సాక్షి, నంద్యాల జిల్లా: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే గతంలో పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 20.85 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ రూ. 1800 కోట్లు చెల్లించాం. ఏ ఏడాది నష్టాన్ని ఆ ఏడాదే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్
‘‘మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మంచి పనులు ఎల్లోమీడియాలో రావని సీఎం జగన్ అన్నారు. ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది. ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి. అప్పటికీ , ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి. అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది. గతంలో డీపీటి పథకం.. దోచుకో, పంచుకో, తినుకో అమలయ్యేది. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అమలవుతోందని’’ సీఎం జగన్ అన్నారు.
‘‘గజ దొంగల ముఠా మంచి చెప్పదు. కుట్రలే చేస్తుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి. మంచి నిలబడాలని, అన్ని ప్రాంతాలకు మేలు జరగాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment