ప్రతికాత్మక చిత్రం
లక్నో: ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కొందరు కలల కంటారు. ఈ జాబితాలో ఆడపిల్లలు ఉండగా.. వాళ్లకు పెళ్లి కాగానే వారి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. భర్తలు భార్యలను అర్థం చేసుకుంటూ వాళ్ల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తున్నారు. అయితే... కొందరు దీన్ని పూర్తిగా మిస్ యూస్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే.. తమ కలల కోసం కష్టపడిన భర్తలకు షాక్కిస్తూ ఇతరులతో వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా, యూపీలోని ఉన్నావ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎస్‌డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా. సరిగ్గా అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో ఒకటి వెలుగు చూసింది. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్, బెల్సి గ్రామానికి చెందిన ఛాయా సింగ్‌ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే ఛాయా సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భర్త విజయపాల్ సింగ్ ముందుకు వచ్చాడు.
తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను తన భార్య కలను తనదిగా భావించాడు. ఉన్నావ్ నగరంలో మంచి కోచింగ్ సెంటర్‌లో కూడా చేర్పించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి ఆమెను చదివించాడు. చివరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరుకగా.. ఆమె 2016లో మహిళా కానిస్టేబుల్‌గా నియమితులైంది. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భర్త రూ.50 వేలు అప్పు తీసుకుని భార్యకు ఇచ్చాడు. చివరికి బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్‌గా విధుల్లో కూడా చేరింది.
ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జాబ్‌లో చేరగానే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ప్రియుడితో పెళ్లి సిద్ధమైంది. ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16న ప్రియుడితో తన భార్య నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని..తన భార్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయ్‌పాల్ ఎస్పీ ఉన్నావ్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment