దక్షిణాఫ్రికా పర్యాటక మంత్రి పచ్యూషా
ముంబై: పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నేరుగా విమానాలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వంతోపాటు మూడు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు దక్షిణాఫ్రికా పర్యాటక మంత్రి పచ్యూషా డె లో తెలిపారు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య కనెక్టింగ్ విమానాశ్రయాలతో ఎమిరేట్స్, కెన్యా ఎయిర్‌వేస్, ఎయిర్ మారిషస్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఎయిర్ సీషెల్స్, రువాండ్ ఎయిర్, ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి.
‘భారతీయ ప్రయాణికుల కోసం దక్షిణాఫ్రికాను పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, ఏవైనా సమస్యలను పరిష్కరించేందుకు, పర్యాటకాన్ని పెంచడానికి మేము ఇక్కడ ఉన్నాము. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలో సమస్య ఉంది. భారతీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సరీ్వసుల ప్రయోజనాలపై వారిని ఒప్పించబోతున్నాను. ఈ విమానయాన సంస్థలు పర్యాటకుల దృక్కోణం నుండి మాత్రమే కాకుండా వాణిజ్యం, వ్యాపార కోణం నుండి కూడా ఈ ప్రత్యక్ష విమానాలతో పొందగల ప్రయోజనాలను దక్షిణాఫ్రికా టూరిజం వివరిస్తుంది’ అని ఆమె వివరించారు.
ఎల్రక్టానిక్ వీసా సౌకర్యాలతో..
దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయ ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాలతో సుదీర్ఘ ప్రక్రియ సమస్యను పరిష్కరించిందని పచ్యూషా వివరించారు. ఈ–వీసాతో భారతీయ యాత్రికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాకు రావడం చాలా సులభం అని చెప్పారు. దక్షిణాఫ్రికాకు అగ్రస్థానంలో ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని, ఈ ఏడాది చివరినాటికి కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకోవాలని తాము భావిస్తున్నామని తెలిపారు. ‘2019లో మేము 95,000 మంది భారతీయ ప్రయాణికులను స్వాగతించాము. 2023లో ఈ సంఖ్య 79,000కి తగ్గింది. ఈ సంవత్సరం జనవరి–సెపె్టంబర్ మధ్య 59,000 మంది భారతీయులు ఇప్పటికే దక్షిణాఫ్రికాను సందర్శించారు. పర్యాటకుల సంఖ్య పరంగా ఈ సంవత్సరం కోవిడ్ పూర్వ స్థాయికి దగ్గరగా ఉండాలని మేము ఆశిస్తున్నాము’ అని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment