బస్టాండ్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు | Traveler killed at vinjamuru | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు

Published Sat, Oct 24 2015 12:21 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Traveler killed at vinjamuru

నెల్లూరు జిల్లా వింజమూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. శనివారం ఉదయం బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోగా, స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు చెన్నైకి చెందిన చిన్న నాగేశ్వరరావు (38)గా పోలీసులు గుర్తించారు. గీతల చొక్కా, నల్లరంగు ప్యాంట్ ధరించి ఉన్న అతడి వద్ద ఒక బ్యాగ్ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement