ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగు మాయం | traveler luguage bag robbery in shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగు మాయం

Published Thu, Feb 25 2016 3:24 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

traveler luguage bag robbery in shamshabad airport

శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగు మాయమైంది.  హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన అబూసలాం(40) మంగళవారం రాత్రి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీ బ్యాగు కనిపించకపోవడంతో తొలుత విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీశాడు. ఫలితం లేకుండా పోవడంతో అబూసలాం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాగులో పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement