కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆగస్ట్ నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,680కు లభించనుంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్ని చివరి సారి ఈ ఏడాది జూలై 4న చివరిసారిగా సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గించాయి. దీంతో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,895.50, ముంబైలో రూ.1,733.50, చెన్నైలో రూ.1,945కి అందుబాటులో ఉంది.
తగ్గని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు
ఇదిలా ఉండగా, ఇంట్లో వినియోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్లు ధరల్ని తగ్గించలేదు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించారు. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50 లభ్యమవుతుంది.
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్‌లలో ధరలు తగ్గిన తర్వాత జూన్‌లో మొదటిసారిగా ఎల్‌జీపీ సిలిండర్ రేట్లను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చివరిసారిగా మార్చి 1న సిలిండర్‌కు రూ.50పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.91.50, మేలో రూ.171.50 చొప్పున తగ్గించారు. జూన్‌లో రూ.83.50 తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment