సిలిండర్‌పై రూ.2 వడ్డింపు
మళ్లీ పెరిగిన సబ్సిడీ వంటగ్యాస్ ధర
న్యూఢిల్లీ: సబ్సిడీ వంట గ్యాస్(ఎల్‌పీజీ) ధర మళ్లీ పెరిగింది. మంగళవారం నుంచి సిలిండర్‌కు రూ.2 చొప్పున ధర పెరిగింది. ఇప్పటివరకు 14.2 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.428.59 ఉండగా.. తాజా పెంపుతో ధర రూ.430.64కు చేరింది. డీలర్లకు చెల్లించే కమీషన్ పెంపులో భాగంగా అక్టోబర్ 28నే సిలిండర్‌కు రూ.1.5 చొప్పున పెంచారు.
సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర కూడా భారీగా పెరిగింది. సిలిండర్‌కు రూ.37.5 చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దీంతో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.529.50కు చేరినట్లయింది.