
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,తిరువొత్తియూరు: భర్తను హత్య చేసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సేలం కిచ్చిపాల్యం ఎస్‌ఎంసీ కాలనీకి చెందిన సేతుపతి (33). అతని భార్య ప్రియ (30). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రియకు పక్కింటిలో ఉండే సతీష్ కుమార్ (45)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ కలసి సేతుపతిని హత్య చేసి నీటి తొట్టిలో పడేశారు. గత రెండు రోజుల నుంచి సంప్ నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేసి సేతుపతి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం నిందితులు ప్రియ, సతీష్ కుమార్‌ను అరెస్టు చేశారు.
మరో ఘటనలో..
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
చెన్నై: తిరువొత్తియూరు శివశక్తి నగర్‌కు చెందిన యోగరాజ్ (29) తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఉన్నాడు. 6 నెలలకు ముందు కన్యాకుమారి జిల్లా మార్తాండంకు చెందిన అశ్విని అనే యువతితో అతనికి వివాహమైంది. కన్యాకుమారికి వెళ్లిన తరువాత అశ్విని మళ్లీ అత్తావారింటింకి రాకపోవడంతో విరక్తి చెందిన యోగ రాజు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: బీమా డబ్బులు కోసం.. కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త మామా
Comments
Please login to add a commentAdd a comment