Traveler
-
ఇవిగివిగో... అవిగవిగో!
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించింది 24 సంవత్సరాల ఆకాంక్ష మోంగ. కన్సల్టెన్సీ జాబ్‌ను వదిలేసి ఫుల్‌టైమ్ ట్రావెలర్‌గా మారింది. పుణెకు చెందిన ఆకాంక్ష ట్రావెల్ అండ్ ఫొటోగ్రఫీ విభాగంలో మంచి పేరు తెచ్చుకుంది. ‘కంటెంట్‌ను ప్రేక్షకులకు వేగంగా చేరువ చేయడానికి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయం లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలి’ అంటుంది ఆకాంక్ష. డిజిటల్ క్రియేటర్లు నిలువ నీరులా, గోడకు కొట్టిన మేకులా ఉండకూడదు అనే స్పృహతో యువ క్రియేటర్లు ఎప్పటికప్పుడు కొత్త టాపిక్స్‌పైనే కాదు టూల్స్ గురించి కూడా అవగాహన చేసుకుంటున్నారు. క్రియేటర్–ఫ్రెండ్లీ టూల్స్‌కు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అప్డేట్స్ను వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కంటెంట్ మేకింగ్‌లో మరింత క్రియేటివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.... రెండు నెలల క్రితం ‘మీ షార్ట్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లండి’ అంటూ యూట్యూబ్ కొత్త క్రియేషన్ టూల్స్‌ను తీసుకువచ్చింది. అందులో ఒకటి కొలాబ్. ఈ టూల్‌తో సైడ్–బై–సైడ్ ఫార్మట్‌లో ‘షార్ట్’ను రికార్డ్ చేయవచ్చు. క్రియేటర్లు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవడానికి మల్టిపుల్ లే ఔట్ ఆప్షన్లు ఉంటాయి.గత నెలలో జరిగిన ‘మేడ్ ఆన్ యూట్యూబ్’ కార్యక్రమంలో క్రియేటర్స్‌కు ఉపకరించే కొత్త టూల్స్‌ను ప్రకటించింది కంపెనీ. ‘క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్కు కొత్త టూల్స్ తీసుకురానున్నాం. క్లిష్టం అనుకునే వాటిని సులభతరం, అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసే టూల్స్ ఇవి. క్రియేటివ్ పవర్‌కు దగ్గర కావడానికి ఉపకరిస్తాయి’ అన్నాడు యూ ట్యూబ్ సీయీవో నీల్ మోహన్.యూ ట్యూబ్ ప్రకటించిన కొన్ని టూల్స్.... డ్రీమ్ స్క్రీన్ యూట్యూబ్ షార్ట్స్ కోసం రూపొందించిన న్యూ జెనరేటివ్ ఫీచర్ ఇది. దీని ద్వారా తమ షార్ట్స్‌కు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేయడానికి వీలవుతుంది. పెద్దగా కష్టపడనక్కర్లేకుండానే పాప్ట్ ఇస్తే సరిపోతుంది. ‘డ్రీమ్ స్క్రీన్’ ద్వారా క్రియేటర్లు తమ షార్ట్స్‌కు న్యూ సెట్టింగ్స్ జ నరేట్ చేయవచ్చు. యూట్యూబ్ క్రియేట్ వీడియోలు క్రియేట్ చేయడానికి షేర్ చేయడానికి ఉపకరిస్తుంది. యూట్యూబ్ క్రియేట్ యాప్ ద్వారా ఖచ్చితత్వం, నాణ్యతతో కూడిన ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ కాప్షనింగ్, వాయిస్ వోవర్, యాక్సెస్ టు లైబ్రరీ ఆఫ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్, రాయల్టీ–ఫ్రీ మ్యూజిక్... మొదలైనవి క్రియేటర్లకు ఉపయోగపడతాయి. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పని లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకునేలా వీడియోలను సులభంగా క్రియేట్ చేయవచ్చు. క్రియేటర్ల నోట ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే మాట తరచుగా వినిపిస్తుంటుంది. ప్రస్తుతం దీన్ని ఫీచర్‌గా మలచనున్నారు. ‘హిట్ లైక్ అండ్ సబ్‌స్క్రైబ్’ వినిపిస్తున్నప్పుడు ఈ బటన్లను సింక్‌లోని విజువల్ క్యూతో హైలైట్ చేస్తుంది. ఏఐ ఇన్సైట్స్ యూట్యూబ్‌లో ప్రేక్షకులు చూస్తున్న కంటెంట్ ఆధారంగా వీడియో ఐడియాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. అలౌడ్ ఆటోమేటిక్ డబ్బింగ్ టూల్ ద్వారా కంటెంట్‌ను ఎక్కువ భాషల్లో క్రియేట్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్తో ముందుకు వస్తోంది. వాటిలో ఒకటి క్రియేటర్లు ‘రీల్స్’లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్ గురించి తెలుసుకునే అవకాశం. ఆ ఆడియోనూ ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకోవచ్చు. సేవ్ చేసి అవసరమైన సందర్భంలో వాడుకోవచ్చు. ట్రెండింగ్ టాపిక్స్ ఏమిటో కూడా తెలుసుకోవచ్చు. ‘ప్రస్తుతం పాపులర్ ఏమిటి?’ అనేది తెలుసుకోవడానికి కొత్త డెడికేటెడ్ సెక్షన్ క్రియేటర్లకు ఉపకరిస్తుంది’ అని చెబుతుంది కంపెనీ.‘రీల్స్’ను ఎడిట్ చేయడాన్ని సులభతరం చేయడానికి వీడియో క్లిప్‌లు, ఆడియో, స్టిక్కర్స్, టెక్ట్స్‌ను ఒకేచోటుకు తీసుకువచ్చింది. తమ కంటెంట్ పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకోవడానికి కొత్తగా తీసుకువచ్చిన ‘రీల్స్ ఇన్సైట్స్’తో యాక్సెస్ కావచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్తగా యాడ్ చేసిన ‘టోటల్ వాచ్ టైమ్’ మెట్రిక్, ‘యావరేజ్ టైమ్’ మెట్రిక్‌తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. రీల్స్‌లో ‘స్ట్రాంగర్ హుక్’ క్రియేట్ చేసి వీడియోను ఆకట్టుకునేలా చేయడానికి ఇది ఉపకరిçస్తుంది. అయిననూ... టెక్నాలజీ మాత్రమే సర్వస్వం, విజయ సోపానం అనుకోవడం లేదు యువ క్రియేటర్లు. ‘టెక్నాలజీ అంటే టూల్స్ మాత్రమే కాదు క్రియేటర్ పనితీరు. ప్రత్యేకత. సృజనాత్మకత’ అనే విషయంపై అవగాహన ఉన్న యువ క్రియేటర్లు నేల విడిచి సాము చేయడం లేదు. కంటెంట్, టెక్నాలజీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. -
ప్రపంచాన్ని చుట్టిన తెలుగు వీరుడు..
-
ఆ యాత్ర ఓ చరిత్ర
ఏమాత్రం ఆధునిక ప్రయాణ సాధనాలు లేని రోజుల్లో ‘కాశీ యాత్ర’ చేసినవాడు ఏనుగుల వీరాస్వామి. తన యాత్రానుభవాలను గ్రంథస్థం చేసిన మొదటి ఆధునిక భారతీయ యాత్రికుడూ ఆయనే! వీరాస్వామి పదహారణాల తెలుగువాడు. ఈయన 1780లో చెన్నైలో జన్మించారు. పూర్వీకులు ఒంగోలు ప్రాంతీయులు. మద్రాస్ సుప్రీం కోర్టులో ‘ఇంటర్ ప్రిటర్’ ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత కాశీయాత్ర చేప ట్టారు. ‘రెగినాల్డ్ బిషప్ హెబార్డ్’ అనే తూర్పు ఇండియా కంపెనీ మతాధికారి 1824 – 1826లో భారతదేశ యాత్ర చేసి ‘బిషప్ హెబార్డ్ జర్నల్’ అనే పేరుతో ఓ గ్రంథం రాశారు. ఇదే వీరా స్వామి ‘కాశీ యాత్ర చరిత్ర’ గ్రంథానికి స్ఫూర్తి. వీరాస్వామి ‘కాశీ యాత్ర’ 1830 మే 18వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని తండయారువీడు లోని సొంత ఇంటి నుంచి ప్రారంభమైంది. తల్లి, భార్యతో సహా 100 మందితో బయలుదేరివెళ్లిన ఆయన... 1831 సెప్టెంబర్ 3వ తేదీన మరలా ఇంటికి చేరుకోవడంతో యాత్ర సుఖాంతమైంది. సుమారు 4 వేల కిలోమీటర్ల దూరం 15 నెలల, 15 రోజులు కొనసాగింది. (చదవండి: అక్షర యోధుడు అదృష్టదీపుడు) 1830, మే 22వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి... 33 రోజుల అనంతరం జూన్ 24వ తేదీన తెలంగాణాలో ప్రవేశించి ఆగస్టు 6వ తేదీ వరకు కొనసాగింది. ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్రలో ప్రవే శించారు. తరువాత మధ్యప్రదేశ్ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించి కాశీ చేరుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తన యాత్రానుభ వాలను ‘కాశీ యాత్రా చరిత్రగా’ గ్రంథస్థం చేసి నాటి కాలమాన పరిస్థితులను ముందు తరాలకు అందించారు. వీరాస్వామి కాశీ యాత్ర చేపట్టిన మే 18వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా ఉంటుంది. – కోరాడ శ్రీనివాసరావు సాలూరు మండలం, పార్వతీపురం మన్యం జిల్లా -
హిమాలయాల్లో తెలుగు స్వామీజీ
అన్వేషణ మనిషిని ఎటువైపు తీసుకెళుతుందో చెప్పలేం. జీవితపరమార్థాన్ని వెతుక్కుంటూ నెల్లూరు నుంచి బయల్దేరిన సుందరరాముడు హిమాలయాల చెంతకు చేరితే, గంగోత్రిని దర్శించుకునేందుకు వెళ్లిన ఒక హైదరాబాద్ యాత్రికుడికి సుందర రాముడు సాక్షాత్కరించారు! సముద్రమట్టానికి 10,200 అడుగుల ఎత్తున ఉంటుంది గంగోత్రి. అటువంటి దేవభూమిలో అడుగిడి గంగామాతను సందర్శించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను చూద్దామని నేనూ నా మిత్రుడు బయలుదేరాం. గంగానదికి కుడి పక్కనున్న మాతాదీ ఆలయాన్ని చూసిన తర్వాత ఎడమ వైపుకు వెళ్లాం. సెలయేళ్లు, రకరకాల పుష్పాలు.. అవి దాటి కొంచెం ముందుకు పోతే ప్రకృతి రమణీయతకు మారుపేరా అన్నట్టున్న తపోవనం. విశాలమైన ఆ ఆవరణలో ఓ మూల నీరెండ పడుతోంది. అక్కడ ఓ రుషి పుంగవుడు మంచంపై విశ్రమించి ఉన్నారు. లోపలికి వెళ్లి స్వామి వారికి నమస్కరించాం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అని అనగానే ఏ ఊరి నుంచి అన్నారు స్వామి. ఆశ్చర్యపోతూ ఉబ్బితబ్బిబ్బయ్యాం. ముందు తపోవనం ఆర్ట్ గ్యాలరీని చూసి రండి తర్వాత మాట్లాడదామన్నారు. అలా తెలిసింది ఆయన తెలుగువారని, గత ఆరేడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని! తపోవనమే ఆశ్రమం ఈ తపోవనమే మన తెలుగువారైన స్వామీ సుందరానంద ఆవాసం. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టి గురుపరంపరను వెతుక్కుంటూ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పట్టి బంధించే (తన కెమెరాతో) దిశగా బయలుదేరి ఉత్తరాఖండ్‌లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిని అంతిమ గమ్యంగా ఎంచుకున్నారాయన. హిమాలయాలను ఔపాశన పట్టి ఎక్కడెక్కడి రహస్యాలను ఒడిసిపట్టి సుమారు 35 ఏళ్ల పాటు గంగోత్రిలోనే నివసించిన మహాపండితులు, సన్యాసీ, కీర్తిశేషులు స్వామీ తపోవన్ మహారాజ్ శిష్యుడు స్వామి సుందరానంద. 47 ఏళ్ల కిందట గురువు నుంచి సన్యాసం స్వీకరించిన సుందరానంద ప్రస్తుతం గంగోత్రిలో తపోవన్ (హిరణ్యగర్భ ఆర్ట్ గ్యాలరీ) ని నిర్వహిస్తున్నారు. కట్టుబట్టలతో వచ్చేశారు సుందరానంద స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం. మద్దు పెంచమ్మ, వెంకటసుబ్బయ్య దంపతుల ఐదుగురి సంతానంలో నడిపివారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర రాముడు. సంతానం తప్ప సంపద లేని కుటుంబం. ఏదో సాధించాలన్న తపన. చుట్టూ ప్రపంచాన్ని చూస్తే ఏదో తెలియని వెలితి. «ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కట్టుబట్టలతో ఊరి నుంచి వచ్చేసి బెజవాడ చేరాడు. ఏమి చేయాలో తెలియలేదు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ వెల్కమ్ హోటల్లో సర్వరుగా చేరారు. కడుపు నింపుకోవడానికి ఆ పని సరిపోయినా తన తృష్ణను తీర్చలేకపోయింది. నేతాజీని కలుద్దామని.. సుందర రాముడు బెజవాడ హోటల్లో పని చేస్తున్నప్పుడే రెండో ప్రపంచ యుద్ధ వార్తలు తెలుస్తుండేవి. హోరాహోరా యుద్ధం నడుస్తున్నప్పుడు ఈ హోటల్లో పనేమిటంటూ– విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరేందుకు కోల్‌కతాకు బయలుదేరాడు. సుందరరాముడు కోల్‌కతాకు వెళ్లేటప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉసూరుమన్న సుందరరాముడు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుని గురువును వెతుక్కుంటూ హిమాలయాలకు బయలుదేరారు. ‘‘1948–49లలో హిమాలయపర్వత సానువులకు వచ్చా. 1950–54 మధ్య కాలంలో ఐదారు సార్లు హిమాలయాలను ఎక్కిదిగా.చీలిక పీలికలయిన దుస్తులే ఈ భౌతికకాయాన్నీ, పవిత్ర ఆత్మను కప్పి ఉంచేవి’’ అని చెప్పారు స్వామీజీ. ఆయన పక్కనే పాతకాలం నాటి ఓ కెమెరా కనిపిస్తుంది. దాని గురించి అడిగినప్పుడు స్వామీజీ మందస్మితులయ్యారు. ‘‘అదో పెద్ద కథలే.. ఓసారి హిమాలయ పర్వతారోహణ సమయంలో కెమెరా ఉంటే బాగుండేదనిపించింది. దేవమార్గాన్ని బంధించాలనిపించింది. అప్పుడు డెహ్రడూన్‌లోని శివానంద ఆర్ట్ స్టూడియో వారిని అడిగి రూ.25లకు ఆస్ట్రేలియాకు చెందిన బాక్స్ కెమెరాను కొనుక్కున్నా. అలా నా భుజం మీదకు చేరిన కెమెరాను ఇప్పటివరకు ఎన్నడూ వీడలేదు. ఇప్పుడు నా వయస్సు 92 ఏళ్లు. 60 ఏళ్లకు పైబడి నా చేతిలో ఈ కెమెరా ఉంది’’ అన్నారు సుందరానంద. తాను తీసిన చిత్రాలతో– హిమాలయన్ త్రూ ద లెస్సెన్స్ ఆఫ్ సాధు – అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1962లో ఓసారి ఊరికెళ్లా.. ‘‘అప్పటికే సన్యాసం స్వీకరించా. తపోవన్ స్వాముల వారిది కేరళ. ఆయన అనుమతి మేరకు దేశపర్యటనలో భాగంగా 1962లో ఓసారి మా స్వగ్రామం అనంతపురం వెళ్లా. హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చానని ఊరు ఊరంతా వచ్చి ఊరేగింపు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు నాకు తన, మన అనేదే తెలియదు. అందరూ నా వాళ్లే. మా అప్పచెల్లెళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు’’ అంటారు స్వామీ సుందరానంద. – సీవీఎస్ రఘునాథరావు ప్రధానులు సందర్శించారు గంగోత్రి నదికి కుడి వైపున ఆలయం ఉంటే ఎడమ వైపున తపోవన్ హిరణ్య గర్భ ఆర్ట్ గ్యాలరీ ఉంటుం ది. పూర్తిగా చెక్కతో నిర్మాణం. ఐదంతస్తులు. ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి చెందిన ఫొటోలను ఏర్పాటు చేశారు. ఎవరెస్ట్ పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కే మొదలు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, వాజపేయి వరకు ఎందరెందరో ఈ తపోవన్ను సందర్శించారు. పై అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. యోగాభ్యాసంలో 360కి పైగా విన్యాసాలు ఉంటాయని, తన జన్మభూమి విశ్వంలో కీర్తిప్రతిష్టలు పొందాలన్నదే తెలుగు ప్రజలకు తానిచ్చే సందేశమన్నారు స్వామీజీ. -
మన్నించు మిత్రమా
ఒక జర్మన్ యాత్రికుడు చాలా దూరం ప్రయాణించి ఒక ఆధ్యాత్మిక గురువును దర్శించుకునేందుకు వచ్చాడు. ప్రయాణ బడలికలో చికాకుగా ఉన్న అతను విసుగ్గా బూట్లను విప్పి ఒక మూలకు విసిరేసి ఎదురుగా మూసి ఉన్న తలుపును కాలితో బలంగా తన్ని తెరిచి లోపలికి ప్రవేశించి గురువుకు నమస్కరించాడు. గురువు అతనితో ‘‘నీ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ముందు వెళ్లి ఆ తలుపునకు, నీ బూట్లకు క్షమాపణ చెప్పిరా’’ అన్నాడు. దానికతను ‘‘తలుపు నకు, బూట్లకు క్షమాపణ చెప్పమంటారేమిటి? వాటికి జీవముందా?’’ అని అడిగాడు. ‘‘తలుపును తన్నినప్పుడు, బూట్లను విసిరేసినప్పుడు వాటికి జీవం లేదు అన్న విషయం నీకు గుర్తుకు రాలేదు. కానీ, నేను వాటికి క్షమాపణ చెప్పమన్నప్పుడు మాత్రం ఆ సంగతి నీకు గుర్తొచ్చిందా? ముందు వెళ్లి వాటికి క్షమాపణ చెప్పిరా. అంతవరకు నేను నీతో మాట్లాడను’’ అన్నాడు. ఒక గొప్ప వ్యక్తిని కలవడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన తాను ఇంత చిన్న విషయానికి ఆయనతో మాట్లాడకుండా వెళ్లిపోవడం సమంజసం కాదని గురువు చెప్పినట్లుగా తలుపు దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి, ‘‘కోపంలో నిన్ను అనవసరంగా తన్ని బాధపెట్టాను. నన్ను మన్నించు’’ అని వేడుకున్నాడు. అలాగే బూట్ల దగ్గరకు వెళ్లి చేతులు జోడించి, ‘‘మిత్రులారా! మిమ్మల్ని ఒక మూలకు విసిరేసి అవమాన పరిచాను. నా తప్పును మన్నించండి’’ అని వేడుకున్నాడు. ఇలా చేసిన వెంటనే అతని మనసులోని అలజడి మాయమై అనిర్వచనీయమైన ప్రశాంతత చోటు చేసుకుంది. క్షమాపణ తంతు ముగించి గురువు వద్దకు వెళ్లి కూర్చున్నాడు. గురువు అతనిని చూసి నవ్వుతూ, ‘‘ఇప్పుడు నాకు బాగుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మనం హాయిగా మాట్లాడుకుందాం’’ అన్నాడు. కేవలం మనుషులను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. నిరంతరం ప్రేమలోనే ఉంటూ జీవులను, మనల్ని జీవులుగా ఉంచేవాటినీ ప్రేమించాలి. ప్రేమించగలగాలి. – డి.వి.ఆర్. -
పోలీసుల దాష్టీకం.. వీడియో వైరల్..!
సాక్షి, అనంతపురం: బెంగుళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాలివి.. గుత్తి రైల్వే స్టేషన్లో సురేష్ అనే ప్రయాణికుడు జనరల్ టిక్కెట్‌తో స్లీపర్ కోచ్ ఎక్కబోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీసులు అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీస్ దాడి చేసిన దృశ్యాలను తోటి ప్రయాణికులు వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోలో పోలీస్ సురేష్‌ను లాఠీతో దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణికుడు చెబుతున్న వినిపించుకోకుండా అలానే దాడి చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రయాణికుడు సురేష్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. అకారణంగా నన్ను రైల్వే పోలీసులు కొట్టారని తన బాధను వ్యక్తం చేశాడు. ఈ దాడిపై తోటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. -
శభాష్ నీలిమ
సాక్షి, సిటీబ్యూరో: గుండెపోటుకు గురైన ఓ ప్రయాణికుడిని సత్వరమే ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ముషీరాబాద్–1 డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ నీలిమకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆమె సమయస్ఫూర్తి పట్ల తెలంగాణ ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం బస్‌భవన్‌లో రూ.2 వేల నగదు పురస్కారాన్ని అందజేసి అభినందించారు. సికింద్రాబాద్–జియాగూడ (1జే) రూట్ బస్సుల్లో నీలిమ విధులు నిర్వహిస్తుండగా ఒక ప్రయాణికుడు హార్ట్ ఎటాక్‌తో బాధపడడం గమనించింది. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి సకాలంలో వైద్యం అందేవిధంగా చొరవ చూపింది. దీంతో సదరు ప్రయాణికుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న చైర్మెన్ ఆమెను బస్‌భవన్‌లో అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు నాగరాజు, పురుషోత్తమ్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగు మాయం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగు మాయమైంది. హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన అబూసలాం(40) మంగళవారం రాత్రి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీ బ్యాగు కనిపించకపోవడంతో తొలుత విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీశాడు. ఫలితం లేకుండా పోవడంతో అబూసలాం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాగులో పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్టాండ్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు
నెల్లూరు జిల్లా వింజమూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. శనివారం ఉదయం బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోగా, స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు చెన్నైకి చెందిన చిన్న నాగేశ్వరరావు (38)గా పోలీసులు గుర్తించారు. గీతల చొక్కా, నల్లరంగు ప్యాంట్ ధరించి ఉన్న అతడి వద్ద ఒక బ్యాగ్ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
48 గంటల్లో 8 కిలోల బంగారం స్వాధీనం
సాక్షి, ముంబై: అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 48 గంటల్లో ఆరుగురు ప్రయాణికుల వద్ద నుంచి ఎనిమిది కిలోల బంగారాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ. రూ. 2.14 కోట్ల రూపాయలు ఉంటుంది. సోమవారం ఓ స్మగ్లర్ 50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు కిలోల బంగారాన్ని చెత్త బుట్టలో పడవేశాడు. దీనిని గమనించిన సీఐఎస్ఎఫ్ అధికారి సీజ్ చేశారు. మరో ప్రయాణికుడు బూట్లలో బంగారాన్ని రహస్యంగా దాచుకుని వస్తుండగా పట్టుకున్నారు. మరో ప్రయాణికుడు గొడుగులో పెట్టుకుని వస్తుండగా పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మహ్మద్ షరీఫ్, ఎ.ఎం.ఆర్.మహ్మద్ ఇబ్రహీం అనే ఇరువురు ప్రయాణికుల వద్ద నుంచి 5.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారి ఒకరు వివరించారు.