న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.
అయితే విమానాల్లో బాంబు బెదిరింపులును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చిందేందుకు రవాణాపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.
తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించారు. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అబద్దపు బెదిరింపు కాల్స్ చేసిన వారిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని, అదేవిధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను పెంచడం వంటి చర్యలను ప్రబుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులు
కాగా బుధవారం బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇకమంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్‌సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment