విజయనగరం: జిల్లాలోని బోగాపురం మండలం రావడలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయినట్టు తెలుస్తోంది. అయితే గాయపడ్డవారిలో ఏడేళ్ల చిన్నారి ఉన్నట్టు తెలిసింది. వారి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.