Cylinder
-
వంట గ్యాస్ ధరలు పెంపు
దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ 19 కేజీల సిలిండర్ రిటైల్ ధరలను ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబరు 1 నుండి రూ. 16.5 చొప్పున పెంచాయి.ధరల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1802 నుంచి రూ.1818.50కి పెరిగింది. గత నెల (నవంబర్)లో ఈ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. గత ఆరు నెలలుగా వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు వరుసగా పెంచుతూ వస్తున్నాయి.ఇదీ చదవండి: ఇక సబ్బులు మరింత ఖరీదుఐవోసీఎల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తాజా సవరణ తర్వాత హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2044 వద్దకు చేరింది. విజయవాడలో ఇది రూ.1990 వద్ద ఉంది. ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఆగస్టు నుండి ఇవి స్థిరంగా ఉన్నాయి. -
సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్కమ్ హోటల్లోని సర్వీస్ కిచెన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్‌లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?
న్యూఢిల్లీ: దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ ఒకటిన ఉదయాన్నే వంటగ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 19 కిలోల గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48.50 నుంచి రూ.50కి పెరిగింది.ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 1740 రూపాయలకు చేరింది. అయితే డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలో కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో మాదిరిగానే ఢిల్లీలో రూ.803కే లభ్యం కానుంది.2024, అక్టోబర్ ఒకటి నుండి, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ముంబైలో రూ. 1,692.50, కోల్‌కతాలో రూ. 1,850.50, చెన్నైలో రూ. 1,903కు చేరింది. దీనికిముందు సెప్టెంబర్‌లో కూడా ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.39 పెరిగి రూ.1,691.50కి చేరింది. దీనికి ముందు రూ.1,652.50గా ఉంది. కోల్‌కతాలో మంగళవారం నుంచి 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.48 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా, రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలలోని ఆహార ధరలు పెరగనున్నాయి.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
రైలు పట్టాలపై సిలిండర్.. బయటపడిన మరో కుట్ర
కాన్పూర్: దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను ఉంచి, రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని దుండగులు ప్రయత్నించారు. కాన్పూర్ నుంచి ఫతేపూర్‌కు వెళ్లే ఢిల్లీ హౌరా రైల్వే ట్రాక్‌పై రైల్వే సిబ్బందికి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కనిపించింది.కాన్పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్లో ఎల్పీజీ సిలిండర్‌ను ఉంచారు. ఈ ఘటన నేడు (ఆదివారం) తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. లోకో పైలట్ అసిస్టెంట్, లోకో పైలట్ ప్రమాదాన్ని గుర్తించి, ఎమర్జెన్సీ బ్రేక్ వేయడం ద్వారా రైలును ఆపారు. రైలులోని ఉద్యోగులు ఈ విషయాన్ని ఆర్పీఎఫ్కి, డిపార్ట్మెంట్లోని ఇతర అధికారులకు తెలియజేశారు.ఘటనా స్థలానికి సంబంధించిన చిత్రాలలో రైల్వే ట్రాక్‌పై ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌ను ఉంచడాన్ని గమనించవచ్చు. పైలట్, అసిస్టెంట్ పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో రైలును పట్టాలు తప్పించే కుట్ర విఫలమైంది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర మధ్య రైల్వే జోన్‌లోని ప్రయాగ్‌రాజ్ డివిజన్ పీఆర్వో అమిత్ సింగ్‌కు సమాచారం అందించారు.ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
రైలు పట్టాలపై సిలిండర్.. ఉగ్రవాదుల పనేనా?
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలపై కుట్ర కోణం దాగింవుందనే చర్చ జరుగుతోంది. యూపీలోని కాన్పూర్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైల్వే మార్గంలో భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ పట్టాలపై సిలిండర్ ఉంచిన ఉదంతాన్ని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలు వేగం ఎక్కువగా ఉంది. డ్రైవర్ రైలును ఆపినప్పటికీ, అది సిలిండర్‌ను ఢీకొంది. దీంతో పెద్ధ శబ్ధం వచ్చింది. ప్రయాణికులు భయకంపితులయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది.ఈ కేసును ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, యూపీ ఏటీఎస్‌సహా అన్ని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తును ఇప్పటికే ప్రారంభించాయి. దీనివెనుక ఐఎస్ఐఎస్ కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఉగ్రవాది ఫర్తుల్లా ఘోరీ ఒక ఆడియోను విడుదల చేశాడు. దానిలో రైలును బోల్తా కొట్టించాలంటూ దేశంలోని స్లీపర్ సెల్‌లను ఆదేశించినట్లు ఉంది. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలను కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నారు. ఈమధ్య ఢిల్లీ పోలీసులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీకి చెందిన 14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు.తాజాగా కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై సిలిండర్ లభ్యమైన ప్రదేశంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. కుట్ర పన్నారనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ డీసీపీ వెస్ట్ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు సంస్థలన్నీ తమ తమ స్థాయిలలో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నారో త్వరలోనే వెల్లడిస్తామని ఆయా సంస్థల అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తునకు డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించారు. ఈ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. దర్యాప్తునకు ఇది ఆటంకం కలిగించే అంశంగా మారింది. కాగా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న బాటిల్లో మండే పదార్థాన్ని పోలీసు అధికారులు గుర్తించారు. -
Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ రైలు.. పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.విచారణ అనంతరం ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుభవార్త చెప్పాయి. హోటల్స్, రెస్టారెంట్లలో ఉపయోగించే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.69 మేర తగ్గిస్తూ కీలక ప్రకటన చేశాయి. నేటి నుంచే (జూన్ 1వ తేదీ) ఈ ధరలు అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. -
సిలిండర్ నుంచి మంటలు.. ఆపద్బాంధవుడు వచ్చి..
‘జ్ఞానం ఉంటే సరిపోదు.. అనుభవం ఉండాలి’ అని చాలామంది అంటుంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజమనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన సైకిల్‌పై గ్యాస్ సిలిండర్‌ను తీసుకువెళుతుండటాన్ని చూడవచ్చు. మరి ఆ తరువాత ఏం జరిగిందంటే.. అకస్మాత్తుగా ఆ సిలిండర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి మంటలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. అయినా ఆ మంటలు చల్లారవు. దారినపోయేవారు కూడా ఆ సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆపేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే ఎట్టకేలకు ఒక వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి, మంటలను అదుపులోకి తీసుకువస్తాడు. వీడియోలో ఉన్న కంటెంట్ గమనిస్తే.. ఒక వ్యక్తి సిలిండర్ నుంచి మంటలు రాగానే సైకిల్‌ను పక్కన పడేసి, ఆపై మంటలను నీటితో ఆర్పడానికి ప్రయత్నిస్తాడు. మరో నలుగురు కూడా అక్కడికి వచ్చి, సిలిండర్‌పై నీళ్లు చల్లడం మొదలుపెడతారు. అయితే మంటలు అంతకంతకూ పెరుగుతుంటాయి తప్ప చల్లారవు. దీంతో ఆ సిలిండర్‌ను పక్కనే ఉన్న చెరువులో ముంచుతారు. అయినా ఆ మంటలు చల్లారవు. దీంతో ఆకుల సాయంతో ఆ మంటలను ఆర్పేందుకు వారంతా ప్రయత్నిస్తారు. అయినా మంటలు ఆరిపోకపోవడంతో వారంతా కూలబడతారు. అప్పుడు అక్కడికి ఆపద్బాంధవునిలా వచ్చిన ఒక వ్యక్తి తన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. చేతిలో తడి సంచితో వచ్చిన అతను దానిని సిలిండర్‌పైన కప్పుతాడు. దీంతో నిప్పుకు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోతుంది. అంతే ఆ సిలిండర్లోని మంటలు ఆరిపోతాయి. @ScienceGuys_ అనే పేరు గల ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. Experience is stronger than knowledge. 👍pic.twitter.com/OtXvLhjvYQ — Science (@ScienceGuys_) March 1, 2024 -
సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ!
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం కూలిపోవడంతో 41 మంది కూలీలు గత 9 రోజులుగా దానిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలవంతం కావడం లేదు. ఇదిలా ఉండగా సోమవారం (నవంబర్ 20) ఆరు అంగుళాల కొత్త పైప్‌లైన్ ద్వారా మొదటిసారిగా బాధితులకు ఘన ఆహారాన్ని అధికారులు అందించగలిగారు. రెస్క్యూ టీమ్ ఈ పైపు ద్వారా వారికి బాటిళ్లలో వేడి కిచిడీని పంపింది. ఇన్ని రోజులుగా సరైన ఆహారం అందకపోవడంతో వారు నీరసించిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హేమంత్ అనే కుక్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం కిచిడీని తయారు చేశారు. కార్మికులకు వేడి వేడి ఆహారాన్ని పంపడం ఇదే తొలిసారి అని హేమంత్ తెలిపారు. తాము కిచిడీ మాత్రమే పంపుతున్నామని, తమకు అధికారులు చెప్పిన ఆహారాన్ని మాత్రమే వండుతున్నామని హేమంత్ పేర్కొన్నారు. బ్రహ్మఖల్-యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిపోయింది. చార్ధామ్ ప్రాజెక్ట్ కింద, బ్రహ్మఖల్- యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా- దండల్గావ్ మధ్య ఈ సొరంగం నిర్మితమవుతోంది. నవంబర్ 12 తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం జరిగింది. 41 మంది కూలీలు లోపల చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం పంపిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల సహకారంతో చార్ట్‌ను సిద్ధం చేశామన్నారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, గంజి మొదలైనవి బాధితులకు పంపిస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు #WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel Rescue: Food items including Khichdi, Dal are being prepared and packed to be delivered to the people trapped inside the tunnel Cook Hemant says, "Food will be sent to the people trapped inside. For the first time, hot food is being sent… pic.twitter.com/dAVZSSi1Ne — ANI (@ANI) November 20, 2023 -
షాక్.. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు!
నెల ప్రారంభంలో గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. గత కొన్ని నెలలుగా కమర్షియల్ సిలిండర్ ధరల్ని తగ్గిస్తూ వస్తున్న కేంద్రం ఒక్కసారిగా రూ.209లు పెంచింది. అదే సమయంలో గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరట లభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని స్థిరంగా ఉంచింది. నేటి నుంచి పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉంది. సిలిండర్ మీద సబ్సిడీ ఈ ఏడాది ప్రారంభంలో, దేశంలోని 330 మిలియన్ల వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ ధరల్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఆగస్టు 29న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ‘ఎల్పీజీ సిలిండర్ల గృహ వినియోగదారులందరికీ సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీ లభిస్తుంది. పీఎం ఉజ్వల పథకం కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుత సబ్సిడీపై ఈ సబ్సిడీని పొందుతారు, ”అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రక్షా బంధన్, ఓనం కానుకగా ఎల్పీజీ సిలిండర్లపై అదనపు సబ్సిడీ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై రూ.400 సబ్సిడీ పొందే అవకాశం లభించినట్లైంది. చదవండి👉 ఎలాన్ మస్క్ క్రియేటర్లకు వందల కోట్లు చెల్లిస్తున్నారు.. మీరు తీసుకున్నారా? -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్‌తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్‌పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్‌తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్‌లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
కొత్త ఏడాది తొలిరోజే షాక్..పెరిగిన గ్యాస్ ధర.. ఎంతంటే?
న్యూ ఇయర్ తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. ఆయిల్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడే డొమెస్టిక్ గ్యాస్ ధరల్ని మాత్రం పెంచలేదు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూసుకుంటే ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 25 రూపాయలు ఉండగా ముంబై, హైదరాబాద్,బెంగుళూరు సహా అన్ని నగరాల్లో ఇలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ ధర రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి. దేశంలో స్థిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు దేశంలో డొమెస్టిక్ గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది ఏడాది జులై 6న రూ.50 పెరగ్గా.. మొత్తంగా గతేడాది కాలంలో గృహావసర గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధరలు.. ఢిల్లో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నై రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 కొనసాగుతున్నాయి. -
గ్యాస్ ధరపై సామాన్యులకు గుడ్ న్యూస్
-
మంచిర్యాలలో నయా దందా
-
పండుగ కానుక: భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్!
దేశంలో నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో పండుగ కానుకగా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే అక్టోబర్ 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 25.50 తగ్గింది. బిగ్ రిలీఫ్.. భారీ తగ్గింపు! అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలతో సహజవాయువు ధరలు రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన ఒక రోజు తర్వాత, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు జాతీయ రాజధానిలో కమర్షియల్ ఎల్పీజీ (LPG Cylinder) సిలిండర్ల ధరను ₹ 25.50 తగ్గించాయి. ఈ తాజా ధరల సవరణతో, ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,859.50గా ఉండగా అంతకు ముందు రూ. 1,885 ఉంది. కోల్‌కతాలో, దీని ధర రూ.1959కి తగ్గింది. ముంబైలో ప్రస్తుతం దీని ధర రూ. 1811.50గా ఉంది. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గించడం ఇది ఆరోసారి. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎలాంటి మార్పు లేదు. కాగా సెప్టెంబర్ 1న, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ యూనిట్ ధర ₹ 91.50 తగ్గింది, ఢిల్లీలో ధర ₹ 1,885 నుంచి ₹ 1,976కి తగ్గిన సంగతి తెలిసిందే. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
LPG Cylinder Price: బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కమర్షియల్ సిలిండర్
న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం అంటే ఆగస్టు 1న, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 తగ్గింది. నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్‌పై రూ.8.50 తగ్గించారు. ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,976గా ఉండగా అంతకు ముందు రూ. 2,012.50 ఉంది. కోల్‌కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది. కాగా స్థానిక టాక్స్‌ల ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చదవండి: ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ! -
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర
-
హోటల్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. బోరజ్ ప్రాంతంలోని ఒక హోటల్లో సిలెండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా హోటల్ అంతా మంటలు వ్యాపించాయి. కాగా, అప్రమత్తమైన హోటల్ యజమాని వెంటనే బయటకు పరుగులు తీశాడు. హోటల్లో కస్టమర్లు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది డ్రమ్లోని నీళ్లతో మంటలను ఆర్పుతున్నారు. తమకు రోజు అన్నంపెట్టే హోటల్ అగ్నిప్రమాదానికి గురవ్వడం చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు
-
సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి
జీడీపీ లెక్కలు బాగానే ఉన్నాయంటూ కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరను చమురు కంపెనీలు మరోసారి పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.50కి చేరుకుంది. రెండు వారాల్లో రెండు సార్లు ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి గ్యాస్ ధరలను చమురు కంపెనీలు సమీక్షిస్తున్నాయి. అందులో భాగంగా మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలను స్థిరీకరిస్తున్నాయి. చివరి సారిగా ఆగస్టు 18న గ్యాస్ ధరను రూ. 25 పెంచాయి. రెండు వారాలు తిరిగే సరికి మరోసారి సామాన్యుడి నెత్తిన గ్యాస్ పిడుగు పడింది. దీంతో రెండు వారాల వ్యవధిలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 వరకు పెరిగింది. ఈ ఏడాది పెంపు రూ. 165.50 ఈ ఏడాది ఆరంభంలో రూ.694లుగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరిలో, మార్చి, జూన్లలో కూడా ధరలను చమురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా ఐదు సార్లు ధర పెరగగా మధ్యలో ఫిబ్రవరి, ఏప్రిల్‌లలో కొద్ది మేరకు ధరలను తగ్గించాయి. మొత్తంగా ఈ ఏడాది 14.2 కేజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.165.50 వరకు ధర పెరిగింది. 2017 నుంచి బాదుడే పెట్రో ఉత్పత్తుల ధరలపై నియంత్రణను 2017లో కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెట్రో ఉత్పత్తి సంస్థలు పెంచేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. తాజా పెంపుతో దేశంలో 29.11 కోట్ల మంది ఎల్పీజీ కస్టమర్లపై భారం పడనుంది. చదవండి: మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ -
గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..! ఇకపై
న్యూ ఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..! ఇకపై గ్యాస్ ఎప్పుడు ఖాళీ అవుతుందనే విషయాన్ని తెలుసుకోవడం మరింత సులువుకానుంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ల బరువు కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) కొత్తగా స్మార్ట్ ఎల్పీజీ సిలిండర్లను విడుదల చేసింది. వీటిని ఇండానే కాంపోజిట్ సిలిండర్లుగా పిలువనున్నారు. ఈ కొత్త స్మార్ట్ సిలిండర్లతో కస్టమర్లు తమ తదుపరి రీఫిల్‌ను ఎప్పుడు బుక్ చేయాలనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ఐఓసీఎల్ విడుదల చేసిన స్మార్ట్ సిలిండర్లతో గ్యాస్ ఎంత పరిమాణం ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. సాధారణంగా గ్యాస్ సిలిండర్లు స్టీల్‌తో చేస్తారు. కాగా ఐఓసీఎల్ రిలీజ్ చేసిన స్మార్ట్ సిలిండర్లను హై-డెన్సిటీ పాలిథిలిన్(హెచ్డీపీఈ)తో తయారుచేశారు. ఈ సిలిండర్లు మూడు లేయర్ల నిర్మాణాన్ని కల్గి ఉంది.ఈ నిర్మాణంతో స్టీల్ సిలిండర్లు మాదిరి స్మార్ట్ సిలిండర్లు ధృడంగా ఉంటాయని తెలుస్తోంది. ఇండానే కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు ►నార్మల్ సిలిండర్ల కంటే ఈ సిలిండర్లు తేలికైనవి. ప్రస్తుతం ఉన్న సిలిండర్లలో సగానికిపైగా బరువు తగ్గనుంది. ►ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. ►వినియోగదారులు సులభంగా రీఫిల్ చేసుకునేందుకు సహాయపడుతుంది. ►స్టీల్ సిలిండర్లు వినియోగించే కొద్దీ అవి తుప్పు పడతుంటాయి. కానీ ఈ సిలిండర్‌కు అలాంటి సమస్యలు ఉండవు. ►మూస పద్దతిలో కాకుండా ట్రెండ్‌కు తగ్గట్లు ఆధునిక పద్దతుల్లో దీన్ని డిజైన్ చేశారు. ►ప్రస్తుతం, ఈ స్మార్ట్ సిలిండర్లు న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, ఫరీదాబాద్, లూధియానాలలో అందుబాటులో ఉన్నాయి. ►వినియోగదారుల సౌకర్యం కోసం 5 కిలోల నుంచి 10 కిలోల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి. ►ఈ సిలిండర్లు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని ఐఓసిఎల్ ప్రకటించింది. ►మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మీరు ప్రస్తుతం ఉన్న ఎల్పిజి స్టీల్ సిలిండర్లకు బదులు ఈ స్మార్ట్ సిలిండర్లను మార్చుకునే సౌకర్యం ఉంది. ►ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ లేని ఈ సిలిండర్లకు సెక్యూరిటీ డిపాజిట్ కింద 10 కిలోల బరువు సిలిండర్ కు రూ .3350, 5 కిలోల బరువున్న సిలిండర్‌కు రూ .2150 చెల్లించాల్సి ఉంటుంది. -
గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, హైదరాబాద్: నిరాటంకంగా పెరుగుతూ వస్తున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా మొత్తం సబ్సిడీ ఎత్తివేస్తోంది. దీంతో సామాన్యుడు వంట చేసుకోలేని విధంగా మారింది. అయితే ఇప్పుడు కొద్దిగా ఉపశమనం కలిగే వార్త వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాస్ బండపై రూ.10 తగ్గనుంది. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. గురువారం నుంచి పది రూపాయలకు తక్కువగా గ్యాస్ సిలిండర్ లభించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.819గా ఉంది. కలకత్తాలో రూ.845, ముంబై రూ.819, చెన్నై రూ.835 ధరలు ఉన్నాయి. ఒక్క 2021 సంవత్సరంలోనే మూడుసార్లు భారీగా గ్యాస్ ధరలు పెంచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండడంతో ధరలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు. -
ఇకపై ఓటీపీ చెబితేనే.. సిలిండర్
సాక్షి, కరీంనగర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల రాయితీలు అందజేస్తున్నాయి. గ్యాస్‌బండ ధర పెరిగినప్పుడల్లా రాయితీని కూడా పెంచుతూ ఆ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. గరిష్ఠంగా ఒక్కో వినియోగదారుడు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు సిలిండర్లు పొందే అవకాశముంది. అన్ని అవసరం లేకపోయినా కొందరు తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. పథకాల్లో ఉన్న లోపాలను అదనుగా చేసుకుని పలు ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తున్నాయి. దీంతో లక్ష్యానికి తీరని విఘాతం కలుగుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను ఎక్కువగా వాణిజ్య అవసరాలకు వినియోగించడం సర్వసాధారణమైంది. ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త విధానం అమల్లోకి వచ్చింది. వినియోగదారుడి ధ్రువీకరణతోనే వాణిజ్యానికి వినియోగించే సిలిండర్ల ధరలు అధికంగా ఉండటంతో గృహవసర సిలిండర్లు దారి మళ్లుతున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వాడుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారు. రాయితీ లక్షల్లో దుర్వినియోగమవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు చమురు సంస్థలు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. పెట్రోలియం మంత్రిత్వశాఖ వంట గ్యాస్ డెలివరీకి సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఓటీపీ(వన్‌టైం పాస్వర్డ్)ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు తాము రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నుంచి రీఫిల్ బుక్‌చేసుకుంటే ఓటీపీ వస్తుంది. ఈ నంబర్ చెబితేనే ఇక నుంచి గ్యాస్ సిలిండర్ అందనుంది. ఇలా సదరు వినియోగదారుడి ధ్రువీకరణతోనే సరఫరా చేసే విధానం అమలుకు చమురు సంస్థలు శ్రీకారం చుట్టాయి. జిల్లాలోని హుజూరాబాద్, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో భారత్ గ్యాస్, ఇండెన్, హెచ్‌పీ చమురు సంస్థల ఏజెన్సీలు 35వరకు ఉన్నాయి. మొత్తంగా 5.10 లక్షల కనెక్షన్లుండగా.. ప్రతి నెలా జిల్లాలో లక్షకు పైగా గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ప్రాధాన్యం జిల్లాలో నానాటికి కరోనా కేసులు అధికమవుతునే ఉన్నాయి. ఏజెన్సీలు గ్యాస్ బండలకు నగదు చెల్లింపులకు కూడా చెక్ పెడుతూ వాట్సప్ ద్వారా సులభంగా డబ్బును చెల్లించేలా ఏర్పాట్లు చేస్తోంది. రిజిష్టర్ నంబర్ల ద్వారా చమురు సంస్థల వాట్సప్ నంబర్లకు హాయ్ అని సమాచారం ఇవ్వాలి. ఇలా వచ్చిన వెంటనే క్షణాల్లో స్పందనను పొందవచ్చు. బుకింగ్‌తో పాటు నగదును తమ డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, తదితర వాటిని వినియోగించి చెల్లించవచ్చు. దీనికి తోడు ఫోన్‌పే, గూగుల్ పేల ద్వారా కూడా నగదును బదిలీ చేయవచ్చు. ప్రజల్లో మరింత అవగాహన పెంచడం ద్వారా చమురు సంస్థలు అమలు చేసే డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలుకు సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనుసంధానం చేసుకుంటే మేలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది తమ మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోలేదు. ఇప్పటివరకు మొబైల్ నంబర్ అనుసం«ధానం లేని వినియోగదారులు ఈ నెలాఖరులోపు అనుసంధానించుకోవాలి. లేదంటే ఆ తరువాత ఓటీపీ చెప్పని క్రమంలో గ్యాస్ బండలను పొందే అవకాశం కోల్పొవాల్సి ఉంటుందని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. -
రాయితీ పెంచినా తప్పని భారం..!
సాక్షి, నల్లగొండ : వంటగ్యాస్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన చమురు ధరలను అనుసరించి ఇంధన కంపెనీలు వంటగ్యాస్ ధరలు పెంచాయి. దీంతో సామాన్యుడిపై గ్యాస్ ధర భారం పడింది. కంపెనీలు పెంచిన ధరలకు అనుగుణంగా పేదలపై భారం పడకుండా సిలిండర్లకు ఇచ్చే రాయితీని కూడా కేంద్రం పెంచింది. దీంతో వినియోగదారులకు పెద్దఝెత్తున ఊరట కలిగినా భారం మాత్రం కొద్ది మొత్తంలో తప్పడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ.6.50 భారం పడనుంది. ప్రతి నెలా జిల్లాలో రూ.6లక్షలపైగా భారం పడే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 1,56,200 రెగ్యులర్, 40వేల దీపం కనెక్షన్లు ఉన్నాయి. ఇండేన్, భారత్, హెచ్‌పీ కంపెనీలకు సంబంధించి 31 మండలాల పరిధిలో 33 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోంది. అయితే రోజూ 4,140 సిలిండర్ల వరకు వినియోగదారులకు సరఫరా అవుతున్నాయి. భారీగా పెంచిన సిలిండర్ ధర... ఇప్పటి వరకు సిలిండర్ ధర రూ.788 ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు రూ.206 రాయితీ కల్పిస్తూ లబ్ధిదారుని అకౌంట్లో ఆ మొత్తం జమచేస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ వినియోగదారుడికి రూ.582కి అందుతుంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు సిలిండర్ దరను పెంచాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.148.50 పెంచాయి. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.936.50కి చేరింది. అయితే ఇందులో ప్రభుత్వం సబ్సిడీని రూ.348కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుడికి కాస్త ఊరట ఓ పక్క ఇంధన కంపెనీలు సిలిండర్ ధర పెంచగా ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా రాయితీని కూడా పెంచింది. దీంతో కంపెనీలు పెంచిన ధర మొత్తం వినియోగదారులపై పడడం లేదు. కేవలం రూ.6.50 అదనంగా పెరిగిన ధరతో చెల్లించాలి్సన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి నెలా జిల్లా గ్యాస్ వినియోగదారులపై రూ.6 లక్షల పైచిలుకు భారం పడనుంది. జిల్లాలో గ్యాస్ వినియోగదారులకు మాత్రం ఈ స్వల్ప భారం తప్పడం లేదు. -
హోండా ‘సీబీఆర్650ఆర్’ స్పోర్ట్స్ బైక్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్ఎంఎస్ఐ).. ‘సీబీఆర్650ఆర్’ పేరుతో కొత్త స్పోర్ట్స్ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సీబీఆర్650ఎఫ్ స్థానాన్ని భర్తీ చేస్తూ విడుదలైన ఈ బైక్.. 649–సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. బైక్ ధర రూ.7.7 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ.. ‘గతవారంలోనే కొత్త ప్రీమియం బిగ్ బైక్ వర్టికల్‌పై ప్రకటన చేశాం. ఇందుకు అనుగుణంగా హోండా బిగ్‌వింగ్ క్యాటగిరిలో ఈ నూతన బైక్ విడుదలైంది’ అని అన్నారు. -
తప్పిన పెను ప్రమాదం
గంట్యాడ: పాఠశాల వంటగదిలో గ్యాస్ సిలెండర్ పేలిన ఘటనలో భవనం కుప్పకూలింది. సంఘటన సమయంలో పరిసర ప్రాంతంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని రామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాఠశాల నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచ్చింది. పేలుడు శబ్ధానికి పరిసర నివాసితులు ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. పాఠశాల వంటగది నుంచి పొగలు రావడంతో అక్కడకు చేరుకున్నారు. భవనంలో నుంచి మంటలు రావడంతో స్కూల్ కమిటీ చైర్మన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. హెచ్ఎం ఎంఈఓకు సమాచారం ఇవ్వగా ఆమె 101 ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి వారిని అప్రమత్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసిం ది. ప్రమాదంలో భవనం పూర్తిగా కూలి పోయింది. పాఠశాలకు ఒంటి పూట బడులు కావడం, సాయంత్రం ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్ర మాద వివరాలను ఉన్నతాధికారులకు తె లియజేస్తామని ఎంఈఓ జి.విజయలక్ష్మి తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలి యరాలేదు. ప్రమాదంలో గుడ్లు, వంట సామగ్రి, వంటపాత్రలు ధ్వంసమయ్యా యి. సిలెండర్ తునాతునకలైంది. విజయనగరం అగ్నిమాపక సిబ్బంది ఎస్ఎఫ్ఓ దిలీప్‌కుమార్, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. -
బండ మళ్లీ బరువెక్కింది..!
-
బండ మళ్లీ బరువెక్కింది..!
సాక్షి, న్యూఢిల్లీ : గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌పై రూ. 1.50, విమాన ఇంధనంపై 6 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రకారమే ధరల్లో మార్పులు చేస్తున్నట్ల ఐఓసీ తెలిపింది. కొత్తగా పెరిగిన ఇంధన ధరల ప్రకారం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఢిల్లీలో కిలో లీటర్‌కు రూ.53,045కు చేరింది. గతంలో ఇది రూ.50,020గా ఉండేది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నా.. విమాన ఇంధనధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ గ్యాస్ ధర రూ.1.50 పెరిగింది. గ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే క్రమంలో గ్యాస్ ధరలను ప్రతినెలా కేంద్రం పెంచుతూ వస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ గ్యాస్ ధరలు.. రూ. 69.50 పెరిగాయి. -
గ్యాస్ సిలిండర్ పేలుడు
l14 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఆత్రేయపురం (కొత్తపేట) : మండలంలోని ర్యాలి గ్రామంలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన గ్రామంలో కలవరం సృష్టిం చింది. ఈ ఘటనలో 14 మంది గాయాలు పాలయ్యారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లకు తీవ్ర గాయాలైన ఇద్దరితోపాటు మరొకరిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. తీవ్రంగా గాయపడిన మరొకరికి కొత్తపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అసలేలా జరిగింది... గ్రామంలో పారిపిరెడ్డి సూర్యనారాయణకు చెందిన గ్యాస్ వెల్డింగ్ షాపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల సమయంలో షాపులో యజమాని వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాడికి వెల్డింగ్ షాపు ధ్వంసమైంది. యజమాని సూర్య నారాయణతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన కొడమంచలి అనంద్‌కుమార్, పల్లేటి సరేష్, చదులవాడ సోనియా, బుడ్డిగ వెంకట్రావు, పెందుర్తి దేవప్రసాద్, పల్లేటి మరియమ్మ, పెందుర్తి రాఘవమ్మ, చదులవాడ వెంకటేశులు, గంపల రాజు, పల్లేటి కృపావతి, కళ్యాణ రవణమ్మ, ఎస్కే మీరాబి ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన మరో ఇద్దరి పేర్లు తెలియాల్సిఉంది. ఈ షాపు సమీపంలో నివాసం ఉంటున్న వారితో పాటు అటుగా వెళుతోన్న వారికి పేలిన సిలిండర్ శకలాలు తగలడంతో గాయపడినట్టు స్థానికులు తెలిపారు.రాజమండ్రికి చెందిన సూర్యనారాయణ 25 ఏళ్ల క్రితం గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చారు. స్థానిక అరుంధతి పేటలో వెల్డింగ్ షాపుతో పాటు లేతు మిషన్ నడుపుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షలు అస్తి నష్టం ఏర్పడిందని అంచనా. క్షతగాత్రులకు ప్రముఖుల పరామర్శ.. తీవ్రగాయాల పాలైన వారికి స్థానిక పీహెచ్సీలో వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం కొత్తపేట, రాజమండ్రి ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జెడ్పీటీసీ సభ్యులు మద్దూరి సుబ్బలక్ష్మి బంగారం, సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, ర్యాలి సర్పంచి పల్లేటి ధనలక్ష్మి, ఆత్రేయపురం, రావులపాలెం మండల పరిషత్ ఉపా«ధ్యక్షులు మద్దూరి సుబ్బారావు, దండు సుబ్రహ్మణ్య వర్మ, రూరల్ బ్యాంకు అధ్యక్షుడు మద్దూరి సుబ్బారావు, ఎంపీటీసీ బోణం రత్నకుమారి, వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ కన్వీనర్ కప్పల శ్రీధర్, మాజీ రూరల్ బ్యాంకు అధ్యక్షులు మెర్ల వెంకటేశ్వరరావు, ఈలి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. వీఆర్వో ఫిర్యాదుపై ఎస్సై జేమ్స్ రత్న ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులకు హోంమంత్రి పరామర్శ రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయాల పాలైన క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప పరామర్శించారు. ప్రమాద సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఉచితంగా చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ముగ్గురికి కంటికి తీవ్ర గాయాలు అయ్యాయని, వారిని కాకినాడలోని కిరణ్ కంటి హాస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విశాఖ జిల్లా కేడీ పేటలో లారీ దూసుకుపోయి గాయాలు పాలైన బాధితులకు ప్రభుత్వ పరంగా వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కౌన్సిల్ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్, హాస్పిటల్ సూపరిటెండెంట్ డాక్టర్ రమేష్ కిషోర్, టీడీపీ నాయకులు గన్ని కృష్ణ, డీఎస్పీలు కులశేఖర్, రామకృష్ణ పాల్గొన్నారు. -
పేలుళ్ల విస్ఫోటం
అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన గ్యాస్ లారీ చెట్టి విరిగి విద్యుత్‌లైన్‌పై పడటంతో రేగిన మంటలు విశాఖపట్టణం (భీమిలి): నగర శివారులో ఆనందపురం మండలం గుడిలోవ వద్ద మంగళవారం అర్థరాత్రి ఒక లారీ మంటలకు ఆహుతి కావడం.. అందులో ఉన్న సిలిండర్లు పేలిపోయిన ఘటన బీభత్సం సృష్టించింది. పరవాడ వద్ద ఉన్న భారత్ గ్యాస్ గొడౌన్ నుంచి 306 గ్యాస్ సిలిండర్లను లారీలో లోడ్ చేసుకొని డ్రైవర్ నాగేశ్వరరావు పెందుర్తి మీదుగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి తీసుకెళ్తున్నాడు. గుడిలోవ వద్ద మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డంగా రావడంతో.. అతన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించే క్రమంలో లారీ రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఢీకొట్టింది. దాంతో తాటిచెట్టు విరిగిపోయి పక్కనే ఉన్న 33 కేవీ విద్యుత్ లైనుపై పడటంతో మంటలు రేగాయి. అదే సమయంలో లారీ నుంచి లీకైన డీజిల్ అంటుకొని మంటలు లారీని కమ్మేశాయి. మంటల వేడికి లారీలో ఉన్న సిలిండర్లలో గ్యాస్ ఒత్తిడి పెరిగి ఒక్కొక్కటిగా పేలడం ప్రారంభించాయి. మూడు గంటలపాటు పేలుళ్లు ఏకధాటిగా మూడు గంటలపాటు కొనసాగిన ఈ పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాంతాలన్నీ అదిరిపోయాయి. నిద్రపోతున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈలోగా లారీకి మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకేసి పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. అయితే మంటల తీవ్రత కారణంగా లారీ సమీపంలోకి వెళ్లలేక దూరం నుంచే మర్రిపాలెం, తాళ్లవలస నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. తెల్లవారుజాముకు గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో లార్తీ పూర్తిగా కాలిపోయి ఆనవాలు లేకుండాపోయింది. 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిపివేత ప్రమాద తీవ్రతను గమనించిన పోలీసులు ఈ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను ఇతర మార్టాల్లోకి మళ్లించారు. సుమారు 4 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, స్థానిక సీఐ ఆర్.గోవిందరావు, తహసీల్దారు ఎస్.వి.అంబేద్కర్లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. లారీ పూర్తిగా దగ్ధం కావడంతోపాటు సిలిండర్లు పేలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. నిషేధ సమయంలో సిలిండర్ల తరలింపు పేలుడు స్వభావం గల వస్తువులు, పదార్థాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మాత్రమే రవాణా చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ప్రమాదానికి గురైన లారీ అర్ధరాత్రి వేళ నిబంధనలను అతిక్రమించి సిలిండర్లను నగరం మీదుగా శివారు ప్రాంతానికి ఎలా చేరుకుందన్న విషయం చర్చనీయాంశమైంది. అలాగే సిలిండర్లను చట్టబద్దంగానే తరలిస్తున్నారా లేదా బ్లాక్‌లో తరలిస్తున్నారా అన్న అనుమానాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాల ద్వారా భారీగా సరుకులు రవాణా చేసేటప్పుడు తప్పకుండా సహాయకులను పంపిస్తారు. కానీ ఈ లారీతో ఒక్క డ్రైవరే ఉన్నాడు. మతిస్థిమితం లేని వ్యక్తిని తప్పించబోయి చెట్టును ఢీకొట్టానని డ్రైవర్ చెబుతున్నాడు. కానీ నిర్ణీత వేగంతో వస్తే లారీని అదుపు చేసే అవకాశం ఉంది. అందువల్ల మితి మీరిన వేగం కానీ.. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కానీ జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బంక్.. ఇటు గ్రామం ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో ఒకపక్క తర్లువాడ గ్రామం.. మరోపక్క పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి చేరువలో ఈ ప్రమాదం జరిగినా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లేది. పెట్రోలు బంక్‌కు ఆనుకొని చాలా తోటలు ఉన్నాయి. మంటలు చెలరేగి ఉంటే అపార నష్టం జరిగి ఉండేదని సంఘట స్థలాన్ని చూసిన స్థానికులు ఆందోళనతో చెప్పారు. -
గ్యాస్ భారం
సబ్సిడీ సిలిండర్ ధరపై రూ.90 పెంపు నేటి నుంచి అమలు జిల్లావాసులపై నెలకు రూ.86 కోట్లు అదనపు భారం పెంచిన మొత్తం సబ్సిడీ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటన చిత్తూరు(కార్పొరేషన్): జిల్లావాసులపై కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌బండ భారాన్ని మరింతగా మోపింది. సబ్సిడీ సిలిండర్‌పై ఏకంగా రూ.90 ధర పెంచడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెంచిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో తిరిగి ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే సబ్సిడీ సక్రమంగా జమకాక ఇబ్బంది పడుతున్న తమకు కేంద్రం తాజా నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు ఖాయమని జనం వాపోతున్నారు. ప్రసుత్తం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.738 ఉండగా అది రూ.828కు పెరిగింది. అయితే పెంచిన మొత్తాన్ని ఖాతాల్లో సబ్సిడీ రూపంలో జమచేయనున్నట్లు ప్రకటించారు. దీంతో జిల్లావాసుల పై నెలకు రూ.86 కోట్లకు వరకు అదనపు భారం పడనుంది. గ్యాస్‌ధర పెంపు నిర్ణయం గురువారం నుంచి అమలులోకి రానుంది. అయితే బుధవారం కేంద్రం ప్రకటన చేసిన వెంటనే డీలర్లు రూ.850కు సిలిండర్లను విక్రయించారు. ఇదేంటని ప్రశ్నిస్తే రేటు పెరిగిందని సమర్థించుకుంటున్నారు. తొమ్మిదిన్నర లక్షల మందిపై భారం.. జిల్లా జనాభా 42 లక్షలు ఉండగా ఇందులో 9,58,786 మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. 90 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా 2,800 మంది నాన్ సబ్సిడీ సిలిండర్లను,3200 మంది వాణిజ్య అవసరాల సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. ఈ లెక్కన 9,58,786 మంది వినియోగదారులపై నెలకు అదనంగా రూ.86 కోట్లు వ్యయం వేశారు. ఈ మొత్తం ఖాతాల్లో జమచేస్తామని చెబుతున్నారు. వాణిజ్య సిలిండర్లపై రూ.148.50 పెంచారు. ఆ లెక్కన ప్రతినెలా అదనంగా మరో రూ.10 లక్షలు భారం పడనుంది. ఇది వరకు రూ.738 ఉన్న సిలిండర్‌ను రూ.760కు విక్రయించగా ఇకపై అది రూ.828కి చేరనుంది. డెలివరీతో పాటు రూ.850 వరకు వసూలు చేస్తారు. బుధవారమే దోపిడీ నూతనంగా పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి. కానీ డీలర్లు బుధవారం కూడా రూ.850(హోమ్ డెలీవరీ) వసూలు చేశారు. ఈ లెక్కన రోజులోనే లక్షలాది రూపాయలు దోచుకున్నారని వినియోగదారులు వాపోయారు. -
గివ్ ఇట్ అప్
బియ్యం వద్దనుకుంటే తహసీల్దార్‌కు లేఖ ఇస్తే చాలు.. ఆ మేరకు డీలర్ కోటాలో కోత మిగతా రేషన్ సరుకులు యథావిధిగా పొందొచ్చు కేంద్రం నుంచి వెలువడిన ఉత్తర్వులు వరంగల్ రూరల్ : గ్యాస్ సిలిండర్‌పై రాయితీ వద్దనుకునే సంపన్నుల కోసం గతంలో కేంద్రప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా నమో దు చేసుకున్న సెల్ నంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్‌ను ఉత్పత్తి ధరకే అందిస్తున్నారు. ఇదే రీతిలో దొడ్డు బియ్యం వద్దనుకునే రేషన్ కార్డుదారులకు కూడా ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. దొడ్డు బియ్యం తినలేం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పలువురికి నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ కార్డులోని పేర్ల ఆధారంగా ఒక్కొక్కరికి రూ.1కి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు. దీనికి తోడు చక్కెర, గోధుమలు, నూనె ఇత్యాది సరుకులు అందజేస్తున్నారు. అయితే, పలువురు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక బయట అమ్ముకుంటుండగా.. మరికొందరు షాపుల నుంచే తీసుకోవడం లేదు. ఇలా మిగిలిపోయిన బియ్యాన్ని డీలర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో బియ్యం పక్క దారి పడుతోందని గుర్తించిన ప్రభుత్వం ‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తమకు బియ్యం అవసరం లేదని తహసీల్దార్ లేఖ ఇస్తే ఆ లబ్ధిదారుడు సరుకులు తీసుకునే డీలర్ కోటా నుంచి మినహాయించి సరఫరా చేస్తారు. అయితే, రేషన్ కార్డుపై ఇచ్చే మిగతా సరుకులను మాత్రం యథావిధిగా తీసుకోవచ్చు. అంతేకాకుండా మిగతా అవసరాలకు కూడా కార్డు పనికొస్తుంది. కాగా, వరంగల్ రూరల్ జిల్లాలో 3,42,084 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 2,17,422 మందికి ఆహార భద్రత కార్డులు, 12,865 మందికి అంత్యోదయ కార్డులు ఉండగా, 15మంది అన్నపూర్ణ కార్డులు పొందారు. ఖర్చు ఎక్కువ ఉపయోగం తక్కువ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి రుపాయి కి కిలో బియ్యం అందించడానికి అధిక మొత్తంలో ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నాయి. రూ.23 నుంచి రూ.24కు కేజీ చొప్పున ప్రభుత్వం రైసు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి, రూ.1కే కిలో చొప్పున లబ్ధిదారులకు అందజేస్తోంది. తద్వారా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, పలువురు దొడ్డు బియ్యం తినేందుకు ఆసక్తి చూపకపోవడంతో వివిధ మార్గాల ద్వారా పక్కదారి పడుతోంది. తెల్ల కాగితంపై రాసి ఇవ్వాలి.. ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ (07 డబ్ల్యూజీఎల్ 301 లేదా 302 – ఎస్డబ్ల్యూ.పీటర్, డీఎస్ఓ)కార్డుదారుల్లో రూ.1కి కిలో బియ్యం వద్దనుకునేవారు తహసీల్దార్‌కు ‘గివ్ ఇట్ అప్’ వర్తింపజేయాలని తెల్లకాగితంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నెలనెలా ఎంత బియ్యం వద్దనుకుంటున్నారో లెక్క వేసి వారి రేషన్ షాపులకు ఇచ్చే నుంచి మినహాయిస్తాం. అయితే, బియ్యం వద్దని రాసిస్తే మిగతా సరుకులు కూడా ఇవ్వరని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతావన్నీ యథావిధిగా ఇస్తారు. దీనికి సంబంధించి మాకు కేంద్రప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. -
నిలువుదోపిడీ..
రవాణా పేరుతో ఒక్కో సిలిండర్‌పై రూ.20నుంచి రూ. 50వరకు వసూలు వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్న ఏజెన్సీలు పట్టించుకోని అధికారులు జిలాల్లో గ్యాస్ ఏజెన్సీలు ఒకపక్క నల్లబజారులో సిలిండర్లను విక్రయిస్తూనే మరోపక్క రవాణా పేరుతో వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఒక్కో సిలిండర్‌పై రూ. 20 నుంచి రూ. 50 వసూలు చేస్తూ వినియోగదారుల జేబులను గుల్ల చేస్తున్నాయి. చిన్న విషయంగానే ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నెలకు రూ. లక్షల్లో సంవత్సరానికి రూ. కోట్లలో ఈ దందా సాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోదాడ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 67 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిలో 5.5 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా సగటు నెల వినియోగం 2 లక్షల 75 వేల సిలిండర్లు. ఒక్కోసిలిండర్‌పై 20 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే సగటున నెలకు రూ.60 లక్షలు, సంవత్సరానికి రూ.7 కోట్ల మేర వీరు బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ సరఫరాకు సొంత వాహనాలు కలిగి ఉండాలి. కాని అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారో ఏమోగాని సొంత వాహనం కలిగి ఉన్న వారినే డెలివరీ బాయ్‌గా పెట్టుకుంటున్నారు. వీరికి వేతనం, వాహనం ఖర్చులు గాని ఏజెన్సీ వారు ఇవ్వ డం లేదు. సదరు బాయ్ రోజుకు 50 నుంచి 100 సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసి వారి వద్ద నుంచి రూ.30నుంచి రూ.50 తమ వేతనం కింద వసూళ్లు చేసుకుంటున్నారు. రవాణా కోసం కంపెనీ ఇచ్చే డబ్బును ఏజెన్సీ నిర్వాహకులే నొక్కేస్తున్నారు. గ్యాస్ సరఫరా చేసే ఈ వాహనాలను కొందరు ఏజెన్సీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తేనే పనిలోకి తీసుకుంటామని చెపుతుండడంతో నిరుద్యోగులు తమ వాహనాలను ఏజెన్సీ పేరుతో మార్చడం, కొందరు లీజుకు ఇచ్చినట్లు అగ్రిమెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అదనంగా ఇవ్వాల్సిందే... గ్యాస్ ధరను రవాణ ఖర్చు, ఏజెన్సీ కమిషన్‌తో కలిపే కంపెనీలు నిర్ణయిస్తాయి. దానికి మించి ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఏజెన్సీ నుంచి వినియోగదారుడి ఇళ్లు 5 కిలోమీటర్లు కన్నా ఎక్కువ ఉంటే అసలు ధరకు 20 రూపాయలను అదనంగా చెల్లించవచ్చు. కొన్ని కంపెనీలు 15 కిలోమీటర్ల వరకు ఉచిత సరఫరా చేస్తున్నాయి. కాని దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నుంచి డెలివరీబాయ్స్ రూ.30 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ఇదేమిటంటే మాకు కంపెనీలు వేతనాలు ఇవ్వవు. మీరు ఇచ్చే డబ్బులే మాకు వేతనం. మీరు ఇవ్వకపోతే మేము ఎలా బతకాలి అనేది వారి వాదన. దీంతో గ్యాస్ అత్యవసరం కావడం, గ్యాస్ ఇంటికి వచ్చిన సమయంలో మహిళలు ఉండడంతో వారితో వాదన పెట్టుకోకుండా అడిగినంత ఇచ్చి గ్యాస్ తీసుకుంటున్నారు. డెలివరీ బాయ్స్‌కు ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వవద్దని ప్రకటనలు ఇస్తూనే వారికి వేతనాలు ఇవ్వకుండా సిలిండర్ తీసుకున్న వారి నుంచే వసూళ్లు చేసేకోమని లోపాయికారిగా చెబుతున్నారు. కార్మికశాఖ ఏంచేస్తున్నట్లు..? జిల్లా వ్యాప్తంగా 67 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటిలో పని చేసే కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత కార్మికశాఖది. వేతనంతో పాటు పీఎఫ్‌ను కూడా వారికి ఇప్పించాలి. కాని అసలు ఏజెన్సీలలో ఎంత మంది కార్మికులు పని చేస్తున్నారు? వారికి ప్రతి నెలా ఎంత వేతనం ఇస్తున్నారు? పీఎఫ్ తదితరాలు జమ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని సదరు అధికారులు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని కార్మికులే అంటున్నారు. తమకు వేతనాలు ఇస్తే అధనంగా ఎందుకు వసూళ్లు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు రేటు మాత్రం బయటకు చెప్పరూ... గ్యాస్ ధరలను కంపెనీలు ప్రతి నెలా ఒకటవ తారీకున సవరిస్తాయి. నవంబర్ లో ఇంటి అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ. 608 ఉండగా డిసెంబర్ నెలలో 685–50 రూపాయలకు పెంచింది. పెంచిన ధరను వెంటనే వసూలు చేస్తున్న ఏజెన్సీలు, తగ్గినపుడు మాత్రం విషయం బయటకు తెలియకుండా అమ్ముతున్నారు. -
నార్సింగిలో పేలిన సిలిండర్
-
సిలిండర్‌పై రూ.2 వడ్డింపు
మళ్లీ పెరిగిన సబ్సిడీ వంటగ్యాస్ ధర న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్(ఎల్పీజీ) ధర మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి సిలిండర్‌కు రూ.2 చొప్పున ధర పెరిగింది. ఇప్పటివరకు 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.428.59 ఉండగా.. తాజా పెంపుతో ధర రూ.430.64కు చేరింది. డీలర్లకు చెల్లించే కమీషన్ పెంపులో భాగంగా అక్టోబర్ 28నే సిలిండర్‌కు రూ.1.5 చొప్పున పెంచారు. సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. సిలిండర్‌కు రూ.37.5 చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దీంతో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.529.50కు చేరినట్లయింది. -
గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధం
మహిళకు గాయాలు రూ.5లక్షల ఆస్తి నష్టం రేగొండ : గ్యాస్ సిలిండర్ పేలి మూడు పూరిళ్లు దగ్ధమైన సంఘటన మండలంలోని మడ్తపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెం దిన కొయ్యడ బిక్షపతి ఇంట్లో శనివారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మంటలు లేచాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు కొయ్యడ నర్సమ్మకు మంటలం టుకొని గాయపడింది. అలాగే పక్కనే ఉన్న కొయ్యడ గట్టయ్య, కొయ్యడ నర్సయ్య పూరిళ్లు కూడా అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. మూడు ఇళ్లలో విలువైన సామ గ్రి, వస్తువులు దగ్ధమయ్యాయని బాధితులు ఆవేదన వ్య క్తం చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం వా టిల్లిందని వాపోయారు. కాగా బాధితుల ఫిర్యాదు మేర కు రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామ నిర్వహించారు. బాధిత కుటుం బాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
మళ్లీ పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ : సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. దేశ్యవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగిన రెండోరోజే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ పై రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో 423.09గా ఉండగా, తాజా పెంపుతో రూ.425.06కు చేరింది. కాగా ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకూ సబ్సిడీ గ్యాస్ ధరలు పెంచడం ఇది మూడోసారి. గత నెలలోనే సబ్సిడీ గ్యాస్ ధరలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 1న సిలిండర్‌పై రూ.1.93, జులై 1న రూ.1.98 పెంచింది. కాగా సబ్సిడీలను తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను పెంచినట్టు తెలుస్తోంది. ఇలా సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా సిలిండర్ ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. -
పెరిగిన సబ్సిడీ సిలిండర్ ధర
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గిన రెండోరోజే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్‌పై రూ.1.93 పెంచారు. సబ్సిడీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో 421.16గా ఉండగా, తాజా పెంపుతో అది 423.09కి పెరిగింది. కాగా గత నెలలోనే సబ్సిడీ సిలిండర్ పై 1.98 పైసలు విషయం తెలిసిందే. తాజాగా నెలరోజుల వ్యవధిలోనే కేంద్రం మరోమారు ధర పెంచింది. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 1.42, డీజిల్‌పై రూ.2.01 మేర దిగివచ్చాయి. నెలరోజుల్లో ఇది మూడో తగ్గింపు. తాజా ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. -
సిలిండర్ తగిలి బాలుడి మృత్యువాత
- విధ్వంసం సృష్టించిన చిన్న గ్యాస్ సిలిండర్ - గాలిలో ఎగిరి బాలుడిని ఢీ కొట్టిన గ్యాస్ బండ - చిన్నారి మృతి.. అంబర్‌పేటలో ఘటన హైదరాబాద్: చిన్న గ్యాస్ సిలిండర్ పెను విధ్వంసానికి కారణమైంది. మంటలు ఎగజిమ్ముతూ గాలిలో ఎగిరి బీభత్సం సృష్టించింది. బంతిలా దూసుకెళ్లిన సిలిండర్ నాలుగేళ్ల బాలుడిని బలంగా తాకడంతో అతని కుడి చేయి తెగిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూశాడు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో ముంతాజ్ బేగం(55) చిన్న గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ముంతాజ్ కుమార్తె కమ్రాబేగం అకాశ్నగర్లో ఉంటోంది. కమ్రాబేగం మూడో కుమారుడు పర్వేజ్(4) అమ్మమ్మ ముంతాజ్ వద్దకు సోమవారం సాయంత్రం వచ్చాడు. మంగళవారం ఉదయం 6.30 ప్రాంతంలో ముంతాజ్ టీ పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న ఐదు కిలోల చిన్న సిలిండర్‌ను వెలిగించింది. అయితే చిన్నగా గ్యాస్ లీకవుతున్నట్లు శబ్దం చే స్తూ మంట అంటుకుంది. దీంతో సిలిండర్‌ను ఇంటి బయటకు తీసుకొచ్చింది. మంటను అదుపు చేయడానికి సిలిండర్‌పై మట్టి పోసింది. మంటలు తగ్గకపోవడంతో బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి మండుతున్న సిలిండర్‌పై పోసింది. నీళ్లు పోయగానే సిలిం డర్ పెద్దగా శ బ్దం చేస్తూ గాలిలో ఎగిరి ఇంటి ముం దున్న గోడలను, ఓ ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో వెనక్కి వచ్చిన సిలిండర్ ముంతాజ్ పక్కనే ఉన్న పర్వేజ్‌ను తాకింది. ఆ ధాటికి అతని కుడి చెయ్యి తెగిపడింది. ముంతాజ్ కాలునూ బలంగా తాకిన సిలిండర్ ఎగురుతూ వెళ్లి పక్కింటి ముందు ఆడుకుంటున్న షేక్ మహ్మద్ కుమారుడు షేక్ హజీ(18 నెలలు)కి తగిలింది. సిలెండర్లోని గ్యాస్ అయ్యేవరకూ అది బీభత్సం సృష్టిం చింది. పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పర్వేజ్ మృతిచెందగా.. ముంతాజ్, షేక్ హజీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
గ్యాస్ సబ్సిడీ గందరగోళం
► ఫినో ఖాతాలో జమ ► వినియోగదారులకు అందనివైనం ► సాంకేతిక సమస్య పేరిట దాటవేత కరీంనగర్ రూరల్ : వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బు వినియోగదారులకు అందడంలేదు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం, ఫినో కంపెనీ దాటవేత వైఖరితో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవైసీలో బ్యాంకు ఖాతాల నంబర్లతో వినియోగదారులు దరఖాస్తు చేసుకున్నా సబ్సిడీ డబ్బును వారి ఖాతాల్లో కాకుండా ఫినో కంపెనీ ఖాతాలో జమచేస్తున్నారు. సబ్సిడీ డబ్బుల కోసం వినియోగదారులు ఫినో కంపెనీ ప్రతినిధుల చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా.. సాంకేతిక సమస్య సాకుతో తప్పించుకుంటున్నారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాలకు భారత్ గ్యాస్‌ను శివ థియేటర్ సమీపంలోని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ సరఫరా చేస్తోంది. గతంలో గ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ మినహాయించి వినియోగదారులకు సరఫరా చేసేవారు. గతేడాదినుంచి కేంద్రప్రభుత్వం నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమచేస్తోంది. దీనికోసం గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు కేవైసీలో బ్యాంకుఖాతాలను సమర్పించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.599 ఉండగా సబ్సిడీ రూ.138 వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ప్రభుత్వ లబ్ధిదారులకే ఈ తిప్పలు గ్యాస్ వినియోగదారులకు దాదాపు నాలుగైదు నెలల నుంచి సబ్సిడీ డబ్బు జమకావడంలేదు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్న వారికి మాత్రమే ఈ సమస్య ఏర్పడగా.. మిగిలిన వినియోగదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయి. ఉపాధిహామీ కూలీలు, ఆసరా ఫించన్‌దారులకు ఫినో కంపెనీ నుంచి సబ్సిడీ డబ్బు చెల్లిస్తున్నారు. ఈ వినియోగదారులు కేవైసీలో బ్యాంకు ఖాతా నంబర్లు ఇచ్చినా ఆధార్‌కార్డు నంబర్ ఫీడింగ్తో ఫినో కంపెనీలో నమోదైన ఖాతాల్లోకి జమవుతోందని ఓంసాయిరాం గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెంకటేశ్వర్రావు తెలిపారు. అయితే పలు గ్రామాల్లో టెక్నికల్ సమస్య పేరిట డబ్బులను కంపెనీ ప్రతినిధులు వినియోగదారులకు చెల్లించడంలేదని తెలుస్తోంది. మొగ్ధుంపూర్‌లో 50మందికి.. కరీంనగర్ మండలం మొగ్ధుంపూర్‌లో దాదాపు 50మంది వినియోగదారులకు నాలుగైదు నెలలుగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు చెల్లించడంలేదు. తమకు కనీసం సమాచారం లేదంటూ ఇవ్వడంలేదని తాళ్లపల్లి ఎల్లమ్మ, వీరగోని వెంకటస్వామి, కందుల రమేశ్‌గౌడ్ ఆరోపించారు. స్మార్ట్మిషన్లో గ్యాస్ వినియోగదారుల ఆధార్‌కార్డు నంబర్‌ను ఫీడింగ్ చేస్తే కస్టమర్ నాట్అవైలబుల్ అనే సమాచారం రావడంతో డబ్బులను చెల్లించడం లేదని ఫినో కంపెనీ ప్రతినిధి సరస్వతి తెలిపారు. సమాచారమున్న కొందరు వినియోగదారులకు చెల్లించినట్లు వివరించారు. కొందరు వినియోగదారుల సమాచారం లభించడంలేదని, పూర్తి వివరాలను తెలుసుకుని సమస్య పరిష్కరించనున్నట్లు ఫినో మండల కోఆర్డినేటర్ రవూఫ్ తెలిపారు. -
పేలిన సిలిండర్.. తప్పిన ప్రమాదం
-
బండ బాదుడు!
సిలిండర్ నిర్ణీత ధర కంటే అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్ ఆగడాలు వినియోగదారుల జేబులకు చిల్లులు నెలకు రూ.8.17 కోట్లకు పైగా భారం సిటీబ్యూరో: మహా నగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు అ‘ధన’పు బాదుడు తప్పడం లేదు. సిలిండర్ అసలు ధర కంటే అదనంగా వసూలు చేస్తూ డెలివరీ బాయ్స్ పబ్లిక్‌గా దోచుకుంటున్నారు. ఇలా ఒక నెలలో వినియోగదారులు చెల్లిస్తున్న మొత్తమెంతో తెలుసా? అక్షరాలా 8 కోట్ల 17 లక్షల రూపాయల పైమాటే. కొందరు వినియోగదారులు ‘చిల్లర’ కదా... అని తేలికగా తీసుకోవడంతో అది కాస్త డిమాండ్‌గా మారింది. ఎవరైనా ఇలా ఇచ్చుకోలేకపోతే రుసరుసలు తప్పవు. దీంతో అందరూ అదన ంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది పేదలకు భారంగా మారుతోంది. డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.662 ఉండగా... డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690. అంటే నిర్ణీత ధర కంటే అదనంగా రూ.28 వంతున లాక్కుంటున్నారు. మహా నగరం మొత్తం వినియోగదారులు నెలకు ముట్ట జెప్పుతోంది లెక్కిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏజెన్సీల నిర్లక్ష్యం... వినియోగదారులకు సిలిండర్‌ను డోర్ డెలివరీ చేయడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)తో కలుపుకొని బిల్లు వేసి.. వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల ధరనే బిల్లుపై వేస్తున్న ఏజెన్సీలు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో వారు ఇష్టమొచ్చినట్టుగా వసూలు చేస్తున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉంటుంది. కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తుండగా... మరికొందరు సిలిండర్ల సంఖ్యను బట్టి కమీషన్ చెల్లిస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లపై దృష్టి పెడుతున్నారు. నిబంధనల ప్రకారం సరఫరా సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువును వినియోగదారులకు చూపించాలి. కానీ ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్న నిబంధనలను వారు మరచిపోయారు. ఇవీ నిబంధనలు వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లుతో డోర్ డెలివరీ చేయాలి. ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయాలి. 6 నుంచి 15 కిలోమీటర్ల వరకూ రవాణా చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16-30 కిలోమీటర్ల దూరానికి రూ.15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి. -
సిలిండర్ లీకేజీతో మంటలు
కందుకూరు (రంగారెడ్డి జిల్లా): వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో వస్తువులు దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని లేమూరు పరిధిలో దన్నారం రవీందర్ ఇంట్లో ఆయన భార్య శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో వంట చేయడానికి లైటర్‌తో గ్యాస్ స్టవ్‌ను వెలిగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గ్యాస్ లీకై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వారు బయటకు పరుగెత్తారు. భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. కాగా, గ్రామస్తులు స్పందించి మంటలను ఆర్పి సిలిండర్ నుంచి రెగ్యులేటర్‌ను తొలగించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. -
‘దీపం’ వెలుగుకు నగదు బదిలీ అడ్డంకి!
ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దూరంగా ఉన్న పేద కుటుంబాలు 3 జిల్లాల్లో ముగిసిన అదనపు గడువుతో మార్కెట్ ధర చెల్లించాల్సిన దుస్థితి హైదరాబాద్: ‘దీపం’ వెలుగులకు గ్యాస్ నగదు బదిలీ పథకం అడ్డంకిగా మారింది. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంపై దీపం పథక లబ్ధిదారులకు అవగాహన లేకపోవడం వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో మొత్తంగా 11 శాతం మంది గ్యాస్ నగదు బదిలీ పథకానికి దూరంగా ఉండగా అందులో 6 నుంచి 7 శాతం దీపం లబ్ధిదారులే ఉన్నారని ఆయిల్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే రెండోసారి ఇచ్చిన అదనపు గడువు సైతం ముగిసిన నేపథ్యంలో మొదటి విడతలో నగదు బదిలీ ఆరంభమైన 3 జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్‌లలోని దీపం లబ్ధిదారులు మార్కెట్ ధరను చెల్లించి సిలిండర్‌ను పొందాల్సి వస్తోంది. నగదు బదిలీకి దూరంగా 4 లక్షల మంది దీపం లబ్ధిదారులు! కేంద్రం తీసుకొచ్చిన నగదు బదిలీ పథకంలో భాగంగా గ్యాస్ నంబర్‌కు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు అనుసంధాన అదనపు వెసలుబాటు గడువు మూడు జిల్లాల్లో ఈ నెల 14తో ముగిసింది. మిగతా ఏడుజిల్లాల్లో జూన్ చివరతో ముగియనుంది. ఇప్పటివరకు అందిన లెక్కల మేరకు రాష్ట్రం మొత్తంగా 89 శాతం మంది ఆధార్, బ్యాంక్ ఖాతాలను అనుసంధానించుకున్నా, మిగతా వారిలో మాత్రం ఎక్కువగా దీపం పథకం లబ్ధిదారులే ఉన్నారు. ముఖ్యంగా తొలి విడత నగదు బదిలీ మొదలైన మూడు జిల్లాల పరిధిలో ఆధార్ సీడింగ్ కలిపి చూస్తే ఆదిలాబాద్‌లో 90 శాతం, రంగారెడ్డిలో 88 శాతం, హైదరాబాద్‌లో 87 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. జంట జిల్లాల్లో మొత్తం 29 లక్షల ఎల్పీజీ గృహ వినియోగదారులు ఉండగా, అందులో నగదు బదిలీ పథకంలో 22.44 లక్షలు చేరగా, 6.56 లక్షల వినియోగదారులు దూరంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మరో 1.50 లక్షల మంది దూరంగా ఉన్నారని చెబుతున్నారు. గడువులోగా అనుసంధానానికి ముందుకురాని మొత్తం 8 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ రాయితీ ధరకు దక్కే అవకాశాల్లేవు. ఇందులో 4లక్షల మంది దీపం పథకం లబ్ధిదారులే ఉన్నట్లు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. బాధ్యత పౌర సరఫరాల శాఖదే! దీపం లబ్ధిదారులను నగదు బదిలీ పథకంలో చేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా పౌర సరఫరాల శాఖ మీదే ఉందని పరిశీలకులు అంటున్నారు. శాఖా పరంగా దీపం లభ్ధిదారుల వివరాలు తెప్పించి మండల, జిల్లాల వారీగా పరిశీలించి అందులో ఆధార్, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి, నగదు బదిలీ పథకంలో చేరేలా అవగాహన కల్పించే బాధ్యతను తీసుకుంటేనే నిరుపేదకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. -
సిలిండర్ పేలి బాలుడు మృతి
అర్వాల్: గ్యాస్ సిలిండర్ పేలి పన్నెండేళ్ల బాలుడు మృతిచెందాడు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బీహార్‌లోని అర్వాల్ జిల్లా బానియా బిఘాలో చోటుచేసుకుంది. వంట చేసేందుకు స్టవ్ వెలిగించే సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఐశు కుమార్ అనే పన్నేండళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు కుటుంబ సభ్యులు, మరొక పొరిగింటి వ్యక్తి గాయాలపాలయ్యారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. -
ప్రకాశాం జిల్లాలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు
-
గ్యాస్ సిలిండర్ పేలుడు, ఇల్లుదగ్ధం
-
సిలిండర్ పేలి.. వ్యక్తి మృతి
-
రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం ..
యథేచ్ఛగా నల్ల బజారుకు తరలిపోతోంది. కళ్లెదుటే అక్రమాలు జరుగుతున్నా అధికార గణం గుడ్లప్పగించి చూడడాన్ని వ్యాపారులు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్‌పై రూ.1200 వరకు ఆర్జిస్తున్న అక్రమార్కులు హోటళ్లకు సరఫరా చేయడం, వాహనాలకు రీఫిల్లింగ్ చేస్తూ తమ గ్యాస్ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తున్నారు. సత్తెనపల్లి : జిల్లాలో గ్యాస్ అక్రమ రీఫిల్లింగ్ వ్యాపారం కాసుల వర్షం కురి పిస్తోంది. రీఫిల్లింగ్ వ్యాపారులు కిలో గ్యాస్‌ను రూ.100లు చొప్పున విక్రయిస్తున్నారు. 14.2 కిలోల గృహ సిలిండర్‌పై రూ.1600 వరకూ వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర కంటే రూ.1150లు అదనంగా సంపాదిస్తున్నారు. * ఇది కాకుండా మరో విధానంలో కూడా సంపాదిస్తున్నారు. మూడు వంటగ్యాస్ సిలిండర్లు కలిపి రెండు వాణిజ్య సిలిండర్లలోకి నింపుతున్నారు. మూడు సిలిండర్ల ధర రూ.1,350 కాగా, ఒక్కో వాణిజ్య సిలిండరు 19 కిలోల వంతున రెండు సిలిండర్లకు రూ. 3,800 వసూలు చేస్తున్నారు. అంటే అదనంగా మిగిలిన రూ 2,450 జేబులో వేసుకుంటున్నారు. * వినియోగదారుడికి నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు రాయితీపై ఇస్తున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు ఏజెన్సీలు సకాలం లో పంపిణీ చేయకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. దీంతో రీఫిల్లింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. * ఈ కేంద్రాలకు గృహాల నుంచే ఎక్కువ సిలిండర్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డబుల్ సిలిండర్ కలిగిన గృహ వినియోగదారుల నుంచి ఒక్కో సిలిండర్‌ను రూ. 700 నుంచి రూ. 800ల వరకు రీఫిల్లింగ్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. * హోటళ్ల నిర్వాహకులు కూడా రూ.800ల చొప్పున గృహ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఐదు కిలలో సిలిండర్‌కు అనుమతి ఎక్కడ ? జిల్లాలో ఏ గ్యాస్ కంపెనీ వారు కూడా ఐదు కిలోల వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించడం లేదు. జిల్లాలో వాటికి అనుమతి లేదు. అయితే లైట్లు, వంట కోసం ఐదు కిలోల సిలిండర్లను దుకాణాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇవన్నీ రీఫిల్లింగ్ కేంద్రాల నుంచి వస్తున్న సిలిండర్లగా అర్థమవుతోంది. *ఒక గ్యాస్ సిలిండర్(14.2 కిలోలు)తో మూ డు ఐదు కిలోల సిలిండర్లు నింపుతున్నారు. దీంతో అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రమాదకరమని తెలిసినా ... *రీఫిల్లింగ్ విధానంలో పైపు ద్వారా ఒక సిలిండర్ నుంచి మరో దానికి గ్యాస్ నింపుతుంటారు. కార్లకైతే విద్యుత్ మోటార్ ద్వారా ఎక్కిస్తుంటారు. నివాస ప్రాంతాల నడుమ ఇలాంటి ప్రక్రియ ప్రమా దకరమని తెలిసినా లాభాలే లక్ష్యంగా అక్రమాలకు ఒడిగడుతున్నారు. *జిల్లాలో ఎక్కువగా పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, మాచర్ల, బాపట్ల, రేపల్లె, పొన్నూరు వంటి పట్టణాల్లో ఈ తంతు సాగుతోంది. *పధానంగా సత్తెనపల్లిలోని అచ్చంపేట రోడ్డు శివాలయ సమీపం లో రీఫిల్లింగ్ కేంద్రం ఉంది. ఇక్కడ బహిరంగంగానే రీఫిల్లింగ్ చేస్తుంటారు. * ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీఫిల్లింగ్ కేంద్రాలు, హోటళ్లపై టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించి వంట గ్యాస్ దుర్వినియోగం కాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
హెచ్‌పీసీఎల్‌ను తేలిగ్గా వదిలేది లేదు
అనంతపురం రూరల్: ‘సిలిండర్‌పై 100 నుంచి 150 గ్రాములు వ్యత్యాసం ఉంది.. కనీసం నెల రోజులు కాకమునుపే సిలిండర్ అయిపోతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇంత దారుణంగా గ్యాస్‌ను పంపిణీ చేస్తే ఎలా’ అని మంత్రి పరిటాల సునీత హెచ్‌పీసీఎల్ ప్రతినిధులపై మండిపడ్డారు. హెచ్‌పీసీఎల్‌ను సీజ్ చేసిన విషయంపై ఆ సంస్థ చీఫ్ మేనేజర్ గోపాలకృష్ణ, ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణతో కలిసి సోమవారం రాత్రి డ్వామా హాల్లో మంత్రి సమావేశమయ్యారు. తాను ఆకస్మికంగా తనిఖీ చేయగా 35 సిలిండర్లలో వ్యత్యాసం ఉందన్నారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సదరు హెచ్‌పీసీఎల్ అధికారులు నీళ్లు నమిలారు. మిషన్‌లో లోపం ఉందని సమాధానం చెప్పబోయారు. ఇన్ని రోజులుగా ఆ లోపాన్ని ఎందుకు సరిచేయలేదని ఆమె నిలదీశారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని చివరి అవకాశం ఇస్తున్నానన్నారు. గ్యాస్ తూకాల్లో వ్యత్యాసం వస్తే వదిలేప్రసక్తే లేదన్నారు. తూనిక లు, కొలతల అధికారులు వచ్చి తనిఖీ చేసిన తర్వాతే సీజ్ ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నారు. ఐదు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారనే ఒక అడుగు వెనుక్కు తగ్గుతున్నామన్నారు. కార్మికుల వేతనాల విషయంలోనూ చాలా వ్యత్యాసం ఉందన్నారు. వారి శ్రమకు తగ్గ వేతనాలిస్తే బాగుంటుందన్నారు. జేసీ సత్యనారాయణ కలుగజేసుకుని లేబర్ యాక్ట్ నిబంధలను కచ్చితంగా పాటించాలని హెచ్‌పీసీఎల్ ప్రతినిధులకు తేల్చి చెప్పారు. పౌరసరఫరాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తూనికలు, కొలతల అధికారులు ఒక్కసారైనా వచ్చి తనను కలవలేదన్నారు. ఇందుకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. గ్యాస్ ఏజేన్సీలు, పెట్రోల్ బంకులు తనిఖీలు చేయమంటే సిబ్బంది తక్కువగా ఉన్నారన్న సమాధానం ఇస్తున్నారని తెలిపారు. సమావేశంలో జెడ్పీఛైర్మన్ చమన్, డీఎస్ఓ ఉమామహేశ్వర రావు, డీఎం వెంకటేశం పాల్గొన్నారు. -
విజయనగరంలో సిలిండర్ పేలి మహిళ మృతి
విజయనగరం: జిల్లాలోని బోగాపురం మండలం రావడలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. అయితే గాయపడ్డవారిలో ఏడేళ్ల చిన్నారి ఉన్నట్టు తెలిసింది. వారి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
‘గ్యాస్’ బుకింగ్ ఇకపై ఆన్లైన్లో..
ఒంగోలు టూటౌన్ : గ్యాస్ వినియోగదారులకు బుకింగ్ కష్టాలు తప్పాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లకుండానే ఇంటి నుంచే సెల్‌ఫోన్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే వ్యవస్థను గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి తెచ్చాయి. గ్యాస్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రికార్డింగ్ సిస్టం(ఐవీఆర్ఎస్) పద్ధతిని ప్రవేశపెట్టాయి. ఆన్లైన్ బుకింగ్‌కు గాను గ్యాస్ కంపెనీలకు ప్రత్యేక నంబర్లు కేటాయించారు. ఇచ్చిన నంబర్లకు నేరుగా వినియోగదారుడు ఫోన్ చేస్తే సిలిండర్ బుక్ చేసుకునే విధానం గురించి తెలియజేస్తారు. వినియోగదారుడు ఏ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్నాడో.. ఆ ఏజెన్సీ ఫోన్ నంబర్‌ను సెల్ఫోన్లో ఎంటర్ చేయాలి. అనంతరం గ్యాస్ బుక్ నంబర్‌ను నమోదు చేయాలి. ...అలా ఆన్లైన్లో ఒక వాయిస్ అడిగిన సమాచారాన్ని ఫోన్లో ఎంటర్ చేస్తే మీ గ్యాస్ బుకింగ్ అయిపోయినట్లే. గ్యాస్ బుక్ చేసినట్లు సెల్‌కు మెసెజ్ కూడా పంపిస్తారు. ఈ విధానం ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు డీఎస్ఓ కే రంగాకుమారి తెలిపారు. జిల్లాలో ఇండేన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీలకు సంబంధించిన 57 ఏజెన్సీలు ఉన్నాయి. సింగిల్ సిలిండర్లు 3, 3,403, డబుల్ సిలిండర్లు 2,47,092, దీపం కనెక్షన్లు 1,45,516, వాణిజ్య సిలిండర్లు 9,426 ఉన్నాయి. వీరందరూ ఇక నుంచి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవాల్సిందేనని డీఎస్ఓ స్పష్టం చేశారు. -
మళ్లీ నగదు బదిలీ?
ఆధార్ లింకుతో అమలు చేసే ఆలోచనలో కేంద్రం న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత నగదు బదిలీ తలనొప్పి మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వంటగ్యాసు సిలిండర్లపై సబ్సిడీని ఆధార్ నంబర్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు జమచేసే ఈ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం ప్రారంభించడం... పథకాల్లో లోటుపాట్లతో అధికారం నుంచి దిగిపోయే ముందు పక్కనపెట్టడం తెలిసిందే. అయితే, నకిలీ లబ్ధిదారులకు చెక్ పెట్టేందుకు మళ్లీ నగదు బదిలీని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ పథకాన్ని మళ్లీ మొదలు పెట్టవచ్చని, పథకం పనితీరును అంచనావేసే పని మొదలైనట్లు అధికారులు తెరలిపారు. 300 జిల్లాల్లో పథకం ప్రభావాన్ని అంచనా వేసి ఆగస్టు 15లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దీంతోమ జిల్లాల్లో పర్యటించి ఓ నివేదికను రూపొందించే పనిలో ప్రణాళికా సంఘం, భారత విశిష్ట గుర్తింపు సంఖ్య సంస్థ అధికారులు ఉన్నారని తెలిపాయి. -
సిలిండర్‌పై వడ్డింపు వాయిదా!
సాక్షి, మంచిర్యాల : ‘బండ’ బాదుడుకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. గృహ సిలిండర్ ఒక్కో దానిపై రూ.5 చొప్పున పెంచాలనే ఆలోచనను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు మౌఖిక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.17,13,500 భారం తప్పినట్లయింది. కేంద్ర ప్రభుత్వం గద్దెనెక్కి నెల కూడా గడవకముందే పెద్ద ఎత్తున రైలు చార్జీలు పెంచడంతో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థితిగతుల రీత్యా కఠిన నిర్ణయాలకు సిద్ధంగా ఉండాలని పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ ప్రజలను కోరారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే దాదాపు 14 శాతానికిగా ైరె ల్వే చార్జీలను పెంచారు. దీనిపై రాజకీయ పార్టీలతోపాటు ప్రజల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇదే సమయంలో గ్యాస్ సిలిండర్ తోపాటు పెట్రోలు, డీజిల్ ధరల పెంపు ఉంటుందనే అభిప్రాయాలు వినిపించాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతోపాటు ఢిల్లీలోనూ త్వరలో ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్న ప్రభుత్వం రెండు మూడు నెలలపాటు పెంపును వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కారణాలు ఏవైనప్పటికీ ఈ నిర్ణయం ఉపశమన నాన్ని కలిగిస్తుందని గ్యాస్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నమోదిత వంటగ్యాస్ వినియోగదారులు 3,42,700 మంది ఉన్నారు. సిలిండర్‌పై రూ.5 చొప్పున పెంచి వసూలు చేస్తే నెలకు రూ.17,13,500 భారం సదరు లబ్ధిదారులపై పడేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ భారం తప్పినట్లయింది. -
నిరుపేద బతుకుల్లో నిప్పులు
పి.గన్నవరం :రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమజీవులు వారు. కూలీనాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు, చెమటోడ్చి సమకూర్చుకున్న సామాన్లు కళ్లెదుటే కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. ప్రాణాలు దక్కితే చాలనుకుని కట్టుబట్టలతో పరుగులు తీశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. పి.గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఉన్న పప్పులవారి పాలెం కాలనీలో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు డాబాలు సహా 14 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఒక తాటాకిల్లు పాక్షికంగా దగ్ధం కాగా, సుమారు రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. 26 కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, ఓ యువకుడు గాయపడ్డాడు. ఓ పాడి గేదె కూడా తీవ్రంగా గాయపడింది. వివరాలిలా ఉన్నాయి. పప్పులవారి కాలనీలో సుమారు 100 ఇళ్లు ఉన్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో పప్పుల శ్రీనివాసరావుకు చెందిన తాటాకింట్లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న గడ్డిమేట అంటుకోవడం, అదే సమయంలో బలంగా గాలులు వీయడంతో నిప్పురవ్వలు సమీపంలోని తాటాకిళ్లపై ఎగిరిపడడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయి. ఒకవైపు విపరీతమైన మంటలు, మరోవైపు దట్టమైన పొగలు వ్యాపించడంతో బాధితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలరచేత పట్టుకుని పిల్లాపాపలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఉధృతమయ్యాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ సామగ్రి, బంగారు, వెండి వస్తువులు, నగదు, బైక్, సైకిళ్లు బూడిదయ్యాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా దగ్ధమయ్యాయి. పప్పుల రామారావుకు చెందిన 8 వేల కొబ్బరికాయల రాశి కాలిపోయింది. కొబ్బరికాయలు పేలుతూ ఎగిరిపడ్డాయి. ప్రమాదంలో చిక్కుకున్న పాడిగేదెను రక్షించబోయిన పప్పుల ధర్మారావు అనే యువకుడు గాయపడగా, అతడిని చికిత్స కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పప్పుల శ్రీని వాస్కు చెందిన పాడిగేదె తీవ్రంగా కాలిపోయింది. బాధితుల ఆక్రందన కష్టార్జితం కళ్లెదుటే కాలి బూడిద కావడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండా పోయింది. సర్వం తుడిచిపెట్టుకుపోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొత్తపేట, అమలాపురం అగ్నిమాపకాధికారులు ఎన్.వెంకట్రావు, ఎండీ ఇబ్రహీం ఆధ్వర్యంలో సిబ్బంది స్థానికుల సహకారంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో అగ్నిమాపక శకటాలు రావడంతో నష్టం తగ్గిందని గ్రామస్తులు పేర్కొన్నారు. బాధితులకు గ్రామస్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. తహశీల్దార్ ఎల్.జోసెఫ్, ఆర్ఐ బొరుసు లక్ష్మణరావు, ఎస్సై జి.హరీష్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. తక్షణ సాయంగా 10 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ వంతున అందిస్తామన్నారు. పూర్తిగా కాలిన ఇంటికి రూ.5 వేలు, పాక్షికంగా కాలిన ఇంటికి రూ.4 వేల వంతున పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబాలను వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, నాయకులు దాసరి కాశి, కొక్కిరి రవికుమార్, తోలేటి బంగారునాయుడు, మర్రి శ్రీను, నేతల నాగరాజు, టీడీపీ నాయకులు సంసాని పెద్దిరాజు తదితరులు పరామర్శించారు. -
భారీ పేలుడు.. ఒకరి మృతి
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలిన సిలిండర్లు సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఆటోకు అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాచిగూడలోని సంజయ్‌గాంధీనగర్ బస్తీలో మూసీ నది ఒడ్డున కొన్నేళ్ల నుంచి అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారు. సబ్సిడీ ధరపై సరఫరా అయ్యే ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్లను ఇక్కడికి అక్రమంగా తరలించి.. ఇక్కడ చిన్న సిలిండర్లలో, ప్యాసింజర్ ఆటోల్లో నింపుతుంటారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 8 గంటలకు పెద్ద సిలిండర్లోని గ్యాస్‌ను చిన్న సిలిండర్‌లోకి రీఫిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దాంతో అక్కడే ఉన్న నరేందర్(19) అలియాస్ నాని అక్కడికక్కడే చనిపోయాడు. నల్లగొండ జిల్లా మన్సాన్పల్లికి చెందిన నరేందర్ నింబోలిఅడ్డలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిలో తుయుష్ (30)ను కిమ్స్ ఆసుపత్రికి, అజీజ్ (20)ను షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. ఎన్.నరేందర్(30), టైలర్ శంకర్(40), శివం(20), కిరణ్(19)లు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహమ్మద్ ఖాదిర్(17), మొహమ్మద్ రహీమ్(10)లు స్థానిక వుడ్లాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు సందర్శించారు. కిషన్‌రెడ్డి వెళ్లిన కాసేపటికే.. సిలిండర్ల నుంచి గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేస్తుండగా మొదట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్దసంఖ్యలో స్థానికులతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చారు. మంటలను అదుపు చేస్తుండగానే కిషన్‌రెడ్డి ఘటనాస్థలం నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కొన్ని సెకన్లకే గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో ప్రమాద స్థలానికి వచ్చిన విద్యార్థి నరేందర్ శకలాలు తగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కేసీఆర్ దిగ్భ్రాంతి కాచిగూడలోని అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుడుపై ముఖ్యమంత్రి కేచంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సంఘటనాస్థలానికి వెళ్లి, బాధితులకు సహాయ సహకారాలను అందజేయాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. పేలుళ్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
సిలిండర్ గోడౌన్ లో అగ్నిప్రమాదం:ఒకరు మృతి
హైదరాబాద్:కాచిగూడలోని నింబోలి అడ్డాలో ఉన్న సిలిండర్ గోడౌన్ లోశనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ గోడౌన్ లో ఆకస్మికంగా మంటలు ఏర్పడటంతో ఆస్తి నష్టం కూడా భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి తెలుసుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సంఘటనా స్థల పరిశీలనకు వెళ్లిగా ఆయనకు తృటిలో ముప్పు తప్పింది. కిషన్ రెడ్డి ముందే ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
బతుకులు ఛిద్రం వెయ్యి గుడిసెలు బుగ్గి
ఎనిమిది మందికి గాయాలు - వసంత్‌కుంజ్ మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం - నిరాశ్రయులైన కాలనీ వాసులు - మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది - బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం వసంత్‌కుంజ్‌లోని మసూద్‌పూర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడి మురికివాడ కాలి బూడిదయింది. ఘటనాస్థలాన్ని సందర్శించిన ఎల్జీ నజీబ్‌జంగ్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. సాక్షి, న్యూఢిల్లీ: క్షణాల్లో అంటుకున్న అగ్గి వందలాది మంది పేదల బతుకులను బుగ్గిపాలు చేసింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగ కున్నా నిలువ నీడ, దస్తులు, వంట సామగ్రి మాడిమసయింది. ఎనిమిది మంది గాయపడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతం మసూద్‌పూర్ జుగ్గీజోపిడీలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో వెయ్యి గుడిసెలు దగ్ధమయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారం వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఉదయం 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు తేరుకుని మంటలార్పేందుకు యత్నించే లోపే అవి పూర్తిగా చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి. జుగ్గీజోపిడీలకు సమీపంలోనే ఉన్న ఖాళీ స్థలంలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, చెక్కలు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. మంటలు వీటికి అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బస్తీవాసులంతా పరుగుతు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం 35 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని నిమిషాల్లోనే దాదాపు వెయ్యి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం వేళలో ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహానీ జరగలేదు. రాత్రి వేళల్లో మంటలు అంటుకుంటే ప్రాణ నష్టం తీవ్రస్థాయిలో ఉండేదని స్థానికులు అన్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించినట్టు ఢిల్లీ అగ్నిమాపక కేంద్రం డెరైక్టర్ ఏకే శర్మ తెలిపారు. ‘మాకు సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాం. మొత్తం 35 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిం చాం. ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. కానీ ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి’ అని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలేంటో ఇంకా నిర్ధారణకు రాలేదని శర్మ తెలిపారు. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపిం చాయి. దీంతో గందరగోళం నెలకొంది. ప్రాణాలు రక్షించేందుకు గుడిసెల వాసులంతా పరుగులు తీశారు. అదే సమయంలో మంటల కారణంగా జుగ్గీల్లోని కొన్ని చిన్న గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత పెరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యు=లు తెలిపారు. గుడిసెలన్నీదగ్ధం కావడంతో తామంతా రోడ్డు పడ్డా మంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని బాధితులు అర్థిస్తున్నారు. ఘటనాస్థలాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సందర్శించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బంగాలీ మార్కెట్లో మరో అగ్ని ప్రమాదం : వసంత్‌కుంజ్ బస్తీతోపాటు శుక్రవారం నగరంలో మరోచోట అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో బెంగా లీ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొదట ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఇవి పక్కన ఉండే మరో మూడు దుకాణాలకు వ్యాపించాయి. రెండు దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధం అయినట్టు దుకాణ యజ మానులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అందజేసినట్టు వారు చెప్పారు. మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలోనూ.. సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి క్యాంటీన్లోనూ శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం రెండింటికి ఈ ఘటన జరగడంతో నాలుగు అగ్నిమాపకశకటాలతో మంటలను ఆర్పేశారు. ఘటన కు గల కారణాలు తెలియలేదని ఒక అధికారి వివరించారు. -
గ్యాస్ సరఫరాలో చేతివాటం
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో డెలివరీ బోయిస్ చేతివాటం పెరిగిపోయిందని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ. 40 అదనంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారు. కాస్త అమాయకంగా కనిపిస్తే వంద రూపాయలకు పైనే గుంజుతున్నారు. వినియోగదారుల నుంచి వసూలుచేసే అదనపు సొమ్మును ఏజెన్సీ నిర్వాహకులకు అందజేస్తున్నట్టు సమాచారం. నగరంలోని కృష్ణలంక, విద్యాధరపురం, వన్‌టౌన్, టుటౌన్, పటమట ప్రాంతాలకు చెందినవారే కాకుండా మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, ఉయ్యూరుల్లో వినియోగదారులు ‘సాక్షి’ కార్యాలయాలకు ఫోన్లు చేసి తమ గోడు వినిపించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి... మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో డెలివరీ పాయింట్లలో కూడా ఇదే విధంగా దోపిడీ జరుగుతున్నట్లు ‘న్యూస్‌లైన్’ దృష్టికి వచ్చింది. ఒకసారి వచ్చిన సిలిండర్ వెనక్కి వెళ్లిపోతే తిరిగి నెలరోజుల వరకు రాదనే భయంతో ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు బుకింగ్ చేసిన తరువాత సిలిండర్ తీసుకోకపోతే ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గిపోతుందని గ్యాస్ డెలివరీ బోయిస్ భయపెట్టడంతో ఇక చేసేది లేక తీసుకుంటున్నారు. -
తప్పిన తిప్పలు
మహానగర సిటీజనులకు శుభవార్త. సోమవారం నుంచి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల వంటగ్యాస్ గృహ వినియోగదారులకు సబ్సిడీ ధరపైనే సిలిండర్ సరఫరా కానుంది. వంటగ్యాస్‌కు నగదు బదిలీ పథకం రద్దు కావడంతో.. నాన్ సబ్సిడీపై సిలిండర్ కొనుగోలు చేసే బాధ తప్పినట్లయింది. గృహ వినియోగదారులందరికీ పాత పద్ధతిలోనే సబ్సిడీ ధరకే వంటగ్యాస్ సిలిండర్లను అందించాలంటూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి వంటగ్యాస్ డీలర్లకు ఆదేశాలు అందడంతో సోమవారం నుంచి సబ్సిడీ ధర (ప్రస్తుతం రూ. 441) పైనే సిలిండర్ల సరఫరా అమలు కానుంది. వాస్తవంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటనకు ముందే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసింది. అయితే నగదు బదిలీ విధానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను తిరిగి పాత పద్ధతిలో మార్పు చేసి సబ్సిడీ ధర బిల్లింగ్‌తో సిలిండర్లను సరఫరా చేసేందుకు కాస్త సమయం పట్టింది. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలైన ఇండేన్, భారత్, హెచ్‌పీ సాఫ్ట్వేర్ల మార్పు పక్రియ దాదాపు పూర్తవడంతో 10వ తేదీ నుంచి పాత విధానంలో సబ్సిడీ ధరపై బిల్లింగ్ చేసి నేరుగా వినియోగదారులకు సిలిండర్లు అందించాలని డీలర్లకు ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో సోమవారం నుంచి పాతపద్ధతిలో బిల్లింగ్ ప్రక్రియ పునఃప్రారంభం కానుంది. వంటగ్యాస్‌కు విముక్తి డీబీటీ అమలుతో డొమెస్టిక్ వినియోగదారులకు తిప్పలు తప్పలేదు. సిలిం డర్ ధర సైతం నిలకడగా లేకుండా పై పైకి ఏగబాకింది. ఎల్పీజీ కనె క్షన్లను ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము పడకపోవడం తదితర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు వంటగ్యాస్‌కు సబ్సిడీ నగదు బదిలీ నుంచి విముక్తి లభించింది. -
తప్పిన గండం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మంగళవారం నుంచి తలపెట్టనున్న నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. సిలిండర్ ధర అంతటా ఒకే విధంగా ఉండాలని, డిస్ట్రిబ్యూటర్‌షిప్ అగ్రిమెంట్లను సమీక్షించాలని, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్‌పై వేస్తున్న ప్లాస్టిక్ సీలుకు బదులుగా పకడ్బందీ సీలును అమర్చాలని.... తదితర డిమాండ్లతో డిస్ట్రిబ్యూటర్లు సమ్మె చేయదలిచారు.. మార్కెట్లో రెండు, మూడు, ఐదు కిలోల సిలిండర్లు విచ్చలవిడిగా చలామణిలో ఉన్నాయని, ఇవన్నీ అక్రమమైనవే కాకుండా అత్యంత ప్రమాదకరమైనవని ఆలిండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సమాఖ్య కర్ణాటక సర్కిల్ కార్యదర్శి ఎన్. సత్యన్ ఆరోపించారు. సిలిండర్లపై ప్రస్తుతం వేస్తున్న ప్లాస్టిక్ సీళ్లను లాఘవంగా తొలగించి గ్యాస్‌ను దొంగిలించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రస్తుతం సబ్సిడీ కింద ఇస్తున్న 14.2 కిలోల సిలిండర్ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటోందని తెలిపారు. అలా కాకుండా ఒకే ధరను నిర్ణయించాలన్నారు. వీటికి తోడు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ 2,700 మంది రెగ్యులర్ డీలర్లను, రాజీవ్ గాంధీ గ్రామీణ ఎల్పీజీ వితరణ యోజన కింద మరో 1,500 మంది డీలర్లను నియమించాల్సిందిగా చమురు కంపెనీలను ఆదేశించిందని వెల్లడించారు. ఇదే కనుక అమలైతే ప్రస్తుత డీలర్లందరూ నష్టపోతారని వివరించారు. కాగా సమ్మెను విరమింపజేయడానికి సమాఖ్య ప్రతినిధులతో అధికారులు సోమవారం రాత్రి కూడా చర్చలు జరిపారు. డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తామని హామీ ఇవ్వడంతో డీలర్లు సమ్మె యోచనను విరమించుకున్నారు. -
సబ్సిడీ సిలిండర్లకు ఆధార్ లింక్ తొలగింపు
-
''ఏడాదికి ఆరు సిలెండర్లు చాలు''
-
‘గ్రేటర్’పై ఏటా బండ భారం రూ.102 కోట్లు
=సిలిండర్‌పై అదనపు చార్జీ రూ. 66.50 =షాకిచ్చిన చమురు సంస్థలు సాక్షి, సిటీబ్యూరో: నూతన సంవత్సరం వంటిం టికీ మోయలేని భారాన్ని మోసుకొచ్చింది. చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధరను ఒకేసారి రూ.215లు పెంచి షాకిచ్చాయి. పెరిగిన ధరతో గ్యాస్ బండ ధర రూ.1327.50 లకు చేరింది. ప్రత్య క్ష ప్రయోజన బదిలీ (నగదు బదిలీ) పథకం ప్రారంభించిన నాటి నుంచి ఎల్పీజీ మార్కెట్ ధరను పరిశీలిస్తే ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటి సారి. అప్పట్లో మార్కెట్లో సిలిండర్ ధర రూ. 965లు ఉండగా గత ఆరు మాసాల్లోనే అదనంగా రూ. 362.50 వరకు పెరిగింది. అయితే పెరి గిన ధరను ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తున్నప్పటికీ ట్యాక్సుల రూపేణా బండపై అదనంగా రూ. 66.50 వసూలు చేస్తోంది. ఫలితంగా ‘గ్రేటర్’పై నెలన్నరకు (ఒక సిలిండర్ నెల న్నర వస్తుంది అనుకుంటే) రూ.12.80 కోట్ల భారం.. ఏడాదికి రూ.102.4 కోట్ల వరకు భారం పడుతుంది. బాదుడు ఇలా.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతం వినియోగంలో సుమారు 28.29 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, అందులో కేవలం 19.26 లక్షల కనెక్షన్లు మాత్రమే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమయ్యాయి. నగదు బదిలీ పథకం పరిధి కింద వచ్చిన వారికి తాజాగా పెరిగిన ధరను బట్టి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా రూ.845ల నగదు బ్యాంక్ ఖాతాకు అందిస్తుంది. డీబీటీ అమలు లేని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మాత్రం సిలిండర్ రీఫిల్లింగ్ రూ.416 లకు మాత్రమే లభిస్తోంది. డీబీటీ పథకం వల్ల వచ్చిన సబ్సిడీ సొమ్ము కలుపుకొన్నా నగరవాసులు సిలిండర్‌పై రూ.66.50 అదనంగా భరించక తప్పడం లేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై అందించిన సబ్సిడీ రూ.25 లకు ఎగనామం పెట్టడమే కాకుండా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో 41.50లను ముక్కుపిండి వసూలు చేస్తోంది. మార్కెట్‌ధర మరింత భారం హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలో వంటగ్యాస్‌కు డీబీటీ వర్తించని వినియోగదారులపై మార్కెట్ ధరతో నెలన్నరకు రూ.82.30 కోట్ల చొప్పున భారం పడనుంది. ఈ లెక్కనా ఏడాదికి 658.4కోట్ల భారం భరించాల్సి ఉంటు ంది. ఆధార్, బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి దూరం గా సుమారు 9.03 లక్షల మంది వినియోగదారులు ప్రస్తుత మార్కెట్ ధర చెల్లించి వంటగ్యాస్‌ను కొనుగోలు చేయక తప్పదు. మిగతా జిల్లాల్లో డీబీటీ అమలు లేకుంటే సిలిండర్ రీఫిల్లింగ్ రూ.416లకు లభిస్తోంది. ఇక్కడ మాత్రం బహిరంగ మార్కెట్ ధర ప్రకారం రూ.1327.50 పైసలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. డీబీటీ వర్తించని కారణంగా కేంద్రప్రభుత్వం అందించే రూ. 845ల సబ్సిడీ సొమ్ము, రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టిన సబ్సిడీ, వ్యాట్ పన్నులు రూ.66.50 కలుపుకొని మొత్తం రూ. 911.50 అదనంగా భరించక తప్పడం లేదు. -
గుది‘బండ’
వరంగల్, న్యూస్‌లైన్ వంట గ్యాస్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చారుు. చమురు సంస్థలు ఒక్కసారిగా తమ ప్రతాపం చూపించారుు. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ.66.50 వడ్డించారుు. ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీ) ప్రారంభమైనప్పటి నుంచి మధ్యలో ఒకటి, రెండు నెలలు తప్ప... ప్రతి నెలా సిలిండర్ ధర పెరుగుతూనే ఉంది. డీబీటీ అమలు ప్రారంభంలో రూ.854.50 ఉన్న సిలిండర్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ.1104.50కు పెరిగింది. తగ్గినట్టే తగ్గిన వంట గ్యాస్ ధర.. ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఆధార్ గజిబిజి ఆధార్ అనుసంధానం నేపథ్యంలో గ్యాస్ ధర గజిబిజిగా మారింది. ఆధార్‌తో లింక్ చేసుకున్నవారి ఖాతాలో ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీ రూ.21.50 జమచేయకపోవడం... ఆధార్‌తో లింక్ కానివారికి అవి జమ అవుతుండడంతో ధరల్లో వ్యత్యాసం నెలకొంది. ఆధార్ అనుసంధామైన వారికి ఒక్కో సిలిండర్‌కు రూ. 88 చొప్పున ... ఆధార్ అనుసంధానం కాని వారికి రూ.66.50 భారం పడుతోంది. ఆధార్ అనుసంధానమైతే... జిల్లాలో మొత్తం 5,48,997 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా... ఆధార్‌తో అనుసంధానమైన వారు 3,10,660 మంది ఉన్నా రు. ఈ లెక్కన ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలు తాజాగా వడ్డించిన మొత్తం రూ. 2,06,58,890. ప్రభుత్వం ఎగ్గొడుతున్న సబ్సి డీ సుమారు రూ.66,79,190. అంటే అదనపు భారం పడుతున్న మొత్తం రూ.2,73,38,080. ఆధార్ అనుసంధానం కాని వారికి... ఆధార్‌తో లింక్ లేని వారికి ఒక్కో సిలిండర్‌పై ప్రభుత్వం తాజాగా పెంచిన రూ.66.50 మాత్రమే పడుతోంది. ఈ లెక్కన 2,38,337 మందిపై రూ.1,58,49,410.50 భారం పడుతున్నట్లు అంచనా. తాజాలెక్కల ప్రకారం... పెరిగిన ధర ప్రకారం ఒక్కో సిలిండర్‌కు రూ.1104.50 పలుకుతోంది. ఆధార్ ఉన్న వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ.603 జమచేస్తోంది. మిగిలిన రూ.501.50లను వినియోగదారుడు చెల్లిస్తున్నాడు. అదే.. ఆధార్ లేని వ్యక్తి రూ.482 మాత్రమే చెల్లిస్తున్నారు. నెలలవారీగా.... సెప్టెంబర్ : ఈ నెలలో ఒక్క సిలిండర్ ధర రూ. 1,000కి చేరింది. వినియోగదారుడి ఖాతాలో ప్రభుత్వం రూ. 587 జమ చేయూల్సి ఉండగా... రూ. 534.50 మాత్రమే చేసింది. లెక్కప్రకారం వినియోగదారుడు సిలిండర్‌కు రూ.413.50 చెల్లించాలి. కానీ.. సర్కారు జమచేయకుండా ఉన్న రూ.52.50లతో కలుపుకుని మొత్తం రూ.466లను గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుడి నుంచి వసూలు చేశారుు. అక్టోబర్ : సిలిండర్ ధర కాస్తా రూ.1,090 చేరింది. ఈ లెక్క న ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో రూ.676.5 జమచే యూలి. కానీ రూ.603 మాత్రమే జమచేసింది. ఈ మేరకు ఒక్కోసిలిండర్‌పై వినియోగదారుడికి 73.5భారం పడిం ది. నవంబర్ : ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ.52 తగ్గగా... ధర రూ.1,038కు చేరింది. ఈ లెక్కన ప్రభుత్వం రూ.624.5లను వినియోగదారుడి ఖాతాల్లో జమ చేయూలి. కానీ రూ. 551 మాత్రమే జమ చేసింది. ఈ మేరకు ఒక్కో సిలిండర్‌పై రూ.73.5 మేర భారం పడింది. -
పీజీ కాలేజీ హాస్టల్లో అగ్నిప్రమాదం
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : శాతవాహన అనుబంధ పీజీ కళాశాల వసతి గృహంలో బుధవారం గ్యాస్ పైప్ లీకై మంటలు చెలరేగాయి. అసిస్టెంట్ కుక్ ఇ.సంతోష్ గాయపడ్డాడు. విద్యార్థులకు ప్రతీ బుధవారం మధ్యాహ్నం చపాతీ చేసి ఇస్తారు. ఇందులో భాగంగా చపాతీ చేస్తుండగా సిలిండర్ పైప్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చపాతీల కోసం అక్కడ క్యూలో నిల్చున్న విద్యార్థులు భయపడి పరుగులు పెట్టారు. అసిస్టెంట్ కుక్ చాకచాక్యంగా సిలిండర్ ఆఫ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఆయన గాయపడ్డాడు. కార్మికులు వర్సిటీ పీజీకాలేజీ ప్రిన్సి పాల్ నమ్రత, అధికారులకు సమాచారం అందించడంతో వారు సంతోష్‌ను ఆస్పత్రికి తరలించారు. కార్మికుల ధర్నా.. తమ బాగోగులను అధికారులు పట్టించుకోవడం లేదని కార్మికులు ధర్నాకు దిగారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో బీమా కల్పించాలని కోరినా ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టం ప్రకారం రూ.6,700 చెల్లించాల్సి ఉన్నా ఇవ్వడం లేదని, వెంటనే జీతాలు పెంచాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పని చేసే ప్రాంతంలో మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని, నెలకోసారి రెగ్యులేటర్ మార్చాలని డిమాండ్ చేశారు. వీటిని అంగీకరించని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపారు. ధర్నాలో ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి.శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిలువు దోపిడీ
‘సార్.. గ్యాస్.. ఆ.. వస్తున్నా.. ఇదిగో సార్ బిల్లు.. ఇదిగో బాబూ డబ్బు.. ఇంకో 40 రూపాయలివ్వండి సార్.. అదేంటయ్యా.. బిల్లు 408 రూపాయలే కదా.. 450 ఇవ్వమంటున్నావ్.. అదేంది సార్.. కొత్తగా మాట్లాడుతున్నారు.. ఇది ‘మామూలే’ సార్’.. ఇది ప్రతిరోజూ గ్యాస్బాయ్కు.. వినియోగదారుడికి మధ్య జరిగే సంభాషణ. సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్‌బాయ్ సిలిండర్ ఇంటికి తెచ్చాక బిల్లుకంటే అదనంగా డబ్బు ఇవ్వాల్సిందే. అలా ఇవ్వకపోతే సిలిండర్ ఇవ్వకుండా వెనక్కు తీసుకెళ్తారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు దోపిడీకి తెగబడ్డారు. సిలిండర్ ధర రూ.408 ఉండగా అదనంగా ఏజన్సీల వారు రూ.2 వసూలు చేస్తుండగా ఇంటి వద్దకు సిలిండ ర్ తీసుకొచ్చిన బాయ్‌లు రూ.450 వసూలు చేస్తున్నారు. ప్రొద్దుటూరులో అయితే 25 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తుంటే, కడపలో మరీ దారుణంగా సిలిండర్‌పై రూ. 40 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని అనిల్గ్యాస్ ఏజన్సీ పరిధిలో 20,114 మంది వినియోగదారులు, బాలాజీ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 49,406 మంది, ఈశ్వర్ఇండేన్ గ్యాస్ ఏజన్సీ పరిధిలో 35,002 మంది వినియోగదారులు ఉన్నారు. ఈ ఏజెన్సీల పరిధిలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, దువ్వూరు, ఎర్రగుంట్ల, రాజుపాళెం గ్రామాల్లోని లబ్ధిదారులే కాకుండా పులివెందుల మండలంలోని పలు గ్రామాల వినియోగదారులు కూడా ఉన్నారు. వీరిలో దాదాపు 70 శాతానికి పైగా డోర్ డెలివరీ వినియోగదారులే ఉన్నారు. ఈ విధంగా ఒక్కో నెలకు గ్యాస్ సిలిండర్లపై అదనంగా వసూలు చేసే మొత్తం రూ.లక్షల్లోనే ఉంది. ఇంత దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో చలనం లేదు. గ్యాస్ ఏజెన్సీల దోపిడీ గురించి ఎవరైనా వినియోగదారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా తనిఖీ చేసి, హెచ్చరికలు జారీ చేయడంతో తమ పని అయిపోయిందనిపించుకుంటున్నారు. బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా...? గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ డెలివరీ చేసే బాయ్‌లకు జీతాలు చెల్లిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే ఒక్కో వినియోగదారుని నుంచి వసూలు చేసే డబ్బుతో ఒక్కో బాయ్‌కి వేలాది రూపాయలు ప్రతి నెలా మిగులుతుందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఒక వేళ బాయ్‌లకు ప్రతి నెలా జీతాలు చెల్లిస్తుంటే వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్న బాయ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ దోపిడీ వెనుక గ్యాస్ ఏజె న్సీ నిర్వాహకులు, గ్యాస్బాయ్లు ఇద్దరి ప్రమేయం ఉన్నట్లయితే అధికారులేం చేస్తున్నారనే విషయం తేలాలి. ఒక్క ప్రొద్దుటూరు పట్టణంలోని మూడు ఏజెన్సీలకు సంబంధించి ఉన్న లక్ష గ్యాస్కనెక్షన్లలో 75 శాతం డోర్ డెలెవరి లెక్కకడితే వసూలు చేసే డబ్బు దాదాపు రూ.20లక్షలుగా తేలుతోంది. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలు అక్రమంగా ప్రజల నుంచి గ్యాస్ ఏజెన్సీలు రాబడుతున్నాయని స్పష్టమవుతోంది. రెవెన్యూ అధికారులకు తెలియదా..? ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ వినియోగదారుల నుంచి డబ్బును గ్యాస్ ఏజెన్సీలు వసూలు చేస్తున్న విషయం రెవెన్యూ అధికారులకు తెలియదా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులతో రెవెన్యూ అధికారులకు సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల జాయింట్ కలెక్టర్ నిర్మల స్వయంగా వచ్చి గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి ప్రజల బాధలను తెలుసుకున్నా ఫలితం శూన్యం. తహశీల్దార్ ఏమంటున్నారంటే గ్యాస్ బాయ్‌లు చేస్తున్న దోపిడీపై ప్రొద్దుటూరు తహశీల్దార్ పుల్లారెడ్డి మాట్లాడుతూ డెలివరీ బాయ్‌లు అంతడబ్బు వసూలు చేయకూడదు. విచారణ చేస్తాం. అన్నారు. -
ఎంజీఎంలో ఆక్సీజన్ దందారూ35.29 లక్షలు స్వాహా
= రూ. 2 కోట్ల దోపిడీకి అదనం =సిలిండర్ల అద్దె పేరిట మోసం =ఆలస్యంగా తేరుకున్న అధికారులు రోగుల ప్రాణాలు కాపాడే ఆక్సీజన్...ఎంజీఎం ఆస్పత్రిని పీల్చి పిప్పి చేస్తోంది. అధిక ధరతో ఆరేళ్లపాటు అడ్డగోలుగా దోచుకున్న సంబంధిత కాంట్రాక్టర్ అద్దె పేరిట మరో మోసానికి ఒడిగట్టాడు. రూ. 2 కోట్లు చాలవన్నట్లు మరో రూ. 35.29 లక్షలను గుటకాయ స్వాహా చేశాడు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉత్తర తెలంగాణలో పెద్దాస్పత్రిగా పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) హాస్పిటల్లో చోటుచేసుకున్న ఆక్సీజన్ సిలిండర్ల దందాలో మరో కోణం వెలుగు చూసింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 230కే ఆక్సీజన్ సిలిండర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్... ఎంజీఎం ఆస్పత్రికి రూ. 385 చొప్పున అంటగట్టిన వైనం ఇప్పటికే బట్టబయలైంది. ఒక్కో సిలిండర్‌పై రూ. 155 చొప్పున సర్కారుకు నష్టం వాటిల్లింది. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ దందాతో రూ. 2 కోట్లకు పైగా పక్కదారి పట్టాయి. కాంట్రాక్టర్... అందరి కళ్లకు గంతలు కట్టి అడ్డగోలుగా దోచుకున్న బాగోతాన్ని ఈ ఏడాది మే నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా మరో నిర్వాకం బయటపడింది. ఆక్సీజన్ సిలిండర్లకు అడ్డగోలు రేటు పెట్టిన ఎంజీఎం పాలనా యంత్రాం గం... అదీ చాలదన్నట్లు రోజుకు రూ. 26 చొప్పున అద్దె కూడా చెల్లించింది. దీంతో ఈ కుంభకోణం విలువ మరింత పెరిగింది. ధ్రువీకరించిన ఎంజీఎం సూపరింటెండెంట్ రేటులో గిమ్మిక్కు చేసి... నిండా ముంచిన ఏజెన్సీకి అద్దె పేరిట మ రో రూ. 35.29 లక్షలు అప్పనంగా చెల్లించినట్లు లెక్కతేలడంతో ఏం చే యాలో పాలుపోక ఎంజీఎం అధికారులు తల పట్టుకుంటున్నారు. అక్రమంగా అద్దె పేరిట బిల్లులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని.. భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లిందని స్వ యానా ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇటీవల సదరు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఆక్సీజన్ కొనుగోలులో భారీ మొత్తమే పక్కదారి పట్టినట్లు మరోసారి రూఢీ అయింది. 2007 నుంచి చెల్లించిన అద్దె రూ. 35,29,344 ఎంజీఎంలో సగటున రోజుకు 70 నుంచి 80 ఆక్సీజన్ సిలిండర్లు అవసరమవుతాయి. 2007 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఆస్పత్రి రికార్డుల ప్రకారం మొత్తం 1,35,744 సిలిండర్లు సరఫరా అయ్యాయి. 2007-08లో 2,794 సిలిండర్లు, 2008-09లో 11,522, 2009-10లో 20,858, 2010-11లో 36,028, 2011-12లో 35,762, 2012-13లో 28,780 సిలిండర్లు కొనుగోలు చేశారు. హన్మకొండకు చెందిన తులసి ఏజెన్సీ వీటిని సరఫరా చేసింది. వీటికి మొత్తంగా రూ. 35,29,344 అద్దె చెల్లించినట్లు ఆస్పత్రి అధికారులు ధ్రువీకరించారు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు ఇప్పుడు రికవరీకి తంటాలు పడుతుండడం గమనార్హం. ఆది నుంచీ వివాదాస్పదమే... ఎంజీఎంలో ఆక్సీజన్ కొనుగోలు ముందు నుంచీ వివాదాస్పదంగానే ఉంది. సర్కారు ఆస్పత్రి కావడంతో రేట్లను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో సదరు కాంట్రాక్టర్ గిమ్మిక్కులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఆరేళ్ల తర్వాత రేట్లలో ఉన్న తేడా బయటపడడంతో మే నెలలో ఎంజీఎం అధికారులు హడావుడిగా ఫైళ్లు కదిపారు. అప్పటి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆస్పత్రిలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రూ. 230కే సిలిండర్లను కొనాలని తీర్మానించారు. మౌఖికంగా రేటును తగ్గించేందుకు అంగీకరించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదని... పాత రేటు ప్రకారమే బిల్లులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధిలోనే సూపరింటెండెంట్ రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సిలిండర్లకు సంబంధించిన పాత బిల్లులు చెల్లించేందుకు లంచం ఇవ్వాలని వేదిస్తున్నాడంటూ సదరు కాంట్రాక్టర్ ఏసీబీకి సమాచారమిచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. దీంతో ఆక్సీజన్ సిలిండర్ల వ్యవహారం తేనెతుట్టెలా తయారైంది. కదిపితే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందనే భయాందోళన ఎంజీఎం అధికారులను వెంటాడుతోంది. 3న తెరవనున్న టెండర్లు ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత మేల్కొన్న అధికారులు ఇటీవల ఆక్సీజన్ సిలిండర్ల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. ఈనెల 13వ తేదీన టెండర్లు తెరువనున్నారు. అరుుతే ఈ సారి ఎంత మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు.. మళ్లీ పాత కాంట్రాక్టర్లే రంగంలోకి దిగుతారా... కొత్త ఏజెన్సీల పేరిట... ఎంజీఎంను తమ గుప్పిట్లోకి తీసుకుంటారా... అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాధనాన్ని కాపాడుతారా.. వేచి చూడాల్సిందే మరి. -
సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: నిండుగా ఉన్న సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ అవడంతో కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సీసీఐ కాలనీకి చెందిన ఆల్ మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్టు యజమాని గోపాలకృష్ణ స్థానిక మాధుర్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గోడౌన్ నుంచి నాలుగురోజుల క్రితం ఓ గ్యాస్ సిలిండర్‌ను తీసుకువచ్చాడు. మూడు రోజులుగా ఇంట్లో వాసన వస్తోందని కుటుంబీకులు పసిగట్టారు. ఏదో జంతు కళేబరం అయి ఉండొచ్చని భావించి మిన్నకుండిపోయారు. బుధవారం వరండాలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను పరీక్షించగా సిలిండర్ మధ్య భాగంలోని అతుకు వద్ద నుంచి గ్యాస్ లీకైతున్నట్లు గుర్తించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురై సిలిండర్‌ను ఇంటికి దూరంగా పడేవారు. కాగా గతంలో కూడా సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైందని స్థానికులు తెలిపారు. సిలిండర్ లీకేజీని గుర్తించకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదని గోపాలకృష్ణ కుటుంబీకులు గ్యాస్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ.72 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసుకోని వారికంటే అనుసంధా నం చేసుకున్న వినియోగదారులు సిలిండర్‌ను ఎక్కువ ధరకు విడిపించుకోవాల్సి వస్తోంది. ఇది చాలదన్న ట్లు సడీచప్పుడు లేకుండా ఎడాపెడా ధరలు పెంచేస్తున్నారు. తాజాగా వినియోగదారులకు తెలియకుండానే సిలిండర్ ధరను రూ.72 పెంచేశారు. నిన్నటి వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.998 ఉండగా, బుధవారం నుంచి అమాంతం రూ.1070కి పెంచారు. ఇంతకుముందు చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచుతున్నట్లు ముందుగానే ప్రకటించేవి. ఇప్పుడు అలా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. నగదు బదిలీ పథకం జిల్లాలో అమలవుతుండటం వల్ల గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరినప్పుడే ధర పెరిగిన విషయం వినియోగదారులకు తెలుస్తోంది. దీనివలన సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ వస్తుందని రూ.1000 సిద్ధంగా ఉంచుకున్న వినియోగదారులు.. తీరా ధర పెరగడంతో అదనపు సొమ్ము కోసం చుట్టుపక్కల ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరోవైపు ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసే కొందరు సిబ్బంది సిలిండర్ మరో రూ.20 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఈ నెలలో దసరా మామూళ్లు అంటూ రూ.50 నుంచి రూ.100 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కలుపుకొని సిలిండర్ విడిపించాలంటే రూ.1150 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే సమైక్య ఉద్యమంలో ఉన్న ఉద్యోగులు రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రభావం మిగిలిన రంగాలపైనా పడి ఆర్థికంగా అవస్థలు పడుతుండగా, గ్యాస్ ధర పెరుగుదల అన్ని వర్గాల వారికి మరింత భారమైంది. ఇదిలా ఉంటే పెరిగిన గ్యాస్ ధరల వలన ఆధార్ కార్డును అనుసంధానం చేయించుకున్న వినియోగదారులే తీవ్రంగా నష్టపోతున్నారు. వీరు రూ.1070 వెచ్చించి గ్యాస్‌ను విడిపించుకుంటే సబ్సిడీగా బ్యాంకులో రూ.435 మాత్రమే జమ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మాత్రం తొలిసారి రూ.435 జమ అవుతుందని, రెండోసారి నుంచి రూ.535 చొప్పున ఖాతాకు జమ అవుతాయని చెబుతున్నారు. ఇది వాస్తవమో కాదో తెలియడం లేదు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఈ మొత్తం జమ కాలేదు. ఒకవేళ ఏజన్సీ ప్రతినిధులు చెబుతున్నట్లుగా రూ.535 బ్యాంకు ఖాతాకు జమ అయినా వినియోగదారులు రూ.1070 చెల్లిస్తున్నందున సిలిండర్‌ను రూ.535కు కొనుగోలు చేస్తున్నట్లు అవుతుంది. అనుసంధానం చేయించుకోని వినియోగదారులకు మాత్రం రూ.411కే సిలిండర్ సరఫరా చేస్తున్నారు. దీంతో అనుసంధానం చేయించుకున్న వినియోగదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కాగా, ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులు ఈ నెల వరకే లబ్ధి పొందుతారని, ఆ తర్వాత వారికి కూడా గ్యాస్ సంస్థలు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తామని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఏదైనా మూడు నెలలకు పైగా గ్యాస్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులు లబ్ధి పొందినట్లు అవుతుందని, తాము ముందుగా అనుసంధానం చేయించుకోవడం ద్వారా కోరి కష్టాలు తెచ్చుకున్నామని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.70కి పైగా పెరిగిన సబ్బిడీయేతర వంటగ్యస్ ధర
-
వంటగ్యాస్‌కు తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఐదు రోజుల కిందట రీఫిల్లింగ్ సిలిండర్ కోసం ఆన్లైన్ ద్వారా బుక్ చేశా. ఇప్పుడు ఆ బుకింగ్ రద్దు అయినట్లు నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?’’ అంటూ విజయనగర్ కాలనీకి చెందిన రంగారెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని జి.ఎన్.ఎస్.గ్యాస్ ఏజెన్సీ డీలరును శనివారం నిలదీశారు. ‘‘మీ పొరపాటు ఏమీ లేదు. సాంకేతిక లోపంవల్లే బుకింగ్ క్యాన్సిల్ అయింది. తిరిగి బుక్ చేసుకోండి...’’ అని ఆ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. ‘‘నేను చేసిన బుకింగ్ కూడా క్యాన్సిల్ అయినట్లు మెసేజ్ వచ్చింది. డీలర్‌ను అడిగితే మళ్లీ బుక్ చేసుకోమంటున్నారు. ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు ఖాళీ అయ్యాయి. వంట ఎలా చేసుకోవాలో అర్థం కావడంలేదు...’’ అని కాస్ట్లీ హిల్స్‌కు చెందిన హిమబిందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వీరిద్దరే కాదు రాష్ట్ర రాజధానిలో చాలామంది గ్యాస్ వినియోగదారులకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. బుక్ చేసి పక్షం రోజులైనా వంటగ్యాస్ అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఆన్లైన్ ద్వారా వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం బుక్ చేసినా కారణం లేకుండానే ఈ బుకింగ్స్ రద్దవుతున్నాయి. రీఫిల్లింగ్ సిలిండర్ కోసం చేసుకున్న బుకింగ్ రద్దు అయిందంటూ కొందరు వినియోగదారుల సెల్ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు వస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక విచారించేందుకు వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. అయితే ఎందుకు అలా జరుగుతోందో తమకూ తెలియదని, మళ్లీ బుక్ చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీల డీలర్లు సమాధానమిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ అందించేందుకు బాయ్ వెళ్లినప్పుడు వినియోగదారుని ఇంటికి తాళం వేసి ఉంటేనే బుకింగ్ రద్దవుతుందని కొందరు డీలర్లు చెబుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ తమ ఇళ్లకు పంపకుండానే బుకింగ్‌లు రద్దు చేసినట్లు మెసేజ్‌లు వస్తున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇండేన్’లోనే సమస్య... ఇండేన్ కంపెనీకి చెందిన డీలర్లకు గ్యాస్ సరఫరాలో సమస్య ఉంది. దీంతో వినియోగదారులు బుక్ చేసి పక్షం రోజులైనా వారికి గ్యాస్ సిలిండర్ అందడంలేదు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తుండటంతో తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఇండేన్‌కు చెందిన ఒక డీలరు చెప్పారు. ‘‘బుక్ చేసి వారాలు గడుస్తున్నా గ్యాస్ సరఫరా చేయకపోతే వినియోగదారులకు నిజంగా ఇబ్బందే. దీంతో వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మూడు రోజులుగా సిలిండర్ల లోడ్ రాలేదు. మా పరిస్థితి ఏమీ చెప్పలేని విధంగా ఉంది’’ అని అన్నారు. బుకింగ్ క్యాన్సిల్ కాకూడదు... గ్యాస్ బుకింగ్‌లు క్యాన్సిల్ అవుతుండటంపై చెన్నైలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకుమార్‌ను ‘సాక్షి’ టెలిఫోన్లో సంప్రదించగా.... అలా కారణం లేకుండా బుకింగ్స్ క్యాన్సిల్ అవ్వడానికి ఆస్కారం లేదని చెప్పారు. ‘‘ఎవరికైనా ఇలా అకారణంగా బుకింగ్ క్యాన్సిల్ అయితే మాకు సమాచారం ఇస్తే విచారించి అందుకు కారణం తెలియజేస్తాం. ఏదైనా లోపం లేనిదే ఇలా బుకింగ్ రద్దు కావడానికి అవకాశం లేదు’’ అని ఆయన వివరించారు.