ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు! | UP Doctor Son Kidnapped Killed By Ex Employees Sacked Past | Sakshi
Sakshi News home page

రెండేళ్లు పగతో రగిలిపోయారు.. డాక్టర్‌ మీద పగతో పాపం ఆ పసివాడిని కబళించారు

Published Mon, Jan 31 2022 1:54 PM | Last Updated on Mon, Jan 31 2022 2:07 PM

UP Doctor Son Kidnapped Killed By Ex Employees Sacked Past - Sakshi

పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్‌ కిడ్నాప్‌-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. 

లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్‌, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్‌ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. 

శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్‌ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తం‍డ్రి.. ఛట్టారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు.   

పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్‌ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్‌ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement