![Cylinder Explodes in Bulandshahr](/styles/webp/s3/article_images/2024/10/22/bulandshahar.jpg.webp?itok=zen1p2XU)
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.
ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్‌కమ్ హోటల్‌లోని సర్వీస్ కిచెన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్‌లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్‌లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment