tourism minister
-
డైరెక్ట్ ఫ్లైట్స్ కోసం భారత్‌తో చర్చలు
ముంబై: పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా నేరుగా విమానాలను ప్రవేశపెట్టడానికి భారత ప్రభుత్వంతోపాటు మూడు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు దక్షిణాఫ్రికా పర్యాటక మంత్రి పచ్యూషా డె లో తెలిపారు. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య కనెక్టింగ్ విమానాశ్రయాలతో ఎమిరేట్స్, కెన్యా ఎయిర్వేస్, ఎయిర్ మారిషస్, ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, ఎతిహాద్ ఎయిర్వేస్, ఎయిర్ సీషెల్స్, రువాండ్ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్ ద్వారా విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. ‘భారతీయ ప్రయాణికుల కోసం దక్షిణాఫ్రికాను పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి, ఏవైనా సమస్యలను పరిష్కరించేందుకు, పర్యాటకాన్ని పెంచడానికి మేము ఇక్కడ ఉన్నాము. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలో సమస్య ఉంది. భారతీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌తో రెండు దేశాల మధ్య నేరుగా విమాన సరీ్వసుల ప్రయోజనాలపై వారిని ఒప్పించబోతున్నాను. ఈ విమానయాన సంస్థలు పర్యాటకుల దృక్కోణం నుండి మాత్రమే కాకుండా వాణిజ్యం, వ్యాపార కోణం నుండి కూడా ఈ ప్రత్యక్ష విమానాలతో పొందగల ప్రయోజనాలను దక్షిణాఫ్రికా టూరిజం వివరిస్తుంది’ అని ఆమె వివరించారు. ఎల్రక్టానిక్ వీసా సౌకర్యాలతో.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయ ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాలతో సుదీర్ఘ ప్రక్రియ సమస్యను పరిష్కరించిందని పచ్యూషా వివరించారు. ఈ–వీసాతో భారతీయ యాత్రికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాకు రావడం చాలా సులభం అని చెప్పారు. దక్షిణాఫ్రికాకు అగ్రస్థానంలో ఉన్న మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని, ఈ ఏడాది చివరినాటికి కోవిడ్‌కు ముందున్న స్థాయికి చేరుకోవాలని తాము భావిస్తున్నామని తెలిపారు. ‘2019లో మేము 95,000 మంది భారతీయ ప్రయాణికులను స్వాగతించాము. 2023లో ఈ సంఖ్య 79,000కి తగ్గింది. ఈ సంవత్సరం జనవరి–సెపె్టంబర్ మధ్య 59,000 మంది భారతీయులు ఇప్పటికే దక్షిణాఫ్రికాను సందర్శించారు. పర్యాటకుల సంఖ్య పరంగా ఈ సంవత్సరం కోవిడ్ పూర్వ స్థాయికి దగ్గరగా ఉండాలని మేము ఆశిస్తున్నాము’ అని ఆమె తెలిపారు. -
North East Sammelan: గ్రోత్ ఇంజిన్ ఈశాన్య రాష్ట్రాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది చెందకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి ఈశాన్య రాష్ట్రాలే గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషల్ సెంటర్లో నిర్వహించిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యే దృష్టి సారించారని చెప్పారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. స్థిరమైన ప్రభుత్వం, నాయకుడి వల్లే నార్త్ ఈస్ట్‌లో శాంతి నెలకొందని, అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. -
మంత్రిగా ఏడాది పూర్తి.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నట్లు రోజా తెలిపారు. ఈ ఏడాది కాలంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సులు జరిగాయన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ. శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఏడాదిగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు సంస్కృతిని ప్రజలకు గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఏపీ టూరిజం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అందున్నట్లు పేర్కొన్నారు. యువతకు ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. విజయవాడలో బెర్మపార్క్‌లో పర్యాటక అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో పర్యాటక శాఖలో జరిగిన అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర క్రీడాకారులకు ఎన్నో రకాల ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. చదవండి: ‘చైతన్య రథం ఎడిటర్ ఎవరు?’ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ.. నోటీసులు ఒక కళాకారిణిగా తోటి కళాకారులకు తనవంతు సాయంగా జగనన్న సాంస్కృతిక సంబరాలు నిర్వహించామని రోజా పేర్కొన్నారు. టూరిజం విభాగంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఎంవోయూలు..గ్రౌండ్ లెవల్లో కార్యచరణ దిశగా ఉన్నాయన్నారు. ఒబెరాయ్ హోటల్స్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి రోజా తెలిపారు. తిరుపతి టెంపుల్ టూరిజంతోపాటు విశాఖలో నేచురల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలో 50 ప్రాంతాల్లో నూతనంగా బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే మూడవస్థానంలో ఉందన్నారు. టూరిజంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఉన్నపళంగా ఏపీకి రావడం వల్ల అనేక సదుపాయాలు కోల్పోయామని విమర్శించారు. చంద్రబాబు వల్ల ఎంతో మంది కళాకారులు ఇబ్బంది పడ్డారని మండిపడ్డారు. -
మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి: మంత్రి రోజా
-
ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు -
సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధిశాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లె క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కుటుంబసమేతంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి మాట్లాడుతూ తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. జగనన్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు. అన్న ఆశీస్సులే అండగా టూరిజం డెవలప్మెంట్కు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్ ఉన్నారు. చదవండి: (టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా) -
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో స్ట్రెయిట్ టాక్
-
వంతెనను ప్రారంభించిన మహరాష్ట్ర మంత్రి.. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా
ముంబై: మహరాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజన గ్రామానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నేడు సాకారమైంది. మహరాష్ట్ర టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రె శుక్రవారం నాసిక్‌లోని మారుమూల గ్రామమైన షేండ్రిపాడలో నిర్మించిన వంతెనను శుక్రవారం ప్రారంభించారు. అంతకు ముందు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వెదురుతో ఒక వంతెనను నిర్మించుకున్నారు. దీనిపై నుంచే తాగునీటి కోసం.. ఇతర పనుల కోసం రాకపోకలు చేసేవారు. ఈ క్రమంలో ఎందరో ఆ లోయలో పడి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల విన్నపం మేరకు, మహా సర్కారు తక్కువ సమయంలోనే వంతెనను నిర్మించి, శుక్రవారం ప్రారంభించింది. కాగా, వంతెన అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్థులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గిరిజనులు నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. #WATCH | Maharashtra Minister Aaditya Thackeray inaugurated a bridge and interacted with locals in Shendripada, a remote tribal village in Nashik earlier today pic.twitter.com/aPdI2iYOkN — ANI (@ANI) January 28, 2022 చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
డిసెంబర్ 12న మిస్ యూనివర్స్ పోటీలను నిర్వహిస్తాం..! రద్దు చేయలేం..
జెరూసలేం: కొత్త వేరియంట్ ఉధృతి కారణంగా దేశంలో ఆంక్షలు విధించినప్పటికీ మిస్ యూనివర్స్ 2021 పోటీలను డిసెంబర్ 12న నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ దేశ పర్యాటక మంత్రి యోయెల్ రాజ్వొజొవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎలీట్లోని రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే ఈ పోటీలో పాల్గొనేవారికి ప్రతి 48 గంటలకు పిసిఆర్ పరీక్షలతోపాటు ఇతర భద్రతా చర్యలకు లోబడి నిర్వహిస్తామని ఆయన చెప్పారు. దాదాపుగా 174 దేశాల్లో ఈవెంట్‌కు సంబంధించిన కార్యక్రమం ప్రసారం అవుతుందని, దీనిని రద్దు చేయలేమని ఆయన పేర్కొన్నారు. కాగా దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..! -
కిషన్ రెడ్డికి చిరంజీవి శుభాకాంక్షలు
కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి పదవి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. కేంద్ర కేబినెట్లో కిషన్‌రెడ్డికి పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ సందర్భంగా చిరంజీవి ట్విటర్ వేదికగా కిషన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశాడు. మన దేశం యొక్క యోగ్యతలను, ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేయడానికి కిషన్ రెడ్డికి మంచి అవకాశం లభించిందన్నారు. ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్‌గా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కిషన్‌రెడ్డి విషయానికి వస్తే.. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా గెలుపొందిన ఆయనకు తొలి ప్రయత్నంలోనే కేంద్ర సహాయ మంత్రి పదవి లభించగా.. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కింది. తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. Heartiest Congratulations @kishanreddybjp garu on being inducted as the Union Minister for Culture,Tourism & DoNER. It is an exciting opportunity to explore our Incredible India & showcase merits of our country to the world.Thrilled to have experienced that feeling & privilege. pic.twitter.com/Hg9VimSr4w — Chiranjeevi Konidela (@KChiruTweets) July 9, 2021 -
కోటి మంది యోగా చేస్తారు
న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది. -
టూరిస్టులకు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: టూరిస్టులకు కేంద్రం ప్రభుత్వం భలే ఆఫర్‌ను ప్రకటించింది. సంవత్సరంలో దేశీయంగా 15 పర్యాటక ప్రదేశాలను సందర్శించిన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ అందించనుంది. ప్రయాణ ఖర్చులను బహుమతిగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. కోణార్క్‌లో ఫిక్కీ సహకారంతో ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ పర్యాటక సదస్సు ముగింపు కార్యక్రమంలో కేంద్రమంత్రి శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. సంవత్సరం లోపు ఈ టాస్క్‌ను పూర్తి చేసిన టూరిస్టులను ప్రభుత్వం రివార్డుతో సంత్కరిస్తామన్నారు. టూరిస్టులను మరింత ప్రోత్సాహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్యాటన్ పర్వ్’ కార్యక్రమంలో భాగంగా అతడు /ఆమె 2022 నాటికి భారతదేశంలోని కనీసం 15 పర్యాటక ప్రదేశాల్లో పర్యటించాలి. స్వరాష్టం తప్ప ఇతర రాష్టాల్లో 15 ప్రదేశాలను సందర్శించాలి అనేది ప్రధాన షరతు. ఇందుకు గాను వారికి ప్రోత్సహకక బహుమతిగా ప్రయాణ ఖర్చులను పర్యాటక మంత్రిత్వ శాఖ భరిస్తుంది. అయితే ఇది నగదు రూపంలో కాకుండా ప్రోత్సాహక బహుమతిగా వుంటుందని స్పష్టం చేశారు. సంబంధిత ఫోటోలను తమ వెబ్సైట్లో పొందు పరుస్తామని ఆయన తెలిపారు. అలాగే ఎంపికైన వారిని భారతీయ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తిస్తామన్నారు. త్వరలోనే కోణార్క్‌లోని సూర్య దేవాలయాన్ని 'ఐకానిక్ సైట్ల' జాబితాలో చేర్చనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి తెలిపారు. అంతేకాదు టూరిస్టు గైడ్స్‌గా పనిచేయాలనుకునే అభ్యర్థుల కోసం పర్యాటక మంత్రిత్వశాఖ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ కూడా నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమంలో ఒడిశా పాల్గొనడం చాలా తక్కువ, దీనిని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రూపైందర్ బ్రార్ అన్నారు. మరోవైపు మరిన్ని పర్యాటక ప్రదేశాలను అనుసంధానించడానికి మరిన్ని పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టాలని ఫిక్కీ ఈస్టర్న్ టూరిజం కమిటీ చైర్మన్ సౌభాగ్య మోహపాత్ర కోరారు. -
పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య
-
పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారుస్తా: ఆదిత్య
ముంబై: మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఠాక్రేల కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన ఆదిత్య.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. ఆదివారం జరిగిన కేబినెట్ శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖ లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టూరిజంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతామని, సోమవారం జరిగే సమావేశానంతరం మంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పారు. గతంలో శివసేన యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న ఆదిత్య ఠాక్రే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. చదవండి: శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్‌ఠాక్రే..! శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సారథ్యంలోని 'మహా వికాస్ అఘాడి' ప్రభుత్వంలో గత డిసెంబర్ 30న కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్ కోసం కేబినెట్లో కొత్త పదవిని సృష్టించబోతున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ ఆదివారం జరిగిన శాఖల కేటాయింపులో ఆయనకు పర్యావరణం, పర్యాటక శాఖలను కేటాయించారు. -
'ఇంగ్లీష్ విద్యపై మతపరమైన విమర్శలా'
సాక్షి, అమరావతి : ఇంగ్లీష్ మీడియం విద్యపై మతపరమైన విమర్శలు చేయడం దారుణమని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న ఇంగ్లీష్ మాధ్యమానికి, క్రిస్టియన్ మతానికి ఏం సంబంధం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన, నిమ్న వర్గాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం తప్పా అని ప్రశ్నించారు. వంగవీటి రంగా హత్యతో కుల రాజకీయాలు చేసిన టీడీపీ ఇప్పుడు మతానికి సంబంధించి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 300 బోట్లున్నాయని, ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం డివిజన్లలో తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 21న 9 కంట్రోల్ రూమ్‌లకు సీఎం శంఖుస్థాపన చేస్తారని, వచ్చే మూడు నెలల్లో కంట్రోల్ రూమ్‌లు నిర్మిస్తామని వెల్లడించారు. ప్రతి కంట్రోల్ రూంకు ఐదుగురు అధికారులు ఉంటారని తెలిపారు. బోటు నడిపేవారు ఎవరయినా అన్ని నిబంధనలను పాటిస్తామని లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి హామీ ఇస్తేనే బోట్లు తిప్పడానికి అవకాశం ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం సారంగులకు పరీక్షలు పెట్టి, బోటుకు ఫిట్నెస్ నిర్వహించాకే అనుమతిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి అన్ని సిద్ధం చేసి బోటు ఆపరేషన్ ప్రారంభిస్తామని, ప్రతి బోటు ఆపరేటర్ కొత్తగా లైసెన్సుకి దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సీనియర్ సారంగులైనా పరీక్ష రాయాల్సిందేనని, అయితే పరీక్షకు సంబంధించి ముందుగా18 రోజులు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత పరీక్ష పెడతామని వివరించారు. -
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం : అవంతి
సాక్షి, విశాఖపట్టణం : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో భీమిలి, విశాఖ, అరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆ శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది పర్యాటకం ద్వారా రూ. 50 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విశాఖతో పాటు పలు పర్యాటక ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. మరోవైపు టీడీపీ హయాంలో అటవీ శాఖ భూములు కూడా కబ్జా చేశారని విమర్శించారు. భూకుంభకోణాలపై ఎవ్వరినీ ఉపేక్షించలేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని అగ్రిగోల్డ్ బాధితులకు పంపిణీ చేయడానికి రూ. 30 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని తెలిపారు. గురువారం గురజాడ కళాక్షేత్రంలో 50 వేల మందికి రూ. పదివేల చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. -
గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి
సాక్షి, అరకు : ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువు చెప్పిస్తే, ఈనాడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగమిచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం అరకులో ఏపీ టూరిజం యాత్రి నివాస్ హోటల్లో రెండు కోట్లతో నిర్మించిన డైనింగ్ రెస్టారెంట్‌ను స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేరు గన్నెల , పద్మాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన 211 కుటుంబాల కార్యకర్తలు మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాక్సైట్ మైనింగ్‌ను రద్దు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని అభినందించారు. గిరిజనులకు మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు. అన్ని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రూ.156 కోట్లతో అరకు టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పారు. గిరిజనులు అమాయకులనీ, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలనుందని అన్నారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సుల వల్ల చిన్న వయసులోనే ఎంపీ కాగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. భారత టూరిజం శాఖ పార్లమెంటు కమిటీలో తాను మెంబరుగా ఉన్నాననీ, అరకు టూరిజంను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకొని చంద్రబాబు అంధకారంలో ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరకు నియోజకవర్గానికి 39 రోడ్లను మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన క్వార్టర్‌ను గిరిజన మహిళల కోసం ప్రసూతి హాస్టల్‌గా మార్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ కూడా పాల్గొని మాట్లాడారు. -
భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు కేటాయింపులు.. భూ కుంభకోణాల గుట్టువిప్పుతాం... అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తాం.. ఇందు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం.. గత పాలకుల భూ కుంభకోణాల వల్ల జిల్లాకు చెడ్డ పేరు వచ్చింది.. దాన్ని రూపు మాపి జిల్లాను అగ్రపథాన నిలపడానికి మీరు...మేము కలసి పని చేద్దామని అధికారులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిద్దామని చెప్పారు. స్థానిక గవర్నర్ బంగ్లాలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులతో శనివారం పలు ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పనులు, కేటాంపుల్లో అవకతవకలు ఉంటే వెలుగులోకి తేవాలని ఆదేశించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సమష్టిగా పని చేసి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేద్దా మన్నారు. ఈ క్రమంలో బాగా పని చేసిన అధికారులకు సీఎం జగన్మోహన్రెడ్డితో సన్మానం చేయిస్తానని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులైన తాగునీటి, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్తు సరఫరా తదితర వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎన్ఏడీ ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టండి ఎన్ఏడీ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ఆ జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డు నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. వీఎంఆర్డీఏ, పర్యాటక శాఖ సమన్వయంతో పనిచేస్తూ పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పర్యాటకులకు దివ్యదామంగా విశాఖను తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రాన్నికి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు వీసా ఆన్ ఎరైవల్ విధానాన్ని అములు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక అంబాసిడర్‌ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 2న0న ఎమ్మెల్యేలతో కలిసి శాఖల వారీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా జీవిఎంసీ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించేందుకు 21న సమావేశం నిర్వహిస్తాననని మంత్రి చెప్పారు. భీమిలి నియోజకవర్గంపై సమీక్ష భీమిలి బీచ్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్లను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి పనులను ప్రారంభించాలని సూచించారు.మత్స్యకారుల రక్షణకు తీసుకోవాల్సిన అంశాలపై దృష్టిసారంచాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించారు.చిట్లివలస శ్మశానవాటిక అభివృద్ధికి గతంలో మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం అయినట్టు ఆరోపణలు ఉన్నాయని.. దానిపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోస్తనీనదిపై కాజ్వే నిర్మాణానికి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేసి జూలై 15 నాటికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈను ఆదేశించారు. అదేవిధంగా మధురవాడ, పరదేశిపాలెం బోయిపాలెం తదితర ప్రాంతాల్లో భవన సముదాయాల నిర్మాణానికి నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని జీవిఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జోన్–1 పరిధిలోని పలు వార్డుల్లో డ్రైన్లు, రోడ్ల నిర్మాణం, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చాలని జీవీఎంసీ అధికారులకు మంత్రి సూచించారు. జేఎన్ఎన్యూఆర్ఎం గృహాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలని జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. నివాసయోగ్యమైన భవన సముదాయాల్లో ప్రైవేటు పాఠశాలల ఏర్పాటును ఎలా అనుమతిస్తారని, ఆయా పాఠశాలను వెంటనే అక్కడి నుంచి తరలించే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.వనయ్చంద్, జీవీఎంసీ కమిషనర్ ఎం. హరినారాయణన్, వీఎంఆర్డీఏ కమిషనర్ బసంత్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాస్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
నేపాల్‌లో కూలిన విమానం
-
ఘోర ప్రమాదం : నేపాల్ మంత్రి దుర్మరణం
ఖట్మాండు : భారత, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగానే సరిహద్దు దేశం నేపాల్‌లో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పలి కూలిన ఘోర ప్రమాదంలో ఆ దేశ విమానయాన శాఖమంత్రి, మరో ఏడుగురు దుర్మరణం చెందారు .టాపెజంగ్ జిల్లాలోని పాతిభారా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్ పర్యాటక రంగం, పౌర విమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి, మరో ఏడురు ఈ ప్రమాదంలో అసువులు బాశారు. హెలికాప్టర్ పైలట్‌తోపాటు మంత్రి భద్రతా సిబ్బంది అర్జున్ గిమిరే, పర్యాటక వ్యాపారి, యతి ఎయిర్‌లైన్స్ డైరెక్టర్,ఎయిర్ డైనాస్టీ ఛైర్మన్ ఆంగ్ చింగ్ షెర్పా, ప్రధాని దగ్గరి బంధువు యబ్బరాజ్ దహల్, సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బీరేంద్ర శ్రేష్ట, మరో వ్యక్తి మరణించారు. విమానయాన మంత్రి ఇతర అధికారులతో కలిసి పతిభార దేవాలయాన్నిసందర్శించి, చుహన్ దండలో విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించటానికి వెళుతున్నట్టుసమాచారం. ఈ ప్రాంతంలో భారీ శబ్దంతో పాటు దట్టమైన పొగ అలుముకున్నాయని స్థానికులు తెలిపారని స్థానికఅధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో క్యాబినెట్ అత్యవసర సమావేశానికి నేపాల్ ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. -
‘రామప్ప’ అభివృద్ధికి సహకరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ను ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో వారు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రసాద్’పథకంలో రామప్ప ఆలయం, రామప్ప చెరువును కూడా చేర్చాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. స్వదేశీదర్శన్ పథకంలో ట్రైబల్ సర్క్యూట్లో రామప్పను చేర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. సందర్శకులతో కళకళలాడుతున్న రామప్ప చెరువులో విహారానికి రెండు హౌజ్ బోట్లను మంజూరు చేయాలని విన్నవించారు. రామప్ప ఆలయాన్ని హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించాలని, ట్రైబల్ సర్క్యూట్లో ములుగు, లక్నవరం, తాడ్వాయి మేడారం, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం మాత్రమే ఉన్నాయని, ఈ పథకంలో రామప్పను చేర్చితే రామప్ప ఆలయం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రికి విన్నవించార -
గోవాలో వారికే ఎంట్రీ..
పనాజీ : గోవాలో బహిరంగంగా మద్యం సేవించే వారిపై జరిమానా విధిస్తామని సీఎం మనోహర్ పారికర్ స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా టూరిజం మంత్రి మనోహర్ అజగోంకర్ సత్ప్రవర్తన కలిగిన టూరిస్టులను మాత్రమే గోవా స్వాగతిస్తుందని చెప్పారు. రాష్ట్ర సంస్కృతి, సహజ సౌందర్యం, గోవా స్ఫూర్తిని సంరక్షించే వారికే తాము ఆహ్వానం పలుకుతామని అన్నారు. బాలికలు, మహిళలతో అమర్యాదకరంగా వ్యవహరించవద్దని ప్రజలు, పర్యాటకులను తాము కోరుతున్నామన్నారు. భారత్‌తో పాటు విదేశాల్లోనూ గోవా ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నందున టూరిస్టులు తమ సంస్కృతి, గోవా అందాలను తిలకించేందుకు వస్తారని ఈ సంస్కృతిని పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. మద్యం సేవించి, అమర్యాదకరంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించిన వారిపై విధించిన రూ 2500 జరిమానా చాలా తక్కువని, దీన్ని మరింత పెంచాలని డిమాండ్ చేశారు. -
బికినీలు.. ఇండియాలో జాన్తా నై!
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకులపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ టూరిస్ట్‌లు తమ దేశంలో తిరిగినట్లు.. భారత్‌లో తిరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. తాజాగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్ కోర్స్.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోం. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. విదేశీయులతోపాటు మనవాళ్లు కూడా దానికి భంగం కలిగించకూడదు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. అలాగని చీరలు కట్టుకునే ఇక్కడికి రావాలని విదేశీయులకు తాను చెప్పటం లేదని.. ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా మెదిలితే చాలని, మన ప్రజలు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు కూడా కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ విదేశీ పర్యాటకులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు ఆయన సలహా ఇచ్చారు. -
అక్కడ బీఫ్ తిని.. ఇండియాకు రండి: కేంద్ర మంత్రి
సాక్షి, భువనేశ్వర్: ఓవైపు గోమాంస నిషేధంపై వివిధ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా టూరిజం శాఖ(సహాయ) బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేజే ఆల్ఫోన్స్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తిన్నాకే ఇండియాకు రావాలంటూ విదేశీ టూరిస్ట్‌లకు ఆయన సూచించారు. భువనేశ్వర్‌లో నిర్వహిస్తున్న 33వ ఇండియన్ టూరిస్ట్ అసోషియేషన్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయనను పలకరించగా, బీఫ్ బ్యాన్పై ఆయన స్పందించారు. ‘వాళ్లు(విదేశీ టూరిస్ట్‌లు) వాళ్ల సొంత దేశాల్లో బీఫ్ తిన్న తర్వాతే .. ఇండియాకు రావాల్సి ఉంటుంది’ అంటూ నవ్వుతూ ఓ ప్రకటన ఇచ్చారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేవని ఇంతకు ముందు ఈయనే వ్యాఖ్యానించారు. అయితే గోమాంస నిషేధం చాలా సున్నితమైన అంశమని, స్పందించేందుకు తానేం ఆహార శాఖ మంత్రిని కాదని తర్వాత ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. గోమాంస నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల్లో మంత్రి ఆల్ఫోన్స్ సొంత రాష్ట్రం కేరళ కూడా ఉంది. జంతువుల అమ్మకం అనేది మాంసం కోసం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిన విషయం తెలిసిందే. -
మంత్రికి ఘనస్వాగతం
ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె మొదటిసారిగా శనివారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు.నాలుగు రోడ్ల కూడలి నుంచి ఊరేగింపుగా దివంగత ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ : మంత్రి భూమా అఖిలప్రియను జిల్లా ఎస్పీ రవికృష్ణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఉన్నారు.