దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రిటైల్ ధరలను ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబరు 1 నుండి రూ. 16.5 చొప్పున పెంచాయి.
ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1802 నుంచి రూ.1818.50కి పెరిగింది. గత నెల (నవంబర్)లో ఈ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. గత ఆరు నెలలుగా వాణిజ్య సిలిండర్‌ల ధరలను చమురు కంపెనీలు వరుసగా పెంచుతూ వస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇక సబ్బులు మరింత ఖరీదు
ఐవోసీఎల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తాజా సవరణ తర్వాత హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2044 వద్దకు చేరింది. విజయవాడలో ఇది రూ.1990 వద్ద ఉంది. ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆగస్టు నుండి ఇవి స్థిరంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment