Pavement
-
రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
పూణే: పూణే రైల్వే స్టేషన్లో అమానుషమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. రైలు రావడం ఆలస్యమైన కారణంగానో మరేదైనా కారణం వల్లనో ఆదమరిచి నిద్రిస్తున్న ప్రయాణికులు కొంతమందిని నిద్ర లేపడానికి నిర్దాక్షిణ్యంగా వారి మొహం మీద నీళ్లు చల్లాడు ఓ సీఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్. ఈ దృశ్యాన్ని చరవాణిలో బంధించిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై స్పందిస్తూ పూణే డివిజనల్ రైల్వే మేనేజర్ ఇందు దూబే ఇది అమానుషం అన్నారు. రైళ్ల రాకపోకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితిలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో సేదదీరడం సర్వసాధారణంగానే మనం చూస్తూ ఉంటాం. రైల్వే ప్లాట్ ఫారం మీద నిద్రించడం నిబంధనలకు విరుద్ధమే. అయినా ఆ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఒక రైల్వే కానిస్టేబుల్ మాత్రం కర్కశంగా వ్యవహరించాడు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గాఢంగా నిద్రిస్తున్న ప్రయాణికుల మొహం మీద బాటిల్ తో నీళ్లు కుమ్మరించాడు. దీంతో ఏమైందోనని ఉలిక్కిపడి లేచారు ప్రయాణికులు. వారిలో ఒక పెద్దాయన కూడా ఉన్నారు. మానవత్వాన్ని తుంగలో తొక్కిన ఈ సన్నివేశాన్ని ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో "మానవత్వానికి నివాళులు" అని రాసి పోస్ట్ చేశాడు ఒక యువకుడు. క్షణాల్లో వైరల్ గా మారిన ఈ వీడియోను ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వీరిలో అత్యధికులు రైల్వే కానిస్టేబుల్ పై విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity 🥺🥺 Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) June 30, 2023 రైల్వే స్టేషన్లలో ఇతరులకు అడ్డంకిగా ఎక్కడ పెడితే అక్కడ నిద్రించడం నిబంధనలకు విరుద్ధం. ఆ విషయాన్ని వారికి మర్యాదపూర్వకంగానూ, గౌరవంగా అర్ధమయ్యేలా కౌన్సెలింగ్ చెయ్యాలి గానీ ఈ విధంగా మొహాన నీళ్లు చల్లడం తీవ్ర విచారకరమని అన్నారు రైల్వే డివిజనల్ మేనేజర్ ఇందు దూబే. నెటిజన్లు ఈ సంఘటనపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే కానిస్టేబుల్ ను నిందించగా మరికొంత మంది అతడికి మద్దతుగా నిలిచారు. ఇది కూడా చదవండి: ఆవుపై సింహం దాడి.. ఆ రైతు ఏం చేశాడంటే.. -
పవిత్ర స్నానాలకొచ్చి.. పరలోకాలకు వెళ్లారు
లక్నో: బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. పేవ్మెంట్ మీద నిద్రిస్తున్న వారి మీదకు మృత్యువు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన బులంద్‌షహర్ నరోరాలోని గంగాఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్ హత్రాస్‌కు చెందిన కొందరు గంగానదిలో పవిత్ర స్నానమాచరించడం కోసం నరోరా ఘాట్‌కు వచ్చారు. ఈ క్రమంలో వీరు గురువారం రాత్రి రోడ్డు పక్కనే ఉన్న పేవ్మెంట్ మీద నిద్ర పోయారు. శుక్రవారం తెల్లవారుజామున వైష్ణోదేవి ఆలయం నుంచి వస్తోన్న ఓ బస్సు వీరి మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
వేడిని పెంచుతున్న ఫుట్‌పాత్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : సుందర నగరాల్లో సాధారణంగా రోడ్ల పక్కన ఎండ ఎక్కువ పడకుండా ఎల్తైన చెట్లు, పక్కన పాదాచారుల కోసం సిమ్మెంట్ టైల్స్‌తో కూడిన ఫుట్‌పాత్‌లు కనిపిస్తాయి. పగటి పూట ఎండ వేడిని తగ్గించేందుకు రోడ్లు పక్కనున్న ఎల్తైన చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, పక్కనుండే పలు అంతస్తుల భవనాలు పగటి పూట ఎండలోని వేడిని గ్రహించి రాత్రి పూట వాతావరణంలోకి వదులుతాయి. తద్వారా రాత్రిపూట వాతావరణం ఆశించినంత లేదా కావాల్సినంత చల్లగా ఉండక పోవచ్చు. మానవులు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట వాతావరణం చల్లగా ఉండాలనేది వైద్యులు ఎప్పుడే తేల్చి చెప్పారు. అయితే సిమ్మెంట్ ఫుట్‌పాత్‌లు, ఎల్తైన కాంక్రీటు భవనాలు రాత్రి పూట వాతావరణం వేడికి కారణం అవుతున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనిపెట్టారు. మాడిసన్లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ పరిశోధకులు సైకిల్ మోటర్లకు జీపీఎస్ డివైస్‌లు, ఉష్ణోగ్రత సెన్సర్లు అమర్చి పగటి పూట, రాత్రివేళ వివిధ రోడ్లలో వాటిని నడిపి ఉష్ణోగ్రతలను నమోదు చేశారు. ఏ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉన్నాయో గమనించి ఎందుకున్నాయో తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిసరాలను పరిశీలించారు. కింద కాంక్రీట్ ఫుట్పాతులున్నా, పైన ఛత్రిలాగా గుబురైన చెట్లు ఉన్న చోట వేడి తక్కువగా ఉండడం, పక్కన ఎల్తైన కాంక్రీటు భవనాలుంటే వేడి స్థాయిలో మార్పులు ఉండడం గమనించారు. పార్కుల వద్ద ఎక్కువ చెట్లు ఉండడం వల్ల అక్కడి వాతావరణం ఎక్కువగా చల్లగా ఉండడం తెల్సిందే. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇతర వేడి ప్రాంతాలకు పనులపై తరచూ వెళ్లి రావడం వల్ల కూడా (చలి, వాతావరణంల మధ్య సర్దుబాటు కుదరక) వారి ఆరోగ్యం దెబ్బతింటుందట. పల్లెల్లో అంతగా చెట్లు లేకున్నా పట్టణాల్లో ఎక్కువ చెట్లున్నా పట్టణాల్లో వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడానికి కారణం (వాహనాల కాలుష్యాన్ని మినహాయించి) వేడిని గ్రహించి రాత్రికి దాన్ని వదిలేసే కాంక్రీట్ భవనాలే. అందుకని కాంక్రీటు భవనాల మధ్య చెట్లు ఉండడంతోపాటు కాంక్రీట్ ఫుట్‌పాత్‌లకు బదులు, గడ్డితో కూడిన ఫుట్‌పాత్‌లు ఉండడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. చెట్లు పార్కులకే పరిమితం కాకుండా ప్రతివీధి, ప్రతి సంధులో చెట్లు ఉండడం వల్ల వాతావరణం చల్లగా ఉండడంతోపాటు సమ ఉష్ణోగ్రత ఉండి ప్రజల ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారంటున్నారు. -
పరీక్షలు ముగిసిన ఆనందంలో కారు నడిపి!
12వ తరగతి (ఇంటర్) పరీక్షలు ముగిసిపోయాయన్న ఆనందంతో ఓ స్కూల్ విద్యార్థి అడ్డగోలుగా కారు నడిపి.. ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. ముగ్గురు స్నేహితులను వెంటపెట్టుకొని గురువారం తెల్లవారుజామున కారులో విహరిస్తూ అతడు పేవ్మెంట్ మీద పడుకుంటున్న అభాగ్యులపై వాహనాన్ని నడిపాడు. దీంతో ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. ఢిల్లీ కాశ్మీర్గేట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కారులో దూసుకొచ్చిన 12వ తరగతి విద్యార్థి ఈ ప్రమాదానికి ఒడిగట్టాడు. మైనర్ అయిన సదరు విద్యార్థి ఓ టాప్ స్కూల్లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతనితోపాటు కారులో ఉన్న అతని ముగ్గురు స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ లేదని సమాచారం. -
హిట్ అండ్ రన్ కు ముగ్గురు బలి..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తరహాలోనే బుధవారం తెల్లవారుజామున చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి మోటారు బైకు నడిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నాడు. మృతిచెందిన ముగ్గురిలో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటననకు సంబంధించి ఒకరిని అరెస్టుచేశామని పోలీసులు చెప్పారు. మృతులతోపాటు ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.