
‘ట్రూజెట్’ తొలి విమానం ఎగిరింది..
హైదరాబాద్-తిరుపతి సర్వీసును
ప్రారంభించిన మంత్రి అశోక గజపతిరాజు
శంషాబాద్: నటుడు రాంచరణ్‌తేజ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఆదివారం హైదరాబాద్ నుంచి తిరుపతి, రాజమండ్రిలకు ప్రారంభమయ్యాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌరవిమానయాన శాఖ మంత్రి పి. అశోక గజపతిరాజు జెండా ఊపి సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల భక్తుల కోసం ఈ నెల 12 నుంచి 25వ తేదీ వరకు రాజమండ్రికి ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయని తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎనిమిదో దేశీయ ఎయిర్‌లైన్స్‌గా ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం కావడం అభినందనీయమని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్ అన్నారు. షిర్డీ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి ట్రూజెట్ ఎయిర్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు, నటుడు రాంచరణ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు.