LPG Gas
-
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే.. ఎల్పీజీ గ్యాస్ ధరలను ప్రకటించాయి. అయితే ఈ సారి కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా రూ. 6 పెంచింది. యూనియన్ బడ్జెట్ తరువాత గ్యాస్ ధరలు పెరగడం ఇది మొదటిసారి.ఈ రోజు (మార్చి 1) నుంచి 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 1,803 రూపాయలు. ధరల పెరుగుదలకు ముందు దీని రేటు రూ. 1797 వద్ద ఉండేది. అయితే 14 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలుఢిల్లీ: రూ. 1803కోల్‌కతా: రూ. 1913ముంబై: రూ. 1755చెన్నై: రూ. 196514 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలుఢిల్లీ: రూ. 803కోల్‌కతా: రూ. 829ముంబై: రూ. 802.50చెన్నై: రూ. 818.50స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలో వ్యత్యాసం కారణంగా LPG ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల వల్ల రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థల ఇన్పుట్ ఖర్చును పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ భారం వినియోగదారులపై పడుతుంది.ఇదీ చదవండి: అమాంతం తగ్గిన గోల్డ్ రేటు: కొనేందుకు త్వరపడాల్సిందే! -
వంట గ్యాస్ ధరలు పెంపు
దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రిటైల్ ధరలను ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబరు 1 నుండి రూ. 16.5 చొప్పున పెంచాయి.ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1802 నుంచి రూ.1818.50కి పెరిగింది. గత నెల (నవంబర్)లో ఈ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. గత ఆరు నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు వరుసగా పెంచుతూ వస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక సబ్బులు మరింత ఖరీదుఐవోసీఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తాజా సవరణ తర్వాత హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2044 వద్దకు చేరింది. విజయవాడలో ఇది రూ.1990 వద్ద ఉంది. ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆగస్టు నుండి ఇవి స్థిరంగా ఉన్నాయి. -
పెరిగిన గ్యాస్ ధర.. వరుసగా నాలుగోసారి..
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పలు మెట్రో నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర శుక్రవారం పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగోసారి. సవరించిన రేటు నేటి నుంచి అమల్లోకి వస్తుంది.ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 62 పెరిగింది. రిటైల్ ధర రూ.1,740 నుండి రూ.1,802లకు ఎగసింది. అంతకుముందు అక్టోబర్‌లో రూ. 48.50, సెప్టెంబరులో రూ. 39, ఆగస్టులో రూ. 8.50 చొప్పున వాణిజ్య ఎల్పీజీ ధరలు పెరిగాయి.ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, కోల్‌కతాలో కూడా 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. తాజా పెంపుతో రిటైల్ ధర ఇప్పుడు ముంబైలో రూ.1,754.50, చెన్నైలో రూ.1,964.50, కోల్‌కతాలో రూ.1,911.50గా ఉంది.ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతినెలా సవరిస్తూ ఉంటాయి. అందులో భాగంగా తాజాగా నవంబర్ నెలకు గానూ ధరను పెంచాయి. దీని ప్రభావం కమర్షియల్ సిలిండర్లను వినియోగించే హోటళ్లు, ఇతర వాటిపై పడనుంది. -
LPG Price Hike: పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దీని ప్రభావం సామాన్యులపై కూడా కనిపించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,691.50గా మారింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ కొత్త ధర రూ.1802.50గా, ముంబైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1644గా, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1855కి చేరింది. గత జూలై ఒకటిన వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. జూలై ఒకటిన 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.30 తగ్గింది.ప్రతి నెల ప్రారంభంలో ఎల్పీజీ సిలిండర్ ధరలలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు , సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు ఈ ధర నిర్ణయాలలో కీలకంగా ఉంటాయి. -
కేంద్రం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఎల్పీజీ సబ్సిడీ పథకాన్ని కూడా ఏడాది పాటు పొడిగించింది. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.300కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తిస్తుంది. రానున్న మూడేళ్లలో అదనపు ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపింది. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయలు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
కేంద్ర ప్రభుత్వం డీఏ (Dearness Allowance)ను 4 శాతం పెంచే నిర్ణయానికి ఈ రోజు (గురువారం) ఆమోదం తెలిపినట్లు. ఈ పెంపు తరువాత డియర్నెస్ అలవెన్స్ & డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) 50 శాతానికి చేరుతుంది. ఈ పెంపు వల్ల కేంద్రం రూ.12,868.72 కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. వచ్చే నెల నుంచే జీతాలు, పెన్షన్ వంటివి భారీగా పెరుగుతాయి. డియర్నెస్ అలవెన్స్ పెంపుతో పాటు, రవాణా అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్‌లలో కూడా 25 శాతం పెరుగుదల ఉంటుందని సమాచారం. #WATCH | Union Cabinet approves hike in Dearness Allowance to govt employees and Dearness Relief to pensioners by 4% from January 1, 2024, announces Union Minister Piyush Goyal. pic.twitter.com/IsWUnwBGHW — ANI (@ANI) March 7, 2024 -
షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది. నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. సిలిండర్ మీద సబ్సిడీ ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్పీజీ సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్పీజీ సిలిండర్లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది. చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా? -
గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 అవుతుంది..!
కోల్‌కతా: జల్పైగురి జిల్లాలోని ధుప్గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు. సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు. అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. ভোট মরশুমে মানুষের মন জয় করতেই রান্নার গ্যাসের দাম ২০০ টাকা কমিয়েছে কেন্দ্রের জনবিরোধী বিজেপি সরকার। আগামী দিনে কেন্দ্রের সরকার বদলে গেলে গ্যাসের দাম কমে ৫০০ টাকা হয়ে যাবে।#TrinamooleNaboJowar #WestBengal #Jalpaiguri pic.twitter.com/eATYbLdtv8 — Trinamoole Nabo Jowar (@TMCNaboJowar) September 2, 2023 ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం.. డిసెంబర్లో బిల్లు -
మరో గుడ్ న్యూస్: భారీగా తగ్గిన గ్యాస్ ధర
Commercial LPG cylinder price cut కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్రం ఇప్పుడు మరో శుభవార్త అందించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం వంటగ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను తగ్గించాయి.కొత్త ధరలు నేటి నుండి అమలులో ఉంటాయి. (పాక్ ఆర్థిక సంక్షోభం: రూ. 300 దాటేసిన పెట్రోలు) అనేక రాష్ట్రాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను సుమారు రూ.158 తగ్గించాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ. 1,522.50 అవుతుంది. అదే విధంగా ముంబైలో గతంలో రూ.1640.50 ఉండగా ఇప్పుడు రూ.1482గా ఉందినుంది. అలాగే చెన్నైలో రూ.1852.50కి బదులుగా రూ.1695కే అందించనున్నారు. వాణిజ్య, గృహ LPG (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి రోజున సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో 7 రూపాయలు పెరిగిన వాణిజ్య LPG సిలిండర్ల ధర ఆగస్టులో రూ. 99.75 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ( LPG Price Cut: మహిళలకు రూ. వేల కోట్ల రక్షాబంధన్ గిఫ్ట్) కాగా రక్షా బంధన్ సందర్భంగా, దేశంలోని మహిళలకు బహుమతిగా కేంద్ర ప్రభుత్వం దేశీయ ఎల్పిజి ధరను రూ.200 తగ్గించింది. అలాగే ఉజ్వల స్కీమ్ కింద అందించే రూ.200 సబ్సిడీకి అదనంగా రూ.200తో మొత్తంగా రూ. 400 తక్కువకే సిలిండర్ లభిస్తోంది. -
200 రూపాయలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ ధర.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వినియోగదారులకు శుభవార్త, తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఆగస్ట్ నెల ప్రారంభం మొదటి రోజు 19 కేజీల సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.99.75 తగ్గింది. తగ్గిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.1,680కు లభించనుంది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరల్ని చివరి సారి ఈ ఏడాది జూలై 4న చివరిసారిగా సవరించబడ్డాయి. తాజాగా మరోసారి తగ్గించాయి. దీంతో 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.1,895.50, ముంబైలో రూ.1,733.50, చెన్నైలో రూ.1,945కి అందుబాటులో ఉంది. తగ్గని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇదిలా ఉండగా, ఇంట్లో వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లు ధరల్ని తగ్గించలేదు. గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల ధరలను చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న సవరించారు. సబ్సిడీ లేని 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,103, కోల్‌కతాలో రూ.1,129, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50 లభ్యమవుతుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. ఏప్రిల్, మే, జూన్లలో ధరలు తగ్గిన తర్వాత జూన్‌లో మొదటిసారిగా ఎల్జీపీ సిలిండర్ రేట్లను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఎల్పీజీ సిలిండర్ ధరలను చివరిసారిగా మార్చి 1న సిలిండర్‌కు రూ.50పెంచారు. ఆ తర్వాత ఏప్రిల్‌లో సిలిండర్‌పై రూ.91.50, మేలో రూ.171.50 చొప్పున తగ్గించారు. జూన్‌లో రూ.83.50 తగ్గింది. -
మళ్ళీ తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. ఈ సారి ఎంతంటే?
LPG Cylinder Price: పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు 'ఎల్పీజీ' (LPG) ధరలు కూడా మారుతూ ఉంటాయి. తాజాగా మరో సారి గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. ఎల్పీజీ కొత్త ధరలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు (2023 జూన్ 01) నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు వినియోగదారులకు భారీ ఊరటను కలిగించనున్నాయి. ప్రస్తుతం తగ్గిన గ్యాస్ సిలిండర్ల ధరలు కేవలం కమర్షియల్ గ్యాస్‌కి మాత్రమే వర్తిస్తాయి. కాగా డొమెస్టిక్ గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. (ఇదీ చదవండి: కస్టమర్లకు షాకిచ్చిన ఓలా.. పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు) 14.2 కేజీల గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కావున దీని ధర రూ. 1133 వద్ద స్థిరంగా ఉంది. అదే సమయంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1856.50 వద్ద నుంచి రూ. 1773 కి తగ్గింది. అంటే ఈ ధరలు మునుపటి కంటే రూ. 83 తగ్గినట్లు తెలుస్తోంది. 2023 మే 1న కూడా కమర్షియల్ గ్యాస్ ధరలు ఏకంగా రూ. 171.50 తగ్గాయి. అప్పుడు కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గి, డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పు లేకపోవడం వల్ల సామాన్య ప్రజలు కొంత నిరాశ చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఒక్కసారిగా రూ. 171 తగ్గిన గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఈ రోజు నుంచి (2023 మే 1) కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ పెట్రోలియం అండ్ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీని ఫలితంగా 19 కేజీల గ్యాస్ సిలిండర్ మీద ఇప్పుడు రూ. 171.50 తగ్గింది. కొత్త ధరలు ఈ రోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే డొమెస్టిక్ LPG గ్యాస్ ధరలలో ఎటువంటి మార్పులు లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్లు హోటల్ వంటి వాణిజ్య వినియోగాలకు మాత్రమే ఉపయోగిస్తారు. కాగా డొమెస్టిక్ సిలిండర్లు కేవలం ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ధరల తగ్గింపుల తరువాత 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1856.50. అదే సమయంలో కలకత్తాలో దీని ధర రూ. 1960.50కి చేరింది. ముంబై, చెన్నై ప్రాంతాల్లో ఈ ధరలు వరుసగా రూ. 1808 & రూ. 2021కి చేరాయి. నిజానికి డొమెస్టిక్ సిలిండర్ ధరల కంటే కమర్షియల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉంటాయి. 2022లో ఎల్పీజీ ధరలు నాలుగు సార్లు పెరిగాయి, మూడు సార్లు తగ్గాయి. ఆంటే ఓకే సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు ధరలలో మార్పులు జరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం నిజంగానే హర్షించదగ్గ విషయం అనే చెప్పాలి. -
Puducherry: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. గ్యాస్ సిలిండర్‌పై భారీగా సబ్సిడీ!
ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఓ వైపు, ఇంధన ధరలు పైపైకి ఎగబాకుతూ మరో వైపు సామాన్యుడి నెల వారి బడ్జెట్‌పై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఇదిలా ఉండగా గ్యాస్ ధరల పెంపు మధ్య తరగతి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో పలు రాష్ట్రాలలో పెరిగిన గ్యాస్ ధరలు నుంచి ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ క్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ పుదుచ్చేరి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని బీపీఎల్ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్ సిలింబర్ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ... అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కాగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్ ధరలను పెంచగా.. ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి. వీటికి అదనంగా తీసుకోవాలంటే.. మార్కెట్లో ఉన్న ధరకు తగ్గట్టు కొనాల్సిందే. -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
ఎల్పీజీ ధరలో నెంబర్–2, పాట్నా తర్వాత హైదరాబాద్ టాప్
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ ధర సామాన్య, మధ్య తరగతి ప్రజానీకాన్ని బాదేస్తోంది. దేశంలోని మెట్రో నగరాలతో పోల్చితే గృహోపయోగ సిలిండర్ ధర విషయంలో నగరం రెండో స్థానాన్ని ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆ తర్వాత మెట్రో నగరాలైన ముంబయి, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో కంటే హైదరాబాద్‌లోనే ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ ధర అధికంగా ఉంది. విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న మహానగరానికి ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్యం దృష్ట్యా వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న కుటుంబాలతో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ వినియోగం బాగా పెరిగింది. అదే స్థాయిలో వాణిజ్య సిలిండర్లకు డిమాండ్ అధికమైంది. మార్కెట్ ధర ఇలా... మెట్రో నగరాల మార్కెట్‌తో పోల్చితే హైదరాబాద్ మార్కెట్లో సిలిండర్ రీఫిల్ ధర మండిపోతోంది. చమురు సంస్థలు రాష్ట్రానికోవిధంగా రవాణా దూరాన్ని బట్టి ధరను నిర్ణయించి అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ కంటే హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.52 అధికంగా ఉంది. డొమెస్టిక్ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో బహిరంగ మార్కెట్ ధర ప్రకారం మొత్తాన్ని భరించాల్సి వస్తోంది. ఐదు శాతం పన్నుల మోత వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్‌కు రవాణా, పన్నులు మరింత భారంగా మారాయి. చమురు సంస్థలు రవాణా, జీఎస్టీ పన్నులు కలుపుకొని ప్రస్తుత మార్కెట్ ధర అనుసరించి హైదరాబాద్‌లో 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ సరఫరాకు రూ.1,105 వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా సిలిండర్ ధర రూ.1052.38 ఉండగా దానిపై సీజీఎస్టీ 2.5 శాతం కింద రూ.26.31, ఎస్జీఎస్టీ 2.5 శాతం కింద రూ. 26.31 పన్నుల భారం పడుతోంది. రవాణా చార్జీలను బట్టి.. చమురు సంస్థలు గ్యాస్ రవాణా దూరాన్ని బట్టి సిలిండర్ ధర నిర్ణయిస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ఎల్పీజీ ధర ఆదిలాబాద్‌లో రూ. 25 అధికంగా ఉంది. మిగతా జిల్లాల్లో సైతం కనీసం రూ. 20 నుంచి రూ. 27 వరకు అధికంగా ధర పలుకుతోంది. 19 కేజీల వాణిజ్య సిలిండర్ టాప్ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర కూడా మోత మోగిస్తోంది. ఢిల్లీ కంటే సుమారు రూ. 204 అధికంగా పలుకుతోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ రూ. 1973 ఉండగా, చెన్నైలో రూ. 1971, కోల్‌కతాలో రూ.1870 ఢిల్లీలో రూ. 1,769, ముంబయిలో రూ.1721 ప్రకారం ధర పలుకుతోంది. 28.21 లక్షలపైనే... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన చమురు సంస్థలకు సంబంధించి సుమారు 28.21 లక్షల గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
వైరల్ వీడియో: ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
-
ప్లాస్టిక్ కవర్లలో ‘వంట గ్యాస్’.. ప్రమాదమని తెలిసినా తప్పట్లే!
ఇస్లామాబాద్: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. సంక్షోభం తలెత్తడం వల్ల రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై పాక్ ప్రభుత్వం కోత పెడుతోంది. మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాకిస్థాన్‌లోని వాయస్వ ఖైబెర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో స్థానికులు ఎల్పీజీ గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. దేశ గ్యాస్ పైపులైన్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్‌ను నింపించుకుంటున్నారు. అందులోంచి లీకేజీ లేకుండా విక్రయదారులు బ్యాగులకు బిగుతుగా నాజల్, వాల్వ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల్లో 3-4 కేజీల గ్యాస్ నింపేందుకు ఒక గంట సమయం పడుతోంది. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘పాకిస్థాన్‌లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో వీటిని ఉపయోగిస్తున్నారని వస్తోన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాతో వెల్లడించారు. In Pakistan, the practice of using gas packed in plastic bags instead of cylinders for cooking has increased. Gas is sold by filling bags inside the shops connected to the gas pipeline network. People use it in the kitchen with the help of a small electric suction pump.#pkmb pic.twitter.com/e1DpNp20Ku — R Singh...🤸🤸 (@lonewolf_singh) December 31, 2022 ఇదీ చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి -
అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్‌పై ఓ లుక్కేద్దాం.. LPG Gas Cylinder Price: ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది. Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్లో మార్పులు ఉన్నాయి. ATM withdraw: డిసెంబర్ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్లో మీ డెబిట్ కార్డ్‌ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్‌పై ఆంక్షలు తప్పవని పీఎన్బీ హెచ్చరించింది. Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్ నుంచి హీరో బైక్‌ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్‌ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ఉంటారు. చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. బుధవారం వంటిట్లో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి. పెరిగిన ధరలపై కేటీఆర్ స్పందించారు. #AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50 Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi — KTR (@KTRTRS) July 6, 2022 బీజేపీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. "అచ్చేదిన్ ఆ గయే. బధాయి హో" ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. భారతీయ కుటుంబాలకు మోడీ జీ బహుమతి ఇదేనంటూ సెటైర్లు వేశారు. అప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అంటూ మంత్రి కేటీఆర్ సందర్భానుసారం బీజేపీపై విమర్శల దాడిని పెంచుతూనే ఉన్నారు. పెరిగిన గ్యాస్ ధరలపై అచ్చేదిన్ ఆగయే అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. మొన్న జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై పరోక్షంగా సెటైర్లు వేశారు. Welcome the WhatsApp University for its executive council meeting to the beautiful city of Hyderabad To all the Jhumla Jeevis; Don’t forget to enjoy our Dum Biryani & Irani Chai ☕️ #TelanganaThePowerhouse 👇 please visit, take notes & try to implement in your states pic.twitter.com/Ub0JRXSIUA — KTR (@KTRTRS) July 1, 2022 జులై 2, 3 తేదీలలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలపై ‘‘అందమైన హైదరాబాద్ నగరంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి వాట్సాప్ యూనివర్సిటీకి(బీజేపీని పరోక్షంగా ఉద్దేశిస్తూ..) స్వాగతం అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. థ్యాంక్యూ డియర్ మోదీ జీ ఏప్రిల్ నెలలో దేశ జీడీపీపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. దేశ జీడీపీ పెరగడం లేదని ఎవరన్నారని ప్రశ్నించారు. థ్యాంక్యూ డియర్ మోదీ జీ. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వెల్లడించారు. Who says GDP is not going up? Thank You dear Modi Ji for the making this Gas Diesel & Petrol hike as a daily habit for all Indians👏 Am sure there will be some bright BJP folks who will tell us now that this is Modi Ji’s master strategy to promote EVs 👍 https://t.co/6Ah3dmzhSO — KTR (@KTRTRS) April 5, 2022 జీడీపీ పెరుగుదలను ప్రధాని మోదీ రోజువారీ అలవాటుగా మార్చారని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే మోదీ వ్యూహమా అని ట్వీట్ చేశారు. -
గ్యాస్ రాయితీకి మంగళం
పెరుగుతున్న గ్యాస్ ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్. గ్యాస్ రాయితీకి కేంద్రం మంగళం పాడటం..ఆచరణలో అమలు కావడంతో వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే రాయితీ రూ.200లు ఇస్తామని ప్రకటించగా మిగతా వంటగ్యాస్ వినియోగదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కూరగాయల ధరలు, పెట్రోలు ధరలు పెరగగా తాజాగా గ్యాస్ రాయితీకి రాంరాం చెప్పడం ఆందోళనకర పరిణామం. –కరీంనగర్ అర్బన్ లక్ష్యం చేరలే.. గుర్తించినోళ్లకు ఇవ్వలే ♦ జిల్లా జనాభా 10,29,078 కాగా 3,18,562 కుటుంబాలున్నాయి. ♦నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని, కాలుష్యరహిత వాతావరణంకోసం ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా లక్ష్యానికి ఆమడదూరంలో ఉండటం మన జిల్లాకే చెల్లు. ♦ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దన్నుగా నిలవాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా..ని కాగితాల్లోనే మూలుగుతోంది. ♦ఆర్భాటంగా దరఖాస్తులను స్వీకరించారే తప్పా అమలులో మాత్రం శీతకన్ను ప్రదర్శిస్తున్నారు. ♦ జిల్లాలో 16 మండలాలకు గానూ ఎక్కడా లక్ష్యాన్ని చేరకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. ♦ ఉజ్వల్ పథకం ప్రారంభంలో జిల్లాకు 52,278 కనెక్షన్లు మంజూరు చేశారు. 27,444 మంది లబ్ధిదారులున్నారని గుర్తించగా 16,480 మందికి గ్యాస్ కనెక్షన్లు గ్రౌండింగ్ చేశారని సమాచారం. ♦ అయితే గుర్తించిన సంఖ్య ప్రకారం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ♦ ఒక్కో గ్యాస్ కనెక్షన్‌కు రూ.1650 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఇందులో 14.2 కిలోల సిలిండర్, డిపాజిట్, రెగ్యులేటర్, సురక్ష పైపు, పాస్‌పుస్తకం, నిర్వహణ ఛార్జీలు తదితర వాటికి చెల్లిస్తుంది. ♦ స్టవ్, మొదటి సిలిండర్ కొనుగోలు కొరకు వడ్డీలేని రుణాన్ని వివిధ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లబ్ధిదారులకు ఇస్తాయి. ♦ దీన్ని మళ్లీ వినియోగదారులు గ్యాస్ వినియోగించే సమయంలో విడుదలయ్యే రాయితీ ఏడో సిలిండర్ నుంచి మినహాయించుకుంటాయి. ♦ రేషన్‌కార్డు ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలో గతంలో గ్యాస్ కనెక్షన్ పొందనివారు ఈ పథకానికి అర్హులు. ♦ కానీ జిల్లాలో కనెక్షన్ మంజూరు, గ్రౌండింగ్‌లో వెనుకబడి ఉండటంతో రాయితీకి దూరమవుతున్నారు. క్రమేణా రాయితీ మాయం ♦ 2010 వరకు ఎలాంటి రాయితీ లేదు. ఆ తరువాత సిలిండర్ ధర రూ.340 నుంచి ఒక్కసారిగా రూ.425కి పెంచారు. ♦ దీంతో కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.85 రా యితీ ఇస్తున్నట్లు ప్రకటించి అమలు చేసింది. ♦ క్రమక్రమంగా గ్యాస్ ధర పెరిగినప్పుడల్లా స్టాండర్డ్ రేటును నిర్ణయించుకొని మిగతా సొమ్మును ప్రభుత్వం వినియోగదారులకు రాయితీ ఇస్తూ వస్తోంది. ♦ కోవిడ్ సమయంలో రెండేళ్ల కిందటి నుంచి వంట గ్యాస్‌పై ఇచ్చే రాయితీని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ♦ చివరికి ప్రభుత్వం ఒక్క ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ మిగతా అన్ని సిలిండర్లకు రాయితీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వంట గ్యాస్ ప్రస్తుత ధర – రూ.1,075 వాణిజ్య సిలిండర్ ధర – రూ.2,464 ఉజ్వల కనెక్షన్దారుకు గ్యాస్ – రూ.1,075 రాయితీ – రూ.200 చెల్లించాల్సింది – రూ.875 ఉజ్వల కనెక్షన్ల పరిస్థితి గణాంకాల్లో జిల్లాకు మంజూరైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు: 52,278 గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య: 27,444 గ్రౌండింగ్ అయిన కనెక్షన్లు: 16,480 -
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
-
March 1: నేటి నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
చూస్తుండంగానే రోజులు చకచక గడిచిపోతున్నాయి. ఈ కొత్త ఏడాదిలో అప్పుడే 3 నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. కొత్త నెలతోపాటు దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. అమూల్ సంస్థ తన లీటర్ పాల ప్యాకెట్ ధరలను రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలలోకి రానున్నాయి. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల సిలిండర్ ధరపై రూ.105లు, 5 కేజీల సిలిండర్‌పై రూ.27లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా ఉన్నాయి అంతర్జాతీయ చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి పెరగడంతో జెట్ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 3.3 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు పెరిగిన తర్వాత జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటిఎఫ్) ధర పెరగడం ఇది ఐదోసారి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిటల్'గా డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్స్ మార్చి 1 నుంచి మారనున్నాయి. 2020 నవంబర్ నెలలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డీబీఎల్) విలీనం కావడంతో ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్సీ కోడ్స్ ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుతాయని డీబీఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. చాలా రాష్ట్రాలలో కోవిడ్ 19 మహమ్మారి పెరగడంతో, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికేట్ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్‌ను 28.02.2022 వరకు సమర్పించవచ్చు. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి 1 నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. మార్చి 5, 2022 నుంచి రూ.150 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను విధించనున్నట్టు ఐపీపీబీ తెలిపింది. అయితే ఈ ఛార్జీలు కేవలం కేవైసీ అప్డేషన్ లేకుండా ఏడాది తర్వాత క్లోజ్ అయ్యే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమేనని తెలిపింది. మిగతా అకౌంట్ల మూసివేతకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. ఈ కొత్త నిబంధన మార్చి 5 2022 నుంచి అమల్లోకి వస్తుంది. చక్రవాహనాల పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. (చదవండి: Hero Electric Eddy: రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!) -
సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!
వంట గ్యాస్ ధరల మార్పు విషయంలో చమరు మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోబోతున్నాయి. మార్చి 1 నుంచి ఎల్పీజీ ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ ధరల విషయంలో రివ్యూ మీటింగ్ చేపడుతుంటాయి. ఈ మీటింగ్‌లో ధరల పెంచాలా? వద్దా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో ఎల్పీజీ, నేచురల్ గ్యాస్ ధరలు పెరగనున్నాయని పలు నివేదికలు ప్రజలను ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌తో పాటు భారత్‌లో ఎల్పీజీ ధరలు పెరగనున్నాయని పలువురు నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ ధరల పెంపు భారత్‌లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చూడలిమరి చమురు కంపెనీలు రేపు వంట గ్యాస్ ధరలను పెంచుతాయా? లేదా? అనేది. కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.100 నుంచి 200 వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (చదవండి: అడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే జరిమానా ఎంతో తెలుసా?) -
బాబోయ్..మళ్లీ బండ బాదుడు!! రెట్టింపు కానున్న గ్యాస్ ధరలు!
రానున్న రోజుల్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట స్థాయికి చేరుకోగా..త్వరలో పెరగనున్న వంటగ్యాస్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారనున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ నుండి వంట గ్యాస్ ధరలు భారీ ఎత్తున పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లతో పాటు, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొన్నాయి. సీఎన్జీ, విద్యుత్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రధాన కారణం పెరుగుతున్న రవాణా ఖర్చులు, నిర్వహణ ఖర్చులేనని తెలుస్తోంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సామాన్యుల కష్టాలను మరింత పెంచుతుంది. పెరుగుతున్న గ్యాస్ ధరల ప్రభావం, కోవిడ్-19 మహమ్మారి నుండి పుంజుకుంటున్న దేశాల వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన అవసరాల్ని తీర్చడంలో వైఫల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం గ్యాస్, పెట్రోలియం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ నాటికి వంటగ్యాస్ ధరలను సవరిస్తే 2.9 డాలర్ల నుంచి 6 - 7 వరకు పెరిగే అవకాశం ఉండనుంది. చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?! -
గుడ్‌న్యూస్: సిలిండర్ ధరలపై ఊరట!
బడ్జెట్ ముందర గ్యాస్ సిలిండర్ ధరల నుంచి ఊరట ఇచ్చే ప్రకటన వెలువడింది. డొమెస్టిక్ సిలిండర్లపై భారీగా ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించగా.. వరుసగా నాలుగో నెలలోనూ చాలా చోట్ల సిలిండర్ ధరల పెంపు ప్రకటన వెలువడకపోవడం విశేషం. ప్రతి నెలా ఒకటో తేదీన ధరల సవరణపై ఓఎంసీలు ప్రకటిస్తాయన్నది తెలిసిందే. అక్టోబర్ నుంచి డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు అక్టోబర్ నుంచి తగ్గలేదు. నవంబర్ నుంచి పెట్రో ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఈ తరుణంలో బడ్జెట్‌కు కొద్ది గంటల ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(OMCs) ఎల్పీజీ సిలిండర్ ధరలను కొన్ని ప్రాంతాల్లో తగ్గించినట్లు ప్రకటనలు విడుదల చేశాయి. ఐదు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గృహా వినియోగ సిలిండర్ ధర ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని భావించారు. అదే సమయంలో కమర్షియల్సిలిండర్ల ధరల్లోనూ మార్పు ఉండొచ్చని ఆశించారు. కానీ, ఈ తరుణంలో కేంద్రం డొమెస్టిక్ సిలిండర్ల ధరల్ని పెంచుకుండా ఊరట ఇచ్చాయి. మరోవైపు ఆయిల్ కంపెనీలు భారీగానే తగ్గింపులు ప్రకటించాయి. క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో ఆకాశాన్ని అంటున్న తరుణంలో ఇది ప్రత్యేకమనే చెప్పాలి. ఫిబ్రవరి 1న ఢిల్లీలో 14.2 కేజీల ఇండేన్ డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 899.50 గా ఉంది. అలాగే కోల్‌కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర 926రూ. ఉంది. ముంబైలో నాన్ సబ్సిడైజ్డ్ ఎల్పీజీ సిలిండర్ రూ. 899.50 గా, చెన్నైలో రూ. 915.50గా ఉంది ఇవాళ. మరికొన్ని రాష్ట్రాల్లోనూ కంపెనీలు సిలిండర్ల ధరలు భారీగా తగ్గించాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. నాలుగు నెలలుగా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఓఎంసీ కమర్షియల్ సిలిండర్ ధరలపైనా భారీగానే తగ్గింపు ప్రకటించింది. (19కేజీల) ఎల్పీజీ సిలిండర్ రూ.91.50పై. తగ్గింది. ఇది ఈ రోజు నుంచే అమలులోకి రానుంది. వాస్తవానికి కొత్త ఏడాది మొదటి రోజునే ఓఎంసీ కమర్షియల్ సిలిండర్‌పై 102రూ. తగ్గించింది. అయినప్పటికీ 2 వేల రూపాయలకు పైనే ఉండేది. ప్రస్తుత ధరల సవరణ తర్వాత ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,907రూ.గా ఉంది. -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్‌డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్‌కు చెందిన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. మహిళలకు ఊరట!
Govt Reduced to LPG Cylinder Weight: గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ విషయంలో ఓ కీలక ప్రతిపాదన తమ దగ్గర ఉన్నట్లు కేంద్రం తెలిపింది. అయితే, ఇది గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు అంశం కాదండోయ్. ప్రస్తుతం 14.2 కిలోల బరువు ఉన్న గ్యాస్ సిలిండర్లను రవాణా చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని దాని బరువును తగ్గించడంతో పాటు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఎల్పీజీ సిలిండర్ బరువుగా ఉండటంతో వాటిని ఒక స్థానం నుంచి మరొక స్థానానికి జరపాలని అనుకున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బరువు తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఈ విధంగా అన్నారు. ఇంతకు ముందు, భారీ సిలిండర్ బరువు కారణంగా మహిళలకు కలిగే అసౌకర్యం గురించి ఒక సభ్యుడు ప్రస్తావించారు. "మహిళలు గ్యాస్ సిలిండర్ బరువును మోయలేక ఇబ్బందిపడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. దాని బరువును తగ్గించే ఆలోచనలో ఉన్నామని" కేంద్రమంత్రి తెలిపారు. 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ బరువును ఐదు కిలోలకు తగ్గించడం లేదా మరేదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తున్నాము అని అన్నారు. (చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు!) -
డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
New Rules From 1st December 2021: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి అద్దె బిల్లులు, చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున చెల్లిస్తారు. ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. దేశవ్యాప్తంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటి అనేక అంశాలకు సంబంధించి డిసెంబర్లో మార్పులు చోటు చేసుకొనున్నాయి. అలాంటి కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్బీఐ ప్రకటించింది. అంటే ఆన్లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు 2021 డిసెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధరలను పెంచనున్నట్లు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న 2.90 వార్షిక వడ్డీని 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతానికి తగ్గిస్తూన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభించనుంది. 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సిన వారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత జరిమానా ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్ పొందాలంటే ఏటా నవంబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. ఈపీఎఫ్ ఖాతాదారులు నవంబర్ 30లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే డిసెంబర్ నెలకు సంబంధించిన యజమాని వాటా ఈపీఎఫ్ అకౌంట్లో జమ కాదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, డిసెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.266 పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి. (చదవండి: మైక్రోసాఫ్ట్ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్వర్డ్ అవసరం లేదు!) -
నిప్పులాంటి నిజం! సిలిండర్‌పై ఎక్స్ట్రా వసూళ్లు, మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే!
ఇంటి గుమ్మం వద్దకు ఎల్పీజీ సిలిండర్ మోసుకొచ్చే బాయ్స్ నిర్ణీత రీఫిల్ ధరపై అదనంగా వసూలు చేసేది కొంత మొత్తమే అయినా.. మహానగరంలో దినసరి మొత్తం లెక్కిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.. రోజుకు అక్షరాలా రూ.22.40 లక్షలు. నెలకు రూ.6.72 కోట్ల పైమాటే. సిలిండర్లపై ఇంతలా అదనంగా బాదుతున్నారంటే నమ్మశక్యం కాదు. కానీ.. ఇది నిప్పులాంటి నిజం. అగ్గిలాంటి వాస్తవం. సాక్షి, హైదరాబాద్ : ఒకవైపు వంట గ్యాస్ ధర మంట మండిస్తుండగా.. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం.. సిలిండర్‌పై అదనపు మోత మోగిస్తున్నారు. వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సిలిండర్ రీఫిల్ నిర్ణీత ధర కంటే అదనంగా వసూళ్లకు పాల్పడటం సర్వసాధారణంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో గృహాపయోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.952. డోర్‌డెలివరీ బాయ్స్ మాత్రం రూ.980కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. అంటే ఇది నిర్ణీత బిల్లు కంటే రూ.28 అదనం. అయినా చెల్లించాల్సిందే. చదవండి: ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. గ్యాస్ ధర, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ) తదితరాలన్నీ కలుపుకొనే డిస్ట్రిబ్యూటర్ల బిల్లింగ్‌తో వినియోగదారులకు సిలిండర్ సరఫరా అవుతోంది. చమురు సంస్థలు నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న స్థానిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు రవాణా భారాన్ని మాత్రం డెలివరీ బాయ్స్‌పై వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయిల్ కంపెనీల ఎల్పీజీ డీలర్లు డెలివరీ బాయ్స్‌కు నామమాత్రంగా వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు డీలర్లు రీఫిల్ డోర్ డెలివరీపై కమీషన్‌న్ అందిస్తున్నట్లు సమాచారం. వేతనాలు సరిపడకపోవడంతో బాయ్స్ సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదీ లెక్క.. నగరంలో వంటగ్యాస్ వినియోగదారులు సుమారు 26.80 లక్షల వరకు ఉన్నారు. ప్రతి రోజు దాదాపు 90 వేల మంది వరకు రీఫిల్ కోసం బుకింగ్ చేస్తుంటారు. ప్రధాన ఆయిల్కంపెనీల సుమారు 115 ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు తమ 1,250 బాయ్స్ (సిబ్బంది) ద్వారా ప్రతి నిత్యం కనీసం 80 వేల వరకు రీఫిల్స్ డోర్ డెలివరీ చేస్తుంటాయి. డోర్ డెలివరీ బాయ్స్ మాత్రం ప్రస్తుత సిలిండర్ ధరను బట్టి ఒక్కో రీఫిల్‌పై రూ.28 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.22.40 లక్షలు అంటే నెలకు వసూలయ్యేది రూ. 6.72 కోట్లకు పైమాటే. ఇలా బహిరంగా దోపిడీ జరుగుతున్నా ఆయిల్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేదెలాగో ప్రభుత్వ యంత్రాంగమే జవాబు చెప్పాలి మరి. రీఫిల్ డెలివరీ నిబంధనలివీ... ► వినియోగదారులు ఆన్లైన్లో సిలిండర్ రీ ఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ అవుతుంది. దాని ఆధారంగా డిస్ట్రిబ్యూ టర్లు తమ సిబ్బందిచే వినియోగదారులకు రీఫిల్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ► స్ట్రిబ్యూటర్ తమ గోదాము నుంచి అయిదు కిలోమీటర్ల దూరం వరకు ఉచితంగా సిలిండర్ రీఫిల్ డోర్ డెలివరీ చేయాలి. 6– 15 కిలోమీటర్ల దూరం ఉంటే రవాణా చార్జీలకు రూ.10 వసూలు చేయాలి. 16–30 కిలో మీటర్ల దూరం ఉంటే రూ.15 తీసుకోవాలి. ఒకవేళ వినియోగదారుడు గ్యాస్ గోదాముకు వెళ్లి సిలిండర్ తీసుకుంటే బిల్లులో రూ.8 తగ్గించాల్సి ఉంటుంది. ► సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాల్సి ఉంటుంది. -
దీపావళికి ముందు సామాన్యులకు భారీ షాక్!
ఇప్పటికే పెరిగి పోతున్న పెట్రోల్, డీజిల్, వంటనూనె, ఉల్లిపాయ ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడే అవకాశం కనిపిస్తుంది. వచ్చేవారం వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ సారి అంతా.. ఇంతా కాదు ఏకంగా రూ.100 వరకు పెరగొచ్చని కొన్ని వర్గాలు సామాన్య ప్రజానీకాన్ని భయపెడుతున్నాయి. నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయని.. కేంద్రం అనుమతిస్తే ధరల పెంపు ఉండే అవకాశం ఉంది అని సమాచారం. అదే జరిగితే అన్ని కేటగిరీల్లో వంట గ్యాస్ రేట్లు పెరగడం ఇది ఐదవ సారి. అక్టోబర్ 6న 14 కేజీల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా 15 రూపాయలు పెంచడంతో హైదరాబాద్ లో వంట గ్యాస్ ఎల్పీజీ ధర రూ.950కి చేరుకుంది. ఒక్క ఏడాదిలోనే గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది. కేవలం జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 14.2 కిలోల సిలిండర్‌పై రూ.90కి పెరిగింది. ఎల్పీజీపై గత ఏడాది నుంచి కేంద్రం రాయితీలను ఎత్తివేసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో, ధరలు పెరుగుదలకు అమ్మకాలకు మధ్య ఉన్న అంతరాన్ని భరించేందుకు కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. (చదవండి: మార్కెట్లోకి శక్తివంతమైన ఎలక్ట్రిక్ ఆటో.. ధర ఎంతో తెలుసా?) అంతర్జాతీయ ఇంధన ధరలు గరిష్టా స్థాయికి పెరగడంతో ఎల్పీజీ అమ్మకాలపై నష్టాలు సిలిండర్‌కు రూ.100కు పైగా పెరిగినట్లు వారు తెలిపారు. సౌదీ ఎల్పీజీ రేట్లు ఈ నెలలో టన్నుకు 60 శాతం పెరిగి 800 డాలర్లకు చేరుకోగా, అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు 85.42 అమెరికన్ డాలర్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాయితీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించకపోవడంతో చమరు కంపెనీలు ఆ భారాన్ని మేయలని పేర్కొంటున్నాయి. లేకపోతే, ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు సిద్దం అవుతున్నాయి. గతంలో సిలిండర్‌పై కేంద్రం మూడొందల వరకు రాయితీ ఇవ్వగా.. ఇప్పుడు నామమాత్రంగా ఇస్తూ సరిపెడుతోంది. దాంతో, ఇంట్లో గ్యాస్ ముట్టించాలంటేనే మహిళలకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
మరో షాక్, భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలో మరోసారి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. అయితే ఈసారి గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకు ఈ పెంపు నుంచి మినహాయింపును ఇచ్చింది. కేవలం కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచింది. రూ. 43 పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర మరోసారి భగ్గుమంది. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 43.50 రూపాయలను కేంద్రం పెంచింది. అంతకు ముందు సెప్టెంబురు 1న ఇవే సిలిండర్ల గ్యాస్ ధరను రూ .75 పెంచింది. దీంతో నెల రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ. 123 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1952, విజయవాడలో 1916, విశాఖలో 1825, ఢిల్లీలో రూ.1736 గా ఉండగా.. కోల్ కతాలో రూ.1805.5గా ఉంది. స్ట్రీట్ వెండర్లకు కష్టమే పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు స్ట్రీట్ ఫుడ్ వెండర్లు, చిన్న, మధ్య తరగతి హోటళ్లకు భారంగా మారనుంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పరిమితంగా ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్‌ఫుడ్, చిన్న హోటళ్ల నిర్వాహకులు ధరలు పెంచే పరిస్థితి లేదు. ఇలాంటి తరుణంలో ముప్పై రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ ధరలు రెండు సార్లు పెగడం వారికి ఇబ్బందిగా మారింది. కొద్దోగొప్పో వస్తున్న ఆదాయం కాస్తా పెరిగిన గ్యాస్ ధరలకే సరిపోతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Petroleum companies increase price of commercial LPG cylinders by Rs 43. Price of a 19 kg commercial cylinder in Delhi now Rs 1736.50. On Sept 1st, price of commercial LPG cylinder was increased by Rs 75. New rates effective from today. No change in domestic LPG cylinder rates. — ANI (@ANI) October 1, 2021 చదవండి: మరో వడ్డన.. భారీగా పెరిగిన సీఎన్జీ గ్యాస్ ధరలు -
సామాన్యులకు భారీ షాక్.. మరింత పెరగనున్న గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలు వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతుంటే మరోపక్క ఎల్పీజీ గ్యాస్, వంట నూనె వంటి నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, సామాన్యులపై వచ్చే నెలలో మరో భారం పడనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం.. వచ్చే నెల అక్టోబర్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్యాస్ ధరలు ఏకంగా 57 - 70 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: ఆ ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం శుభవార్త!) ఒకవేల గ్యాస్ సిలిండర్ ధరలు నిజంగానే పెరిగితే ఇక వాటిని కొనాలంటే సామాన్యుడికి భారంగా మారే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టిన డొమెస్టిక్ గ్యాస్ పాలసీ నియమాల ప్రకారం.. ప్రతి 6 నెలలకు ఒకసారి నేచురల్ గ్యాస్ ధరలను సమీక్షిస్తుంది. అయితే, ఈ సమీక్షలో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం చూస్తే వచ్చే నెలలో దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు అధిక మొత్తంలో పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎం గ్యాస్ ధర మీ.మీ.బీ.టీ.యుకు 1.79 డాలర్‌గా ఉంటే ఇది వచ్చే నెల 3 డాలర్ల పైకి పెరగవచ్చు అనే అంచనాలున్నాయి. విదేశీ మార్కెట్లో నేచురల్ గ్యాస్ ధర సెప్టెంబర్ 8న ఒక్క రోజే 8 శాతం పెరిగింది. -
మళ్లీ పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర, ఏడాదిలో ఐదోసారి
-
మళ్లీ పేలిన గ్యాస్ బండ!
సాక్షి, అమరావతి: వంట గ్యాస్ సిలిండర్ మరోసారి భగ్గుమంది. సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధరను రూ.25 చొప్పున ఉత్పత్తి సంస్థలు పెంచేశాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. ఉత్పత్తి సంస్థలు ధర పెంచిన నేపథ్యంలో విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.857 నుంచి రూ.882కి పెరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రవాణా వ్యయం ఆధారంగా గ్యాస్ సిలిండర్ ధర రూ.882కి కాస్త అటూఇటుగా ఉంది. 2019 ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ రూ.732 ఉండగా ఇప్పుడు రూ.882లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో గ్యాస్ సిలిండర్ ధర రూ.150 మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. గత నెలలోనూ.. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఉత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. గత నెల 1న గ్యాస్ సిలిండర్ ధరను రూ.25.5 పెంచిన ఉత్పత్తి సంస్థలు తాజాగా మరో రూ.25 పెంచేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 వంట గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద అందిస్తోంది. -
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు మళ్లీ షాక్!
పెట్రోలియం కంపెనీలు దేశీయ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి భారీగా పెంచాయి. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.25పైగా పెంచడంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు రూ.859.5కు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.834.50గా ఉండేది. అంతకు ముందు జూలై 1న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచిన సంగతి తెలిసిందే. ముంబైలో కూడా 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు రూ.859.5 గా ఉంది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.861 నుంచి రూ.886కు పెరిగింది. ఈ రోజు నుంచి చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.850.50 నుంచి రూ.875.50కు పెరిగింది. హైదరాబాద్‌లో రూ.887లుగా ఉన్న గ్యాస్ ధర రూ.25 పెరిగి రూ.912కి చేరింది. సాధారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల(ఎల్పీజీ ధర) ధరలను మారుస్తాయి. 2021 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరిలో ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలో దేశీయ ఎల్పీజీ గ్యాస్ ధర రూ.859.5కు పెరిగింది. అంటే ఏడాదిలో ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.165.50 పెరిగాయి. (చదవండి: సరికొత్త రికార్డు సృష్టించిన టీసీఎస్) -
భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర!
న్యూఢిల్లీ: నేడు (ఆగస్టు 1) పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.73.5 పెంచాయి. 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధరలలో ఎటువంటి మార్పులేదు. నేటి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. తాజా ధరల పెరుగుదలతో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.1623.00గా ఉంది. అలాగే, వాణిజ్య సిలిండర్ ధర ముంబైలో రూ.1579.50కు పెరిగింది. కోల్ కతా, చెన్నైలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ.1629.00, రూ.1761.00గా ఉన్నాయి. చమురు & గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా 1వ తేదీన వంట గ్యాస్ ధరలను సవరిస్తాయి. దేశీయ గృహ ఎల్పీజీ సిలిండర్ ధరలను 2021 ఆగస్టులో మార్పులు చేయలేదు. గత నెల జూలై 1న ధరలను రూ.25.50 పెంచారు. జూలైలో ధరల పెరుగుదలతో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.834.50, ముంబైలో రూ.834.50, కోల్ కతాలో రూ.861, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887లుగా ఉంది. 2021లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.138.50 పెంచారు. జనవరి 1, 2021న 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694 వద్ద ఉంది. అంతేగాక, గత ఏడు సంవత్సరాలలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది. ఉదాహరణకు, 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మార్చి 1న రూ.410.50గా ఉంది. అయితే, ఇన్ని సంవత్సరాల్లో నిరంతర ధరల పెరుగుదలతో 14.2 కిలోల సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధానిలో రూ.834.50 వద్ద ఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది మృతి
అహ్మదాబాద్: ఇంట్లోని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీతో సంభవించిన పేలుడులో నలుగురు చిన్నారులు సహా 9 మంది తీవ్ర గాయాలతో చనిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారులో ఈనెల 20వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో బాధితులంతా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా మధుసూదన్‌గర్‌కు చెందిన వారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు, శుక్రవారం ఐదుగురు, శనివారం ఒకరు చనిపోగా ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ‘కార్మికులు, వారి కుటుంబసభ్యులు 9 మంది కలిసి ఒక ఇరుకు గదిలో నిద్రిస్తుండగా, ఆ గదిలోని ఎల్పీజీ సిలిండర్ లీకయింది. ఇది పసిగట్టి పొరుగునే ఉండే కుల్‌సింహ్ భైరవ అప్రమత్తం చేసేందుకు ఆ ఇంటి తలుపు తట్టాడు. నిద్రిస్తున్న ఒకరు లేచి, లైట్ స్విచ్ ఆన్ చేయగా, అప్పటికే గదంతా దట్టంగా వ్యాపించిన గ్యాస్ అంటుకుని మంటలు, పేలుడు సంభవించాయి. కుల్‌సింహ్ సహా మొత్తం 10 మందికి ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటివరకు చిన్నారులు సహా 9 మంది చనిపోగా, కుల్‌సింహ్ బైరవ పరిస్థితి విషమంగా ఉందని శనివారం పోలీసులు తెలిపారు. భైరవ సొంతూరు రాజస్తాన్‌లోని కరౌలీ అని చెప్పారు. -
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇకపై
న్యూ ఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ఐఓసీఎల్ విడుదల చేసిన స్మార్ట్ సిలిండర్లతో గ్యాస్ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్ రిలీజ్ చేసిన స్మార్ట్ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్ సిలిండర్లు మాదిరి స్మార్ట్ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ►నార్మల్ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ►ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ►వినియోగదారులు సులభంగా రీఫిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ►స్టీల్ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. ►మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్ చేశారు. ►ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. ►వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి 10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ►ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది. ►మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ►ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. -
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై..
న్యూ ఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ వినియోగదారులు ఇకపై తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి రిఫిల్ సిలిండర్లను పొందవచ్చునని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ గురువారం రోజున ప్రకటన చేసింది. కాగా ఈ సదుపాయాన్ని ప్రస్తుతం చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ నగరాలల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. త్వరలోనే ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఒసీలతో జతకట్టి రాష్ట్రాలలో 21,000 ఇప్పటివరకు ఎల్పిజి కేంద్రాలను తెరిచినట్లు సీఎస్సీ ఎస్పీవీ డైరక్టర్ దినేష్ త్యాగి ఒక ప్రకటనలో తెలిపారు.అంతేకాకుండా దేశవ్యాప్తంగా మార్చి 2022 నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి సుమారు ఒక లక్ష ఎల్పీజీ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్
గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై పేటీఎం భారీ ఆఫర్ ప్రకటించింది. పేటీఎం యాప్ ద్వారా ఎల్పీజీ సిలిండర్ బుక్ చేస్తే ఏకంగా రూ.800 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు అని పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు అందుబాటులో ఉంది. దేశంలో 14 కిలోల గ్యాస్ సిలిండర్ రిటైల్ ధర రూ.808-850 వరకు ఉంది. అయితే పేటిఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ. 10 నుంచి రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తుంది. మీకు కనుక అదృష్టం ఉంటే గ్యాస్ ఉచితంగానే లభించవచ్చు. అయితే, ఈ ఆఫర్ మొదటి సారి పేటీఎం నుంచి గ్యాస్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తుంది. పేటీఎం ద్వారా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్ పొందాలంటే మీరు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, మొదట మీరు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్, ఇండెన్ గ్యాస్ ఆప్షన్ లలో మీ డీలర్ షిప్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వంట గ్యాస్ ప్రొవైడర్, వినియోగదారు నంబర్, మొబైల్ నంబర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లావాదేవీల కోసం వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ చేసిన తర్వాత 48 గంటలోపు స్క్రాచ్ కార్డు లభిస్తుంది. స్క్రాచ్ కార్డు ఓపెన్ చేసి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి సారి గ్యాస్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు రూ.10 నుంచి రూ.800 వరకు ఎంతైనా క్యాష్ బ్యాక్ రావొచ్చు. మీరు స్క్రాచ్ కార్డును వారం రోజులోగా ఉపయోగించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కార్డు ఎక్స్పైరీ అవుతుంది. -
భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్‌పై రూ. 122 మేర తగ్గిస్తూ తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. నేటి(జూన్ 1) నుంచి ఈ సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రం ఊరట లభించలేదు. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యథాతథంగానే ఉండనుంది. వాణిజ్య సిలిండర్ ధర మే నెలలో కూడా తగ్గిన విషయం తెలిందే. తాజా సవరణతో ఢిల్లీలో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కి చేరింది. ముంబైలోరూ.1422కు, కోల్‌కతాలో రూ.1544కు, చెన్నైలో కూడా సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది. ఇక 14 కేజీల గ్యాస్ సిలిండర్ ఢిల్లీ లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 809గా ఉంది. . కోల్‌కతాలో రూ.835, ముంబైలో సిలిండర్ ధర రూ. 809గానూ, చెన్నైలో రూ. 825గా హైదరాబాద్‌లో రూ. 861.50 గానూ ఉంది. చదవండి: మిషన్ చోక్సీ: కీలక మహిళ ఎవరంటే? కరోనా విలయం: కోటి ఉద్యోగాలు గల్లంతు -
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు. -
ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ: దేశీయ ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఫీబ్రవరిలో వరుస పెరుగుల తర్వాత గ్యాస్ ధర స్వల్పంగా తగ్గడంతో గృహా వినియోగదారులకు కాసింత ఉపశమనం లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధర రూ.10 తగ్గించినట్లు పేర్కొంది. తగ్గిన ధరలు రేపటి(ఏప్రిల్ 1) నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఎల్పిజి సిలిండర్ ధర రూ.871గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఎల్పిజి సిలిండర్ ధర రూ.871.5 ఉంటే, విశాఖపట్నంలో రూ.826.5గా ఉంది. సమీప భవిష్యత్తులో ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. ఎల్పీజి గ్యాస్ సిలిండర్ ధర అంతర్జాతీయ ఇంధన రేట్లు, యూఎస్ డాలర్-రూపాయి మారకపు రేట్లపై ఆధారపడి ఉంటుంది. దేశీయ ఎల్పిజి సిలిండర్ల అమ్మకాలపై భారత ప్రభుత్వం ప్రస్తుతం వినియోగదారులకు సబ్సిడీ ఇస్తోంది. సిలిండర్ కొనుగోలు చేసిన తరువాత సబ్సిడీ మొత్తం నేరుగా వ్యక్తి బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. చదవండి: ఇన్‌కం టాక్స్ వెబ్సైట్ క్రాష్! కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్ -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,54,058 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 2,29,734 యూనిట్లతో పోలిస్తే ఇది 10.59 శాతం అధికం. లో బేస్ ప్రభావమే ఇందుకు కారణమని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ఈ వివరాలు తెలిపింది. దేశవ్యాప్తంగా 1,481 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు (ఆర్టీవో) ఉండగా.. 1,274 ఆర్టీవోల నుంచి సమీకరించిన గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడైనట్లు పేర్కొంది. ఎఫ్ఏడీఏ ప్రకారం.. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16% క్షీణించి 10,91,288 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు సుమారు 30% తగ్గి 59,020కి క్షీణించాయి. అటు త్రిచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయి 33,319 యూనిట్లకు తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం పెరిగి 61,351 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవారీగా చూస్తే వాహనాల విక్రయాలు 13 శాతం క్షీణించి 14,99,036 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్-4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మళ్లే క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు మందగించాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. సెమీ కండక్టర్ల కొరతతో కష్టాలు.. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడటం వల్ల ప్యాసింజర్ వాహనాల డెలివరీల్లో దాదాపు ఎనిమిది నెలల దాకా జాప్యం జరిగిందని గులాటీ వివరించారు. వాహనాలు అందుబాటులో లేక దాదాపు 50 శాతం మంది డీలర్లు సుమారు 20 శాతం పైగా విక్రయ అవకాశాలు కోల్పోయారని ఎఫ్ఏడీఏ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. తాజాగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుండటంతో కొన్ని రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. ఇంధన రేట్లు భారీగా పెరగడం కూడా దీనికి తోడైందని గులాటీ పేర్కొన్నారు. మరోవైపు, ఫైనాన్సింగ్ పరమైన సమస్యలతో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడుతోందని, విద్యా సంస్థలు ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల ప్యాసింజర్ బస్సుల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆటో ఎల్పీజీ.. 40% చౌకైన ఇంధనం ఐఏసీ వెల్లడి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఇతర ఇంధనాల వైపు చూస్తున్న వినియోగదారులకు ఆటో ఎల్పీజీ చౌకైన ప్రత్యామ్నాయం కాగలదని ఇండియన్ ఆటో ఎల్పీజీ కూటమి (ఏఐఎసీ) పేర్కొంది. ఇది సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే 40 శాతం చౌకైనదని తెలిపింది. ఆటో ఎల్పీజీ/సీఎన్జీ కన్వర్షన్ కిట్లను మరింత తక్కువ రేటులో అందుబాటులోకి తెచ్చేందుకు వీటిపై విధిస్తున్న 28% జీఎస్టీని తగ్గించాలని కేంద్రాన్ని ఒక ప్రకటనలో కోరింది. సముచిత విధానాలతో ప్రోత్సహించిన పక్షంలో సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఆటో ఎల్పీజీ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని ఐఏసీ తెలిపింది. ‘ఇంధన వ్యయాపరంగా చూస్తే పెట్రోల్ కన్నా ఇది కనీసం 40% చౌకైనది’ అని పేర్కొంది. ధరపరంగా ఇంత భారీ వ్యత్యాసమున్న నేపథ్యంలో ఆటో ఎల్పీజీ కిట్లను ఏర్పాటు చేసుకునే వాహనదారులు.. వాటిపై పెట్టిన పెట్టుబడిని ఆరు నెలల్లోనే రాబట్టుకోవచ్చని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయష్ గుప్తా తెలిపారు. దీనితో కాలుష్యకారక వాయువుల విడుదల.. సీఎన్జీ, పెట్రోల్‌తో పోలిస్తే 50 శాతం, డీజిల్‌తో పోలిస్తే 80 శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. -
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద ఉన్న 8 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఎల్పిజి సిలిండర్ల అందించే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ ధరల పెరుగుదల నేపథ్యంలో జనవరి నుంచి 14.2 కిలోల సిలిండర్ ధర జనవరి నుంచి సిలిండర్‌కు 125 రూపాయలకు పైగా పెరిగింది. దీనివల్ల జనవరిలో రూ.694 ఉన్నఎల్‌పిజి సిలిండర్ ధర ప్రస్తుతం రూ.819కు చేరుకుంది. వాస్తవానికి ఢిల్లీలో గత ఏడాది మే నుంచి వంట గ్యాస్ ధర 237.50 రూపాయలు పెరిగింది. గత సంవత్సరం కరోనా మహమ్మారి సమయంలో ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద ఉజ్వల పథకం లబ్ధిదారులందరికీ మూడు నెలల పాటు ఉచిత ఎల్పిజి సిలిండర్లు అందించారు. ఎల్పిజి సిలిండర్ల రిటైల్ ధరకు సమానమైన నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి మూడు నెలలు బదిలీ చేశారు. 2021-22 బడ్జెట్లో రెండేళ్లలో ఉజ్వాలా పథకం కింద 10 మిలియన్ల మంది లబ్ధిదారులు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చదవండి: బంగారం ధరలు ఎంత పెరిగాయంటే రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
సామాన్యుడికి షాక్ : వంట గ్యాస్ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్ ధర పెంపు సామాన్య ప్రజల్లో గుండెల్లో బాంబులై పేలుతున్నాయి. దేశంలో ఇప్పటికే నింగిని తాకిన పెట్రో ధరలతో ప్రజలు నానా తంటలు పడుతుంటే తాజాగా పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర సెగలు మరో షాకిచ్చాయి. బడ్జెట్ రోజు ఫిబ్రవరి 1న వంట గ్యాస్ ధరలను యథాతథంగా ఉంచినా, తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు (గురువారం)నుండి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామంతో వంట గ్యాస్ సిలిండర్ కూడా గుదిబండగా పరిణమించింది. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు రూ.771.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర రూ.746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర రూ .664 నుంచి రూ. 719కి పెరిగింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. -
ఎల్పీజీ: అదనంగా రూ. 6 కోట్లు!
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్‌పై డెలివరీ బాయ్స్ ప్రతినెలా అదనంగా ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా.? అక్షరాల రూ.6 కోట్ల పైమాటే. ఆశ్చర్యపోతున్నారా..? ఇది నిజం. ప్రతి వినియోగదారుడు సిలిండర్ రిఫిల్పై డెలివరీ బాయ్స్‌కు బిల్లుపై అదనంగా రూ.20 నుంచి రూ.30 చెల్లిస్తున్నారు. చిల్లరే కదా అనుకుని తేలిగ్గా తీసుకోవడంతో అది కాస్తా ‘తప్పనిసరి‘గా మారింది. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గ్యాస్ బండ( సిలిండర్) వినియోగదారులకు నానాటికి భారంగా మారుతోంది. ఓ వైపు ఆరు నెలలకోసారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరను పెంచుతుండగా, మరో వైపు డెలివరీ బాయ్స్ డిమాండ్ చేసి మరీ అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఎల్పీజీ రీఫిల్ బుక్ చేసి ఆన్లైన్లో నిర్ణీత ధర చెల్లించినా డెలివరీ సమయంలో అదనపు బాదుడు తప్పడం లేదు. ఇక నగదు చెల్లింపు అయితే బిల్లుతో కలిపి అదనంగా రూ. 30 వరకు వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఈ అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ప్రధాన ఆయిల్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసం లేదని స్పష్టం చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రస్తుతం ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తే నిర్ణీత ధర రూ.746.50పైసలు అయినా నగదు రూ.770 చెల్లించాల్సిందే. అదే చేతిలో చిల్లల లేకుంటే మరో పది రూపాయిలు కూడా పెరగొచ్చు. డెలివరీ బాయ్స్ వినియోగదారుడి చేతికి బిల్లు ఇచ్చి అదనపు మోత కలిపి వసూలు చేయడం పరిపాటిగా తయారైంది. ఏజెన్సీల నిర్లక్ష్యం.. ఏజెన్సీలు వినియోగదారులకు రీఫిల్ డోర్ డెలివరీ బాధ్యతలో నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్దేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా బాధ్యతను డెలివరీ బాయ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. అదనపు వసూళ్లపై డిస్ట్రిబ్యూటర్లకు ఫిర్యాదుచేసినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. చాలీచాలని వేతనాలు.. సిలిండర్ డెలివరీ బాయ్స్‌కు చాలీచాలని వేతనాల చెల్లిస్తుండటం కూడా వినియోగదారులపై అదనపు బాదుడుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. కొందరు డిస్ట్రిబ్యూటర్లు వారికి నామమాత్రపు వేతనాలు చెల్లిస్తుండగా, మరికొందరు రీఫిల్ డెలివరీపై కమీషన్ ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధనల ప్రకారం బాయ్స్ సిలిండర్‌ను డోర్ డెలివరీ చేసే సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. అయితే ఈ నిబంధన ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు తప్ప బరువు చూపించాలన్న ధ్యాస లేకుండా పోయింది. నిబంధనలు ఇవీ ⇔ వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుకింగ్ చేసుకున్న తర్వాత బిల్లు జనరేట్ చేసి డోర్ డెలివరీ చేయాలి ⇔ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలివరీ ఇవ్వాలి. ⇔ ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణా చార్జీల పేరుతో రూ.10 వసూలు చేయవచ్చు. ⇔ 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీగా రూ. 15 వసూలు చేయాలి ⇔ వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
ఢిల్లీ: జనంపై గ్యాస్ బండ
-
7718955555
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: నవంబర్ 1 నుంచి ఇండేన్ గ్యాస్ వినియోగదారులు దేశంలో ఎక్కడ నుంచి అయినా 7718955555 నంబర్ ద్వారానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఇండియన్ ఆయిల్ డీజీఎం (ఎల్పీజీ) ఎల్పీ ఫులిజిలే తెలిపారు. ఆయన విజయవాడలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. డీలర్ల వద్ద నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ల నుంచి ఎస్ఎంఎస్ లేదా ఐవీఆర్ విధానంలో సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు. మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారు 16 అంకెల గ్యాస్ కనెక్షన్ నంబర్ నమోదు చేయడం ద్వారా బుక్ చేసుకోవాలన్నారు. అలాగే 75888 88824 నంబర్‌కు వాట్సాప్ ద్వారా రీఫిల్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు తెలిపారు. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కూడా గ్యాస్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్ సేవలు పొందవచ్చన్నారు. -
ఎల్లో మీడియా దుష్ప్రచారంపై రజత్ భార్గవ్ స్పష్టత
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధర పెంచిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'గృహావసరాలకు వాడే గ్యాస్ ధర ప్రభుత్వం పెంచలేదు. ఎల్పీజీ గ్యాస్‌పై వ్యాట్ పెంచామన్నది అబద్ధం. అసలు ఎల్పీజీ గ్యాస్‌పై ట్యాక్స్ జీఎస్టీ పరిధిలోనిది. ఎల్పీజీపై రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచే అవకాశమే లేదు. కొన్ని మీడియా సంస్థలు అవగాహన లేక తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నేచురల్ గ్యాస్‌పై ట్యాక్స్‌ను స్వల్పంగా పెంచింది. అది పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే గ్యాస్ మాత్రమే. వంట గ్యాస్‌పై ట్యాక్స్ ఎక్కడా పెంచలేదు' అని రజత్ భార్గవ్ స్పష్టం చేశారు. ('చంద్రబాబులా ఈ ప్రభుత్వం సీబీఐకి భయపడదు') -
దిగొచ్చిన గ్యాస్ ధర..!
సాక్షి, నాగారం (నల్గొండ) : పేద, సామన్య ప్రజలకు ఊరట. లాక్డౌన్ కారణంగా అధిక ధరలతో అవస్థలు పడుతున్న ప్రజలకు వంట గ్యాస్ ధర తగ్గడంతో కాస్త ఉపశమనం లభించింది. వంట గ్యాస్ ధరలు తగ్గడంతో జిల్లాలో 3,24,567 మందికి ప్రయోజనం చేకూరనుంది. తగ్గిన వంట గ్యాస్ ధరలు మే నెల నుంచే అమలులోకి వచ్చాయి. ఏప్రిల్ నెలలో గృహ అవసరాల సిలిండర్ ధర రూ.818 ఉండగా ప్రస్తు తం రూ.214లు తగ్గి రూ.604లకు లభిస్తోంది. గతంలో కమర్షియల్ సిలిండర్ (నాన్‌డొమెస్టిక్) ధర రూ. 1,495 ఉండగా రూ.101 తగ్గి ఇప్పుడు రూ.1,394కు లభిస్తోంది. లాక్‌డౌన్‌తో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో గ్యాస్ ధరలు దిగొచ్చాయి. గ్యాస్ ధరలు తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా... జిల్లాలో మొత్తం 3,24,567 గ్యాస్కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ సిలిండర్ 1,90,508, డబుల్ సిలిండర్ 50,532, దీపం పథకం11,576, కార్పొరేషన్ రెస్పాన్స్‌బులిటి (సీఎస్ఆర్) 61,369, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 10,582 ఉన్నాయి. చార్జీల పేరిట దోపిడీ.... గ్యాస్ఏజన్సీల నిర్వాహకులు రవాణా చార్జీల పెరిట వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 25 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలు ప్రతినెలా వినియోదారులకు గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రవాణా చార్జీల పేరుతో ఒక్కోగ్యాస్ సిలిండర్‌పై అదనంగా రూ.30నుంచి రూ.60వరకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. గ్యాస్ ధర తగ్గింపుతో ఊరట కరోనా లాక్‌డౌన్‌తో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.214లు తగ్గించడంతో పేదలకు ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను తగ్గించడం పట్ల ఆనందంగా ఉంది. –మల్లెపాక వెంకన్న, ఆటోడ్రైవర్, లక్ష్మాపురం గ్యాస్‌రేటు తగ్గడం హర్షణీయం లాక్డౌన్ కారణంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు తగ్గించడం సామాన్యులకు ఎంతో మేలు. వంట గ్యాస్ ధరలు తగ్గించడం హర్షణీయం. –మామిడి ధనమ్మ, గృహిణి, పసునూర్ ఈనెల నుంచే అమలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గాయి. ఈ రేట్లు ఈనెల–1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. రూ.604లకే 14కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు లభిస్తోంది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా వస్తుంది. –విజయలక్ష్మి, డీఎస్ఓ, సూర్యాపేట -
‘ఎల్పీజీ’పై తొందరవద్దు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లభ్యత తగ్గిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి బుకిం గ్లు చేస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలపై ఒత్తి డి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, విని యోగదారులు ఆందోళనకు గురికావొద్దని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళికృష్ణ ప్రకటించారు. కొరత లేదు.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బుకింగ్‌లు పెరి గాయి. దేశవ్యాప్తంగా రోజుకు 15–18 లక్షల బుకింగ్‌లు ఉం టుండగా, మార్చి నాటికి 20 నుంచి 22 లక్షలకు పెరిగాయి. పది రోజులుగా ఏకంగా రోజుకు దేశవ్యాప్తంగా 25లక్షల బు కింగ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 2లక్షల వరకు బుకింగ్‌లు ఉంటుం డగా, అవిప్పుడు ఏకంగా 3.50లక్షల వరకు పెరిగాయి. రెండ్రోజుల కిందట వరకు తొలి సిలెండర్ బుకింగ్ చేసిన అనంతరం రెండో బుకింగ్ చేసేందుకు కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో బుకింగ్‌లు పెరగడంతో, ఆయిల్ కంపెనీలు పలు ఆంక్షలు తెచ్చాయి. ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గ్యాప్‌ను 14 రోజులకు పెంచాయి. అంటే 14 రోజుల తర్వాతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని, సాధారణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నాయని ప్రకటించింది. అనవసరం బుకింగ్‌లు వద్దని, డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపాలని సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ 1906ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
సబ్సిడియేతర ఎల్పిజి సిలిండర్ ధర భారీగా పెంపు
-
గ్యాస్ పైపు నోట్లో పెట్టుకుని..
సాక్షి, హైదరాబాద్ : జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పులగూడ గ్రామం దుర్గానగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఆర్.మౌలీధర్ నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజులుగా అతడి చెల్లి శ్రావణి ఫోన్ చేస్తున్నా తీయకపోవడంతో ఆందోళన చెందిన ఆమె సమీప బంధువైన ఆర్.నరేందర్ప్రదీప్కు తెలిపింది. దీంతో అతను ఆదివారం సాయంత్రం మౌలీధర్ నివాసానికి వచ్చి చూడగా మొహానికి ప్లాస్టిక్ కవర్‌ను గ్యాస్ పైప్‌తో కట్టుకుని పడిఉండటాన్ని కిటికీలోంచి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతడి పక్కనే సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి చెల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పెరిగిన గ్యాస్ ధర
సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్ ధర పెరిగింది. రెండు మాసాలుగా వరుసగా తగ్గిన వంట గ్యాస్ ధర ఈసారి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర రూ.628లు ఉండగా, పెరిగిన ధరతో అది రూ.644కు చేరింది. పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది. -
‘ఉజ్వల స్కీమ్’కు మరింత సబ్సిడీ!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల స్కీమ్’ కింద ఇప్పటి వరకు దేశంలోని 7.30 కోట్ల పేద కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేశారు. 2020 సంవత్సరం నాటికి దేశంలోని ఎనిమిది కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇప్పటికే 91.25 లక్ష్యాన్ని సాధించింది. కనుక మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మరెంతో సమయం పట్టదు. ఇన్ని కోట్ల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసినప్పటికీ గత రెండేళ్ల కాలంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరిగింది మాత్రం 0.8 శాతం మాత్రమే. పెరిగిన వినియోగదారుల సంఖ్య కూడా ఆరు శాతమే. ఇలా ఎందుకు జరుగుతోంది ? ఉజ్వల స్కీమ్ కింద వంట గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వారిలో ఎక్కువ మంది గ్యాస్ సిలిండర్లను కొనుగోలు చేయడం లేదనేది సులభంగానే అర్థం అవుతోంది. ఉజ్వల స్కీమ్ కింద వినియోగదారులంతా కలిసి ఏడాదికి తలసరి 3.4 శాతం సిలిండర్లు వినియోగిస్తున్న ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. ‘కొలాబరేటివ్ క్లీన్ ఏర్ పాలసీ సెంటర్’ ప్రకారం వీరు తలసరి కనీసం తొమ్మిది సిలిండర్లు వినియోగించాలి. మరి ఎందుకు వినియోగించడం లేదు. గ్యాస్ సిలిండర్ల ఖరీదును భరించలేక వారంతా ఇప్పటికీ వంట చెరకు, పిడకలపైనే ఆధారపడి వంట చేసుకుంటున్నారు. దేశం మొత్తం మీదుండే ఐదొంతుల గ్రామీణ ప్రజల్లో రెండొంతుల మంది బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. వారిలో 85 శాతం మంది ఇప్పటికీ సంప్రదాయ వంట చెరకునే వాడుతున్నారని ‘ఇండియా స్పెండ్’ పరిశోధన సంస్థ వెల్లడించింది. వంట కోసం కట్టెలు, పిడకలు, ఊక ఉపయోగించడం వల్ల రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. మొత్తం కాలుష్యంలో వీటి వాటా 25 నుంచి 30 శాతం ఉంటుంది. వంట కాలుష్యం వల్ల ఏటా 4,80.000 మంది అకాలంగా మరణిస్తున్నారన్నది క్లీన్ ఏర్ పాలసీ సెంటర్ అంచనా. వంట గ్యాస్‌ను ఉపయోగించడం ఈ అకాల మరణాలను సులభంగా అడ్డుకోవచ్చు. ఈ పేద వినియోగదారుల ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను కచ్చితంగా పంపించడం వల్ల ఒక్కొక్క వినియోగదారుడి ఆరోగ్యం ప్రభుత్వం పెడుతున్న ఖర్చును 3,800 నుంచి 1,800 రూపాయల వరకు ఆదా చేయవచ్చు. వంటగ్యాస్ సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చు పెడుతున్న మొత్తం 2019–20 బడ్జెట్ అంచనాల ప్రకారం 32,989 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్జు పెడుతున్నా ఆశించిన ఫలితం రాకపోవడం బాధాకరం. ఉజ్వల స్కీమ్ కింద పేద వినియోగదారుడికి సిలిండర్‌కు ఆరేడు వందల రూపాల భారం పడుతోంది. అది ఏ నాలుగు వందల రూపాయల లోపల వస్తేగానీ, అంటే 350 రూపాయలకు వస్తేనేగానీ ఆ వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సాహసించలేడు. అందుకని ఈ మేరకు పేదలపై సిలిండర్ సబ్సిడీని పెంచి, మిగతా వినియోగదారులపై తగ్గించాలని ‘సీసీఏపీసీ’ కేంద్రానికి సిఫార్సు చేసింది. -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..
సాక్షి, సిటీబ్యూరో: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింది. 14.2 కిలోల సిలిండర్ ధర రూ.690 నుంచి రూ.627.50కి తగ్గింది. అంటే సిలిండర్‌పై రూ.62.50 తగ్గినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ గ్యాస్ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం బలపడడం తదితర కారణాలతో చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తగ్గిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. వినియోగదారులు సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత సబ్సిడీ సొమ్ము నగదు బదిలీ కింద బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మూడు నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గుతూ వస్తోంది. జూన్‌లో రూ.793 ఉండగా జూలైలో రూ.690కు చేరింది. తాజాగా మరో రూ.62.50 తగ్గింది. గ్రేటర్ పరిధిలో డొమెస్టిక్ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉండగా... 135 ఎల్పీజీ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతిరోజు 1.50 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్ల సరఫరా జరుగుతోంది. -
వంట గ్యాస్ ధర పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. ఎన్డిఏ ప్రభుత్వం ఆధ్యర్యంలో పెట్రోలు, డీజిలు ధరలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై నెల చివర్లో ఎల్పీజీ సిలిండర్ ధరను మళ్లీ పెంచింది. తాజా పెంపుతో రాయితీ ఉన్న వంట గ్యాస్ సిలిండర్‌పై ధర రూ.1.76 పెరిగింది. సబ్సిడీ లేని సిలిండర్ ధరను రూ.35.50 లు పెరిగింది. నేటి అర్థరాత్రి నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. దీంతో గత నాలుగేళ్లలో 27 సార్లు గ్యాస్ ధరలను పెంచినట్టయింది. గత నెలలో సిలిండర్‌పై రూ.2.71 మేర ధరను పెంచింది. పేద,మధ్య తరగతి వినియోగదారులు వినియోగిస్తున్న సిలిండర్‌పై ఇస్తున్న రాయితీని దశలవారీగా తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. -
సిలిండర్ పేలుళ్లకు పరిహారమేదీ?
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా ప్రమాదవశాత్తూ వంటగ్యాస్ సిలిండర్ పేలుళ్లకు వందలాది మంది బలవుతున్నా, భారీగా ఆస్తినష్టం సంభవిస్తున్నా బాధిత కుటుంబాలు చట్ట ప్రకారం పొందాల్సిన బీమా పరిహారానికి నోచుకోవడంలేదు. ప్రమాదాలకు గురయ్యే ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరిగా చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు కనీస అవగాహన లేకపోవడం, చమురు సంస్థలు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు సైతం పెద్దగా ప్రచారం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రమాదాలకు బీమా సదుపాయం ఉందని తెలిసిన అతికొద్ది మందికే తూతూమంత్రంగా పరిహారం దక్కుతోంది. గత పదేళ్లలో గ్యాస్ సిలిండర్ పేలుళ్ల కారణంగా తెలంగాణలో 657 మంది మృతిచెందగా కేవలం 25 మందికే బీమా పరిహారం అందగా దాదాపు 2,300 మంది క్షతగాత్రుల్లో ఏ ఒక్కరికీ పరిహారం లభించలేదు. అలాగే ఈ ప్రమాదాల్లో 1,100కుపైగా ఇళ్లు ధ్వంసమైతే ఆస్తి నష్టం కింద బాధితులకు పైసా పరిహారం కూడా దక్కలేదు. చమురు సంస్థలు ప్రీమియం చెల్లిస్తున్నా... ఏదైనా కారణం చేత వంటగ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించి ఎవరైనా మరణించినా, ఆస్తులకు నష్టం వాటిల్లినా బీమా పరిహారం తప్పనిసరి. ప్రభుత్వరంగ చమురు సంస్థలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు తమ పబ్లిక్ లయబిలిటీ పాలసీని అనుసరించి (పాలసీ నంబర్ 021700/ 46/14/37/0000041) ఒక్కో వ్యక్తి మరణానికి రూ. 5 లక్షల చొప్పున, ఒక్కో క్షతగాత్రుడికి గరిష్టంగా రూ. లక్ష చొప్పున, ప్రమాదం మొత్తంమీద గరిష్టంగా రూ. 15 లక్షలను వైద్య ఖర్చుల కింద బీమా పరిహారంగా చెల్లించాల్సి ఉంది. అలాగే ఆస్తి నష్టానికి గరిష్టంగా రూ. లక్ష పరిహారం అందించాల్సి ఉంది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బీమా కంపెనీలకు ప్రీమియం (పర్ సిలిండర్) చెల్లిస్తున్నాయి. ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లతో పోలిస్తే అనూహ్యంగా పెరిగింది. 2010 దశకంలో గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ల వాడకం 28 శాతం ఉండగా ఇప్పుడది 83 శాతానికి పెరిగింది. పట్టణ, నగర ప్రాంతాల్లో ఏటేటా 11 శాతం నుంచి 13 శాతం మేర కనెక్షన్లు పెరుగుతున్నాయి. దాంతోపాటే సిలిండర్ పేలుడు ప్రమాదాలూ ఎక్కువవుతున్నాయి. వినియోగదారులు, డీలర్లలో అవగాహనలేమి... ఎల్పీజీ వినియోగదారుల్లో అత్యధిక శాతం మందికి బీమా సదుపాయం ఉందన్న సంగతే తెలియదు. పట్టణ ప్రాంతాల్లో 85 శాతం మంది వినియోగదారులు, 60 శాతం మంది డీలర్లకు బీమా సదుపాయం గురించి అవగాహన లేదని విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ పరిశీలనలో బయటపడింది. ఈ విషయంలో వినియోగదారులు, డీలర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాలేవీ ఆయిల్ కంపెనీలు చేపట్టడం లేదు. ఆయిల్ కంపెనీలు తమ నుంచి సరఫరా అయ్యే ప్రతి సిలిండర్‌కు ప్రీమియం చెల్లిస్తున్నా ప్రచారం చేయకపోవడంతో వినియోగదారులు, డీలర్లకు దీని గురించి తెలియడంలేదు. తమిళనాడు, కేరళ మినహా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సిలిండర్ పేలుళ్లు ఎక్కువగా జరుగుతున్న విషయం గమనించిన పరివర్తన్ మరఠ్వాడా అనే స్వచ్ఛంద సంస్థ బాధిత కుటుంబాల చేత స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయించి మరీ బీమా కంపెనీల నుంచి పరిహారం ఇప్పిస్తోంది. వీరెవరికీ పరిహారం రాలేదు గతేడాది నవంబర్ 19న హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పీఎస్ పరిధిలో ఉన్న అడ్డగుట్టలో ఓ ఇంట్లో సిలిండర్ పేలి దినేష్ అనే టీనేజర్ మరణించడంతోపాటు ఇల్లు ధ్వంసమైంది. నిబంధన ల ప్రకారం అతని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల మేర బీమా పరిహారం, ఇల్లు ధ్వంసమైనందుకు మరో రూ. లక్ష అందాల్సి ఉన్నా అందలేదు. 2017 మార్చి 27న హిమాయత్‌నగర్‌లోని శ్యామల బుచ్చమ్మ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఇల్లు సగభాగం ధ్వంసమైంది. దాదాపు రూ. 25 లక్షల మేర నష్టం వాటిల్లినా నిబంధనల మేరకు రావాల్సిన లక్ష పరిహారం కూడా రాలేదు. గతేడాది జూలై 26న కుల్సుంపురాలో సిలిండర్ పేలుడు ప్రమాదంలో రామకృష్ణ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎవరికీ పైసా బీమా పరిహారం అందలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో గతేడాది సెప్టెంబర్ 4న సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబానికి రూ. 10 లక్షల మేర బీమా రావాల్సి ఉన్నా ఆయిల్ కంపెనీగానీ, ఎల్పీజీ డీలర్గానీ పట్టించుకోలేదు. డీలర్ల నిర్లక్ష్యమే... వినియోగదారులు లేదా గోడౌన్లలో పని చేసే సిబ్బంది ప్రమాదవశాత్తూ మరణించినా లేదా గాయపడినా బీమా సదుపాయం ఉంటుందని మేము కచ్చితంగా డీలర్లకు వివరిస్తాం. ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలని సూచిస్తున్నా వారు పట్టించుకోవడంలేదు. వినియోగదారులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయాలన్న నిబంధననూ గాలికి వదిలేస్తున్నారు. అయితే ఎవరైనా వచ్చి ప్రమాద ఘటన వివరాలు మా దృష్టికి తెస్తే పరిహారం ఇప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సీనియర్ మేనేజర్, బీపీసీఎల్ -
గ్యాస్ మంట
మంచిర్యాల టౌన్: మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. సామాన్యుడిపై భారం పడింది. కేంద్రం ప్రస్తుతం పెంచింది రూ.4.50 అయినా గడిచిన 16 నెలల్లో పెంచిన పెంపు మొత్తం రూ.240.50 కావడం గమనార్హం. సబ్సిడీ ఎత్తివేయాలనే యోచనతోనే కేంద్రం నెలనెలా ఇలా గ్యాస్ ధర పెంచుతున్నట్లు తెలుస్తోంది. 2016 జూలైలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు ఈ ధరలను 16 నెలల్లో 19 సార్లు సవరించాయి. ఇందులో ఎక్కువ సార్లు పెరుగుదలే ఉంది. వంటగ్యాస్‌ను సబ్సిడీపై పొందుతున్న వారిలో సాధారణ కుటుంబాలే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం నేరుగా పెట్రోలియం సంస్థలకు సబ్సిడీ సొమ్మును సర్దుబాటు చేసి వినియోగదారులకు తక్కువ ధరకే గతంలో సిలిండర్ అందించేది. అయితే సబ్సిడీని పెట్రోలియం సంస్థలకు సర్దుబాటు చేయకుండా వినియోగదారుల నుంచి నిర్ణీత సొమ్ము వసూలు చేసి రీయింబర్స్మెంట్ రూపంలో కేంద్రం వినియోగదారుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే విధానం కొంతకాలంగా అమలు చేస్తోంది. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై రూ.90 నుంచి రూ.200 వరకు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమయ్యేది. అంటే గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం అంత మొత్తాన్ని భరించేది. అయితే వంటగ్యాస్‌పై సబ్సిడీ భారాన్ని వదిలించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి నెలా గ్యాస్‌పై రూ.4 చొప్పున ధర పెంచాలని నిర్ణయించింది. ఇలా ప్రతినెలా ధర పెంచుతూ పోయి 2018 మార్చి వరకు మొత్తం సబ్సిడీని ఎత్తివేయాల ని యోచిస్తోంది. గత నెల సబ్సిడీ సిలిండర్ ధర రూ.714 ఉండగా ఈ నెల నుంచి పెరిగిన ధరతో కలిపి రూ. 808కి (ఇందులో సబ్సిడీ మినహా పెరిగింది రూ.4.50) చేరింది. నెలకు రూ.18.76 లక్షలకు పైనే భారం ఉమ్మడి జిల్లాలో 45 ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీలలో సబ్సిడీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య 4.17 లక్షల వరకు ఉంది. ఒక్కో సిలిండర్‌పై రూ.4.50 పెంచడంతో వినియోగదారులపై నెలకు రూ.18.76 లక్షల భారం పడనుంది. 2016 ఆగస్టులో గ్యాస్ రూ. 567.5 ఉండగా, ప్రతి నెలా పెరుగుతూ మధ్యలో కొంచెం తగ్గినా అక్టోబర్‌కు రూ.714కు చేరింది. ఈ నెల రూ.808 అయింది. గత నెల సబ్సిడీ గ్యాస్ ధర రూ.714 ప్రస్తుతం పెరిగిన ధర(రూ) రూ.808 ఈ నెల పెంపు రూ.94 (సబ్సిడీ పోనూ పెరిగిన మొత్తం రూ.4.50) ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 4.17లక్షలు ప్రజలపై నెలకు భారం రూ.18.76 లక్షలు ధరలు పెంచుకుంటూ పోతే ఎలా..? వంట గ్యాస్ ధరలను ప్రతి నెలా ఇలా పెంచుకుంటూ పోతే మాలాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి. గతేడాది రూ.560 వరకు ఉన్న గ్యాస్ ధర ఈ నెల రూ.808కి పెంచి మాపై భారం మోపడం సరికాదు. – బిరుదుల కవిత, రెడ్డికాలనీ, మంచిర్యాల గింతగనం ఎన్నడూ పెరగలేæ.. కేంద్రం ఏం నిర్ణయాలు తీసుకుంటుందో ఏమోగాని గీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. ఏ సర్కార్ కూడా ఎన్నడు గింత గనం పెంచలేదు. సామాన్య ప్రజలు వంటగ్యాస్ పోయి మీద వండుకొని తినడం మానేసి కట్టెల పొయ్యిని నమ్ముకునేలా చేస్తున్నారు. – ఎం. ఇందిర, మంచిర్యాల గ్యాస్ ధరలు తగ్గించాలే... పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలేమో పెంచుకుంటూ పోతే ఏ నెల ఎంత ధర ఉంటదో మాకు ఎట్లా తెలుస్తుంది. మాకు పనిచేసుకునే చోట గ్యాస్ ధరలు పెంచినట్లు జీతాలు పెంచి ఇవ్వడం లేదు. ఓ వైపు కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అందనంత దూరం పోయినయ్. నోట్ల రద్దు తర్వాత అన్ని ధరలు తగ్గుతాయాని గొప్పలు చెప్పిన నాయకులు ఇప్పుడేమో ఎవరు మాట్లాడుతలేరు. – నవీన, మంచిర్యాల -
డీలర్లే అక్రమార్కులు..!
► దారితప్పిన రేషన్ వ్యవస్థ ► నల్లబజారుకు నీలి కిరోసిన్ ► రేషన్ బియ్యమూ పక్కదారి ► కార్డుదారులకిచ్చేది అరకొరే ► 50 మందిపై కేసులు నమోదు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిరుపేదలకు నిత్యావసర సరుకులు వినియోగదారులకు సక్రమంగా అందడం లేదు. అనేక ప్రాంతాల్లో డీలర్లు వినియోగదారుల పేరిట కోటా విడుదలైనా.. ఆ సరుకు ఇవ్వకుండా కోత విధిస్తున్నారు. వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఎంతోమంది డీలర్లు షాపుల్లో స్టాక్ పట్టికను నిర్వహించడం లేదు. అసలు రికార్డులు నిర్వహించని, సకాలంలో షాపులు తెరవని వాళ్లూ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీల్లో కనీసం 10 నుంచి 20 మధ్యలో డీలర్లు పట్టుబడుతూనే ఉన్నారు. వారికి ప్రతి నెల రెవెన్యూ డివిజనల్ అధికారులు రూ.7 వేలలోపు జరిమానా విధిస్తూ వదిలి పెడుతున్నారు. ఎన్ని జరిమానాలు విధించినా డీలర్ల తీరులో మార్పు రావడం లేదు. ఏడాది కాలంలో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో అక్రమాలకు పాల్పడిన 50 మంది డీలర్లపై కేసులూ నమోదు చేశారు. వారి డీలర్ షిప్ రద్దు చేశారు. రికార్డులు, స్టాక్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించిన అధికారులు 1067 క్వింటాళ్ల బియ్యం, 8376 నీలి కిరోసిన్, 200క్వింటాళ్ల గోధుమలు, 30 క్వింటాళ్ల కందిపప్పు, 34 క్వింటాళ్ల చక్కెరస్వాధీనం చేసుకున్నారు. అయినా.. క్షేత్రస్థాయిలో డీలర్లలో మార్పు రావడం లేదు. నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్ నల్లబజారుకు తరలిస్తూనే ఉన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలాఖరు వరకు కార్డుదారులందరికీ నిత్యావసర వస్తువులు ఇవ్వాలనే నిబంధనలున్నా.. నెలకు ఐదు రోజులకు మించి రేషన్‌షాపులు తెరవడం లేదనే విమర్శలున్నాయి. మరోపక్క.. ఆ ప్రాంత ప్రజల పరిస్థితులను బట్టి ప్రతి రోజు నాలుగు గంటలు రేషన్ షాపులు తెరిచి ఉంచాల్సి ఉండగా.. కొందరు రోజుకు రెండు గంటలు మాత్రమే షాపులు తె రిచి తర్వాత మూసేస్తున్నారు. దీంతో కార్డుదారులు సరుకుల కోసం రేషన్ షాపులే కాదు.. డీలర్ల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షించాల్సిన పలువురు డీటీ(ఎన్ఫోర్స్మెంట్)ల పనితీరుపైనా విమర్శలొస్తున్నాయి. పలువురు డీటీల అండదండలతో డీలర్లు అక్రమాలకు తెరలేపారు. ముఖ్యంగా మంచిర్యాల పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తూర్పు ప్రాంతానికి కేంద్రంగా ఉండడం.. రవాణా వ్యవస్థకు అనుకూలంగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు చెందిన డీలర్లు నిత్యావసర వస్తువుల్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు మంచిర్యాల కేంద్రంగా రేషన్ బియ్యం, గోధుమలను ఇతర ప్రాంతాలకు తరలించి బడా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారి మిల్లులు, గోదాములపై మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గతంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అక్రమార్కులు సెలైంట్‌గా ఉండడంతో.. తూర్పు ప్రాంత పరిధిలో ఉన్న డీలర్లు ఈ అక్రమ దందాకు తెరలేపినట్లు తెలిసింది. రెండ్రోజులకోసారి జిల్లాలో ఏదో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు పట్టుబడుతునే ఉన్నాయి. జిల్లాలో 7.38 లక్షల కార్డులు జిల్లాలో 7.38 లక్షల పైచిలుకు ఆహార భద్రత కార్డులున్నాయి. 23లక్షల మందికి రేషన్ సరుకులు అందుతున్నాయి. 1443 రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ అవుతున్నాయి. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని వారికి 2 లీటర్ల కిరోసిన్, గ్యాస్ ఉన్న వారికి లీటర్ కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కార్డుదారుల్లో సుమారు 3లక్షల మంది ప్రతి నెలా నిత్యావసర సరుకులు రేషన్ షాపుల నుంచి తీసుకోరు. వందలాది మెట్రిక్ టన్నుల బియ్యం, వేలాది లీటర్ల కిరోసిన్ ప్రతి నెలా మిగిలిపోతోంది. దీంతో రేషన్డీలర్లే ఆ బియ్యం, కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. పలు చోట్ల నిత్యావసర వస్తువుల కోసం షాపులకు వెళ్లిన వినియోగదారులకు అన్ని సరుకులు కాకుండా ఒకటి, రెండు రకాలు మాత్రమే ఇచ్చి పై నుంచి ఇంకా కోటా రాలేదంటూ డీల ర్లు తిరిగి పంపుతున్నారు. దీంతో ఇచ్చిన సరుకులే చాలంటూ.. వినియోగదారులు ఇచ్చిందే తీసుకుని వెనుదిరుగుతున్నారు. మరోపక్క జిల్లాలో మూడొందలకు పైగా రేషన్ దుకాణాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు ఉన్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బంధువులకు షాపులు మంజూరు చేయొచ్చనే నిబంధన ఉండడంతో దాన్ని సాకు గా చేసుకుని కొందరు నేతలు తమ పలుకుబడితో బంధువులకు రేషన్ షాపులు ఇప్పించుకున్నారు. బినామీ పేరిట షాపులు నిర్వహిస్తూ.. నిత్యావసర సరుకులు పక్కదారి పట్టిస్తున్నారు. దీంతో ప్రజలూ సదరు డీలర్లపై ఫిర్యాదు చే సేం దుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల మేరకు షాపులు నిర్వహించని డీలర్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కఠినంగా వ్యవహరిస్తాం రేషన్ డీలర్లంద రూ సమయపాలన పాటించడంతోపాటు కార్డుదారులందరికీ ప్రతి నెల విధిగా నిత్యావసర సరుకులు ఇవ్వాలి. కార్డుదారులందరికీ సరుకులందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి నెల సాధారణ తనిఖీలు చేపడుతున్నాం. రెగ్యులర్ యాక్టివిటీస్, బోర్డుపై స్టాక్ వివరాలు, సమయపాలన పాటించని వారికి జరిమానాలు విధిస్తున్నాం. సరుకులు పక్కదారి పట్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. - ఉదయ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
15 నుంచి గ్యాస్‌కు నగదు బదిలీ
ఒంగోలు : గ్యాస్‌కు ఆధార్ లింకేజీని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో వివరాలను పొందుపరిచింది. 15వ తేదీ నుంచి డెలివరీ అయ్యే సిలిండర్లకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని శ్రీదేవి ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కోటిరెడ్డి తెలిపారు. అయితే గతంలో గ్యాస్‌కు నగదు బదిలీ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నవారు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, మిగిలిన వారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమకు ఒక దరఖాస్తు అందజేయడంతోపాటు బ్యాంకుకు కూడా సంబంధిత సమాచారాన్ని తెలియజేస్తూ ఆధార్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
సబ్సిడీ సిలిండర్లను తగ్గించబోం!
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ త్వరలోనే వంటగ్యాస్‌కు నగదు బదిలీ ప్రారంభం ఇందుకు ఆధార్ తప్పనిసరి కాదు తొలుత 54 జిల్లాల్లో అమలు న్యూఢిల్లీ: దేశంలో గృహ వినియోగానికి సబ్సిడీపై అందజేస్తున్న ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను తగ్గించే యోచనేదీ లేదని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అలాగే వంటగ్యాస్‌కు నగదు బదిలీని వచ్చే ఏడాది జూన్‌లోగా దేశమంతటికీ విస్తరిస్తామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో గృహ వినియోగదారులకు ఏటా 12 వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై అందజేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు వీటిని నెలకొకటి మాత్రమే ఇవ్వాలన్న పాత నిబంధనను మోదీ సర్కారు తొలగించి.. ఏడాదిలో ఎప్పుడైనా వీటన్నింటినీ తీసుకునే వెసులుబాటు కల్పించింది కూడా. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు వివరాలను వెల్లడించారు. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమలు చేస్తామని.. సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని సవరించామని, గతంలోలాగా ఆధార్ నంబర్‌ను ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర మంత్రి వెల్లడించారు. తొలుత 54 జిల్లాల్లో నగదు బదిలీని ప్రారంభిస్తామని.. జనవరి 1 నుంచి మిగతా చోట్ల అమలు చేస్తామని చెప్పారు. వచ్చే జూన్ నాటికి దాదాపు దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో వంటగ్యాస్‌కు నగదు బదిలీ అమల్లోకి వస్తుందని తెలిపారు. జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు తెరిచినవారికి కూడా ఈ పథకం నుంచి ప్రయోజనం కలుగనుందన్నారు. ప్రస్తుతం వంటగ్యాస్‌కు బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తికాగానే సబ్సిడీలను జమ చేయడం ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. నగదు బదిలీ కింద జమ చేసే సబ్సిడీ మొత్తాన్ని నిర్ణయించేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో దేశంలో వ్యాపార పరిస్థితులను సులభతరం చేస్తామని పేర్కొన్నారు. -
12 సిలిండర్లు ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చు
న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట! కుటుంబానికి నెలకు ఒకే సిలిండర్ అన్న నిబంధనను కేంద్ర కేబినెట్ ఎత్తివేసింది. ఏడాదికి ఇస్తున్న 12 సబ్సిడీ సిలిండర్లను ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ల కోటాను 9 నుంచి 12 సిలిండర్లకు పెంచుతూ.. నెలకు ఒకే సిలిండర్ అని నిబంధన విధించడం తెలిసిందే. ఈ విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేబినెట్ గుర్తించినట్లు టెలికం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కేబినెట్ భేటీ అనంతరం విలేకర్లతో చెప్పారు. ‘కొన్నిసార్లు ప్రజలకు ఒక్క సిలిండర్ కూడా అవసరం ఉండదు. పండుగల్లో మాత్రం చాలా కావాల్సి ఉంటుంది. దీంతో ఒక నెల సిలిండర్ తీసుకోకపోతే అది పోయినట్లేనని భావన నెలకొంది. దేశ ప్రజల మేలు కోసం కేబినెట్ భేటీలో ఈ నిబంధనను ఎత్తివేశాం’ అని తెలిపారు. ఇకపై ఢిల్లీలో 12 సబ్సిడీ సిలిండర్లను ఏడాదిలో ఎప్పుడైనా సరే రూ.414 చొప్పున, సబ్సిడీయేతర సిలిండర్‌ను మార్కెట్ రేటు రూ. 920కు కొనుక్కోవచ్చన్నారు. జపాన్‌తో ఆరోగ్య ఒప్పందానికి ఒకే... ఆరోగ్య రంగంలో జపాన్‌తో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన సహకార ఒప్పందంపై సంతకాలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిసింది. ప్రభుత్వ ఆరోగ్య బీమా వ్యవస్థ అనుభవాలు, మానవ వనరుల అభివృద్ధి ద్వారా సార్వత్రిక ఆరోగ్య సదుపాయాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోడీ త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
అంకుల్‌శామ్‌కు ‘ఆధార’మా?
ప్రజలకు అందవలసిన సేవలకు, ఒనగూర్చవలసిన ప్రయోజనాలకూ ఆధార్ కార్డును ముడిపెట్టరాదని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది! పర్యవసానంగా వంటగ్యాస్‌తో ఆధార్ లింకును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఆ కార్డుతో ఉండే ఇతరేతర ప్రమాదాలు తొలగలేదు. ‘‘జాత్యహంకారం మూర్తీభవించిన దక్షిణాఫ్రికాలో నేను ఉన్నప్పుడు నేటాల్ రాష్ట్రంలోని భారతీయులు అనుభవించిన బాధలలో ఒకటి - చట్టప్రకారం శ్వేత ప్రభుత్వ అధికారులు అడిగినప్పుడు విధిగా వేలిముద్రలు ఇవ్వటం! నేటాల్లో కూలీనాలీ చేసుకుని బతికే భారతీయులు శ్వేత ప్రభుత్వమిచ్చే పాస్లపైననే పనిపాట్లలోకి దిగాలి. కానీ వీరు స్వేచ్ఛాజీవులు కారు. నేనక్కడ ఉండగా వేలి ముద్రల గురించి రాసిన ఓ పుస్తకం చదివాను. నేరగాళ్ల నుంచి మాత్రమే ఈ వేలిముద్రలు తీసుకోవాలని చట్టం చెబుతోంది’’. - మహాత్మాగాంధీ: ‘‘ఆఫ్రికాలో జాత్యహంకారం’’ (1906-1914) గాంధీజీ ప్రస్తావించిన సందర్భం దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష శ్వేత ప్రభుత్వ కాలం నాటిది. స్వతంత్ర భారత ‘నల్ల’ పాలకులు కూడా ‘తెల్ల’ వాడి చట్టాలే ఆదర్శంగా అలాంటి వివక్షను అనుసరించగలరని ఊహించగలమా?! కానీ మన దేశంలో ఏదైనా సాధ్యమే. అందుకు ఉదాహరణ ‘ఆధార్’ కార్డు! ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు సేవలందించాలంటే సవాలక్ష మార్గాలున్నాయి, పథకాలున్నాయి, కొన్ని విధానాలూ ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉండగా ‘ఆధార్’ పథకమంటూ ఓ గూఢచర్య వ్యవస్థను చాపకింద నీరులా ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమిటి? వంటగ్యాస్ సరఫరాకూ, ఆధార్‌కూ ఇప్పటిదాకా ఉన్న లింక్‌ను తెగ్గొడుతూ ఇటీవలే కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఆస్పత్రులలో సేవలు, ఆహార భద్రత, వివాహాల రిజిస్ట్రేషన్లు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది జీతనాతాలు... ఏ సర్వీసులూ, సబ్సిడీలూ కావాలన్నా ‘ఆధార్’ కార్డు తప్పదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వంటగ్యాస్‌తో ఆధార్ లంకెను తాత్కాలికంగా పాలకులు లేకుండా చేసినా భవిష్యత్తులో ఇంకా సమస్యలు ఉండనే ఉన్నాయి. ఆధార్ మూలాలు ఎక్కడ? ఇంతకూ ఈ వ్యవస్థకు మూలాలు ఎక్కడున్నాయి? ప్రపంచ బ్యాంకులో, దానికి నాయకత్వం వహిస్తున్న అమెరికన్ సామ్రాజ్య వ్యవస్థ, దాని గూఢచారి వ్యవస్థల్లో ఆ మూలాలున్నాయి! ఫలానా వాడు ఉగ్రవాది లేదా టైస్టు అయి ఉంటాడని అమెరికా ఎవడిని పేర్కొంటే ‘అవును, వాడు వాడే’నని అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న ఇండియా లాంటి వర్ధమాన దేశాలు తలలూపి తీరాల్సిందే! ‘ట్విన్ టవర్స్’పై జరిగిన దాడి తరువాత ‘అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ప్రారంభించిన పోరుతో చేతులు కలపడానికి సంకోచించే దేశాలూ అధినేతలూ అమెరికాకు వ్యతిరేకులుగా, టైజానికి అనుకూలురుగా ముద్రపడతారు’ అని మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ బెదిరించాడు. అది మొదలు అన్ని రకాల అమెరికా గూఢచారి సంస్థలూ తమ కార్యకలాపాలని వర్ధమాన దేశాలకు విస్తరించాయి. అమెరికా తమ దేశ రక్షణ పేరిట, మన దేశాల రక్షణ బడ్జెట్లను పెంచుకోమంటున్నాయి. నిన్నగాక మొన్ననే అమెరికా సైనిక రక్షణ వ్యవస్థకు చెందిన ఒక కీలకమైన అధికారి స్నోడెన్ బయట పెట్టేవరకూ అమెరికా ‘జాతీయ భద్రతా సంస్థ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ)’ నిర్వాకమూ బయటపడలేదు. ఇండియా సహా అనేక ఆసియా దేశాలలో ఇంటర్నెట్, ట్విట్టర్, ఫేస్బుక్ వగైరా ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా నాయకుల, వివిధ రకాలసంస్థల, వ్యక్తుల మధ్యా సాగుతున్న సంభాషణలను ఆ ఏజెన్సీ నమోదు చేస్తున్నది. ఆ నమూనాలో భాగంగానే, అమెరికా గూఢచర్యంలో అంతర్భాగంగానే ‘ఆధార్’లో కూడా అమెరికా ‘వేగు’ల వ్యవస్థ ప్రవేశించింది! పన్నెండంకెల మోసం ‘ఇన్ఫోసిస్’ మాజీ అధికారి నందన్ నిలేకనీ ఆధ్వర్యంలో దేశ పౌరులందరి వేలిముద్రలు, పౌరుల కనుపాపల వెనక దాగి ఉన్న ఉగ్రవాద ఛాయలనూ పసికట్టడం కోసం కేంద్రం ‘ఐరిస్’ ప్రయోగాలు ప్రారంభించింది. సంతకాలు సహా వ్యక్తిపరమైన పూర్తి సమాచార సేకరణకు ప్రత్యేక సంస్థనే 2010లో నెలకొల్పారు! అదే ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (యూఐడీఏఈ). ఆ తర్వాత వచ్చిన ఆలోచనే ‘ఆధార్’ కార్డు. ‘ఆధార్’కార్డుదారులకు 12 అంకెల నంబరు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ‘ఆధార్’ స్కీమును ఉత్తి నోటిమాటగా మాత్రమే ముందు ఐచ్ఛికమైన పథకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించజూసింది. క్రమంగా ‘ఆధార్’ పథకాన్ని పౌరుడు విధిగా తలదాల్చి తీరాలని ఆదేశించింది. ఈలోగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కేఎస్ పుట్టస్వామి (రిటైర్డ్) మొదటిసారిగా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దానిపైన సుప్రీం (24.9.2013) ప్రజలకు అందవలసిన సేవలకూ, ఒనగూర్చవలసిన ప్రయోజనాలకూ ఆధార్ కార్డును ముడి పెట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది! రేషన్ షాపులలో రేషన్ కార్డుల మీద ఆహార పదార్థాలు అందించవలసిన చోట ‘ఆధార్’ ఎందుకని ప్రశ్నించింది. ‘ఆధార్’ వ్యవస్థకు పార్లమెంటు అనుమతి లేదు. కేవలం ప్రభుత్వస్థాయిలో జరిగిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు తప్ప మరొకటి కాదు కనుక ఇది రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వు అన్న పుట్టస్వామి వాదనతో సుప్రీం అంగీకరించింది. పైగా వ్యక్తిగత సమాచారాన్ని గూఢంగా సేకరించడం వ్యక్తి జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని ‘21వ అధికరణ’ను ఈ ఆధార్ వ్యవస్థ ఉల్లంఘిస్తోంది. అన్నిటా అమెరికా హస్తమే! ఒకవైపున అమెరికా ‘జాతీయ భద్రతా వ్యవస్థ’ భారత రాజకీయాల్లో, రోదసీ కార్యక్రమాల్లో, అణుశక్తి వినియోగ ప్రయోగాల్లో తలదూర్చుతున్నది. ఈ దశలో - ‘థాట్ వర్క్స్’(ప్రపంచవ్యాపిత సాఫ్ట్వేర్ నెట్వర్క్ సంస్థ)అధ్యక్షుడు, వ్యవస్థాపకుడైన నావెల్లీ రాయ్ సంఘం చేసిన హెచ్చరికను విస్మరించరాదు. ప్రపంచపు ‘వెబ్’ ఆధారంగా నడుస్తున్న అనంత సమాచారాన్ని అనుక్షణం మానిటర్ చేస్తున్న అమెరికా దురాలోచన గురించిన హెచ్చరిక ఇది: నెవెల్లీ మాటల్లోనే ‘ఆండ్రాయిడ్ ఫోన్లోని ‘చిప్’తో, లేదా వ్యక్తుల వేలిముద్రల ఆధారంగాగానీ కొత్త ‘ఐ’ ఫోన్ సిస్టంనే బద్దలుకొట్టి తీసిన సమాచారాన్ని సరాసరి అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ)కు బట్వాడా చేయొచ్చు’. అంతేగాదు, అంతర్జాతీయ ఇంటర్నెట్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, ఫేస్బుక్, పాల్‌టాక్, ఏడీఎల్, స్కైప్, యూట్యూబ్, యాపిల్ వగైరా కంపెనీలు అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థకు చెందిన ‘ప్రిజమ్’ గూఢచారి కార్యక్రమాలలో యథేచ్ఛగా పాల్గొంటున్నాయనీ, ఈ ఇంటర్నెట్ కంపెనీల ‘సర్వర్ల’ నుంచి సరాసరి వ్యక్తిగత సంబంధమైన సమాచారాన్నంతటినీ సేకరించుకుంటుందనీ మరచిపోరాదు! ఈ అంశాలు గమనించవద్దా? ఇందులో భాగంగా దేశంపైకి ముంచుకొచ్చిందే ‘ఆధార్’ వ్యవస్థ! గతంలో వ్యవస్థలకు పునాది వ్యవస్థనే, ‘ఆధార్’ను పోలిన వ్యవస్థనే 1785లోనే సామాజిక శాస్త్రవేత్త జెర్మీ బెంతామ్ ఖైదీలకు తెలియకుండా జైలులోని వారి పనుల్ని గమనించగల ఓ పారదర్శక చిట్కాను (‘పానోప్టికాన్’ గూఢచర్య వ్యవస్థ) వార్డెన్ల కోసం రూపొందించాడట! అలాంటిదే ‘ఆరవీలియన్ బయోమెట్రిక్ వ్యవస్థను 1933లోనే నాజీ పాలకులు జర్మనీలో ప్రవేశపెట్టారు. ఆధార్ కార్డు లాంటి ‘హోలెరిత్ డి-11’ కార్డు వ్యవస్థను అమలు జరిపారు! అలాగే ఆధార్‌లో నిక్షిప్తమై ఉన్న పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశీ, స్వదేశీ గూఢచారి సంస్థలు యథేచ్ఛగా దుర్వినియోగమూ చేయవచ్చు! - (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
ఆటోను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్
