హిట్ అండ్ రన్ కు ముగ్గురు బలి.. | Three pavement dwellers killed in Chennai after motorbike runs over them | Sakshi
Sakshi News home page

హిట్ అండ్ రన్ కు ముగ్గురు బలి..

Published Wed, Jun 3 2015 11:14 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

హిట్ అండ్ రన్ కు ముగ్గురు బలి.. - Sakshi

హిట్ అండ్ రన్ కు ముగ్గురు బలి..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు తరహాలోనే బుధవారం తెల్లవారుజామున చెన్నై నగరంలో ఘోరం జరిగింది. ఫూటుగా మద్యం సేవించిన ఓ వ్యక్తి.. పేవ్మెంట్పై నిద్రిస్తున్న వారిపై నుంచి మోటారు బైకు నడిపి మూడు నిండు ప్రాణాలు బలిగొన్నాడు.

మృతిచెందిన ముగ్గురిలో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. ఈ ఘటననకు సంబంధించి ఒకరిని అరెస్టుచేశామని పోలీసులు చెప్పారు. మృతులతోపాటు ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement