Rajiv gandhi international airport
-
ఆరేళ్లలో ఐదు కోట్ల మంది ప్రయాణికులు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు. ‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్‌పోర్టును నిర్మించారు’ అని వివరించారు. -
భూబదిలీ కాగానే వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో విమానాశ్రయానికి అదనంగా కావాల్సిన 250 ఎకరాల భూమి భారత ఎయిర్పోర్ట్ అథారిటీకి బదిలీ కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగంగానే నిర్వహిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నెక్ట్స్ జనరేషన్ ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన విమానాశ్రయాల్లో తొలుత వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏపీలోని భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. బెదిరింపు కాల్స్‌పై చర్యలకు చట్ట సవరణ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ కాల్స్ చేస్తున్న ఘటనలు తీవ్రమైన నేపథ్యంలో, అలాంటి ఫోన్‌కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. ఫేక్ కాల్స్ విమాన ప్రయాణాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వారికి జైలు శిక్షతోపాటు జీవితాంతం విమానాల్లో ప్రయాణించే వీలు లేకుండా చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఇందుకు భారత పౌరవిమానయాన చట్టం 1982కు సవరణలు ప్రతిపాదించామని, దీనిపై మంత్రివర్గ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోందని, అభిప్రాయ సేకరణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 158కి పెరిగిందని, మరో 50 విమా నాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ‘పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఉన్న 800 విమానాలకు అదనంగా మరో 1,100 విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మన విమానాశ్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో 5.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో 1.26 కోట్ల మంది విమాన ప్రయాణం చేయగా, ఆ సంఖ్య ఈ ఏడాది అదే నెలలో 1.36 కోట్లుగా నమోదైంది’అని పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల భద్రత, సులభతర ప్రయాణ ఏర్పాట్లు, అన్నిచోట్ల జాప్యాన్ని నివారించటమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ భారత విమానయాన రంగంలో ఓ మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు. జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సౌత్చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ మాట్లాడుతూ ఏఐ ఆధారితంగా పనిచేసే కొత్త కేంద్రం ఇటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచటంతోపాటు వారికి మెరుగైన ప్రయాణ అనూభూతిని కలిగిస్తుందన్నారు. 40 రకాల అంశాలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఆధారంగా మానిటర్ చేసే వేగంగా, తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని ఏరకంగానూ ప్రయాణ సమయంలో అనవసరపు జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ వ్యవస్థను జీఎమ్మార్ విమానాశ్రయాలన్నింటిలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. జీఎమ్మార్ గ్రూపు విమానాశ్రయ విభాగ చైర్మన్ జీబీఎస్ రాజు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వాల్నమ్, జీఎమ్మార్ విమానాశ్రయ ప్రతినిధులు శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు, కొత్తగా ప్రారంభించిన కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కేంద్రమంత్రి వెంట రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉన్నారు. -
Hyderabad To Delhi: హలో సిటీ.. చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్యా పరంగా దేశంలోనే 4వ స్థానంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ త్వరలోనే తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకోనుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగం వరకూ చూస్తే నగరం నుంచి ఢిల్లీకి అత్యధికంగా 14.6 శాతం మంది, ముంబైకి 10.8 శాతం మంది, బెంగళూరుకు 10 శాతం మంది రాకపోకలు సాగించినట్టు వెల్లడించింది. మనకు నాలుగో స్థానం... మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 1,10,61,929 మంది ప్రయాణికులతో దేశంలోనే అత్యధిక సంఖ్యలో రాకపోకలు సాగించిన ఎయిర్‌పోర్ట్స్‌లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత 4వ స్థానం దక్కించుకుంది. అయితే 10.9 శాతం పెరుగుదలతో శరవేగంగా బిజీగా మారుతున్న ఎయిర్‌పోర్ట్స్‌లో నగరం ఒకటిగా నిలుస్తోంది.ట్రాఫిక్ హీట్ పుట్టించిన మే... ఈ ఏడాది తొలి అర్ధభాగం అత్యధిక ట్రాఫిక్‌ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చవిచూసింది. అందులోనూ గత మే నెలలో ప్రయాణికుల రద్దీ అత్యధికంగా కనిపించింది. సంఖ్యాపరంగా చూస్తే జనవరి నెలలో 1.802 మిలియన్, ఫిబ్రవరిలో 1.730 మిలియన్, మార్చిలో 1.861 మిలియన్, ఏప్రిల్‌లో 1.858 మిలియన్, మేలో 1.971 మిలియన్, జూన్‌లో 1.841 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఢిల్లీకే ఎక్కువ... నగరం నుంచి ఇతర నగరాలకు రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉండగా అందులో తొలిస్థానం ఢిల్లీకి దక్కింది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఢిల్లీకి 16,14,660 మంది, ముంబైకి 11,97,952 మంది, బెంగళూరుకు 11,11,649 మంది రాకపోకలు సాగించారు. -
ఎయిర్‌పోర్ట్‌లో కొత్త లాంజ్
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్‌కామ్ (ఇఎన్సీఎఎల్ఎమ్) హాస్పిటాలిటీ ‘ట్రాన్సిట్ బై ఎన్‌కామ్’ పేరిట ఏర్పాటైన తమ అధునాతన లాంజ్‌ను మంగళవారం ప్రారంభించింది. ఎన్‌కామ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వికాస్ శర్మ మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌లోని లెవల్ డి అరైవల్స్ వద్ద ఉన్న ఈ ట్రాన్సిట్ లాంజ్‌లో ప్రయాణికుల కోసం 17చ.మీ మీటర్ల నుంచి 51 చ.మీ వరకూ పరిమాణంలో 57 గదులు, జిమ్, ఎన్‌రూట్ కేఫ్, కాఫీ మేకర్, వాక్–ఇన్ షవర్స్, వైఫై, కరెన్సీ మార్పిడి, లగేజీ స్పేస్ లతో పాటు స్పా సౌకర్యం ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. -
విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా ఫ్లైట్‌లోనే సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. మధ్యాహ్నం 2.30కు ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయల్దేరలేకపోయింది. దీంతో గంట నుంచి రేవంత్, భట్టి, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి విమానంలోనే ఉండిపోయారు. కాగా సీఎం రేవంత్, భట్టి, పొన్నం, దీపాదాస్ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నేడు ముంబైలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది. చదవండి: ఇక రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ -
Shamshabad Airport: సారీ.. ఎయిర్‌పోర్టుకు రాలేం
హైదరాబాద్: క్యాబ్‌వాలాలు సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు క్యాబ్ సేవలను నిలిపివేస్తూ ‘లో ఫేర్..నో ఎయిర్’ ప్రచారం చేపట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి నడిపే క్యాబ్‌డ్రైవర్లకు సరైన ఆదాయం లభించకపోవడమే ఇందుకు కారణం. దీంతో సకాలంలో క్యాబ్‌లు లభించక.. ఒకవేళ సర్వీసులు బుక్ అయినప్పటికీ డ్రైవర్లు నిరాకరించడం వల్ల ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సకాలంలో క్యాబ్‌లు లభించక గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ పుష్పక్ బస్సులు, ప్రీపెయిడ్ ట్యాక్సీలు, సొంత వాహనాలు మినహాయించి మరో 5 వేల క్యాబ్‌లు ఇటీవల వరకు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉండేవి. కానీ కొంతకాలంగా ఎయిర్‌పోర్టు నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికి వెళ్లినా తమకు రూ.500 నుంచి రూ.700 వరకు మాత్రమే లభిస్తున్నాయని. దీంతో ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నాయి. ఇది మరింత భారంగా మారిందని తెలంగాణ గ్రిగ్ అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీపెయిడ్ ట్యాక్సీలకు ఒక ట్రిప్పుపైన రూ.980 నుంచి రూ.1150 వరకు లభిస్తుండగా తమకు మాత్రం అతి తక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. దీంతో ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లు నడిపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. ప్రీపెయిడ్ ట్యాక్సీల తరహాలో ఎయిర్‌పోర్టుకు నడిచే క్యాబ్‌లకు ప్రతి కిలోమీటర్‌కు రూ.21 చొప్పున ఇవ్వాలని, అగ్రిగేటర్ సంస్థలకు ఇచ్చే కమిషన్‌ను 30 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని క్యాబ్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ నెలకొంది. బాంబు బెదిరింపు మెయిల్‌తో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ టీం తనిఖీలు చేపట్టాయి. అయితే కాసేపటికే ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను ఇవాళ రాత్రి ఏడుగంటలకు పేల్చేస్తామంటూ ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ మెయిల్ వచ్చింది. దీంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయితే కాసేపటికే అదే మెయిల్ ఐడీ నుంచి మరో మెయిల్ వచ్చింది. తమ కుమారుడి మానసిక స్థితి బాగోలేదని.. అందుకే అలా సందేశం పంపాడని.. క్షమించాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తనిఖీలు మాత్రం కొనసాగించి.. ఆ బెదిరింపును ఫేక్‌గా నిర్ధారించుకున్నాయి. మరోవైపు ఆ మెయిల్స్ బెంగాల్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మెయిల్స్ పంపిన చిరునామాను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. -
వారెవ్వా.. శంషాబాద్ రన్‌వేపై బెలుగా ఎయిర్‌బస్.. అదిరిపోయిందిగా! (ఫొటోలు)
-
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
Shamshabad Airport: ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి?
సాక్షి, హైదరాబాద్: ల్యాండింగ్ అవుతున్న సమయంలో విమానాన్ని పక్షి ఢీకొన్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్నట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొనడంతో కొంత దెబ్బతిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. సదరు ఎయిర్‌లైన్స్ అధికారులు, విమానాశ్రయ వర్గాలు మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. కాగా.. మరో ఘటనలో.. ఈ నెల 18న ఉదయం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఇండిగో విమానానికి వడగళ్ల వానతో ఇబ్బందులు ఎదురయ్యాయి. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో పైలెట్లకు ముందు ఉన్న అద్దంతో పాటు వెనకాల కొంత పలుచోట్ల విమానం దెబ్బతిన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.. -
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సరికొత్త ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల విమానాలను ఫ్రైటర్లుగా మార్చే సరికొత్త ప్రాజెక్టు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రారంభమైంది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్న బోయింగ్–737 విమానాన్ని ఫ్రైటర్గా మార్చనున్నారు. ఈ మేరకు విమానాశ్రయంలో మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) సేవలు అందజేసే జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ (జీఏటీ)కి, బోయింగ్ సంస్థకు మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తరువాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా సేవలందిస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే మొట్టమొదటిసారి విమానాల మార్పు రంగంలోకి అడుగుపెట్టినట్లయింది. ఈ తరహా కన్వర్షన్ సాంకేతిక పరిజ్ఞానం అమలులో చైనా, బ్రిటన్, కోస్టారికా తరువాత నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు ఎయిర్‌పోర్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు బోయింగ్ –737 నుంచి బోయింగ్ –800 వరకు ప్రయాణికుల విమానాలను బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్స్ (బీసీఎఫ్)గా మార్పు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి రానున్న ఐదేళ్లలో 30 విమానాలను ఫ్రైటర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఒప్పందం ప్రతిష్టాత్మకం విమానాల కన్వర్షన్ కోసం బోయింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాలింగ్ కేంద్రాల నుంచి బిడ్లను ఆహా్వనించగా చివరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎంఆర్ఓకు ఈ కాంట్రాక్ట్ లభించడం విశేషం. రానున్న రోజుల్లో బోయింగ్ సరుకు రవాణా రంగంలో తన సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 75 ఫ్రైటర్లను బోయింగ్ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. దీంతో ఎయిర్ కార్గోలో ఇది 6.3 శాతం వరకు విస్తరించనుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ–కామర్స్ రంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందిన దృష్ట్యా హైదరాబాద్ నుంచి అమెరికాతోపాటు వివిధ దేశాలు, మన దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు మధ్య ఫ్రైటర్స్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. కోవిడ్ దృష్ట్యా అంతర్జాతీయంగా రాకపోకలు తగ్గుముఖం పట్టడంతో పలు ఎయిర్‌లైన్స్ సరుకు రవాణా రంగంలోకి తమ సేవలను మార్పు చేశాయి. ఈ క్రమంలోనే బోయింగ్ సైతం ఈ రంగంలో విస్తరణకు చర్యలు చేపట్టింది. బోయింగ్ సంస్థ గత 40 ఏళ్లుగా ప్రయాణికుల సేవలో ఉంది. ఎంఆర్ఓలదే భవితవ్యం ప్రపంచవ్యాప్తంగా విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాలింగ్(ఎంఆర్ఓ) సేవలకు గొప్ప భవిష్యత్తు ఉందని జీఎమ్మార్ ఎయిరో టెక్నిక్ సంస్థ సీఈవో అశోక్ గోపీనాథ్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాము ఎంఆర్ఓ సేవలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రధాన అంతర్జాతీయ నగరాలకు కార్గో సేవలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. -
కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే, బుధవారం రోజున తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. మరోవైపు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. చదవండి: (Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు) -
ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేసిన కేసీఆర్
-
Shamshabad: ప్రధాన టెర్మినల్ నుంచే విమాన సర్వీసులు
శంషాబాద్: దశలవారీగా జరుగుతున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనుల్లో భాగంగా తాత్కాలిక అంతర్జాతీయ డిపార్చర్‌ను మూసివేయనున్నారు. ప్రధాన టెర్మినల్ అనుసంధానంగా నిర్మాణం చేసిన విస్తరణ పనులు పూర్తవడంతో ఈ నెల 28 నుంచి గతంలో మాదిరిగానే ప్రధాన టెర్మినల్ నుంచే అంతర్జాతీయ డిపార్చర్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జీఎంఆర్ సంస్థ పూర్తి చేసినట్లు విమానాశ్రయ వర్గాలు బుధవారం మీడియాకు వెల్లడించాయి. (క్లిక్ చేయండి: బేగంపేట మార్గంలో మళ్లీ ట్రాఫిక్ ఆంక్షలు.. ఫిబ్రవరి 21 వరకు..) -
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీసులు.. 4 గంటల్లోనే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి నేరుగా వియత్నాంకు విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాంలోని హనోయి, హో చి మిన్, డా నాంగ్ నగరాలకు వియట్జెట్ ఫ్లైట్లను నేరుగా నడుపనున్నట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. ఈ సర్వీసులు 4 గంటల్లో వియత్నాం చేరుకుంటాయి. హనోయికి అక్టోబర్ 7న, హో చి మిన్ సిటీకి అక్టోబర్ 9న, డా నాంగ్‌కు నవంబర్ 29వ తేదీన వియట్జెట్ తొలి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు సార్లు ఈ విమాన సర్వీసులు ఉంటాయి. వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటకరంగం అభివృద్ధి చెందుతుందని ఫణికర్ అభిప్రాయపడ్డారు. అలాగే వ్యాపార, వాణిజ్య రంగాల్లోను సంబంధాలు మెరుగు పడతాయన్నారు. కొత్త సర్వీసుల వల్ల భారతదేశంలో తమ నెట్వర్క్ బలోపేతం అవుతుందని వియట్జెట్ కమర్షియల్ డైరెక్టర్ జె.ఎల్.లింగేశ్వర అన్నారు. ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాలకు వారధిగా ఉన్న వియత్నాం సౌందర్యాన్ని ఆస్వాదించడానికి రావాలని ఆయన హైదరాబాద్ పర్యాటకులను ఆహ్వానించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైబిగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9:45 గంటలకు శంషాబాద్ నుంచి మహారాష్ట్రలోని గోండియా వెళ్లాల్సిన ఫ్లైబిగ్ విమానం రన్‌వే పైకి వెళ్లగానే ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తి రన్‌వేపై నిలిచిపోయింది. అయితే ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు విమానం బయలుదేరకపోవడంతో అధికారులపై అసహం వ్యక్తం చేస్తున్నారు. ఆధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రన్ వేపై ప్రయాణికులు ధర్నాకు దిగారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..
శంషాబాద్: ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమయంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా« ది నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలోని క్యాటరింగ్ సర్వీస్ ఉద్యోగి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఈ బంగారాన్ని ఆహార పదార్థాల లోడింగ్, అన్లోడింగ్ పద్ధతిలో హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ కనిపెట్టింది. ఇలా పార్శిల్లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్ఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించింది. అసలు ఈ మాఫియాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారు ఎవరు? ఏయే దేశాల నుంచి ఎంత బంగారం ఇప్పటివరకు వచ్చిందన్న పూర్తి అంశాలపై విచారణ జరుగుతోందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను పెంచుకునేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్ పెరుగుతుంది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్ పెంచొద్దు
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేసిన ప్రతిపాదనలపై దేశీ విమానయాన సంస్థల సమాఖ్య ఎఫ్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిణామాలతో ఎయిర్‌లైన్స్ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో యూడీఎఫ్ పెంచడం సరికాదని, పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి విజ్ఞప్తి చేసింది. థర్డ్ కంట్రోల్ పీరియడ్‌గా వ్యవహరిస్తున్న 2021 ఏప్రిల్–2026 మార్చి మధ్య కాలానికి టారిఫ్‌లను సవరించేందుకు అనుమతించాలంటూ ఏఈఆర్‌ఏకి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశీయంగా ప్రయాణించే వారికి యూడీఎఫ్‌ను ప్రస్తుతమున్న రూ. 281 నుంచి ఏకంగా రూ. 608కి (116% అధికం), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికులకు ప్రస్తుత రూ. 393 నుంచి రూ. 1300కి (231 శాతం) పెంపునకు అనుమతించాలని వీటిల్లో కోరింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని జీఎంఆర్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్లైన్ ద్వారా స్కైట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
శంషాబాద్‌లో 30 విమాన సర్వీసులు రద్దు
సాక్షి, శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
మాస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వ్యాక్సిన్
-
వచ్చేసిందోచ్: హైదరాబాద్ చేరిన స్పుత్నిక్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రష్యా దేశానికి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లు తెలంగాణకు చేరుకున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయానికి శనివారం సాయంత్రం వ్యాక్సిన్ కంటైనర్లు వచ్చాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీహెచ్ఏసీ)కు రష్యా తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ల మొదటి ప్రధాన కన్సైన్మెంట్ చేరుకుంది. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో ఒక పెద్ద మైలురాయి. ఈ వ్యాక్సిన్ సరుకును ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ విమానంలో దిగుమతి చేసుకుంది. ఈ విమానం సాయంత్రం 4.05 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారీ ప్రదేశంగా హైదరాబాద్‌కున్న ప్రత్యేక స్థానం దృష్ట్యా, వ్యాక్సిన్ల సంఖ్యలో పెరుగుదలకు అనుగుణంగా జీహెచ్ఏసీ అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. కొన్నేళ్లల్లో ఈ ప్రాంతం నుంచి 3.5 బిలియన్ల వివిధ రకాల కరోనా వ్యాక్సిన్ల మోతాదులు ఉత్పత్తి అవుతాయని అంచనా. హైదరాబాద్ విమానాశ్రయంలో చేరిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. వీటిని మైనస్ 20 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం జీహెచ్ఏసీ- డాక్టర్ రెడ్డీస్ సప్లై చైన్ బృందం, కస్టమ్స్ విభాగం, ఎయిర్ కార్గోకు చెందిన నిపుణులతో కలిసి పని చేస్తోంది. స్పుత్నిక్ వి కన్సైన్మెంట్ను సజావుగా నిర్వహించడానికి హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7.5 టన్నుల వ్యాక్సిన్ తెలంగాణకు చేరుకుంది. మొత్తం లక్షా 50 వేల డోసుల వ్యాక్సిన్ హైదరాబాద్ చేరింది. చదవండి: ‘భారత్ కోలుకో’: నయాగారా జలపాతం త్రివర్ణశోభితం చదవండి: సంతలో లస్సీ ప్రాణం మీదకు వచ్చింది.. The first consignment of Russian COVID-19 vaccine #SputnikV arrived in Hyderabad. #IndiaFightsBack pic.twitter.com/rIRbl0d0cf — N Ramchander Rao (@N_RamchanderRao) May 1, 2021 -
మహిళ తెలివి: లో దుస్తుల్లో బంగారం పేస్ట్..
సాక్షి, శంషాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ విదేశీ కరెన్సీ పట్టివేత హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం -
రేపటి నుంచి షికాగోకు నాన్‌స్టాప్ విమానం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నేరుగా షికాగో వెళ్లేందుకు ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. షికాగో నుంచి బుధవారం బయల్దేరిన ఎయిర్ ఇండియా బోయింగ్–777 విమానం గురువారం రాత్రి 12.50 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఇదే విమానం శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ అయి నేరుగా షికాగో బయల్దేరుతుందని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి. ప్రతి శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షికాగోకు ఈ సర్వీసు వెళుతుంది. 238 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో 8 మొదటి తరగతి, 35 బిజినెస్ క్లాస్, 195 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి. -
ఎయిర్‌పోర్టులో సందడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలు క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. లక్షలాది మంది వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశీయ సర్వీసులతో పాటు వివిధ దేశాలకు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు.. కోవిడ్ కారణంగా ఎయిర్‌పోర్టులో షాపింగ్ చేసేందుకు భయపడిన జనం.. ఇప్పుడు సరదాగా షాపింగ్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత జీవన విధానాన్ని ప్రారంభించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 23 నుంచి మే 25 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. సరుకు రవాణా కార్గో విమానాలు మాత్రమే నడిచాయి. ఆ తరువాత వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు తరలించేందుకు వందేభారత్ విమానాలను నడిపారు. ప్రయాణికులు మాత్రం కోవిడ్ భయాందోళనలతో రాకపోకలు సాగించారు. మే 25 నుంచి దేశీయ ప్రయాణాలను పునరుద్ధరించారు. మొదట్లో ప్రయాణికుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా అన్ని రకాల ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు పునరుద్ధరించడంతో జనజీవితంలోనూ అనూహ్య మార్పులు వచ్చాయి. కోవిడ్‌కు ముందు ఉన్న పరిస్థితులు నెలకొన్నా యి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగినట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. 6 లక్షలు దాటిన ప్రయాణికులు... ► హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, విశాఖ సహా సుమారు 70 నగరాలకు రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ► కోవిడ్‌కు ముందు ప్రతిరోజూ 55 వేల మందికి పైగా దేశీయ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఇప్పుడు సగటున 20 వేల నుంచి 22 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. ► ఇక అంతర్జాతీయంగా గతంలో ప్రతిరోజు 10 వేల మంది రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు 3 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ► బ్రిటన్‌తో పాటు, దుబాయ్, ఖతార్ తదితర గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు పెరిగాయి. త్వరలో మరిన్ని దేశాలకు విమానాలు నడిచే అవకాశం ఉంది. ► సెప్టెంబర్‌లో 7 వేల దేశీయ సర్వీసులు, 665 అంతర్జాతీయ సర్వీసులు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు. ► ఈ ఒక్క నెలలోనే 6 లక్షల మందికి పైగా దేశీయ, 38 వేలకుపైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగించారు. యూవీ ఓవెన్లో పెట్టి.. ఎయిర్‌పోర్టులో 80 షాపింగ్ ఔట్లెట్స్ ఉన్నాయి. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువును యూవీ ఓవెన్లలో పెట్టి ఇస్తున్నారు. దీంతో వైరస్ పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ట్రయల్ రూమ్స్‌తో పాటు, షాపింగ్ సెంటర్లను కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు. షాపింగ్ ఔట్‌లెట్స్‌లో క్రమంగా విక్రయాలు పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు జాతీయ అవార్డులు
శంషాబాద్: ఇంధన పొదుపు సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు పర్యావరణ హితమైన చర్యలతో ముందుకెళుతున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు జాతీయ పురస్కారాలు దక్కాయి. 2020 కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఇండియా, గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ ఆధ్వర్యంలో ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ జాతీయ అవార్డుల్లో భాగంగా ‘నేషనల్ ఎనర్జీ లీడర్’అవార్డుతో పాటు ‘ఎక్స్లెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్’అవార్డును పొందినట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. గత మూడేళ్లుగా శంషాబాద్ విమానాశ్రయం ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా 4.55 మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. హైదరాబాద్ విమానాశ్రయం ఇంధన వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో అవార్డులు పొందిందని, తమ పనితీరుకు అవార్డులు కొలమానమని జీహెచ్ఐఏఎల్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
నేటి నుంచి 140 దేశీయ విమానాల రాకపోకలు
శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాత్రి 1.20 గంటలకు పుణే నుంచి ఇండిగో విమానం శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇండిగో వి మానం (6ఈ 732) ఇక్కడి నుంచి లక్నో వెళ్లడానికి షెడ్యూల్ నిర్ధారించినట్టు ఆదివారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 30 వరకు రాకపోకలు సాగించే విమానాల రాకపోకల షె డ్యూల్‌ను, నిర్ధారిత వేళల పట్టికను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. షెడ్యూ ల్లో మార్పుచేర్పులు ఉండనున్నాయి. నేడు గన్నవరం, విశాఖ సర్వీసులు రద్దు గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రా రంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ సాంకేతిక కారణాలు వల్ల రద్దయ్యాయి. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
శంషాబాద్‌లో ప్రత్యేక సేవలు
సాక్షి, హైదరాబాద్: కరోనా సృష్టిస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేక సేవలను అందజేస్తోంది. వివిధ ప్రాంతాలకు నిత్యావసర వస్తువులను సరఫరా చే యడంతో పాటు హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి దేశాలకు చేరవేస్తోంది. లాక్డౌన్ ఎత్తివేస్తే దేశీయ విమానాల రాకపోకలకు సైతం ఎయిర్‌పోర్టు పూర్తిగా సన్నద్ధమైంది. ఈదిశగా ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య విమాన సర్వీసులను నడిపేందుకు బుకింగ్ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ టు అమెరికా.. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్లను తీసుకుని ప్రత్యేక విమానం మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది. అమెరికా కాన్సులేట్, తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో దీనిని ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 1617–ఏ–320 విమానం ముంబై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.20కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 99 మంది ప్రయాణికులకు థర్మల్ పరీక్షలు, ఇమిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి విమానంలోకి పంపారు.4.15 గంటలకు ఇక్కడి నుంచి తిరిగి ముంబైకి బయల్దేరింది. అక్కడున్న మరికొందరు ప్రయాణికులతో అమెరికాకు వెళ్లనుంది. ప్రత్యేక సేవల్లో ఎయిర్‌పోర్టు 12ఏళ్ల పాటు నిరంతరాయంగా సేవలందిస్తోన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మొట్టమొదటిసారి లాక్డౌన్ కారణంగా సాధారణ సేవలను నిలిపివేసింది. కానీ కార్గో సేవలు కొనసాగుతున్నాయి. మార్చి 31న ఎయిరిండియా ప్రత్యేక విమానం ద్వారా 38 మంది జర్మన్లను వారి స్వదేశానికి తరలించారు. మార్చి 28న ఇండిగోకు చెందిన ప్రత్యేక మెడికల్ ఎవాక్యుకేషన్ విమానం హైదరాబాద్‌లో దిగి, తన ఎనిమిది మంది సిబ్బందిని హైద రాబాద్‌లో దింపి, ఇక్కడ చిక్కుకుపోయిన ఐదుగు రు సిబ్బందితో చెన్నైకు వెళ్లింది. ఫార్మా, ఔషధాలు, ఇతర అత్యవసర సేవలను ఎయిర్‌పోర్టు కొనసాగిస్తోందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. -
ప్యాసింజర్ విమానంలో అత్యవసరాల తరలింపు
శంషాబాద్: డీజీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యవసర సమయాల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు వినియోగిస్తున్నారు. ఖతార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన క్యూఆర్–8311 విమానం గురువారం రాత్రి 1.30 గంటలకు వైద్య పరికరాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కాగా.. తిరుగు ప్రయాణంలో 28 టన్నుల నిత్యావసరాల సరుకులతో శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి వెళ్లింది. విపత్కర పరిస్థితుల్లో ప్యాసింజర్ విమానాలను కార్గో సేవలకు ఉపయోగించుకునేలా డీజీసీఏ అనుమతించడం మంచి పరిణామమని విమానాశ్రయ సీఈవో ఎస్జీకే కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ప్రత్యేక విమానంలో జర్మన్ల తరలింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చిక్కుకున్న 38 మంది జర్మన్ దేశస్తులను తిరిగి ఆ దేశానికి పంపించేందుకు జర్మనీ కాన్సులేట్ తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో మంగళవారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా వారిని జర్మనీకి తీసుకెళ్లారు. వీరిలో 19 మంది మహిళలు, 17 మంది పురుషులు, మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మన్లను తరలించేందుకు చెన్నై నుంచి వచ్చిన ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్ లైనర్ (బోయింగ్ బీ787–8) విమానం ఏఐ– 3005 ఉదయం 7.32 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయానికి చేరుకున్న జర్మన్లకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఆ విమానంలో చెన్నై నుంచి వచ్చిన మరికొందరు జర్మన్లు ఉన్నారు. ఉదయం 9.22 గంటలకు ఈ ప్రత్యేక విమానం హైదరాబాద్ నుంచి ముంబైకు బయల్దేరింది. అక్కడ మరికొంత మంది ప్రయాణికులను తీసుకుని జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌కు వెళ్లనుంది. ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానం హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఇండిగో విమాన సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రెస్క్యూ విమానాన్ని కూడా ఇదే విమానాశ్రయం నుంచి పంపించారు. మార్చి 28 మధ్యాహ్నం ముంబై నుంచి వచ్చిన ఇండిగో మెడికల్ ఎవాక్యుయేషన్ విమానంలో ఎనిమిది మంది ఇండిగో సిబ్బంది ఇక్కడ దిగారు. హైదరాబాద్‌లో చిక్కుకున్న ఐదుగురు ఇండిగో సిబ్బంది చెన్నైకు బయల్దేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందికి స్క్రీనింగ్ నిర్వహించి, వారి సమాచారాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగేందుకు కృషి చేస్తున్నారు. అత్యవసర వస్తువులైన ఔషధాలు, వ్యాక్సిన్లు, మెడికల్ ఎక్విప్ మెంట్, ఫార్మా ముడి పదార్థాలు, రక్షణ పరికరాలు, బ్యాంకు సంబంధిత వస్తువులతో నగరంనుంచి కార్గో సేవలు కొనసాగుతున్నట్లు జీఎమ్మార్ అధికారులు తెలిపారు. -
కరోనా అలర్ట్: ఎయిర్‌పోర్టు ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తితో జనాలు గడప దాటాలంటేనే జంకుతున్నారు. పలు దేశాలు సైతం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ వైరస్ భయంతో జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే శంషాబాద్ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది. అంతేకాక పలు ఎయిర్‌లైన్ సర్వీసులు కూడా రద్దవడంతో రాకపోకలు స్థంభించాయి. మరోవైపు విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్‌తో సహా ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, డీసీఎం వ్యానులను ఎయిర్‌పోర్టులో అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో ప్రతిరోజు 2 వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వారితో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తున్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మిగతావారిని వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. (ఆకాశవీధిలో..నో టూర్స్) విమానాలు భారీగా రద్దు.. కొన్నిరోజులుగా ఆయా దేశాల ఆంక్షలతోపాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తోపాటు దేశీయ ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నైలాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి. (చిరుత అనుకొని.. పరుగులు పెట్టిన ఎయిర్పోర్ట్ సిబ్బంది) -
విమానాశ్రయంలో పది అంబులెన్స్‌లు
హైదరాబాద్: వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరి 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తుండటంతో శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 10 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. విమానాశ్ర యంలో ప్రతిరోజు 2వేల నుంచి 2,500 మంది ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో కరోనా అనుమానిత లక్షణాలు కనిపిం చిన వారితో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తు న్న ప్రయాణికులకు నగరంలోని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మిగతా వారిని వికారాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. విమానాలు భారీగా రద్దు.. కొన్ని రోజులుగా ఆయా దేశాల ఆంక్షలతో పాటు ప్రయాణికులు కూడా రాకపోకలకు రద్దు చేసుకుంటుండటంతో అంతర్జాతీయ ట్రాఫిక్‌తో పా టు, దేశీయ ట్రాఫిక్ కూడా తగ్గుముఖం పడుతోంది. కోవిడ్ ప్రభావంతో బుధవారం నాలుగు అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు 25 దేశీ య విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాల్లో ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతో పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఢిల్లీ, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను రద్దు చేశాయి. -
ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పేలుస్తానంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. సాయిరాం కాలేరు అనే పేరు మీద వచ్చిన ఈ మెయిల్ మంగళవారం మధ్యాహ్నం 2.31 గంటలకు ఎయిర్‌పోర్టులోని ఆర్జీఐఏ కస్టమ్స్ సపోర్ట్ మెయిల్ ఐడీకి చేరింది. సంబంధిత అధికారులు వెంటనే భద్రతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మెయిల్లో ‘ఐ వాంట్ టు బ్లాస్ట్ బాంబ్ ఇన్ ఎయిర్‌పోర్టు టుమారో’అని ఉంది. దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు సీఐఎస్ఎఫ్, సైబరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర పౌర విమానయాన భద్రత అధికారులకు సమాచారం అందించారు. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి కేసు దర్యాప్తును ప్రారంభించారు. rairamka eru@ ive.com ఐడీతో వచ్చిన మెయిల్‌ను సైబరాబాద్ సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా దేశీయ, అంతర్జాతీయ అరైవల్, డిపార్చుర్ టెర్మినళ్లతో పాటు పార్కింగ్ ఏరియాలను డాగ్‌స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. -
ఓలా క్యాబ్ అంటూ ప్రైవేటుకారులో...
శంషాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కిడ్నాప్ కలకలం చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ప్రయాణికులను ఎక్కించుకుని అనుమానాస్పదంగా వెళ్లిన కారును కుటుంబసభ్యులు వెంబడించి అడ్డుకున్నారు. ముంబైకి చెందిన శ్రీనాథ్, అతని కుటుంబసభ్యులు నగరంలో ఉన్న స్నేహితుడి కుటుంబాన్ని కలవడానికి ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. రెండు ఓలా క్యాబ్‌లను బుక్ చేసుకున్నారు. ముందుగా వచ్చిన ఓలా క్యాబ్‌లో శ్రీనాథ్, అతడి భార్య, మరొకరు కూర్చున్నారు. వీరి కుటుంబంలోని యువతితోపాటు బాలిక, బాలుడు మరో ఓలా క్యాబ్ కోసం బస్టాప్ వద్ద వేచి ఉన్నారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు డ్రైవర్.. ఓలా క్యాబ్ అని చెప్పి వారిని ఎక్కించుకున్నాడు. క్యాబ్ ముందుకెళుతున్న సమయంలో ఓటీపీ చెబుతానని యువతి అనడంతో అక్కర్లేదని క్యాబ్ డ్రైవర్ తిరస్కరించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత కారులోకి అతడి స్నేహితుడు ఎక్కాడు. యువతి అనుమానించి కారును నెమ్మదిగా తీసుకెళ్లమని చెప్పినా డ్రైవర్ వినిపించుకోకుండా వేగం పెంచాడు. ఆమె వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా ఉందని అప్రమత్తం చేసింది. దీంతో వారు ఆ కారును వెంబడించి ఓవర్ టేక్ చేశారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద కారును ఆపి యువతితోపాటు బాలిక, బాలుడిని అందులో నుంచి దించారు. అయితే, డ్రైవర్ పరార్ కాగా కారులో ఉన్న అతడి స్నేహితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌నకు యత్నించిన కారు డ్రైవర్ రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు చెందిన కిషన్ అని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
టాప్ టెన్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు..!
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులకు సేవలందించడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) గొప్ప ప్రగతి సాధించింది. ప్రపంచంలోని టాప్‌టెన్ ఎయిర్‌పోర్టుల్లో 8వ ర్యాంకు పొందింది. ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మొదటి స్థానంలో నిలవగా.. టోక్యో, ఏథెన్స్ ఎయిర్‌పోర్టులు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా నుంచి మరే ఇతర ఎయిర్‌పోర్టు టాప్ 20లో కూడా లేకపోవడం గమనార్హం. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 24వ స్థానంలో నిలిచింది. ఇక అత్యంత చెత్త ఎయిర్‌పోర్టులుగా.. లండన్‌లోని గత్విక్, కెనడాలోని బిల్లీ బిషప్ విమానాశ్రయాలు నిలిచాయి. ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. విమాన ప్రయాణికుల హక్కులు, పరిహారాలు, కేసులు, విమానాల ఆలస్యం, రద్దు తదితర అంశాలపై ఎయిర్‌హెల్ప్ సేవలందిస్తోంది. ఖతార్ రెండోసారి.. ఇక ఎయిర్‌లైన్స్ సేవల్లో కూడా ఖతార్ వరుసగా రెండో ఏడాది మొదటి ర్యాంకు సాధించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిరోమెక్సికో, ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఖంతాస్ ఎయిర్‌లైన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక వరస్ట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో ర్యానైర్ ఎయిర్వేస్, కొరియన్ ఎయిర్, కువైట్ ఎయిర్వేస్, యూకేకు చెందిన ఈస్ట్ జెట్, థామస్ కుక్ టాప్ ర్యాంకుల్లో నిలిచాయి. టాప్ టెన్ ఎయిర్‌పోర్టులు.. 1. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - ఖతర్ 2. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - జపాన్ 3. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - గ్రీస్ 4. అఫోన్సో పీనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ 5. డాన్సిక్ లెచ్ వాటెసా ఎయిర్‌పోర్టు - పోలెండ్ 6. మాస్కో షెరెమ్త్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - రష్యా 7. సింగపూర్ చాంగీ ఎయిర్‌పోర్టు - సింగపూర్ 8. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - ఇండియా 9. టెనెరిఫ్ నార్త్ ఎయిర్‌పోర్టు - స్పెయిన్ 10. విరాకోపోస్/కాంపినాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు - బ్రెజిల్ -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు మరోసారి అరుదైన ఘనత సాధించింది. తాజాగా స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై పురస్కారాలు ప్రకటించింది. అందులో జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో ఉత్తమఎయిర్‌పోర్టుగా పురస్కారం గెలుచుకుంది. మరోవైపు విమానాశ్రయ సిబ్బంది సేవల విభాగంలో మధ్య ఆసియాలోనే మెరుగైన విమానాశ్రయంగాను అవార్డు దక్కించుకుంది. ఒకేసారి రెండు విభాగాల్లో గుర్తింపు సాధించి తన ప్రత్యేకత చాటుకుంది. లండన్‌లో నిర్వహించిన ప్యాసింజర్ ఎక్స్పో కార్యక్రమంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జీహెచ్ఐఎల్) ఈ పురస్కారాలను అందుకుంది. -
డ్రిల్లింగ్ మెషీన్, కుక్కర్లలో బంగారు కడ్డీలు..
సాక్షి, హైదారాబాద్ : బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగేజీ తనిఖీల క్రమంలో నిందితులు పట్టుబడ్డాడు. వీరిలో ఒకతను డ్రిల్లింగ్ మెషీన్ లోపల బంగారు కడ్డీలను దాచిపెట్టగా కస్టమ్స్ అధికారులు వాటిని వెలికి తీశారు. మొత్తం నాలుగు కడ్డీలలో 2 పావు కిలో చొప్పున, మరో రెండు ఒక్కోటి 50 గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా.. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి దగ్గర 219 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిల్వర్ కోటింగ్ వేసిన గోల్డ్ ప్లేట్లను కుక్కర్లో దాచి ఉంచగా బ్యాగేజ్ తనిఖీల్లో బయటపడ్డాయి. -
ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. సత్వరమే భద్రతా తనిఖీలను పూర్తిచేసే ముఖకవళికల(ఫేస్ రికగ్నైజేషన్) నమోదు ప్రక్రియను గతేడాది ఎయిర్‌పోర్టు అధికారులు ప్రారంభించారు. మొదటి దశలో ఎయిర్‌పోర్టు అధికారులు, సిబ్బంది, రెండోదశలో భాగస్వామ్య సంస్థలను ఈ తనిఖీల పరిధిలోకి తెచ్చారు. మొత్తం ఎయిర్‌పోర్టు కమ్యూనిటీ ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. డిజి యాత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫేస్ రికగ్నైజేషన్ను దశలవారీగా జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు కూడా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. రోజూ సుమారు 55,000 మంది ప్రయాణికులు, 400 జాతీయ, అంతర్జాతీయ విమానాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రయాణికుల భద్రతలో భాగంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన అధికారులు తాజాగా ముఖకవళికల నమోదుకు శ్రీకారంచుట్టారు. బ్యాగేజ్ తనిఖీల్లోనూ మరింత పటిష్టమైన ఆటోమేటిక్ ట్రేరిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్) చేపట్టింది. ప్రస్తుతం డొమెస్టిక్ ప్రయాణికుల బ్యాగేజ్‌కి మాత్రమే ఈ ఏటీఆర్‌ఎస్‌ను పరిమితం చేశారు. ముఖ కవళికల నమోదు ఇలా.... ఎయిర్‌పోర్టు టర్మినల్ ప్రవేశమార్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కియోస్క్‌ల ద్వారా ప్రయాణికులకు వన్‌టైమ్ ఫేస్ రికగ్నైజేషన్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఇందుకోసం ప్రయాణికులు ఫేస్ ఐడీతోపాటు, గుర్తింపు ధ్రువీకరణ, ఫొటోలను కియోస్క్‌ల వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం ఈ–బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తారు. దీంతో ఎయిర్‌లైన్ డిపార్చర్ కంట్రోల్ సిస్టమ్‌లో ఆటోమేటిక్‌గా తనిఖీ పూర్తవుతుంది. తర్వాత ప్రయాణికుల ఫేస్ రికగ్నైజేషన్‌తో టికెట్ అందజేస్తారు. ఒకసారి ఫేస్ రికగ్నైజేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఆ తరువాత పదే పదే నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా భద్రతా తనిఖీలను పూర్తిచేసుకొని వెళ్లిపోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఈ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మరి కొద్దిరోజుల్లో డొమెస్టిక్ ప్రయాణికులకు దీనిని విస్తరించనున్నారు. తరువాత అంతర్జాతీయ ప్రయాణికులను ఈ ప్రక్రియలోకి తెచ్చే అవకాశం ఉంది. ఒక సారి ఫేస్ నమోదు పూర్తయిన తరువాత ఇతర ప్రవేశమార్గాల్లో, భద్రతా అధికారుల తనిఖీల్లో మరోసారి నమోదు చేసుకోవలసిన అవసరం ఉండదు. ఏటీఆర్ఎస్ బ్యాగేజ్.. ఎక్స్‌రే–బ్యాగేజ్ తనిఖీల్లో అత్యాధునిక ఆటోమేటిక్ ట్రే రిట్రైవల్ సిస్టమ్(ఏటీఆర్ఎస్)ను ప్రవేశపెట్టారు. ఇది సమగ్రమైన భద్రతా ప్రక్రియ. అన్ని డొమెస్టిక్ సెక్యూరిటీ మార్గాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో ప్రత్యేకంగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా బ్యాగుల తనిఖీ పూర్తవుతుంది. చెక్–పాయింట్ల వద్ద గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. వేగంగా, పటిష్టంగా బ్యాగ్ స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఆటోమేటిక్ ట్రేలలో బ్యాగులు వేసిన తరువాత ఆటోమేటిక్ రోల్లో ఎక్స్‌రే–మెషీన్ల వైపు బ్యాగులు వెళ్తాయి. ఈ ట్రేలను కేబిన్ సైజ్ బ్యాగులు తనిఖీ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి ట్రేకు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ ఉంటుంది. అనుమానాస్పద వస్తువులు ఉన్న బ్యాగులను తొలగించేందుకు ప్రత్యేక లైన్లు ఉంటాయి. అనంతరం అలాంటి బ్యాగులను అధికారులు స్వయంగా తనిఖీ చేసి నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఇంటీరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్ టెర్మినల్(ఐఐడీటీ)లో సమీకృత ఏటీఆర్ఎస్ వ్యవస్థతో పాటు 2 ఎక్స్–రే మెషీన్లు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. -
‘ఫేస్’ చూపించి వెళ్లిపోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: ఇక ఫ్లైట్ మిస్సవుతామనే భయం లేదు. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. ఫ్లైట్ టేకాఫ్ సమయానికి 10 నిమిషాలు ముందు ఎయిర్‌పోర్టులో వాలిపోవడం. క్షణంలో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకొని.. ఎంచక్కా విమానం ఎక్కేయడం. ఇంతటి సదుపాయం ఎక్కడో కాదు.. మన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే. ఈ సరికొత్త సదుపాయం డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఫేస్ రీడింగ్ టెక్నాలజీ ద్వారా భద్రతా తనిఖీలను సులభతరం చేసేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చర్య లు చేపట్టారు. దీనిలో భాగంగానే తొలుత దేశీయ విమాన ప్రయాణికులకు దీన్ని అమల్లోకి తెచ్చి ఆ తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకూ విస్తరించనున్నారు. కొంతకాలంగా ఎయిర్‌పోర్టు సిబ్బంది తనిఖీల కోసం ఫేస్ రీడింగ్ టెక్నాలజీని ఎయిర్‌పోర్టులో విజయవంతంగా అమలు చేస్తున్నారు. సిబ్బంది తనిఖీల్లో ఈ పరిజ్ఞానం సత్ఫలితాలనివ్వడంతో ప్రయాణికులకు కూడా దీనిని విస్తరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరి కొద్ది నెలల్లోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దేశంలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అమలు చేయనున్న మొట్టమొదటి ఎయిర్‌పోర్టు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమే కానుంది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చాలు.. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌తో ప్రయాణికులు తమ వివరాలను ఒక్కసారి నమోదు చేసుకుంటే ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎప్పుడు ప్రయాణం చేసినా ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా లోనికి వెళ్లిపోవచ్చు. కొత్త విధానంలో ముందుగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించిన తర్వాత ఎంట్రన్స్‌లో గుర్తింపు, చిరునామా, ఆధార్, తదితర ధ్రువపత్రాలను అందజేసి అత్యాధునిక కెమెరాల వద్ద ముఖకవళికలను నమోదు చేసుకోవాలి. ఈ కొత్త విధానంలో భాగంగా ఎంట్రీ గేట్ల వద్ద హైటెక్ కెమెరాలు అమరుస్తారు. ఒక్కసారి ఇలా వివరాలు నమోదు చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆ కెమెరాల వైపు చూడగానే అతడి వివరాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. దీంతో బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డులు చూపెట్టాల్సిన అవసరం లేకుండానే అధికారులు సదరు ప్రయాణికుడిని లోపలికి అనుమతిస్తారు. ‘‘ఇది అత్యంత భద్రతతో కూడిన విధానం. ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎంట్రీల్లో ఫేస్ రీడింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఫలితాలు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు హైటెక్ కెమెరాలను ఏర్పాటు చేస్తాం’’అని ఎయిర్‌పోర్టు ఉన్నతా ధికారి ఒకరు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని పూర్తిగా కాగిత రహితంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. ఇందుకోసం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 480 జాతీయ, అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 55,000 మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తే హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
ఎయిర్‌పోర్టులో తప్పిన ప్రమాదం
శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. విమానంలో ఇంధనం నింపే క్రమంలో ఏర్పడిన లీకేజీని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు. జెడ్డా నుంచి ఇండోనేసియా వెళ్తున్న సిటీలింక్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఇంధనం కోసం ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ఇంధనం నింపుతున్న సమయంలో లీకేజీ ఏర్పడి రన్‌వేపై పడింది. దీన్ని వెంటనే గమనించిన సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో రన్‌వేను శుభ్రం చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది. -
ఎయిర్పోర్ట్ దాకా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి హైదరాబాద్ నగరం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులువుగా రాకపోకలు సాగించేందుకు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్లై ఓవర్‌ను ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం మాసబ్‌ట్యాంక్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను బెంగళూరు జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే మార్గంతో అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పీవీ ఎక్స్‌ప్రెస్ వేకు అంకురార్పణ జరిగింది. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో, 11.06 కిలోమీటర్ల పొడవున నిర్మితమైన ఈ ఫ్లైఓవర్ దేశంలోనే అతి పెద్దది. ఈ వంతెనతో బెంగళూరు జాతీయ రహదారి, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనదారులకు కొంత ఊరట కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ వద్ద ముగుస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను విమానాశ్రయం వరకు పొడిగిస్తే ప్రయాణం మరింత సులువుగా ఉంటుందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టింది. వంతెన ముగిసిన తర్వాత వెంటనే గగన్ పహాడ్ ‘వై’జంక్షన్ ఉండటం, శంషాబాద్ పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ఈ ఫ్లై ఓవర్‌ను ఎయిర్‌పోర్టు వరకు కొనసాగిస్తే బాగుంటుందనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. సుమారు 10 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ మార్గం డిజైన్‌ను ఎన్హెచ్ఏఐ రూపొందిస్తోంది. రూ.400 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్న ఇంజనీరింగ్ విభాగం.. మార్గమధ్యంలో రెండు చోట్ల దిగేలా ర్యాంపులు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం కొన్ని చోట్ల భూ సేకరణ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఘనత: నంబర్ వన్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ)కు ప్రపంచస్థాయి నంబర్‌వన్ ర్యాంకు లభించింది. ఏడాదికి 5-15 మిలియన్ల ప్రయాణికుల క్యాటగిరీలో ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ(ఏసీఐ) సంస్థ ఈ గుర్తింపు నిచ్చిందని విమానాశ్రయం యాజమాన్యం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఒక ప్రకటనలో వెల్లడించింది. మారిషస్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఏసీఐ డైరెక్టర్ జనరల్ అంజెలా గిటెన్స్ నుంచి ట్రోఫీ అందుకున్నట్లు జీహెచ్ఐఏఎల్ సీఈవో ఎస్జీకే కిశోర్ తెలిపారు. ఈ గౌరవంతో హైదరాబాద్‌కు మరోసారి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించినట్లయిందని ఆయన వివరించారు. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
షార్జా విమానానికి తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం షార్జాకు బయలు దేరిన విమానానికి పెనుప్రమాదం తప్పింది. కొద్ది దూరం వెళ్లాక విమాన ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని గర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. సాంకేతిక లోపాన్ని పైలట్ ముందే పసిగట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
విమానంలో మహిళ పట్ల అసభ్య ప్రవర్తన..
- ప్రయాణికుడి అరెస్ట్ హైదరాబాద్‌సిటీ సింగపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న సిల్క్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ పట్ల ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో దిగిన అనంతరం సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మలేసియా ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.2 కోట్ల విలువైన సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం భారీగా విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ సిగరెట్లకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తీసుకువచ్చిన ఈ ఖరీదైన విదేశీ బ్రాండ్ల సిగరెట్ల విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. సిగరెట్ల బండిళ్లను సీజ్ చేసి, సంబంధీకుల కోసం విచారణ జరుపుతున్నారు. -
శంషాబాద్‌లో భారీగా నగదు పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళుతున్న ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని పాతబస్తీకి చెందిన అహ్మద్ నుంచి భారత కరెన్సీలో రూ.10 కోట్లు విలువ చేసే విదేశీ కరెన్సీ ఉన్నట్లు ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారులు సోమవారం తెల్లవారుజామున అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతడిని డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో 3.26 కేజీల గోల్డ్ సీజ్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.97 లక్షల విలువైన 3.26 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు శనివారం సీజ్ చేశారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 28 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అదుపు తప్పిన విమానం!
♦ రన్‌వేపై ఘటన ♦ ప్రయాణికులకు తీవ్ర గాయాలు ♦ పరుగులు పెట్టిన భద్రతాదళాలు ♦ అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ శంషాబాద్: అది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. అర్ధరాత్రి 12 గంటలు.. మరికాసేపట్లో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో హైడ్రాలిక్ పవర్ సమస్య తలెత్తింది. ఆ వెంటనే రన్‌వేపై అదుపు తప్పింది. ఆ కుదుపునకు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని స్మోకింగ్ అలారం మోగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు క్రాషింగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. వైద్యుల బృందం, విమానాశ్రయ భద్రతా బలగాలు విమానం సమీపంలోకి క్షణాల్లో చేరుకున్నాయి. హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని బయటకు తరలించి ఆ సమీపంలోనే వైద్య సేవలు ప్రారంభించారు. అచ్చంగా నిజమనిపించే ఈ మాక్‌డ్రిల్ గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించారు. విమా నం కుప్పకూలితే తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టిన ఈ మాక్‌డ్రిల్ విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులనూ అప్రమత్తం చేసింది. దేశంలోనే ప్రథమంగా అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఇందులో సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ సెక్యూరిటీ, జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ విపత్తుల శాఖ సిబ్బంది, జిల్లా వైద్యాధికారులు, 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఇం దుకు వినియోగించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండున్నర గంటలపాటు మాక్‌డ్రిల్ నిర్వహించారు. -
శంషాబాద్‌లో బుల్లెట్ కలకలం
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఏయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అస్సాం వెళ్తున్న శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ వద్ద రెండు బుల్లెట్లు లభించడంతో.. అప్రమత్తమైన ఏయిర్పోర్టు సిబ్బంది విచారణ చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే ఆర్మీ జవాన్ శంషాబాద్ నుంచి బయలుదేరుతున్న సమయంలో చెకింగ్‌లో బుల్లెట్లు బయటపడ్డాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎయిర్ పోర్టులో ప్రయాణికుడి బ్యాగు మాయం
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి లగేజీ బ్యాగు మాయమైంది. హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన అబూసలాం(40) మంగళవారం రాత్రి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి లగేజీ బ్యాగు కనిపించకపోవడంతో తొలుత విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీశాడు. ఫలితం లేకుండా పోవడంతో అబూసలాం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బ్యాగులో పాస్‌పోర్టు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో సోలార్ వెలుగులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎంఆర్ రూ.25 కోట్లతో ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి మంగళవారం ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్‌కు అవసరమైన విద్యుత్‌లో 30 శాతం ఈ ప్లాంటు సమకూరుస్తుంది. రెండు మూడేళ్లలో ప్లాంటు సామర్థ్యాన్ని 30 మెగావాట్లకు చేర్చాలన్నది కంపెనీ ప్రణాళిక. తద్వారా విమానాశ్రయంతోపాటు అనుబంధంగా ఉన్న భవనాలకు మొత్తం విద్యుత్ సోలార్ ప్లాంటు అందిస్తుంది. -
ట్రూజెట్ సర్వీసుల రద్దుతో ప్రయాణికుల అవస్థలు
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే నాలుగు ట్రూ జెట్ సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం ఉదయం 8 గంటలకు శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన 2టీ 101 విమానం రద్దు కావడంతో సుమారు 70 మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వీసు నిలిపివేతకు కారణాలు తెలియకపోవడంతో ప్రయాణికులు సదరు ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతోపాటు ఉదయం 11.30 గంటలకు ఔరంగాబాద్, సాయంత్రం 3 గంటలకు బెంగళూరు వెళ్లే విమానాలతోపాటు 6.20 గంటలకు చెన్నై వెళ్లాల్సిన విమానాలను కూడా సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసింది. విమానాలను రద్దుకు గల కారణాలను వెల్లడించలేదు. -
ఐదు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఐదు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల సీట్ల వద్దనున్న లగేజీలో ఐదు కిలోల బంగారుబిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని నిందితు లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్ పాతబస్తీకి చెందినవారిగా గుర్తించారు. ప్రైవేట్ బస్సులో 50 కిలోల వెండి వస్తువులు.. జడ్చర్ల: ఓ ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 50 కిలోల వెండి సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి కొందరు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్‌ప్లాజా దగ్గర తనిఖీలు చేపట్టి బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పరిశీలించారు. మూడు బ్యాగుల్లో రూ.17 లక్షల విలువజేసే 50 కిలోల వెండి సామగ్రిని గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని వాణిజ్యపన్నులశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో సీటీవో రాధాగోపాల్ పన్ను, జరిమానా కింద రూ.55,536 వసూలు చేసి సామగ్రిని సదరు వ్యక్తికి అప్పగించారు. -
విమానాశ్రయంలో 5 కిలోల బంగారం స్వాధీనం
శంషాబాద్ (రంగారెడ్డి) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన రెండు వేరు వేరు విమానాల్లో గుర్తుతెలియని వ్యక్తులు 5 కిలోల బంగారాన్ని వదిలివెళ్లారు. ఇది గుర్తించిన అధికారులు బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికుల జాబితాను సేకరించి సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా అనుమానాస్పద వ్యక్తుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. -
విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తి వద్ద బుల్లెట్లు లభించటం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్టణం వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన జయరాం అనే వ్యాపారవేత్తను భద్రతా సిబ్బంది సోదాలు చేయగా అతని వద్ద నాలుగు బుల్లెట్లు లభించాయి. వాటితోపాటు వాడేసిన బుల్లెట్లు కూడా నాలుగు దొరికాయి. దీనిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
నకిలీ వీసాతో పట్టుబడిన వ్యక్తి అరెస్ట్
శంషాబాద్ : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్జీఐఏ) పోలీసులకు అప్పగించారు. ఉపాధి నిమిత్తం ఏజెంట్ ద్వారా నకిలీ వీసా పొందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదీర్ బాషా(40) సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి వెళ్లడానికి యత్నిస్తుండగా అతడి వీసాను పరిశీలించిన అధికారులు నకిలీదిగా గుర్తించారు. వెంటనే అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇమిగ్రేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విమానాశ్రయంలో అరకిలో బంగారం పట్టివేత
శంషాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నగరానికి చెందిన ఓ ప్రయాణికుడి తీరును అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అతడి వద్దనున్న టీవీ స్టాండ్‌లో అమర్చి 500 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.10 లక్షల సొత్తుతో ఉడాయించిన టాక్సీ డ్రైవర్
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు. వారిద్దరినీ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖలీద్, బోధన్‌కు చెందిన నాసర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లేందుకు వారిద్దరూ ఓ కారును మాట్లాడుకున్నారు. అందులో ఎక్కి కొంతదూరం వెళ్లాక...'ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్ద మీ జేబులో నుంచి కొన్ని కాగితాలు పడిపోవటం చూశాను. అవి పాస్‌పోర్టు, వీసాలాగానే ఉన్నాయి...' అంటూ కారు డ్రైవర్ వారిని తికమకపెట్టాడు. అతని మాటలు నిజమేననుకున్న ఖలీద్, నాసర్ కారును వెనక్కి తీసుకెళ్లాలని కోరారు. ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్దకు వెళ్లాక వారిద్దరూ కిందికి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని గమనించి కారు డ్రైవర్ వారి లగేజీతో మాయమయ్యాడు. మోస పోయామని గ్రహించిన బాధితులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాగుల్లో 450 కువైట్ దినార్లు, 10 సెల్ఫోన్లు, 5 తులాల బంగారు ఆభరణాలు తదితర రూ.10 లక్షల విలువైన సొత్తు ఉందని వారు పేర్కొన్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఆ కేసు దర్యాప్తు ప్రారంభం కాలేదనే సమాచారం మేరకు వారు జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన జోక్యం చేసుకోవటంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
అగని అక్రమ దందా!
విదేశాల నుంచి యథేచ్ఛగా బంగారం తరలింపు ఆగస్టులోనే 10 కిలోలకు పైగా రవాణా తాజాగా పొట్టలో మాదక ద్రవ్యాలు తీసుకొచ్చిన మహిళ సంచలనాలకు కేంద్ర బిందువుగా విమానాశ్రయం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా తీరు సంచలనంగా మారుతోంది. ఓ వైపు కస్టమ్స్ అధికారులు భారీగా తనిఖీలు చేపట్టినా అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని విదేశాల నుంచి తీసుకొస్తున్నారు. దీంతో ఎంతకూ బంగారం అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పడడం లేదు. ఆదివారం అమెరికా మహిళా మూసా మోజియా (34) ఏకంగా తన కడుపులో మాదకద్రవ్యాల ప్యాకెట్లు తీసుకురావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆరు నెలల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడు కూడా తన కడుపులో 400 గ్రాముల బంగారం ఉండలు మింగి తీసుకురాగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అతడిని పట్టుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు విరేచనాల ద్వారా బంగారాన్ని బయటకు తీశారు. తాజాగా అమెరికా మహిళ కూడా కడుపులో రూ. 50 లక్షలు విలువచేసే మాదకద్రవ్యాల ప్యాకెట్లను తీసుకురాగా.. ఉస్మానియా వైద్యులు అందులో కొన్నింటిని బయటకు తీశారు. ఆగస్టులో అత్యధిక బంగారం.. గతేడాది 2014-ఏప్రిల్ మాసం ప్రారంభం నుంచి 2015 మార్చి 31 వరకు మొత్తం రూ. 39 కోట్ల విలువ చేసే 127 కేజీల అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని 125 కేసులు నమోదు చేశారు. విమానాశ్రయం ఏర్పాటు తర్వాత గత ఆర్థిక సంవత్సరంలోనే భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 25 కేజీలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆగస్టు మాసంలో పది కేజీలకుపైగా బంగారం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. కాగా, అక్రమార్కులు రోజుకో కొత్త ఐడియాతో పసిడిని తీసుకొస్తున్నారు. ఏడాది కిందట ఓ వ్యక్తి బంగారు బిస్కెట్లను తన మలద్వారంలో పెట్టుకుని తీసుకొచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారంతో పాటు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చర్చనీయాంశంగా మారింది. -
శంషాబాద్‌లో ఈ-బోర్డింగ్ పైలట్ పూర్తి: ఆర్జీఐఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో దేశంలో ఈ-బోర్డింగ్ సౌకర్యం ఉన్న తొలి ఎయిర్‌పోర్టుగా నిలిచింది. జెట్ ఎయిర్‌వేస్‌తో కలిసి ఆర్జీఐఏ ఈ ప్రాజెక్టును అమలు చేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇప్పటి వరకు 7 వేల మందికిపైగా ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ-బోర్డింగ్ పైలట్ ప్రాజెక్టును ముంబై, బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాల్లోనూ ప్రారంభించారు. సంప్రదాయ పేపర్ బోర్డింగ్ పాస్‌లకు బదులు ఎలక్ట్రానిక్ విధానంలో చెక్-ఇన్ పూర్తి చేసేందుకు ఈ-బోర్డింగ్ దోహదం చేస్తుంది. ఈ సౌకర్యం కావాల్సిన ప్రయాణికులు ముందుగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన వెబ్సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలతో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు
రంగారెడ్డి (శంషాబాద్) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి పాదరక్షల అడుగుభాగం నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దుబాయ్ నుంచి బయలుదేరి గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పాదరక్షల అడుగుభాగంలో దాచుకొని తీసుకొచ్చిన కిలో పది గ్రాముల బరువున్న నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
‘ట్రూజెట్’ తొలి విమానం ఎగిరింది..
హైదరాబాద్-తిరుపతి సర్వీసును ప్రారంభించిన మంత్రి అశోక గజపతిరాజు శంషాబాద్: నటుడు రాంచరణ్‌తేజ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఆదివారం హైదరాబాద్ నుంచి తిరుపతి, రాజమండ్రిలకు ప్రారంభమయ్యాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక గజపతిరాజు జెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల భక్తుల కోసం ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రికి ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎనిమిదో దేశీయ ఎయిర్‌లైన్స్‌గా ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం కావడం అభినందనీయమని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ అన్నారు. షిర్డీ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి ట్రూజెట్ ఎయిర్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, నటుడు రాంచరణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎలక్ట్రికల్ స్టౌ కింది భాగంలో కిలో బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు ముంబైకి చెందిన రఫీక్‌గా గుర్తించారు. -
సెల్‌ఫోన్ బ్యాటరీల్లో బంగారం..
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి సోమవారం ఉదయం సుమారు రెండు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడతామనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో ప్రయాణికులు పలు రకాలుగా బంగారాన్ని తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రయాణికుడు కూడా సెల్‌ఫోన్ బ్యాటరీల స్థానంలో బంగారాన్ని అమర్చి తీసుకు వచ్చాడు. అయితే అధికారుల తనిఖీల్లో ఆ విషయం బటయపడింది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
డ్యూటీఫ్రీగా జీఎమ్ఆర్ ఎయిర్పోర్ట్
-
ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి లగేజీ నుంచి 2.3 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లోదుస్తుల్లో 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
480 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న480 గ్రాముల బంగారాన్ని వారి వద్ద గుర్తించారు . అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. -
540 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మహిళా ప్రయాణికురాలి నుంచి 540 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళా ప్రయాణికురాలి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ఏడు కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా విమానంలో గురువారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఏడు కిలోల వంద గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీరు ముంబైకి చెందిన సమీరా, సిందియాలుగా గుర్తించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
ఉత్తమ సేవలు..అత్యుత్తమ గుర్తింపు!
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ అవార్డు సేవా ప్రమాణాలపై {పశంసలు సిటీబ్యూరో ప్రయాణికులకు నాణ్యమైన, అత్యుత్తమ సేవలందజేయడంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అనేక విమానాశ్రయాలతో పోటీపడుతూ అవార్డుల పంట పండించుకుంటోంది. గత సంవత్సరం ‘రోల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎయిర్‌పోర్టు క్వాలిటీ సర్వీసు’ అవార్డును సొంతం చేసుకున్న ఆర్జీఐఏ ఈ ఏడాది అంతర్జాతీయ విమానాశ్రయాల సంస్థ (ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్) నిర్వహించిన ఎయిర్‌పోర్టు సేవా ప్రమాణాల సర్వేలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ ప్రతి ఏటా ప్రయాణికుల సదుపాయాలు, భద్రత, తదితర అంశాలలో సేవా ప్రమాణాల సర్వేను నిర్వహిస్తుంది. ఈ సర్వేలో గత ఆరేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా 300 ఎయిర్‌పోర్టులతో పోటీపడుతూ ఆర్జీఐఏ మొదటి మూడు ర్యాంకుల్లో నిలవడం విశేషం. ఈ ఏడాది 50 లక్షల నుంచి కోటీ 50 లక్షల మందికి ప్రయాణ సదుపాయాన్ని అందజేసే విమానాశ్రయం కేటగిరీ కింద ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2009లో నిర్వహించిన సర్వేలో 4.44 శాతం స్కోరు నమోదు కాగా, 2014 లో అది 4.82 కు పెరిగింది. ఏటేటా ప్రపంచమంతటా కొత్త విమానాశ్రయాలు ప్రారంభమవుతున్నాయి. పాతవి ఆధునీకరించుకుంటున్నాయి. అయినప్పటికీ నాణ్యతా ప్రమాణాల్లో జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఈ పోటీని ధీటుగా ఎదుర్కొని నిలవడం అతి పెద్ద విజయం. కోటికి చేరువైన ప్రయాణికులు... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దేశ, విదేశీ ప్రయాణికుల రద్దీ సైతం అనూహ్యంగా పెరిగింది. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు సుమారు 87 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం సేవలను వినియోగించుకున్నారు. మార్చి ఆఖరు నాటికి ఈ సంఖ్య కోటికి చేరుకోవచ్చునని జీఎమ్మార్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రయాణికులో 64 లక్షల మంది దేశీయ ప్రయాణికులు కాగా, మిగతా 22 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఐదు దేశీయ, 15 అంతర్జాతీయ విమానసర్వీసులు ప్రయాణికులకు సేవలందజేస్తున్నాయి. కోల్కత్తా, చెన్నై, విశాఖ,ముంబయి, బెంగళూరు వంటి దేశంలోని 27 ప్రధాన నగరాలకు, దుబాయ్, మస్కట్, లండన్, అబుదాబి, సింగపూర్ వంటి 20 అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇది సమష్టి విజయం గత ఆరేళ్లుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ విజయంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది. జీఎమ్మార్ భాగస్వామ్య సంస్థలు, వివిధ కేటగిరీలలో పని చేసే ఉద్యోగుల కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది.రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అగ్రగామిగా అభివృద్ధి చెందాలనేది మా ఆకాంక్ష. - ఎస్జీకె కిషోర్, సీఈవో, ఆర్జీఐఏ -
ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల్లో శంషాబాద్
-
ఎన్టీఆర్ పేరు తొలగించకుంటే ఆందోళన
సంగారెడ్డి అర్బన్: కేంద్ర ప్రభుత్వం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరుపెట్టడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొట్టడమేనని, కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోని పక్షంలో పెద్ద యెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో డొమెస్టిక్ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజల మధ్య చిచ్చును రగిల్చేలా ఉందన్నారు. రాష్ట్ర శాసన సభకు, ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వత్తిడితో కేంద్రం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రాజీవ్‌గాంధీ పేరును పునరుద్ధరించాలని లేని పక్షంలో భవిష్యత్ కార్యచరణ రూపొందించి ముందుకెళ్తామన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకార్యకర్తలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఏకపక్ష నిర్ణయాలను మానుకొని ఇరురాష్ట్రాల ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మెలిగేలా సహకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ బొజ్జాను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సుప్రభాతరావు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, డిసీసీ కార్యదర్శి శంకర్‌యాదవ్, డీసీసీబీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, శివరాజ్‌పాటిల్, జెడ్పీటీసీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్‌ను అవమానపర్చేందుకే పేరుమార్పు
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం ఆయన ఖ్యాతిని దిగజార్చి.. అవమానపర్చడమేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తే అందుకు సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ సోమవారం శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఉన్న నాలుగు ఎయిర్‌పోర్టులతో పాటు నిర్మాణం చేయదల్చుకున్న వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు. చేసిన వాగ్దానాలను నేరవేర్చలేని స్థితిలో ఉన్న బాబు ఆంధ్రాలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశీయ టెర్మినల్‌కు పెట్టిన ఎన్టీఆర్ పేరును వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు మార్పుపై చిత్తశుద్ధిలేదని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతులు దులిపేసుకుందన్నారు. పేరుమార్పుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని మాజీ హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసిన ఘనత యూపీఏదేనని చెప్పారు. పేర్లు మార్చే సంస్కృతి మంచిది కాదని సబిత హితవుపలికారు. ప్రస్తుతం చేసే ధ ర్నా కేవలం ఆరంభం మాత్రమేనని ఎన్టీఆర్ పేరును తొలగించే వరకు ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్రి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రసంగాల అనంతరం సర్వే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు జాతీయరహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ తర లించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్, కాంగ్రెస్ యువనేత కార్తీక్‌రెడ్డి , జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
పేరు మార్చితే భారీ ఆందోళన
కాంగ్రెస్ నేతల హెచ్చరిక పహాడీషరీఫ్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడితే భారీ ఆందోళన చేపడతామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. 35 మంది పార్టీ నాయకులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అనంతరం టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, మల్లు భట్ట్టివిక్రమార్క స్టేషన్‌కు చేరుకొని హనుమంతరావుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వి.హనుమంత రావు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లు రాల్చుకునేందుకు చంద్రబాబునాయుడు కుట్రతో దేశీయటెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తన పద్ధతి మార్చుకోకపోతే చెప్పులతో స్వాగతం పలకాల్సి ఉంటుందన్నారు. కేంద్రం తనవైఖరిని మార్చుకోకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని దానం నాగేందర్ హెచ్చరించారు. టెర్మినల్ ఎన్టీఆర్ విమానాశ్రయం పేరుతో కేంద్రం జీవో జారీ చేయడం అభ్యంతరకరమని టీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య,టీ కాంగ్రెస్ శాసనసభ పక్షనేత కె.జానారెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ అలీ, మాజీ ఎమ్మెల్యే అనిల్, పీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ ఉన్నారు. -
సోషల్‌మీడియాలో ఆర్జీఐఏ సమాచారం
హైదరాబాద్: విమానాల రాకపోకల వేళలు, ఇతర డెవలప్‌మెంట్స్‌ను ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపర్చనున్నట్లు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(ఆర్జీఐఏ) నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలిపింది. విమానాల రాకపోకలు, విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లు, రిటైల్ ఆప్షన్లు, ఫుడ్ అండ్ బ్రీవరేజ్ సర్వీసులు, డ్యూటీ ఫ్రీ దుకాణాల సమాచారం ఇక నుంచి సోషల్ మీడియాలో అందుబాటులోకి రానుంది. ఫేస్బుక్లో ఆర్జీఐఏ సమాచారం పొందాలనుకునేవారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఫేస్బుక్.కామ్/హైదరాబాద్ఎయిర్పోర్ట్, ట్విట్టర్లో.. ట్విట్టర్.కామ్/ఆర్జీఏఏహెచ్వైడి, యూట్యూబ్‌లో.. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.యూట్యూబ్.కామ్/యూజర్/ఆర్జీ ఐఏహైదరాబాద్ లో సంప్రదించాలని జీఎంఆర్ సంస్థ ఒకప్రకటనలో తెలిపింది. -
సెప్టెంబర్ 14న తొలి హజ్ ఫ్లైట్
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర తొలి ఫ్లైట్ సెప్టెంబర్ 14న ఉదయం 11.30 గంటలకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరుతుందని తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్.ఏ. షుకూర్ వెల్లడించారు. ఈ ఫ్లైట్ ద్వారా 350 మంది యాత్రికులను జెడ్డాకు పంపిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 6050 మందిని హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 12 నుంచి నాంపల్లిలోని హజ్ హౌజ్‌లో యాత్రికులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. -
విమానాశ్రయంలో సందర్శకులపై నిషేధం
స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో... సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సందర్శకుల రాకపోకలపై నిషేధం విధించారు. కేవలం విమానంలో ప్రయాణించే వారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. వారితో పాటు వచ్చే బంధువులు, స్నేహితులను మాత్రం లోనికి అనుమతించరు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 5 నుంచి 20 వరకు అమల్లో ఉంటాయి. నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో బందోబస్తును మరింత పటిష్టం చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయాల్లో రెడ్అలర్ట్ కూడా ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ఉగ్రవాదులు విజిటర్స్ పాసులు, ప్రవేశ టికెట్లు ఖరీదు చేసి లోనికి వచ్చి విధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయనే అనుమానంపై ఈ నిషేధం విధించినట్లు తెలిసింది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు
* పోలవరం ఆర్డినెన్స్ వివాదాస్పదమేమీ కాదు * గత ప్రభుత్వ హామీనే అమలుచేశాం * కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎన్టీయార్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ప్రస్తుత డిమాండ్‌ను పరిశీలిస్తామని, అవకాశం ఉంటే మార్చేస్తామని చెప్పారు. ఆయన గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం, మళ్లీ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే... బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరు, దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుండేది. టీడీపీ హయాంలో శంషాబాద్‌లో కొత్త విమానాశ్రయం ఏర్పాటుచేసింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టింది. పేరు మార్చాలని మహానాడులో డిమాండ్ వచ్చింది. డిమాండ్‌ను పరిశీలించి, అవకాశం ఉంటే మార్చేస్తాం. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో వివాదమేమీ లేదు. కొత్త విషయం అంతకన్నా లేదు. పోల వరం స్వాతంత్య్రంనాటి నుంచి పెండింగ్‌లో ఉంది. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతామని గత ప్రభుత్వం పార్లమెంట్లో హామీ ఇచ్చింది. బీజేపీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. అయితే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రపతి ఆపేసి ఉండొచ్చు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. దీన్ని కొందరు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు కాబోయే(డిజిగ్నేటెడ్) ముఖ్యమంత్రులను పిలిచి చర్చ పెట్టాలంటే.. అపాయింటెడ్ డేను పోస్ట్‌పోన్ చేయాలి. కానీ అందుకు ప్రజలు ఇష్టపడకపోవచ్చు. -
ఎయిర్‌పోర్ట్‌లో రెండున్నర కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్, న్యూస్‌లైన్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మీర్ మహ్మద్ హుస్సేన్(35) సింగపూర్ నుంచి సిల్క్ ఎయిర్‌లైన్స్ ఎంఐ(478) విమానంలో గురువారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్యాంటు, చొక్కా లోపలి భాగంలో రెండు బంగారు బిస్కెట్లు, ఓ బ్రాస్లెట్ కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇవి 2 కిలోల 499 గ్రాముల బరువు ఉన్నాయి. వీటి రూ.75 లక్షల విలువ ఉంటుందని అధికారులు నిర్ధారించారు. హుస్సేన్ అక్రవుంగా బంగారం తెస్తున్నందున అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. తనిఖీల్లో కస్టమ్స్ అడిషనల్ కమిషనర్ ఆర్. మనోహర్, డిప్యూటీ కమిషనర్ ఈవీఎన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కల్యాణ్, కస్టమ్స్ సూపరిండెంట్ రామకృష్ణారావు, ఎయిర్ ఇంటలిజెన్స్ అధికారులు అన్వర్, మొహినుద్దీన్, ప్రతాప్‌రెడ్డి, హుస్సేన్ పాల్గొన్నారు. ఫిబ్రవరి మాసంలో అధికంగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫిబ్రవరి నెలలోనే పదికిపైగా బంగారం పట్టివేత కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో కస్టమ్స్ అధికారులు సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేజీ బంగారానికి సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రో ప్లేట్ల రూపంలో రెండున్నర కేజీల బంగారాన్ని తీసుకొచ్చాడు. పాప్‌కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో, లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా ఇలా పలు విధాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోయూరు. -
ఎయిర్‌పోర్టు కేంద్రంగా అఘాయిత్యాలు
శంషాబాద్, న్యూస్‌లైన్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకున్న ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు మహిళలను కిడ్నాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో ఇప్పటి వరకు ఈ ఘటనలు వెలుగులోకి రాలేదు. అయితే ఈనెల 24న ఎయిర్‌పోర్టు ఉద్యోగినిని ఈ ముఠా కిడ్నాప్ చేసింది. లైంగికదాడికి యత్నించగా కుక్కలు అరవడంతో ఆమెను వదిలి పారిపోయారు. బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దుండగుల పాపాలు పండాయి. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఆ ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసి క్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, ఎస్ఓటీ ఓఎస్డీ కసిరెడ్డి గోవర్ధన్‌రెడ్డితో కలిసి నిందితుల వివరాలు మీడియాకు తెలిపారు. రంగారెడ్డిజిల్లా తుక్కుగూడకు చెందిన కారు డ్రైవర్ పి.జగన్ (26) మూడేళ్ల క్రితం రెండెకరాల భూమిని విక్రయించగా రూ.30 లక్షలు వచ్చాయి.ఈ డబ్బులో కొంత ఖర్చు చేసి చెల్లెలి పెళ్లి చేశాడు. మిగతా డబ్బుతో క్యాబ్ (ఏపీ ఏపీ29టీవీ5844) కొన్నాడు. ఇందులో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికులను ఎక్కించుకొని.. వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతనికి కర్మన్‌ఘాట్‌కు చెందిన డ్రైవర్ టి.శ్రీనివాస్ (31)తో పరిచయం ఏర్పడింది. రాత్రి వేళల్లో ఇద్దరూ విమానాశ్రయం వద్ద కాపుకాస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను లిఫ్ట్ ఇస్తామని క్యాబ్‌లో ఎక్కించుకొని కిడ్నాప్ చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఒక్కోసారి బాధిత మహిళకు డబ్బు ఇచ్చి పంపిస్తున్న వీరు.. మరికొందరు బాధితుల వద్ద ఉన్న బ్యాగ్‌లోని సొత్తును దోచుకుంటున్నారు. ఇలా ఈ ముఠా రెండేళ్లుగా అఘాయిత్యాలకు పాల్పడుతోంది. బాధితులెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే ఈ నెల 24న ఎయిర్‌పోర్టులో విధులు ముగించుకుని రాత్రి 7.30కి ప్రధాన గేటు ముందు నిల్చున్న మహిళ (30)ను లిఫ్ట్ ఇస్తామని ఎక్కించుకుని తొండుపల్లిలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ జగన్ ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. పక్కనే ఉన్న ఫాంహౌస్‌లోని కుక్కలు ఐదు నిమిషాల పాటు భౌ..భౌ.. భౌమని అరవడంతో భయపడ్డ నిందితులు ఆమెను కారులోంచి బయటకు తోసి పారిపోయారు. మరుసటి రోజు బాధితురాలు ఆర్జీఐ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఎస్ఓటీ, ఆర్జీఐ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, పుష్పన్‌కుమార్, దుర్గాప్రసాద్, ఎస్ఐలు నాగరాజు, మహేష్‌గౌడ్, శ్రీకాంత్‌లు రంగంలోకి దిగారు. ఇలా పట్టుబడ్డారు... విమానాశ్రయం ప్రధాన గేటు నుంచి తొండుపల్లి వరకు ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసుల దర్యాప్తు ఆగిపోయింది. అయితే, పోలీసులు క్యాబ్ డ్రైవర్ల ప్రవర్తన, వారి వ్యక్తిగత వివరాలపై ఆరా తీయగా.. జగన్, శ్రీనివాస్‌లపై అనుమానం కలిగింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈనెల 24న మహిళను తామే కిడ్నాప్ చేశామని అంగీకరించారు. జగన్ ఇంట్లో పోలీసులు సోదా చేయగా రెండు లేడీస్ బ్యాగ్‌లు దొరికాయి. ఒక బ్యాగ్ 24న కిడ్నాప్ చేసిన మహిళది కాగా.. మరో బ్యాగ్ గతేడాది డిసెంబర్ 16న తాము కిడ్నాప్ చేసిన మరో మహిళదని నిందితులు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులను మరింత లోతుగా విచారించగా ఇప్పటి వరకు నాలుగైదు నేరాలకు పాల్పడ్డామని తెలిపారు. తొండుపల్లి, శంషాబాద్, మంకాల్, షాపూర్ గ్రామ శివార్లకు మహిళలను తీసుకెళ్లే వారమని చెప్పారు. అయితే వీరి చేతికి చిక్కిన బాధితులు ఎవరనేది పోలీసులు గుర్తించలేకపోతున్నారు. నిందితులకు కూడా వారి వివరాలు తెలియదు. బాధితులెవ్వరూ ఫిర్యాదు చేసేందుకు ముందు రాకపోవడంతో నిందితులిద్దరూ ఇంకెన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డారోనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు. బాధితుల్లో విమాన ప్రయాణికులు కూడా ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
నిఘా నేత్రంపై నిర్లక్ష్యం
శంషాబాద్, న్యూస్‌లైన్: నిందితుల కంటికి కనిపించని ఆ నాలుగో సింహమే సీసీ కెమెరా. వీటి ద్వారా పలు సంచలనాత్మక కేసుల గుట్టును ఇట్టే విప్పారు మన పోలీసులు. సాధారణ, రద్దీ ప్రాంతాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, చౌరస్తాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. మంచి ఫలితాలు సాధించిన మన పోలీసులు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆర్జీఐ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ మార్గంలో దొంగలు, ఉగ్రవాదులు రాకపోకలు సాగించినా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. బెంగళూరు జాతీయ రహదారి (శంషాబాద్) నుంచి రాజీవ్‌గాంధీ అంత ర్జాతీయ విమానాశ్రయం వరకు 8 కి లో మీటర్లు గల ఈ రహదారి మీదుగా వీవీఐపీ, వీఐపీలు, దేశవిదేశాల నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణం చేస్తుంటారు. ఇంతటి ప్రధాన్యత గల ఈ మార్గంలో ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఐఎస్ఐ ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టులోకి చొరబడి విమానాలను హైజాక్ చేసే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ముష్కరుల టార్గెట్‌లో ఉన్న ఈ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన పోలీసులు నిర్లక్ష్య చేస్తున్నారు. జీఎంఆర్‌ఐ, సైబరాబాద్ పోలీసుల సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఓ క్యాబ్ డ్రైవర్ ఎయిర్‌పోర్టు బయట నిలబడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసి, జాతీయ రహదారి వరకూ తీసుకెళ్లి పారిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు ఇప్పటి వరకు ఆ క్యాబ్ ఆచూకీ, కనీసం దాని రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా కనిపెట్టలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఈ మార్గంలో సీసీ కెమెరాలు లేకపోవడమే. సీసీ కెమెరా ఉండి ఉంటే దాని ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడి కనిపెట్టి.. కటకటాల్లోకి నెట్టి ఉండేవారు. -
అక్కడ రాజ్యాంగమే మారిపోయింది
నోటిఫైడ్ ఏరియా కమిటీలు 74వ రాజ్యాంగ సవరణతోనే రద్దు అయినా రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా గుర్తింపు పంచాయతీ.. మునిసిపాలిటీల్లో లేని ‘జీఎంఆర్’ ‘ఐలా’లోనూ లేదు.. పన్నులు ఎవరికీ చెల్లించకుండా సొంత కమిటీ ఒప్పందం ప్రకారం రోడ్లు వేయాల్సిన జీఎంఆర్.. తాజాగా నోటిఫైడ్ ఏరియా కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడం గమనార్హం సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాజ్యాంగమే మారిపోయింది. 74వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 243 (క్యూ)తో నోటిఫైడ్ ఏరియా కమిటీలు రద్దయ్యాయి. పరిశ్రమలు, పోర్టులు, విమానాశ్రయాలు ఏవైనా సరే.. అవి పంచాయతీ లేదా మునిసిపాలిటీ పరిధిలోకి రావాల్సిందే. లేదంటే స్థానిక పారిశ్రామిక ప్రాంత సంస్థ(ఐలా)లా ఉండాలి. కానీ, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రం ఇందుకు భిన్నంగా నోటిఫైడ్ ఏరియాగా గుర్తించారు. దీని వల్ల స్థానిక సంస్థలకు ఈ విమానాశ్రయంపై ఎలాంటి అధికారాలు ఉండవు. విమానాశ్రయ సంస్థదే ఇష్టారాజ్యం. నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలు స్థానిక సంస్థల పరిధిలోకి రావు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయ యాజమాన్యం నోటిఫైడ్ ఏరియాగా 1965 రాష్ట్ర మున్సిపల్ చట్టం 389 (ఏ) కింద ఉత్తర్వులు తెచ్చుకుంది. వాస్తవానికి 74వ రాజ్యాంగ సవరణ తర్వాత అందుకు అనుగుణంగా రాష్ట్ర మున్సిపల్ చట్టాన్ని ఏడాదిలోగా సవరించుకోవాలి. సవరించుకోని పక్షంలో రాష్ట్ర చట్టంలోని నిబంధనలు ఆటోమేటిక్‌గా తొలగుతాయి. 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం నోటిఫైడ్ ఏరియాగా గుర్తించడానికి వీల్లేదని పురపాలక శాఖ అధికారి ప్రభుత్వానికి స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ విమానాశ్రయానికి మరో మూడేళ్ల పాటు నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఏప్రిల్ 24 నుంచి అమలులోకి వచ్చేలా పురపాలక శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. 74వ రాజ్యాంగ సవ రణతో నోటిఫైడ్ ఏరియా కమిటీలుగా ఉన్న రామగుండం, మందమర్రి, పాల్వంచలను మునిసిపాలిటీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కొత్తగా నోటిఫైడ్ ఏరియా కమిటీలను ఏర్పాటు చేయలేదు. కానీ జీఎంఆర్‌ను మాత్రం నోటిఫైడ్ ఏరియా కమిటీగా గుర్తించారు. అంతర్జాతీయ విమానాశ్రయం స్థానిక సంస్థ పరిధిలో ఉంటే ఆరేడు కోట్ల రూపాయలు మేరకు ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చేదని ఓ అధికారి చెప్పారు. జీఎంఆర్ సంస్థ విమానాశ్రయంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా.. సొంత నిధుల నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మధ్య ఒక రహదారి కోసం రూ. పది కోట్లు నోటిఫైడ్ ఏరియా కమిటీ ఫండ్ నుంచి వినియోగించడంపై కమిటీలోని ప్రభుత్వ అధికారి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఆ నిధులను జీఎంఆర్ తిరిగి కమిటీకి జమ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశ్రామిక వాడల్లో సరైన మౌలిక వసతులు కల్పించడం లేదన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఇండస్ట్రీయల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను ఏర్పాటు చేసింది. ఆ విధంగా రాష్ట్రంలో దాదాపు 76 ఐలాలు ఉన్నాయి. ఈ ఐలాల్లో వసూలవుతున్న పన్నుల్లో 35% స్థానిక సంస్థకు (మునిసిపాలిటీ లేదా గ్రామ పంచాయతీకి) చెల్లిస్తూ.. మిగిలిన 65% నిధులను ఆ ప్రాంతంలో అభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నాయి. జీఎంఆర్ విమానాశ్రయం నోటిఫైడ్ ఏరియాగా ఉండడంతో.. ఆ 35% నిధులు ఏ సంస్థకూ చెల్లించడం లేదు. నోటిఫైడ్ ఏరియా కమిటీలో ప్రభుత్వ ఉన్నతాధికారులు నలుగురు ఉన్నా.. ఒకరిద్దరు కూడా సమావేశాలకు వెళ్లడం లేదు. సమావేశం మినిట్స్ వస్తే.. వాటిపై సంతకాలు చేసి పంపిస్తున్నట్లు సమాచారం. -
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఉత్తమ అవార్డు
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ (ఆర్జీఐఏ)కి ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్ట్' అవార్డు లభించింది. జైపూర్ లో జరిగిన ఎయిర్ కార్డో ఏజెంట్స్ అసోసియేషన్ 40వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఇది వరుసగా రెండవసారి అని జీఎంఆర్ హైదరబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ వెల్లడించింది. తమ సంస్థ చిత్తశుద్దిని, అందిస్తున్న సేవలకు ప్రతిరూపమే ఈ అవార్డు అని సీఈఓ ఎస్ జీకే కిశోర్ అన్నారు. -
16న రాష్ట్రానికి కేంద్ర మంత్రి చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11.15కు జరిగే ‘ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సిస్టమ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ ఠక్రూ కూడా రాష్ట్రానికి రానున్నారు.