శాలరీ అకౌంట్ ఉంటే ఇవన్నీ ఉన్నట్టే.. | Hidden benefits Of Salary Accounts Banks Wont Tell These | Sakshi
Sakshi News home page

శాలరీ అకౌంట్.. బ్యాంకులు చెప్పని బెనిఫిట్స్‌

Published Sun, Mar 16 2025 9:18 AM | Last Updated on Sun, Mar 16 2025 10:27 AM

Hidden benefits Of Salary Accounts Banks Wont Tell These

వివిధ సంస్థల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు శాలరీ అకౌంట్‌ ఉంటుంది. ఇది సాధారణ బ్యాంకు ఖాతా లాగే పనిచేస్తుంది. ఇందులో కంపెనీల యాజమాన్యాలు ప్రతి నెలా జీతాన్ని జమ చేస్తారు. ఈ డబ్బును ఖాతాదారులు ఉపసంహరించుకుంటారు.. లావాదేవీలు చేస్తారు.. ఖర్చులను నిర్వహిస్తారు. అయితే శాలరీ అకౌంట్ తో వచ్చే ఎక్స్ క్లూజివ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఖాతా  తెరిచే సమయంలో చాలా బ్యాంకులు ఈ ప్రయోజనాలను వెల్లడించవు.

క్లాసిక్ శాలరీ అకౌంట్స్‌, వెల్త్ శాలరీ అకౌంట్స్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్-శాలరీ, డిఫెన్స్ శాలరీ అకౌంట్స్ ఇలా వివిధ రకాల శాలరీ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. వీటిలో దాగిఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

  • యాక్సిడెంటల్ డెత్, హెల్త్ ఇన్సూరెన్స్
    చాలా శాలరీ అకౌంట్లు యాక్సిడెంటల్ డెత్ కవర్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ను అదనపు భద్రతా ఫీచర్ గా కలిగి ఉంటాయి. ఖాతాదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణను అందిస్తాయి.

  • రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు
    శాలరీ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలపై ప్రిఫరెన్షియల్ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. దీనివల్ల రుణ కాలపరిమితిలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

  • ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ
    అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనాలలో ఒకటి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఇది అత్యవసర పరిస్థితుల్లో మీ ఖాతా బ్యాలెన్స్ జీరో ఉన్నప్పటికీ కొంత డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తుంది.

  • ప్రాధాన్య బ్యాంకింగ్ సేవలు
    వేగవంతమైన ప్రాసెసింగ్, డెడికేటెడ్ కస్టమర్ సర్వీస్, ఎక్స్ క్లూజివ్ బ్యాంకింగ్ ఆఫర్లతో సహా అనేక బ్యాంకులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు ప్రాధాన్యతా సేవలను అందిస్తున్నాయి.

  • ఉచిత క్రెడిట్ కార్డులు, రివార్డులు
    బ్యాంకులు తరచుగా శాలరీ అకౌంట్లతో కాంప్లిమెంటరీ క్రెడిట్ కార్డులను అందిస్తాయి. వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌ బ్యాక్, ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తాయి.

  • ఆన్ లైన్ షాపింగ్ & డైనింగ్ డీల్స్
    శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఆన్‌లైన్ షాపింగ్, డైనింగ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో సహా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి. జీవనశైలి ఖర్చులను మరింత చౌకగా చేస్తాయి.

  • ఉచిత డిజిటల్ లావాదేవీలు
    సాధారణ ఖాతాల మాదిరిగా కాకుండా, చాలా బ్యాంకులు శాలరీ  ఖాతాదారులకు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ ఛార్జీలను మాఫీ చేస్తాయి.

  • ఫ్రీగా చెక్ బుక్, డెబిట్ కార్డులు
    శాలరీ అకౌంట్‌ కస్టమర్లకు చాలా వరకు బ్యాంకులు ఎటువంటి రుసుములు లేకుండా చెక్ బుక్ లు, డెబిట్ కార్డులను అందిస్తుంటాయి. ఇవి చిన్నపాటివే అయినా పునరావృతమయ్యేవి కాబట్టి ప్రయోజనం ఉంటుంది.

  • ఉచిత ఏటీఎం లావాదేవీలు
    అనేక బ్యాంకులు ప్రతి నెలా ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం ఉపసంహరణలను అనుమతిస్తాయి. దీంతో అదనపు ఛార్జీల గురించి ఆందోళన లేకుండా నగదును యాక్సెస్ చేసుకోవచ్చు.

  • జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ
    చాలా శాలరీ అకౌంట్లు జీరో బ్యాలెన్స్ ఫీచర్‌తో వస్తాయి. అంటే కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఇది సాధారణ సేవింగ్స్‌ ఖాతాలకు లేని ప్రయోజనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement