మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాత్రమే బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న చెర్రి.. పలు వ్యాపార సంస్థలో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో ఓ విమానాయాన సంస్థ కూడా ఉంది. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్ పేరుతో డొమాస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది.
తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్‌వేస్ సంస్థను ప్రారంభించిన రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో దీనిపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేస్తూ.. ‘ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి. ఈ సంస్థలో పని చేసే ఇద్దరూ అధికారులు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఇన్వెస్టర్ కూడా రానున్నారు.
ఇన్వెస్టర్స్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉమేష్ గారే కొనసాగనున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలిక నిలిపివేశాం. టెంపరరిగా ట్రూజెట్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ పునఃప్రారంభిస్తాం. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము” అని ఈ ప్రకటనలో తెలిపారు.
చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్!
— TruJet (@FlyTruJet) February 16, 2022
Comments
Please login to add a commentAdd a comment