domestic airlines
-
మరో 25 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు. కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. -
7030 విమానాలు రద్దు.. గవర్నమెంట్ డేటా
దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం.. క్యారియర్లు 2024లో 4,56,919 షెడ్యూల్డ్ డిపార్చర్లను నిర్వహించాలి. 2022లో 6,413 విమానాలు రద్దయ్యాయని, 2023లో ఈ సంఖ్య 7,427కి పెరిగిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తెలిపారు.డిజి యాత్ర (Digi Yatra) గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, దశలవారీగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా విమాన ప్రయాణికులు డిజి యాత్రను ఉపయోగించారు.డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా రూపొందించారు. విమానాశ్రయాల్లోని వివిధ చెక్పాయింట్ల వద్ద కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రయాణికుల డేటా అంత ఉంటుంది. అయితే విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి డేటా తొలగిస్తుంది. ఇది ప్రయాణికులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతుంది. -
మళ్లీ లాభాల్లోకి దేశీ ఎయిర్‌లైన్స్
ముంబై: కోవిడ్ మహమ్మారి ధాటికి కుదేలైన దేశీ విమానయాన సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్లీ లాభాల బాట పట్టనున్నాయి. వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, రుణభారాన్ని తగ్గించుకోవడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఇచ్చిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏవియేషన్ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో తమ నష్టాల భారాన్ని 75–80 శాతం మేర రూ. 3,500–4,500 కోట్లకు తగ్గించుకోనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇది రూ. 17,500 కోట్లుగా నమోదైంది. ప్యాసింజర్ల ట్రాఫిక్ గణనీయంగా మెరుగుపడటం, వ్యయాలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం వంటివి ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా విమానయానంలో 75 శాతం వాటా ఉన్న మూడు పెద్ద ఎయిర్‌లైన్స్‌పై విశ్లేషణ ఆధారంగా క్రిసిల్ ఈ అంచనాలు రూపొందించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ .. కోవిడ్ పూర్వ స్థాయిని అధిగమించవచ్చని, చార్జీలు అప్పటితో పోలిస్తే 20–25 శాతం అధిక స్థాయిలో ఉండవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. విమాన ఇంధన ధరలు సగటున తగ్గడం కూడా దీనికి తోడైతే ఎయిర్‌లైన్స్ నిర్వహణ పనితీరు మెరుగుపడి, అవి లాభాల్లోకి మళ్లగలవని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ► 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (కోవిడ్ పూర్వం) ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకూ 9 నెలల కాలంలో దేశీ, అంతర్జాతీయ ప్యాసింజర్ ట్రాఫిక్ వరుసగా 90 శాతం, 98 శాతానికి కోలుకుంది. ► అంతర్జాతీయ సర్వీసులను కూడా పునరుద్ధరించడంతో బిజినెస్, విహార ప్రయాణాలు సైతం పెరిగాయి. ద్వితీయార్ధంలో పండుగల సీజన్ కూడా వేగవంతమైన రికవరీకి ఊతమిచ్చింది. ► అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నా భారత్ ఎదుర్కొని నిలబడుతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరమూ ఇదే తీరు కొనసాగవచ్చని అంచనాలున్నాయి. ► చార్జీలపై పరిమితులను తొలగించడమనేది విమానయాన సంస్థలు తమ వ్యయాల భారాన్ని ప్రయాణికులకు బదలాయించేందుకు ఉపయోగపడుతోంది. ► ఏవియేషన్ రంగం వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 8,000–10,000 కోట్ల ఈక్విటీని సమకూర్చుకోనుంది. విమానాల సంఖ్యను పెంచుకునేందుకు, ప్రస్తుతమున్న వాటిని సరిచేసుకునేందుకు నిధులను వెచ్చించనుంది. ► నిర్వహణ పనితీరు మెరుగుపడటం, ఈక్విటీ నిధులను సమకూర్చుకోవడం వంటి అంశాల కారణంగా స్వల్ప–మధ్యకాలికంగా విమానయాన సంస్థలు రుణాలపై ఆధారపడటం తగ్గనుంది. ► బడా ఎయిర్‌లైన్‌ను (ఎయిరిండియా) ప్రైవేటీకరించిన నేపథ్యంలో రుణ భారం తగ్గి, ఫలితంగా వడ్డీ వ్యయాలూ తగ్గి పరిశ్రమ లాభదాయకత మెరుగుపడనుంది. ► అయితే, సమయానికి ఈక్విటీని సమకూర్చుకోవడం, విమానాల కొనుగోలు కోసం తీసుకునే రుణాలు, కొత్త వైరస్‌లేవైనా వచ్చి కోవిడ్–19 కేసులు మళ్లీ పెరగడం వంటి అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. -
విమాన టికెట్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న చార్జీలు!
విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి సమయంలో దేశీయ విమానయాన సంస్థలపై విధించిన ప్రైస్ బ్యాండ్లను ఎత్తివేసింది. దీంతో ఇకపై దేశీయ మార్గాల్లో విమాన చార్జీలపై ఉన్న పరిమితులను తొలగించినట్లు దేశ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇకపై ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు. గతంలో దేశీయ మార్గాల్లో ఛార్జీల పై కనిష్ట, గరిష్ట పరిమితులు విధించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం ద్వారా తక్కువ చార్జీల వల్ల విమాన సంస్థలు, డిమాండ్ ఉన్న సమయాల్లో భారీ రేట్లతో ప్రయాణికులు నష్టపోకుండా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుతం విమాయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన సంస్థలు తమ విమానాల్లో ప్యాసింజర్లతో నింపేందుకు టిక్కెట్లపై డిస్కౌంట్లను అందించే అవకాశమే ఎక్కవగా ఉందంటూ నిపుణలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో దేశీయంగా విమాన రంగం వృద్ధి సాధిస్తుందని విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆశాభావం వ్యక్తం చేశారు. డిమాండ్, ఇంధన ధరలను జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత ఛార్జీల పరిమితులను తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. The decision to remove air fare caps has been taken after careful analysis of daily demand and prices of air turbine fuel. Stabilisation has set in & we are certain that the sector is poised for growth in domestic traffic in the near future. https://t.co/qxinNNxYyu — Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 10, 2022 చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపరాఫర్.. ఆగస్టు 31 వరకు మాత్రమే! -
మార్చిలో విమానయానం జూమ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి తదుపరి దేశీ విమానయానం ఊపందుకుంటోంది. గత మార్చిలో దేశీ ప్రయాణికుల సంఖ్య 1.06 కోట్లను తాకింది. అంతకుముందు నెల ఫిబ్రవరిలో నమోదైన 76.96 లక్షలతో పోలిస్తే సుమారు 38 శాతం అధికం. వైమానిక నియంత్రణ సంస్థ డీజీసీఏ తాజా గణాంకాలివి. గత నెలలో దేశంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 80 శాతం దాటడం గమనార్హం. విమానాల ఆక్యుపెన్సీని తెలియజేసే పీఎల్ఎఫ్ స్పైస్‌జెట్‌లో 86.9 శాతం, ఇండిగోకు 81 శాతం, విస్తారాలో 86.1 శాతంగా నమోదైంది. ఈ బాటలో గో ఫస్ట్ 81.4 శాతం, ఎయిరిండియా 85 శాతం, ఎయిరేషియా ఇండియా 81.3 శాతం చొప్పున పీఎల్‌ఎఫ్‌ను సాధించినట్లు డీజీసీఏ వెల్లడించింది. అయితే కేంద్రం నిర్వహణలోని ప్రాంతీయ సంస్థ అలయెన్స్ ఎయిర్ మార్చిలో 74 శాతం పీఎల్ఎఫ్నే సాధించినట్లు పేర్కొంది. కాగా.. గత రెండేళ్లలో కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రయాణాలపై నిషేధ ఆంక్షలు విధించడంతో విమానయాన రంగం కుదేలైన విషయం విదితమే. -
నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాత్రమే బిజినెస్‌మెన్‌గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న చెర్రి.. పలు వ్యాపార సంస్థలో కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. అందులో ఓ విమానాయాన సంస్థ కూడా ఉంది. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలిసి ట్రూజెట్ పేరుతో డొమాస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది. తక్కువ ఖర్చుతో దేశీయ విమానయానాన్ని అందించాలానే ఉద్దేశంతో తన స్నేహితుడు ఉమేశ్‌తో కలిసి టర్బో మేఘా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించిన రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో విమాన సర్వీసులు నడుపుతోంది. జులై 12వ తేదీ 2015 లో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు నిరాటకంగా ఈ విమానాలు నడుస్తూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ సంస్థ నష్టాల్లో నడుస్తుండటంతో దీనిపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ట్రూజెట్ విమానాలు నష్టాల్లో ఉండటంతో ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ట్రూజెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనని విడుదల చేస్తూ.. ‘ట్రూజెట్ విమానాలు ఆపేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలని నమ్మకండి. ఈ సంస్థలో పని చేసే ఇద్దరూ అధికారులు గతంలో రిజైన్ చేసి వెళ్లిపోయారు. వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించాము. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు త్వరలోనే ఇన్వెస్టర్ కూడా రానున్నారు. ఇన్వెస్టర్స్ వచ్చాక కొత్త సీఈఓని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉమేష్ గారే కొనసాగనున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ‘వివిధ అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ కారణాల వల్ల ట్రూజెట్ విమానయాన కార్యకలాపాలకు తాత్కాలిక నిలిపివేశాం. టెంపరరిగా ట్రూజెట్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం. త్వరలోనే మళ్లీ పునఃప్రారంభిస్తాం. నవంబర్ 2021 నుండి ఉద్యోగులకు ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని చెప్పే వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. వారికి పాక్షిక జీతాలు ఇస్తున్నాము. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చాము” అని ఈ ప్రకటనలో తెలిపారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! pic.twitter.com/XE4RQ1paG5 — TruJet (@FlyTruJet) February 16, 2022 -
దూసుకెళ్తున్న డొమెస్టిక్ విమానాలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి డొమెస్టిక్ విమానాలు దేశవ్యాప్తంగా దూసుకెళ్తున్నాయి. దేశీయ విమానాల రాకపోకల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కోవిడ్ నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా నిలిపివేసిన విమాన సర్వీసులను మే నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. పరిమిత రూట్లలో సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతోపాటు ఎయిర్‌పోర్టులో కోవిడ్ నియంత్రణ చర్యలు, ప్రస్తుతం ఎయిర్‌పోర్టులోనే కరోనా పరీక్షా కేంద్రం అందుబాటులో ఉన్నందున ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మేలో నిత్యం 3 వేల మంది రాకపోకలు సాగించగా ప్రస్తుతం వారి సంఖ్య 37 వేలకు చేరుకుంది. మే నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అన్‌లాక్ 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికుల వైద్య పరీక్షల ఆధారంగా క్వారంటైన్ నిబంధనలను సడలించడంతో విమానరంగం వేగం పుంజుకున్నట్లు చెప్పారు. పది రెట్లు పెరిగిన ప్రయాణికులు.. ⇔ మే 25 నుంచి దేశీయ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. మొదటి కొన్ని వారాల్లో హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 3 వేల మంది రాకపోకలు సాగించారు. ⇔ నవంబర్ నుంచి ప్రయాణికుల సంఖ్య 30 వేలకు పెరిగింది. ఇది విమాన సరీ్వసులు పునఃప్రారంభం నాటితో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ⇔ మే 25 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు 30 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ⇔ మొదట్లో నిత్యం 40 విమానాలు రాకపోకలు సాగించగా ప్రస్తుతం 260 దేశీయ విమానాలు అందుబాటులో ఉన్నాయి. విమాన సరీ్వసులు పునఃప్రారంభమైన మొదటి రోజుకు ఇది 6 రెట్ల కంటే ఎక్కువ. నవంబర్ 23 వరకు 35 వేల విమానాల నడిచాయి. ⇔ ఇటీవల దేశీయ ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో 37 వేలకు చేరుకుంది. అలాగే విమానాల రాకపోకల సంఖ్య ఒకే రోజు 284ను దాటింది. ⇔ కోవిడ్‌కు ముందు హైదరాబాద్ నుంచి 55 గమ్యస్థానాలు ఉండగా, ప్రస్తుతం 51 గమ్యస్థానాలకు సరీ్వసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇవి కాకుండా కొత్తగా కోజికోడ్, ఇంపాల్, జగదల్పూర్లకు కూడా సరీ్వసులు ప్రారంభమయ్యాయి. నమ్మకానికి ప్రతీక.. జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి మాట్లాడుతూ.. విమాన ప్రయాణంపై ప్రయాణికుల్లో పెరుగుతున్న నమ్మకానికి ఈ 30 లక్షల మంది ప్రయాణికులు ఒక తార్కాణమన్నారు. కోవిడ్‌కు పూర్వం ఉన్న సామర్థ్యంలో 70 శాతానికి చేరుకున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సురక్షితమైన రాకపోకల కోసం ఎయిర్‌పోర్టులో ఉన్నచోట్ల కాంటాక్ట్ లెస్ సేవలను అందుబాటులోకి తెచి్చనట్లు పేర్కొన్నారు. త్వరలోనే కోవిడ్ పూర్వ పరిస్థితులు ఏర్పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
నేటి నుంచి 140 దేశీయ విమానాల రాకపోకలు
శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రాత్రి 1.20 గంటలకు పుణే నుంచి ఇండిగో విమానం శం షాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఇండిగో వి మానం (6ఈ 732) ఇక్కడి నుంచి లక్నో వెళ్లడానికి షెడ్యూల్ నిర్ధారించినట్టు ఆదివారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 30 వరకు రాకపోకలు సాగించే విమానాల రాకపోకల షె డ్యూల్‌ను, నిర్ధారిత వేళల పట్టికను ఆదివారం విడుదల చేశారు. దీని ప్రకారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 140 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. షెడ్యూ ల్లో మార్పుచేర్పులు ఉండనున్నాయి. నేడు గన్నవరం, విశాఖ సర్వీసులు రద్దు గన్నవరం/విశాఖపట్నం/తిరుపతి అన్నమయ్యసర్కిల్: విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి సోమవారం పునఃప్రా రంభం కావాల్సిన దేశీయ విమాన సర్వీస్‌లన్నీ సాంకేతిక కారణాలు వల్ల రద్దయ్యాయి. రెండు ఎయిర్‌పోర్టుల నుంచి మంగళవారం నుంచి విమాన సర్వీస్‌లు నడిచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కంటెయిన్మెంట్ జోన్లవారికి నో ఎంట్రీ
-
విమానయానం.. కొత్త కొత్తగా...
న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా పలు ఆంక్షలను ప్రకటించింది. విమానం ప్రయాణించిన కాలం ఆధారంగా కనిష్ట, గరిష్ట చార్జీలను నిర్ధారించింది. దేశవ్యాప్తంగా విమాన మార్గాలను ఏడు బ్యాండ్స్‌గా విభజించామని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం వెల్లడించారు. విమాన ప్రయాణ సమయం 40 నిమిషాల లోపు ఉంటే తొలి బ్యాండ్‌గా, 40–60 నిమిషాల మధ్య ఉంటే రెండో బ్యాండ్, 60–90 నిమిషాల మధ్య ఉంటే మూడో బ్యాండ్, 90–120 నిమిషాల మధ్య ఉంటే నాలుగో బ్యాండ్, 120–150 నిమిషాల మధ్య ఉంటే ఐదో బ్యాండ్, 150–180 నిమిషాల మధ్య ఉంటే ఆరో బ్యాండ్, 180–210 నిమిషాల మధ్య ఉంటే ఏడో బ్యాండ్‌గా నిర్ధారించామన్నారు. కనిష్ట, గరిష్ట ధరలను నిర్ధారించేందుకే ఇలా బ్యాండ్స్‌గా విభజించామన్నారు. ఈ విభజన, చార్జీలపై పరిమితి ఆగస్ట్ 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రతీ విమానంలో కనిష్ట– గరిష్ట ధరలకు మధ్య సరిగ్గా సగం ధరకు 40% టికెట్లను అమ్మాల్సి ఉంటుందని విమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం 33% ఆపరేషన్లకే అనుమతించామని హర్దీప్ చెప్పారు. కరోనా కట్టడికి, చార్జీల వసూలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా పాటించాలన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘వందేభారత్’ కార్యక్రమంలో ప్రైవేటు విమానయాన సంస్థలూ త్వరలో పాలుపంచుకుంటాయన్నారు. ఇప్పటివరకు ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రమే ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన మార్చి 25 నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణీకులు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవీ నిబంధనలు.. ► 14 ఏళ్ళు దాటిన ప్రయాణికులంతా తమ మొబైల్స్‌లో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్దనే సీఐఎస్ఎఫ్, లేదా వైమానిక సిబ్బంది యాప్ ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకోని వారిని ప్రత్యేక కౌంటర్‌కి పంపి, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. అరోగ్య సేతు స్టేటస్‌లో రెడ్ మార్క్ కనిపిస్తే వారిని లోనికి అనుమతించరు. ► ఫ్లైట్ బయలు దేరడానికి కనీసం రెండు గం టల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చే యాలి. ఫ్లైట్ బయలుదేరేందుకు 4 గంటల ముం దు మాత్రమే టెర్మినల్ బిల్డింగ్‌లోనికి అనుమతిస్తారు. ► కేవలం వెబ్ చెక్–ఇన్ చేసుకున్న వారిని మాత్రమే విమానాశ్రయం లోనికి అనుమతిస్తారు. విమానాశ్రయాల్లో ఫిజికల్ చెక్–ఇన్ కౌంటర్లు ఉండవు. ► కేవలం ఒక చెక్–ఇన్ బ్యాగేజ్‌ని మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ► ఫ్లైట్‌లో భోజన సదుపాయం ఉండదు. ► ఫ్లైట్ బయలుదేరడానికి గంట ముందు బోర్డింగ్ ప్రారంభం అవుతుంది. ► టెర్మినల్‌లోకి ప్రవేశించడానికి ముందు తగు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం మొత్తం మాస్క్, గ్లవ్స్ ధరించడం తప్పనిసరి. ► కంటెయిన్మెంట్ జోన్లలోని వారికి, కరోనా పాజిటివ్ వచ్చినవారికి అనుమతి లేదు. ► ఆరోగ్య సేతు యాప్ ద్వారా, లేదా స్వీయ హామీ పత్రంద్వారా తాము ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రుకరించాలి. ► వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. ► కోవిడ్–19 అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు, వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ప్రత్యేక సౌకర్యాలు విమానాశ్రయాల్లో కల్పించాలి. ► విమానయాన సిబ్బందికి పీపీఈ కిట్లు తప్పనిసరిగా అందించాలి. ► విమానాశ్రయాల్లో పీపీఈ కిట్లు మార్చుకోవడానికి సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ► అన్ని ప్రవేశ ప్రాంతాల్లో ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి. ► విమానాశ్రయాల్లో న్యూస్‌పేపర్ గానీ, మ్యాగజైన్లు గానీ అందుబాటులో ఉండవు. అనుమతించరు. ► ఎయిర్‌పోర్టులో ఫుడ్ అండ్ బేవరేజెస్ అందుబాటులో ఉంటాయి. అన్ని కోవిడ్–19 జాగ్రత్తలతో అమ్మకాలు జరగాలి. ► ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న ఫుట్ మ్యాట్స్, కార్పెట్స్‌ని నిత్యం శుద్ధి చేస్తుండాలి. ► ప్రయాణికులు విమానాశ్రయంలో, విమానంలో భౌతిక దూరం పాటించాలి. ► విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల లగేజ్‌ను వారు టెర్మినల్ బిల్డింగ్‌లోకి వచ్చేముందే శానిటైజ్ చేయాలి. ► డిపార్చర్, అరైవల్ ప్రాంతాల్లో ట్రాలీల వినియోగాన్ని ప్రోత్సహించవద్దు. అవసరమని భావిస్తేనే ట్రాలీ ఇవ్వాలి. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం, ప్రయాణికులను విమానంలోనికి అనుమతించాలి. -
దేశీ విమానయాన సంస్థల సేఫ్టీ ఆడిట్ షురూ..
న్యూఢిల్లీ: దేశీ విమానప్రయాణాల్లో ఇటీవల పలు వివాదాస్పద ఉదంతాలు నమోదవుతున్న నేపథ్యంలో విమానాల్లో రక్షణ చర్యలపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేసే షెడ్యూల్డ్ విమానయాన సంస్థలన్నింటిపైనా ఆడిట్ జరుగుతోందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ 15 నుంచి ముంబై కేంద్రంగా పనిచేసే ఎయిర్‌లైన్స్ ఆడిట్ చేపట్టనున్నట్లు వివరించారు. విమానయాన సంస్థల కార్యకలాపాలతో పాటు శిక్షణా కార్యక్రమాలు.. కేంద్రాలు, సిబ్బంది పనితీరును కూడా మదింపు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది షెడ్యూల్డ్ ఆపరేటర్స్ ఉండగా .. ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్, గోఎయిర్, విస్తార మొదలైనవి ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్నాయి. ప్రయాణం మధ్యలో ఇంజిన్లు ఫెయిల్ కావడం, విమానాల సిబ్బంది నిర్లక్ష్య వైఖరులతో ప్రయాణికులు ఇబ్బందుల పాలవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ ఆడిట్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారీగా పెరిగిన ఎయిర్‌లైన్ ట్రాఫిక్: పుంజుకున్న షేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇండిగో, గో ఎయిర్ లాంటి విమాన యాన సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం కొనసాగుతుండగా దేశీయ పాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలను నమోదు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నెలవారీ దేశీయ ట్రాఫిక్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య(ఏవియేషన్ ట్రాఫిక్) 24 శాతం జంప్‌చేసింది. 24 శాతం వృద్ధితో 2018 ఫిబ్రవరి నాటికి దేశీయ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.07 కోట్లకు పెరిగింది. మొత్తం దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ జనవరి నెలలో 1.14 కోట్లకు పెరిగింది. డిజిసిఎ ఇచ్చిన సమాచారం ప్రకారం జనవరి-ఫిబ్రవరి 2018 నాటికి ప్రయాణీకుల రద్దీ 21.80 శాతం పెరిగింది. 2017 నాటికి 86.55 లక్షల నుంచి పెరిగినట్లు సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో విమానయాన కంపెనీల కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్ 2 శాతం, స్పైస్‌జెట్ 1.2 శాతం, ఇంటర్‌గ్లోబ్(ఇండిగో) 0.75 శాతం లాభపడింది. -
కొత్త టెక్నాలజీ వినియోగంలో దేశీ విమాన సంస్థల జోరు
సీఐటీఏ నివేదిక న్యూఢిల్లీ: కొత్త టెక్నాలజీని ఒడిసి పట్టుకోవడంలో, ప్రపంచంలోని ఇతర సంస్థలతో దేశీ విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయని సీఐటీఏ పేర్కొంది. ‘2016 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ–ఇండియా ఐటీ ట్రెండ్స్ బెంచ్‌మార్క్’ అనే పేరుతో గ్లోబల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీఐటీఏ ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. ⇔ 2019 నాటికి ఐఏటీఏ బ్యాగేజ్ ట్రాకింగ్ సొల్యూషన్స్‌ను పూర్తిగా అమల్లోకి తీసుకురావాలని దేశీ ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ⇔ అవరోధాలను ముందుగానే గుర్తించి, వాటి ప్రభావాలను అంచనా వేయగలిగే వ్యవస్థలను వచ్చే మూడేళ్లలో ఏర్పాటు చేసుకోవాలని 60 శాతం దేశీ ఎయిర్‌పోర్ట్‌లు ప్రయత్నిస్తున్నాయి. ⇔ దాదాపు 75 శాతం విమానయాన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సామరŠాథ్యలను పెంపొందించుకోవడంలో ప్రారంభ దశలో ఉన్నాయి. ⇔ 40 శాతం ఎయిర్‌లైన్స్ కొత్త డిస్ట్రిబ్యూషన్ క్యాపబిలిటీ (ఎన్డీసీ) సంబంధిత రిసోర్సెస్లలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నాయి. ⇔ దాదాపు 98 శాతం మంది భారతీయ ప్రయాణికులు వారి ప్రయాణంలో మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్ వంటి వాటిల్లో ఏదోఒకదాన్ని వెంట తీసుకెళ్తున్నారు. 32% మంది అన్నింటినీ పట్టుకెళ్తున్నారు. ఇది గ్లోబల్ సగటు కన్నా చాలా ఎక్కువ. -
దేశీ విమాన ప్రయాణిలకు రద్దీ 5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ మార్చి నె లలో 5.3 శాతం మేర పెరిగింది. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. దేశీ విమానయాన సంస్థలు మార్చిలో మొత్తంగా 78.72 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఈ సంఖ్య ఫిబ్రవరిలో 74.72 లక్షలుగా ఉంది. ఇక మార్కెట్ వాటా విషయానికి వస్తే.. ఇండిగో 38.4 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో జెట్ ఎయిర్వేస్ (17.6 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం) ఉన్నాయి. -
బిజినెస్@పార్లమెంట్
దేశీ ఎయిర్‌లైన్స్ నిబంధనల సడలింపు దేశీ విమానయాన సంస్థలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే అయిదేళ్లపాటు దేశీయంగా సేవలు అందించడంతో పాటు 20 విమానాలు ఉండాలనే 5/20 నిబంధనను సవరించనున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ రాజ్యసభకు తెలిపారు. మొండిబకాయిలు: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో సుమారు రూ. 28,152 కోట్లు టాప్ 10 రుణగ్రస్తుల నుంచి రావాల్సి ఉంది. మొత్తం రుణాల్లో ఇది 1.73 శాతం. రూ. 1,000 కోట్ల పైచిలుకు రుణాలు తీసుకున్న వారు 433 మంది ఉన్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభ కు వివరించారు. పన్నుల రిఫండ్: గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.19 లక్షల కోట్ల మేర ఆదాయ పన్ను రిఫండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం రూ. 68,032 కోట్లుగా ఉన్నట్లు వివరించారు. -
ఎయిర్‌లైన్స్ దీపావళి ధమాకా
మరోసారి పోటాపోటీగా ఆఫర్లు స్పైస్‌జెట్, ఎయిర్కోస్టా, జెట్ చౌక టికెట్లు ముంబై: పండుగ సీజన్లో దేశీ విమానయాన సంస్థలు మరోసారి పోటాపోటీగా డిస్కౌంటు ఆఫర్లు ప్రకటించాయి. మంగళవారం ముందుగా స్పైస్‌జెట్ రూ. 899-రూ. 2,499 శ్రేణిలో (వన్ -వే, అన్ని చార్జీలు కలిపి) టికెట్లను అందిస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే జెట్ ఎయిర్వేస్, ఎయిర్కోస్టా తదితర సంస్థలు డిస్కౌంట్ స్కీమ్స్ ప్రకటించాయి. స్పైస్‌జెట్ ఆఫర్ కింద అక్టోబర్ 26 దాకా బుకింగ్ చేసుకోవచ్చు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 దాకా ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. స్వల్ప దూరాలకు (బెంగళూరు-చెన్నై-కోచి వంటి రూట్లు ) టికెట్ చార్జీ రూ. 899 నుంచి ఉంటుంది. అదే బెంగళూరు-గోవా వంటి రూట్లలో రూ. 1,599 మేర, మిగతా రూట్లలో రూ. 2,499 స్థాయిలో చార్జీలు ఉంటాయి. రైలు టికెట్ల కన్నా తక్కువ చార్జీలకు విమాన టికెట్లను తరచూ ఆఫర్ చేస్తూ దేశీయంగా విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తెస్తున్నామని స్పైస్‌జెట్ సీవోవో సంజీవ్ కపూర్ తెలిపారు. మొత్తం మీద ఈ ఆఫర్ల కారణంగా రాబోయే రోజుల్లో బుకింగ్స్ గణనీయంగా పెరగగలవని అంచనా వేస్తున్నట్లు ట్రైవెల్ పోర్టల్ యాత్రాడాట్‌కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ తెలిపారు. జెట్ డీల్..: ఇక, జెట్ ఎయిర్వేస్ అయిదు రోజుల పాటు ఎకానమీ తరగ తిలో రూ. 899కి (ఆల్ ఇన్‌క్లూజివ్) టికెట్లు అందిస్తోంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 దాకా దేశీయంగా ప్రయాణాల కోసం ఈ నెల 26 లోగా వీటిని బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎయిర్కోస్టా ఆఫర్లు.. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 25లోపు బుకింగ్ చేసుకున్న ప్రతీ టికెట్‌పై రూ. 500 తగ్గింపు ఆఫర్ అందిస్తున్నట్లు విజయవాడ కేంద్రంగా పనిచేసే ఎయిర్కోస్టా ప్రకటించింది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో మార్చి 28, 2015 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చని తెలిపింది. అలాగే దేశంలోనే తొలిసారిగా చెన్నై-జైపూర్ మధ్య తొలి నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను అక్టోబర్ 26 నుంచి ప్రవేశపెడుతున్నట్లు వివరించింది. ఈ టిక్కెట్ ప్రారంభ ధరను రూ.4,999గా నిర్ణయించారు. -
టాటా ఎయిర్‌లైన్స్ టేకాఫ్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్.. దేశీ విమానయాన రంగంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఎయిర్‌ఏషియాతో కలిసి చౌక విమాన సేవలు అందించడంపై దృష్టి పెట్టిన టాటా గ్రూప్ .. తాజాగా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ముచ్చటగా మూడోసారి జతకట్టింది. గురువారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే కొత్త కంపెనీకి అనుమతుల కోసం విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)కి దరఖాస్తు చేసుకున్నట్లు టాటా గ్రూప్ పేర్కొంది. ముందుగా 10 కోట్ల డాలర్ల పెట్టుబడితో కొత్త ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతులన్నీ లభిస్తే వచ్చే ఏడాది కార్యకలాపాలు మొదలుకావొచ్చని వివరించాయి. దేశీయంగా పౌరవిమానయాన రంగంలో టాటా సన్స్‌కి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1932లోనే జేఆర్డీ టాటా ..టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత 1946లో ఎయిరిండియాగా మారింది. దీన్ని 1953లో జాతీయం చేశారు. టాటా గ్రూప్‌కి 5% వాటాలు..: కొత్త ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్‌కి 51%, సింగపూర్ ఎయిర్‌లై న్స్‌కి 49% వాటాలు ఉంటాయి. బోర్డులో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇందులో ఇద్దరిని టాటా సన్స్, ఒకరిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ నామినేట్ చేస్తాయి. టాటా క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ చైర్మన్ ప్రసాద్ మీనన్.. దీనికి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ తరఫు నుంచి మాక్ స్వీ వా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్)గా ఉంటారు. టాటా గ్రూప్ ఇప్పటికే చౌక విమానయాన సర్వీసులు అందించేందుకు మలేసియాకి చెందిన ఎయిర్‌ఏషియాతో జట్టు కట్టింది. అయితే, ప్రతిపాదిత ఎయిర్ఏషియా వెంచర్లో టాటా సన్స్‌కి 30% వాటాలు ఉన్నా నిర్వాహక పాత్ర లేదు. కానీ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో వెంచర్లో మాత్రం అదే సారథ్య బాధ్యతలు చేపట్టనుంది. నియంత్రణపరమైన ప్రశ్నలు .. టాటా గ్రూప్ ఇలా ఒకే రంగంలో రెండు వేర్వేరు వెంచర్లు ఏర్పాటు చేస్తుండటం తాజా డీల్‌కి ఆటంకాలేమైనా తెచ్చిపెట్టవచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ పార్ట్నర్ అంబర్ దూబే తెలిపారు. మరోవైపు, ఈ విషయంలో ఏవియేషన్ నిబంధనలపరంగా అడ్డంకులేమీ లేవని పౌర విమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పారు. అయితే సెబీ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చని, అవే ఈ ప్రతిపాదనను క్లియర్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక, భారత్‌లో పౌర విమానయాన రంగం నిలకడగా వృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని టాటా సన్స్ అంచనా వేసినట్లు ప్రసాద్ మీనన్ తెలిపారు. భారత్ మార్కెట్లో విస్తరించేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం తోడ్పడగలదని సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు. 18 ఏళ్లలో ముచ్చటగా మూడోసారి.. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భారత్‌లో విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి. 1995లో ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ కోసం ఎఫ్ఐపీబీకి ఇవి తొలిసారిగా దరఖాస్తు చేసుకున్నాయి. ఏడాది తర్వాత అనుమతులు లభించాయి. అయితే, దేశీ ఎయిర్‌లైన్స్‌లో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు తీసుకోకూడదంటూ 1997లో విధానాలను మార్చేయడంతో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. ఒక కేంద్ర మంత్రికి లంచమివ్వడానికి నిరాకరించినందునే ఇలా జరిగిందంటూ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానిం చారు కూడా. ఇక 2000లో టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరోసారి దేశీ విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశాయి.