allagadda
-
ఆళ్లగడ్డలో హైటెన్షన్.. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వెనుక ఉన్న మోహన్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అఖిల ప్రియ తిష్ట వేసింది. మోహన్‌రెడ్డి నివాసంలో సాయంత్రం కార్యకర్తల సమావేశానికి రావాలంటూ అఖిల ప్రియ పిలుపు నిచ్చింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే ఏవీ సుబ్బారెడ్డికి ,అఖిల ప్రియ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే మోహరించారు. సంఘటన స్థలంలో పరిస్థితిని డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షిస్తున్నారు. -
ఎమ్మెల్యే అఖిలప్రియకు భూమా కిషోర్‌రెడ్డి సవాల్
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డలో కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్సీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చర్చకు సిద్ధంగా ఉన్నామని.. అన్ని ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. వైఎస్ జగన్‌పై అఖిల ప్రియ ఆరోపణలు చేయడం అవివేకం. విజయ పాల డైరీలో బకాయిలు, మేము ఎత్తిచూపించాము. అఖిల ప్రియా, ఆమె సోదరుడు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. కొత్తూరు కోట కొండల్లో మైనింగ్ చేసి ఇటుక బట్టిలకు మట్టిని అమ్ముకుంటున్నారు.. ఆళ్లగడ్డలో బెదిరింపులు పాల్పడుతూ.. రాజకీయాలు చేస్తున్నారు. విజయ డెయిరీ చైర్మన్, డైరెక్టర్‌ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అడ్డదారులో చైర్మన్ కావాలని చూస్తున్నారు’’ అని కిషోర్ రెడ్డి మండిపడ్డారు.జగత్ విఖ్యాతరెడ్డి విజయ డెయిరీ ఎన్నికలకు అర్హుడు కాదు. ప్రజల కోసం ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం తాము కృషి చేస్తున్నాం. వారి వ్యవహార శైలి నచ్చకపోవడంతో కార్యకర్తల, ప్రజలు వ్యతి రేకిస్తున్నారు’’ అని కిషోర్‌రెడ్డి అన్నారు. -
అధికారం మనదే.. లోడెత్తండి!
ఆళ్లగడ్డ: మట్టి మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు.. చివరకు చెరువులను సైతం వదిలి పెట్టడం లేదు. రేయింబవళ్లు ప్రొక్లెయిన్లతో యథేచ్ఛగా తవ్వేస్తూ భారీ టిప్పర్లు, లారీల్లో తరలిస్తున్నారు. ఎవరైనా అడ్డు చెబితే వారిపై దాడులకు కూడా వెనుకాడడం లేదు. ‘మేం ఎమ్మెల్యే భర్త తాలుకా.. అధికారం మాది.. మీరెవరు అడగడానికి..’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అయినా మాట వినకపోతే అక్రమ కేసులు బనాయించడానికి బరితెగించారు. ఈ దారుణాలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం వేదికైంది. ఈ ప్రాంతంలో ఇటుకల బట్టీలు ఎక్కువ. వాటికి అవసరమయ్యే ఎర్ర మట్టిని చలి కాలంలో తోలుకుని నిల్వ చేసుకుంటారు. ఇదే అదునుగా భావించిన నియోజకవర్గం టీడీపీ కీలక నేత.. తన మనుషులను పెట్టి, కోటకొండ చెరువులో భారీగా ప్రొక్లెయినర్లు మోహరించి రాత్రిళ్లు తవ్వకాలు సాగించి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 35 టన్నుల చొప్పున రోజూ 100 టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఫిర్యాదులందినప్పటికీ.. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ, మైనింగ్ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. రాత్రిళ్లు మట్టి తరలించేటప్పుడు 20 మంది గూండాలు కాపలాగా ఉంటున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి రాయల్టీ చెల్లించకుండా యథేచ్ఛగా దండుకుంటున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ.25 వేల చొప్పున ఇటుకల బట్టి నిర్వాహకులు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క రోజులోనే రూ.25 లక్షలు వెనకేసుకుంటున్నారు. కోటకొండ నుంచి గాజులపల్లె వరకు ఉన్న తెలుగు గంగ ప్రధాన కాలువ కట్టపై నుంచి మట్టి తరలిస్తున్నారు. 35–40 టన్నుల బరువున్న వాహనాలు వెళ్తుండటం వల్ల కట్ట ధ్వంసం అవుతోంది. తమ పొలంలోకి వెళ్లేందుకు కట్టను కాస్త చదును చేస్తే మాత్రం కేసులు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, రైతుల నుంచి భూమి లీజుకు తీసుకుని మట్టి తరలించే వ్యాపారులకు మాత్రం అధికారులు సవాలక్ష నిబంధనలు విధిస్తుండటం గమనార్హం. ‘జేసీబీలు పెట్టకూడదు. మూడు అడుగులు కంటే లోతు తీయకూడదు. పెద్ద మిషన్లు, టిప్పర్లు ఉపయోగించకూడదు. దారిలో దుమ్ము లేవకుండా నీళ్లు కొట్టాలి’ అని చెబుతున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాను మాత్రం గాలికొదిలేశారు.కట్ట ధ్వంసం చేసి.. రోడ్డేసి..ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్ ట్రెంచ్ ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేసి అక్రమంగా మట్టి దందా సాగిస్తున్నారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా, అంత బలంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మట్టి దందా గురించి మైనర్ ఇరిగేషన్ ఏఈ రఘురాంను వివరణ కోరగా.. ‘చెరువులో మట్టిని తోలుకునేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. మట్టి తోలుతున్నట్లు మా దృష్టికి రాలేదు. తక్షణమే పరిశీలించి అక్రమ మట్టి తవ్వకాలు సాగించే వారిపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
జనసేనలోకి మంచు మనోజ్, మౌనిక?
మంచు ఫ్యామిలీ కొట్లాటలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుందా?. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైనట్టు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ఈ పొలిటికల్ అరంగేట్రానికి ఆళ్లగడ్డ వేదిక కానున్నట్టు సమాచారం.మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనోజ్, మౌనిక దంపతులకు ఆహ్వానం వెళ్లింది. అయితే వీరిద్దరూ ఏకంగా వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం, భూమా ఘాట్ నుంచి రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని చర్చ నడుస్తోంది. అందులో భాగంగా తమ బలం నిరూపించుకునేందుకు ఇలా ర్యాలీగా వస్తున్నారనే సమాచారం.భూమా కుటుంబంలో ప్రస్తుతం టీడీపీ నుంచి నాగిరెడ్డి పెద్ద కూతురు అఖియప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలప్రియతో ఉన్న కొన్ని ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక.. జనసేన వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే జనసేనలో చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనలో ఉంటే టికెట్ కూడా దక్కే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక, మౌనిక పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ గతంలోనే కీలక కామెంట్స్ చేశారు. అంతకుముందు తిరుమల దర్శనానికి వెళ్లిన సమయంలో మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక రాజకీయాల్లోకి వెళ్లితే కచ్చితంగా తన మద్దతు ఉంటుందన్నారు. ఇదే సమయంలో తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదన్నారు. రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం తనకు ఉందన్నారు.రాజకీయాల్లో భూమా ఫ్యామిలీ.. భూమా కుటుంబం రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. వారి మరణం తర్వాత భూమా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమె 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున ఆళ్లగడ్డ నుంచి పోటీచేసి విజయం సాధించారు. తండ్రి నాగిరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఇద్దరు టీడీపీలో చేరగా.. కొంతకాలానికి నాగిరెడ్డి మృతి చెందారు. ఇక, భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల బాధ్యతల్ని భూమా కుటుంబమే చూసుకుంటోంది. ఇప్పుడు భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. -
కూటమి బడ్జెట్ నిరాశాజనకం బ్రిజేంద్రా రెడ్డి.
-
ఆళ్లగడ్డలో హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డిపై పోలీసులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒత్తిడి చేయిస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో చెప్తే నేనెందుకు వెళ్తా.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి అంటున్నారు.కాగా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. మందిమార్బలంతో డెయిరీ ప్రాంగణంలోని చైర్మన్ గదిలోకి వెళ్లారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడి అక్రమాలు తన దృష్టికి వచ్చాయని, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.దీంతో అఖిలప్రియ రెచ్చిపోయారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలాఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యకం చేశారు. తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని అఖిల సూచించారు.‘నాతో మామగా మాట్లాడుతున్నావా... లేక చైర్మన్‌గా మాట్లాడుతున్నావా.. మామవైతే నీ సీట్లో కూర్చుంటే తప్పేముంది. మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు.. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకో’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే నంద్యాలకు వచ్చి రాజకీయాలు చేయడం ఏంటని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పరిధిలో రాజకీయాలు చేసుకోవాలని.. తమ పరిధిలోకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. -
ఆళ్లగడ్డలో అఖిలప్రియ అనుచరుడి అరాచకాలు..
-
ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్‌బుక్ రాజ్యాంగం
-
ఖాళీ జాగా.. వేసేయ్ పాగా
సాక్షి టాస్‌్కఫోర్స్ : టీడీపీ అధికారంలోకి వచ్చాక ‘తమ్ముళ్ల’ దురాక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఒకరు వాగులూ వంకలు మింగితే.. మరొకరు చెరువును కొల్లగొడుతున్నారు. ఇంకొకరు ప్రభుత్వ, పోరంబోకు, గ్రామనెత్తం.. ఇలా స్థలం ఏదైనా ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. తమ్ముళ్ల ఆగడాలకు అధికారులు “పచ్చ’ జెండా ఊపుతూ రిజి్రస్టేషన్‌కు అనువుగా మారుస్తుండటంతో అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీరికి అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండగా ఉండడంతో యంత్రాంగం అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఆళ్లగడ్డలోని ఓ అంగన్వాడీ భవనానిది ఇప్పుడు ఇదే పరిస్థితి. వివరాలు ఏమిటంటే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని రామలక్ష్మీ కొట్టాల కాలనీలో సుమారు పాతికేళ్ల క్రితం అంగన్వాడీ కేంద్రం కోసమని అప్పటి పంచాయతీ కార్యాలయం 6 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అందులో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రానికి భవనం నిర్మించి ఇచ్చింది. కాలక్రమేణా భవనం పాతపడటంతో ఈ కేంద్రాన్ని అద్దె భవనంలోకి మార్చారు. అప్పట్లో గ్రామ శివారులో ఉన్న ఈ స్థలం ఇప్పుడు మంచి ధర పలుకుతోంది. ప్రస్తుతం ఇక్కడ సెంటు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండడంతో ఈ స్థలంపై ఓ టీడీపీ నేత కన్నుపడింది. అంతే.. జేసీబీతో ఆ భవనాన్ని కూల్చి దాని ఆనవాళ్లు లేకుండా చదును చేసేశాడు. అందరూ అంగన్వాడీ కేంద్రాన్ని మళ్లీ నిరి్మస్తున్నారని భావించారు. కానీ, అసలు విషయం తెలుసుకుని సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో స్థలం అభివృద్ధి పనులను టీడీపీ నేత వేగవంతం చేశాడు. అడ్డదారులనూ ఆక్రమించేశారు.. ఇదిలా ఉంటే.. సుమారు 30 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ కాలనీలో ప్రధాన రోడ్లకు సమాంతరంగా అడ్డదారులు ఏర్పాటుచేశారు. ఈ దారులపైనా కన్నేసిన తమ్ముళ్లు ఖాళీగా ఉన్న స్థలాలతోపాటు అడ్డరోడ్లను ఆక్రమించుకుని అమ్మేసుకుంటున్నారు. దీంతో ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి పోవాలంటే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతఅధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. ఎవరో అంగన్వాడీ భవనం కూల్చి స్థలం ఆక్రమించుకుంటున్నారనే విషయం తెలిసింది. ఈ విషయం వెంటనే పీడీ మేడంకు తెలియబరిచా. ఆమె స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారితో మాట్లాడారు. అక్కడ అపరిశుభ్రంగా ఉంటే క్లీన్ చేశామని చెప్పారంట. – తేజేశ్వరి, సీడీపీఓ మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలి.. అంగన్వాడీ భవనం కూల్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని అక్కడి సిబ్బంది వచ్చి చెప్పారు. అది మీ స్థలం, అందులో భవనం కూడా ఉంది.. దాన్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పా. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారిస్తామని చెప్పా. అయినా వారు ఇంతవరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు కూడా చేయలేదు. – రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఐదు నెలల క్రితం నాడు–నేడుకు ఎంపిక ఐదు నెలల క్రితం గత ప్రభుత్వం అక్కడ కొత్త భవనం నిర్మించాలని నిధులు విడుదల చేసింది. విశాలమైన స్థలం ఉండటంతో నాడు–నేడు కింద మోడల్ అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని తీర్మానించారు. అధికారులు పరిశీలించడంతో చుట్టుపక్కల కాలనీల వారు సంబరపడ్డారు. అయితే, ఇంతలో ప్రభుత్వం మారడంతో విలువైన స్థలం కబ్జాకు గురైంది., భవనం కూలిపోయింది. మాకు సంబంధం లేదంటే మాకు సంబంధంలేదని ఆయా శాఖలు తప్పించుకుంటున్నాయి. -
గద్వాల: లారీ, స్కార్పియో ఢీ.. నలుగురి మృతి
గద్వాల, సాక్షి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఓ స్కార్పియో వాహనం ఢీ కొట్టుకోవడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్-బెంగు జాతీయ రహదారి 44 పై ఎర్రవల్లి చౌరస్తా ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు స్పాట్లోనే చనిపోగా.. గాయపడిన ముగ్గురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాల్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. అతివేగం ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం నెంబర్ ఏపీ 29 జి 5553. కర్నూలు ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహనంలోని వాళ్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద ధాటికి వాహన ముందు భాగం పూర్తిగా నుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడదు. ఈ కక్ష ఇప్పటిది కాదు అది ఎప్పటికీ అంతమవుతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. అలాంటి తరుణంలో వేసిన ఓ ప్లాన్ బెడిసికొట్టింది. చేసింది ఎవరు , చేయించింది ఎవరు ? ఎవరు ఎవరిని టార్గెట్చేశారన్న విషయం తెలిసి కూడా వాళ్లు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ? ఇంతకీ ఈ ఫాక్ష్యన్ కసిలో రగిలిపోతున్న ఆ ఊరేంటి? ఆళ్లగడ్డలో భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెరెడ్డిల మధ్య కొన్నేళ్లుగా రాజకీయకక్షలు కొనసాగుతున్నాయి. టీడీపీకి చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పట్టు కోసం ఇరువర్గాలు సమయం కోసం ఎదురుచూస్తుంటాయి. పోలింగ్ తర్వాత ఆళ్లగడ్డలో మరోసారి ఏవీ, భూమాకుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ ని చంపేందుకు ప్రయత్నాలు జరగడం, అతడు తృటిలో తప్పించుకోవడంతో మరోసారి ఆళ్లగడ్డ ఉద్రిక్తంగా మారింది. ఈ మర్డర్ ప్లాన్ వెనుక టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నంద్యాలజిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఉందన్న వాదన ఉంది. దానికి ప్రతికారం తీర్చుకునేందుకే భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‌ని చంపేందుకు ఏవీ సుబ్బారెడ్డి ప్లాన్ వేశారని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలినట్టుగా చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ మాత్రం ఈ వ్యవహారంపై పెద్దగా స్పందించడంలేదు. సరికదా కేసు పెట్టడానికి కూడా ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే అఖిలప్రియపై పలు కేసులున్నాయి. ఈ తరుణంలో మరోసారి ఈ కేసు గురించి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి ఆమె సిద్ధంగా లేరట. అందుకే బాడీగార్డ్‌పై జరిగిన హత్యాయత్నం విషయాన్ని చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అటు ఏవీ సుబ్బారెడ్డి తరపు నుంచి కూడా ఎవరూ పెద్దగా ఈ విషయంపై స్పందించకపోవడంతో పోలీసులు ఈ కేసుని తమదైన శైలిలో ముగించే పనిలో ఉన్నారని సమాచారం. ఇంకోవైపు ఆళ్లగడ్డలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నా ప్రజలు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. -
లోకేష్ రెడ్ బుక్ కి గంగుల బ్రిజేంద్ర రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభం
-
నంద్యాల: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులు మృతి
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఇక, మృతిచెందిన వారిని హైదరాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కాగా, వీరంతా హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన వారు అని తెలుస్తోంది. ఇక, మృతుల్లో నవ దంపతులు ఉండటం కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. అల్వాల్‌కు చెందిన బాలకిరణ్, కావ్యకు ఇటీవలే ఫిబ్రవరి 29 తేదీన వివాహం జరిగింది. మార్చి మూడో తేదీన షామీర్‌పేటలో రిసెప్షన్ జరిగింది. కాగా, వీరింతా తిరుమలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరగడంతో మృతిచెందారు. -
అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి మధ్య ముదిరిన వర్గపోరు
-
అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నంద్యాల జిల్లా: రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరింది. అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వర్గపోరు ముదిరింది. ఈ క్రమంలో అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీకి సిద్ధమని, అఖిలప్రియకు సీటు ఇస్తే సహకరించే ప్రసేక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. మరోవైపు, అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం జరిగిన ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: లోకేష్, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్ -
ఆళ్లగడ్డలో టీడీపీకి ఎదురుదెబ్బ
-
ఆళ్లగడ్డ: రా..రమ్మన్నా.. రాని జనం.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలేదు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపుల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలని ముందుగానే చెప్పినప్పటికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు. రూ.2 కోట్లు వృథా.. సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండిపోయారు. సభపై జనాలకు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటుచేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు. అసహనానికి గురైన చంద్రబాబు సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం. -
మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకోండి
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో వచ్చే మూడునెలలు టీడీపీ–జనసేన జెండాలు పట్టుకుని తిరగాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. గోదావరి నుంచి 350 టీఎంసీలు రాయలసీమకు తరలించి సీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామని, నంద్యాల జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పాసు పుస్తకాలపైనా తన బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దోపిడి దొంగలుగా మారారని, ఈ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైఎస్సార్సీపీ మంత్రులది సామాజిక యాత్ర కాదని అది మోసాలయాత్ర అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు పెద్దఎత్తున పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నందికొట్కూరులో విత్తన సరఫరా యూనిట్‌ను, ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును జగన్ ధ్వంసం చేశారని ఆరోపించారు. జగన్ వదిలిన బాణం ఎక్కడ తిరుగుతోందని వైఎస్ షర్మిలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. -
మా వల్ల కాదు బాబూ..
సాక్షి, నంద్యాల : రాజకీయంగా ఎంతో ప్రతిష్ట కలిగిన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పోటీకి ముందే టీడీపీ చేతులెత్తేస్తోందా? భూమా అఖిల ప్రియ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అల్టీమేటం జారీ చేశారా? తనకే టికెట్ ఇస్తున్నట్లు మంగళవారం నాటి సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారా? మరోవైపు ఆమె ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయారా? పార్టీ కోసం కనీస ఖర్చులు సైతం పెట్టుకోలేని స్థితికి చేరుకున్నారా? అనుచరులందరూ చేజారి పోతున్నారా? తన విచిత్ర వైఖరితో అందరినీ దూరం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ స్థానికులు ‘అవును’ అని సమాధానం చెబుతున్నారు. మంగళవారం (నేడు) పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్ల విషయంలో ఆ పార్టీ వైఖరి తేటతెల్లమైంది. పార్టీ అధ్యక్షుడు వస్తున్నారంటే టికెట్ ఆశిస్తున్న వారు ఎవరైనా జనసమీకరణపైనే దృష్టి పెడతారు. నియోజకవర్గంలో తన బలం చెక్కుచెదరలేదని ఎలాగైనా సరే నిరూపించుకోవడానికి ఎన్ని పాట్లయినా పడతారు. కానీ ఆళ్లగడ్డలో మాత్రం అందుకు విరుద్ద పరిస్థితి కనిపిస్తోంది. నేటి సభకు జన సమీకరణ, ప్రజలకు భోజనాలు, తరలింపు ఏర్పాట్లు.. ఇలా ఏమీ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. వాస్తవానికి మంగళవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభను టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభను నిర్వహించి తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభ నిర్వహణకు కనీసం రూ.రెండు కోట్లు ఖర్చవుతుందని, ఆమాత్రం ఖర్చుతో ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం నుంచి సూచనలు అందినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ మాత్రం ఖర్చు పెట్టేందుకు కూడా ఆళ్లగడ్డ టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీనమేషాలు లెక్కిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే తనకే టికెట్ ఇస్తామని సభలో ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలియవచ్చింది. అఖిల ఆరి్థక పరిస్థితి, ఇతరత్రా విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న అధిష్టానం అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని, సభ నిర్వహణ అంతా పార్టీనే చూసుకుంటుందని, ఆ మేరకు జన సమీకరణ ఏర్పాట్లు జిల్లాలోని ఇతర టీడీపీ నేతలకు అప్పగించినట్లు ఆ పారీ్టకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. జన సమీకరణ ఎలా? సభకు అయ్యే ఖర్చు పెట్టుకోలేనని తెగేసి చెప్పిన అఖిలప్రియ.. మరో వైపు ఎలాగైనా టికెట్ తనే దక్కించుకోవాలని ప్రయాసపడుతోంది. అయితే ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మరోవైపు తమ నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలిస్తే ఆ క్రెడిట్ అంతా అఖిలప్రియకు దక్కుతుందని.. ఇలా చేస్తే మనకేంటి లాభమని టీడీపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. సభ విజయవంతమైతే తన వల్లే సభ సక్సెస్ అయ్యిందని.. విఫలమైతే ఆ నెపం తమ మీద వేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ బాధ్యత మీదే కదా అని జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు నేరుగా అఖిలప్రియను ప్రశి్నంచినట్లు సమాచారం. మరోవైపు ఆళ్లగడ్డ టికెట్ తమకేనంటూ జనసేన నాయకులు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, ఆళ్లగడ్డ పట్టణంలోని బీబీఆర్ పాఠశాల సమీపంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న తన స్థలాన్ని పాడు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఆళ్లగడ్డ బీజేపీ కన్వినర్ భూమా కిశోర్ రెడ్డి చెబుతున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంతో నియోజకవర్గ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ ఖర్చులను పూర్తిగా తమ మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సభ నిర్వహణ గురించి పట్టించుకోకుండా.. సభకు ఏవీ సుబ్బారెడ్డి వస్తే బాగోదంటూ భూమా అఖిలప్రియ హెచ్చరించడం కొసమెరుపు. -
బాబు సభకు ముందే.. ఆళ్లగడ్డలో భగ్గుమన్న టీడీపీ, జనసేన విభేదాలు
సాక్షి, నంద్యాల: అవకాశవాద రాజకీయాలతో గెలుపొందాలని చూస్తున్న టీడీపీ- జనసేన.. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. టీడీపీతో జట్టు కట్టడంపై జనసేన నేతలు, శ్రేణులు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు పవన్‌పై పెదవి విరుస్తున్నారు. ఇటు బాబుకు సైతం వర్గపోరు, పొత్తుల పొట్లాటతో మళ్లీ పాత కథే పునరావృతమవుతందనే బెంగ పట్టుకుంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఎడమొహం, పెడమొహం పెడుతున్నారు. తాజాగా బాబు చేపట్టిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభ సాక్షిగా టీడీపీ, జనసేన వర్గ విభేదాలు బయటపడ్డాయి. మంగళవారం ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు సభకు రాకూడదని ఏవీ సుబ్బారెడ్డికి మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్‌గా ఉన్నా తన అనుచరులు ఊరుకోరని చెప్పిందట అఖిల ప్రియా.. దీంతో రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు బాబు సభకు జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం జరుగుతోంది. ‘మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తాం’ అని జనసేన నేతలు చెప్పేశారట. దీంతో ఆళ్లగడ్డలో చంద్రబాబు సభకు జనసేన సైడ్ అయిపోయింది. ఈ మేరకు ఆళ్లగడ్డ జనసేన ప్రకటన విడుదల చేసింది. ‘టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు. రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దు’అని ఆదేశించింది. -
ఆళ్లగడ్డలో స్పీచ్ అదరగొట్టిన అనిల్ కుమార్ యాదవ్
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పట్టం
సాక్షి, నంద్యాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా సముచితస్థానం ఇచ్చి, సామాజిక న్యాయం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే ఆయన కేటాయించారని చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దేశంలోనే మైనార్టీల పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్ బాషా మాట్లాడారు. నా పాలన చూడండి, నా పథకాలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు లేదన్నారు. పేదలకు, పెత్తందార్లకు జరిగే మహా సంగ్రామంలో ప్రజలంతా పేదల ప్రభుత్వమైన వైఎస్సార్సీపీ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే కల్పించలేదని అంజాద్ బాషా గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ, మొట్టమొదటిసారి వీరందరికీ సంపూర్ణ రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి సమున్నత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. నా అక్క, చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అంటూ ఎస్సీలను తన కుటుంబ సభ్యులుగా వైఎస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరుణ దేవుడు ఇటువైపు తొంగిచూసేందుకు కూడా భయపడ్డాడని, వారంతా హైదరాబాద్‌కు వెళ్లగానే మళ్లీ వర్షాలు పడుతున్నాయన్నారు. బీసీల విలువ జగన్ పెంచుతున్నారు.. ఇక సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్న బీసీ ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు సున్నాతో పోలుస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలంతా సున్నాగానే ఉండిపోయారని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక సున్నా ముందు ఒకటి అనే సంఖ్య పెట్టి బీసీల విలువ పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు బీసీలను నీచంగా చూస్తున్నారని.. గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు అవమానిస్తే సీఎం జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. మీ తోకలు కట్ చేస్తానని నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు అవమానిస్తే అదే వర్గానికి చెందిన వారిని పాలకమండళ్ల సభ్యునిగా చేసి సీఎం జగన్ గౌరవించారన్నారు. ఒళ్లు ఎలా ఉందని మత్స్యకారులను చంద్రబాబు బెదిరిస్తే అదేవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ్యకు పంపి గౌరవించిన ఘనత జగన్‌కు దక్కుతుందని అనిల్ చెప్పారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధంలో మనమంతా మంచి కోసం పోరాడుతున్న జగన్ వైపు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చి వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని.. 2024 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌తో పాటు బంపర్ మెజార్టీలు ఇవ్వాలని అనిల్ అభ్యర్థించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. జోరు వానలోనూ ప్రభం‘జనం’.. ఇక మంగళవారం నంద్యాల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రజలే కనిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారు. జై జగన్.. జైజై జగన్.. జోహార్ వైఎస్సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తామంతా నిలుస్తామని నినదించారు. మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైన సభకు వరుణ దేవుడు స్వాగతం పలికాడు. నాయకులంతా సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ కార్యకర్తలు, ప్రజలు నాయకుల కోసం నిరీక్షించారు. సభకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటెత్తారు. వర్షంవల్ల సభ ఆలస్యమైనా ఓపికతో వారంతా ఎదురుచూశారు. తొలుత యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
‘జగన్ పాలనలోనే అన్ని వర్గాలు బాగుపడ్డాయి’
సాక్షి, నంద్యాల: వైఎస్సార్సీపీని ఆదరించేందుకు ఏపీ ప్రజలు మరోసారి సిద్ధం అవుతున్నారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అన్నివర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం అంజాద్ భాషా అంటున్నారు. ఆళ్లగడ్డలో ఇవాళ వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు యాత్రకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు అన్ని సామాజిక వర్గాలను మోసం చేయడమే కాకుండా.. అబద్ధపు వాగ్దానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందడం మాత్రమే కాదు.. అన్ని సామాజిక వర్గాలు బాగుపడ్డాయి. ఇలా అన్నిరకాలుగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతేకాదు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 50 శాతం రిజర్వేషన్లతో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారని ఆంజాద్ బాషా గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టే ప్రజల్లోకి సామాజిక సాధికార యాత్ర ద్వారా ధైర్యంగా వెళ్లగల్గుతున్నామని, కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలో మరోసారి ప్రజల్ని మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంజాద్ భాషా సూచించారు. మంత్రి నారాయణ స్వామి కామెంట్లు.. ‘‘ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మైనార్టీలు నా వాళ్లే అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతారు. తన ప్రభుత్వంలో బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు.. ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు ప్రాకులాడుతున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు మాట్లాడం పై చంద్రబాబుకు ఎస్సీలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అయ్యింది. బీసీలను ,ఎస్సీలను నాడు చంద్రబాబు అవమానిస్తూ మాట్లాడిన మాటలెవరూ మర్చిపోరు. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర రాష్ట్రం దేశం అంతా తెలుసు అని చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. రాష్ట్ర ప్రజలందరికీ నవరత్నాల పథకాలతో మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయి’’. -
ఆళ్లగడ్డలో సామాజిక సాధికార యాత్ర
-
ఏ పార్టీలో ఉన్నాం.. ఎవరి కోసం పనిచేస్తున్నాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచింది. జనసేన ఆవిర్భావం నుంచి టీడీపీ గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పాకులాడటం తెలిసిందే. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జనసేన, 2019లో టీడీపీని కాదని లెఫ్ట్ పార్టీలతో జట్టుకట్టింది. అయితే జనసేన బలం ఏంటో తేటతెల్లమైంది. జనసేనతో లెఫ్ట్ పార్టీలు, బీఎస్పీ కలిసి పోటీ చేసినా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.15శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మరోవైపు అధికార వైఎస్సార్సీపీకి రికార్డు స్థాయిలో 51.5శాతం, ప్రతిపక్ష టీడీపీకి 35.10శాతం ఓట్లు దక్కాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే జనసేన కంటే కొన్ని నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీకి ఎక్కువ ఓట్లు పోలవడం. దీన్ని బట్టి చూస్తే జనసేన బలం ఏంటో? ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి కర్నూలు: జనసేన ఆవిర్భవించి దశాబ్దకాలం అవుతున్నా ఇప్పటి వరకూ ఆ పార్టీకి రాజకీయ స్వరూపమే లేదు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ బాధ్యులు లేని పార్టీ జనసేన. బహుశా రాజకీయ స్వరూపం, పార్టీ నిర్మాణం లేని ఏకై క పార్టీ జనసేన మాత్రమే ఉంటుంది. దీన్నిబట్టే చూస్తే పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా నిర్మించి, ప్రజాసమస్యలపై పోరాటం చేద్దాం.. అధికార, ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనే ఆలోచన లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. చివరకు ప్రతిపక్షపార్టీ 23 సీట్లకే పరిమితమై ఘోర ఓటమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనే ఆలోచన జనసేన చేయకపోవడం గమనార్హం. టీడీపీకే వంత పాడుతుండటం చూస్తే జనసేన అంతరార్థం, లక్ష్యం ఏంటో తెలుస్తోంది. పవన్‌కళ్యాణ్ కేవలం తన అవసరం కోసం ఓ పార్టీ స్థాపించడం, తనకు నచ్చిన వారికి మద్దతు ఇచ్చేందుకు, జనసేన పార్టీ పేరుతో కార్యకర్తలను వాడుకుని ఎన్నికల సమయంలో టీడీపీ జెండా మోయించడం మినహా మరో లక్ష్యం ఆ పార్టీకి లేదనేది స్పష్టం. కర్నూలు, నంద్యాల జిల్లాలోని రాజకీయపార్టీల నేతలు, విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి దూరమయ్యే యోచనలో జనసైనికులు, బలిజలు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం ఓట్లు 40వేల దాకా ఉన్నాయి. నంద్యాలలో 35వేలకు పైనే. అలాగే బనగానపల్లి, డోన్‌లో కూడా మంచి ఓటు బ్యాంకు ఉంది. ► అయితే 2019 ఎన్నికల్లో 2057 ఓట్లు మాత్రమే జనసేనకు పోలయ్యాయి. అంటే 1.10శాతం మాత్రమే. ► నంద్యాలలో 5,995 ఓట్లు, అంటే 3.04 శాతం మాత్రమే పోలయ్యాయి. బనగానపల్లిలో మరీ ఘోరంగా 1504 ఓట్లు (0.80శాతం) మాత్రమే దక్కాయి. ► డోన్‌లో 2537ఓట్లు(1.46శాతం).. మంత్రాలయంలో 1394(0.87శాతం) ఓట్లు పోలయ్యాయి. ► దీన్నిబట్టి చూస్తే బలిజల ఓటు బ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా జనసేనకు ఏమాత్రం ఆదరణ లేదనేది స్పష్టమైంది. ► ఈ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీస్థానాల పరిధిలో వైఎస్సార్సీపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ► 55–60శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయి. ఈ క్రమంలో ఇంత బలమైన వైఎస్సార్సీపీని ఢీకొట్టలేమని జనసేనతో పాటు జనసేనానికి కూడా తెలుసు. ► పదేళ్లుగా స్థిరత్వం, లక్ష్యం లేని రాజకీయం చేస్తున్న పవన్‌కళ్యాణ్ రానున్న సార్వత్రిక పోరులో ఒంటరిగా పోటీ చేస్తే 2019 కంటే ఘోరమైన ఫలితాలు వస్తాయని ఇప్పటికే అర్థమైంది. ► కలిసి పోటీ చేస్తామని గురువారం ప్రకటించినా, ప్రజలందరూ మొదటి నుంచి టీడీపీ, జనసేనను ఒకే పార్టీగా చేస్తున్నారు. ప్రత్యామ్నాయం తప్పనట్లే.. వాస్తవానికి 14చోట్ల పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా జనసేనకు లేరు. ‘బ్రో’ సినిమా నిర్మాత, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ బంధువు టీజీ విశ్వప్రసాద్ మాత్రమే ఆదోని బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, గత ఎన్నికల్లో ఆదోనిలో అత్యధికంగా జనసేనకు 11,836(7.54శాతం) ఓట్లు రావడంతో జనసేన బరిలో టీజీ విశ్వప్రసాద్ బరిలో ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే మీనాక్షినాయుడు కుటుంబం సీటు వదులుకోవల్సిందే. మరో వైపు భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈక్రమంలో ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లలో కూడా ఓ సీటును జనసేన ఆశించే పరిస్థితి ఉంది. దీంతో టీడీపీ నేతల్లో కూడా గుబులు మొదలైంది. పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచలో పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఇదే క్రమంలో మనస్సాక్షికి విరుద్ధంగా టీడీపీ జెండా మోసి చంద్రబాబు కోసం పనిచేయాల్సిన పరిస్థితి రావడంతో జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జనసేన ఎన్డీఏలో కొనసాగుతోంది. అలాంటిది ఎన్డీఏలో లేని టీడీపీతో పవన్ జత కట్టడం బీజేపీ శ్రేణులను కూడా గందరగోళానికి గురిచేస్తోంది. మూడు జెండాల తికమకలో జన సైనికులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కంటే పక్కకు తప్పుకోవడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు. పవన్‌కళ్యాణ్ ప్రకటనపై జనసైనికులు నిర్వేదంలో మునిగిపోయారు. తాము ఏ పార్టీలో ఉన్నామో, ఎవరి కోసం పనిచేస్తున్నామో తెలియని అయోమయంలో ఉన్నామని, బహుశా ఏ పార్టీ కార్యకర్తలకు ఈ వేదన ఉండదనే చర్చ జరుగుతోంది. పార్టీని నడపటం చేతకానప్పుడు, రాజకీయం తెలియనప్పుడు పార్టీని టీడీపీలో విలీనం చేస్తే సరిపోతుందని ఆళ్లగడ్డకు చెందిన ఓ జనసేన పార్టీ నేత ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. -
మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో అగ్రనటుడిగా పేరు పొందిన మోహన్‌బాబు తనయుడిగా తనదైన నటనతో సినీ ప్రియులను అలరించాడు. ఈ ఏడాదిలో మంచు మనోజ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష్మీ వివాహంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. (ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి) అయితే ఇప్పటికే మౌనికకు పెళ్లికాగా.. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి సమయంలోనే మంచు మనోజ్ ఆ పిల్లవాడి బాధ్యత కూడా తనదేనని గొప్ప మనసును చాటుకున్నారు. కలిసొచ్చే కాలానికి.. ఎదిగొచ్చే కుమారుడు అంటూ అప్పట్లో మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా మౌనిక కుమారుడు ధైరవ్ నాగి రెడ్డి బర్త్ డే కావడంతో మనోజ్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. ఆయన ఫ్యాన్స్ సైతం బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచు మనోజ్ ట్వీట్లో రాస్తూ..' ఈ పవిత్రమైన రోజున నాకు అమూల్యమైన నిధిని బహుమతిగా ఇచ్చినందుకు నేను శివునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నువ్వు నా ధైర్యం ధైరవ్. నా ప్రపంచంలోకి మీరు రావడం కేవలం ఒక సంఘటన కాదు. ఇది నన్ను మంచి మనిషిగా మార్చిన ప్రయాణానికి నాంది. నేను ప్రతిరోజూ ఎంతో ఆరాధించే ప్రయాణం. నీ నవ్వు, నీ అమాయక కళ్లు నాకు మార్గదర్శక దీపాలు. నా జీవితంలో నీ ఉనికి, అమ్మ భూమా మౌనిక ప్రేమ నాకు జీవితాన్ని చాలా భిన్నమైన మార్గంలో అర్థం చేసుకునేలా చేశాయి. మనోజ్ ట్వీట్లో రాస్తూ..'నీ ముసిముసి నవ్వులు, కౌగిలింతల వెచ్చదనం లేని జీవితాన్ని ఊహించలేను. మీ ఉనికి నా ప్రపంచాన్ని ప్రకాశవంతం చేసింది. నా హృదయాన్ని అపరిమితమైన ఆనందంతో నింపింది. నా ప్రియమైన బంగారం ధైరవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అడుగడుగునా నీ చేయి పట్టుకుని వెంట నడుస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఉంది. నువ్వు జీవితంలో మరింత ఎదగాలని నేను ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఆగస్టు 1న ధైరవ్ నాగిరెడ్డి 5వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది చూసిన ఆయన అభిమానులు సైతం ధైరవ్ నాగిరెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: మంచు మనోజ్ భార్య అరుదైన ఫీట్.. సోషల్ మీడియాలో వైరల్! ) On this auspicious day, I thank Lord Shiva for gifting me an invaluable treasure, you, my brave boy #Dhairav . Your entrance into my world wasn't just an event, it was the beginning of a journey that has made me a better man, a journey that I cherish every single day. Your… pic.twitter.com/HhUvAKbIFH — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 1, 2023 -
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో అఖిల ప్రియను అరెస్ట్ చేసిన పోలీసులు
-
భూమా అఖిలప్రియ అరెస్ట్
-
కర్నూలులో తన్నుకున్న టీడీపీ శ్రేణులు : అఖిలప్రియ అరెస్ట్
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో తెలుగుదేశం పరువు బజారున పడింది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీలో మరొకసారి విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేత భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నంద్యాల నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ ఘటన జరిగింది. నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో అఖిలప్రియ వర్గీయులు కొందరు ఏవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సుబ్బారెడ్డి ఎత్తిపడేసి పిడిగుద్దులు కురిపించారు. ఒక సమయంలో సుబ్బారెడ్డి పరిస్థితి క్లిష్టంగా మారింది. చివరి క్షణంలో ఆయన వర్గీయులు అడ్డుకుని పక్కకు తప్పించారు. తీవ్రంగా గాయ పడ్డ సుబ్బారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. భూమా అఖిలప్రియను నంద్యాల పీఎస్‌కు తరలించారు. దాడి గురించి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అఖిలప్రియ.. ఏవీ సుబ్బారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. నంద్యాల పర్యటన సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ లాగారాని, దీనిపై నిలదీస్తే ఏవీ సుబ్బారెడ్డి తనను దూషించారని అఖిలప్రియ ఆరోపించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డి పై దాడిచేశారని తెలిపారు. తన కోసం భర్త భార్గవ్ రామ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారని అఖిలప్రియ తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఖండించారు. తమ బలాన్ని నిరూపించుకునేందుకు దాడి చేశారని ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులు ఆరోపించారు. ఇదిలా ఉండగా, నంద్యాల ఘటనపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తలపట్టుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అసలే అంతంత మాత్రంగా నడుస్తోన్న లోకేష్ పాదయాత్రకు కొత్తగా ఇవేమీ ఇబ్బందులంటూ చంద్రబాబు వాపోయినట్టు తెలిసింది. ఘటనపై పార్టీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. సీనియర్లతో త్రిసభ్య కమిటీ వేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. పాదయాత్ర పూర్తయ్యేవరకు పార్టీ నేతలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. చదవండి: లేఖను ఎందుకు దాచారు? -
అఖిలప్రియ హౌస్ అరెస్ట్
ఆళ్లగడ్డ(నంద్యాల): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, నంద్యాల గాంధీ చౌక్‌కు వచ్చి వాటిని బయటపెడతానని, తమపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా ఆధారాలతో రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆమె ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో అఖిలప్రియ ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. -
అఖిల ప్రియ అండ.. భార్గవ రామ్ దందా!
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండతో ఆమె భర్త భార్గవ రామ్ భూ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆళ్లగడ్డలో ఓ మహిళ స్థలాన్ని తమ ఇంట్లో పని చేసే వ్యక్తుల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ చింతకుంటకు చెందిన గూడా నరసింహుడు ఆళ్లగడ్డ శివారులో (కీర్తన స్కూల్ పక్కన) ఉన్న అదే గ్రామానికి చెందిన మహమ్మద్ హుస్సేన్, నూర్ అహమ్మద్ కుటుంబ సభ్యులకు చెందిన 25 సెంట్లు స్థలాన్ని కొని, 1995 మార్చి 27న భార్య గూడా వెంకటలక్ష్మమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ 1.50 కోట్లు ఉంటుందని అంచనా. స్థలం ఖాళీగా ఉన్న విషయం అఖిలప్రియ దృష్టికి వెళ్లడంతో ఆమె భర్త భార్గవరామ్ రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా ఇక్కడి రెవెన్యూ శాఖలో తిష్ట వేసిన ఓ అధికారి ఆ స్థలం రికార్డులను తారుమారు చేశారు. ప్రస్తుత యజమాని పేరు రికార్డుల్లో లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పథకం వేశారు. ఇందులో భాగంగా 1952లో అల్లిసా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ ఆధారంగా వారి మనువడు నూర్‌బాషాకు వారసత్వంగా వచ్చినట్లుగా రికార్డులు సృష్టించారు. 1952 నుంచి 1985 వరకు అనేక మార్లు రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ ఈసీలో ఒక్క ఎంట్రీ కూడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీటి ద్వారా నూర్‌బాషాతో అఖిలప్రియ ఇంట్లో పనిచేసే నంద్యాల హుస్సేన్‌రెడ్డి పేరు మీద 9 సెంట్లు, అనుచరుడు మిద్దె నాగార్జున పేరు మీద 9 సెంట్లు, బుట్టగాళ్ల రమణ పేరు మీద 7 సెంట్లు 2022 డిసెంబర్ 1న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఆ స్థలం కంచె తీసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంకటలక్ష్మమ్మ, ఆమె భర్త నరసింహులు అధికారులను ఆశ్రయించారు. అధికారులు న్యాయం చేయాలి: బాధితురాలు 1995లో కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. కొన్నేళ్లు పొలం సాగు చేసుకున్నాం. చుట్టూ ఇళ్లు పడటంతో మేము కూడా సాగు ఆపేసి కంచె వేసుకున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి తాము కొనుక్కున్నామని బెదిరిస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. కాగా ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు పెడుతున్నామని సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. -
అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ విలీనమైంది) లోన్ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది. అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్ ముందు కూడా ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. -
సాగు చేస్తే చం'ధనమే'!.. పంటకాలం 12 ఏళ్లు.. చేతికి రూ.కోట్లలో ఆదాయం
సాక్షి, ఆళ్లగడ్డ: డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులు. ఏళ్లతరబడిగా ఒకే తీరు పంటలు వేస్తూ దిగుబడులు రాక పెట్టుబడులు ఎల్లక అనేక అవస్థలు పడుతున్న అన్నదాతలు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహనతో ఇప్పుడిప్పుడే ఇతర పంటలు, లాభదాయక సాగుపై దృష్టిసారిస్తున్నారు. నంద్యాల జిల్లాలో అటవీ సమీప గ్రామాల రైతులు ఎక్కువగా శ్రీగంధం, ఎర్రచందనం, అగర్ ఉడ్, మల్బరీ వేప, మహాగని తదితర పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. మొదటి రెండేళ్లు కష్టపడితే అవి పెరిగి పెద్దవై రూ.కోట్లలో ఆదాయం తెచ్చి పెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదు సిరి సంపదల గని శ్రీగంధం. అడవి సంపదలో రారాజు ఎర్రచందనం. ఇవి ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన ధర పలికే చెట్లుగా వెలుగొందుతున్నాయి. అయితే, ఇవి దట్టమైన అడవుల్లో మాత్రమే లభించే చెట్లు. వీటి చెక్కను ఎన్నో ఔషధాల్లో, కాస్మోటిక్లో విరివిగా వాడుతారు. ప్రస్తుతం వీటి వినియో గం పెరగడంతో అంతరించి పోతున్న అరుదైన జాతి సంపదను స్మగ్లర్ల బారి నుంచి సంరక్షించుకునేందుకు ప్రభుత్వం వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో శ్రీగంధం మినహా మిగతా మొక్కలను సో షల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి కొన్ని రకాలు ఉచితంగా మరి కొన్ని రకాల మొక్కలు నామమాత్రపు ధరకు రైతులకు అందజేస్తోంది. దీంతో జిల్లాలో పలువురు వీటిని సా గు చేస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లో అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటవీ శాఖ అనుమతులు ఇస్తోంది. దీంతో జిల్లాలో ప్ర స్తుతం ఎర్రచందనం, శ్రీగంధం సుమారు 80 హెక్టార్లలో సాగు అయినట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీగంధం చెట్టు రైతుకు ఆదాయం.. వాతావరణ పరిరక్షణ శ్రీగంధం, ఎర్రచందనం పెంపకం చాలా తేలిక. అటవీ సాగు మొక్కలైన టేకు, జామాయిల్, సుబాబుల్ మొక్కలు మాదిరే వీటిని పెంచవచ్చు. నీరు నిలవని మెట్టభూములు వీటి సాగుకు అనుకూలం. ఈ మొక్కలకు ఎటువంటి క్రిమి కీటకాలు ఆశించవు. రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఏడాదికి నాలుగైదు సార్లు నీటితడులు, ఒకసారి పశువుల ఎరువు వేసుకుంటే సరిపోతుంది. గంధం, చందనం సాగు రైతులకు ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు. సాగు ఇలా.. ఎకరం విస్తీర్ణంలో 450 నుంచి 560 మొక్కలు నాటుకోవచ్చు. ఎర్రచందనం మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సోషల్ ఫారెస్ట్ నర్సరీల్లో పెంచి ఉచితంగా అందజేస్తారు. శ్రీగంధం మొక్కలు ప్రైవేటు నర్సరీల్లో లభ్యమవుతాయి. మొక్కలు నాటిన మూడు, నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు, సాగు చేసుకోవచ్చు. సాగు వ్యయం ఎకరాకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతుందని అంచనా. పచ్చని బంగారం శ్రీగంధం ఎర్రచందనం తరువాత శ్రీగంధం కలపకు భారీ డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు కూడా ఎక్కువే. శ్రీగంధం చెక్కను సెంట్లు, అగరబత్తీలు, సబ్బులు, అందమైన బొమ్మలు తయారీలో వినియోగిస్తారు. ఒక కిలో ధర రూ. 8 వేల నుంచి రూ. 16వేల వరకు ఉంటుంది. 12 నుంచి 15 ఏళ్లు తరువాత ఒక్కో చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల వరకూ పొందవచ్చు. దీంతో ఒక్కో చెట్టు నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్ల ఆదాయం లభిస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే, వీటిని దొంగల బారిన పడకుండా రక్షించుకోవాల్సి ఉంటుంది. పెరిగి పెద్దయితే ఎర్ర బంగారమే.. ఎర్రచందనం 15 సంవత్సరాల వయసు తరువాత ఈ చెట్లు గరిష్టంగా 20 మీటర్లు ఎత్తు పెరుగుతాయి. వీటిని నరికితే ఎకరాకు 200 నుంచి 300 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఏ – గ్రేడు దుంగలకు టన్ను రూ 60 లక్షలు, బి–గ్రేడు రూ. 40 లక్షలు, సీ–గ్రేడు రూ. 31 లక్షలు ధరలుగా నిర్ణయించారు. ఈ లెక్కన కనీసం సీ గ్రేడు రకానికి లెక్కేసినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సాగులో పాటించాల్సిన మెలకువలు ►నాటిన మొదటి సంవత్సరం మొక్కల బతుకుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మొదటి రెండేళ్ల పాటు మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మొక్కలు నేలలో స్థిరపడి బాగా పెరుగుతాయి ►వీటిని మెట్ట,గరప నేలల్లో సాగు చేయవచ్చు ►ఎకరాకు 560వరకు మొక్కలు నాటుకోవచ్చు ►మొక్కల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి ►శ్రీ గంధం వేర్లకు సొంతంగా పోషకాలను గ్రహించే శక్తి తక్కువగా ఉంటుంది. అందుబాటులో చెట్ల వేర్లతో శ్రీగంధం వేర్లు పెనవేసుకొని వాటి నుంచే తేమను పోషకాలను సంగ్రహిస్తాయి. ►నాటిన మూడేళ్ల వరకు శ్రీగంధానికి అందు బాటులో ఏదో ఒక మొక్క ఉండి తీరాల్సిందే. -
నాడు.. దోచుకో.. పంచుకో.. తినుకో 'నేడు నేరుగా లబ్ధి'
మూడేళ్ల నాలుగు నెలల్లో మీ బిడ్డ బటన్ నొక్కి అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. అప్పట్లోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్.. అప్పుల గ్రోత్‌రేట్ కూడా అప్పటి కంటే ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు? చంద్రబాబు ఎందుకు చేయలేదు? అని ఆలోచించాలని అడుగుతున్నా! అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు, దత్తపుత్రుడు దోచుకో, పంచుకో, తినుకో అనేలా డీపీటీ అనే పథకం అమలయ్యేది. ఈ రోజు మీ బిడ్డ ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్’తో బటన్ నొక్కుతున్నాడు. నేరుగా మీ ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. అప్పట్లో అంత దోచుకున్నా ఎవడూ రాయడు, ప్రశ్నించడు. కారణం.. వీరందరిదీ గజదొంగల ముఠా కాబట్టి! దేవుడి దయతో, మీ అందరికీ మంచి చేసే పరిస్థితులు రావాలని, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా సంస్థలు కూలిపోవాలని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని త్రికరణ శుద్ధిగా విశ్వసించి అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అన్నదాతకు ఇంతగా తోడ్పాటు అందిస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ, ఎక్కడా లేదని మీ బిడ్డగా చెప్పేందుకు గర్విస్తున్నానన్నారు. ప్రతి పథకాన్ని క్రమం తప్పకుండా కాలెండర్లో పేర్కొన్న ప్రకారం అమలు చేస్తూ ప్రతి కుటుంబానికీ అండగా నిలిచామన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభించారు. బటన్ నొక్కి 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు జమ చేశారు. రైతులకు మెగా చెక్ అందచేసి లబ్ధిదారులతో ముచ్చటించారు. వారితో కలసి గ్రూపు ఫోటో దిగారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. 82 శాతం చిన్నకారు రైతులకు ప్రయోజనం మూడేళ్ల నాలుగు నెలల పాలనలో దేశంలోని 27 రాష్ట్రాలలో ఎక్కడా లేనివిధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి ఆలోచిస్తే కేవలం అర హెక్టార్ అంటే 1.25 ఎకరాలలోపు ఉన్నవారు 68 శాతం మంది ఉన్నారు. ఒక హెక్టార్ వరకూ అంటే 2.5 ఎకరాలు ఉన్న రైతులు 82 శాతం ఉన్నారు. వీరికి ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న రైతుభరోసా సొమ్ము దాదాపు 80 శాతం పెట్టుబడి ఖర్చులకు సరిపోతుంది. అన్నదాతలు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. పంట వేసే సమయానికి పెట్టుబడి సొమ్ము చేతికందాలి. ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా, పారదర్శకంగా ఖాతాల్లో ఈ డబ్బులు మూడు విడతల్లో జమ చేస్తున్నాం. ఏటా ఖరీఫ్ సీజన్ మొదలయ్యేలోపే మే నెలలో రూ.7,500, పంటలు కోతకు వచ్చేముందు అక్టోబర్‌లో మరో రూ.4 వేలు, సంక్రాంతి సందర్భంగా జనవరిలో మరో రూ.2 వేలు కలిపి మొత్తం రూ.13,500 రైతన్నల చేతిలో పెడుతున్నాం. మూడున్నరేళ్లలో వైఎస్సార్ రైతుభరోసా – పీఎం కిసాన్ ద్వారా దాదాపు 50.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.25,971 కోట్లకుపైగా నేరుగా జమ చేశాం. అంటే ఏటా దాదాపు రూ.7 వేల కోట్లను రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. కౌలు, గిరిజన రైతులకూ భరోసా పట్టా భూములున్న రైతులే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కౌలు రైతులు, దేవదాయశాఖ భూములు సాగు చేస్తున్న వారు, గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు కూడా రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందచేసి మంచి చేయగలుగుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయానికి సాయంగా, అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా ఉండేందుకు మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు వ్యయం చేశామని సగర్వంగా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సభకు హాజరైన భారీ జన సందోహం మాఫీ పేరుతో బాబు మోసం చంద్రబాబు పాలన చూశారు.. మన పాలన చూస్తున్నారు. తేడా ఒక్కసారి గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. దీంతో రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి కాకుండా తిరిగి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోగలుగుతున్నారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లలో వడ్డీలేని రుణాల కింద చెల్లించింది రూ.685 కోట్లు మాత్రమే. 2016 అక్టోబర్ నుంచి ఆ పథకాన్ని రద్దు చేశారు. మీ బిడ్డ తిరిగి ఆ పథకాన్ని తీసుకొచ్చాడు. ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో రూ.1,282 కోట్లు చెల్లించామని సగర్వంగా చెబుతున్నా. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగంలో రూ.3,64,624 కోట్లు అందితే ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల పాలనలోనే రూ.5,48,518 కోట్లు అందచేశాం. తేడా గమనించాలని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో పంటల బీమా ప్రీమియంలో రైతులు, ప్రభుత్వం వాటాలు చెల్లించాలి. ఈ రెండూ సక్రమంగా జరగకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్‌లో నష్టం వాటిల్లింది. ఆ ఐదేళ్లలో 30.80 లక్షల మందికి రూ.3,412 కోట్లు మాత్రమే బీమా పరిహారంగా దక్కితే ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684 కోట్ల బీమా సొమ్ము రైతుల ఖాతాల్లోకి జమ అయింది. తేడా మీరే గమనించండి. రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు హయాంలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇన్‌ఫుట్ సబ్సిడీ పేరుకే ఉండేది. ఎప్పుడు వస్తుందో? ఎవరికి వస్తుందో? తెలియదు. చివరకు 2017–18, 2018–19 కాలానికి రూ.2,558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు మూడేళ్ల నాలుగు నెలల్లో 20.85 లక్షల మంది రైతులకు రూ.1,800 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందచేశాం. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసే లోపే డబ్బులు జమ అవుతున్నాయి. ఈ – క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్‌తో పారదర్శకంగా ప్రతీ రైతన్నకు తోడుగా నిలుస్తున్నాం. ఇవాళ ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ రైతులకు క్రమం తప్పకుండా అందుతోంది. గొప్ప మార్పు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ప్రతీ గ్రామంలో రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట విక్రయం వరకూ వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఈ – క్రాపింగ్ ప్రతీ గ్రామంలో నమోదవుతోంది. ఈ– డేటా ఆధారంగా ప్రతీ రైతుకు, ప్రతీ పథకం వివక్ష, లంచం లేకుండా నేరుగా అందుతోంది. పరిహారం అందని కుటుంబం ఒక్కటీ లేదు రైతన్నలు ఎవరైనా దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే గతంలో సానుభూతి కూడా చూపలేదు. అసలు ఆత్మహత్య చేసుకున్నవారు రైతులే కాదనే మాటలు వినిపించేవి. ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉంటే వెంటనే ప్రభుత్వం స్పందిస్తోంది. పాసు పుస్తకాలున్న అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడితే పరిహారం అందని రైతన్నలు ఒక్కరంటే ఒక్కరూ లేరు. సీసీఆర్టీ కార్డులున్న కౌలు రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే వారికీ పరిహారం అందించాం. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు ఆర్బీకేలను యూనిట్‌గా తీసుకుని అర్హులెవరూ మిగిలిపోకుండా సంతృప్త స్థాయిలో మంచి చేస్తున్నాం. పగటిపూట 9 గంటల ఉచిత కరెంటు, కనీస మద్దతు ధరతో పంటల కొనుగోలు, ఆక్వా రైతులను ఆదుకోవడం, రైతులను భాగస్వాములుగా చేసి ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్ల ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాలను కమ్యూనిటీ సెంటర్ల ద్వారా అందించడం, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధర లభించేలా అమూల్ సంస్థను తేవడం లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు గంగుల ప్రభాకర్‌రెడ్డి, చల్లా భగీరథరెడ్డి, ఇషాక్‌బాషా, ఎమ్మెల్యేలు బిజేంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఆర్థర్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. మన ఖర్మ ఏమిటంటే.. మన ఖర్మ ఏమిటంటే గొప్ప మార్పులు జరుగుతున్నా, పండ్లు కాసే చెట్టుకే రాళ్లు పడతాయి అన్నట్లు రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నా ఎల్లో మీడియా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, చంద్రబాబు ఒక దత్తపుత్రుడు రాష్ట్రంలో ఏం చేస్తున్నారో మీకు తెలిసిందే. వారి చేతిలో మీడియా ఉంది. వారు రాసిందే రాత. వారు ఏం చూపిస్తే అదే జరుగుతుందనే భ్రమలో ఉన్నారు. గర్వం పెరిగిపోయింది. వారికి చెందిన వ్యక్తి సీఎం స్థానంలో లేరు కాబట్టి ఆయన్ను తెచ్చేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఆనాటికి, ఇప్పటికి తేడా గమనించాలని అడుగుతున్నా. ఆ రోజు కంటే ఈ రోజు మన బతుకులు బాగున్నాయా? లేదా? అనేది మీరు గుండెలపై చేతులు వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. పరిపాలన ఎలా సాగిందో మీరంతా చూసిన వారే. కేవలం రైతుల కోసం మీ బిడ్డ రూ.1,33,527 కోట్లు ఖర్చు చేశాడు. ఇది మీ ప్రభుత్వం. మీ బిడ్డ బటన్ నొక్కి మూడున్నరేళ్లలో అక్షరాలా రూ.1,74,931 కోట్లు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేకుండా పారదర్శకంగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్లింది. ఇలాంటి మంచి పనులు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నా. నాడు ఏటా కరువే.. నేడు తావే లేదు దేవుడి దయ, మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనను గమనిస్తే 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359 మండలాలు, 2016లో 301 మండలాలు, 2017లో 121 మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో మరో 257 కరువు మండలాలు ప్రకటించారు. చంద్రబాబు, కరువు రెండూ కవల పిల్లలే అన్నట్లుగా పాలన సాగింది. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. మంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ వరకూ సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు కాగా ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 4 శాతం అధికంగా వర్షాలు కురిసి రాష్ట్రం కళకళలాడుతోంది. 21 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైతే ఐదు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ కురిసింది. గతంలో 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలను తీసుకున్నా మూడేళ్ల నాలుగు నెలల్లో ఏ ఒక్క ఏడాదీ ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. చంద్రబాబు పాలనతో పోల్చితే పంటల విస్తీర్ణంతో పాటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరిగింది. నాడు ఐదేళ్లలో సగటున 154 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా మన ప్రభుత్వంలో 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 13.24 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ప్రతీ గ్రామంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. దీంతోపాటు వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కార్మికులకు కూడా మంచి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల నాలుగు నెలల్లో ప్రతీ రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో కూడా భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దివ్యాంగురాలికి ముఖ్యమంత్రి భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తక్షణ సాయం నంద్యాల: అనారోగ్యంతో బాధపడుతూ తనను కలిసిన ఓ దివ్యాంగురాలికి నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా కల్పించారు. నంద్యాల జగజ్జననీనగర్కు చెందిన హేమపావని మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. వైద్యం చేయించుకునే స్థోమత ఆ కుటుంబానికి లేదు. సీఎం జగన్ సోమవారం ఆళ్లగడ్డ వస్తున్న విషయం తెలుసుకొని బాధితురాలు తండ్రి శ్రీనివాసులుతో కలిసి హెలిపాడ్ వద్దకు వచ్చింది. సీఎంను కలసి తన సమస్యను మొరపెట్టుకుంది. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిని పిలిచి బాధితురాలి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తనకు వివరాలు ఇవ్వాలని సూచించారు. అంతేగాకుండా తక్షణమే ఆ బాలికకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.లక్ష మంజూరు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. భయం పోయింది.. నాకు ఏడెకరాల పొలం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం అంటే పండుగ అయింది. భయం పోయింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.48 వేలు వచ్చాయి. ఇప్పుడు మరో రూ.4 వేలు జమ కానున్నాయి. అంతేకాకుండా పంట నష్టం కింద రూ.30 వేలు వచ్చిందన్నా. రైతులంతా సీహెచ్ఎస్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీపై ట్రాక్టర్, టిల్లర్, కంకుల మిషన్ తీసుకున్నాం. దీనికి రూ.13.50 లక్షలు కాగా సబ్సిడీ కింద రూ.5.40 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. గతంలో మందు మూటెలు (ఎరువులు) కావాలంటే మండల కేంద్రం శిరివెళ్లకు వెళ్లి క్యూలైన్లలో నిలుచుని అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు గ్రామంలోని ఆర్బీకేలో మందు బస్తాలు అందచేస్తూ అటు నుంచి అటే పొలానికి వెళ్లి చల్లుకునేలా చేశావన్నా. రెతుల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం రుణం ఏమిచ్చి తీర్చుకోగలం? – గుర్రప్ప ,రైతు, కోటపాడు నిన్ను చూడాలని.. గతంలో రెండు సార్లు వరి పంట నష్టపోవడంతో బాధపడ్డా. మళ్లీ పంట వేయకముందే పంట నష్టం కింద రూ.40 వేలు జమ చేశారు. బ్యాంకులో రూ.20 వేలు తీసుకుంటే సున్నా వడ్డీ కింద రూ.3 వేలిచ్చారు. అధికారులే మా దగ్గరకు వచ్చి వివరించి ప్రయోజనం చేకూరుస్తున్నారు. మీరు సీఎం అయ్యాకే మా నాన్నకు పింఛన్ వచ్చిందన్నా. నాన్నకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా గుండె జబ్బుకు, కంటి వెలుగు కింద అమ్మకు కంటి ఆపరేషన్ చేశారు. వాళ్లిద్దరూ నిన్ను చూడాలని మీటింగ్‌కు వచ్చి జనంలో కూర్చున్నారన్నా. మానాన్న బతికారంటే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ చలువే కారణం. రైతుల కోసం మీరు చేపడుతున్న పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. – కృష్ణ నాయక్, రైతు, బాచేపల్లె తాండ ఆర్బీకేలతో రైతన్నలకు అండగా ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్, ఇన్సూరెన్స్ చేస్తున్నాం. రైతన్నకు తోడుగా నిలిచి ప్రతి పథకం అందిస్తూ నష్టపోకుండా చూస్తున్నాం. చంద్రబాబు హయాంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అంతా కల్తీనే. వీటితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్తీని అరికట్టేందుకు రాష్ట్రంలో కేవలం 12 ల్యాబ్‌లు మాత్రమే చంద్రబాబు పాలనలో ఉండగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 147 ల్యాబ్‌లు నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్నాయి. 70 ల్యాబ్‌లు ఇప్పటికే పూర్తై రైతులకు సేవలు అందిస్తున్నాయి. తక్కిన 77 నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో రెండు ల్యాబ్‌లు, 4 ప్రాంతీయ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. -
వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోంది
-
సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారు
-
‘మీ వల్లే నాన్న బతికారు.. మిమ్మల్ని చూడాలని వచ్చారు’
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, వైఎస్సార్ రైతు భరోసాతో ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆర్బీకే కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎరువులు కోసం గతంలో రోజుల తరబడి క్యూ ఉండేది. ఇప్పుడు విత్తనం నుంచి విక్రయం దాకా ఆర్బీకేలు అండగా ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్ రైతులకు పెద్దదిక్కుగా ఉన్నారన్నారు. ఇంకా లబ్ధిదారులు ఏమన్నారంటే వారి మాటల్లోనే.. చదవండి: గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్ మీ వల్లే ఆయన బతికారు: భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు. జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను. సాగు చేస్తున్నాను. నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు. నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను. కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ.3 వేలు వచ్చాయి. గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి. మీ వల్లే ఆయన బతికారు. ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు. తెలుగుగంగ ప్రాజెక్ట్ కెనాల్‌కు పిల్ల కాలువలు డాక్టర్ వైఎస్ఆర్ తవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. అమ్మ సంతోషపడింది: దూదేకుల గుర్రప్ప, రైతు జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది. మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్లో వచ్చాయి. నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది. ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి. పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం. గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈరోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి. అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం. మా అమ్మకు క్యాన్సర్ ఆపరేషన్ జరిగితే సీఎంఆర్ఎఫ్ కింద రూ. 60 వేలు వచ్చాయి. కొడుకుగా నా బాధ్యత జగన్ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్పుట్ సబ్సిడీ కూడా అందింది. మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి. మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. -
ఆళ్లగడ్డలో ఘనంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం (ఫొటోలు)
-
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
-
గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్
సాక్షి, నంద్యాల జిల్లా: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే గతంలో పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 20.85 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ రూ. 1800 కోట్లు చెల్లించాం. ఏ ఏడాది నష్టాన్ని ఆ ఏడాదే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్ ‘‘మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మంచి పనులు ఎల్లోమీడియాలో రావని సీఎం జగన్ అన్నారు. ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది. ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి. అప్పటికీ , ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి. అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది. గతంలో డీపీటి పథకం.. దోచుకో, పంచుకో, తినుకో అమలయ్యేది. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోందని’’ సీఎం జగన్ అన్నారు. ‘‘గజ దొంగల ముఠా మంచి చెప్పదు. కుట్రలే చేస్తుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి. మంచి నిలబడాలని, అన్ని ప్రాంతాలకు మేలు జరగాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఆళ్లగడ్డ నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకు రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్ ఆళ్లగడ్డ పర్యటన
-
వైఎస్సార్ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ
సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన.. అప్డేట్స్ 12:49PM రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్ 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు విడుదల చేసిన సీఎం జగన్ 12:11PM సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రతి అంశంలో రైతులకు అండగా ఉంటున్నాం ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నాం రైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది రైతన్నత ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందిస్తున్నాం ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు ఇప్పటికే మేలో రూ. 7500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తున్నాం మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర లబ్థి మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశాం ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ. 51 వేలు అందించాం పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం మూడున్నరేళ్లలో రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశాం మంచి పనులు ఎల్లో మీడియాలో రావు ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి గతంలో డీపీటీ పథకం.. దోచుకో, పంచుకో, తినుకో ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోంది గజదొంగల ముఠా మంచిని చెప్పదు.. కుట్రలే చేస్తుంది అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది ఈరోజు మీ జీవితాలు బాగున్నాయా.. లేదా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు ఈ ప్రభుత్వంతో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు సున్నా వడ్డీ కింద చంద్రబాబు రూ. 685 కోట్లు చెల్లిస్తే, మూడున్నరేళ్లల్లో సున్నా వడ్డీ కింద రూ. 1,282 కోట్లు చెల్లించాం బాబు హయాంలో బ్యాంకుల ద్వారా రూ. 3.6 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు రూ. 5.48 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,684 కోట్లె బీమా సొమ్ము జమ చేశాం ఏ రైతు నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి 11:53AM మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారు క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నారు. దేశంలోనే లేని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల భీమా రైతులతో వ్యవసాయం సలహా మండలి ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏపీ టీడీపీ హయాంలో రైతుల పేరిట దోచుకున్నారు మేం వచ్చాక దళారుల ప్రమేయం లేకుండా రైతులకు రాయితీ ఏపీ వ్యవసాయం రంగం చర్యలను ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రశంసించారు ప్రపంచంలోనే లేని వ్యవసాయ సంస్కరణలు ఏపీలో ఉన్నాయని వారు కొనియాడారు 11: 20AM ఆళ్లగడ్డ చేరుకున్న సీఎం జగన్ 10:10AM ► వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ కార్యక్రమం.. కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకోనున్న సీఎం జగన్. 9:03AM ► వైఎస్ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు జమ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరారు సీఎం జగన్. ► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో ప్రసంగించి.. అనంతరం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ► వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ► వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు. ► మే నెలలో ఖరీఫ్‌కు ముందే తొలి విడత సాయాన్ని అందజేసింది. ► మూడో విడుతను సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది. ► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరుసగా నాలుగో ఏడాది రెండో విడత ‘రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ► రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందచేయనుంది. ► దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీనే కావడం గమనార్హం. 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు రూ.7,000 కోట్లను రైతు భరోసా ద్వారా అందచేసి ఆదుకుంటోంది. ► రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. ► చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాయాన్ని అందచేస్తోంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అందిస్తామని మేనిఫెస్టోలో మాటివ్వగా సీఎం జగన్ ప్రభుత్వం అంతకుమించి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందచేస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న రూ.17,500. ► గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నలకు సీఎం జగన్ ప్రభుత్వం దాదాపు రూ.1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ రైతు భరోసా, ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని తెచ్చింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, ఐదు రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటించింది. రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తోంది. ఏడాది పొడవునా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండటంతో ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్ధితి తలెత్తలేదు. ► టీడీపీ హయాంలో రైతన్నలకు కనీసం విత్తనాలు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. ఇక ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు అగమ్యగోచరమే. ఆశాస్త్రీయ పంట నష్టాల అంచనాతోపాటు అయిన వారికే పరిహారం దక్కేది. నాడు ఏడాది పొడవునా కరువు తాండవించడంతో ఐదేళ్లలో 1,623 కరువు మండలాలను ప్రకటించాల్సి రావడం గత సర్కారు నిర్వాకాలకు నిదర్శనం. ఇక రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనే గత పాలకులకు రాలేదు. రైతు భరోసాతో ఇప్పటిదాకా ఎవరికి, ఎంత సాయం? ► బీసీలు 24,61,000 మందికి రూ.12,113.11 కోట్లు ► ఎస్సీలు 5,23,000 మందికి రూ.2,653.04 కోట్లు ► ఎస్టీలు 3,92,000 మందికి రూ.1,771.13 కోట్లు ► మైనార్టీలు 60,000 మందికి రూ.320.68 కోట్లు ► కాపులు 7,85,700 మందికి రూ.3,793.44 కోట్లు ► ఇతరులు 10,16,300 మందికి రూ.5,319.93 కోట్లు ► మొత్తం 52,38,000 మందికి రూ.25,971.33 కోట్లు నేడు సీఎం పర్యటన ఇలా ► సీఎం జగన్ ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. ► 10.45 – 12.10 వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు, ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ► మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం
దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. బకాయిల బాగోతం ఇదీ 2011 డిసెంబరు నెలలో భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17, 370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు, భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న 356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు, భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు. ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరీ మాదాల వెంకటరమణయ్య గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు గుంటూరు శీను ప్రధాన నిందితుడు. ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే! భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి 2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. -
Dragon Fruit: కరువు నేలపై సిరులు: రూ.5.5 లక్షల ఖర్చు.. 16లక్షల ఆదాయం
సంప్రదాయ పంటతో ఆశించిన ఆదాయం రాకపోవడంతో అన్నదాతలు ఉద్యాన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో విదేశీ పంటలను కూడా సాగు చేస్తూ వినూత్న పద్ధతులు, మెలకువలు పాటిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘ కాలిక లాభాలు వచ్చే డ్రాగన్ ఫ్రూట్‌ను సైతం సాగు చేస్తున్నారు. మార్కెటింగ్ సదుపాయం, లాభాలే లక్ష్యంగా తోటల సాగుపై దృష్టి సారించారు. సాక్షి, నంద్యాల(ఆళ్లగడ్డ): జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. ఔషధ గుణాలు మెండుగా కలిగిన పండు కావడంతో పాటు మంచి గిరాకీ ఉండటంతో రైతులు డ్రాగన్ ఫ్రూట్ తోటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. విదేశీ పండుగా చెప్పుకునే డ్రాగన్ ఫ్రూట్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి సారి ఆళ్లగడ్డ మండలం పెద్ద ఎమ్మనూరులో 2018 –19లో సాగైంది. అనంతరం చాగలమర్రి, ఉయ్యలవాడ మండలాల్లోని కొందరు రైతలు అటువైపు దృష్టి మళ్లించారు. రైతుల ఆసక్తిని, పంట దిగుబడి ఆదాయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం 2021 –22లో డ్రాగన్ ఫ్రూట్‌ను వాణిజ్య పంటగా గుర్తించింది. అలాగే ఎన్ఆర్ఈజీఎస్, ఉద్యానశాఖల సంయుక్తంగా సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు మూడేళ్ల పాటు నిర్వహణకు రాయితీలు అందిస్తోంది. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 80 ఎకరాల్లో డ్రాగన్ సాగవుతోంది. అన్ని నేలలూ అనుకూలమే.. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నీరు నిలిచే బంక నేలలు మినహా అన్ని భూములు అనుకూలమే. మెట్ట ప్రాంత భూముల్లో డ్రాగన్ మొక్క బాగా పెరగడంతో పాటు పండ్ల సైజు, దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో వస్తుంది. నీటి ఎద్దడిని సైతం సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడులను ఇస్తుంది. ఆళ్లగడ్డ మండలం శాంతినగరంలో సాగైన డ్రాగన్ ఫ్రూట్ 30 ఏళ్ల వరకు దిగుబడి .. డ్రాగన్ మొక్కలు నర్సరీలో నాలుగు నుంచి ఐదు నెలలు పెంచి ఆ తర్వాత పొలంలో నాటుకోవాలి. నాటిన 9వ నెల నుంచి ఏడాదిలోపు మొదటి పంట చేతికొస్తుంది. ఏటా ఫిబ్రవరి నుంచి నవంబరు వరకు ఏడాదికి మూడు కాపుల చొప్పున 30 ఏళ్లు దిగుబడి వస్తుంది. ఏటా ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.65 వేల వరకు పెట్టుబడి నిర్వహణ ఖర్చులు వస్తాయి. దిగుబడి మాత్రం ఏటేటా పెరుగుతుంది. సాగు ఇలా.. ఎకరం మెట్ట భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రస్తుత ధరలను అనుసరించి రూ.8 లక్షల వరకు ఖర్చవుతుంది. ఎకరాకు 400 నుంచి 600 వందల సిమెంట్ స్తంభాలు అవసరం. ఇందులో 2 వేల నుంచి 2,200 మొక్కల వరకు నాటుకోవచ్చు. తొలి ఏడాది మొక్కల ఖర్చు, సిమెంట్ స్తంభాలు, రింగులు, కంచె తదితర వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. మొదటి ఏడాది ఒక్కో చెట్టు సుమారు 10 నుంచి 20 పండ్లు కాస్తుంది. తర్వాత మూడేళ్ల నుంచి ఒక్కో చెట్టు 80 నుంచి 150 పండ్లు కాస్తుంది. ఈ లెక్కన పెట్టుబడి వ్యయం పోనూ ఎకరాకు ఏడాదికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎకరాకు రూ.6 లక్షల రాయితీ.. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో రైతుకు మూడేళ్లకు రూ.6 లక్షలు ఇస్తారు. ఈ మొత్తంలో నర్సరీ నుంచి మొక్కలు తెప్పించి, కూలీలతో గుంతలు తీయించి వారే నాటిస్తారు. డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. ఎరువులు, కలుపు, సంరక్షణ ఖర్చులు ఇస్తారు. సిమెంట్ స్తంభాలు అందజేస్తారు. ప్రస్తుతం ఖర్చు ఎక్కువగా ఉండటంతో రైతుకు అర ఎకరా వరకే రాయితీ ఇవ్వనున్నారు. పుష్కలంగా ఔషధ గుణాలు డ్రాగన్ ఫ్రూట్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పోషక విలువలు, విటమిన్ – సి, విటమిన్ – బి3తో ఐరన్, మెగ్నీషియంలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అత్యధికంగా ఉంటాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధి, రక్త పోటు నియంత్రణలో కూడా బాగా ఉపయోపడుతుందని వైద్యులు చెబుతున్నారు. మార్కెట్లో మంచి గిరాకీ ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్‌కు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కరోనా సమయంలో వ్యాధినిరోధక శక్తి పెంపొందాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినమని చెప్పడంతో ప్రజలు అందరూ ఈ పండు తినేందుకు ఆసక్తి పెంచుకున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌కే పరిమితమైన ఈ పండు.. ఇప్పుడు చిన్నచిన్న పట్టణాల్లో తోపుడు బండ్లపై కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకే వచ్చి వినియోగ దారులు కిలో రూ.200 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా సాగు చేశా ఏ పంటలు వేసినా పెద్దగా ఆదాయం రాకపోవడంతో ఒక ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పంట వేయాలని నిర్ణయించుకున్నాం. యూట్యూబ్ చూసి ఎలా చేపట్టాలో తెలుసుకున్నాం. మొక్కలు తెచ్చుకుని 2019లో నాటాం. మొదటి ఏడాది కాపు వచ్చే వరకు సుమారు రూ.5.5 లక్షల ఖర్చు వచ్చింది. మొదటి కాపు పెద్దగా రాలేదు. రెండో కాపు సుమారు నాలుగు క్వింటాళ్లు వచ్చింది. మూడో సంవత్సరం 8 టన్నులు వచ్చింది. కిలో రూ.200 లెక్కన విక్రయించడంతో రూ.16 లక్షల వచ్చింది. ఇక్కడే పొలం వద్ద విక్రయించడంతో రవాణా ఖర్చు మిగిలిపోయింది. ఈ ఏడాది 10 నుంచి 12 టన్నులకు పైగానే దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. కిలో రూ.150 ప్రకారం అమ్మినా ఎకరాకు రూ.18 లక్షలు వస్తుంది. అందుకే ఈ ఏడాది మరో రెండు ఎకరాల్లో నాటేందుకు నర్సరీలో మొక్కలు పెంచుకుంటున్నాం. – రావూరి ఆంజనేయులు, రైతు, శాంతినగరం, ఆళ్లగడ్డ మండలం ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు చేశా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఆదాయం వస్తుందని చెప్పుకుంటుంటే సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. ముందు మన ప్రాంతంలో పండుతాయో లేదో తెలుసుకునేందుకు బత్తలూరు వద్ద సాగుచేసిన తోటకు వెళ్లి రైతుతో మాట్లాడాను. అంత పెట్టుబడి పెట్టడం ఎలా అని ఆలోచిస్తుంటే ఉపాధి పథకం వాళ్లు సబ్సిడీ ఇస్తామంటే అర ఎకరంలో గత ఏడాది మొక్కలు నాటాను. మొక్కలు బాగా పెరిగాయి. ఇప్పటికి రెండు కోతలు వచ్చింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడ లేదు. మూడో ఏడాది ఖర్చులు పోనూ సుమారు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుందని అనుకుంటున్నాం. – సుధాకర్, రైతు, పెద్ద ఎమ్మనూరు, ఉయ్యలవాడ మండలం సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం రాయితీలు అందిస్తూ వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ పంటను ఉపాధి హామీ పథకంలో సాగు చేపట్టేవిధంగా 2021–22 నుంచి ప్రభుతం అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్న రైతులకు అర ఎకరా వరకు సాగు చేపడితే విడతలవారీగా మూడేళ్లకు రూ.3 లక్షల వరకు రాయితీ ఇస్తుంది. ఈ ఏడాది 10 మంది రైతులు నాటుకున్నారు. మరో 160 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. మరింత మంది సద్వినియోగం చేసుకోవాలి. – పి.రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ, నంద్యాల -
ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురు విశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన కళాకారులు. ఈ గ్రామం వద్ద ఉన్న నానుబాయి కొండ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నల్లటి రాతి శిలలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నాణ్యంగా, దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అనువుగా ఉండడంతో పలు ప్రాంతాలకు చెందిన శిల్పులు శిలలను చెక్కి విక్రయిస్తున్నారు. కొందరు బండలాగుడు పోటీలకు పెద్ద బండరాళ్లను ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారు. ఇక్కడి శిల్పులు, శిల్పళానైపుణ్యంపై సాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, కడప (వైఎస్సార్ జిల్లా) : తొండూరు మండలం మల్లేలలో ఉన్న వడ్డెర కుటుంబాలు శతాబ్దాలుగా గుట్ట నుంచి రాయిని వెలికి తీయడం వృత్తిగా చేసుకున్నాయి. విగ్రహాలకు రాళ్లు అనువుగా ఉండడంతో ఆ రాళ్లను ఇతర ప్రాంతాల్లోని శిల్పులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డతోపాటు పలు ప్రాంతాల్లోని శిల్పులు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాలలో గుడుల నిర్మాణంతోపాటు గుడుల స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర అవసరాల కోసం కూడా తీసుకెళుతుంటారు. రాయిని ఇక్కడి వడ్డెరలు అడుగు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రధానంగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన శిల్పులు మల్లేల గ్రామం నానుబాయి కొండ నుంచి ఎక్కువగా రాయిని తీసుకెళుతున్నారు. ఈ రాతితో వినాయకుడు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, శ్రీకృష్ణుడు, సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు సైతం తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఇటీవలే మల్లెల కొండ నుంచి ఆంజనేయస్వామి విగ్రహం కోసం 45 అడుగుల పొడువున్న రాయిని మైసూరుకు చెందిన వారు తీసుకెళ్లారు. దేవతామూర్తుల విగ్రహాలే కాకుండా బండలాగుడు పోటీలకు ఉపయోగించే పెద్ద బండరాళ్లు, కంకల గుండ్లు సైతం ఈ రాయితో ఇక్కడి వడ్డెరలు తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా రోళ్లు, విసురు రాళ్లు, రుబ్బు రాళ్లు తదితర వాటిని సైతం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ఎనిమిది వడ్డెర కుటుంబాలకు ఇదే వృత్తి. పొద్దునే వెళ్లి కొండ గుట్టపై మట్టిని తొలగించి రాళ్లను వెలికి తీస్తున్నారు. వెలికి తీసిన రాళ్లను అడుగు రూ. 75 చొప్పున విక్రయిస్తున్నారు. వడ్డెర మహిళలు సైతం పురుషులకు తోడుగా ఇదే పనిలో ఉంటున్నారు. పెద్ద రాళ్లను విగ్రహాలు, ఇతర వాటికి విక్రయించగా, చిన్న రాళ్లను విసురురాళ్లు, రోళ్లు తదితర వాటిని వీళ్లే మొలిచి అమ్ముకుంటున్నారు. లీజుతో తవ్వకాలు 10 ఎకరాల్లో నానుబాయి కొండను స్థానిక వడ్డెరలే సొసైటీ ద్వారా లీజుకు తీసుకున్నారు. భూమి నుండి ప ది అడుగులలోతు వరకు ఇక్కడ రాతి పొరలు ఉన్నా యి. పూర్వం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు వడ్డెరలు చెబుతున్నారు. పెద్దల నుంచి వచ్చిన వారసత్వంగా ఇప్పటికే రాళ్లు తీసి అమ్ముకోవడమే వృత్తిగా బ్రతుకుతున్నట్లు చెప్పారు. తమకు వ్యవసాయ భూములు లేవని, రాయి తీసి అమ్ముకోవడం, చిన్నరాళ్లను మొలిచి విక్రయించుకోవడమే వృత్తిగా బతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. రోజుకు రూ. 400–500లోపు కూలీ మాత్రమే పడుతున్నట్లు తెలిపారు. రాయి నాణ్యంగా ఉండడంతో శిల్పాలకు పనికి వస్తోందని, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రాయిని తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. గ్రామాల్లో గుడులు నిర్మించేవారు, వారికి అవసరమైన రాయిని తరలించుకుని ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారని వడ్డెర్లు చెబుతున్నారు. (క్లిక్: లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!) దేవతా విగ్రహాలకు ఇక్కడి రాయే తీసుకెళతారు దేవతామూర్తుల విగ్రహాలు చేసేందుకు శిల్పులు మా మల్లేల గ్రామం వద్దనున్న నానుబాయి కొండ రాయినే తీసుకు వెళతారు. శిల్పులకు అవసరమైన రాయిని మేము తవ్వితీసి అడుగు లెక్కన విక్రయిస్తాం. చాలామంది గుడులు నిర్మించేవారు కూడా రాయిని తీసుకెళతారు. పెద్దరాళ్లను విక్రయించి చిన్న రాళ్లను రోళ్లు, విసురు రాళ్లు తదితర వాటిని మేమే మొలిచి విక్రయిస్తుంటాం. మా పూర్వీకుల నుండి ఇప్పటివరకు ఇదే వృత్తితో జీవిస్తున్నాము. – కుంచెపు వీరభాస్కర్, మల్లేల గ్రామం పూర్వం నుంచి ఇదే వృత్తి మా పూర్వీకులు ఇక్కడి రాయిని వెలికితీసి దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అమ్మేవారు.ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం. గ్రామం వద్దనున్న నానుబాయి కొండ ప్రాంతాన్ని లీజు ద్వారా తీసుకుని రాయిని వెలికి తీసి అడుగు చొప్పున విక్రయిస్తుంటాం. ఆళ్లగడ్డ, ఇతర ప్రాంతాలవారు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళతారు. ఈ రాయితోనే విగ్రహాలను, రుబ్బురోళ్లు తయారు చేస్తారు. – కుంచెపు చిన్న లింగన్న, మల్లేల గ్రామం -
అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం
రోజు రోజుకూ అరటి ధరలు పెరుగుతున్నాయి. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి అరటిధరలు రెట్టింపు అయ్యాయి. రెండు నెలల కిందట టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు చేరింది. యాపిల్ పండ్ల ధరలతో అరటి పోటీ పడుతోంది. పెరిగిన ధరలతో అరటి రైతుల ఆనందపడుతున్నారు. ఆళ్లగడ్డ: ఈ ఏడాది అరటి సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతోంది. కాస్త ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ నికరంగా ఆదాయం తెచ్చిపెడుతుండటంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా మహానంది, ప్యాపిలి, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లోని రైతులు అధికంగా అరటి తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. లాభాల వైపు అడుగులు రెండేళ్ల నుంచి ధర అంతంత మాత్రమే ఉన్న అరటి గెలల ధరలు ఇటీవల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు నెలల వరకు టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలికింది. ఒక్కో సమయంలో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాక తోటలోనే వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా జూన్ నుంచి ధరలు పెరగడం మొదలు కాగా ప్రస్తుతం ధరలు మరింత పెరిగి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల పైగానే ధర పలుకుతోంది. అరటి తోట ప్రస్తుతం జీ9 రకం అరటికి మంచి గిరాకీ ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు కృష్ణా, ఉభయ గోదావరి తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడులు లేకపోవడంతో ప్రస్తుతం రాయలసీమ అరటి గెలలకు మంచి డిమాండ్ వచ్చింది. కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పలుకుతుండటంతో నిన్నటి మొన్నటి వరకూ ధరలేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 10 వేల ఎకరాల్లో సాగు నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,200 మొక్కలు (టిష్యూ కల్చర్) చొప్పున రూ.60 వేలు ఖర్చు చేసి నాటుతున్నారు. సాగు ఖర్చులు, మందులకు అంతా కలిపి ఎకరాకు మరో రూ..40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అయితే మరో రూ.30 వేలు అదనంగా అవుతుంది. 1,200 మొక్కల్లో కనీసం 900 నుంచి 1,000 చెట్లు గెలలు తెగినా సరాసరి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర ఉంటే ఖర్చులు పోను ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. రెండో పంటకు ఖర్చు తక్కువ అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది. రెండో ఏడాది ఎక్కువగా ఉండదు. కాండం నుంచి వచ్చిన ఐదారు పిలకల్లో మంచి పిలకను ఎంచుకుని మిగతావి తీసి వేస్తే సరిపోతుంది. దీంతో విత్తనం ఖర్చు సుమారు ఎకరాకు రూ.60 వేల వరకు తగ్గుతుంది. సేద్యాల ఖర్చు ఉండదు. ఎరువులు కూడా పెద్దగా అవసరముండక పోవడంతో రైతన్నలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. రైతులకు చేయూత ఇలా.. ఏరియా, వాతావరణ పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్ఎం), సమగ్ర ఎరువులు, పురుగుల మందుల యాజమాన్యం (ఐపీఎం) ప్రూట్ కేర్ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. తోట బడుల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. సాగుచేసే ప్రతి రైతుకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ (జీఏపీ) ఇస్తారు. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ మండలం గూబగుండం మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కల్వర్టును స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను కడప జిల్లా మైదుకూరుకు చెందిన వారిగా గుర్తించారు. బేతంచెర్ల మద్దిలేటయ్య స్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: వివాహేతర సంబంధం.. తల్లీ కూతుళ్లతో..! -
మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్ 23 వరకు శుభ దినాలే
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్: మాంగల్యం తంతునా.. మమ జీవనం హేతునా.. కంఠే భద్మామి సుభగే...త్వం జీవ శరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు ఈ సారి మారుమోగనున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా దూరం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో పరిణయ ఝరి పరిమళించనుంది. గత రెండేళ్లలో కేవలం వధూవరుల బంధువులు 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతులు ఉండటంతో పెళ్లిళ్లలో కళ తప్పింది. ఈసారి ఏప్రిల్ 13 నుంచి జూన్ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో యువతీ యువకులు, తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. మొదలైన సందడి ఇప్పటికే కొందరు పెళ్లికార్డులు ఆర్డర్లు ఇస్తూనే కల్యాణ మండపాలు అడ్వాన్సులు ఇచ్చి మరీ బుక్ చేసుకోవడం మొదలెట్టారు. మంచి ముహూర్తం కోసం పురోహితులను కలుసుకోవడం ముమ్మరం చేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ మహిళలు కొందరు బంగారు నగలు కొంటుంటే... మరికొందరు చీరలు కొనడం మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. ఒక పెళ్లి ఎంతో మందికి ఉపాధి పెళ్లంటే రెండు కుటుంబాలు కలవడం అంటారు. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లంటే ముందుగా గుర్చొచ్చేవి పెళ్లి పత్రికలు, నూతన పట్టు చీరలు, వధూవరుల పరిణయ పట్టు వస్త్రాలు, ఫొటోలు, వీడియోలు, ట్రావెల్స్ ఏజెంట్లు, పెళ్లి మండపాలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్రీ షియన్స్, బ్యాండ్ మేళం వారు. వీరంతా రెండేళ్లుగా ఉపాధి లేక అగచాట్లు పడ్డారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండటంతో ఉపాధి దొరుకుతుందని వారంతా సంబర పడుతున్నారు. మూడు నెలలు ముహూర్తాలే శుభకృత్ నామ సంవత్సరంలో వివాహాలు, శుభకార్యాల ముహూర్త తేదీలు ఏప్రిల్ : 13, 14, 15, 16, 17, 21, 22, 24 మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25 జూన్ : 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 శుభలేఖలకు ఆర్డర్లు ఇస్తున్నారు ఇప్పటికే పెళ్లిళ్లు, వివిధ శుభ కార్యక్రమాల కోసం ఆహ్వాన పత్రికలు, పెళ్లి పత్రికల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో వివిధ రకాల డిజైన్లతో శుభలేఖలు సిద్ధం చేశాం. రూ.5 నుంచి రూ.వందల విలువైన పత్రికలు అందుబాటులో ఉంచాం. ఈసారి కరోనా లేనందున వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. –ప్రసాద్, పెళ్లి పత్రికల ప్రింటర్స్, ఆళ్లగడ్డ మెండుగా శుభకార్యాలు ఈసారి శుభముహూర్తాలు మూడు నెలల్లో మెండుగా ఉన్నాయి. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో పనులు ఉండవు కాబట్టి పెళ్లిళ్లకు ఏప్రిల్, మే, జూన్ నెలలు వరంలా మారనున్నాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లి, శుభ కార్యాలకు ముహుర్తాలకు సంబంధించి లగ్నపత్రికలు రాయించుకుంటున్నారు. –విజయ్‌స్వామి, పురోహితుడు, అహోబిలం -
పచ్చర్ల జంగిల్ క్యాంప్.. అడవిలో ఆహ్లాదకర ప్రయాణం
వసంత కాలం వచ్చేసింది. ఆకులు రాల్చిన అడవి పచ్చదనాన్ని తొడిగి సరికొత్తగా కనిపిస్తోంది. పచ్చని చిలుకలు.. పాడే కోయిలలు సందడి చేస్తున్నాయి. ఎగిరే జింకలు.. దూకే వానరాలు.. ఉరికే ఉడతలు.. ఉత్సాహంగా ఉల్లాసంగా కనువిందు చేస్తున్నాయి. ఎత్తుగా నిటారుగా దర్పాన్ని ప్రదర్శించే వృక్షాలు..హొయలొలుకుతూ వయ్యారంగా అల్లుకున్న లతలు ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలంటే పచ్చర్ల క్యాంప్‌కు వెళ్లాల్సిందే. ఆళ్లగడ్డ: నల్లమల.. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయారణ్యం. విశేషమైన వృక్ష సంపద, లెక్కలేనన్ని వన్యప్రాణులు, ఎన్నో రకాల పక్షులు, క్రూరమృగాలైన పెద్దపులులు, చిరుతలు, ఔషధ మెక్కలు ఈ అడవి సొంతం. పర్యావరణ ప్రేమికులకు మరింత ఆసక్తిని, ఆనందాన్ని కలిగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నల్లమల అందాలను దగ్గర నుంచి చూసే అరుదైన అవకాశం జంగిల్ సఫారీ పేరిట అందుబాటులోకి తెచ్చింది. కాటేజీలు అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు, ఇక్కడ ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని పచ్చర్ల టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. జంగిల్ క్యాంప్ పునఃప్రారంభం ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని పంచేందుకు, మనసును ఆహ్లాదపరిచేందుకు నల్లమలలోని ‘పచ్చర్ల’ జంగిల్ క్యాంప్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ దృష్ట్యా కొంతకాలం మూతపడిన సఫారీ మళ్లీ పునఃప్రారంభమైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మీదుగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు జంగిల్ సఫారీకి వస్తున్నారు. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడి సౌందర్యాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుండటం విశేషం. జంగిల్ సఫారీలో పర్యాటకులు అందుబాటులో కాటేజీలు నంద్యాల, గిద్దలూరు మార్గంలో నంద్యాలకు 25, గిద్దలూరుకు 35 కి.మీ దూరంలో పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంప్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ రెండు ఓపెన్ టాప్ జీపులను పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచారు. ఒక్కో వాహనంలో 10 మంది కూర్చొని సఫారీ చేయవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ. 200 చొప్పున చెల్లిస్తే ఐదుగురు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. మొత్తం రూ.1000 చెల్లించి ఇద్దరు ముగ్గురైనా సఫారీకి వెళ్లవచ్చు. జంగిల్ క్యాంప్‌లో నాలుగు కాటేజీలు, 2 మిలట్రీ టెంట్ హౌస్‌లు ఉన్నాయి. కాటేజీ అద్దె రూ. 4,000, మిలట్రీ టెంట్ అద్దె రూ. 5,000 (ఇద్దరికి), ఆరేళ్లు దాటిని పిల్లలకి రూ. 1,000 అదనంగా వసూలు చేస్తారు. బస చేసిన వారికి రెండు పూటలా భోజం, ఉదయం బెడ్ కాఫీ, టిఫిన్, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. జంగిల్ సఫారీ ఉచితంగా చేయవచ్చు. అడవిలో ఆహ్లాదకర ప్రయాణం నల్లమలలోని టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో సుమారు 25 కి.మీ ప్రయాణం ఆహ్లాదకరంగా సాగుతుంది. నెమళ్లు, వివిధ రకాల పక్షులు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కొండ గొర్రెలు, భయపెట్టే కొండ చిలువలు, తాచు పాములు వీటి మధ్య పర్యటన కొనసాగుతుంది. మధ్యన రెండు చోట్ల వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. సందర్శకులు వీటిని ఎక్కితే నల్లమల అంతా చూడవచ్చు. ప్రస్తుతం నల్లమలలో దాదాపు 50 చిరుత పులులు, 70 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా. అప్పుడప్పుడు చిరుత, పెద్ద పులులు కూడా కనిపిస్తున్నాయి. అడవిలోకి వెళ్లే పర్యాటకులు అటవీ సిబ్బంది ఆపిన చోట మాత్రమే కిందకు దిగాలి. అటవీ మధ్యలో దిగడం, ఫొటోలు తీసుకోవడం చేయకూడదు. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు స్థానికంగా నివసించే చెంచులే గైడ్లుగా ఉంటూ నల్లమల అడవిని చూపిస్తారు. పర్యాటకులు వారితో మమేకమై ముచ్చటించేందుకు అటవీ శాఖ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై అవగాహన కలుగుతుంది. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా అధికారులు ప్యాకేజీని రూపొందించారు. మళ్లీ రావాలని అనిపిస్తోంది స్నేహితుడి పెళ్లి అయిపోయిన తరువాత ఫొటో షూట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఇంత ఆహ్లాదకరంగా ఉంటుందని అనుకోలేదు. మళ్లీ రావాలని అనిపిస్తోంది. – కాశీబాబు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, చెన్నై చాలా బాగుంది స్నేహితులతో కలిసి మొదటిసారి ఇక్కడికి వచ్చాను. పచ్చర్ల జంగిల్ సఫారీ చాలా బాగుంది. మరోసారి కుటుంబ సభ్యులం అందరం కలిసి రావాలని అనుకుంటున్నాం. – చందన, మార్కాపురం, ప్రకాశం జిల్లా లాభాపేక్ష లేకుండా సేవలు జంగిల్ క్యాంప్ ఆహ్లాదకరంగా ఉంటుంది. కాటేజీ బుక్ చేసుకున్నవారు ఒక్క రూపాయికూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. భోజనాలు, టీ, టిఫిన్, స్నాక్స్ అన్నీ ఫ్రీగా అందజేస్తున్నాం. లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్నారు. పర్యాటకులు చెల్లించే మొత్తం ఇక్కడ పనిచేసే చెంచులకే ఖర్చు చేస్తున్నాం. – నరసయ్య, డీఆర్వో -
రక్తమోడిన రోడ్లు
ఆళ్లగడ్డ/కావలి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని జాతీయ రహదారి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన ముల్లా అబ్దుల్‌కలాం (31), అఫ్జల్ (19) సెంట్రింగ్ పని నిమిత్తం సోమవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వెళ్లారు. మిలాద్ ఉన్నబీ పర్వదినం జరుపుకునేందుకు మంగళవారం ఉదయం సొంత గ్రామానికి మోటార్ సైకిల్‌పై బయలు దేరారు. ఆళ్లగడ్డ శివారులోకి వచ్చేసరికి వారి గ్రామానికే చెందిన మిత్రులు ఉసేన్‌బాషా ఉరఫ్ జాబిర్(20), సులేమాన్ శిరివెళ్ల వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. మోటార్ సైకిల్ ఆపి వారితో మాట్లాడుతుండగా నంద్యాల వైపు నుంచి చాగలమర్రి వెళ్తున్న కారు ముందు టైరు పగిలి అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టి రోడ్డు పక్కనున్న వారిపై పడింది. ఈ ఘటనలో అబ్దుల్ కలాం, అఫ్జల్, ఉసేన్‌బాషా అక్కడికక్కడే మృ త్యువాత పడ్డారు. సులేమాన్ తీవ్రంగా గాయప డగా కర్నూలు వైద్యశాలకు తరలించారు. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి.. తిరుపతి నగరం పద్మావతీ పురం కేఆర్ నగర్‌కు చెందిన తనమాల రవి, ఆయన భార్య భార్గవీలత (45), ఆయన తల్లి రాజేశ్వరమ్మ (65), వారి బంధువు ఇరగల వెంకటరమణయ్య (65), బంధువుల చిన్నారి సాయి కలసి కారులో ప్రకాశం జిల్లా ఉలవపాడులో జరిగిన వివాహానికి హాజరయ్యారు. శుభకార్యం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. కారును రవి నడుపుతున్నారు. కావలి పట్టణంలోని ముసునూరు వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొంది. కారు కంటైనర్ కిందభాగంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వెనుక సీట్లో కూర్చొని ఉన్న భార్గవీలత, రాజేశ్వరమ్మ, ముందు సీట్లో కూర్చొని ఉన్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మరణించారు. రవి, ముందు సీట్లో కూర్చుని ఉన్న సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు'
సాక్షి, ఆళ్లగడ్డ: '' ప్రేమించానన్నాడు. నువ్వే సర్వస్వమన్నాడు. కాదంటే.. చచ్చిపోతానన్నాడు. నిన్ను, నీ వాళ్లను పువ్వుల్లో పెట్టి సాక్కుంటానని నమ్మబలికాడు. ఇలా ఏడాది పాటు ఆమె చుట్టూ తిరిగాడు. ఇక ఆమె కాదనలేకపోయింది. కుటుంబ సభ్యులను ఒప్పించి అతన్ని మనువాడింది. కానీ ఐదేళ్ల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడింది.'' ఇప్పుడు ఆమె న్యాయం కోసం వేడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన ఓబులేసు జియో ఫైబర్ కంపెనీలో ఉద్యోగం చేసేందుకు మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఈ క్రమంలో భర్త చనిపోయి ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటున్న ఇంటి యజమాని కుమార్తె విజయ సునీల్ అగర్వాల్‌పై కన్నేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కాస్త చనువు ఏర్పడ్డాక ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె.. అతన్ని మందలించింది. అయినా వినకుండా వెంటపడ్డాడు. ఆమెతో పాటు పిల్లలను, తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని నమ్మబలికాడు. నీవు లేకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఇరుగూ పొరుగు వారితోనూ మాట్లాడి.. ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని వేడుకున్నాడు. అతని మాటలు నమ్మిన వారందరూ ఆమె తల్లిదండ్రులను ఒప్పించి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. అక్కడే ఉంటూ బుద్ధిగా కాపురం చేసేవాడు. వారి కాపురానికి గుర్తుగా నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కాగా.. ఓబులేసు నాలుగు నెలల క్రితం సొంతూరికి వెళ్లొస్తానని చెప్పి వచ్చాడు. కొన్ని రోజుల పాటు భార్యతో ఫోనులో బాగానే మాట్లాడాడు. త్వరలోనే తిరిగొస్తానని నమ్మించాడు. రానురాను ఫోనులో మాట్లాడాలంటే విసుక్కోవడం, ఎంతకూ ఫోను ఎత్తకపోవడం వంటివి చేసేవాడు. పని ఒత్తిడి వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని ఆమె అనుకుంది. కానీ రెండు వారాల క్రితం ఓబులేసు మిత్రుడొకరు ఫోను చేసి ‘నీ భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంటున్నాడ’ని చెప్పడంతో ఉలిక్కిపడింది. గత నెల 28న అతను గ్రామంలోనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఇది తెలిసిన విజయ భర్తకు ఫోన్ చేయగా.. తనకు ఇష్టం లేక పోయినా బలవంతంగా పెళ్లి చేశా రని చెప్పాడు. దీంతో ఆమె కుమారుడితో కలిసి ఆళ్లగడ్డకు చేరుకుంది. నాలుగు రోజులుగా అతనితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా కుటుంబ సభ్యులు కుదరనివ్వలేదు. చివరకు గ్రామంలోకి సైతం రానివ్వడం లేదు. ఆళ్లగడ్డలోనే ఉండాలని, అక్కడికే వచ్చి మాట్లాడతామని చెబుతున్నారే తప్ప ఎవరూ రావడంలేదు. దీంతో బాధితురాలు విషయాన్ని మీడియాకు తెలిపింది. తనకు ఇక్కడ ఎవరూ తెలియదని, తెలుగు కూడా రాదని, ప్రజా, మహిళా సంఘా లు సహకరించి న్యాయం చేయాలని వేడుకుంటోంది. చదవండి: నల్లపురెడ్డిపల్లెలో కాల్పుల కలకలం -
ఆళ్లగడ్డ టు అమెరికా: గ్రేట్ జర్నీ, బతుకు శిల్పం
ఆళ్లగడ్డ శిల్పకారులు పుట్టిన గడ్డ. ఈ నిజాన్ని ప్రపంచానికి తెలియచేసిందో అమ్మాయి. ఆళ్లగడ్డ అమ్మాయి చేసిన ప్రయత్నం ఆ ఊరికి వన్నె తెచ్చింది. సినిమా రంగం నెత్తుటి చారికలు అద్దిన ఆళ్లగడ్డను ఈ అమ్మాయి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసింది. ఆళ్లగడ్డలో శిల్పకారుల కుటుంబాలు వందలాదిగా ఉన్నాయి. ఈ సంగతి కర్నూలు జిల్లా వాళ్లకు తప్ప బయట ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని రోజుల్లో భువనేశ్వరి చేసిన ఒక ప్రయత్నంతో ఈ రోజు ఆళ్లగడ్డ ఇంటర్నెట్లో విశ్వవిహారం చేస్తోంది. తల వంచుకుని శిల్పాలు చెక్కుతూ తెరవెనుక ఉండిపోయిన శిల్పకారులు ఈ రోజు యూ ట్యూబ్‌లో ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. జీవితంలో ఎదురైన విషమ పరీక్షకు సమాధానంగా తన జీవితాన్ని తానే చెక్కుకునే క్రమంలో ఆమె ఎంచుకున్న మార్గమే ఆమెను ఈ రోజు ‘శిల్పకారిణి భువనేశ్వరి’గా నిలబెట్టింది. ఉలి పట్టుకునే నేర్పు ‘పని మీద ధ్యాస పెట్టు. మనసు కుదుట పడుతుంది’ నాన్న అన్న ఈ మాట నా జీవితాన్ని కొత్తగా పట్టాలెక్కించింది అంటోంది శిల్పి భువనేశ్వరి. ‘‘జీవితం మనల్ని పరీక్షించడానికి క్రాస్ రోడ్స్‌లో నిలబెడుతుంది. ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అయోమయంలోకి నెట్టేస్తుంది. అలాంటి క్షణంలో నాన్న చెప్పిన మాట నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునేటట్లు చేసింది. ఉలి పట్టుకున్నాను. విజేతగా నిలబడగలిగాను. ఈ కళలో ఉన్న గొప్పదనం ఏమిటంటే... ఉలి పట్టుకునే వరకే మనం. శిలను చూస్తూ ఉలి చేతిలోకి తీసుకున్న తర్వాత ఇక ఏ ఇతర ఆలోచనలూ రావు. అప్పటి వరకు మెదడును కందిరీగల్లా విసిగించిన ఆలోచనలు కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి. తదేక దీక్షతో శిల్పాన్ని చెక్కడంలో మునిగిపోతాం. పని పూర్తయిన తర్వాత కూడా మెదడు మంచి ఆలోచనలతోనే ఉంటుంది. మనకు తెలియని పాజిటివ్ ఎనర్జీ ఆవరిస్తుంది. అలాగే మాకు శిల్పం మీద మమకారం కూడా ఉంటుంది. నేను ఈ వృత్తిలోకి వచ్చిన రెండేళ్లకు కాలిఫోర్నియా నుంచి రాముడి విగ్రహాల సెట్ ఆర్డర్ వచ్చింది. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాల సెట్. పదకొండు అంగుళాల విగ్రహాలు. చూడడానికి ముచ్చటగా ఉన్నాయి. వాటిని ఇచ్చేటప్పుడు కొంచెం బాధనిపించింది’’ గుర్తు చేసుకుంది భువనేశ్వరి. ఒక యాదాద్రి... మరో బుద్ధవనం! తెలంగాణలో సీయెం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నిర్మాణంలో కొంతభాగం పనిని భువనేశ్వరి శిల్పుల బృందం పూర్తి చేసింది. నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్, బుద్ధవనంలో బుద్ధుడి జీవిత చిత్రాల వెనుక భువనేశ్వరి ఉలి నైపుణ్యం ఉంది. ‘‘నేను 2013 నుంచి పూర్తిగా శిల్పకళ మీద దృష్టి పెట్టాను. అప్పటికే మా నాన్న, పెదనాన్న యాదాద్రి పనులు మొదలు పెట్టారు. అలా అంత పెద్ద ప్రాజెక్టులో పని చేసే అవకాశం వచ్చింది. బుద్ధవనం ప్రాజెక్టు నిర్వహణ స్వయంగా చేపట్టాను. దీనితోపాటు అనేక పనులు సమన్వయం చేయడం మొదలు పెట్టాను. ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి పుష్కరాల సమయంలో విగ్రహాలు చేశాం. మా శిల్పాలను చూసిన అధికారులు బాగున్నాయని మంచి ఆర్డర్లు ఇచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో రాతి బెంచ్‌లు, ఫౌంటెయిన్లు ఎన్నింటినో చేశాం. ఈ కరోనా సమయంలో సమూహంగా చేయాల్సిన పెద్ద ప్రాజెక్టులేవీ చేయడం లేదు. ఇళ్లలో షో పీస్‌లుగా విగ్రహాలు పెట్టుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. ఆళ్లగడ్డలోని మా శిల్పకళామందిరంలోనే చిన్న ఆర్డర్లు పూర్తి చేస్తున్నాం. తెర ముందుకు శిల్పులు మా శిల్పకారులు ఎప్పుడూ తెర వెనుకే ఉంటారు. చిత్రకారులు ఇది నేను వేసిన చిత్రం అని చెప్పుకోవడానికి సంతకం చేస్తారు. శిల్పకారులకు ఆ అవకాశం ఉండదు. అందుకే మా శిల్పకళామందిరంలో పని చేసే శిల్పకారులను వీడియో తీసి ఫేస్బుక్, యూ ట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తుంటాను. మా పనిలో గొప్పదనాన్ని తెలియచేయడానికి నేను చేస్తున్న ఓ చిన్న ప్రయత్నం మంచి ఫలితాలనే ఇస్తోంది. మా శిల్పకారులకు శిలకు ప్రాణం పోయడమే తెలుసు, కళను ప్రమోట్ చేసుకోవడం తెలియదు. ఆ పనిని నేను చేస్తున్నాను. నన్ను చూసి మా వాళ్లు చాలా మంది వాళ్ల అమ్మాయిలకు కూడా శిల్పాలు చెక్కడం నేర్పిస్తామని చెప్తున్నారు. ఆ మాట నాకు సంతోషాన్నిస్తోంది. శిల్పాలు చెక్కుతున్న తొలి మహిళ గా ఉలిని పట్టుకోవడంతోనో, విశ్వకర్మ ఎక్స్‌లెన్స్, లెజెండరీ అవార్డులను అందుకోవడంతోనో నేను గమ్యాన్ని చేరినట్లు కాదు. మా కళకు ప్రాచుర్యాన్ని, గౌరవాన్ని తీసుకువచ్చే బాధ్యత కూడా చేపట్టాను. అమ్మాయిలను శిల్పకారిణులుగా తీర్చిదిద్దాలి. ఆ లక్ష్యాన్ని చేరే వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది’’ అంటోంది భువనేశ్వరి. ఆళ్లగడ్డ అమ్మాయి ఏ దేవాలయానికి వెళ్లినా, చారిత్రక కట్టడాన్ని చూసినా శిల్పసంపదను చూస్తూ మైమరచి పోతాం. రాతికి జీవం పోసిన శిల్పులను అపరబ్రహ్మలుగా కీర్తిస్తాం. యుగాల నుంచి వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళాత్మకమైన వృత్తిలో సాధారణంగా మగవాళ్లే ఉంటారు. మగవాళ్లకు సహాయంగా చిన్న చిన్న పనులు చేస్తుంటారు ఆడవాళ్లు. ఈ ఆనవాయితీని మార్చేసింది దురుగడ్డ భువనేశ్వరి. ఇది మగవాళ్ల ప్రపంచం అని చెప్పకుండా చెప్పే ఒక నియమాన్ని సవరించింది. కంటికి కనిపించని ఒక సరిహద్దును చెరిపేసింది. తానే స్వయంగా ఉలి పట్టుకుని శిల్పం చెక్కడం నేర్చుకుంది. 2018లో హైదరాబాద్ పార్క్ హయత్‌లో లేడీ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా... -
భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ
ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): నియోజకవర్గంలో మాజీ మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో బాసటగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివిరెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్ సయ్యద్‌వలి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరితో పాటు వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్, పద్మకుమార్‌రెడ్డి తదితర భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరడం గమనార్హం. వీరిని ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాదరంగా పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కొండారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, కుమార్‌రెడ్డి, రమణ, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు భూమా కోట బద్దలు భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. వారు ఏ పారీ్టలో ఉన్నా చాగలమర్రి మండల నాయకులు మాత్రం వారి వెంటే నడుస్తూ ప్రతి ఎన్నికల్లో బాసటగా నిలిచారు. అలాంటి మండలంలో నేడు భూమా వర్గానికి చెందిన దాదాపు నాయకులందరూ గంగుల సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం విశేషం. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో భూమా వర్గం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం పరిషత్ ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలని భావించారు. కానీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం, ఇదే తరుణంలో అఖిలప్రియ కూడా పోటీలో నిలిచిన అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. దీంతో కీలక నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ప్రజాసేవలో పాలుపంచుకుంటా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారీ్టలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన పాలనా దక్షతకు ఆకర్షితుడినై వైఎస్సార్సీపీలో చేరా. ప్రజాసేవలో నా వంతుగా పాలు పంచుకుంటా. – రామగురివిరెడ్డి, చాగలమర్రి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అందరికీ సముచిత స్థానం దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానికంగా మా నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారి స్థాయికి తగ్గ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తాం. – ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి చదవండి: అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..! కళా వెంకట్రావు ఓ డిక్టేటర్.. ఆడియో హల్చల్ -
చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని..
సీతారామపురం: నాలుగేళ్లుగా ప్రేమించుకుని.. కోటి కలలతో పెళ్లి చేసుకున్న ఆ జంటను విడదీయాలని చూశారు ఆమె పుట్టింటివాళ్లు. దాడిచేశారు. చివరకు ఆమెను చంపి అయినా తమ పరువు కాపాడుకోవాలనుకునే దుర్మార్గపు ఆలోచన చేశారు. చంపేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని సింగారెడ్డిపల్లికి చెందిన పి.బాలకృష్ణ, దేవమ్మచెరువు గ్రామానికి చెందిన ఎం.అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న ఇంట్లోవారికి తెలియకుండా వెళ్లి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. అదేరోజు తమ కుమార్తె కనిపించలేదని యువతి తల్లిదండ్రులు సీతారామపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. వాళ్లిద్దరూ ఆళ్లగడ్డలో బంధువుల వద్ద ఉన్నారని తెలుసుకున్నారు. ఎస్సై రవీంద్రనాయక్ సిబ్బందితో కలిసి వెళ్లి వారిద్దరినీ మంగళవారం సీతారామపురం తీసుకొచ్చి తహసీల్దార్ వెంకటసునీల్ వద్ద హాజరుపరిచారు. ఇద్దరూ మేజర్లు కావడం, తన భర్తతో వెళతానని అనిత చెప్పడంతో వారిని బాలకృష్ణ ఇంటికి పంపించారు. ఈ విషయం తెలుసుకున్న అనిత బంధువులు సంగసానిపల్లి సమీపంలో అడ్డగించి వారిపై దాడిచేశారు. బాలకృష్ణ, అనితలను కొట్టారు. ఆమె నోట్లో పురుగుమందు పోశారు. అదే సమయంలో బాలకృష్ణ బంధువులు, పోలీసులు రావడంతో పరారయ్యారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనితను 108 వాహనంలో ఉదయగిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం అనిత పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయగిరి సీఐ ప్రభాకర్‌రావు వైద్యశాలలో విచారణ చేపట్టారు. అనిత బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోడ్డుకు అటు.. ఇటు: జోడు పంచాయతీలు
ఆళ్లగడ్డ రూరల్: ఎక్కడైనా రెండు పంచాయతీలు కనీసం రెండు కి.మీ. దూరంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం రోడ్డుకు అటు, ఇటు ఉండటం విశేషం. ఆళ్లగడ్డ మండలంలో గోపాలపురం, పేరాయిపల్లె పంచాయతీలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి. గోపాలపురం గ్రామం నల్లగట్ల రెవెన్యూ పరిధిలో, పేరాయిపల్లె జంబులదిన్నె రెవెన్యూ పొలిమేర పరిధిలో ఉండటంతో వేర్వేరు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఒకే ఊరులా కనిపించే ఈ గ్రామాలు వేర్వేరు పంచాయతీలు. పేరాయిపల్లె గ్రామం 1995 వరకు జి.జంబులదిన్నె గ్రామ పంచాయతీలోనే ఉండేది. తర్వాత జనాభా 500 పైగా పెరగడంతో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఇటీవల జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గోపాలపురం సర్పంచ్‌గా రామలక్ష్మమ్మ, పేరాయిపల్లె గ్రామ సర్పంచ్‌గా నాగలక్ష్మమ్మ ఎన్నికయ్యారు. (చదవండి: ఆ కుటుంబం ఓటమి ఎరగదు..) హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం
సాక్షి, కర్నూల్: జిల్లాలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఇంటి నుంచి బయల్దేరి వాకింగ్‌కు వెళ్లిన కొడుకుపై తండ్రి కత్తులతో దాడిచేసిన ఘటన ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హర్షవర్ధన్ అనే యువకుడు తీవ్రగాయాల పాలవ్వగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి శ్రీనివాస ఆచారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ప్రియుడిపై మోజుతో కాబోయే భర్తనే..
సాక్షి, ఆళ్లగడ్డ: ప్రియుడి మోజులో పడి డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఓ యువతి కాబోయే భర్తను హత్య చేయించింది. ప్రియుడు, మరో నలుగురు యువకుల సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ముందు రోడ్డు ప్రమాదం,తరువాత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసు మిస్టరీని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించడం గమనార్హం. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ సెకండియర్ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ వారిలో ఏమాత్రమూ మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు. ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రమూ ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేశారు. మరో ముగ్గురి సాయం తీసుకున్నారు. హత్య చేసింది ఇలా.. కాబోయే భర్తను ఎలాగైనా అంతమొందించాలనుకున్న ఆమె అతనికి, కుటుంబ సభ్యులకు ఏమాత్రమూ అనుమానం రాకుండా పది రోజులుగా రోజూ ఫోన్లో ప్రేమగా మాట్లాడేది. ఇంటికి రమ్మంటూ అతన్ని కోరేది. ఈ క్రమంలోనే శనివారం బాచ్చాపురంలో గడేకారి పనికి పోయిన గఫార్‌బేగ్‌కు ఫోన్ చేసింది. ‘ఇంట్లో ఎవరూ లేరు. నిన్ను చూడాలనిపిస్తోంది. ఇంటికి రా’ అంటూ నమ్మ బలికింది. అతను స్వీట్లు, పండ్లు తీసుకుని వెళ్లాడు. అక్కడ సుమారు రెండు గంటలు గడిపాడు. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దగ్గర వాళ్లు ఎదురు చూస్తుంటారని తన మోటార్ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. అయితే అప్పటికే కోటకందుకూరు సమీపంలోకి వెళ్లి సిద్ధంగా ఉండాలంటూ ప్రియుడుతో పాటు మరో యువకుడిని బైక్‌పై పంపించింది. అతను ఏ దారిలో వెళ్తాడోనన్న అనుమానంతో మరో ఇద్దరిని ఇంకో బైకుపై అతన్ని అనుసరించేలా పంపి.. నిమిష నిమిషానికి ఫోనులో సమాచారం కనుగొంది. గఫార్‌బేగ్ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపు గాచిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాగా..కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. ముందు రోడ్డు ప్రమాదమని భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి కాల్ డేటా ఆధారంగా రేష్మను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో కోటకందుకూరు మెట్టవద్ద ఉన్న శేఖర్ సింగ్, ఖాజీపీర్, అన్నవరం పెద్ద శ్రీనివాసులు, నాగిపోగుల చంద్రశేఖర్‌లను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని డీఎస్పీ రాజేంద్ర తెలిపారు. సమావేశంలో సీఐ సుదర్శనప్రసాద్, ఎస్ఐ వరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు
ఆళ్లగడ్డ: మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు నమోదు చేసినట్టు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణంలో కోవిడ్ నిబంధనల మేరకు సెక్షన్–30 అమల్లో ఉన్నప్పటికీ అఖిలప్రియ బుధవారం జాతీయ రహదారి దిగ్బంధం చేపట్టారని పేర్కొన్నారు. వాహనాల రాకపోకలకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించడంతో అఖిలప్రియతో పాటు టీడీపీకి చెందిన మరో 25 మందిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. -
ప్రియుడితో రాసలీలలు.. భర్త రెడ్‌హ్యాండెడ్‌గా..
ఆళ్లగడ్డ(కర్నూలు): ప్రియుడితో రాసలీలలు జరుపుతున్న భార్యను భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించిన సంఘటన ఆళ్లగడ్డ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల రెండో వీధిలో ఓ ఆటోడ్రైవర్ వాసం ఉంటున్నాడు. అతనికి ఓ సామాజికవర్గం హక్కుల సాధన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది. తనకు రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉందని మాయమాటలు చెప్పి ఆటోడ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. దీనిపై భర్తకు అనుమానం రావడంతో సదరు వ్యక్తిని తన ఇంటికి రావొద్దని చెప్పాడు. (చదవండి: ఆవు దూడపై అత్యాచారం) ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భర్త ఇంట్లో లేని సమయంలో వచ్చి మహిళతో రాసలీలలు కొనసాగిస్తుండగా ఇరుగుపొరుగు వారు గమనించి ఫోన్ చేసి చెప్పారు. భర్త వచ్చి భార్య, ప్రియుడు ఇంట్లో ఉండటం గమనించి గదికి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి వారిద్దరిని స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉదయం వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితుడు చెప్పారని, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ సుబ్రమణ్యం తెలిపారు. (చదవండి: భార్యను చంపి శవంతో స్కూటీపై 10 కి.మీ) -
ఎమ్మెల్సీ గంగులను కలిసిన తారకరత్న
సాక్షి, ఆళ్లగడ్డ: సినీ హీరో నందమూరి తారకరత్న శనివారం ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జమ్మలమడుగు మండలం గండికోటలో జరుగుతున్న చిత్రం షూటింగ్ నిమిత్తం వచ్చిన తారకరత్న తిరుగు ప్రయాణంలో వైఎస్సార్సీపీ నాయకుడు గిరిధర్‌రెడ్డితో కలసి హైదరాబాద్‌కు వెళ్తూ మార్గమధ్యలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డిని కలిశారు. (కోనేటి ఆదిమూలంకు సీఎం జగన్ పరామర్శ) అహోబిలేశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ముందుగా మఠం మేనేజర్ వైకుంఠం, ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. -
‘దోచుకున్నారు కాబట్టే.. బుద్ధి చెప్పారు’
సాక్షి, కర్నూలు: వర్షాలు, కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేని నేతలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మాట్లాడే హక్కులేదని ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ప్రజలకు సేవ చేస్తే స్వాగతిస్తాం. సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. అంతేగాని ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నాలు మానుకోవాలని’’ ఆయన టీడీపీ నేతలకు హితవు పలికారు. (చదవండి: 100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?) గత ఐదేళ్లలో ప్రజల మీద పడి దోచుకున్నారు కాబట్టే టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నేత ఎస్వీ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని, గత ప్రభుత్వ హయాంలో వార్డులో సీసిరోడ్లు వేసి డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ రోజు ఇళ్లలోకి నీరు చేరి సమస్య వచ్చిందని ఆయన పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి) -
దేవుళ్ల పుట్టిల్లు
రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆళ్లగడ్డ: ఏకశిల రథముపై లోకేశు వడిలోన.. ఓరచూపుల దేవి ఊరేగి వస్తుంది. శిల్పి స్పర్శ తగలగానే అక్కడి శిలలు చేతనత్వం పొంది.. సరిగమలు ఆలపిస్తాయి. కటిక రాతికి జీవకళ పోయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచీ ఆళ్లగడ్డ శిల్పులు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఒక కుటుంబం మాత్రమే ఈ వృత్తిని చేపట్టగా.. ప్రస్తుతం సుమారు 100 కుటుంబాలు ఇదే వృత్తిని జీవనాధారంగా చేపట్టి శిల్పకళా రంగంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో పదిలపరుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న శేషపాన్పు విగ్రహం ఇలా మొదలైంది ► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని గుంప్రామాన్ దిన్నె గ్రామానికి చెందిన దురుగడ్డ బాలాచారి, వీరాచారి పూర్వీకులు సుమారు 300 సంవత్సరాల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టారు. ► పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో వీరు 1950లో అక్కడి నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వలస శిల్ప శాలను ఏర్పాటు చేశారు. ► 1982 వరకు ఆ ఒక్క కుటుంబం మాత్రమే శిల్పాలు తయారు చేసేది. ఆ తరువాత ఆ కుటుంబానికి చెందిన దురుగడ్డ రామాచారి తన నలుగురు కుమారులతోపాటు మరికొందర్ని శిష్యులుగా చేర్చుకుని శిల్పకళను అభివృద్ధి చేశారు. ► ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 60 శిల్ప శాలలు ఉండగా.. వాటిలో 500 మంది శిల్పులు విగ్రహాలు తయారు చేస్లూ జీవనోపాధి పొందుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అమెరికా వరకు.. ► దేవతా మూర్తుల విగ్రహాలలోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను జీవకళ ఉట్టి పడేలా తీర్చిదిద్దడం ఆళ్లగడ్డ శిల్పుల ప్రత్యేకత. ► వీరి చేతిలో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో మూలవిరాట్‌లుగా కొలువై పూజలందుకుంటున్నాయి. ► ఇక్కడి శిల్పులు అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారు. ► ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు చైనా, రష్యా, శ్రీలంక, జపాన్ తదితర దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మహిళలూ రాణిస్తున్నారు ► శిల్ప కళలో మహిళలు కూడా రాణిస్తున్నారు. మొదట్లో కుటుంబంలోని పురుషులు చెక్కిన విగ్రహాలకు నగిషీలు ఇవ్వటం, నునుపు చేయటం వంటి పనులు మహిళలు చేసేవారు. ► శిల్ప కళలో మెళకువలు నేర్చుకుని పురుషులతో సమానంగా పాల రాతి శిల్పాలు, గృహాలంకరణ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. ► ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువకులంతా సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతుంటే.. శిల్పుల కుటుంబాల్లోని యువకులు శిల్ప కళపైనే మక్కువ చూపుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఆర్డర్లు బుక్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. శిల్పాల తయారీలో యంత్రాల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో విగ్రహానికి.. ఒక్కో శిల ► విగ్రహాలను చెక్కడం ఓ ఎత్తైతే వాటికి అవసరమైన, వినియోగదారుడి బడ్జెట్‌కు సరిపోయే రాయిని ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ► ఏ రాయి అయితే ఏ విగ్రహం ఎలా ఉంటుంది... ఎంత బడ్జెట్లో వస్తుందో చెప్పి విగ్రహాలను తయారు చేసి ఇస్తుంటారు. ► ఇందుకోసం వైఎస్సార్ జిల్లా తలమంచి పట్నం, మల్యాల, కాంచీపురం, బెంగళూరు, కోయిరా, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్, ఎర్ర రాయి, నల్ల రాయి, పాల రాయి, కోయిరా రాయి వంటి శిలలను వినియోగిస్తారు. -
అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో పడకండ్ల గ్రామంలో కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ శూలం నరసింహుడు ప్రత్యర్థులపై దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్లోకెళ్లి అడ్డొచ్చిన పోలీసులను తోసేసి నిందితుడిని తీసుకెళ్లాడు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) ఈ విషయాన్ని స్టేషన్ సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అఖిలప్రియ ఇంటి వద్దకెళ్లి మళ్లీ నిందితుడిని స్టేషన్ తీసుకెళ్లారు. దీంతో భూమా విఖ్యాత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 224, 225, 212 సెక్షన్ల కింది కేసు ఫైల్ చేశారు. -
ఎందుకు చంపాలనుకున్నారు?
సాక్షి, కర్నూలు: తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు చెబితేనే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పిన విషయాలు తెలుసుకుని షాక్ తిన్నానని పేర్కొన్నారు. ‘‘నేను అఖిలప్రియపై ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మని అఖిలప్రియ అంటోంది. ఆమె నాకు రాజకీయ నేర్పుతుందా. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నా.. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని’’ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) కార్యకర్తలను కాపాడుకున్న చరిత్ర తనదని తెలిపారు. భూమా నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తుంటే.. దాడులు చేస్తుంటే.. భూజాలపై ఎత్తుకునిపోయి కాపాడానని తెలిపారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు భూమా కుటుంబానికి,తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. నాగిరెడ్డి కోసం నంద్యాల సీటు వదులుకున్నానని చెప్పారు. ‘‘అఖిలప్రియ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఆళ్లగడ్డలో ఎంతమందిని చంపిస్తారో. ఆమెకు తప్పా మరెవ్వరికి అక్కడ అవకాశం ఇచ్చినా మద్దతు ఇస్తా. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. అఖిల ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని’’ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అఖిలప్రియ భర్తకు పోలీసుల నోటీసులు కడప అర్బన్: కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు విచారణకు హాజరుకావాలని కడప పోలీసులు నోటీసులిచ్చారు. సుబ్బారెడ్డి హత్యకు కడపకు చెందిన వారితో కుట్ర పన్నినట్లుగా భార్గవ్‌పై ఆరోపణలున్నాయి. -
అఖిలప్రియ భర్త భార్గవ్‌పై పోలీస్ కేసు
సాక్షి, కర్నూలు : మాజీమంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆళ్లగడ్డలో ఉన్న క్రషర్ క్వారీ ఫ్యాక్టరీ వివాదంలో యజమాని శివరామిరెడ్డి ఫిర్యాదు మేరకు భార్గవ్ రామ్‌తో సహా 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని అఖిలప్రియ భర్త బెదిరింపులకు పాల్పడటంతో శివరామిరెడ్డి పోలీసుల్ని ఆశ్రయించాడు. మరోవైపు అఖిలప్రియ, భార్గవ్ రామ్‌ల పీఏ మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు అయిన వారి వివరాలు.. 1.మద్దూరు భార్గవ్ రామ్ నాయుడు 2. మాదల శ్రీను 3.నాగిరెడ్డి పల్లె శేఖర్ రెడ్డి 4.శ్రీను 5.అల్లా సుబ్బయ్య 6.నాగేంద్ర 7.డ్రెవర్ గణేష్ 8.మంగలి పవన్ 9. మహేష్ (పీఏ) 10.సంపత్ నాని 11.షరీఫ్ -
వరదలో విద్యార్థులు..
సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ గురుకుల పాఠశాలను వరద నీరు చుట్టు ముట్టింది. భారీ వర్షాలు కారణంగా పాఠశాల పక్కనే ఉన్న ఏరు పొంగి ప్రవహిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి ఒకసారిగా వరద చుట్టుముట్టింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను స్థానికులు కాపాడారు. అధికారులు అప్రమత్తమై.. బాలయోగి గురుకుల పాఠశాల విద్యార్థినులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండికోట జలాశయానికి భారీగా వరదనీరు.. కడప జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు గండికోట జలాశయానికి వరద నీరు భారీగా చేరుతోంది. 30 వేల క్యూసెక్కుల నీరు గండికోటకు చేరింది. మైలవరం నుండి 20 వేల క్యూసెక్కుల నీటిని పెన్నానదికి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద ఉధృతిపై కలెక్టర్ హరికిరణ్ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. -
నిఘా నిద్ర.. జూదం దర్జా!
ఆళ్లగడ్డ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పిచ్చలాట, పేకాట, బెట్టింగ్‌ల వంటి అసాంఘిక కార్యకలాపాలు జడలు విప్పి కరతాళ నృత్యం చేస్తున్నాయి. ఆయా గ్రామాల్లో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా జూద క్రీడలను పలువురు దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు.. ముఖ్యంగా యువత జూదాలకు బానిసలై పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుని అప్పులపాలవుతున్నారు. కొందరు ఇల్లు విడిచి వెళ్తుండగా, మరి కొందరు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. నిరోధించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. – ఆళ్లగడ్డ సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ నియోజవర్గంలోని రుద్రవరం మండలం ఆలమూరు, తువ్వపల్లె, గుట్టకొండ నరసింహస్వామి, డికొట్టాల, పెద్దకంబలూరు, చాగలమర్రి మండలం బైవరగుండాలు, తెలుగు గంగ కాల్వ, రాజోలి ఆనకట్ట, మండల కేంద్రం ఉయ్యలవాడ, జమ్ములదిన్నె తదితర ప్రదేశాల్లో పిచ్చలాట, మంగపత్త, మట్కా, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలపాలు కొన్ని మాసాలుగా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో జన సంచారం లేని ప్రదేశాల్లో ఈ జూదాలను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. ఇక వారంతాల్లో, సెలవు దినాల్లో ఈ వికృత క్రీడల నిర్వహణ పతాక స్థాయికి చేరుతోంది. పలు ప్రదేశాల్లో రాత్రి సమయంలో కూడా ఈ జూదాలను నిర్వహిస్తున్నారు. ఆయా తోటలు, ప్రదేశాల్లో విద్యుద్దీపాలు, చార్జింగ్ లైట్లు ఏర్పాటు చేసుకుని జూదాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఇందులో నిర్వాహకులు డిక్కు (పర్సేంటేజి) కింద 10 నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. పలు చోట్ల జూదం ఆడే ప్రదేశానికి మ«ధ్యాన్ని కూడా సరఫరా చేస్తుండటం విశేషం. చిత్తవుతున్న యువత.. యథేచ్ఛగా జరుగుతున్న ఈ జూద క్రీడల్లో పేద, మధ్యతరగతి యువత బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ రూరల్ మండలం లింగందిన్నె గ్రామానికి చెందిన ఓ యువకడు పిచ్చలాట ఆడుతూ ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు పోగొట్టుకోగా మరో రూ.2 లక్షలు అక్కడే అప్పు చేశాడు. అయినప్పటికీ చేయి తిరగకపోవడంతో అప్పిచ్చినవారు ఒత్తిడి చేయడంతో ఇల్లొదిలి పారిపోయాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో జూదం ఆడేందుకు డబ్బులు ఇచ్చిన వారే మా పిల్లోడిని ఏదైనా చేశారేమోనని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జూదరులను విచారించారు. అప్పు చెల్లించలేక తిరుపతి పారిపోయినట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొన్ని మాసల క్రితం పిచ్చలాటలో రూ.లక్షలు పోగొట్టుకుని అధిక వడ్డీలు చెల్లించలేక రుద్రవరం మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు దృష్టిసారించడంలేదనే విమర్శలున్నాయి. వడ్డీ వ్యాపారుల కనుసన్నల్లో.. జూదాల్లో డబ్బులు పోగుట్టుకున్నవారిని కొందరు వడ్డీ వ్యాపారులు ఎంచుకుంటున్నారు. వారికి మరీ అప్పులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ద్విచక్రవాహనాలను, పొలాల పాస్‌బుక్కులను, ఇంటి స్థలాల డాక్యుమెంట్లను, బంగారాన్ని, వెండిని కుదవకు పెట్టుకుని అధిక వడ్డీకి అప్పు ఇస్తున్నారు. దీంతో పాటు ఖాళీ పత్రాలు, స్టాంపులు, ప్రామిసరి నోట్లపై సంతకాలు, వేలి ముద్రలు తీసుకుంటున్నారు. ఇక్కడ వారం, రోజు వడ్డీతో పాటు గంటల వడ్డీ కూడా నడుస్తుండటం గమనార్హం. రోజుకు నూటికి రూ.10, వారానికి రూ.50 లెక్కన వడ్డీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రకమైన వడ్డీలను వసూలు చేసుకుంటున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. చెప్పిన సమయానికి వడ్డీ చెల్లించకపోతే తన అనుయాయుల ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అప్పటికీ ఇవ్వక పోతే దాడులు చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు కళ్లెం వేయాలని స్థానికలు కోరుతున్నారు. సరిహద్దు ప్రదేశాలే.. జూదరులు పోలీసుల కల్లుగప్పేందుకు రెండు మండాలల సరిహుద్దులు, జిల్లా సరిహద్దుల్లో జూద కేంద్రాలను ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు. అక్కడైతే పోలీసులు తమ పరిధి కాదన్నట్లు ఉంటారనే ధైర్యం. దీనికి తోడు వాహనాలు వెళ్లలేని ప్రదేశాన్ని జూదం ఆడేందుకు ఎంచుకుంటున్నారు. సమాచారం తెలిసినా పోలీసులు కాలినడకన వెళ్లేందుకు ఇష్టపడక, వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చర్యలు తీసుకుంటాం వారం క్రితం లింగందిన్నె యువకుడు అదృశ్యమైన విషయం నా దృష్టికి వచ్చింది. సబ్‌డివిజన్ వ్యాప్తంగా గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే ప్రత్యేక బలగాలతో గాలింపు చేపడతాం. జూదరులతో పాటు ఆడించేవారిపైనా కఠిన చర్యలు ఉంటాయి. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – తిప్పేస్వామి, ఆళ్లగడ్డ డీఎస్పీ సరిహద్దు ప్రదేశాలే.. -
అహోబిలంలో ఆధిపత్య పోరు
సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మఠం, దేవదాయ శాఖ అధికారుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో భక్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శతాబ్దాలుగా తమ ఆధ్వర్యంలోనే దేవస్థానం నడుస్తోందని, సర్వహక్కులు తమవే అని మఠం అధికారులు అంటుండగా.. దశాబ్దాలుగా ఇక్కడ దేవదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలోనే ఈఓ ఉంటూ సిబ్బందిని నియమించి పరిపాలన కొనసాగిస్తున్నారని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరివురి మధ్య ఆధిపత్య పోరులో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరి దారి వారిదే... దేవస్థానంలో సాగుతున్న ఆధిపత్య పోరుతో ఎవరిదారి వారిదే అయింది. తాజాగా తాము చెప్పినట్లు వినలేదని సుమారు 20 ఏళ్లకు పైగా దేవస్థానంలో పనిచేస్తున్న పావన, సురేంద్ర అనే ఇద్దరు సీనియర్ సిబ్బందికి ఈ నెల వేతనం పూర్తిగా నిలిపివేశారు. అంతేకాకుండా వారిని విధుల నుంచి తొలగించేందుకు మఠం వర్గాలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు మఠం నుంచి ఆర్డర్ కాపీ తయారు చేసి ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోలేదు. తాము దేవస్థాన సిబ్బందిగా ఈఓ చెప్పినట్లు నడుచుకుంటున్నాం.. తప్ప తమ సొంత నిర్ణయం కాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితే వస్తుందని సిబ్బందిని, పూజార్లను మఠం అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. దేవదాయ తరఫున ఆరుగు సిబ్బందిని నియమించగా.. తమ అనుమతి లేదంటూ మఠం అధికారులు వారికి వేతనాలు ఇవ్వలేదు. దీనికి తోడు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న సిబ్బందికి సైతం రూ. 4000, రూ.5000 మాత్రమే వేతనం ఇస్తున్నారు. మఠం తరఫున ఈ మధ్య నియమించుకున్న సిబ్బందికి మాత్రం రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు జీతం ఇస్తున్నారని దేవస్థాన వర్గాలు ఆరోపిస్తున్నాయి. సందట్లో సడేమియా.. దేవదాయ, మఠం అధికారుల మధ్య ఆధిపత్య పోరు కొందరి సిబ్బందికి కలసి వస్తోంది. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు డ్యూటీలు వేసుకుంటూ..అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సుమారుగా 20 రోజుల నుంచి హుండీ డబ్బులు, టిక్కెట్ సొమ్ములు, వెండి, బంగారు కానుకలు సైతం కొందరు సిబ్బంది జమ చేయకుండా దగ్గర ఉంచుకున్నట్లు సమచారం. గతంలో మాదిరిగా రోజూ సాయంత్రం జమ చేయకుండా ఎక్కడ ఉంచుతున్నారో కూడా చెప్పలేదనే మఠం ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రేక్షక పాత్రలో దేవదాయ శాఖ ఈఓ పాలన తమకు వద్దు అంటూ ఖరాకండిగా చెపుతుండటంతో పాటు ఇక్కడి ఖర్చు, ఆదాయానికి సంబంధించి అంతా మఠం స్వాధీనం చేసుకుంది. కేవలం ఈఓ పేక్షక పాత్రలో ఉన్నట్లుగా ఉంది. కనీసం ఓ రూపాయి ఖర్చుపెట్టాలన్న మఠం అనుమతి తప్పనిసరి. ఈఓ ఎక్కడికైనా కారులో వెళ్లాలన్నా మఠం అనుమతి తీసుకుని ఓచర్ రాసి డబ్బులు ఇప్పించుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి ఎటువంటి స్పందనా లేదు. సరైన సమాధానం చెప్పనందుకే చర్యలు టిక్కెట్, హుండీ సొమ్ములు అందరూ వచ్చి కార్యాలయంలో జమ చేస్తున్నారు. అయితే ఇద్దరు ఉద్యోగులు 20 రోజుల నుంచి వీటిని ఎక్కడ పెడుతున్నారో చెప్పడం లేదు. దీనిపై మెమో ఇస్తే సరైన సమాధానం చెప్పలేదు. ఈఓ జమ చేయమన్నాడని చెబుతున్నారు. అదే రాసివ్వమంటే రాసివ్వడంలేదు. దీంతో జమ చేసుకున్న పవన్, సురేంద్రల వేతనం నిలిపివేశాం. ఇద్దరిని సస్పెండ్ చేసేందుకు ఆర్డర్ తయారు చేసి ఇస్తుంటే వారు తీసుకోలేదు. దీనిపై మఠం ఉన్నత వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – భద్రినారాయణ్, మఠం మేనేజర్ -
విజయనగరంలో బస్సు బోల్తా
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందినవారు కాశీయాత్ర ముంగించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. తోటపల్లి ఎడవకాలువ వద్దకు రాగానే వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 20 మంది యాత్రికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాజువాకకు చెందిన గౌరీశంకర్ ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదానికి గురైంది. ఆళ్ళగడ్డలో ఘోర రోడ్డుప్రమాదం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు విహారయాత్ర చేపడుతుండగా తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆకలి తీరుస్తున్న ఆశ్రమం
సాక్షి, ఆళ్లగడ్డ(కర్నూలు) : ఉన్నట్టుండి ఇంటికి నలుగురు అతిథులు వస్తే.. భోజన ఏర్పాట్లకు ఆ ఇల్లాలు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. ఏదైనా శుభకార్యం చేయాలంటే.. ఓ నెల రోజుల ముందు నుంచే వందలెక్కలు వేస్తాం.. అలాంటిది అక్కడ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా వేలాది మందికి వేడివేడిగా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేస్తారు. సుమారు 50 సంవత్సరాలుగా నిత్యం కొనసాగుతున్న ఈ అన్నదాన మహత్కార్యం లక్షలాది మంది అభినందనలు అందుకుంటోంది. కరువు సీమ రాయలసీమలో నిత్యాన్నదానాలు జరగడం ఒక విశేషమైతే కాశినాయన మొట్టమొదట ప్రారంభించిన అన్నదాన సత్రం అహోబిలంలోనిది కావడం విశేషం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం నుంచి మూడు కిలో మీటర్లు అడవిలోపలికి వెళితే యోగానంద నృసింహస్వామి క్షేత్రం వస్తుంది. ఒకప్పుడు ప్రజలు ఏమాత్రం సంచరించేందుకు వీలులేని ప్రాంతమది. అలాంటి ప్రదేశానికి నేడు ఆటోలు, ప్రత్యేక వాహనాలు, మోటర్ సైకిళ్లు భారీగా వెళ్తున్నాయి. ఈ పెను మార్పుకు ముఖ్య కారణం అక్కడ వెలసిన కాశినాయన నిత్యాన్నదాన సత్రమే. ఎలా ఏర్పాటయిందంటే ఆత్మజ్ఞానాన్ని పొందిన కాశినాయన 1979– 80 ప్రాంతంలో యోగానంద క్షేత్రం చేరుకున్నారు. శిథిలావస్థకు చేరిన దేవాలయాన్ని ఒకే రోజు నిర్మించి అక్కడ బాలయోగానంద స్వామిని పునః ప్రతిష్టించారు. మొదట అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారని ఆయన శిష్యులు చెబుతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ నిత్యాన్నదాన ఆశ్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యమంలా అన్నదానం కాశినాయన చేతులమీదుగా సుమారు 50 సంవత్సరాల క్రితం చిన్న గుడిసెలో ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. మొదట్లో జొన్న సంగటి, రొట్టెలు, కొర్ర అన్నం, మజ్జిగ వడ్డించే వారు. భక్తుల వితరణతో నేడు ఆధునిక పద్ధతిలో వంటలు తయారు చేస్తున్నారు. రోజూ 500 మంది వరకు భోజనానికి వస్తుండగా శని, ఆదివారాల్లో వీరి సంఖ్య వెయ్యికి పెరుగుతోంది. దేశంలోని నలుమూలలనుంచి వచ్చే భక్తులకు నల్లమల అడవిలో ఇక్కడ తప్ప మరెక్కడా భోజనవసతి ఉండదు. ఏ సమయంలో పోయినా కడుపునిండా అన్నం దొరికే ప్రదేశం కాశినాయన ఆశ్రమమని చెప్పుకుంటారు. సాధారణ భక్తులు, యాత్రికులతో పాటు ఈ ప్రాంతంలోని అనేక మంది పేద వర్గాలు తమ వివాహ, ఇతర శుభకార్యాలు సైతం ఇక్కడ చేసుకుని ఉచితంగా విందు భోజనం చేసి వెళ్తుంటారు. ఏడాదికి కనీసం 15 వివాహాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఏమీ లేకపోయినా నిత్యాన్నదానం చేస్తున్నాం ఆశ్రమం ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడి దారిలేదు. కొండలో చెట్లలో వచ్చి చిన్న పందిరి వేశాం. అప్పుడే కాశి నాయన చెప్పినాడు ఇక్కడికి వేలల్లో భక్తులు వస్తారు.. వచ్చిన అందరికి ఆకలి తీర్చాలని. ఏమీ లేక పోయినా మనం 10 మంది ఆకలి తీరిస్తే 100 మంది ఆకలి తీర్చడానికి సరిపడా సాయం దేవుడు చేస్తాడని చెప్పేవాడు. ఇప్పుడు అదే జరుగుతోంది. మా దగ్గర ఏమీ లేక పోయినా నిత్యం అన్నదానం కొనసాగిస్తూనే ఉన్నాం. –రామదాసు, ఆశ్రమ నిర్వాహకుడు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
వారంతా వివిధ గ్రామాల నుంచి ఎవరి పనిమీద వారు పట్టణానికి వచ్చి వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు నంద్యాల వైపు వెళ్తున్న ఆటో ఎక్కారు. బయలుదేరిన ఐదు నిమిషాలకే వెనుక నుంచి లారీ రూపంలో మృత్యువు యమపాశం విసిరింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. సాక్షి,ఆళ్లగడ్డ(కర్నూలు): మండల పరిధిలోని పేరాయిపల్లె మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. దొర్నిపాడు మండలం చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి శివుడు, భార్య లక్ష్మిదేవి పట్టణానికి చేరుకొని, ఎర్రగుంట్ల గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. బత్తలూరు గ్రామానికి చెందిన విలియం మనవరాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కోడలితో కలిసి పట్టణంలోని వైద్యశాలకు వచ్చి అక్కడ చికిత్స చేయించుకుని, తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఇదే ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో ఆరుగురు కూడా నంద్యాల వైపు వెళ్లేందుకు ఆటోలో ఎక్కి కూర్చోవడంతో ఆటో నంద్యాల వైపు బయలు దేరింది. పేరాయిపల్లె›మెట్ట సమీపంలోకి రాగానే ఆటోలో ఉన్న ప్యాసింజర్ సంచి కిందపడుతోందని చెప్పడంతో డ్రైవర్ సడన్‌గా రోడ్డు సైడుకు తిప్పి నిలిపాడు. వెనుకనే వస్తున్న లారీ క్షణాల్లో ఆటోను ఢీకొంది. ప్రమాదంలో చాగరాజువేముల గ్రామానికి చెందిన చాకలి లక్ష్మీదేవి (50), బత్తలూరు గ్రామానికి చెందిన విలియం (61) అక్కడికక్కడే మృతిచెందగా, లక్ష్మీదేవి భర్త చాకలి శివయ్యతో పాటు నల్లగట్లకు చెందిన బాలిక మాధవి, బత్తలూరు గ్రామానికి చెందిన సులోచన, గాజులపల్లి గ్రామానికి చెందిన రసూల్బీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, „ýక్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం నంద్యాల వైద్యశాలకు తీసుకెళ్లారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
అఖిల ప్రియకు షాక్..
సాక్షి, కర్నూలు: మంత్రి అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించారు. అఖిలప్రియ పోటీ చేసిన ఆళ్లగడ్డ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బీజేంద్రరెడ్డి గెలుపొందారు. అయితే ఈ ఓటమికి ఆమె వ్యవహార శైలే ప్రధాన కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఉండి కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడం, అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆమె ప్రవర్తన తీరు నచ్చక పలువురు నేతలు కూడా టీడీపీని వీడారు. ఇవన్నీ కూడా ఆమె ఓటమిలో కీలక భూమిక పోషించాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన అఖిలప్రియ.. టీడీపీలో చేరి మంత్రి పదవి చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆమె సోదరుడు భూమ బ్రహ్మానందరెడ్డి కూడా నంద్యాలలో ఓటమి పాలయ్యారు. -
అసాంఘిక కార్యకలాపాలకు చోటివ్వం: గంగుల
కర్నూలు జిల్లా: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళిపై వైఎస్సార్సీపీ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. మంత్రి అఖిల ప్రియా తమ్ముడు జగత్ విఖ్యాత్ టీడీపీ కండువా వేసుకుని, వాహనం మీద స్టిక్కర్ వేసుకుని పోలింగ్ బూతులోకి వెళ్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్లు వేసే సమయంలో అఖిల ప్రియ ఫోటో స్టికర్ ఓటర్లకు పంపించి ఓట్లు టీడీపీకి వేసిన తర్వాత రూ.2 వేలు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఎలక్షన్ కమీషన్ సరిగ్గా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించలేదని అన్నారు. ఓటమి భయంతో ఎన్నికల పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి ఎంతగానో ప్రయత్నించారని ఆరోపించారు. ఆళ్లగడ్డ అభివృద్ధిలో పోటీ పడతాం తప్ప, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఇవ్వమని గంగుల ప్రభాకర్ రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. -
బరితెగించిన టీడీపీ
కర్నూలు(అర్బన్): అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. వైఎస్సార్సీపీకి ప్రజలు పట్టం కడుతున్నారనే అక్కసుతో గురువారం జరిగిన పోలింగ్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఉదయం నుంచి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనడంతో పాటు ఎక్కడ చూసినా ... వైఎస్ జగన్ ప్రభంజనం వినిపించడంతో తట్టుకోలేని టీడీపీ శ్రేణులు పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేసి గాయపర్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను కూడా లేకుండా చేసి ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకోవాలని ప్రయత్నించారు. కుదరకపోవడంతో కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు దిగారు. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వై. బాలరాగిరెడ్డికి మద్దతుగా కూర్చున్న మాజీ సర్పంచు, పోలింగ్ ఏజెంట్ నరసన్నపై ప్రత్యర్థి టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో నరసన్న తలకు బలమైన గాయం కావడంతో వెం టనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తలకు 11 కుట్లు పడ్డాయి. అలాగే కౌతాళం మం డలం గోతులదొడ్డిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ హనుమేష్పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఉలిగయ్య, ఆయన అనుచరులు ఏజెంట్ ఇంటికి వెళ్లి దాడి చేశారు. ఆలూరు నియోజకవర్గం పి. కోటకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్ 288, 289లను పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ సోదరుడు శ్రీనివాసులుపై టీడీపీ వర్గీయులు దాడికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. బనగానపల్లె నియోజకవర్గం గొర్విమానుపల్లెలో ఓట్లు వేసి ఇళ్లకు వెళ్తున్న వైఎస్సార్సీపీ వర్గీయులపై టీడీపీ నేత రామేశ్వరరెడ్డి అనుచరులు రాళ్లతో దాడి చేశారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీ వర్గీయులకు చెం దిన బోలేరో వాహనం అద్దాలు పగిలాయి. అలాగే కమ్మవారిపల్లెలో కూడా టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పత్తికొండ అసెంబ్లీ పరిధిలోని మల్లెపల్లె, రామళ్లకోట గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమనిగింది. కర్నూలు మండలం తులశాపురం, ఎదురూరు గ్రామాల్లో ఏజెంట్లను బయటకు పంపేందుకు టీడీపీ యత్నించింది. ఈ కుట్రను వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. -
ఆళ్లగడ్డ.. ఎవరికో అడ్డా
సాక్షి, కర్నూలు: జిల్లాలో అత్యంత కీలక నియోజకవర్గంగా ఆళ్లగడ్డకు పేరుంది. 90 శాతం పల్లె ఓటర్లున్న ఈ నియోజకవర్గానికి తూర్పున తెలుగు గంగ, పడమర కేసీ కెనాల్ ప్రవహిస్తున్నాయి. 1953లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి ఆళ్లగడ్డ ప్రాంతం కోవెలకుంట నియోజకవర్గ పరిధిలో ఉండేది. 1955లో శిరివెళ్లగా మారింది. 1962లో ఆళ్లగడ్డ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి, రుద్రవరం, గోసుపాడు మండలాలు దీని పరిధిలో ఉండేవి. అప్పట్లో దీనిని ఎస్సీలకు రిజర్వు చేశారు. 1967లో జనరల్ కేటగిరీకి మార్చారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో గోసుపాడు మండలాన్ని నంద్యాల నియోజకవర్గంలో కలపగా అంతవరకు కోవెలకుంట నియోజకవర్గంలో ఉన్న ఉయ్యలవాడ, దొర్నిపాడు మండలాలను ఆళ్లగడ్డలో కలిపారు. 2014లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా శోభనాగిరెడ్డి పోలింగ్ ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలింగ్‌ను యధాతథంగా నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకరరెడ్డిపై శోభనాగిరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆమె కుమార్తె భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మూడు కుటుంబాల మధ్యే.. 1967 నుంచి ఇప్పటివరకు గంగుల కుటుంబానికి, వారి ప్రత్యర్థులుగా ఉన్న ఎస్వీ, భూమా కుటుంబాలకు మధ్యే రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ఇక్కడ గంగుల తిమ్మారెడ్డి రెండుసార్లు, ఆయన కుమారుడు గంగుల ప్రతాపరెడ్డి మూడుసార్లు, ఎస్వీ సుబ్బారెడ్డి రెండుసార్లు, ఆయన మేనల్లుడు భూమా శేఖర్‌రెడ్డి ఒకసారి, ఆయన తమ్ముడు భూమా నాగిరెడ్డి రెండుసార్లు, ఆయన భార్య శోభా నాగిరెడ్డి ఐదుసార్లు, వారి కూతురు అఖిలప్రియ ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967లో గంగుల కుటుంబం నుంచి మొదటిసారి తిమ్మారెడ్డి పోటీ చేయగా.. ఎస్వీ కుటుంబం నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి తలపడ్డారు. ఆ తరువాత తిమ్మారెడ్డి కొడుకు గంగుల ప్రతాపరెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు శోభానాగిరెడ్డి పోటీ పడ్డారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున గంగుల తిమ్మారెడ్డి మనుమడు గంగుల బిజేంద్రారెడ్డి, టీడీపీ తరఫున ఎస్వీ సుబ్బారెడ్డి మనుమరాలు అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. వీరు మూడో తరానికి చెందిన వారు. అఖిలప్రియకు ఎదురీత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిలప్రియ ఎవరితోనూ చర్చించకుండా వెంటనే పార్టీ ఫిరాయించడం, రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్రెడ్డిని విమర్శించడం అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం పెట్టినట్టు ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పార్టీ మారిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న చంద్రబాబు ఆ పదవి ఇవ్వకుండా అవమానాల పాలు చేయడంతో మానసిక వేదనతో నాగిరెడ్డి మృతి చెందారు. ఆ తరువాత అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది. ఆమె ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు. తనచుట్టూ ఉన్న ముగ్గురు, నలుగుర్ని తప్ప.. ఆ కుటుంబానికి అండగా నిలిచి ఆస్తి, ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.. ఆర్ అండ్ బీ రోడ్లు, నీరు–చెట్టు పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలు ఆ నలుగురే పంచుకుని రూ.వందల కోట్లు సంపాదించుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టారనే అపప్రద ఉంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అఖిలప్రియ అభ్యర్థిత్వంపై అటు ప్రజల్లోను, ఇటు పార్టీలోను వ్యతిరేకత ఉంది. దీనికి తోడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాకపోవడం వైఎస్సార్ సీపీకి కలిసొచ్చే అంశం. అమలు కాని హామీలు నియోజకవర్గానికి ఆయువుపట్టు అయిన కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో పంట కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ ఆయకట్టుకు ఏమాత్రం నీరు చేరడంలేదు. ప్రధాన కాలువల మరమ్మతులతోపాటు పంట కాలువల నిర్మాణం చేపడతామన్న హామీ నెరవేర్చలేదు. ఆళ్లగడ్డలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కలగానే ఉంది. అహోబిలంలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఫ్యాన్ జోరు నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఆమె అనుచరుల అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తూ మూడేళ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగుల బిజేంద్రారెడ్డిలకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఓటమి ఖాయమని గ్రహించిన మంత్రి అఖిలప్రియ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు కుతాంత్రాలు పన్నినా ఈ ఎన్నికల్లో బిజేంద్రారెడ్డికి పట్టం కట్టడానికి నియోజకవర్గ ఓటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగోసారి ఘన విజయం నమోదు చేయటం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. – బీవీ కృష్ణయ్య, సాక్షి, ఆళ్లగడ్డ -
ఆళ్లగడ్డలో జోరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం
-
మంత్రి భూమా ఇలాకాలో.. రౌడీ రాజ్యం..
సాక్షి, ఆళ్లగడ్డ : నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇందూరు ప్రభాకరరెడ్డి, ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వీరిద్దరు ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డికి ముఖ్య అనుచరులు. హంతకులు.. మంత్రి అఖిలప్రియకు ముఖ్యులు. ∙2018 అక్టోబర్‌లో బాలయ్య అనే వ్యక్తిపై టీడీపీ నాయకులు అహోబిలంలో దాడులకు పాల్పడ్డారు. అంతేగాక అడ్డుబోయిన కానిస్టేబుల్ నాగిరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. 2019న ఫిబ్రవరి 12న ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దళిత మహిళను మంత్రి అఖిలప్రియ ప్రధాన అనుచరుడు (అంగరక్షకుడు) సి.శ్రీనివాసులు లైంగికంగా వేధిస్తుండంతో అవమాన భారంతో పాటు భయంతో ఆ మహిళ గ్రామం వదిలి పుట్టింటికి వెళ్లింది. భార్య ఇళ్లు వదలి వెళ్లి పోవడంతో పాటు ఈవిషయం గ్రామంలో చర్చనీయాంశం కావడంతో అవమాన భారంతో ఆ మహిళ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. - అలాగే మంత్రి అనుచరులు 2019 డిశంబర్‌లో ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన దివ్యాంగుడైన దస్తగిరిని మోటారు బైక్ అడ్డువచ్చిందనే నెపంతో దారుణంగా కొట్టారు. పోలీసుల అండతో అక్రమ కేసులు - 2015 మార్చి 21న జిల్లాలోని కృష్ణగిరి మండల పరిధిలోని బోయబొంతిరాళ్ల గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన వారు గాయపడ్డారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. అయితే అధికారపార్టీ పోలీసుల అండతో ప్రతిపక్షం వారు పెట్టిన కేసును ఫాల్స్ కేసుగా చేశారు. కాని వైఎస్సార్సీపీ వారిపై మాత్రం సెక్షన్–307కేసు నమోదు చేయడంలోనే కోర్టులో నడుస్తోంది. - కృష్ణగిరి మండలం ఎస్‌హెచ్. ఎర్రగుడి గ్రామంలో గతేడాది జూలై 13న దళితులకు సంబంధించి బావి వద్ద అక్రమం నిర్మాణాలను తొలగించే విషయంలో టీడీపీ జెండా కట్టాను తీసేయాలని చూసారని వైఎస్సార్సీపీ నాయకులు మాదన్నతోపాటు మరో ఐదుగురుపై అధికారపార్టీ నాయకులు కేసు నమోదు చేయించారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తమను కులం పేరుతో దూషించారని కేసు ఇచ్చేందుకు వెళ్లితో పోలీసులు పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. - కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో వైఎస్ఆర్సీపీ వర్గీయులు తమ పొలం మీదుగా వెళ్లేందుకు రస్తా ఇవ్వలేదనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. చిన్న రామాంజనేయులు, రాజి, భవాణిపై టీడీపీ నాయకులు కొండారెడ్డి, మల్లేశ్వరరెడ్డి,శివారెడ్డి పొలం వద్దే దాడికి పాల్పడ్డారు. ఇంటికొచ్చాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా మరో సారి దాడికి తెగబడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా.. చివరకు పోలీసులు వారి పైనే కేసు నమోదు చేసి టీడీపీ నాయకులపై కేసు లేకుండా చేశారు. -
అధికార పార్టీ ‘‘మందు’’చూపు
సాక్షి, కర్నూలు: ఎన్నికలు అనగానే తాయిలాల నుంచి మద్యం వరకు అంతా సందడే. ఓటర్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా మద్యం పారించి ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే మద్యం కిక్కు పెంచేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున ‘ఇండెంట్లు’ ఇచ్చి అంతకంతకూ పెంచుకుని రహస్య ప్రదేశాల్లో భారీ ఎత్తున మద్యాన్ని నిల్వ చేశారు. తర్వాత అధిక రేట్లకు బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపడింది. నాలుగు మద్యం దుకాణాలు సీజ్ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించారు. గూడూరులో నందవరం అక్షిత వైన్స్‌లో 70 కేసుల మద్యం, గూడూరులో సూర్య వైన్స్‌లో 1,076 బాక్సులు, నంద్యాల సూర్య వైన్స్‌లో 200 బాక్సులు, బేతంచర్ల రమ్య వైన్స్‌లో 300 బాక్సులు మద్యాన్ని ఆయా దుకాణాలకు దూరంగా రహస్యంగా నిల్వ ఉంచినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని షాపులను మొత్తం సీజ్ చేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నందవరం మద్యం దుకాణం టీడీపీకి చెందిన కౌన్సిలర్ రామకృష్ణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే నంద్యాల, బేతంచర్ల, గూడూరులో కూడా అధికార పార్టీ నాయకుల అనుచరులే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐలు వరలక్ష్మి, లక్ష్మణదాసు నేతృత్వంలో గూడూరు, నందవరం లో తనిఖీలు నిర్వహించి దుకాణాలు సీజ్ చేయగా నంద్యాల, బేతంచర్లలో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా తనిఖీలు శూన్యం కొంతకాలంగా పెద్ద ఎత్తున మద్యం నిల్వలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జిల్లాలో 206 మద్యం దుకాణాలు, 48 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. ప్రతి నెలా సంబంధిత స్టేషన్ అధి కారి లేదా ఎన్ఫోర్స్మెంట్, డీటీఎఫ్ అధికారులు మద్యం షాపుల్లో విక్రయాలు, నిల్వలు తదితర అంశాలపై తనిఖీలు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల్లో అత్యధిక భాగం అధికార పార్టీకి చెందినవి కావడంతో ఎక్సైజ్ అధికారులు దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొను గోలు కేంద్రాల నుంచి దుకాణాలకు మద్యం తరలించేటప్పుడు ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను ఎక్సైజ్ అధికారు లు తనిఖీ చేయాలి. అలాగే దుకాణాల్లో ఆర్–1, ఆర్–2 రిజిస్టర్లు కూడా విధిగా తనిఖీ చేయాల్సి ఉం ది. గతంలో డీటైల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించేవారు. ఆ విధానానికి స్వస్తి చెప్పడంతో మద్యం వ్యాపారులు దుకాణాల్లోని మద్యాన్నంత బెల్టు షాపులకు అధిక రేట్లకు కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. రహస్య ప్రాంతాల్లో రూ.500 కోట్ల మద్యం నిల్వలు ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు సుమారు రూ.500 కోట్లకు పైగా విలువ చేసే మద్యాన్ని ముందుగానే రహస్య స్థావరానికి తరలించి నిల్వ చేసినట్లు సమాచారం. జిల్లాలో నంద్యాల, కర్నూలులో మద్యం సరఫరా చేసే డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల నుంచి కొనుగోలు చేసే మద్యమే కాకుండా కర్ణాటక నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యాన్ని దిగుమతి చేసుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. కర్నూలు, నంద్యాల ఐఎంఎల్ డిపోలో వారం రోజులుగా రేషన్ విధానం అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధానం అమలు చేసి పరిమితంగా మద్యం సరఫరా చేస్తున్నారు. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అధికార పార్టీ నేతలు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున మద్యాన్ని జిల్లాలోకి దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున అక్రమ మద్యం ఎన్నికల ప్రకటన వెలువడకముందే అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను వారి వారి నియోజకవర్గాల్లో డంప్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా పత్తికొండ, డోన్, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో భారీ ఎత్తున అధికార పార్టీ నేతలు మద్యాన్ని నిల్వ చేసి ఊరూరా బెల్టు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎమ్మార్పీకి అదనంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అర్ధరాత్రి కూడా పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. సాధారణ రోజుల్లో ప్రతినెలా వంద కోట్లకు పైగా మద్యం కొనుగోళ్లు జరిగేవి. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీకి చెందిన నాయకులు రెట్టింపు మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేసి రహస్య ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. -
టీడీపీకి షాకిచ్చిన నేతలు
సాక్షి, ఆళ్లగడ్డ: ఐదేళ్ల పాటు అక్రమాలు, అవినీతి, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీకి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. బుధవారం దొర్నిపాడు మండలంలోని గుండుపాల గ్రామంలో మండల గోపవరం అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీ డైరెక్టర్ బండి శ్రీనివాసరెడ్డి, మల్లు సూర్యనారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తిరుపాల్‌రెడ్డి, లింగాల సూర్యనారాయణరెడ్డి, రామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, శ్రీరాములు, అబ్రహాం, ప్రసాద్‌రెడ్డి, స్వామిదాసు, వెంకటేశ్వర్లు తదితరులతో పాటు 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అనంతరం ఉయ్యాలవాడ మండలం అల్లూరు మజరా అయిన కొత్తపల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అరికట్ల శివరామకృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, సాలయ్య, కులశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో 20 కుటుంబాలు పార్టీలో చేరారు. షేక్ ఉసేన్‌బాషా, ఇమాం, హుసేన్‌వలి, మౌలాలి, మాబు, కరీం, నాగేశ్వరరావు, బడేసా, పెద్దయ్య, నాగరాజు తదితరులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో నాయకులు కూలురు నరసింహారెడ్డి, నారయణరెడ్డి, రాజారెడ్డి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి రాంపుల్లారెడ్డి సోదరులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు
-
వైఎస్సార్ సీపీలోకి రాంపుల్లారెడ్డి బ్రదర్స్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డ టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాంపుల్లారెడ్డి సోదరులు కలిశారు. రాంపుల్లారెడ్డి సోదరులకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాంపుల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వంలో ఓ సైనికుడిగా పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. తమ కార్యకర్తలు కూడా తమబాటలోనే నడుస్తారని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని, గంగుల కుటుంబంతో తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని రాంపుల్లారెడ్డి తెలిపారు. టీడీపీలో అవినీతి రాజ్యమేలుతోందని రాంపుల్లారెడ్డి విమర్శించారు. (వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు) -
వైఎస్ జగన్‌ను కలిసిన ఆళ్లగడ్డ టీడీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆళ్లగడ్డ టీడీపీ నేతలు కలిశారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో శనివారం ఉదయం టీడీపీ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి, ప్రతాప్ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. ఇరిగెల రాంపుల్లారెడ్డి గతంలో ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేశారు. అయితే టీడీపీలో తమకు సరైన గౌరవం లేదని, కష్టకాలంలో అండగా నిలిచిన తమకంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఇరిగెల సోదరులు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్, దాసరి జై రమేష్ తదితరులు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ...ప్రతిపక్ష నేతతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
భార్యను చంపిన భర్త
కర్నూలు, ఆళ్లగడ్డ రూరల్: అళ్లగడ్డ మండలంలోని అహోబిలం సమీపంలో తెలుగుగంగ కాలువ వద్ద భర్త.. భార్యను చంపిన ఘటన సోమ వారం చోటుచేసుకుంది. రుద్రవరం మండలం డి.కొట్టాల గ్రామానికి చెందిన నరేష్ కుమార్‌రెడ్డి.. భార్య దమయంతిని(30) అహోబిలం వెళ్లే దారిలో తెలుగుగంగ కాలువ వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హతమార్చాడు. అనతంరం పోలీసులకు లొంగిపోయాడు. వెంటనే డీఎస్పీ కులశేఖర్, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహన్ని పరిశీలించారు. నరేష్‌కుమార్‌రెడ్డి, దమయంతి ఏడాది క్రితం విడాకులకు దరఖ>స్తు చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ సోమవారం అతనితో ద్విచక్రవాహనంపై వెళ్లి హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. -
వికలాంగుడిపై అఖిల ప్రియ అనుచరుల దాడి
సాక్షి, కర్నూలు : ఓ వికలాంగుడిపై మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు దాడికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దస్తగిరి అనే వికలాంగుడిని మంత్రి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంత్రి అఖిల ప్రియ కాన్వాయ్ నుంచి దిగిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న అతడిపై దాడి చేశారు. తనపై చాకలి శ్రీను, మార్క్, కే రామ్మోహన్ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేశారని, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం. -
అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఆళ్లగడ్డ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తానంటూ పోలీసులను హెచ్చరించారు. పోలీసులు కక్ష కట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధిస్తున్నారని ఆరోపించారు. (అలిగిన మంత్రి అఖిలప్రియ) తన సొంత అనుయాయులపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను కాదన్నారు. సొంత సెక్యూరిటీతోనే మావోయిస్టుల ప్రభావం ఉన్న కర్నూలు జిల్లా రుద్రావరం మండలంలో మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆళ్లగడ్డలో టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
-
అఖిలప్రియకి ఝలక్.. కీలక నేత రాజీనామా
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి రాజీనామా చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ తీరు కారణంగానే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాల్లో మంత్రి భూమా అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. టీడీపీ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. నీరు చెట్టు పథకంలో అఖిలప్రియ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్ధం అని తెలిపారు. ఇరిగెల బాటలోనే పలువురు మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. -
ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
-
ఆళ్లగడ్డలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
ఘనంగా మంత్రి అఖిలప్రియ వివాహం
సాక్షి, ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వివాహం భార్గవరామ్‌తో బుధవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివారులోని భూమా శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి శాసన మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్, రాష్ట్ర మంత్రులు కాలవ శ్రీనివాసులు, నారాయణ, ఆది నారాయణరెడ్డి, ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి, జిల్లా కల్టెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి హాజరయ్యారు. -
అక్రమాల అన‘కొండ’లు
ఇది ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి సమీపంలోని కొండ. రెవెన్యూ శాఖ పరిధిలోని ఈ కొండలో సాగుకు ఏమాత్రమూ అనువుగా లేదు. అయినా.. సర్వే నంబర్ 653లోని 104.98 ఎకరాలు, 239లోని 178.45 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. దాదాపు 160 మందికి ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఇక్కడ పంటలు కూడా సాగుచేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. వాటి ఆధారంగా అక్రమార్కులు బ్యాంకుల్లో పంట రుణాలు పొందుతున్నారు. ఆళ్లగడ్డ: రెవెన్యూ అధికారులు తలచుకుంటే ఏమైనా సాధ్యమే! ఎవరి భూమికి ఎవరి పేరుతోనైనా పట్టా ఇచ్చేయగలరు. కొండలు, గుట్టలు సైతం సాగులో ఉన్నట్లు చూపగలరు. వారు అడిగినంత ఇస్తే ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. అక్కడ రకరకాల పంటలు సాగు చేస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. అడ్డదారుల్లో భూమి పొందిన వారు వీటిని బ్యాంకుల్లో పెట్టి ఎంచక్కా పంట రుణాలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను పొందవచ్చు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనైతే రెవెన్యూ లీలలకు అంతే లేకుండా పోతోంది. కొండలకు పాసు పుస్తకాలు ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ 653లో 104.98 ఎకరాలు, 239లో 178.45 ఎకరాలు, ఇవిగాక మర్రిపల్లి, ఆర్.కృష్ణాపురం, మిట్టపల్లి, రుద్రవరం మండలం ఆలమూరు, రుద్రవరం, లింగందిన్నె, చాగలమర్రి మండలం ముత్యాలపాడు, ఉయ్యాలవాడ మండలంలో మరో 900 ఎకరాల దాకా రెవెన్యూ కొండలు, తిప్పలు ఉన్నాయి. ఇక్కడ ఏమాత్రమూ సాగుకు అనుకూలంగా లేదు. వీటికి కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. సర్వే నంబర్లను వెబ్‌ల్యాండ్‌లో 145 సబ్ డివిజన్లుగా విభజించి.. ఏకంగా 232 మందికి పాసు పుస్తకాలు జారీ చేశారు. వీటిలో డి.పట్టాలిచ్చింది మాత్రం 50 ఎకరాలకే. మిగతాదంతా అనధికారికంగా కట్టబెట్టారు. నాలుగేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికీ ఎవరు డబ్బు ఇస్తే వారికి అన్లైన్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా రికార్డులు అనధికారికంగా కట్టబెట్టిన భూములు కావడంతో ఆన్లైన్ చేసిన అధికారులు కార్యాలయంలోని 1బీ రికార్డుల్లోనూ హడావిడిగా ఖాతాలు సృష్టించి ఎంట్రీ చేశారు. అనేక ఖాతాల్లో పాసుపుస్తకం యూనిక్ నంబర్, రైతు ఫొటో, తహసీల్దార్ సంతకం, భూమి రకం తదితర వివరాలేవీ నమోదు కాలేదు. విస్తీర్ణం కంటే రెట్టింపు పంపిణీ రెవెన్యూ అ«ధికారులు ఎకరాకు ఇంతని ధర నిర్ణయించి చెప్పడంతో బేరం కుదుర్చుకున్న నాయకులు ఒక్కొక్కరు 20 నుంచి 40 ఎకరాల దాకా పాసు పుస్తకాలు చేయించుకున్నారు. డబ్బు మోజులో పడి అక్కడున్న భూమి కంటే రెట్టింపు విస్తీర్ణానికి అధికారులు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేశారు. ఆన్లైన్ చేసే సమయంలో విస్తీర్ణం సరిపోలకపోవడంతో ఒక్కొక్కరికి 20 నుంచి 50 శాతం వరకు తగ్గించి నమోదు చేశారు. దీంతో పాసు పుస్తకంలోని విస్తీర్ణం, ఆన్లైన్లోని విస్తీర్ణం మధ్య తేడా వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్రమార్కులు తగ్గించిన పొలానికి డబ్బులన్నా వెనక్కివ్వాలని, లేకుంటే ఒప్పుకున్న కాడికి ఆన్లైన్ చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. రూ.కోట్లలో రుణాలు! అనధికారికంగా పాసు పుస్తకాలు పొందిన వారు వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని బ్యాంకుల్లో సుమారు రూ.10 కోట్ల వరకు ఇదే తరహాలో రుణాలు పొందినట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులతో పాటు కొందరు బ్యాంకర్లు సైతం వీరికి సహకరించి.. అంచనాకు మించి రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన రైతులకు రుణాలు ఇవ్వాలంటే సవాలక్ష నిబంధనలు చెబుతూ ముప్పుతిప్పలు పెట్టే బ్యాంకర్లు వీరి పట్ల మాత్రం ఉదారత చూపుతున్నారు. ఒరిజినలా? నకిలీనా ? 2014 తర్వాత ప్రభుత్వం మ్యానువల్ పట్టాదారు పాసుపుస్తకాల ప్రక్రియ నిలిపేసింది. వీటి స్థానంలో ఈ –పాసుపుస్తకాలు అందిస్తోంది. అయితే.. వీరందరికీ మ్యానువల్ పాసుపుస్తకాలే జారీ చేశారు. దీంతో ఇవి ఒరిజినలా లేక నకిలీనో అధికారులే తేల్చాలి. ఇప్పటికీ ఆళ్లగడ్డ, రుద్రవరం , చాగలమర్రి మండలాల్లో చాగలమర్రి కేంద్రంగా నకిలీ పాసుపుస్తకాల దందా సాగుతోంది. -
అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు
సాక్షి, ఆళ్లగడ్డ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దానికి ప్రతిరూపమని, ఆయన నోటి వెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్ ఇంటికి పోయినట్లు చిన్న ఆధారంతో నిరూపించినా దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రులు ఎంతో మంది ఉంటారని, వారు ఎదురుపడినప్పుడు కలసి మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకోవడం సహజమన్నారు. అలాంటిది ఇతర పార్టీ వాళ్లతో మాట్లాడితే రాజకీయ సంబంధం అంటగట్టడం సీఎంకే చెల్లిందన్నారు. ఆయనలో అభద్రతా భావం రోజురోజుకు పెరిగి ఎదుటివారిపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దేశంలో అందరికంటే తానే సీనియర్ అని చెప్పుకునే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రజలు తమ వెంటరావాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకుడు నయాబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
కొలిక్కివచ్చిన ఆళ్లగడ్డ పంచాయితి
-
ముగిసిన పంచాయితీ.. సుబ్బారెడ్డి అసంతృప్తి
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయితీపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మీడియా సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ నేతలు ఆయనను బుజ్జగించారు. తనపై రాళ్ల దాడి చేయించిన రాష్ట్ర మంత్రి అఖిలప్రియపై చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు తన డిమాండ్‌ను పట్టించుకోలేదని, తన ఆవేదనను అర్థం చేసుకోలేదంటూ సుబ్బారెడ్డి అసహనంతో ఉన్నారు. తన మాట చంద్రబాబు పట్టించుకోకపోవడంపై కినుక వహించిన సుబ్బారెడ్డి మీడియా సమావేశం జరుగుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పార్టీ అభివృద్ధికి తాను ఎప్పటిలాగే కృషి చేస్తానని సుబ్బారెడ్డి తెలిపారు. కాగా, ఆళ్లగడ్డ విభేదాలపై సీఎం చర్చించారని, ఈ వివాదం టీ కప్పులో తుపాన్ వంటిదని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ.. వివాదాలు వద్దని, అభివృద్ధిపై దృష్టి సారించమని చెప్పినట్లు తెలిపారు. చిన్న చిన్న విభేదాలు సహజమేనని, వాటిని సర్దుకుని పోవాలని చంద్రబాబు సూచించారు. ఏవీ సుబ్బారెడ్డితో కలిసి పిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. తమ కుటుంబానికి సీఎం చంద్రబాబు అండగా ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అఖిలప్రియ పేర్కొన్నారు. ఓవైపు సుబ్బారెడ్డి బాధగా కనిపించగా.. మరోవైపు అఖిలప్రియ మాత్రం తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వివాదం ఏంటంటే.. సైకిల్ యాత్ర చేస్తున్న సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరగడంతో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తన సమక్షంలో పంచాయితీకి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన పంచాయితీకి అఖిలప్రియ గైర్హాజరు కాగా, శుక్రవారం రావాలని ఆదేశించారు. చంద్రబాబు సమక్షంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య రాజీయత్నం జరిగింది. -
ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో మా బంధం అప్పుడే తెగిపోయింది
-
'మమ్మల్ని వేలెత్తి చూపితే ఊరుకోం'
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి నిప్పులు చెరిగారు. ఆళ్లగడ్డ రాళ్ల పంచాయితీ వ్యవహారానికి సంబంధించి మంత్రి అఖిలప్రియ గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా మౌనికా రెడ్డి మాట్లాడుతూ...‘ ఈ పంచాయితీ తేల్చాలని అధిష్టానాన్నే అడుగుతాం. మా అక్క మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేయడం ఎంతవరకూ సబబు. గుంటనక్క అని ఏవీ సుబ్బారెడ్డిని మా అక్క ఏనాడు అనలేదు. అఖిలప్రియ ధర్నా చేసినప్పుడు ఏవీ వర్గీయులు వచ్చి ఈలలు వేస్తూ వెటకారంగా కామెంట్లు చేశారు. అందుకే రాళ్ల దాడి జరిగి ఉండవచ్చు. అక్క వెంట భూమా, ఎస్వీ కుటుంబాలు అండగా ఉన్నాయి. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శిస్తే, ఆళ్లగడ్డ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. నాన్న చనిపోయిన రెండోరోజు నుంచే ఏవీ సుబ్బారెడ్డి పద్ధతిలో మార్పు వచ్చింది. రాజకీయంగా ఎదగడం కోసం సుబ్బారెడ్డి మా అక్కపై విమర్శలు చేస్తున్నారు. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. సుబ్బారెడ్డి కూతుళ్లు నాన్న సమాధి వద్దకు రానప్పుడే మా మధ్య బంధం తెగిపోయింది. నాన్న వాళ్ల పిల్లలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు. నాన్న చనిపోయాక మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎంతోమంది విమర్శలు చేసినా సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి వైఖరిని అంతా చూశారు. ఆయనను మామా అనే హక్కు ఉందో లేదో. అఖిలప్రియ ముందు భూమా అఖిలప్రియ అనే విషయం మరిచారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే మా సహకారం ఉంటుంది. కానీ తన రాజకీయ ఎదుగుదలకు మాపై వేలెత్తి చూపితే చూస్తూ ఊరుకోం. పబ్లిక్‌లో మా కుటుంబంపై వేలెత్తి చూపిస్తే సహించేది లేదు. సుబ్బారెడ్డి కూతురు మాపై విమర్శలు చేసినా మాతో కలిసి పెరిగారని ఓపికతో ఉన్నాం. ఇంకా విమర్శలు చేస్తూ ఆళ్లగడ్డ ప్రజలు సహించరు. అఖిలను తాకాలంటే భూమా కేడర్ ఉందనే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం ఉంది. భూమా కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇక రాళ్లదాడి మా అనుచరులే చేశారా? లేదా అనేది విచారణలో తేలుతుంది.’ అని అన్నారు. -
సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా!
-
అఖిలప్రియ భయపడుతోంది
-
‘భూమా ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోయాయి’
సాక్షి, అమరావతి : తనపై ఎప్పుడైతే రాళ్లదాడి జరిపారో అప్పుడే భూమా కుటుంబంతో తనకున్న సంబంధాలు తెగిపోయాయని టీడీపీ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ కుటుంబాన్ని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఆళ్లగడ్డలో సైకిల్ ర్యాలీ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అఖిలప్రియే రాళ్ల దాడి చేయించారంటూ ఏవీ సుబ్బారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. అయితే అధిష్టానం నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ అఖిలప్రియ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. దీంతో ఆళ్లగడ్డ పంచాయితీ రేపటికి వాయిదా పడింది. మరోవైపు ఏవీ సుబ్బారెడ్డి ..అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తనపై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు అందచేశారు. ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ...‘ఏమైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. రాళ్లదాడులు సరికాదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. దాడికి సంబంధించిన ఆధారాల్నీ ముఖ్యమంత్రికి అందచేస్తా. పార్టీ ఆదేశాల మేరకే సైకిల్ ర్యాలీ చేశారు. రాజకీయంగా వారికి అడ్డు వస్తున్నాననే నాపై దాడులు చేస్తున్నారు. రాళ్లదాడి చెత్త. ఇలాంటివి చాలానే చూశాను. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఏవీ సుబ్బారెడ్డి అంటే భయం, భక్తి లేదు. కనీసం వయస్సుకు కూడా పెద్దరికం ఇవ్వలేదు. ప్రత్యర్థులు కూడా నాపై దాడి చేయడానికి సాహసం చేయరు. అలాంటిది ఆమె నాపైనే దాడి చేయిస్తుందా?. అఖిలప్రియ భయపడుతోంది.. నా ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు స్పందించాలి కదా. మంత్రి సైకిల్ ర్యాలీ కంటే నాకే ఎక్కువ ఆదరణ లభించింది. అఖిలప్రియ తన గ్రాఫ్ పడిపోతోందని భయపడుతోంది. అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది. చిన్నప్పటి నుంచి ఆమె తెలుసు. అలాంటిది ఆమె గురించి మాట్లాడాలంటే నా పెద్దిరికం అడ్డు వస్తోంది. అందుకే నా తరఫున నా కూతురు మాట్లాడింది. ఇంత జరిగాక, ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే రాజకీయపరంగా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందే. ఇక వ్యక్తిగతంగా వస్తే భూమా నాగిరెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధానికి తెరపడినట్లే. సీఎంతో సమావేశానికి అఖిల ఎందుకు రాలేదో అర్థం కాలేదు. రేపు సాయింత్రం సీఎంతో సమావేశం అవుతున్నాం.’ అని తెలిపారు. -
రాజధానికి చేరుకున్న ఆళ్లగడ్డ పంచాయతీ
-
ఆళ్లగడ్డ పంచాయితీకి అఖిలప్రియ డుమ్మా!
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పంచాయితీ ఎట్టకేలకు అమరావతికి చేరింది. సైకిల్ ర్యాలీ సందర్భంగా రాళ్లదాడి ఘటనపై అమరావతి రావాల్సిందిగా ఏపీ పర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డికి అధిష్టానం నుంచి ఆదేశాలు అందిన విషయం విదితమే. దీంతో ఏవీ సుబ్బారెడ్డి ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం తనకు ఎలాంటి సమాచారం లేదంటూ ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. కాగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఇటీవల చోటుచేసుకున్న వరుస సంఘటనలపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...వారిద్దర్నీ బుధవారం సాయంత్రం అమరావతికి వచ్చి కలవాలని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే సీఎం కలవమని చెప్పిన ఒకరోజు ముందే ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ రచ్చకెక్కడం గమనార్హం. ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు చల్లారకముందే ...మంగళవారం రాత్రి అఖిలప్రియ చేపట్టిన సైకిల్ యాత్ర అలాంటి వాతావరణాన్నే పునరావృతం చేసింది. అయితే పోలీసుల పర్యవేక్షణలో చివరకు సైకిల్‌యాత్ర ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆళ్లగడ్డలో తారాస్థాయికి వర్గపోరు
-
ఏం జరిగినా అఖిలప్రియదే బాధ్యత: జశ్వంతి
సాక్షి, ఆళ్లగడ్డ : తన తండ్రికి ఏం జరిగినా అందుకు మంత్రి అఖిలప్రియే బాధ్యత వహించాలని టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డి అన్నారు. అఖిలప్రియ తన వాహనాలపై భూమా స్టిక్కర్ తీసివేసి మంత్రి అఖిలప్రియగా పెట్టుకోవాలని ఆమె సూచించారు. ‘మా నాన్న భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఎంతో సేవ చేశాడు. ర్యాలీ సందర్భంగా నాన్నపై దాడి జరగడం చాలా బాధ కలిగించింది. నాన్నకు ఏదైనా జరిగింతే అఖిలక్కా నువ్వు బాధ్యత తీసుకుంటావా?. మామా మామా అంటూ మా నాన్నకు ఇచ్చే గౌరవం ఇదా?. మీడియా ముందు మాత్రం మేమంతా కలిసిపోయాం అని చెబుతావు. వెనుక మాత్రం చేయాల్సింది చేస్తున్నావ్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నా?. నాన్న కన్నా అఖిలప్రియ 35ఏళ్లు చిన్నది. కనీసం నాన్న వయసు అయినా గౌరవం ఇవ్వడం నేర్చుకో.’ అని జశ్వంతి రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఆళ్లగడ్డలో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్న విషయం విదితమే. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ నేత, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి మీద నిన్న రాళ్ళ దాడి జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆ దాడి భూమా అఖిలప్రియ వర్గీయులే చేశారని సుబ్బారెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి తనపై దాడి జరిగి 24 గంటలు దాటినా ఇప్పటివరకూ దుండగులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాళ్లదాడికి కారకులైన మంత్రి అఖిలప్రియపై కేసు ఎందుకు నమోదు చేయలేదన్నారు. ఈ కేసును నీరుగార్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ పంచాయితీ పార్టీ అధిష్టానం వరకూ వెళ్లింది. ఈ నేపథ్యంలో మంగళవారం అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు అందాయి. -
అఖిలప్రియ, సుబ్బారెడ్డికి అధిష్టానం పిలుపు
సాక్షి, కర్నూలు : ఆళ్లగడ్డ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. మంత్రి అఖిలప్రియతో పాటు ఏవీ సుబ్బారెడ్డి రేపు (మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదుట హాజరు కావాలని ఆదేశాలు వెలువడ్డాయి. గత కొంతకాలంగా మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విబేధాలు నెలకొన్న విషయం తెలిసిందే. వీరిరువురి మధ్య ఎన్నిసార్లు రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. ఈ వ్యవహారాన్ని ఏవీ సుబ్బారెడ్డి హుటాహుటీన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సైకిల్ ర్యాలీ కార్యక్రమం చేపడుతున్న సుబ్బారెడ్డిపై దాడులు చేయడాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిని రేపు అమరావతి రావాల్సిందిగా ఆదేశాలు వెళ్లాయి. -
మంత్రి అఖిలప్రియ పేరు తొలగింపు
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి కేసు దర్యాప్తు వివాదాస్పదంగా మారింది. మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపిస్తూ సుబ్బారెడ్డి ఫిర్యాదుచేయగా.. పోలీసులు మాత్రం అనూహ్యంగా మంత్రి పేరును తొలగించారు. బాధితుడి ఫిర్యాదును పక్కనపారేసి, పోలీసులనే సాక్ష్యులుగా పేర్కొంటూ మరో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేప్రయత్నం చేస్తున్నారని ఏవీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ సుబ్బారెడ్డి సోమవారం కూడా తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది?: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీని చేపట్టారు. ఆదివారం ర్యాలీగా వెళుతోన్న సుబ్బారెడ్డిపై మంత్రి అనుచరులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఆ వెంటనే సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నా పోలీసులు మాత్రం వాటిని పక్కనపెట్టేయడం గమనార్హం. మంత్రి పేరును తొలగించి, పోలీసులే సాక్ష్యులుగా మరో కేసు నమోదుచేసి, దానిపై దర్యాప్తు చేపట్టారు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాల్సిఉంది. రాళ్లదాడి అనంతరం ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. (చదవండి: ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి; ఆళ్లగడ్డలో ఉద్రిక్తత) -
ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై రాళ్లదాడి
-
సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం
సాక్షి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై ఆదివారం దాడి జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తోన్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాళ్లదాడి చేసి పరారయ్యారు. తనపై దాడి చేయించింది మంత్రి అఖిలప్రియే అని సుబ్బారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సర్వత్రా భయాందోళనలు: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విబేధాలు సాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఒక్కసారే దాడి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి ఫొటో స్టిక్కర్లు అంటించిన వాహనంపై వచ్చిన దుండగులు.. ఏవీ సుబ్బారెడ్డి లక్ష్యంగా దాళ్లు విసరడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, మంత్రి అఖిలప్రియ ఆదేశాలతోనే దాడి జరిగి ఉంటుందని ఏవీ సుబ్బారెడ్డి అనుమానించారు. ఈ మేరకు ఫిర్యాదులోనూ మంత్రి పేరును ప్రస్తావించారు. -
భూమా బతికుంటే అఖిలప్రియ చెంపలు వాయించేవారు..
-
భూమా బతికుంటే అఖిలప్రియ చెంపలు వాయించేవారు..
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆళ్లగడ్డలో గురువారం జరిగిన ఏవీ హెల్ఫ్‌లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడు. అది మా ఇద్దరి మధ్య అనుబంధం. భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్‌ను. సినిమాలో హీరోనే కనబడతాడు..డైరెక్టర్ కనిపించడు...నేను కూడా అంతే. భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333’ అని తెలిపారు. కాగా దివంగత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల స్నేహం బలమైంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అయితే భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవీ సుబ్బారెడ్డిని.. అఖిలప్రియ ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటి నుంచే ఫీలర్స్ వదులుతున్నారు. అందులో భాగంగానే ఏవీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
వేడెక్కుతున్న నంద్యాల టీడీపీలో వర్గపోరు
-
మరోసారి వేడెక్కిన ఆళ్లగడ్డ రాజకీయాలు
అమరావతి: నంద్యాల టీడీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మంత్రి అఖిల ప్రియ చుట్టు అసమ్మతి రాగాలు ఎక్కువ కావటంతో ఆళ్లగడ్డ రాజకీయం మరోసారి వేడెక్కింది. మంత్రి అఖిలప్రియ, టీడీపీ సీనియర్ నేత, దివంగత భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డికి మధ్య కోల్డ్‌వార్ మళ్లీ తెరమీదకు వచ్చింది. భూమా వర్థంతికి తనకు పిలుపు రాలేదని మంత్రి అఖిల ప్రియపై తీరుపై సుబ్బారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి వర్థంతి రోజు అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏవీ సుబ్బారెడ్డి..ఆమెతో విభేదాలు వాస్తవమేనని అంగీకరించారు. ఆళ్లగడ్డలో గుంట నక్కలు ఎవరో త్వరలో తేలుస్తానని, ఈ నెల 29న తన రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానన్నారు. ముఖ్యమంత్రితో తనకు సత్సంబంధాలున్నాయని ... ఏ పదవి ఇవ్వాలో త్వరలో సీఎంయే నిర్ణయిస్తారని సుబ్బారెడ్డి తెలిపారు. వాస్తవానికి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రికి, ఏవీ సుబ్బారెడ్డికి మధ్య అంతరం పెరిగిపోయింది. ఒకరికి ఒకరు మాటలు లేకుండా రోజుల తరబడి ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డిని కలుపుకొని వెళ్లాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మంత్రి పొడిపొడిగానే మాట్లాడి చేతులు దులిపేసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం నంద్యాలలో నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ నాయకత్వం వహించినప్పటికీ ఆమె హాజరుకాలేదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లినా అదే తీరే కొనసాగుతోంది. కాగా భూమాకు, ఏవీకి మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. ఒకరికి తెలియకుండా మరొకరు ఎటువంటి వ్యవహారాలూ నడిపే అవకాశం లేనంతగా వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉండేవి. అయితే, భూమా మరణం తర్వాత ఆ కుటుంబంతో ఏవీకి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనే భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఓ కాంట్రాక్టు వ్యవహారంలో కూడా తమకు తెలియకుండా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య అగాధం భారీగా పెరిగిపోయింది. దీంతో వీరిద్దరూ నిప్పు-ఉప్పు చందంగా మారింది. తాజాగా ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఇలాగైతే ఎందుకు బతకాలి?
ఆళ్లగడ్డ: ‘మేం నిరుపేదలం. ప్రభుత్వం నుంచి ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదు. ఇలాగైతే ఎందుకు బతకాలి’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామానికి చెందిన చాకలి నరసింహులు స్థానిక ఇందిరమ్మ కాలనీలోని ఓవర్‌హెడ్ ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపాడు. వెంటనే ఇల్లు, మరుగుదొడ్డి మంజూరు చేయకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానంటూ కేకలు వేశాడు. దీన్ని గమనించినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా కిందకు దిగేందుకు ససేమిరా అన్నాడు. ఎవరైనా పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే ఇక్కడి నుంచి దూకుతానని హెచ్చరించాడు. కాలనీలో అనేక మందికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని, కనీసం మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని వాపోయాడు. ఇవన్నీ ఇస్తామంటేనే ఇక్కడి నుంచి దిగుతానని, లేదంటే కిందకు దూకుతానని హెచ్చరించడంతోపాటు అనేకమార్లు దూకేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విషయం తెలిసిన వైఎస్సార్సీపీ నాయకుడు, కేడీసీ బ్యాంక్ డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, మాలోల అతిథి గృహ మేనేజర్ బద్రీనారాయణ్ అక్కడికి చేరుకుని నరసింహులుకు సర్దిచెప్పారు. అధికారులతో మాట్లాడామని, వెంటనే ఇల్లు, మరుగుదొడ్డి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అతను కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంత జరిగినా అధికార పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. -
దుర్మార్గ పాలనపై రాజీలేని పోరాటం
కోవెలకుంట్ల/నంద్యాల టౌన్/ఆళ్లగడ్డ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర శనివారం పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామానికి చేరుకోగా పింఛన్లు, పక్కాగృహాలు, రుణమాఫీ, సంక్షేమ పథకాలు వర్తించడం లేదని మహిళలు వైఎస్ జగన్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ దుర్మార్గ పాలనలో చంద్రబాబుపై పోరాటం చేస్తున్నామని ధ్వజమెత్తారు. ‘వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రజలకు లబ్ధి చేకూరుస్తాం. మీ (రాతన)గ్రామంలో ఏ ఒక్కరు కూడా మాకు ఇల్లు లేదని చెప్పేవారు లేకుండా అందరికీ ఇళ్లు కట్టిస్తాం. రైతులు నష్టపోకుండా పంట వేసే ముందు గిట్టుబాటు ధర ప్రకటిస్తాం. పింఛన్ వయసును 45 ఏళ్లకు తగ్గించడంతో పాటు నగదును రూ.2 వేలకు పెంచుతాం. ఎన్నికల నాటికి ఉన్న డ్వాక్రా రుణ బకాయిలను నాలుగు విడతల్లో మహిళల చేతికే ఇస్తాం. బ్యాంకులకు వడ్డీ మొత్తాన్ని చెల్లించి అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలను అందిస్తాం. ఇద్దరు పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లుల అకౌంట్లలో జమ చేస్తాం’ అని వైఎస్ జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. వలసపోతున్నామన్నా.. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ‘ఎన్నికలప్పుడు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కట్టవద్దని, అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు మాటలు నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీ మీద వడ్డీ కడుతున్నాం. ఉపాధి పనులు లేక దూర ప్రాంతాలకు పిల్లలను వెంటబెట్టుకుని వలస(సుగ్గి) వెళుతున్నాం. మా పిల్లల చదువులు నాశనం అవుతున్నాయి’ అని వాపోయారు. పంటలన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. తుగ్గలి సమీపంలో మహిళా రైతులు శ్రీదేవి, సిద్దమ్మ, లత్తమ్మ, తదితరులు తెగులు సోకిన పత్తిపంటను వైఎస్ జగన్‌కు చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారితో మాట్లాడుతూ మనం అధికారంలోకి వస్తే అన్నదాతలు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం టమాటాలను లారీలో తీసుకెళుతున్న రైతులను ఆయన పలకరించారు. టమాటాల బుట్టను ఎంతకు విక్రయిస్తున్నారని అడగ్గా బుట్ట(25కిలోలు) రూ.150 నుంచి రూ.200 విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. వాటిని హెరిటేజ్‌లో ఎంతకు కొనుగోలు చేస్తున్నారని వైఎస్ జగన్ అడగ్గా కిలో రూ.50 నుంచి రూ.60కి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని అన్న చెప్పాడని అందరికీ ధైర్యంగా చెప్పండి’ అని వైఎస్ జగన్ సూచించారు. ఇక నుంచి మీ కష్టాలు నావి.. ‘ఇంత వరకు మీరు పడ్డ కష్టాలన్నీ నేను చూశాను. ఇక మీదట మీ కష్టాలు నావి. మీకు అండగా నేనుంటా’ అని ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భరోసానిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర శనివారం పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామానికి చేరుకోగా మహిళలు వైఎస్ జగన్‌కు సమస్యలు విన్నవించారు. పంట సాగు చేసే ముందే ఆ పంటకు ఎంత అయితే గిట్టుబాటు అవుతుందో అంతరేటు నిర్ణయించి అన్ని పంటల దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రబాబునాయుడిలా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తన హెరిటేజ్ కంపెనీలో అత్యధిక ధరలకు విక్రయించేలా దళారీ పని మన ప్రభుత్వం చేయదన్నారు. -
రాజమ్మ లక్ష్మమమ్మకూ వైఎస్ఆర్సీపీ చేయూత
-
వైఎస్ జగన్ కలిసేందుకు పోటెత్తిన ప్రజలు
-
పదో రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కర్నూలు : ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పదో రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి చింతకుంట, దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు. కాగా, తొమ్మిదవ రోజు పాదయాత్రలో వైఎస్ జగన్ 14.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు ఆయన 124.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. -
పదో రోజు పాదయాత్ర ఇలా..
సాక్షి, కర్నూలు : ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పదో రోజు (గురువారం) షెడ్యూల్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డలో ఉదయం 8గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అనంతరం ఉదయం 8.30లకు పెద్ద చింతకుంట చేరుకుంటారు. అక్కడ నుంచి దొర్నిపాడు మండలంలోని భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్ రోడ్డు, కొండాపురం మీదుగా పాత్రయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3గంటల వరకూ భోజనం విరామం తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు కొండాపురంలో పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు దొర్నపాడు మండల కేంద్రం చేరుకొని పార్టీ జెండా ఎగురవేస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం విడుదల చేశారు. -
నాకే బాధ అనిపించి తీసుకొచ్చా: వైఎస్ జగన్
సాక్షి, ఆళ్లగడ్డ: చర్మం కాలిపోయి అనారోగ్యంతో బాధ పడుతున్న నిరీక్షణ అనే బాలిక పరిస్థితిని చూసి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. ఆమెను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డలో జరిగిన బహిరంగ సభకు తనతో పాటు ఆమెను తీసుకొచ్చారు. నిరీక్షణ దయనీయ స్థితి గురించి ప్రజలకు వివరించారు. ‘చర్మం కాలిపోయి పనులు చేసుకోలేకపోతోంది. నాకే బాధే అనిపించి తీసుకొచ్చా. ఆమెకు ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం లేదు. నీకు మైకు ఇస్తాను. నీ గురించి చెప్పు. అప్పుడైనా చంద్రబాబు బుద్ధి వస్తుందేమో. నేను కూడా నీ గురించి కలెక్టర్‌కు లేఖ రాస్తాను’ అంటూ ఆమె చేతికి మైకు అందించారు. ‘నా పేరు నిరీక్షణ. చర్మం కాలిపోయి రెండేళ్లుగా బాధ పడుతున్నాను. నాకు పెన్షన్ రావడం లేదు. జగనన్న నన్ను ఆదుకుంటార’ని నిరీక్షణ పేర్కొంది. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ఏడాది తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో ఇల్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కోసం జన్మభూమి కమిటీల దగ్గరకు వెళ్లక్కర్లేదు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తా. ప్రతి సామాజిక వర్గం నుంచి 10 మందికి ఇందులో ఉద్యోగాలిస్తాం. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో అన్ని వచ్చేట్టు చేస్తాను. రాజకీయాలు, మతాలు, కులాలు, పార్టీలు చూడకుండా అందరికీ అన్ని ఇస్తామని మాట ఇస్తున్నాన’ని వైఎస్ జగన్ ప్రకటించారు. -
నాకే బాధే అనిపించింది: వైఎస్ జగన్
-
ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి చెలగాటం
-
అన్నా.. ఈ చంద్రబాబు పాలనతో వేగలేకపోతున్నాం అన్న..!
సాక్షి, ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): 'నా పాదయాత్రలో దారిపొడవునా ప్రజలు నాకు అర్జీలు ఇస్తున్నారు. అన్నా ఈ చంద్రబాబు పాలనతో వేగలేకపోతున్నాం అన్నా.. అని తమ గోడును చెప్పుకుంటున్నారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తొమ్మిదోరోజు బుధవారం ఆళ్లగడ నాలుగురోడ్ల కూడలికి చేరుకున్న వైఎస్ జగన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో పోటెత్తిన ఆళ్లగడ్డ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. తన పాదయాత్రలో దారి పొడవునా.. ప్రజలు తమ గోడు చెప్పుకుంటున్నారని, చంద్రబాబు పాలనతో తాము వేగలేకపోతున్నామని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే ప్రతినోటా వినిపిస్తోందని అన్నారు. ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే.. దారిపొడవునా.. ఇవే మాటలు పాదయాత్రలో ఇవాళ ఉద్యోగులు నన్ను కలిశారు. సంత్సరంపైగా పెన్షన్ విధానం మార్చాలని కోరుతున్నా, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దారిపొడవునా అవ్వాతాతలు నన్ను కలిసి.. పెన్షన్ రావడం లేదని మొరపెట్టుకున్నారు పెన్షన్ అందడం లేదని, ఇళ్లు లేవని, పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని దారిపొడవునా ప్రతి నోట ఇవే మాటలు వినిపిస్తున్నాయి. పత్తి, మినుములు, పసుపు, వేరుశనగల తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతున్నలు అంటున్నారు ధరలు గిట్టుబాటు కాక, అప్పుల బాధ తట్టుకోలేక ఏదో రేటుకు అమ్ముకునే అధ్వాన్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకుల గడప తొక్కలేకపోతున్నాం, అప్పులు పుట్టడం లేదని రైతన్నలు గోడు చెప్పుకుంటున్నారు చదువుకున్న పిల్లలు వచ్చి ఇంజినీరింగ్ ఫీజులు లక్షదాక ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేది రూ. 30వేలు కూడా ఉండటం లేదు. అదీ ఎప్పుడిస్తారో తెలియదు. పరిస్థితులు ఇలా ఉంటే ఎలా చదువాలి అన్న అని అంటున్నారు వైఎస్సార్ పాలనలో వడ్డీ లేని రుణాలు, పావులా వడ్డీ రుణాలు వచ్చేవని, ఇప్పుడా రోజులు పోయాయని పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలకు ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదని అంటున్నారు. నాలుగేళ్ల పాలన.. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాలుగు సంవత్సరాల టీడీపీ పరిపాలన గురించి ఇవాళ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం, సమయం వచ్చింది. ఈ నాలుగేళ్ల పాలనలో మనకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాయకత్వం నుంచి ఏదైతే ఆశిస్తామో అది వచ్చిందా? లేదా అన్నది ప్రశ్నించుకోవాలి నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది కూడా ప్రశ్నించుకోవాలి ఫలానావాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకొనేలా నాయకుడు ఉండాలి సినిమాల్లో హీరోనే ఎప్పుడూ నచ్చుతాడు.. విలన్ నచ్చడు.. మరొక్క సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి.. మనం ఇవాళ కూర్చి మీద కూర్చోబెట్టిన ఇదే చంద్రబాబుకు మళ్లీ ఓటు వేయాలా? వద్దా? అన్నది నిర్ణయించాలి బాబు పాలన రాకముందు కరెంటు బిల్లు ఎంత వచ్చింది? ఇప్పుడెంత వస్తోంది. ఇప్పుడు ఇష్టమొచ్చినట్టు బాదుడే బాదుతున్నారు. డబ్బు కట్టకపోతే కరెంటు కట్ చేస్తామని బెదిరిస్తున్నారు బాబు పాలన రాకముందు బియ్యం కోసం మీరు రేషన్ షాపులకు వెళ్తే.. బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్, గోధుమపిండి, చింతపండు, పామాయిల్ దొరికేవి. కానీ ఇప్పుడు రేషన్ షాపులో ఒక్క బియ్యం తప్ప మరేమీ దొరకడం లేదు ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇల్లు అన్న కట్టించాడా? లేదు రుణాలు మాఫీ చేస్తానని, బ్యాంకుల్లోని బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని మాట తప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశాడు. ప్రతి ఇంటికీ చంద్రబాబు రూ. 90వేలు చొప్పున బాకీపడ్డాడు చంద్రబాబు నిస్సిగ్గుగా..! 'ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమే లేకపోతే.. ప్రజల తరఫున ఎవరూ నిలబడరు? ప్రజలకు ఎవరు అండగా నిలబడరన్న ఆలోచనతో చంద్రబాబు నిస్సిగ్గుగా, సంతలో గొర్రెలను కొన్నట్టు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. కొంతమందికి డబ్బులు ఇస్తున్నాడు. ఇంకొంతమందికి మంత్రిపదవులు ఇస్తున్నాడు. ప్రస్తుతం కేబినెట్లో ఎవరు ఏ పార్టీ నుంచి ఎన్నికై మంత్రిగా ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దారుణంగా రాజకీయ పరిస్థితి దిగజారిపోయింది. చట్టాలను రూపొందించి.. కాపాడాల్సిన శాసనసభ్యులనే చట్టాలను ఏమాత్రం లెక్కచేయకుండా చంద్రబాబు నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తున్నాడు. పార్టీ మారినా వాళ్లు రాజీనామా చేయకుండా.. వారి పదవులు పోకుండా కాపాడుతున్నాడు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉండటంతో ఆ చట్టసభలో కూర్చోబుద్ధి కావడం లేదు. వీళ్లంతా (ఫిరాయింపు ఎమ్మెల్యేలు) మంత్రులైన మొట్టమొదటి సభ ఇది. సభకు హాజరైతే వాళ్లు చేసిన అన్యాయాన్ని మేం కూడా టిక్ చేసినట్టు అవుతుంది. అందుకే మేం సభకే రామని చెప్పాం. అప్పుడే మీ అన్యాయం దేశం మొత్తానికి, ప్రపంచం మొత్తానికి తెలుస్తుందని, అప్పుడైనా మీకు సిగ్గు వస్తుందయ్యా చంద్రబాబు అని అన్నాం' అని వైఎస్ జగన్ అన్నారు. -
జనం తోడుగా జగన్ అడుగులు..
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి ఆయన బుధవారం ఉదయం పాదయాత్ర మొదలుపెట్టగానే వృద్ధులు, మహిళలు...జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కర్నీ వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ ...ఏడాది ఓపిక పట్టండి, ప్రజాప్రభుత్వం వస్తుందని.....అందరి కష్టాలు తీరుతాయని భరోసా కల్పిస్తున్నారు. ఇక పెద్దకోట కందుకూరు చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. మరోవైపు రహదారులన్నీ బురదమయం అయినా, అదే రోడ్లపై వెళ్లి ఆయన స్థానికుల్ని పలకరించారు. అంతేకాకుండా వయోభారంతో తన వద్దకు రాలేని వారిని ...అక్కడకు వెళ్లి మరీ పలకరించారు. టార్పాలిన్‌నే పైకప్పుగా చేసుకున్న నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. అలాగే వృద్ధులకైతే పింఛన్, రేషన్‌పై హామీ ఇస్తున్నారు. తనను కలిసిన మహిళలకు ....అమ్మ ఒడి పథకంతో చిన్నారులను చదివించే బాధ్యత తనదని హామీ ఇస్తున్నారు. సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా రాబోయే రాజన్నరాజ్యం ఉంటుందని .....ప్రతిఒక్కరికీ చెబుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. -
తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్ర
-
ఆర్.కృష్ణాపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, ఆళ్లగడ్డ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తొమ్మిదోరోజు ప్రజాసంకల్పయాత్రను ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన ఆర్.కృష్ణాపురంలో పాదయాత్రను మొదలుపెట్టారు. రాజన్న తనయుడు అడుగడుగునా జననీరాజనాలు అందుకుంటున్నారు. ప్రజాసంకల్పయాత్ర ఇవాళ... ఆర్.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు. -
నీరాజనం
చాగలమర్రి, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ రూరల్: ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి నుంచి మంగళవారం 8:30 గంటలకు ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు నీరాజనం పలికారు. స్థానిక ఎస్ఎస్ ధాబా నుంచి ముత్యాలపాడు బస్టాండ్ వరకు మండల నాయ కుడు బాబులాల్ ఆధ్వర్యంలో దారిపొడవునా పూలబాట వేసి జననేత వైస్.జగన్మోహన్ రెడ్డికి ఘనస్వాగం పలికారు. మండల నాయకులతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు, విద్యార్థులు, కులసంఘాల నాయకులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను విన్నమించారు. జగన్నను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. జననేతను చూడటానికి మిద్దెలు, చెట్లు ఎక్కారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు గంగుల నాని, గంగుల సుభాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు, బాచాపురం రాఘవేంద్రారెడ్డి, లడ్డుబాయ్, సుధాకర్‌రెడ్డి, గంధం రాఘవరెడ్డి, ఎస్ భరత్‌కుమార్, గుండామణి, యాదవాడ నరసింహారెడ్డి, నర్సపురం సర్పంచ్ ప్రసాద్‌రెడ్డి, గజ్జల క్రిష్ణారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు బాబులాల్, వీరభద్రుడు, వెంకటరమణ, ముల్లా రఫీ, షబ్బీర్, హుసేన్‌వలి, గేట్లమాబు, అబ్దుల్లాబాషా, మాబుషరీఫ్, వలిసాగారి షరీఫ్,పెయింటర్ రఫి, మనోహర్, రామనారాయణరెడ్డి, బలస్వామి, పత్తి నారాయణ, సంజీవరాయుడు, తులసి, రామకృష్ణ, రవి, శ్రీధర్, మురళి, వీరారెడ్డి, శేషు రమేష్, చాంద్‌బాషా, కానాల మాబుబాషా, గోవిందమ్మ, బాజోజి, శ్రీనివాసులు, గిరిరాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు. చాగలమర్రి: ప్రజాసంకల్ప యాత్రకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మండల నాయకుడు బాబులాల్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యుడు మాబుషరీఫ్ మంగళవారం గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ గంగల ప్రభాకర్‌రెడ్డి పెద్దమకానంలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాత్రలో చాగలమర్రి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జగన్ వెంట నడిచారు. -
తొమ్మిదో రోజు పాదయాత్ర ఇలా..
సాక్షి, కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తొమ్మిదో రోజు బుధవారం షెడ్యూల్ విడుదలైంది. ఆళ్లగడ్డ మండలంలోని కృష్ణాపురంలో బుధవారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఆయన ఆళ్లగడ్డ మండలం పెద్దకోటకందుకూరు చేరుకొని.. పార్టీ జెండాను ఎగరవేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.3 గంటలకు పలసగారాం చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు ఆళ్లగడ్డ మండలం ఫోర్రోడ్ జంక్షన్లో బహిరంగ సభ ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ బస చేస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్‌ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తలశిల రఘురాం విడుదల చేశారు. -
హామీలకు గండి కొట్టిన టీడీపీ నేతలు
-
ప్రయాణమే పరీక్ష!
ఆళ్లగడ్డ: జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 110 ఉన్నాయి. ఈ నెల 23 నుంచి డిగ్రీ సెమిస్టర్ –3, సెమిస్టర్ – 5 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. సుమారు 15 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే, జంబ్లింగ్ పేరుతో వారికి కిలోమీటర్ల కొలది దూరంలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చదివే కళాశాలకు పరీక్ష కేంద్రాలు సుమారు 30 నుంచి 70 కి.మీ దూరంలో ఉన్నాయి. అక్కడికి చేరుకోవాలంటే రెండు నుంచి మూడు బస్సులు ఎక్కి దిగాలి. మరి కొన్నింటికి బస్సు సౌకర్యాలు లేవు. ఈ ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు సుదూర ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్వాకం..విద్యార్థులకు శాపం డిగ్రీ చదివేవారిలో అనేక మంది గృహిణులు, దివ్యాంగులు, బాలికలు ఉన్నారు. సుమారు 15 రోజుల పాటు ఉదయం 9 గంటలకే సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాయడం వారికి కష్టమవుతుంది. కొన్ని మండలాల్లో డిగ్రీ కళాశాలలు లేకున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలను కేటాయించారు. మరి కొన్న చోట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నప్పటికీ డిగ్రీ కళాశాలలు లేవని సాకు చూపుతూ సుదూర ప్రాంతాలకు పంపుతున్నారు. ఇటువంటి చర్యలతో రానున్న కాలంలో డిగ్రీ విద్యకు బాలికలు, వివాహితలు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. రాయలసీమ యూనివర్సిటీ అ«ధికారులు స్పందించి దగ్గరలోని కేంద్రాల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతదూరం ఎలా వెళ్లేది? జంబ్లింగ్ పేరుతో పరీక్ష కేంద్రం ఆదోనికి కేటాయించారు. మా ఊరు నుంచి అక్కడికి వెళ్లాలంటే సుమారు 30 కి.మీ. వెళ్లాలి. ఉదయం 9 గంటలకే పరీక్ష. అక్కడికి వెళ్లేందుకు బస్సులే ఉండవు. ఆటోల్లో అంత దూరం రోజు వెళ్లి పరీక్షలు రాసి రావడం చాల కష్టం. అందుకే ఇంట్లో వాళ్లు పరీక్షలు రాయొద్దు అంటున్నారు. వరలక్ష్మి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, హŸళగుంద మూడు బస్సులు మారాలి: ఇంటర్ తర్వాత పై చదువులు వద్దు అని కుటుంబ సభ్యులు అడ్డుచెప్పినా పక్క గ్రామంలోనే కదా డిగ్రీ కళాశాల అని చెప్పడంతో సరే అని చేర్పించారు. ఇప్పుడు మా ఊరికి 45 కి. మీ. దూరంలోని ఎర్రగుంట్లలో పరీక్ష కేంద్రం ఇచ్చారు. అక్కడికి పోవాలంటే మూడు బస్సులు మారాలి. రోజు అంతదూరం వెళ్లి రావాలంటే మాలాంటికి వారికి ఇబ్బందే. అధికారులు స్పందించి సమీపంలో కేంద్రాన్ని కేటాయిస్తే బాగుంటుంది. కల్పన, విద్యార్థిని, ఆలమూరు నిబంధనల ప్రకారమే కేటాయించాం ఆళ్లగడ్డ చుట్టపక్కల కళాశాలల్లో చదువుతున్న అభ్యర్థులకు ఆళ్లగడ్డ పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించేందుకు ప్లేస్ చాలడం లేదు. అందుకే నంద్యాల, ఎర్రగుంట్ల లో కేంద్రాలు కేటాయించాం. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటే విచారించి మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణాధికారి -
కారులోనే కాలిపోయారు!
తల్లి, ఇద్దరు చిన్నారులు సజీవ దహనం ఆళ్లగడ్డ: అతివేగంగా వెళ్తున్న కారు దగ్ధమైన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలతో కలసి మృత్యువాత పడిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో ఆ కుటుంబానికే చెందిన వ్యక్తి కారు నడుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన నుంచి అతడు తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. తిరుగు ప్రయాణంలో వదిన, పిల్లలతో కలసి బయల్దేరి.. పోలీసుల కథనం మేరకు అనంతపురం జిల్లాకు రాజాప్రసాద్ ఆదివారం కారు (కేఏ 53 జెడ్ 21047 ఫోర్డ్ ఫిస్టా)లో బాడుగకు ప్రయాణికులను తీసుకుని గుత్తి నుంచి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లాడు. అక్కడ వారిని దింపిన తరువాత ప్రొద్దుటూరులోని తన అన్న నాగరాజు ఇంటికి వెళ్లాడు. అనంతరం రాత్రిపూట నాగరాజు భార్య వనితాబాయి (25), పిల్లలు ప్రేమ్‌కుమార్ (5), ఉమేష్ (2) అతడితో కలసి నంద్యాల కారులో బయల్దేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు బత్తలూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ మట్టికుప్పను ఢీకొని సుమారు 20 మీటర్ల దూరం ఎగిరిపడింది. వెంటనే మంటలు వ్యాపించటంతో కారులో వెనుక సీట్లో కూర్చున్న వనితాబాయి, ఆమె కుమారులు ప్రేమ్‌కుమార్, ఉమేష్ కాలి బూడిదయ్యారు. కారు నడుపుతున్న రాజాప్రసాద్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని నంద్యాల ఆస్పత్రికి తరలించారు. మరి కొద్ది సేపట్లో గమ్యం చేరుకునే సమయంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కాటేసింది. వనితాబాయి, ఆమె చిన్న కుమారుడు ఉమేష్ మాత్రమే నంద్యాల వెళ్లాలని తొలుత కారులో కూర్చున్నారు. అయితే ఉదయం ఇంటిదగ్గర ఎవరూ ఉండరని, పెద్ద కుమారుడు ప్రేమ్‌కుమార్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు సూచించటంతో అప్పటికే నిద్రిస్తున్న చిన్నారిని అలాగే కారులో పడుకోపెట్టారు. చిన్నారి నిద్ర నుంచి లేవకుండానే శాశ్వత నిద్రలోకి తల్లీబిడ్డ జారుకున్నారని తండ్రి, బంధువులు గుండెలవిసేలా రోదించారు. -
మంటలు చెలరేగి కారులోనే సజీవదహనం
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బత్తలూరు వద్ద 40వ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న మట్టికుప్పలను ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్‌ను నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, పిల్లలు ప్రేమ్‌కుమార్(5), ఉమేష్(2)లుగా గుర్తించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు సజీవదహనం : ముగ్గురు మృతి
-
హీరో షోరూంలో భారీ చోరీ
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భారీ చోరీ జరిగింది. హీరో షోరూంలో రాత్రివేళ దొంగలు చొరబడి షోరూంలోని లాకర్లో ఉన్న రూ.6.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పైకప్పు రేకులను తొలగించి దొంగలు లోపలికి వెళ్లినట్టు గుర్తించారు. ఉదయం 11 గంటలకు షోరూంను తెరిచేందుకు వచ్చిన యాజమాన్యం చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆధిపత్యం కోసమే జంట హత్యలు
► గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు ►వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్లారు. రాజకీయ ఎదుగులను చూసి ఓర్వలేక ప్రత్యర్ధులు హత్య చేసినట్లు ఆయన తెలిపారు. ఎదుగుదల చూసి ఓర్వలేక ఇందూరు ప్రభాకర్‌రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ చిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్‌రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ పార్టీ, వర్గం తేడా లేకుండా పనులు చేసేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థి వర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరు చూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు. కుటుంబ కలహాలు తోడు ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి వైఎస్ఆర్సీలో చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్‌రెడ్డికి, ప్రభాకర్‌రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీధర్‌రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణ కాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్‌రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. హత్యచేశారు ఇలా ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్‌కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్‌రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్‌రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్‌రెడ్డి, దస్తగిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వీడిన హత్యకేసు మిస్టరీ శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆధిపత్యం కోసమే హత్య చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడయింది. గ్రామానికి చెందిన ఐదుగురు నిందితులు.. ఓ కిరాయి హంతకున్ని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జంట హత్యల కేసును పక్కదోవ పట్టించేందుకు హతుని జేబులో నక్సలైట్ల పేరిట లేఖ ఉంచారు. హత్యలకు సంబంధించి సాక్ష్యాలు దొరకకుండా చేయటానికే వారు ఇలా చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా శిరివెళ్ల మండలంలో గతంలో బోయలకుంట్ల గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఇప్పటికీ ఓ వర్గం వారు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. పోలీసుల రికార్డులలో అత్యంత సున్నితమయిన గ్రామంగా ఈ ఊరి పేరు ఎక్కింది. తాజాగా గోవిందపల్లె కూడా అదే కోవలోకి వచ్చింది. -
వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత ఇందూరు ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యర్థులు శనివారం దారుణ హత్య చేశారు. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన ప్రభాకర్ రెడ్డి, ఆయన బావమరిదిని వెంబడించిన ప్రత్యర్థులు వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, కత్తులతో వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇరువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్‌రెడ్డి గతంలో ఎంపీపీగా పని చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఘటనాస్ధలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా వరాహ జయంత్యుత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ) : వరాహ జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జామున వరాహ క్షేత్రంలో కొలువైన వరాహ నారసింహస్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామి వారికి తిరుమంజనం నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. -
మంత్రికి ఘనస్వాగతం
ఆళ్లగడ్డ : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె మొదటిసారిగా శనివారం రాత్రి పట్టణానికి చేరుకున్నారు.నాలుగు రోడ్ల కూడలి నుంచి ఊరేగింపుగా దివంగత ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ : మంత్రి భూమా అఖిలప్రియను జిల్లా ఎస్పీ రవికృష్ణ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
మూగబోయిన ఆళ్లగడ్డ
జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో ఆళ్లగడ్డ మూగబోయింది. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భూమా శోభానాగిరెడ్డి మృతిని మరిచిపోకముందే భూమా అనుచరులు, అభిమానులకు మళ్లీ కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆళ్లగడ్డలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు ఆయన భౌతికఖాయాన్ని తీసుకొచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ అభిమాననేత విగతజీవిగా ఉండటాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. - ఆళ్లగడ్డ నివాళ్లుర్పించిన ప్రముఖులు భూమా నాగిరెడ్డి మృత దేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, గౌరు చరితారెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి. వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కొండారెడ్డి, తాడిపత్రి ఇన్చార్జ్ పెద్దిరెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి స్వగృహం దగ్గర జిల్లా ఎస్పీ రవికృష్ణ, ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ప్రత్యేక పోలీసు బలాగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
.. మీ రాక సంతోషం సుమండి..!
-
‘అఖిలప్రియపై ఎలాంటి దాడి జరగలేదు’
గుంటూరు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై తమ పార్టీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారన్నది కల్పిత కథనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అఖిలప్రియ వాహనానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ఎదురైన సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఎలాంటి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు కూడా ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు. వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే టీడీపీ దుర్మార్గపు ప్రచారానికి దిగిందని విమర్శించారు. అఖిలప్రియ కంటే ముందు అదే దారిలో జూపూడి ప్రభాకర్ వెళ్లారని... అఖిలప్రియ వచ్చే సమయానికి అభిమానులు పెరగడంతో ఆమె తన కారును వెనక్కు తిప్పుకుని వెళ్లిపోయారని అంబటి రాంబాబు వివరించారు. అఖిలప్రియపై దాడి చేసేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు యత్నించారని కొన్ని చానళ్లు ప్రసారం చేయడంతో ఆయన వివరణయిచ్చారు. -
అఖిలప్రియకు చేదుఅనుభవం
విజయవాడ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. అఖిలప్రియ సచివాలయానికి వెళుతుండగా అదే మార్గంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చింది. జగన్ వస్తున్నారని తెలిసి రైతులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. రోడ్డు పొడవునా వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చేసేదేమి లేక అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లోని రైతులను కలుసుకునేందుకు వైఎస్ జగన్ నేడు పర్యటిస్తున్నారు. -
తహశీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. కార్యాలయంలోని కంప్యూటర్లు, ముఖ్యమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
ఆళ్లగడ్డ: సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావం అలవరుచుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుందని అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అన్నారు. శనివారం ఆళ్లగడ్డ పట్టణంలో భక్తుల డోలత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజన్ స్వాముల వారు ఆరాధించిన నవనీత కృష్ణుడి విగ్రహంతో పలువురి గృహాల్లో పర్యటించారు. స్వామి విగ్రహాన్ని ఆయా గృహాల్లోని ఊయలలో కొలువుంచి అర్చనలు, పూజలు నిర్వహించారు. నవనీత కృష్ణుడి విగ్రహం తమ గృహాల్లో కొలువై పూజలు అందుకుంటే ఆ ఇల్లు బృందావనం అవుతుందని భక్తుల విశ్వాసం. ప్రత్యేక పూజల అంనతరం పీఠాధిపతి భక్తులను అక్షింతలతో ఆశీర్వాదించారు. పీఠాధిపతికి ఘనస్వాగతం అహోబిల పీఠాధిపతి ఆళ్లగడ్డ పట్టణానికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పట్టణ వాసులు ఆయన వాహనానికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. పీఠాధిపతి వెంట అహోబిలం ప్రధానర్చకులు వేణుగోపాలన్, మఠం ప్రతినిథి సంపత్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులున్నారు. -
పోలీసులకు సవాల్‌గా మారిన మహిళా అదృశ్యం
-
ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం
న్యాయవాది బోరెడ్డిలక్ష్మీరెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని న్యాయవాది బోరెడ్డిలక్ష్మిరెడ్డి అన్నారు. బీజేపీ నియోజవర్గ ఇన్చార్జ్గా పనిచేసిన బోరెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామ చేశారు. వైఎస్సార్సీపీకి ఆక ర్షితుడైన ఆయన శుక్రవారం హైదరబాద్‌లోని లోటస్‌పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిని కలిశారు. అక్కడే ఆయనతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నగర పంచాయతీ వైస్‌చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి, దొర్నిపాడు మండలం నాయకుడు శ్రీపతిప్రసాద్ ఉన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా బోరెడ్డి పార్టీలో చేరిన బోరెడ్డి లక్ష్మిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. పార్టీలో చేరిన వెంటనే తనకు బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
బీజేపీకి ‘బోరెడ్డి’ రాజీనామా..
త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతానని ప్రకటన ఆళ్లగడ్డ: రాష్ట్రంలో టీడీపీకి బీజేపీ మిత్రపక్షమా లేక ప్రతిపక్షమా తేల్చుకోలేక పోతున్నామని ఆ పార్టీ నియోజవర్గ ఇన్చార్జ్ బోరెడ్డి లక్ష్మిరెడ్డి అన్నారు. అందుకే తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం నియోజవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీలో సామన్య కార్యకర్తగా చేరి నియోజవర్గ యువమోర్చా కన్వీనర్‌గా రెండు సార్లు, జిల్లా యువమోర్చా కార్యదర్శిగా రెండు సార్లు పార్టీకి సేవలు చేశానన్నారు. పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి 1994 నుంచి పోటీ చేస్తున్నానన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం విచారకరమన్నారు. నామినేటేడ్ పదవుల్లో బీజేపీకి అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీ నాయకుల అవినీతి అక్రమాలను ఎత్తి చూపలేకపోతున్నామన్నారు. అదీగాక విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. అందుకే తనతో పాటు మండల కన్వీనర్లు, ఇతర నాయకులు అందరూ బీజేపీకి రాజీనామా చేశామన్నారు. ఈ నెల 14వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న కో –ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు చెప్పారు. -
జీపు ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బత్తులూరులో విషాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న జీపు... సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. దీంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో జీపు డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... జీపు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.