
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల సవరణలను ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ. 25.50 పెరిగింది. కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
ధరల పెంపు తర్వాత, ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు రూ.1,795 అవుతుంది. అలాగే కలకత్తాలో రూ. 1,911, ముంబైలో రూ. 1749లకు పెరిగింది. ఇక చెన్నైలో రూ. 1960.50, హైదరాబాద్‌లో రూ. 2027, విశాఖపట్నంలో రూ. 2110.50 చొప్పున 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర ఉంది.
అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నాయి. కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌ల ధరల నెలవారీ సమీక్షలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున జరుగుతాయి. స్థానిక పన్నుల ఆధారంగా దేశీయ వంట గ్యాస్ ధరలు రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.