
లక్నో: బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. పేవ్‌మెంట్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన బులంద్‌షహర్ నరోరాలోని గంగాఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ హత్రాస్‌కు చెందిన కొందరు గంగానదిలో పవిత్ర స్నానమాచరించడం కోసం నరోరా ఘాట్‌కు వచ్చారు. ఈ క్రమంలో వీరు గురువారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న పేవ్‌మెంట్ మీద నిద్ర పోయారు. శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవి ఆలయం నుంచి వస్తోన్న ఓ బస్సు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment