న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు.
కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment