మంత్రికి ఘనస్వాగతం
ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె మొదటిసారిగా శనివారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు.నాలుగు రోడ్ల కూడలి నుంచి ఊరేగింపుగా దివంగత ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించిన అనంతరం ఇంటికి చేరుకున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ : మంత్రి భూమా అఖిలప్రియను జిల్లా ఎస్పీ రవికృష్ణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఉన్నారు.