Bulandshahr
-
సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సికిందరాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. భారీ పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలోనివారంతా ఉలిక్కిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల నుంచి ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని స్థానికులు అంటున్నారు.ఈ ఘటనకు ముందు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కూడా సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వెల్కమ్ హోటల్లోని సర్వీస్ కిచెన్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. హోటల్లోని నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇదే తరహాలో యూపీలోని ఘజియాబాద్‌లోని తిలా మోడ్ ప్రాంతంలో గల న్యూ డిఫెన్స్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది కూడా చదవండి: మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికార్పూర్-బులంద్‌షహర్ రోడ్డులో పికప్ వ్యాన్, ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు. మృతులంతా అలీఘర్ జిల్లాలోని అత్రౌలీ తహసీల్‌లోని రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందినవారు. గాయపడినవారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌పూర్ ఖాస్ అహిర్ నాగ్లా గ్రామానికి చెందిన 40 మంది పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి అలీగఢ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు బులంద్‌షహర్ రోడ్డులో ఉన్న ఒక ఫుడ్ కంపెనీలో పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం వీరంతా పికప్ వ్యాన్‌లో ఘజియాబాద్ నుంచి తమ ఇళ్లకు బయలుదేరారు. సేలంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు వీరు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ అంబులెన్స్ ఘటనాస్థలికి చేరుకుంది. దానిలోని సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా మెజిస్ట్రేట్ చంద్రప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ శ్లోక్‌కుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గంగానది నుంచి బయటకొచ్చిన భారీ మొసలి.. తర్వాత ఏం జరిగిందంటే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో 10 అడుగుల భారీ మొసలి జనాలను హడలెత్తించింది. కాలువలో నుంచి పొరపాటున బయటకు వచ్చిన మొసలి.. కాసేపు సమీప ప్రాంతంలో సంచరించింది. స్థానికులు కంటపడంతో ఏం చేయాలో తోచక కంగారుపడిపోయింది. అనంతరం అక్కడున్న ఇనుప రెయిలింగ్‌పై నుంచి నీటిలో దూకేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన బులంద్‌షహర్‌లోని నరోరా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.నరోరా ఘాట్ వద్ద గంగానది కాలువలోంచి 10 అడగుల మొసలి ఒక్కసారిగా బయటకు దూసుకొచ్చింది. మొసలి బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే పోలీసులతోపాటు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు మొసలిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అది తప్పించుకోవాలని చూసింది.అక్కడున్న ఇనుప రెయిలింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించింది. అయితే పైదాకా ఎక్కినా రెయిలింగ్‌ను దాటడం సాధ్యంకాక మళ్లీ కింద పడింది. ఈ క్రమంలో అది కాస్త గాయపడ్డట్లు తెలిసింది. చివరకు అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని బంధించారు. అనంతరం సురక్షితంగా నదిలోకి విడిచిపెట్టారు.UP: This crocodile came out of Ganganahar in Narora of #Bulandshahr district. The forest department team reached and rescued him and released him back into the canal. #Heatwave #Weatherupdate pic.twitter.com/HiwdLwMVf9— Shivaji Mishra | शिवाजी मिश्रा (@08febShivaji) May 29, 2024 -
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు. ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది. ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు. -
ఆ అవ్వ కళ్లలో ఆనందం.. ఐపీఎస్ అనుపై ప్రశంసలు
Viral Video: భావోద్వేగ సన్నివేశాలను తెర మీద చూసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అలాంటి క్షణాలు నిజజీవితంలోనూ కలిగితే!. ఆ ఆనందానికి అవధులు ఉంటాయా?.. కొన్ని కోట్లు ఖర్చు చేసినా అలాంటి ఆనందం దొరకదు మరి. యువ ఐపీఎస్ అధికారిణి అనుకృతి విషయంలోనూ అదే జరిగిందట. ఆ క్షణాల్ని ఆమె పంచుకోగా.. పలువురు అభినందిస్తున్నారు కూడా. ఉత్తర ప్రదేశ్ బులందర్‌షెహర్ జిల్లా ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ స్వయంగా ‘స్వదేశ్’చిత్ర అనుభూతిని పొందారట. ఆ హిందీ చిత్రంలో నాసా సైంటిస్ట్ అయిన షారూక్ ఖాన్ తన ఊరికి కరెంట్ తెప్పించడానికి చేసే ప్రయత్నాన్ని డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్ స్క్రీన్ మీద ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. అలాంటి క్షణాల్ని.. అనుభూతినే తాను పొందానని ఐపీఎస్ అను స్వయంగా ట్వీట్ చేశారు. నూర్జహాన్(70) అనే వృద్ధురాలి ఇంటికి అనుకృతి దగ్గరుండి విద్యుత్ సదుపాయం అందించారు. ఆమె ఇంట్లో లైట్ వెలగగానే అటు అను ముఖంలో.. ఇటు బామ్మ ముఖంలో సంతోషం ఒక్కసారిగా వెల్లివిరిసింది. ఆ సంతోష కాంతుల్ని ట్విటర్ ద్వారా ఆమె పంచుకున్నారు. ఆమె ఇంటికి కరెంట్ తెప్పించడంలో సహకరించిన ఎస్‌హెచ్‌వో జితేంద్రకు, మొత్తం టీంకు ఆమె కృతజ్ఞతలు సైతం తెలియజేశారు. అనుకృతి శర్మ.. 2020 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. ప్రస్తుతం బులంద్‌షెహర్‌కు అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారామె. ఒంటరిగా పేదరికంలో ఉన్న నూర్జహాన్.. తన ఇంటికి వెలుగులు కావాలని నేరుగా పోలీసులను ఆశ్రయించిందట. ఆ విషయం తెలియగానే ఐపీఎస్ అనుకృతి.. ఇలా రంగంలోకి దిగి స్వయంగా ఆ ఏర్పాట్లను పర్యవేక్షించింది. అంతేకాదు ఓ ఫ్యాన్‌ను సైతం ఆ పెద్దావిడకు అందించింది. ఆపై అంతా స్వీట్లు పంచుకున్నారు. Swades moment of my life 🌸😊 Getting electricity connection to Noorjahan aunty's house literally felt lyk bringing light into her life. The smile on her face ws immensely satisfying.Thank u SHO Jitendra ji & the entire team 4 all da support 😊#uppcares @Uppolice @bulandshahrpol pic.twitter.com/3crLAeh1xv — Anukriti Sharma, IPS 🇮🇳 (@ipsanukriti14) June 26, 2023 ఇదీ చదవండి: జాతకాల పిచ్చోడా? బ్యాంక్ అధికారులకు షాకిచ్చాడుగా! -
బస్సులోనే ప్రసవం.. అటు నుంచి నేరుగా..
బులంద్‌షహర్: ఉత్తర ప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి సొంతూరుకు వెళుతున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆ వెంటనే డ్రైవర్ ఆ బస్సును ప్రభుత్వ ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లి తల్లిని, నవజాత శిశువును వైద్యులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి యూపీలోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌకు వెళ్తుండగా ఆదివారం చోటుచేసుకుందని ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి యూపీలోని ఈటా జిల్లా లోని సొంతూరుకు తాము వెళ్తున్నట్లు మహిళ భర్త సోమేశ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో బస్సులోనే పురిటి నొప్పులు వచ్చాయని అతను వివరించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు. -
యోగితో యూపీలో అభివృద్ధి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే, కోవిడ్ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొద్ది రోజుల్లోనే భర్తీ చేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూపీ ఎన్నికల సందర్భంగా ఆదివారం ఆయన డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించారు. యూపీలో బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చకు తెరదించుతూ యోగిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా రాకపోయి ఉంటే యోగి సారథ్యంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధిని సాధించి ఉండేదని అన్నారు. కేంద్ర పథకం కింద నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇస్తేనే, ఆయన మరిన్ని మంచి కార్యక్రమాలకు చేయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఆగ్రా, మథుర, బులంద్షార్ ఓటర్లనుద్దేశించి ప్రధాని ఆన్లైన్ ద్వారా మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో అభివృద్ధిని చూసే ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు. యూపీలో బీజేపీ మళ్లీ గెలిస్తే సీఎం అభ్యర్థిని మారుస్తుందా అన్న సందేహాలకు తావు లేకుండా ప్రధాని ప్రసంగం సాగింది. రాష్ట్రంలో మహిళలంతా బీజేపీ మళ్లీ గెలవాలని, యోగి మళ్లీ సీఎం కావాలని నిర్ణయించుకున్నారని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజల అవసరాలను గుర్తించలేదని దుమ్మెత్తి పోశారు. యూపీని లూటీ చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వారి కుటుంబమే ప్రభుత్వంగా మారితే, బీజేపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రమంతా ఒక కుటుంబంలా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా భారత గానకోకిల లతా మంగేష్కర్ కన్నుమూయడంతో యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ హాజరయ్యే ఒక కార్యక్రమంలో ఆదివారం ఉదయం 10:15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. లత మరణంతో రెండు నిముషాల సేపు నేతలు మౌనం పాటించారు. మేనిఫెస్టో విడుదల కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. బీజేపీ నేతల ప్రవేశంపై నిషేధం తమ గ్రామంలోకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ రావొద్దంటూ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్ పరిధిలోని బిచ్పురి సైలాబ్ గ్రామంలో చోటుచేసుకుంది. బీజేపీ శ్రేణుల రాకను గ్రామస్థులు అడ్డుకుంటున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోర్డు ఏర్పాటు చేసిన గ్రామపెద్ద నిరంజన్ సింగ్‌ను అరెస్టు చేశారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకు నిరసనగానే ఈ బోర్డు పెట్టినట్లు ప్రజలు చెబుతున్నారు. యూపీలో మామపై కోడలి పోటీ! ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్‌పూర్ జిల్లాలోని తిల్హార్ అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రోషన్‌లాల్ వర్మపై ఆయన కోడలు సరితా యాదవ్ పోటీకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రీయ సమాజ్ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తానని ఆమె చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన వర్మ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ ఆయనకు తిల్హార్ టిక్కెట్ ఇస్తామని ప్రకటించింది. తన మామ రోషన్‌లాల్ వర్మ భూకబ్జాదారుడు అని సరితా యాదవ్ ఆరోపించారు. అసలు సరితా యాదవ్ తన కోడలే కాదని వర్మ చెబుతున్నారు. రాయ్‌బరేలీ స్టార్ ప్రచారకుల్లో లేని సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నాలుగో దశలో ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, రాయ్‌బరేలీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ స్టార్ ప్రచారకుల జాబితాలో సోనియా పేరు లేకపోవడం గమనార్హం. 30 మంది స్టార్ ప్రచారకుల జాబితాలో రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ప్రియాంకాగాంధీ వాద్రా తదితరులు ఉన్నారు. పంజాబ్‌లో అన్నదమ్ముల పరస్పర పోటీ పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలో ఉన్న మజిథా అసెంబ్లీ స్థానం నుంచి అన్నదమ్ములు వేర్వేరు పార్టీల టిక్కెట్లపై పోటీకి దిగుతున్నారు. తనదే గెలుపు అంటూ ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుఖ్జిందర్రాజ్ సింగ్ అలియాస్ లల్లీ మజీథియా ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై, ఆయన తమ్ముడు జగ్విందర్పాల్ సింగ్ అలియాస్ జగ్గా మజీథియా కాంగ్రెస్ టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
ఉద్యోగం తీసేశాడని.. కడుపుకోత మిగిల్చారు!
పగ.. ప్రతీకార వాంఛ.. కృతజ్ఞతను సైతం పక్కన పడేస్తుంది. మనిషిని మృగంగా మార్చేసి విపరీతాలను దారి తీస్తుంది. అలాంటిదే ఈ ఘటన. ఎప్పుడో రెండేళ్ల క్రితం తండ్రి చేసిన పనిని మనసులో పెట్టుకుని.. ఆ పగని అభం శుభం తెలియని పసివాడి మీద చూపించారు ఇద్దరు వ్యక్తులు. యూపీలో జరిగిన మైనర్ కిడ్నాప్-హత్య ఉదంతం ఇప్పుడు వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. లక్నో: యూపీ బులంద్‌షెహర్‌లో బాధిత తండ్రి డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆవారాగా తిరుగుతున్న ఇద్దరు కుర్రాళ్లను.. వాళ్ల తల్లిదండ్రుల ముఖం చూసి తన దగ్గర కాంపౌండర్లుగా చేర్చుకున్నాడు. అయితే డాక్టర్‌కు తెలియకుండా వాళ్లను డ్యూటీలో తప్పులు చేస్తూ వచ్చారు. దీంతో రెండేళ్ల కిందట నిజమ్, షాహిద్‌లను ఉద్యోగంలోంచి తీసేశాడు. అప్పటి నుంచి ఆ డాక్టర్ మీద కోపంతో రగిలపోతూ.. అదను కోసం చూస్తూ వచ్చారు వాళ్లిద్దరూ. శుక్రవారం(28, జనవరి)న ఆ డాక్టర్‌కి ఉన్న ఎనిమిదేళ్ల కొడుకును కిడ్నాప్ చేసి.. దాచిపెట్టారు. కొడుకు కనిపించకపోయేసరికి కంగారుపడ్డ ఆ తండ్రి.. ఛట్టారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగేసరికి భయంతో అదే రాత్రి ఆ చిన్నారిని చంపేశారు. పోలీసుల దర్యాప్తులో.. మాజీ ఉద్యోగులుగా, పైగా డాక్టర్ ఇంటి దగ్గర్లోనే ఉంటుండడంతో ఆ ఇద్దరిని ప్రశ్నించారు పోలీసులు. వాళ్లు తడబడడంతో తమ శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పేసుకున్నారు. దీంతో ఆ పిల్లవాడి మృతదేహాన్ని రికవరీ చేసుకుని.. నిందితులను అరెస్ట్ చేశారు. తన మీద కోపంతో తన కొడుకును కడతేర్చడంపై ఆ తండ్రి, ఆ తల్లి కుమిలి కుమిలి రోదిస్తున్నారు. -
లైంగిక వేధింపులు: ఉరికి వేలాడిన మహిళా ఎస్సై
లక్నో: అమ్మాయిలకు వేధింపులు ఎదురైతే పోలీసుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళా ఎస్సైకే వేధింపులు ఎదురయ్యాయి. వాటిని నిలువరించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైన ఎస్సై చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. బులంద్‌షహర్ ఎస్ఎస్పీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన 30 ఏళ్ల అర్జూ పవార్.. అనూప్షహర్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో 2015 నుంచి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె షామ్లి జిల్లాలో ఒంటరిగా నివసిస్తోంది. (చదవండి: కృష్ణుని కోసం ప్రాణాలు తీసుకున్న రష్యన్ యువతి) అయితే గత కొంత కాలంగా ఆమెకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దీంతో తీవ్రంగా కలత చెందిన సదరు మహిళ తను నివాసం ఉంటున్న ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. మరోవైపు ఇంటి యజమాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో తలుపు తట్టి చూడగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. అందులో తన చావుకు తనే కారణమని పేర్కొంది. (చదవండి: యూట్యూబ్ నటికి వేధింపులు..) -
సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువ మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడ్డారు. ఉరి వేసుకుని తనువు చాలించారు. వివరాలు... బులంద్‌షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీస్ స్టేషన్లో ఆర్జూ పవార్(30) ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో శుక్రవారం ఉరికి వేలాడుతూ కనిపించారు. చాలా సేపటి నుంచి ఆర్జూ అలికిడి వినిపించకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరచి చూడగా విషయం బయటపడింది. (చదవండి: ఆమె మళ్లీ బతుకుతుందని 25 రోజులు..) ఈ క్రమంలో.. ఆమె ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. ఆస్పత్రికి తరలించగా ఆర్జూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా ఘటనాస్థలంలో లభించిన సూసైడ్‌నోట్‌లో.. తన చావుకు తానే కారణమని ఆర్జూ పేర్కొన్నట్లు రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆమె సన్నిహితులను కూడా విచారిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
సీటు కోసం గొడవ.. తుపాకీతో కాల్పులు
బులంద్‌షహర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలోని ఓ స్కూల్లో.. తరగతి గదిలో సీట్ల విషయంలో వచ్చిన గొడవకు 10వ తరగతి చదివే సన్నీ (14)తన తోటి విద్యార్థిని తుపాకీతో కాల్చి చంపాడు. సెలవుల్లో ఆర్మీ నుంచి ఇంటికి వచ్చిన తన అంకుల్ లైసెన్స్ గన్‌తో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కాల్చిన అనంతరం పారిపోబోయాడు. అయితే అప్పటికే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గేట్లు మూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికాడు. కాగా పోలీసులు వివరాలు నమోదు చేసుకొని జువైనల్ హోమ్‌కు తరలించారు. -
పబ్లిక్‌గా దమ్ము లాగించిన పోలీసులు
లక్నో: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరం. ఈ నిబంధనను ఆచరించకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. లేదంటే పబ్లిక్‌గా పొగ తాగినందుకు ఏకంగా పోలీస్ స్టేషన్‌కే లాక్కెళ్లిపోతారు. మరి శిక్షించాల్సిన పోలీసులే రూల్స్ బ్రేక్ చేస్తే..! వారి పరువు గంగలో కలవడమే కాదు, ఉద్యోగం కూడా చిక్కుల్లో పడుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎస్సై రాజ్ బహదూర్, హెడ్ కానిస్టేబుల్ జితేంద్ర సింగ్.. పహసు పోలీస్ స్టేషన్ పరిధిలోని బనేల్ గ్రామంలో పార్టీకి వెళ్లారు. అక్కడ తీరికగా కూర్చుని ఎదురుగా టేబుల్ మీద మందు బాటిళ్లు పెట్టుకుని పబ్లిక్‌గా దర్జాగా దమ్ము లాగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా అది కాస్తా వైరల్‌గా మారింది. అలా ఈ వీడియో పై అధికారుల కంట పడింది. దీంతో ఆ ఇద్దరినీ బులంద్‌షహర్‌కు బదిలీ చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు సంతోష్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. (చదవండి: సిస్టర్ అభయ కేసు: దోషులకు జీవిత ఖైదు) చదవండి: కాబోయే భార్య ఆస్పత్రి బెడ్ మీద ఉండగానే.. -
సూట్‌కేసులో మృతదేహం.. తన భార్యదేనని..
లక్నో : చనిపోయిందని భావించిన ఓ మహిళా సజీవంగా తిరిగి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ఇస్లామాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న వరీషా భర్త అమీర్ జూలై 23న తన భార్య కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే నెల 27న ఘజియాబాద్ సమీపంలో సూట్‌కేసులో కుక్కి ఉన్న ఓ మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అమీర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం తన భార్య వరీషాదేని చెప్పి తీసుకుకెళ్లారు. (చదవండి : ప్రియుడితో పారిపోయి.. భర్తపై నెపం వేసి) కాగా, సోమవారం వరీషా పోలీసులకు సంప్రదించి తాను బతికే ఉన్నానని పేర్కొంది. అంతే కాకుండా తన భర్త అమీర్, అత్త వరకట్నం కోసం తనను వేధించారని, వారి టార్చర్ భరించలేక నోయిడా వెళ్లినట్లు తెలిపారు. దీంతో పోలీసులు అమీర్, అతని తల్లిపై వరకట్నం వేధింపులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు సూట్ కేసులో లభించిన మృతదేహం ఎవరిదనేది తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని బులంద్‌షహర్ పోలీసులు పేర్కొన్నారు. -
బీజేపీని చిక్కుల్లో పడేసిన ఫోటో
లక్నో: బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు, ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫోటో ఒకటి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. హంతకులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వివరాలు.. బులంద్‌షహర్‌లోని ఓ సంస్థ జూలై 14 న ‘ప్రధాన్ మంత్రి జాన్ కళ్యాంకరి యోగి జాగ్రుక్తా అభియాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు ముఖ్య అతిథిగా బులంద్‌షహర్ బీజేపీ అధ్యక్షుడు అనిల్ సిసోడియాను ఆహ్వానించింది. అనంతరం సంస్థ సభ్యులకు సిసోడియా చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ క్రమంలో శిఖర్ అగర్వాల్ అనే వ్యక్తికి కూడా సిసోడియా సర్టిఫికెట్ అందజేశారు. 2018లో యూపీలో సంచలనం సృష్టించిన పోలీసు అధకారి హత్య కేసులో శిఖర్ అగర్వాల్ నిందితుడిగా ఉన్నాడు. సిసోడియా, అగర్వాల్‌ను సంస్థకు జనరల్ సెక్రటరీగా నియమిస్తూ సర్టిఫికెట్ అందజేసిన ఫోటో సోషల్ మీడయాలో తెగ వైరలయ్యింది. దాంతో నేరస్తులకు బీజేపీ పదవులు కట్టబెడుతోంది అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూన్నాయి. (పరిమళించిన మానవత్వం) వివాదం కాస్తా పెద్దది కావడంతో సిసోడియా దీనిపై స్పందించారు. ఓ స్థానిక సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరయ్యానని.. ఈ కార్యక్రమానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. 2018లో బులంద్‌షహర్‌లో గోహత్య పుకార్ల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. దాంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌పై నిందితులు దాడి చేశారు. ఆయన చేతి వెళ్లను నరికి.. తలపై కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పోలీసు వాహనంలో వేసి.. పొలాల్లో వదిలేశారు.. ఈ దారుణానికి పాల్పడిన వారిమీద కేసు నమోదు చేశారు. నాటి ఘటనలో శిఖర్ అగర్వాల్ కూడా నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న అగర్వాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యి.. సర్టిఫికెట్ అందుకోవడం వివాదాస్పదంగా మారింది. -
సీఎం యోగికి ఉద్ధవ్ ఫోన్.. అందుకేనా?
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వెలిబుచ్చారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ‘యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్లో మాట్లాడాను. బులందర్‌షహర్ జిల్లాలో జరిగిన ఇద్దరు సాధువుల హత్యపై ఆందోళన వ్యక్తపరిచాను. మేము మీతో ఉంటామని ఆయనతో చెప్పాను. ఇలాంటి కేసులో మేము వ్యవహరించినట్టుగానే కఠినంగా ఉండాలని, దోషులను చట్టం ముందు నిలబెట్టాలని సూచించాను. దీనికి మతం రంగు పూయొద్దని కోరాన’ని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. కాగా, సాధువుల హత్యపై యూపీ సీఎంకు ఠాక్రే ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మహారాష్ట్రలోని పాల్గాఢ్ జిల్లాలో సాధువుల హత్య జరిగిన సందర్భంలో ఉద్ధవ్‌కు సీఎం యోగి ఫోన్ చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయనకు సూచించారు. సరిగ్గా ఇదేవిధంగా ఇప్పుడు ఆదిత్యనాథ్‌కు ఠాక్రే ఫోన్ చేశారు. పాల్గాఢ్ ఘటనకు మతం రంగు పూయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించగా ఉద్ధవ్ సర్కారు సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతల ఫోన్ సంభాషణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన సీనియర్ సంజయ్ రౌత్ కూడా బులందర్‌షహర్ సాధువుల హత్యకు మతం రంగు పులమకుండా జాగ్రత్త పడాలని ట్విటర్లో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బులందర్‌షహర్ జిల్లా పగోనా గ్రామంలోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. (దేవుడు కోరాడనే సాధువులను చంపేశా) -
శివాలయంలో సాధువుల దారుణ హత్య
లక్నో: మహారాష్ట్రలోని పాల్గరిలో సాధువుల హత్య ఘటన మరువకముందే మరో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని పగోనా గ్రామంలో శివాయం లోపల ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా హతమార్చారు. సోమవారం నాడు ఈ ఘటన జరిగివుండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన కొందరు గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న సాధువులను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..) మృతి చెందిన సాధువులను జగదీష్(55), షేర్ సింగ్(46)గా గుర్తించారు. ఈ ఘటనపై బులంద్‌షహర్ ఎస్ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఇటీవలే ఇద్దరు సాధువులకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది. అతను వీరి వస్తువులు దొంగిలించేందుకు ప్రయత్నించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంతోనే అతను వాళ్లిద్దరినీ చంపేసి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింద"న్నారు. ప్రస్తుతం సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్‌ను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) -
కేక్ కటింగ్: భర్తకు పాకిన కరోనా
లక్నో: ఆమెకు కరోనా సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కనపెట్టి తన పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంది. ఈ తప్పిదం వల్ల ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. అంతేకాక లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనల కింద ఆమెతోపాటు వేడుకలో పాల్గొన్న మరో ముగ్గురిపై పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన బీజేపీ మహిళా నాయకురాలు, బీజేపీ మహిళా మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడిని కలవడంతో ఆమెకు కరోనా సోకింది. దీంతో ఆమెతోపాటు కుటుంబ సభ్యులనందరినీ శిఖర్‌పూర్‌లోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (కోవిడ్ నెగిటివ్ వస్తేనే లోపలికి అనుమతిస్తాం) అయితే ఈ మధ్యే ఆమె తన 38వ వివాహ వార్షికోత్సవ వేడుకలను క్వారంటైన్ సెంటర్లో వేడుకగా జరుపుకుంది. ఈ సందర్భంగా భర్త, కూతురు, అల్లుడి మధ్య కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ పార్టీ చేసుకున్నారు. దీంతో తాజా పరీక్షలో ఆమె భర్తకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో వీరి పెళ్లి వేడుకలు, కేక్ కటింగ్ ఫొటోలు చక్కర్లు కొట్టాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాక క్వారంటైన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుమీదా దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలావుండగా కరోనా సోకిన భార్యాభర్తలనిద్దరినీ ఖుర్జాలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. (డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది) -
పరిమళించిన మానవత్వం
బులంద్‌షహర్ : ప్రపంచమంతా కరోనా ధాటికి గడగడ వణుకుతున్న వేళ మానవత్వానికి ఆలంబనగా నిలిచిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో వెలుగు చూసింది. ఆపత్కాలంలో ఆయువు తీరిన నిరుపేద హిందూ మతస్థుడి అంత్యక్రియలకు అయినవారు రాలేకపోయిన వేళ సాటి ముస్లింలు మానవత్వం ప్రదర్శించి మతసామరస్యం చాటారు. మతాల అడ్డుగోడలను అధిగమించి ఆపన్న హస్తం అందించి ఆదర్శంగా నిలిచారు. మానవత్వానికి, మతసామరస్యానికి అద్దం పట్టిన ఈ ఘటన బులంద్‌షెహర్‌లోని మౌలానా ఆనంద్ విహార్‌లో చోటుచేసుకుంది. రవిశంకర్ అనే వ్యక్తి క్యాన్సర్ వ్యాధితో ఆదివారం మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అంత్యక్రియలకు బంధువులు, స్నేహితులు రాలేకపోయారు. నిరుపేద కుటుంబం దీనావస్థను గమనించిన చుట్టుపక్కల ముస్లింలు.. రవిశంకర్ అంత్యక్రియల్లో సాయం చేశారు. స్వయంగా పాడె మోసి మృతదేహాన్ని శ్మశానికి తరలించడంలో సహాయపడ్డారు. భౌతికకాయాన్ని తరలించే సమయంలో 'రామ్ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ మతసామరస్యాన్ని చాటారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు. లాక్డౌన్ కారణంగా బంధువులు రాలేకపోయారని, ముస్లిం సోదరుల అండతో తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించామని రవిశంకర్ కుమారుడు చెప్పారు. కరోనా మహమ్మారి విరుచుకుపోతున్న వేళ మునుపెన్నడూ చూడని ప్రత్యేక పరిస్థితులు నెలకొనడంతో దేశంలోని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పేదలు, బడుగులు, కూలీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బులంద్‌షెహర్‌లోని ముస్లింలు చూపిన మానవత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. (వైరల్ వీడియో : వలస కార్మికుడు దీనస్థితి) -
క్షమించండి: రూ. 6 లక్షలు తీసుకోండి!
లక్నో: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు ముస్లిం వర్గం ముందుకు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశ వాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈశాన్య రాష్ట్రాలు సహా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహించిన యోగి సర్కారు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని హెచ్చరికలు జారీ చేసింది.(‘ప్రతీకారం తీర్చుకుంటాం.. ఆస్తులు వేలం వేస్తాం’) ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలోని బులంద్‌షహర్‌లో గత శుక్రవారం చెలరేగిన అల్లర్లలో జరిగిన నష్టానికి చింతిస్తూ ముస్లిం సోదరులు పరిహారం చెల్లించారు. ఈ మేరకు రూ. 6.27 లక్షల చెక్కును ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ఈ విషయం గురించి బులంద్‌షహర్ కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం నమాజ్ పూర్తైన తర్వాత కొంత మంది ముస్లిం వ్యక్తులు తనను కలిసి డీడీ ఇచ్చారని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ వాహనం ధ్వంసమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. హింసను వ్యతిరేకిస్తూ లేఖ కూడా అందించారని పేర్కొన్నారు. రికవరీకి వెళ్లకముందే స్వయంగా వారే పరిహారం చెల్లించడం గొప్ప విషయమని ప్రశంసించారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస కారణంగాగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. రూ .14.86 లక్షలు కట్టాలంటూ యూపీ సర్కారు 28 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.(యోగి ప్రతీకారం : రూ. 15 లక్షలు కట్టండి! ) చదవండి: ఖాదిర్ దేవుడిలా వచ్చి.... నన్ను కాపాడాడు అమ్మానాన్న ఎక్కడ.. అయ్యో పాపం ఐరా.. ‘19 మంది మృతి..1100 మంది అరెస్ట్’ -
పవిత్ర స్నానాలకొచ్చి.. పరలోకాలకు వెళ్లారు
లక్నో: బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. పేవ్మెంట్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన బులంద్‌షహర్ నరోరాలోని గంగాఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ హత్రాస్‌కు చెందిన కొందరు గంగానదిలో పవిత్ర స్నానమాచరించడం కోసం నరోరా ఘాట్‌కు వచ్చారు. ఈ క్రమంలో వీరు గురువారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న పేవ్మెంట్ మీద నిద్ర పోయారు. శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవి ఆలయం నుంచి వస్తోన్న ఓ బస్సు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
షాకింగ్.. పొరపాటున బీజేపీకి ఓటేసి.. !
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు రెండోదఫా పోలింగ్ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. శిఖర్‌పుర ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ హులాసన్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ (25) ఈ ఘటనకు పాల్పడ్డాడు. పొరపాటున బీజేపీ గుర్తుకు ఓటేయడంతో కోడవలిని ఉపయోగించి తన చేతి వేలిని పవన్ నరికేసుకున్నాడు. వేలిని నరికేసుకున్న తర్వాత పొరపాటున బీజేపీకి ఓటేశానంటూ అతను విచారం వ్యక్తం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ అభ్యర్థి యోగేశ్ వర్మకు ఓటేయాలని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన పవన్.. పొరపాటున బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ భోలా సింగ్‌కు ఓటేశాడని, జరిగిన పొరపాటున తెలుసుకొని తనపై తానే ఆవేశానికి లోనై.. వేలిని నరికేసుకున్నాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
నాన్నను ఆ ఇద్దరు అంకుల్స్ చంపేశారు!
లక్నో : ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న ఓ వ్యక్తి మరణానికి సంబంధించి అతడి కూతురు(4), ఇరుగుపొరుగు వారు చెప్పిన వివరాల ఆధారంగా.. నోయిడా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి అంత్యక్రియలను నిలిపివేసి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. వివరాలు.. బులంద్‌షహర్‌కు చెందిన సంతోశ్ రాఘవ్ అనే వ్యక్తి భార్య మమత, కూతురు(4), కొడుకు (2)లతో కలిసి సెక్టార్ 93లో నివాసం ఉంటున్నాడు. సంతోశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా మమత కూడా కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో పని పూర్తి చేసుకుని శనివారం రాత్రి మమత టెర్రస్‌పైకి వచ్చే సరికి సంతోశ్ రాడ్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో మద్యం మత్తులో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించింది. ఈ విషయం గురించి బంధువులకు సమాచారం అందించింది. వాళ్లిద్దరు నాన్నను చంపేశారు సంతోశ్ శవాన్ని తమ స్వగ్రామానికి తీసుకువెళ్లే క్రమంలో అతడి సోదరి సీమా రానా మేనకోడలు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ నా సోదరుడి అంత్యక్రియలు నిర్వర్తించేందుకు శవాన్ని తీసుకుని రెండు కార్లలో బయల్దేరాం. అప్పటి వరకు నిద్రపోయిన నా మేనకోడలు లేచిన తర్వాత నాన్న ఎక్కడ అంటూ మమతను అడిగింది. నాన్న నాకు పాఠం చెబుతున్నపుడు ఇద్దరు అంకుల్స్ మన ఇంటికి వచ్చారు. ఒకరు లావుగా, మరొకరు సన్నగా ఉన్నారు. నాన్నను పైకి తీసుకువెళ్లారు. నేను వస్తానంటే వద్దన్నారు. సీసాలు తెచ్చారు. అక్కడే నాన్నను కొట్టి చున్నీ మెడకు వేశారు అని చెప్పింది’అని పేర్కొంది. కాగా ఈ కేసులో సంతోశ్ పక్కింటి వ్యక్తులు కూడా అతడి కూతురు చెప్పిన వివరాలే చెప్పడంతో అనుమాననాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నోయిడా పోలీసులు తెలిపారు. -
మా వంతు సహాయంగా రూ. 70 లక్షలు!
లక్నో : బులంద్‌షహర్ హింసాకాండలో మృతి చెందిన ఎస్ఐ సుబోధ్ కుమార్ కుటుంబానికి యూపీ పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా 70 లక్షల రూపాయలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘ సుబోధ్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల పరిహారంతో పాటుగా.. మా వంతు సహాయంగా మరో 70 లక్షల రూపాయలు వాళ్లకు అందిస్తాం’ అని వ్యాఖ్యానించారు. కాగా బులంద్‌షహర్‌లోని మహావ్ గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదంమొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్‌తో పాటు సుమిత్ కుమార్ అనే యువకుడు కూడా మృతి చెందాడు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) ఇక యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్ కుమార్ ఈ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్ దళ్ నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉండటం.. బులంద్‌షహర్ ఘటనలో కూడా భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్‌పై ఆరోపణలు రావడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. -
సరిగ్గా నెలరోజులకు నిందితుడి అరెస్టు
లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్రాజ్ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్‌దళ్ మిత్రులతో కలిసి స్టేషన్లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా) ఇదొక కథ..? యోగేష్‌రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు. ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్‌షహర్ హింసాకాండతో యోగేష్రాజ్కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు. -
తానే కాల్చుకున్నాడు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో చోటుచేసుకున్న హింసాకాండపై బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ లోధి మరో వివాదం లేవనెత్తారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించి సరికొత్త వివాదం రేపారు. డిసెంబర్ 3న జరిగిన విధ్వంసకాండ సందర్భంగా బుల్లెట్ గాయంతో సుబోధ్ మరణించారు. ‘జనమంతా చుట్టుముట్టినప్పుడు సుబోధ్ సింగ్ నిస్సహాయంగా ఉన్నారు. ఆందోళనకారుల బారి నుంచి కాపాడుకునేందుకు తనను తాను కాల్చుకోవాలనుకున్నారు. చివరికి తుపాకిని తలకు గురిపెట్టి కాల్చుకున్నార’ని దేవేంద్ర సింగ్ అన్నారు. సుబోధ్ పుర్రెలో బుల్లెట్ ఉందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఆరు చోట్ల రాళ్లతో కొట్టిన గాయాలు ఉన్నట్టు కూడా పేర్కొంది. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’) మహావ్ గ్రామంలోని ఓ చెరుకుతోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్ దల్ నాయకుడు యోగేష్ రాజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, కీలక నిందితుడు ప్రశాంత్ నాథ్‌ను అరెస్ట్ చేసినట్టు యూపీ పోలీసులు గురువారం ప్రకటించారు. సుబోధ్ సింగ్‌ను కాల్చినట్టు అతడు ఒప్పుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే తాను కాల్చలేదని కోర్టు బయట మీడియాతో ప్రశాంత్ చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.