commercial gas
-
పెరిగిన గ్యాస్ ధర.. వరుసగా నాలుగోసారి..
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్పీజీ ధరలు పెరిగాయి.ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది. -
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎక్కడ.. ఎంత?
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరల ధోరణులకు అనుగుణంగా నెలవారీ సవరణలో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధరను రూ. 6.5 పెంచినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు తెలియజేశారు.రేట్ల సవరణ తర్వాత కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 1,646, ముంబైలో రూ.1,605, కోల్‌కతాలో రూ.1,764.50, చెన్నైలో రూ.1,817, హైదరాబాద్‌లో రూ.1,872 గా ఉంది. నాలుగు నెలలుగా వరుస తగ్గింపుల తర్వాత ఈ నెలలో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచారు. చివరిసారిగా జూలై 1న రూ. 30 మేర ధర తగ్గింది. నాలుగు నెలల్లో మొత్తంగా రూ.148 తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా వీటి ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే, గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర మాత్రం రూ.803 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ఇంధనం, సగటు ధర, విదేశీ మారక విలువ ఆధారంగా ప్రతి నెల మొదటి తేదీన ఏటీఎఫ్, వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
గ్యాస్ బండపై పెరిగిన భారం!
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల సవరణలను ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 25.50 పెరిగింది. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ధరల పెంపు తర్వాత, ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,795 అవుతుంది. అలాగే కలకత్తాలో రూ. 1,911, ముంబైలో రూ. 1749లకు పెరిగింది. ఇక చెన్నైలో రూ. 1960.50, హైదరాబాద్‌లో రూ. 2027, విశాఖపట్నంలో రూ. 2110.50 చొప్పున 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఉంది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల నెలవారీ సమీక్షలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున జరుగుతాయి. స్థానిక పన్నుల ఆధారంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. -
గుడ్‌న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
కమర్షియల్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. అంతర్జాతీయ ధరల పరిస్థితుల్లో సానుకూలతల నేపథ్యంలో దేశంలో చమురు సంస్థలు వాణిజ్య వంటగ్యాస్ ధరను కాస్త తగ్గించాయి. వాణిజ్య వంటగ్యాస్ (LPG) 19 కిలోల సిలిండర్ ధర శుక్రవారం రూ.39.50 తగ్గింది. కమర్షియల్ వంట గ్యాస్ ధర తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు వీటిని వినియోగించే అనేక వర్గాలకు ఉపశమనం కలిగింది. ధర తగ్గింపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,757 ఉంది. అంతకుముందు రూ. 1,796.50 ఉండేది. ఈ మేరకు చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. ఇదీ చదవండి: Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చివరిసారిగా డిసెంబర్ 1న వాణిజ్య ఎల్పీజీ ధరను రూ.21 పెంచాయి. కమర్షియల్ వంట గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం ముంబైలో రూ. 1,710, కోల్‌కతాలో రూ. 1,868.50, చెన్నైలో రూ. 1,929 లుగా ఉంది. స్థానిక పన్నుల ఆధారంగా వీటి ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. కాగా గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 903 ఉంది. -
ఏటీఎఫ్ ధర 5 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధర 4.6 శాతం తగ్గింది. దీంతో న్యూఢిల్లీలో ఏటీఎఫ్ రేటు కిలోలీటరుకు రూ. 5,189 తగ్గి రూ. 1,06,156కి దిగి వచ్చింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ (19 కేజీల) ధర రూ. 21 తగ్గి రూ. 1,749కి పరిమితమైంది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ ధర యధాప్రకారం రూ. 903 (14.2 కేజీల సిలిండర్)గానే కొనసాగనుంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్ సంస్థలు ఈ మేరకు సవరించిన ధరలను శుక్రవారం ప్రకటించాయి. ఏటీఎఫ్‌ను తగ్గించడం నెలరోజుల్లో ఇది రెండోసారి. నవంబర్ 1న దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854) తగ్గింది. అంతకు ముందు జులై 1 నుంచి నాలుగు నెలల వ్యవధిలో రేటు రూ. 29,391 మేర పెరిగింది. తాజాగా రెండు విడతల తగ్గింపుతో అందులో సుమారు మూడో వంతు భారం తగ్గినట్లయింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 40 శాతం వాటా ఏటీఎఫ్‌దే ఉంటుంది. దీన్ని తగ్గించడంతో ఎయిర్‌లైన్స్‌పై భారమూ తగ్గుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. ఇందుకోసం క్రితం నెల అంతర్జాతీయంగా ఉన్న సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ రేట్లను రోజువారీ సవరించాల్సి ఉన్నప్పటికీ 2022 ఏప్రిల్ 6 నుంచి రికార్డు స్థాయిలో 21 నెలలుగా మార్చడం లేదు. మే 22న కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఇందుకు మినహాయింపు. -
ఎన్నికలు ముగియగానే పెరిగిన వంటగ్యాస్ ధర!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెరిగాయి. నేటి నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.21 పెంచాయి. నేటి నుండి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1796.50గా ఉంది. నవంబర్ 16న దీని ధర తగ్గించడంతో రూ.1775.50గా ఉండేది. నేటి నుంచి ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1749, కోల్‌కతాలో రూ.1885.50, చెన్నైలో రూ.1968.50గా ఉంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్ల ఆహార విక్రయాలపై ప్రభావం చూపనుంది. అయితే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఆయా కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఈ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ సిలిండర్ ఢిల్లీలో రూ.903కి అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50 ధరలకు లభిస్తోంది. ఇది కూడా చదవండి: అక్కడ మహిళల ఓట్లే అధికం.. లెక్కింపు బాధ్యతలూ వారికే! -
మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర
Commercial LPG cylinder price cut కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు) అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో 7 రూపాయలు పెరిగిన వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్) కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200 సబ్సిడీకి అదనంగా రూ.200తో మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ లభిస్తోంది. -
వినియోగదారులకు శుభవార్త, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆగస్ట్ నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,680కు లభించనుంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్ని చివరి సారి ఈ ఏడాది జూలై 4న చివరిసారిగా సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గించాయి. దీంతో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,895.50, ముంబైలో రూ.1,733.50, చెన్నైలో రూ.1,945కి అందుబాటులో ఉంది. తగ్గని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇదిలా ఉండగా, ఇంట్లో వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు ధరల్ని తగ్గించలేదు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించారు. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50 లభ్యమవుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్లలో ధరలు తగ్గిన తర్వాత జూన్‌లో మొదటిసారిగా ఎల్జీపీ సిలిండర్ రేట్లను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలను చివరిసారిగా మార్చి 1న సిలిండర్‌కు రూ.50పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.91.50, మేలో రూ.171.50 చొప్పున తగ్గించారు. జూన్‌లో రూ.83.50 తగ్గింది. -
బండపై మళ్లీ రూ.50
సాక్షి, హైదరాబాద్: పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్య ప్రజానీకంపై మరో బాదుడు. ఎనిమిది నెలల విరామం తరువాత చమురు సంస్థలు మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశాయి. 14.2 కిలోల గృహావసర సిలిండర్‌పై రూ. 50 పెంచగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ. 350.50 పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో గృహావసరాల సిలిండర్ రేటు రూ.1,105 నుంచి రూ.1,155కి చేరింది. కాగా, గ్యాస్ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో రెండేళ్లుగా వినియోగదారులకు నగదు బదిలీ నిలిచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1.16 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 68.74 లక్షలు కాగా, డబుల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు 48 లక్షలు. ఇవి కాకుండా దీపం కనెక్షన్లు 19.72 లక్షలు, ఉజ్వల కనెక్షన్లు 11.46 లక్షలు, సీఎస్ఆర్ కింద 7.30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులను బట్టి సిలిండర్ల వినియోగంలో తేడాలున్నా... సాధారణ కుటుంబానికి సగటున నెలకు ఒక సిలిండర్ అవసరమవుతుంది. గ్రామాల్లో కొంత తక్కువ వినియోగం ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి నెలా కోటి సిలిండర్లకు పైగా రీఫిల్ కోసం వస్తాయనుకున్నా... నెలకు అదనపు భారం రూ. 50 కోట్లకుపైనే ఉంటుందని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి. హోటల్ తిండి భారమే.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ఎకాఎకిన రూ. 350.50 పెంచేశాయి. దీంతో హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే ఈ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1,973 నుంచి రూ. 2,323.50కి చేరినట్లయింది. ఆదిలాబాద్, ఖమ్మం వంటి జిల్లాల్లో సిలిండర్ ధర మరింత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మహిళలను వంచించిన కేంద్రం: మంత్రి గంగుల కమలాకర్ గ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం మహిళలను మరోసారి వంచించింది. వారం రోజుల్లో మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా మోదీ ప్రభుత్వం దేశ మహిళలకు గ్యాస్ ధరలను పెంచి కానుకగా ఇచ్చింది. అదానీ నష్టాలను పూడ్చుకునేలా సామాన్యుల నుంచి గ్యాస్ ధరల రూపంలో వసూలు చేస్తోంది. అధ్వానపు విధానాలతో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమైన కేంద్రం.. ఏమాత్రం మానవత్వం ఉన్నా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. -
కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్ ధర.. ఎంతంటే?
న్యూ ఇయర్ తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. దేశంలో స్థిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు దేశంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి. -
కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ షాక్
సాక్షి, పంజగుట్ట: వాణిజ్య అవసరాల కోసం వాడే ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్లపై ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇచ్చే రాయితీని దేశ వ్యాప్తంగా పూర్తిగా ఎత్తివేశారని, ఈ విషయం వినియోగదారులు గ్రహించి సహకరించాలని తెలంగాణ ఎల్పీజీ డి్రస్టిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ వ్యాప్తంగా నెలకు 8 నుంచి 9 లక్షల వాణిజ్య సిలిండర్లు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి గతంలో వినియోగదారున్ని బట్టి 100 నుంచి 200 వరకు డిస్కౌంట్ లభించేదని దాన్ని పూర్తిగా ఎత్తేశారని తెలిపారు. ఎల్పీజీ ప్రమాదాలు ఇటీవల బాగా జరుగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే సేఫ్టీ ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు. ప్రమాదం జరిగితే రూ.40 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుందని, ఇది రావాలంటే డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్ట్రేషన్ ఉండాలన్నారు. ఈ సమావేశంలో సెక్రటరీ శ్రీచరణ్, అశోక్, వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధర! ఎంతంటే!
పెరిగిన,పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు గ్యాస్ కంపెనీలు ఊరట నిచ్చాయి.కమర్షియల్ గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయించాయి. తగ్గిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీల నిర్ణయంతో దేశంలోని ప్రాంతాల వారీగా కమర్షియల్ గ్యాస్ ధరలు అదుపులోకి వచ్చాయి.ఢిల్లీలో 19కేజీల కమర్షియల్ గ్యాస్ ధర రూ.198తగ్గింది. కోల్‌కతాలో రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గాయి. గతంలో ఎంత తగ్గిందంటే చమురు కంపెనీలు వ్యాపారానికి వినియోగించే గ్యాస్ ధరల్ని వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో జూన్ 1న అదే గ్యాస్ ధరను రూ.135 తగ్గించాయి. కానీ 14.2 కిలోల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి తగ్గుముఖం కనిపించగా పోగా..వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క మే నెలలో వంటింట్లో వాడే వంట గ్యాస్ ధరను రెండు సార్లు పెంచాయి. తొలిసారిగా మే 7న లీటరుకు రూ.50 పెంచగా.. మే 19న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.3.50పెరిగాయి. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, సోషల్ మీడియాలో మీమ్స్ మంట!
ఉప్పు నుంచి పప్పు దాకా..పెట్రోల్ నుంచి నిత్యవసర సరుకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని బూచీగా చూపిస్తూ ఉత్పత్తి దారులు అన్నీ రకాల వస్తుల ధరల్ని పెంచడంతో..ఆకాశాన్నంటుతున్న ధరలతో సామాన్యులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. తాజాగా ఇవేం సరిపోవన్నట్లు గ్యాస్ కంపెనీలు సైతం గ్యాస్ ధరల్ని పెంచి సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపించాయి. దీంతో పెరిగిన ధరలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదైన స్టైల్లో మీమ్స్ వేస్తున్నారు. ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. గురువారం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.3.50పైసలు పెరగ్గా..కమర్షియల్ గ్యాస్ ధర రూ.8 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1000 దాటడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన సిలిండర్ ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇవ్వాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో 14.2కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,003, కోల్ కతాలో 1,029.50, ముంబైలో రూ.1,003, చెన్నైలో రూ.1,019 ఉంది 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.2,254, కోల్‌కతాలో రూ.2,453, ముంబైలో రూ.2,305, చెన్నైలో రూ.2,507గా ఉంది. విమర్శల వెల్లువ పెరిగిన గ్యాస్ ధరలపై నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.రోజురోజుకీ పెరిగిపోతున్న గ్యాస్ ధరలు మధ్య తరగతి ప్రజల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. The price of domestic LPG cylinders is hiked by Rs. 3.50 & commercial cylinders by Rs 8. In Delhi, LPG used to cost Rs 414/cylinder in May 2014 under UPA & it now costs Rs 1003. Even when inflation is at its highest in decades, the BJP govt has no mercy on the people of India! — Dr. Shama Mohamed (@drshamamohd) May 19, 2022 అప్పుడు రూ.414..ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3.50, కమర్షియల్ సిలిండర్ రూ.8 పెరగడంపై కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రతినిధి శర్మ డాక్టర్ షామా మొహమ్మద్ కేంద్రంపై మండిపడ్డారు. మే 2014 కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇదే గ్యాస్ ధర రూ.414 ఉంటే.. ఇప్పుడు రూ.1,003 ఉందని ట్వీట్ చేశారు. Domestic LPG cylinder is 1003rs today. Petrol Price is 113rs / ltr ACHE DIN Dear Indians, Open your eyes before it's too late.#LPGPriceHike#PetrolDieselPrice #GasCylinder pic.twitter.com/UeF4xYkVEd — Taj (@Taj_Taju1) May 19, 2022 LPG gas cylinder is the Mahesh Babu of commodities, hence proved🤭#LPG #lpgpricehike #MaheshBabu pic.twitter.com/JKFK7Sc1Lw — TejalTweets (@TweetsTejal) May 11, 2022 -
భారీగా పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
-
మరో షాక్, భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. అయితే ఈసారి గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకు ఈ పెంపు నుంచి మినహాయింపును ఇచ్చింది. కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచింది. రూ. 43 పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 43.50 రూపాయలను కేంద్రం పెంచింది. అంతకు ముందు సెప్టెంబురు 1న ఇవే సిలిండర్ల గ్యాస్ ధరను రూ .75 పెంచింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ. 123 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1952, విజయవాడలో 1916, విశాఖలో 1825, ఢిల్లీలో రూ.1736 గా ఉండగా.. కోల్ కతాలో రూ.1805.5గా ఉంది. స్ట్రీట్ వెండర్లకు కష్టమే పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న, మధ్య తరగతి హోటళ్లకు భారంగా మారనుంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫుడ్, చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ముప్పై రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు రెండు సార్లు పెగడం వారికి ఇబ్బందిగా మారింది. కొద్దోగొప్పో వస్తున్న ఆదాయం కాస్తా పెరిగిన గ్యాస్ ధరలకే సరిపోతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Petroleum companies increase price of commercial LPG cylinders by Rs 43. Price of a 19 kg commercial cylinder in Delhi now Rs 1736.50. On Sept 1st, price of commercial LPG cylinder was increased by Rs 75. New rates effective from today. No change in domestic LPG cylinder rates. — ANI (@ANI) October 1, 2021 చదవండి: మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు -
భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర!
న్యూఢిల్లీ: నేడు (ఆగస్టు 1) పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5 పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులేదు. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు పెరిగింది. కోల్ కతా, చెన్నైలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు & గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. దేశీయ గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలను 2021 ఆగస్టులో మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. 2021లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. ఉదాహరణకు, 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంది. అయితే, ఇన్ని సంవత్సరాల్లో నిరంతర ధరల పెరుగుదలతో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ.834.50 వద్ద ఉంది. -
స్తంభించిన గ్యాస్ సరఫరా
తగ్గింపు వివరాలు ఏజెన్సీలకు అందని వైనం నిలిచిపోయిన విక్రయాలు జిల్లాలో ప్రజల ఇక్కట్లు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : చమురు కంపెనీలు గ్యాస్ ధరలు తగ్గించినా ఆ మేరకు ఉత్తర్వులు అందకపోవడంతో జిల్లాలో శనివారం సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు కూడా గ్యాస్ సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీలలో కూడా అమ్మకాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజల నెత్తిన భారం మోపిన కేంద్ర ప్రభుత్వం గృహావసరాల గ్యాస్ సిలిండర్‌పై రూ.110, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.270 తగ్గించింది. దీని ప్రకారం గృహావసరాలకు వాడే 14 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రస్తుతం సబ్సిడీతో కలిపి రూ.1,320 ఉండగా ఫిబ్రవరి నుంచి రూ.1,210 చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాన్ సబ్సిడీలో సరఫరా చేసే కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రూ.2,320 నుంచి రూ.2,050కి తగ్గింది. నిలిచిపోయిన విక్రయాలు... తగ్గించిన ధరల వివరాలను చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు పంపకపోవటంతో విజయవాడ నగరంలో, జిల్లాలో 76 గ్యాస్ ఏజెన్సీలలో సిలిండర్ల విక్రయాలు నిలిచిపోయాయి. ప్రతిరోజూ జిల్లాలో 21 వేల గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తారని అంచనా. ఆధార్ లింక్‌పై ప్రకటనలు గుప్పిస్తూ ప్రభుత్వం నుంచి సబ్సిడీ గ్యాస్‌పై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయకపోవటంతో గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఏడాదికి గతంలో ఇచ్చే తొమ్మిది సిలిండర్లను 12కి పెంచుతూ ప్రభుత్వం నుంచి గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. జరుగుతున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రెండు సిలెండర్లు ప్రతి వినియోగదారునికీ ఇస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఏడాదికి 12 సిలెండర్లు సరఫరా చేయాలని గ్యాస్ ఏజెన్సీలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.