అశ్వాపురం, న్యూస్‌లైన్ మరో పదిహేను కిలోమీటర్లు వెళితే ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకుని ఉండేవారు... కానీ విధి వక్రించింది.. గ్యాస్ ట్యాంకర్ మృత్యువు రూపంలో వచ్చి ఇద్దరిని కబళించి పలువురిని క్షతగాత్రులను చేసింది. అశ్వాపురం మండలంలోని సీతారామపురం వద్ద సోమవారం ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ వేగంగా టాటా మ్యాజిక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు సంఘటన స్థలంలో మృతి చెందగా మరొకరు భద్రాచలంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏడుగురు గాయపడ్డారు. సంఘటన స్థలం రక్త సిక్తంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం నుంచి ప్రయాణికులతో మణుగూరుకు వస్తున్న టాటా మ్యాజిక్ ఆటోను మండలంలోని సీతారామపురం వద్ద మణుగూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ ఢీకొట్టింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అమ్మగారిపల్లికి పంచాయతీ బట్టామల్లయ్య గుంపునకు చెందిన బట్టా మంగయ్య(50) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన విజయవాడకు చెందిన ఎస్కే ఖలీల్(28) భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిట్టగూడేనికి చెందిన తాటి ఎర్రమ్మ, మిడియం లక్ష్మి, జిమ్మా జానకమ్మ, మణుగూరు మండలం శివలింగాపురానికి చెందిన సియాల పాపరావు, తాటిగడప గ్రామానికి చెందిన దార్ల హరికృష్ణ, మ్యాజిక్ డ్రైవర్ కర్నే దిలీప్‌కుమార్, మహేష్‌లు గాయపడ్డారు. సమాచారం అందుకున అశ్వాపురం సీఐ వేణుచందర్ హుటాహుటీన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
ముంచుకొస్తున్న వంటగ్యాస్ కొరత
=ప్రజలంతా గోబర్ గ్యాస్ ఏర్పాటు చేసుకోవాలి =మనిషి మల, మూత్రాల్లోనూ పోషకాలు =ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌పాలేకర్ వరంగల్అగ్రికల్చర్/ హసన్‌పర్తి, న్యూస్‌లైన్: రానున్న 30 ఏళ్లలో వంట గ్యాస్‌కొరత ముంచుకొస్తుందని, ఈ విషయాన్ని ప్రజలు ఇప్ప టి నుంచే గ్రహించాలని బసవశ్రీ అవార్డు గ్రహీ త, ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్‌పాలేకర్ హెచ్చరించారు. కాకతీయ ఫౌండేషన్, శ్రీ మహ ర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగర శి వారులోని చింతగట్టు బీజీఆర్ గార్డెన్లో నిర్వహిస్తున్న ‘గోఆధారిత పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ శిక్షణ తరగతులు శుక్రవారం రెండో రో జుకు చేరాయి. ఈ సందర్భంగా రైతులకు జీవామృతం తయారీ, వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం సుభాష్‌పాలేకర్ మాట్లాడుతూ వంటగ్యాస్ ఉత్పత్తులు తగ్గే ప్రమాదం ఉన్నందున గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఇప్ప టి నుంచే గోబర్‌గ్యాస్ ఏర్పాటు చేసుకోవాలన్నా రు. జర్సీ ఆవుల పెంపకం వల్ల ఉపయోగం లేద ని, వాటి పెంపకానికి రైతులు దూరంగా ఉండాల ని ఆయన సూచించారు. కాగా, శిక్షణ తరగతు ల్లో పాలేకర్ జీవామృతం, దేశీయ ఆవుపేడ ఉప యోగంపై వివరించారు. గోబర్‌గ్యాస్ తయారీ ఇలా.. గోబర్‌గ్యాస్ బయటికి వెలువడిన తర్వాత పేడ(స్లరీ) తో ఘన జీవామృతం తయారు చేసుకునే విధానాన్ని పాలేకర్ రైతులకు వివరించారు. 50 కిలోల ఎండిన, జల్లెడ పట్టిన గోబర్‌గ్యాస్ స్లరీని తీసుకోవాలి. అం దులో 50 కిలోల దేశీయ ఆవుపేడను కలుపాలి. అందు లో కిలో బెల్లం, కిలో పప్పు పిండిని మిక్సింగ్ చేయాలి. అనంతరం దానిని పూర్తిగా కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని 48 గంటల పాటు నీడలో ఉంచాలి. ఇలా నీడ లో ఉంచడం వల్ల కిణ్మయ ప్రక్రియ జరుగుతుందని వివరించారు. ఆ తర్వాత 48 గంటల పాటు ఎండలో అరబెట్టాలి. ఎండిన తర్వాత ఆ మిశ్రమాన్ని చూర్ణం చే సి ఒక గోనె సంచిలో భద్రపరచాలి. అయితే గోనె సం చిలో నింపిన చూర్ణాన్ని ముళ్లె కట్టి నేలపై ఉంచకుండా చెక్కపై పెట్టాలి. నేలపై ఉంచినట్లయితే తేమశాతం పెరిగే అవకాశం ఉంది. ఈ చూర్ణాన్ని ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. మనిషి మలమూత్రాల్లో పోషకాలు.. మనిషి మలమూత్రాల్లో కూడా పోషకకణాలు ఉంటాయని సుభాష్‌పాలేకర్ వివరించారు. మనిషి రోజువా రీ విసర్జ్జీతాల పరిమాణం చూస్తే.. మలం 100 నుంచి 400 గ్రాములు, మూత్రం 1000 నుంచి 1310 గ్రాము లు ఉంటాయి. అయితే ఇవి కూడా పంటల పోషకాలు గా ఉపయోగించుకోవచ్చు. మానవ మూత్రాలు తప్ప జీవామృతంలో ఉపయోగించేవి రాక్షస మూత్రాలు కావని ఆయన సూచించారు. ఒక దేశీయ ఆవుతో 30ఎకరాల సాగు.. ఒక దేశీయ ఆవు రోజుకు సగటున 11 కిలోల పేడ ఇ స్తుంది. ఒక కిలో పేడతో ఎకరం వ్యవసాయం చేయొ చ్చు. అంటే నెలకు సగటున 30 ఎకరాల సాగు చేయవచ్చని వివరించారు. దేశీయ ఆవు పేడలో 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉపకరించే సూక్ష్మ జీవులు ఉం టాయి. ఇది ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల సమూహం లాంటిది. భూమిపై పడిన చెట్టు, మొక్కల ఆకులు, కొ మ్మలా రెమ్మలవంటి కాష్ట పదార్థాన్ని(బయోమాస్)ను ఈ విసర్జితాలతో ఉండే సూక్ష్మజీవులు కుళ్లబెడతాయి. కుళ్లిన చెత్తాచెదారం నుంచి పోషకాలు విడుదలై మొక్కల కు అందుబాటులోకి వస్తాయి. దీంతో పంటల ఎదుగుదలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. భూమిలో పోషకాలు పుష్కలం... భూమిలోనే మొక్కలు, చెట్లకు అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కానీ, రెండు కారణాల వల్ల అవి వేర్లకు అందుబాటులో లేవు. మొదటి కారణం ఏమంటే భూమిలో ఉన్న ఖనిజాలు వేర్లకు కావాల్సిన స్థితిలో లే వు. మనం రోజు భోజనం చేసేందుకు ఆహార ధాన్యాన్ని ఉడికించుకుని తింటాము. కానీ, ఉన్నవాటిని ఉన్నట్లుగా తినలేము. అదే మాదిరిగా భూమిలో కూడా పంటలకు అవసరం ఉన్న పోషకాలు వేరే రూపంలో ఉన్నాయి. మొక్కల వేర్లు నేరుగా గ్రహించలేని విధంగా ఉన్నాయి. వీటిని మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చే పనిని మట్టిలోని అనంతర కోటి సూక్ష్మజీవులు చేస్తాయని పాలేకర్ వివరించారు. దేశీయ ఆవు పేడతో ఘన జీవామృతం తయారీ దేశీయ ఆవుపేడతో ఘన జీవామృతం తయారీ విధానాన్నిపాలేకర్ వివరించారు. ఎకరం పొలంలో ఏ మోతాదులో ఆవు పేడ వినియోగించాలో రైతులకు అవగాహన కల్పించారు. 100 కిలోల దేశీయ ఆవు పేడలో కిలో బెల్లంతో పాటు ద్విదళ బీజాల పిండిని కలపాలి. ఆ మిశ్రమాన్ని నీడలో కుప్పగా పోయాలి. అనంతరం మిశ్రమంపై వర్షపు నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత 48 గంటల పాటు నీడలో ఉంచిన తర్వాత మరో 48 గంటలు ఎండలో అరబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చూర్ణం చేసి గోనె సంచిలో నింపి చెక్కపై పెట్టాలి. ఇది కూడా ఏడాది పాటు వినియోగించుకోవచ్చు. అయితే ఈ చూర్ణాన్ని గోమూత్రంతో కలిపి లడ్డులా చేసి పంటలకు నీరు పా రించే కాల్వల ముఖద్వారం వద్ద పెడితే ఎరువు రంగులో నీటి ద్వారా పంటలకు పోషకాలు అందిస్తాయి. జీవామృతం పిచికారీ జీవామృతంను భూమిలో వేయడంతో పాటు పంటలు, పండ్ల చెట్లపై పిచికారీ చేయొచ్చు. వరి, అరటి, మొక్కజొన్న, పెసర, మినుము, శనగ, పొద్దు తిరుగుడు, బబ్బెర్లు, మిరప, ఉల్లి, టామాటా, వంకాయ తదితర కూరగాయాల మొక్కల వంటి 2 నుంచి 8నెలల కాలవ్యవధిలో పూర్తయ్యే పంటలకు పిచికారీ చేయాలి. జీవామృతాన్ని ఏ పం టలపైన అయిన ప్రతి 15 రోజులకోసారి, నెలకోసారైన పిచికారీ చేయాలి. విత్తనం వేసినప్పటికీ నుంచి విత్తనం వేసిన, మొక్కనాటిన 15 రోజులకోసారి పిచికారీ చేయాలి. ప్రతి ఎకరానికి ఐదు లీటర్ల వడబోసిన జీవామృతాన్ని వందలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత 30 రోజులకు పిచికారీ చేయాలి. మళ్లీ 45 రోజులకు 10 లీటర్ల జీవామృతంలో 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 60 రోజుల పంటలకు 20 లీటర్ల జీవామృతానికి 200 లీటర్ల నీటిని కలపాలి. దీనిని 75 రోజుల వరకు అలాగే కొనసాగించాలి. కాగా, 90 రోజులకు 25 లీటర్ల జీవామృతంలో 200ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. మూడున్నర, నాలుగు, నాలున్నర నెలల పంటలకు 25 లీటర్ల జీవామృతానికి 200 లీటర్ల నీటిని కలిపి పిచికారీ చేయాలి. ఐదు నెలల తర్వాత 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. దీంతో పంటల్లో అద్భుతమైనఫలితాలు వస్తాయని సుభాష్ పాలేకర్ రైతులకు వివరించారు. దేశీయ ఆవు పేడలో పోషకాలు.. దేశీయ ఆవు పేడలో నత్రజని 1.74 శాతం, భాస్వరం 1.7 శాతం, పొటాష్ 0.6 శాతం, కాల్షియం 0.37 శాతం, మెగ్నీషియం 0.53 శాతం లోహం 1400 పీపీఎం, మాంగనీస్ 5.0 పీపీఎం, తుత్తు నాగం 90 శాతం ఉంటాయని పాలేకర్ వివరించారు. కాగా, ప్రకృతి వ్యవసాయం అనే రథానికి నా లుగు చక్రాలు. ఆ నాలుగు చక్రాలు సక్రమంగా సాగాలంటే రైతులు బీజామృతం, జీవామృతం, అచ్చాదన, వాప్సల ఉ పయోగాలపై పాలేకర్ రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకతీయ ఫౌండేషన్ అధ్యక్షుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి, శ్రీమహర్షి గోశాల చారిటబుల్ట్రస్ట్ అధ్యక్షుడు సజ్జన రమేష్, మీడియా ఇన్చార్జ్ రాంచంద్రారెడ్డితో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు చెం దిన సుమారు వేయి మంది రైతులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ లింకేజీ తెలుసుకోవడం ఇలా...
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులా..! మీ ఎల్పీజీని ఆధార్, బ్యాంక్‌ఖాతాతో అనుసంధానానికి సంబంధి త పత్రాలను గ్యాస్ డీలర్, బ్యాంకర్లకు సమర్పించారా..!?అయినా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలెండర్ రీఫిల్లింగ్‌పై ఇచ్చే సబ్సిడీ రాయితీ రూ.558.30 పైసలు నగదురూపం లో బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదా..? దీంతో రీఫిల్లింగ్ కొనుగోలుకు ప్రస్తుత మార్కెట్ ధర రూ. 1024.50 ను పూర్తిగా భరించాల్సి వస్తుందా.? డీలర్, బ్యాంకర్లను అడిగినా సరైన సమాధానం రావడం లేదా..?...అయితే అసలు మీ ఎల్పీజీ ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైనదో లేదో ఒక్కసారి ఇంటర్నెట్లో పరిశీలించండి. ఇలా: ఇంటర్నెట్ గూగుల్‌లో వెళ్లి www.transparency portal indane gas లేదా HP gas లేదా ఆజ్చిట్చ్ట జ్చట అని టైప్ చేయండి. సంబంధిత గ్యాస్ పోర్టల్ సైట్ ఓపెన్ కాగానే అందులో రాష్ట్రం, జిల్లా, డిస్ట్రిబ్యూటర్ పేరు సెలక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. కొన్ని కంపెనీలు ఆధార్ నంబర్‌ను అడుగుతాయి. వాటి తర్వాత కస్టమర్ నంబ ర్, పేరు, అడ్రస్ సూచించిన బాక్స్‌లో కంపో జ్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీ ఎల్పీజీ ఆధార్, బ్యాంక్ ఖాతాలలో అనుసంధానమైందా? లేదా ?అన్న స్టేటస్ రిపోర్టు రెండు వృత్తాల ద్వారా తెలుస్తుంది. ఆకుపచ్చ వృత్తం ఆయితే అనుసంధానం ఆయినట్లు, ఎర్రరంగు వృత్తం వస్తే కానట్లు అర్థం చేసుకొవాలి. ఆయిల్ కంపెనీ స్టేటస్ కింద ఆకుపచ్చ వృత్తం వచ్చి, బ్యాంక్ స్టేటస్ కింద వృత్తంలో ఎర్ర రంగు వృత్తం వస్తే డీలర్ వద్ద అనుసంధానమైనట్లు, బ్యాంకులో కానట్లు అర్థం చేసుకొవాలి. ఒకవేళ ఆయిల్‌కంపెనీ స్ట్టేటస్ కింద ఎర్ర రంగు వృత్తం వచ్చి, బ్యాంక్ స్టేటస్ కింద ఆకుపచ్చ వృత్తం వస్తే డీలర్ వద్ద ఆనుసంధానం కానట్లు, బ్యాంక్‌లో అనుసంధానంమైనట్లు గ్రహించాలి. ఒక వేళ రెండు వృత్తాలు ఆకుపచ్చగా వస్తే పూర్తిగా ఆయినట్లు, రెండు వృత్తాలు ఎర్రగా వస్తే డీలర్, బ్యాంకు ఖాతా కూడా లింకేజీ కానట్లు అర్థం చేసుకొవాలి. తక్షణమే మరోసారి అనుసంధానికి ప్రయత్నించండి. -
నేడు బ్యాంకుల్లో ఆధార్ నమోదు
సాక్షి, సిటీబ్యూరో: ఆధార్ (యూఐడీ) నంబరును బ్యాంకుల్లో నమోదు చేసుకోని ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆదివారం కూడా ఆయా బ్యాంకు శాఖల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ లీడ్ బ్యాంక్ మేనేజర్ భరత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఆధార్ కార్డు వివరాలతో తమ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉన్నప్పటికీ, బ్యాంకు ఖాతాలు లేని వినియోగదారులు సమీప బ్యాంకుల్లో కొత్తగా ఖాతాలు తెరవవచ్చు. ఈనెల 31తో గడువు ముగుస్తున్నందున భారత ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల ఆధార్ నమోదు కోసం నగరంలోని అన్ని బ్యాంకుల శాఖలు ఆదివారం కూడా పనిచేయాలని ఆదేశించినట్లు ఎల్డీఎం తెలిపారు. వివరాలకు 9885634895 నంబర్లో సంప్రదించవచ్చు.