luggage bag
-
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
Hyderabad: మెట్రో స్టేషన్లో బ్యాగులు తారుమారు.. ట్వీట్ చేయడంతో..
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులు తమ విలువైన వస్తువులు పోగొట్టుకున్నా.. వారి చేతులు మారినా మెట్రో సిబ్బంది బాధ్యతతో వ్యవహరించి వాటిని సదరు యజమానులకు అందజేస్తున్నారు. ఇటీవల పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తరచూ మెట్రోలో ప్రయాణించే లిజు జాన్ అనే ప్రయాణికుడు ఉదయం 9.30 గంటలకు తన బ్యాగేజీ స్కానింగ్‌కు ఇచ్చే క్రమంలో అది తన చేతులు మారిందని అతను గుర్తించాడు. వెంటనే అతను స్టేషన్‌లోని టికెటింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సిబ్బంది లిజు జాన్ వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించి ఆ బ్యాగ్‌లో లభించిన కాంటాక్ట్ నంబరుకు ఫోన్ చేశారు. దీంతో తన బ్యాగ్‌కు బదులుగా పొరపాటున లిజు జాన్ బ్యాగ్‌ను తీసుకున్న ఓ మహిళా ప్రయాణికురాలు.. 10 నిమిషాలలో పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌కు వచ్చి అప్పజెప్పారు. కాగా ఆ మహిళా ప్రయాణికురాలు ఓ న్యాయవాది. ఆమె బ్యాగ్‌లో అతి ముఖ్యమైన కేస్ ఫైల్స్ ఉండగా, లిజు జాన్ బ్యాగ్‌లో ల్యాప్‌టాప్‌లో అతి ముఖ్యమైన ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. తమ బ్యాగ్‌లను అందజేసిన మెట్రో సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై లిజు ట్వీట్ చేయడంతో నెటిజన్లు మెట్రో సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు. చదవండి: hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా -
మా లగేజ్ ఎక్కడ ?.. ఎయిర్‌పోర్టులో హీరోయిన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ దియా మీర్జాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం (మే 21) జైపూర్ ఎయిర్‌పోర్టులో లగేజీ లేకుండా చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెబుతూ తెలియజేసింది. దియా ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె ప్రయాణిస్తున్న విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. దియా మీర్జా అక్కడ ఎయిర్‌పోర్టులోనే సుమారు 3 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత తన లగేజ్ గురించి ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగితే ఎవరు ఎలాంటి సమాధానం, కానీ సహాయం అందించలేదట. ఈ విషయాన్ని ట్విటర్ హ్యాండిల్లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విస్తారాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇందులో 'ఢిల్లీకి వెళ్లాల్లిన యూకె904 విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది. మేము 3 గంటలు విమానంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఫ్లైట్ రద్దు అయిందని, ఇక్కడ దిగమని చెప్పారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు, సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. మా లగేజ్ బ్యాగులు ఎక్కడా ?' అని పేర్కొంది. దియా ట్వీట్ తర్వాత అనేక మంది ప్రయాణికులు ఆ ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యాన్ని ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇంతలో వాతావరణం బాగా లేనందునే ఫ్లైట్‌ను జైపూర్‌కు మళ్లించినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ట్వీట్ చేసింది. చదవండి: ఓటీటీలతో సినీ ఇండస్ట్రీకి ముప్పుపై దీపికా సమాధానం.. UK904 to Delhi, is diverted to land in Jaipur. We wait inside the aircraft for 3hrs. Then we are told the flight is cancelled and are asked to disembark. NO ONE for the airport authority or Vistara to offer any help or answers. Where are our bags? @airvistara @AAI_Official — Dia Mirza (@deespeak) May 20, 2022 -
నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్ ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె.. విమాన ప్రయాణంలో తన ఖరీదైన లగేజ్ బ్యాగ్ డ్యామేజ్ చేశారని, బ్యాగ్ హ్యాండిల్, వీల్స్ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ను ధ్వంసం చేసిపారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్ రెండు హ్యాండిల్స్ విరిగిపోయానని, వీల్స్ పూర్తిగా ఊడిపోయానని, మీ ధాటికి సామ్‌సొనైట్ బ్యాగ్ తట్టుకోలేకపోయిందంటూ ఇండిగో సిబ్బందికి సోనాక్షి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్లో వరుస సినిమాలతో సోనాక్షి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలో సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్-3’ లో అలరించనున్నారు. -
ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగు మాయం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగు మాయమైంది. హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన అబూసలాం(40) మంగళవారం రాత్రి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీ బ్యాగు కనిపించకపోవడంతో తొలుత విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీశాడు. ఫలితం లేకుండా పోవడంతో అబూసలాం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాగులో పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.