raithu barosa
-
తెలంగాణలో రైతు భరోసా సాయం ఎకరానికి ఏడాదికి 12 వేల రూపాయలు... సాగు యోగ్యమైన భూములన్నింటికీ పెట్టుబడి సాయం... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
-
రైతు భరోసాపై కేబినెట్ లో కీలక నిర్ణయం
-
రైతు భరోసా వారికి మాత్రమేనా?
-
రైతు భరోసాపై కొలిక్కిరాని చర్చలు
-
తెలంగాణలో రైతు భరోసా ఎగవేత కుట్రలను ఎదిరించండి... రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ
-
రైతుల ఖాతాల్లో సంక్రాంతి తర్వాత రైతు భరోసా జమ: సీఎం రేవంత్ రెడ్డి
-
తెలంగాణలో సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఆర్థిక సాయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన.. ఇంకా ఇతర అప్డేట్స్
-
‘మాఫీ’ కోసం సెల్ఫీ..
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే) రైతులు రుణ మాఫీకోసం వినూత్న నిరసన చేపట్టారు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో సెల్ఫీ దిగి సీఎం కార్యాలయానికి పంపించారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖరా(కే)లో 190 మంది వరకు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 50 మంది రైతులకే రుణమాఫీ అయిందని, మిగతా 140 మంది అర్హులైనా రుణమాఫీ కాలేదని వాపోయారు. రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా అమలు కాకపోవడంతో పొలం పనులు విడిచి రోజుల తరబడి బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని తెలిపారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. -
రైతుకు ‘భరోసా’ కరువు!
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సీజన్ మరో నెల రోజుల్లో ముగియనున్నా రైతుభరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్లో అసలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుండటంతో అయోమయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. పునఃసమీక్ష ప్రకటనతో సరి! కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా (గతంలో రైతుబంధు) మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అసలు రైతుల కన్నా ధనికులు, అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారనేది కొత్త సర్కారు ఉద్దేశం. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతల్లో దాదాపు రూ. 25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పున:సమీక్ష అనంతరం ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ఐదెకరాలా? పదెకరాలా? ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా గత యాసంగి సీజన్లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్నవారిలో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది ఉండగా వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. ⇒ జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. ⇒ అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది.⇒ జూలై 15వ తేదీన కేబినెట్ సబ్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభి ప్రాయాలు తీసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు.⇒ జూలై 23వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు. -
సాగుభూమికే రైతుభరోసా ఇవ్వాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రైతుభరోసా విధివిధానా ల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం కదిలింది. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో రైతులు, కౌలురైతులు, రైతుసంఘాల నేతలు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు 70 మందికి పైగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అంతేకాక లేఖ ద్వారా కూడా అభిప్రాయాలు తెలపొచ్చని మంత్రులు ప్రకటించడంతో పలువురు రైతులు లేఖలు అందించారు. సమావేశంలో మెజారిటీగా వెల్లడైన అంశాలిలా ఉన్నాయి. ⇒ సాగుచేసే వారికే రైతుభరోసా పథకం అమలు చేయాలి. నిజమైన రైతులు ఎవరనేది వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి జాబితా రూపొందించాలి. సాగు చేయని భూములకు గతంలో రైతుబం«ధు ఇచ్చారు. ఈ విధానానికి స్వస్తి పలికితే అర్హులైన, సాగు చేసుకునే రైతులకే రైతు భరోసా అందుతుంది. ⇒ రైతుబంధు పరిమితి లేకుండా ఎంత భూమి ఉన్నా ఇచ్చారు. అలా కాకుండా పదెకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో రైతుల నుంచి వచ్చే మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ సీజన్ ప్రారంభంలోనే రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. అప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో రైతుభరోసా అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ⇒ బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతుబంధు ఇచ్చారు. భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందింది. రైతుభరోసాలో ఈ భూములు, ఈ కేటగిరీకి చెందిన వారిని తొలగించాలి. ⇒ కౌలు రైతులకు ఉపయోగపడేలా రైతుభరోసా ఉండాలి. రైతుబం«ధు అందక, పంటనష్టం జరిగినా పరిహారం లేక.. ఇన్పుట్ సబ్సిడీ రాక కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి ఎంతో కొంతైనా రైతుభరోసా ఇవ్వాలి. లేదా సబ్సిడీపై విత్తనాలు అందించాలి. యంత్రలక్ష్మి పథకాన్ని పునరుద్ధరించి రైతులు, కౌలు రైతులకూ వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి. ⇒ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కౌలు రైతులను అధికారికంగా గుర్తించారు. 2011లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ కౌలు రైతుల గుర్తింపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి అర్హులైన వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. గ్రామసభలు నిర్వహించి మళ్లీ కౌలు రైతులను గుర్తించాలి. ⇒ ఒకటి, రెండు ఎకరాలున్న చాలామంది రైతుల భూములు ధరణిలో నమోదు కాలేదు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వీరికి పాత పాస్ పుస్తకాలు ఉన్నా.. ధరణిలో ఎక్కకపోవడంతో కొత్తవి రాలేదు. ఈ రైతులు రైతుభరోసా పథకాన్ని కోల్పోకుండా భూములను ధరణిలో చేర్చేందుకు రైతు సదస్సులు నిర్వహించాలి. ⇒ ఒకే భూమికి సంబంధించి ఇద్దరు, ముగ్గురు రైతుబంధు తీసుకున్నారు. వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారినప్పుడు ఇలా జరిగింది. వీటిని నియంత్రిస్తే అర్హులైన ఎక్కువమంది రైతులకు రైతుభరోసా అందుతుంది. ⇒ విత్తన సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, పంటల బీమా పథకం అమలు చేయాలి. గతంలో జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. పంటల బీమాను త్వరితగతిన అమలు చేయాలి. ⇒ ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పొందిన, పోడు పట్టాలు పొందకుండా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతుభరోసా వర్తింపజేయాలి. -
రైతుభరోసా ఇచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే, రాష్ట్రంలో పంట రుణ మాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఖమ్మంలోని వేంసూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది. సహకార బ్యాంక్‌లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్షిప్ ఉండాలి. ఓట్ల కోసం మెంబర్షిప్ ఇవ్వకూడదు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. రైతులకు కావల్సిన అన్నింటినీ రివైజ్డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీ లోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నాం.రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కోరిక. గత ఐదేళ్లలో పంట వేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది. దానివల్ల 25వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. 10, 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది.రుణమాఫీ పూర్తి అయిన తరువాత రైతు భరోసా ప్రారంభిస్తాం. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా ముఖ్యమంత్రితో మాట్లాడాం. రైతు బీమా కూడా కొనసాగించాలి అని చెప్పాం. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలి. భవిష్యత్‌లో పామాయిల్‌ను ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్లాలి. పామాయిల్‌కు రూ.17 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడాం. పామాయిల్ రైతు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలిసన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మలగతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పాత పద్ధతిలోనే రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్‌లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన. సీజన్‌కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది. మార్గదర్శకాలపై కసరత్తు రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. -
TS: రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలిచ్చారు. ‘‘ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ సదరు సమీక్షలో అన్నారు. రాష్ట్ర ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రైతులకు నిధులు చెల్లించాలని అధికారులకు చెబుతూనే.. అదే విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీపై కార్యారచణ ప్రారంభించాలని ఆదేశించారు. -
ప్రభుత్వ భరోసాపై రైతుల హర్షం
-
రైతుభరోసా కేంద్రాలతో గ్రామస్వరాజ్యం ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
జగన్ గారి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతులు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు
-
తల ఎత్తుకుని వ్యవసాయం చేసేలా చేసారు..!
-
అన్నదాతలకు అండగా నిలుస్తున్న రైతు భరోసా కేంద్రాలు
-
ఆర్ బీకేలతో ఏపీలో వ్యవసాయరంగం కొత్త పుంతలు
-
కౌలు రైతులకూ రైతుభరోసా అందించాం : సీఎం వైఎస్ జగన్
-
అడవుల్లోనూ ఆహార పంటలు
‘‘నేను నా రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతోంది. రాయితీ విత్తనాలు కూడా అందించి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది 1070 వరి రకాన్ని సాగుచేశా. మంచి దిగుబడులు సాధిస్తున్నా. అటవీ ఫలాలు సేకరణతోనే కుటుంబాన్ని పోషిస్తూ గతంలో అవస్థలుపడ్డ నేను ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో ఆహార పంటలూ పండిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాను.’’ – కుర్సం రాజు, మెరకగూడెం, బుట్టాయగూడెం మండలం, ఏలూరు జిల్లా సాక్షి, అమరావతి: నిన్న మొన్నటి వరకు కేవలం అటవీ ఫలాల సేకరణపైనే ఆధారపడ్డ గిరిపుత్రులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఇతర అన్ని ప్రాంతాల్లోని రైతుల మాదిరిగానే ఆహార పంటలు పండిస్తూ వారితో సాగులో పోటీపడుతున్నారు. వీరికి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూమిని పంపిణీ చేయడంతో అడవి బిడ్డలు ఇప్పుడు ఉద్యాన, వ్యవసాయ పంటల సాగువైపు మళ్లుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. పోడు వ్యవసాయం, వంతుల సాగు, టెర్రస్ సాగు, వర్షాధార సాగు, మిశ్రమ పంటలు వేయడం, అంతర్ పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి విధానాలను ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. గిరిజనులు సాగుచేస్తున్న ప్రాంతాలివే.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రపురం, కృష్ణా, నెల్లూరు, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లతోపాటు గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అనేక గిరిజన తెగలు వ్యవసాయ సాగులో రాణిస్తున్నాయి. సాగుతో రైతులుగా మారిన గిరిజన తెగలు.. సవర, కాపు సవర, జతాపు, సవర గదబ, భగత, వాల్మీకి, కొండదొర, కొండరెడ్డి, వాల్మీకి, కొండ కమ్మర, కోయనైకపాడు, కోయ, లంబాడీ, చెంచు, సుగాలి, యానాది, ఎరుకల, నక్కల తెగలు. గిరిజన తెగలు సాగుచేస్తున్న పంటలు.. వరి, రాగి, జొన్నలు, బాజ్రా, కందులు, వేరుశనగ, జీడిపప్పు, కాఫీ, మిరియాలు, మామిడి, అనాస (పైనాపిల్), సీతాఫలం, రామాఫలం, పనస, బొప్పాయి, అరటి, టమాటా, పసుపు, చింతపండు, నిమ్మ, అల్లం, మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది నేను సొంతంగా రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఏటా రైతుభరోసాతోపాటు రాయితీతో కూడిన విత్తనాలు అందిస్తున్నారు. కోతుల బెడద నుంచి రక్షణగా పొలం చుట్టూ గ్రీన్ కర్టెన్ ఏర్పాటుచేశాను. పంట బాగుంది. రూ.35వేల వరకు మిగిలే అవకాశముంది. – బంధం చిన్న వీరాస్వామి, ఐ.పోలవరం గ్రామం, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ సాగుకు తోడ్పాటు అందుతోంది రెండెకరాల్లో కాఫీ తోట పెంచుతున్నాను. ఇందులో అంతర్ పంటగా మిరియాలు సాగుచేస్తున్నాను. కాఫీ సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం, కాఫీ బోర్డు, ఐటీడీఏ సహకారం బాగుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలుతో బయట మార్కెట్లోను పోటీ పెరిగి మంచి ధర దక్కుతోంది. ఈ ఏడాది రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది. – తమర్భ వెంకటేశ్వరనాయుడు, ఇరడాపల్లి గ్రామం, పాడేరు మండలం గిరిజన రైతులకు భరోసా అందిస్తున్నాం గిరిజన రైతులకు ఏటా రూ.13, 500 చొప్పున వైఎస్సార్ రైతుభరోసా సాయాన్ని అందిస్తూ విత్తన రాయితీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. సీఎం నేతృత్వంలో 2019 ఆగస్టు నుంచి 1,20,361 మంది గిరిజనులకు 2,09,615 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 26,287 మందికి 39,272 ఎకరాల డీకేటీ పట్టాలు అందించాం. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా భూములు చదును చేయడం, బోరు బావులు తవ్వడం వంటివి ప్రభుత్వం చేపట్టింది. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు సేకరించిన అటవీ ఫల సాయంతోపాటు అటవీ ఉత్పత్తులను కూడా జీసీసీ మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రోత్సహిస్తోంది. అటవీ ఫలసాయం సేకరణతోనే గిరిజనులు సరిపెట్టుకోకుండా వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. – శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) -
ఆళ్లగడ్డలో ఘనంగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం (ఫొటోలు)
-
గజ దొంగల ముఠా మంచి చెప్పదు.. ఎల్లో మీడియాకు సీఎం జగన్ కౌంటర్
సాక్షి, నంద్యాల జిల్లా: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే గతంలో పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 20.85 లక్షల మంది రైతులకు ఇన్‌ఫుట్ సబ్సీడీ రూ. 1800 కోట్లు చెల్లించాం. ఏ ఏడాది నష్టాన్ని ఆ ఏడాదే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్ ‘‘మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మంచి పనులు ఎల్లోమీడియాలో రావని సీఎం జగన్ అన్నారు. ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది. ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి. అప్పటికీ , ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి. అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది. గతంలో డీపీటి పథకం.. దోచుకో, పంచుకో, తినుకో అమలయ్యేది. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోందని’’ సీఎం జగన్ అన్నారు. ‘‘గజ దొంగల ముఠా మంచి చెప్పదు. కుట్రలే చేస్తుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి. మంచి నిలబడాలని, అన్ని ప్రాంతాలకు మేలు జరగాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాబు, కరువు రెండూ కవల పిల్లలు: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఆళ్లగడ్డ నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం రెండో విడత సాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు. ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు’’ అని సీఎం జగన్ అన్నారు. ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకు రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్ రైతు భరోసా: రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు జమ
సీఎం జగన్ ఆళ్లగడ్డ పర్యటన.. అప్డేట్స్ 12:49PM రైతు భరోసా నిధుల్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్ 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల నగదు విడుదల చేసిన సీఎం జగన్ 12:11PM సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ప్రతి అంశంలో రైతులకు అండగా ఉంటున్నాం ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నాం రైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది రైతన్నత ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం మూడు విడతల్లో ప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందిస్తున్నాం ఎక్కడా లంచాలు లేవు.. వివక్ష లేదు ఇప్పటికే మేలో రూ. 7500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4 వేలు ఇస్తున్నాం మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర లబ్థి మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశాం ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకూ రూ. 51 వేలు అందించాం పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం మూడున్నరేళ్లలో రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశాం మంచి పనులు ఎల్లో మీడియాలో రావు ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి గతంలో డీపీటీ పథకం.. దోచుకో, పంచుకో, తినుకో ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోంది గజదొంగల ముఠా మంచిని చెప్పదు.. కుట్రలే చేస్తుంది అప్పటికీ, ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది ఈరోజు మీ జీవితాలు బాగున్నాయా.. లేదా అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు ఈ ప్రభుత్వంతో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు సున్నా వడ్డీ కింద చంద్రబాబు రూ. 685 కోట్లు చెల్లిస్తే, మూడున్నరేళ్లల్లో సున్నా వడ్డీ కింద రూ. 1,282 కోట్లు చెల్లించాం బాబు హయాంలో బ్యాంకుల ద్వారా రూ. 3.6 లక్షల కోట్లు ఇస్తే ఇప్పుడు రూ. 5.48 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం 44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 6,684 కోట్లె బీమా సొమ్ము జమ చేశాం ఏ రైతు నష్టపోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి 11:53AM మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారు క్రమం తప్పకుండా రైతు భరోసా సాయం అందిస్తున్నారు. దేశంలోనే లేని విధంగా వైఎస్సార్ ఉచిత పంటల భీమా రైతులతో వ్యవసాయం సలహా మండలి ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏపీ టీడీపీ హయాంలో రైతుల పేరిట దోచుకున్నారు మేం వచ్చాక దళారుల ప్రమేయం లేకుండా రైతులకు రాయితీ ఏపీ వ్యవసాయం రంగం చర్యలను ఆస్ట్రేలియా ప్రతినిధులు ప్రశంసించారు ప్రపంచంలోనే లేని వ్యవసాయ సంస్కరణలు ఏపీలో ఉన్నాయని వారు కొనియాడారు 11: 20AM ఆళ్లగడ్డ చేరుకున్న సీఎం జగన్ 10:10AM ► వైఎస్ఆర్ రైతు భరోసా నగదు జమ కార్యక్రమం.. కాసేపట్లో ఆళ్లగడ్డకు చేరుకోనున్న సీఎం జగన్. 9:03AM ► వైఎస్ఆర్ రైతు భరోసా రెండవ విడుత నగదు జమ కార్యక్రమం కోసం.. తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరారు సీఎం జగన్. ► వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే కార్యక్రమానికి హాజరై బహిరంగ సభలో ప్రసంగించి.. అనంతరం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు. ► వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ► వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయం అందజేస్తున్నారు. ► మే నెలలో ఖరీఫ్‌కు ముందే తొలి విడత సాయాన్ని అందజేసింది. ► మూడో విడుతను సంక్రాంతి సమయంలో విడుదల చేయనుంది. ► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే.. ఇప్పటివరకు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర ఏపీ రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరుసగా నాలుగో ఏడాది రెండో విడత ‘రైతు భరోసా’
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. ► రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందచేయనుంది. ► దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీనే కావడం గమనార్హం. 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు రూ.7,000 కోట్లను రైతు భరోసా ద్వారా అందచేసి ఆదుకుంటోంది. ► రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం. ► చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాయాన్ని అందచేస్తోంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అందిస్తామని మేనిఫెస్టోలో మాటివ్వగా సీఎం జగన్ ప్రభుత్వం అంతకుమించి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందచేస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న రూ.17,500. ► గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నలకు సీఎం జగన్ ప్రభుత్వం దాదాపు రూ.1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ రైతు భరోసా, ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని తెచ్చింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, ఐదు రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటించింది. రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తోంది. ఏడాది పొడవునా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండటంతో ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్ధితి తలెత్తలేదు. ► టీడీపీ హయాంలో రైతన్నలకు కనీసం విత్తనాలు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. ఇక ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు అగమ్యగోచరమే. ఆశాస్త్రీయ పంట నష్టాల అంచనాతోపాటు అయిన వారికే పరిహారం దక్కేది. నాడు ఏడాది పొడవునా కరువు తాండవించడంతో ఐదేళ్లలో 1,623 కరువు మండలాలను ప్రకటించాల్సి రావడం గత సర్కారు నిర్వాకాలకు నిదర్శనం. ఇక రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనే గత పాలకులకు రాలేదు. రైతు భరోసాతో ఇప్పటిదాకా ఎవరికి, ఎంత సాయం? ► బీసీలు 24,61,000 మందికి రూ.12,113.11 కోట్లు ► ఎస్సీలు 5,23,000 మందికి రూ.2,653.04 కోట్లు ► ఎస్టీలు 3,92,000 మందికి రూ.1,771.13 కోట్లు ► మైనార్టీలు 60,000 మందికి రూ.320.68 కోట్లు ► కాపులు 7,85,700 మందికి రూ.3,793.44 కోట్లు ► ఇతరులు 10,16,300 మందికి రూ.5,319.93 కోట్లు ► మొత్తం 52,38,000 మందికి రూ.25,971.33 కోట్లు నేడు సీఎం పర్యటన ఇలా ► సీఎం జగన్ ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. ► 10.45 – 12.10 వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు, ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ► మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
ఆర్బీకేల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు బ్యాంకింగ్ సేవలందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. ప్రతీ రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే)లో ఏటీఎంను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకొక ఆర్బీకేలో వీటిని ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలుండగా, ప్రస్తుతం 9,160 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 6,708 మంది మాత్రమే ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. మిగిలిన వారి సేవలకూ చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుతం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా రూ.25వేల వరకు పరిమిత నగదు ఉపసంహరణ.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం.. పంట రుణాల మంజూరు.. పాడి, మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ, డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీ వంటి సేవలందిస్తున్నారు. తాజాగా.. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఆర్బీకేల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన చేయగా బ్యాంకర్లు అందుకు ముందుకొచ్చారు. జిల్లాకొకటి చొప్పున ఆర్బీకేలతో పాటు గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకుల్లేని గ్రామాల్లో ఏర్పాటుచేయనున్నారు. చివరిగా.. మిగిలిన ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాలోŠల్ స్థానికంగా ఉండే డిమాండ్‌ను బట్టి దశల వారీగా ఏర్పాటుచేస్తారు. రైతుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం.. మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని ఆర్థిక లావాదేవీల (పేపర్ లెస్)ను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఆర్బీకేల ద్వారా రైతు సంబంధిత బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకొకటి ఏర్పాటుచేస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు బ్యాంకర్లందరూ ముందుకొస్తున్నారు. తొలుత ఆర్బీకేలు, సచివాలయాల్లో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటుచేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన చోట్ల ఏర్పాటుచేస్తాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
రైతు భరోసా ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం
-
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
-
అన్నదాతకు అండగా...
-
అన్నదాతలకు అండగా రైతు భరోసా కేంద్రాలు
-
వ్యవసాయాన్ని పండగ చేసిన వ్యక్తి వైస్సార్ గారు : కాపు రామచంద్ర రెడ్డి
-
రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన
వైఎస్సార్...రైతును రాజుగా చేసిన నేత. అందుకే ఆయన భౌతికంగా దూరమై దశాబ్దం దాటినా జనం గుండెల్లో మాత్రం నేటికీ కొలువై ఉన్నారు. కరువు జిల్లా అనంతలో ఏ చెట్టును కదిపినా...ఏ ప్రాజెక్టును పలకరించినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. ఇక రైతన్నతో వైఎస్సార్ గురించి ప్రస్తావిస్తే స్వర్ణయుగం కళ్లముందు కనిపిస్తుంది. ఆయన తనయుడు, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్ జయంతి (జూలై 8వ తేదీ)ని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది. సాక్షి,అనంతపురం: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సువర్ణపాలనను తలపించేలా ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. గత రెండేళ్లుగా అడుగడుగునా అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. రెండేళ్లలోనే రూ.2,700 కోట్ల జమ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం, అనుబంధ శాఖలు పురోభివృద్ధి దిశగా పయనిస్తున్నాయి. ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’ కింద ఏటా ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం కింద రెండేళ్ల కాలంలో రూ.1,938.72 కోట్లు జమ చేశారు. ‘వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు’ పథకం కింద రెండేళ్లలో రూ.61.55 కోట్లు జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి రూ.25.17 కోట్లు జమ చేశారు. ‘ఉచిత పంటల బీమా’ పథకం కింద రూ.628 కోట్లు ఇన్సూరెన్స్ మొత్తాన్ని నేరుగా చెల్లించారు. ఉద్యాన రైతులకు పంటల బీమా కింద రూ.51 కోట్ల పరిహారం ఇచ్చారు. రైతు ఆత్మహత్యలకు సంబంధించి రెండేళ్ల కాలంలో 181 బాధిత కుటుంబాల ఖాతాల్లోకి రూ.10.59 కోట్ల మేర పరిహారం జమ చేశారు. కనీస మద్దతు ధరతో రైతుల నుంచి రూ.250 కోట్ల విలువైన పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ‘వైఎస్సార్ పశునష్ట పరిహారం పథకం’ కింద గత రెండేళ్లలో 3 వేల మందికి పైగా బాధితుల ఖాతాల్లోకి రూ.9 కోట్ల వరకు జమ చేశారు. మొత్తమ్మీద రెండు సంవత్సరాల రెండు నెలల కాలంలోనే వ్యవసాయ, అనుబంధ రంగాల కింద లబ్ధిదారులకు రూ.2,700 కోట్ల మేర బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఇక రైతు భరోసా కేంద్రాల వేదికగా రైతులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. -
ఆంధ్ర ప్రదేశ్ లో ఆదర్శంగా నిలుస్తోన్న రైతు భరోసా కేంద్రాలు
-
వైఎస్సార్ రైతు భరోసా: రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
కష్టకాలంలో రైతుకు ఆర్థిక భరోసా
-
రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 90 శాతం హామీలు అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ధర్నాలు చేసినా పరిహారం వచ్చేది కాదు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. – శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా సాక్షి, అమరావతి : ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ఈ రోజు నిజంగా మరో ఘట్టం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదని, మొదటిసారిగా ఆ నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుతోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు గతంలో ఏం జరిగింది? ► గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015–16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ► 2015–18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ► ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ► అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ఎవరికైనా ఈ పథకాలు మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. ► వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. పేద రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. రైతుల కోసం బకాయిలు చెల్లించాం ► గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8,655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1,180 కోట్లు ఇస్తున్నాం. ► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ► పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. అన్నదాతల కోసం ఎన్నెన్నో చేస్తున్నాం ► 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ► పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. ► 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలోనూ రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ.3,218 వడ్డీ మాఫీ వచ్చింది. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. – ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గుంటూరు జిల్లా నంబూరు రైతులు మీ పట్ల నమ్మకం పెరిగింది మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. మీ పనితీరు పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. – విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా -
‘వైఎస్సార్ యాప్’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవచ్చు. అలాగే సదరు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా సరైన సమయంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్దం చేయడం, రైతులకు ఇన్పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్: సీఎం జగన్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్) రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్ రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు) -
ఆర్బీకేల్లో బ్యాంకింగ్ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి మరో వినూత్న సేవను అందించేందుకు వ్యవసాయ శాఖ సంకల్పించింది. రైతులకు బ్యాంకింగ్ సేవలను సైతం ఆర్బీకేల నుంచి అందించడానికి కృషి చేస్తోంది. ఈమేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించిన ముసాయిదాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్బీసీ) సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రాథమిక అవగాహన కూడా కుదిరింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే ఆర్బీకేల నుంచి సేవలు ప్రారంభించనున్నారు. అన్నదాతలకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ కొత్త ఆలోచన మరో తార్కాణం అని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. పరపతి (క్రెడిట్) సౌకర్యం లేకనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ పలు కమిటీలు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రానికి నివేదించిన అంశాలు ► వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే క్రమంలో భాగంగా రాష్ట్రంలో గత నెల 30న సీఎం వైఎస్ జగన్ 10,641 ఆర్బీకేలను ప్రారంభించారు. ► ఆర్బీకేలలో గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ), గ్రామ ఉద్యాన సహాయకులు (వీహెచ్ఏ), విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (వీఎస్ఏ) కీలకపాత్ర పోషిస్తారు. ► వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతు ఇంటి ముంగిటే అందించడం ఆర్బీకేల ఉద్దేశం. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవల్ని సైతం రైతుకు తన సొంత గ్రామంలోనే అందించాలని ప్రతిపాదిస్తున్నాం. ► బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందించే సేవలు.. ఆర్బీకేల్లో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు అందించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. రైతులు, బ్యాంక్ బ్రాంచ్‌ల మధ్య వారు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ► క్రెడిట్ కోసం బ్యాంక్‌కు సమర్పించడానికి వీలుగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో దరఖాస్తు ఫారాలను నింపడానికి సహకరిస్తారు. పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. ► రూపే కిసాన్ క్రెడిట్ కార్డు జారీకి అవసరమైన ఆధార్ కార్డుల అనుసంధానానికి, కొత్త కార్డుల జారీకి, కేసీసీ పునరుద్ధరణకు దరఖాస్తు ఫారాలు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచవచ్చు. ► పీఎంజేడీవై, పీఎంఎస్బీవై, ఏపీవై పథకాలలో నమోదుకు అర్హులైన రైతుల నుంచి సమ్మతి పత్రాలను సేకరించడానికి అనుమతించవచ్చు. అర్హత ఉన్న రైతులందరికీ లబ్ధి చేకూరేలా చూడవచ్చు. ► అర్హులైన వారికి రైతు భరోసా డబ్బు జమ కాకపోతే.. ఆ రైతుల తరఫున బ్యాంకులకు కావాల్సిన పత్రాలను సమర్పించవచ్చు. ► రుణాల రికవరీలో వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలు బ్యాంకులకు సహాయం చేస్తారు. ► తనిఖీ కోసం బ్యాంకర్లు తమ రుణగ్రహీతల జాబితాలను వారికి అందజేయవచ్చు. ► అన్ని రకాల వ్యవసాయ రుణాలను సమీక్షించేందుకు (క్వాంటిటేటివ్) బ్యాంకులు తమకు బకాయి ఉన్న వారి వివరాలను వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఏలతో పంచుకోవచ్చు. ► ఆర్బీకే సిబ్బందికి బ్యాంకులు ఓ సమయాన్ని కేటాయిస్తే ఇతర ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పని పూర్తికి వీలు కల్పించవచ్చు. ► బ్యాంక్ మిత్రలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు తమ సేవలను ఆర్బీకేల నుంచి సాగించవచ్చు. వారే అక్కడ రైతులతో నేరుగా మాట్లాడి సందేహాలు తీర్చవచ్చు. అవసరమైన సేవల్ని అందించవచ్చు. ► నిర్దేశిత సమయంలో బ్యాంక్ అధికారులు ఆర్బీకేకు వెళితే ఆ గ్రామ రైతులతో భేటీ అయి బ్యాంకింగ్ సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించవచ్చు. పరపతి లక్ష్యాలను చేరుకునేందుకు వేదికలుగా ఆర్బీకేలను ఉపయోగించుకోవచ్చు. ► ఇలా చేయడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ రైతులకు తప్పుతుంది. రుణాల జాప్యాన్ని నివారించవచ్చు. అర్హులైన వారందరికీ రుణాలు ఇచ్చి పంటల సాగుకు తోడ్పడవచ్చు. రైతులకు సేవలందించే క్రమంలో బ్యాంకర్లు ఆర్బీకే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించేందుకే.. రైతులకు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న ఆలోచనల్లో భాగంగా వారి ఇంటి ముంగిటే బ్యాంకింగ్ సేవలు అందించాలన్న ప్రతిపాదన వచ్చింది. రైతుల్లో చాలా మందికి బ్యాంకింగ్, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన ఉండదు. ఆ అంశాలపై అవగాహన కల్పించి త్వరితగతిన సేవలు అందిస్తే రైతులు తమ ఊరికి దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకునే అవసరం ఉండదు. దరఖాస్తు ఫారాలను నింపడానికి ఇతరుల సహకారం తీసుకునే పని ఉండదు. ఆధార్ అనుసంధానం కాలేదన్న సాకుతో రుణాలో, ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయమో సకాలంలో అందలేదన్న ఫిర్యాదులు లేకుండా చేయొచ్చు. రుణాలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందించే కృషిలో భాగంగా ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోంది. – కురసాల కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం
కర్నూలు (అగ్రికల్చర్): ‘వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రైతు భరోసా కేంద్రాలు దేశానికే రోల్ మోడల్‌గా మారనున్నాయి. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఏర్పాటు కావటం.. ఇందులోనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్నిరకాల సేవలు అందుతుండటం విశేషం. ఏ అవసరమొచ్చినా రైతులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేద’ని కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త జి.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. ఆర్బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లోని నాలుగు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. అనంతరం తాను పరిశీలించిన అంశాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. అంతలోనే.. ఇంత మార్పా! ► నేను వెళ్లే సమయానికి మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అక్కడే ఉండి రైతులకు సేవలందించటాన్ని గమనించాను. ► అక్కడ రైతులు కూర్చోడానికి కుర్చీలున్నాయి. ర్యాక్‌లు వచ్చాయి. వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు కూడా కనిపించాయి. ► నేను వెళ్లిన ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్‌లు, ఎల్ఈడీ టీవీలు, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాల తయారీ స్టవ్, కుక్కర్లను చూశా. ► వ్యవసాయ శాఖలో ఇంత మార్పును చూసి ఆశ్చర్యపోయా. రైతు గ్రామం విడిచి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందనే నమ్మకం కలిగింది. ► ఇక్కడే ఈ–కర్షక్ యాప్‌లో పంటలను నమోదు చేసి.. ఉచిత పంటల బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ► రైతులు తమకు కావాల్సిన వాటిని డిజిటల్ కియోస్క్ ద్వారా ఎంపిక చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. ► ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లో ఎరువుల కోసం కియోస్క్ ద్వారా అక్కడి రైతులు ఆర్డర్ పెట్టడాన్ని గమనించాను. వారి ఆర్డర్ విజయవంతమైనట్లు వెంటనే వారి సెల్‌కు మెసేజ్ వచ్చింది. ► ఏ కంపెనీ ఎరువు లేదా పురుగు మందు కావాలన్నా ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది. భూసార పరీక్షలూ ఇక్కడే.. ► గతంలో భూసార పరీక్షలు ప్రహసనంలా ఉండేవి. మట్టి నమూనాలు ఇస్తే.. వాటిని ఎప్పుడు పరీక్ష చేస్తారో తెలిసేది కాదు. పంటలు పూర్తయ్యే తరుణంలో ఫలితాలు ఇచ్చేవారు. ► ఆర్బీకేల వల్ల ఈ సమస్య తీరిపోయింది. దాదాపు రూ.80 వేల విలువైన మట్టి పరీక్షల ప్రత్యేక కిట్లను ప్రభుత్వం ఆర్బీకేలకు సమకూర్చింది. ► దీనివల్ల రైతులు ఎటువంటి జాప్యం లేకుండా పరీక్షలు చేయించుకుని వెంటనే ఫలితాలను పొందే అవకాశం కలిగింది. ► రైతు భరోసా కేంద్రాల్లో బీటీ పత్తి రకాలతో పాటు కొర్ర, కందులు, వేరుశనగ, కూరగాయ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ► వాటి నాణ్యతను కూడా పరిశీలించాను. మంచి కంపెనీలకు చెందిన బ్రాండెడ్ విత్తనాలే ఉన్నాయి. కియోస్క్ ద్వారా ఎరువులు బుక్ చేశా గతంలో ప్రతి చిన్న అవసరానికీ కోడుమూరు లేదా కర్నూలుకు పోవాల్సి వచ్చేది. ఈ సారి వేరుశనగ విత్తనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేలోనే పొందా. డిజిటల్ కియోస్క్ ద్వారా యూరియా, ఇతర ఎరువులను బుక్ చేశా. రైతులకు వ్యయ ప్రయాసలు లేవు. సమయం ఆదా అవుతోంది. – సీతారాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం అవగాహన పెంచుకుంటున్నాం రైతు భరోసా కేంద్రాల్లో పంటల గురించి ముందుగానే టీవీల్లో నిపుణులు ప్రాక్టికల్‌గా ఇచ్చే సూచనల వల్ల అవగాహన పెంచుకుంటున్నాం. మిరప సాగు పద్ధతులు, విత్తనాల ఎంపిక వంటి విషయాలను టీవీ ద్వారా తెలుసుకున్నాను. గ్రామంలోనే సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పొందా. ఎరువులు, పురుగు మందుల కోసం ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లిస్తే మరుసటి రోజునే సరఫరా చేస్తున్నారు. – చిన్నరాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం -
రైతు రాజ్యం ఖాయం
అనంతపురం అగ్రికల్చర్: రైతును రాజును చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయం నుంచి పుట్టిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) నిజంగా రైతుల పాలిట దేవాలయాలుగా మారతాయని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త, కీటకశాస్త్ర విభాగం నిపుణుడు డాక్టర్ టి.మురళీకృష్ణ అన్నారు. వీటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లాలోని రామగిరి, మరూరు, రాప్తాడు, నాగిరెడ్డిపల్లి ఆర్బీకేలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం ‘సాక్షి’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఆర్బీకే వ్యవస్థ నిజంగా అద్భుతం ► తొలుత రామగిరి ఆర్బీకేకు వెళ్లాను. అధికారులతో పాటు కొందరు రైతులు ఉన్నారు. అక్కడి వసతులు పరిశీలించాను. కియోస్క్ పరికరం, టీవీ, ఎల్ఈడీ సెట్, కుర్చీలు, టేబుళ్లు, ర్యాక్‌లు అందులో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్యాకెట్లు ఉన్నాయి. చదువుకునేందుకు వ్యవసాయ పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే కషాయాల తయారీ మిషన్, కుక్కర్ వంటివి ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందులు కూడా ఉన్నాయి. ► తర్వాత డిజిటల్ కియోస్క్ పనితీరు పరిశీలించాను. రిజిష్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రైతుకు ఎప్పుడు ఏమి కావాలన్నా ఇందులో ఆర్డర్ ఇచ్చి.. పక్కనున్న సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌కు డబ్బు కడితే... 48 గంటల్లో ధర్మవరంలో ఉన్న ఆర్బీకే హబ్ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితరాలు అందుతాయి. ► డబ్బు కట్టిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన సరుకు ఎక్కడుంది, ఎప్పుడొస్తుందనే విషయం కూడా మొబైల్ ట్రాకింగ్ ద్వారా చూసుకోవచ్చు. గ్రామ స్థాయిలో రైతులకు మంచి వేదిక ► రాప్తాడు మండలం మరూరు ఆర్బీకేలో నలుగురైదుగురు రైతులున్నారు. వసతులు పరిశీలిస్తుండగానే కొందరు ఉన్నతాధికారులతో పాటు మరో 20, 30 మంది రైతులు రావడంతో అక్కడ సందడిగా మారింది. ఆర్బీకేల గురించి అడగ్గానే రైతులు చాలా అవగాహన ఉన్నట్లు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. పురుగు మందులు వెంటనే ఇవ్వాలి.. ► రాప్తాడు ఆర్బీకే వద్దకు వెళ్లేసరికి ఏఈవోలు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, రైతులతో కిటకిటలాడుతోంది. పురుగు మందుల సరఫరా ఆలస్యం అయితే పంట దెబ్బతింటుందని రైతులు విన్నవించారు. రైతులకు క్రెడిట్ కార్డు వంటి సదుపాయం కల్పిస్తే బావుంటుందని మరికొందరు కోరారు. రైతు విజ్ఞాన కేంద్రాలే.. ► అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ఆర్బీకేను మధ్యాహ్నం 2 గంటలకు సందర్శించాను. ఆ సమయంలో కూడా గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, చౌడప్ప మరికొందరు రైతులు తమ పేర్లను కియోస్క్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, ఉద్యాన, మత్స్య, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖలకు సంబంధించి అన్ని రకాల సేవలూ ఇక్కడ ఉంటాయన్నారు. ► మరూరు, నాగిరెడ్డిపల్లి ఆర్బీకేల వద్ద కూడా రైతుల సందడి కనిపించింది. ఈ–కర్షక్, డీ–కృషి, సీఎం యాప్, ధరల స్థిరీకరణ నిధి, సీహెచ్‌సీ సదుపాయం, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 155251 అందుబాటులో ఉండటం విశేషం. ► భవిష్యత్తులో ఆర్బీకేలకు అనుబంధంగా శీతల గిడ్డంగులు, గోదాములు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతుల తల రాతలే మారిపోతాయనడంలో సందేహం లేదు. ఆర్బీకేలతో కష్టాలు తప్పినట్లే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఇక కష్టాలు తప్పినట్లే. భూములు దుక్కి చేసి పంట విత్తుకునే నాటి నుంచి అమ్మకం వరకు అడుగడుగునా అండ గా ఉండే అవకాశం ఉన్నందున రైతులకు సమస్యలు ఉండవు. – ముత్యాలునాయక్, రామగిరి నాణ్యమైన వేరుశనగ ఇచ్చారు ఈసారి ముందుగానే నాణ్యమైన వేరుశనగ ఇవ్వడంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా మున్ముందు మరిన్ని సేవలు అందుతాయని భావిస్తున్నాం. వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా ఇకపై గిట్టుబాటు ధరలు వస్తాయి. . ఆర్బీకేల ద్వారా అన్నీ మా వద్దకే వచ్చినట్లుంది. – రామచంద్రారెడ్డి, కొండారెడ్డి, మరూరు -
ఆర్బీకేల నుంచే పండ్లు, విత్తనాలు, మొక్కలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నుంచే ఉద్యాన పంటల విత్తనాలు, మొక్కలు రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాల పంటల విత్తనాలు, మొక్కలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, ఏపీ ఆగ్రోస్, అన్ని జిల్లాల వ్యవసాయ, అనుబంధ విభాగాల్ని సంప్రదించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఇలా ఉండనున్నాయి... ► కూరగాయల సాగులో పాల్పంచుకుంటున్న కంపెనీలతో ఆగ్రోస్ ఎండీ అవగాహన ఒప్పందం చేసుకుంటారు. ► ఆర్బీకేల నుంచి ఆర్డరు చేసిన విత్తనాలను సమీపంలోని హబ్‌లకు పంపి రైతులకు నేరుగా పంపిణీ అయ్యేలా చూస్తారు ► ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఆయా ప్రాంతాల్లోని రైతులకు కావాల్సిన విత్తనాలను గుర్తించి వంగడాల జాబితాలను ఆగ్రో స్కు పంపిస్తారు. ► కూరగాయలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల విషయంలో స్థానిక వ్యవసాయాధికారి, ఉద్యాన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎంత మొత్తం కావాలో అంచనా వేస్తారు. ► తమ ప్రాంతాల్లోని విస్తీర్ణం ఆధారంగా గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు విత్తన అవసరాన్ని గుర్తిస్తారు. ► ఆర్డరు అందిన 48 గంటల్లోపు సరఫరా చేసేలా ఏపీ ఆగ్రోస్ చర్యలు తీసుకుంటుంది ► ప్రస్తుత నర్సరీల చట్టం ప్రకారం ఉద్యాన శాఖ అన్ని పంటల నారుమళ్లను నమోదు చేసి పర్యవేక్షిస్తుంది. ► నారుమళ్ల నాణ్యతలో లోపాలుంటే సంబంధిత సంస్థపై చర్య తీసుకుంటారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు) సైతం విత్తనాల సేకరణకు ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. ► ఆర్బీకేల నుంచే కూరగాయల విత్తనాలు, మిర్చి, బొప్పాయి, టిష్యూ కల్చర్ అరటి, పుచ్చ, కర్బూజ పంటల మొక్కలు, విత్తనాల పంపిణీ. ► పొలంబడి కార్యక్రమంలో ఉద్యాన శాఖ పండ్లు, కూరగాయల పంటల సాగుపై రైతులకు మెళకువలు నేర్పించి మంచి దిగుబడులు వచ్చేలా చూస్తుంది. ► పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల మొక్కలను నర్సరీల నుంచి సేకరించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేందుకు ఎవరితో కలిసి పని చేయాలో ఉద్యాన శాఖ ప్రణాళికను ఖరారు చేస్తుంది. ► ఇలా చేయడం వల్ల ఉద్యాన రైతులు నష్టపోవాల్సి ఉండదని ఉద్యాన శాఖ స్పష్టం చేస్తోంది. -
రైతుల పాలిట ఆధునిక ఆలయాలు
తెనాలి: ఏ పంట సాగు చేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటుకు అమ్ముకోవచ్చు? ఈ విషయం ఎవరిని అడగాలి? విత్తనాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి? మందులు, ఎరువుల మాటేమిటి? పంట చేతికొచ్చే దశలో నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బీమా ఎలా చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరూరా రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ప్రారంభించింది. ప్రస్తుతం రైతులందరికీ చక్కగా విత్తనాలు అందిస్తుండటం వినూత్నం. ప్రతి రైతుకూ తానుంటున్న ఊళ్లోనే ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్బీకేల పనితీరు ఎలా ఉందో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డికి ప్రత్యక్షంగా చూడాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి బయలు దేరారు. వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోని చుండూరు, అంగలకుదురు, పెదరావూరు, వల్లభా పురంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఆయన గమనించిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఇంతలో ఎంత మార్పు..! ► పల్లెటూళ్లలో ఒక్కో ఆర్బీకేను చూడగానే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న కుటీరంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలిగింది. పల్లె వాతావర ణాన్ని తలపించే రంగులతో తీర్చిది ద్దడం ఆహ్లాదంగా అనిపించింది. ► అతి పెద్ద మొబైల్ ఫోన్ లాంటి డిజిటల్ కియోస్క్, స్మార్ట్ ఫోనుతో అనువుగా తీర్చిదిద్దారు. నేను వెళ్లే సరికే పలువురు రైతులు అక్కడున్న వ్యవసాయ సహాయకులతో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ► కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజనులో విస్తారంగా సాగుచేసే వరి విత్తనాల గురించి రైతులు చర్చించుకుంటున్నారు. కియోస్క్ పని తీరును స్వయంగా చూశాను. స్మార్ట్ మొబైల్ ఫోన్‌ను వినియోగించే రైతు ఎవరైనా, తానే సొంతంగా కియోస్క్‌లో కావాల్సిన విత్తన రకాన్ని బుక్ చేసుకోవచ్చు. సహాయకుల సహకారంతో కొందరు బుక్ చేసుకున్నారు. మరికొందరు సహాయకులతోనే బుక్ చేయించారు. ► విత్తనం బుక్ చేసిన 48 గంటల్లోపు డెలివరీ తీసుకొనేలా చర్యలు తీసుకున్నారు. విత్తనాలే కాదు, ఎరువులు, పురుగు మందులనూ ఇలాగే తీసుకోవచ్చని తెలిసి ఎంతో ఆనందం వేసింది. ► వ్యవసాయ రంగంలో ఇదొక నూతన అధ్యాయం.. దేశంలోనే వినూత్నమైన ముందడుగు.. ఇంతలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని రైతులు చర్చించుకోవడం కనిపించింది. ఇలా చేస్తే ఇంకా మేలు.. ► దుక్కి దున్నిన రైతులు, భూమి పదును తేలగానే విత్తనం కోసం వెతుకుతాడు. పంట వేశాక, వర్షం కురవగానే ఎరువుల కోసం దౌడుతీస్తాడు. తెగులు కనిపిం చగానే తగిన మందు కొట్టేందుకు ఆరాటపడతాడు. అలాంటి పరిస్థితుల్లో గ్రామ సచివాలయంలో డబ్బు చెల్లించి, చీటీ తీసుకురాగానే తగిన విత్తనం/ ఎరువు/ పురుగుమందు సిద్ధంగా ఉండే లా స్టాకు పాయింట్ ఏర్పాటు చేయాలని కొందరు రైతులు సూచించారు. ► వేర్వేరు చోట్ల స్థిరపడిన వారికి ఊళ్లో గల భూములను అనధికారికంగా కుటుంబ సభ్యులే కౌలు చేస్తుంటారు. ‘యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే’ అనే నిబంధన స్థానంలో ఎక్కడైనా రేషన్ తీసుకున్నట్టుగా ఓటీపీ/లెటర్/ఆధార్ సీడింగ్ ద్వారా సేవలందించగలిగితే ఎంతో మేలు. ఆధునిక పరిజ్ఞానంతో రైతులకు మేలే ► వ్యవసాయాన్నంతటినీ ఆర్బీకే అనే వ్యవస్థలోకి మళ్లించటం, సాంకేతిక పరిజ్ఞానా నికి అధిక ప్రాధా న్యత ఇవ్వటం వల్ల దళారుల ప్రాబల్యం తగ్గుతుం దన్న ఆశాభావాన్ని రైతులే వెలిబుచ్చారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకపోవటంతో పాటు రైతులకు మంచి జరుగుతుండటం కళ్లెదుటే కనిపించింది. ► నాడు నాగార్జునసాగర్‌ను ఆధునిక దేవాలయం అన్నారు. నేడు ఊరూరా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట ఆధునిక దేవాలయాలుగా వర్ధిల్లుతాయన్న భావన కలిగింది. డీలర్ వద్దకు పరుగెత్తాల్సిన పనిలేదిక ► భూసార పరీక్షలకు తగిన సలహాలు, తోడ్పాటు, వరి విత్తే దశ నుంచి నారుమడి పెంపకం, వరి నాట్లు, ఎదిగిన పైరుకు కావాల్సిన ఎరువులు, చీడ పీడలు, దోమల నివారణకు అవసరమైన పురుగు మందు లపై తగిన సలహాలను ఇవ్వడానికి ఉద్యోగు లు సిద్ధంగా ఉండటం చూసి ముచ్చటేసింది. ► ఏదైనా పంటకు తెగులు ఆశించిందని తెలి యగానే ఇన్నాళ్లూ రైతులు పరుగెత్తుకుంటూ పురుగు మందుల డీలర్ దగ్గరకు ఇక వెళ్లాల్సిన అవసరం లేదే లేదనిపించింది. ► ఇన్నాళ్లూ ఆ వ్యాపారి తన పరిజ్ఞానంతో ఏదో ఒక మందు వాడాలని చెప్పడం.. అది సరిగా పని చేయక రైతులు నష్టపోవడం ఏటా చూశాం. ఇక ఈ పరిస్థితి ఉండదు. ఎరువుల విషయంలోనూ అంతే. వల్లభాపురంలో పలువురు రైతులు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం నాది. సొంతూరు వల్లభాపురంలో వ్యవసాయం చేస్తున్నాను. మండల కేంద్రానికి వెళ్లకుండా, అన్నీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు వనరులు, సలహాలు, శిక్షణ లభించటం గొప్ప విషయం. – లంకిరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు, వల్లభాపురం కాన్సెప్ట్ అద్భుతం.. రైతు భరోసా కేంద్రాల కాన్సెప్ట్ అద్భుతం. చక్కని ముందడుగు. ఎంతోకాలంగా కష్టనష్టాలు పడుతూ వ్యవసాయాన్ని వదులుకోలేక, సాగు కొనసాగిస్తున్నాం. ఏవేవో రాయితీలంటూ ఇచ్చినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. రైతుల అన్ని సమస్యలకు పరిష్కారంగా తోస్తోంది. – కాకర్ల వెంకట కృష్ణయ్య, రైతు, అంగలకుదురు -
అన్ని విత్తనాలు ఇంటి ముంగిట్లో..
ఇది కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామం. గత ఏడాది విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇక్కట్లు పడిన గ్రామాల్లో ఇదొకటి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. విత్తనాల కోసం రైతులు ముందుగానే రైతు భరోసా కేంద్రానికి వెళ్లారు. కోవిడ్19 నిబంధనలకు అనుగుణంగా లైన్లో నిల్చున్నారు. వాళ్ల డాక్యుమెంట్లు చూపించారు. ఏ విత్తనం కావాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.48 గంటల్లో విత్తనాలు పొందారు. ఇది అనంతపురం జిల్లా హిందూపురం మండలం చలివెందల. మారుమూల గ్రామం కావడంతో వేరుశనగ విత్తనం వస్తుందో లేదోనని ఎప్పుడూ బెంగ ఉండేది. ఈ ఏడాది ఎక్కడా భారీ క్యూలు లేవు. కుర్చీల్లో కూర్చోబెట్టి..వరుసగా పిలిచి.. మరీ విత్తన కాయల్ని ఇచ్చి పంపారు. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో రైతులకు వారు ఉంటున్న ఊళ్లోనే విత్తనాలు అందుతున్నాయి. గతానికి భిన్నంగా వేరుశనగ సహా ఏ విత్తనం కోసం క్యూలలో ఎగశ్వాస, దిగశ్వాసతో నిలబడిన ఆనవాళ్లు లేవు. వడదెబ్బతో తల్లడిల్లిన ఘటనలు లేవు. చద్ది మూటతో తెల్లవారుజామునే వెళ్లి లైన్లో నిల్చొని తన వంతు వస్తుందో రాదో అనే ఆందోళన అసలే లేదు. తోపులాటలు లేవు. లాఠీచార్జీలు లేవు. అధికారులో, మాఫియా ముఠాలో ఇచ్చే నాసి రకం విత్తనాలు తెచ్చుకోవాల్సిన పని లేదు. నాణ్యత లేకపోతే తిరిగి ఇచ్చి మంచిది ఇమ్మని అడిగే హక్కు వచ్చింది. అదీ వేరెక్కడో కాదు. సాక్షాత్తు తన ఊళ్లోనే. తన పంచాయతీలోనే.. ఏడాదిలో ఎంత మార్పో. రైతు భరోసా కేంద్రాల వల్లే సాధ్యం తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన రైతు శ్రీనివాస రెడ్డి చెప్పే దాని ప్రకారం రైతు భరోసా కేంద్రాల వల్లే ఇది సాధ్యమైంది. ‘మాకు కావాల్సిన వరి వంగడాల కోసం పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తీసుకుని ఆర్బీకేకి వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకునికి ఇచ్చి నమోదు చేయించాం. 48 గంటల తర్వాత వెళ్లి విత్తనాలు తెచ్చుకున్నాం. ఊళ్లోనే విత్తనాన్ని తీసుకోవడం వల్ల రవాణా ఖర్చులు తగ్గాయి. అన్నింటికి మించి శ్రమ తగ్గింది. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. ఎక్కడో మార్కెట్ యార్డులో పెడితే అక్కడకు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది’ అని చెప్పారు. అనంతపురం జిల్లా బొమ్మేపర్తి మండలం డి.వెంకటరాయుడిదీ ఇదే కథనం. తనకు నాణ్యత లేని విత్తనాలు వచ్చాయని ఫిర్యాదు చేస్తే తిరిగి మంచివి ఇచ్చి వెళ్లారని చెప్పారాయన. ఇంతకు ముందు విత్తనం బాగా లేదంటే మా ఖర్మానికి పడి ఏడ్చే వాళ్లమన్నాడు. 18న ప్రారంభిస్తే 31కి 88 శాతం పూర్తి.. ఇంతకు ముందు ఐదారు రోజులైనా మీడియాలో వార్తలు, కనీసం ఇద్దరు ముగ్గురైనా బలి కానిదే విత్తన పంపిణీ ముగిసేది కాదు. ఈ ఏడాది అలాంటి ఘటనలే లేవు. మే నెల 18న 8.43 లక్షల క్వింటాళ్ల విత్తన పంపిణీ ప్రారంభిస్తే ఎటువంటి అలికిడి లేకుండానే 31వ తేదీ నాటికి 88 శాతం పూర్తయిందంటే అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువ గందరగోళం జరిగే వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి సజావుగా సాగిపోయిందని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. గత ఏడాది 4,42,339 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని సిద్ధం చేసుకుని 3,96,659 మంది రైతులకు 4,04,744 క్వింటాళ్లను పంపిణీ చేశారు. ఈ ఏడాది 5,07,598 క్వింటాళ్ల విత్తనాల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేశారు. విత్తనం కోసం 5,71,549 మంది 4,49,180 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో మే నెల 31నాటికి 4,95,013 మంది రైతులకు 3,94,991 క్వింటాళ్ల కాయల్ని పంపిణీ చేశారు. అంటే మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల్లో వీరు 88 శాతం. గ్రామ స్థాయి విత్తన పంపిణీతో ప్రయోజనాలెన్నో.. – అనంతపురం జిల్లాలో 2,70,913 మంది, చిత్తూరులో 1,51,950 మంది, వైఎస్సార్ కడపలో 30,450 మంది, కర్నూలు జిల్లాలో 41,466 మంది, విజయనగరం జిల్లాలో 234 మంది రైతులు వేరుశనగ విత్తనాన్ని తీసుకున్నారు. ఇంకా ఎవరికైనా విత్తనం కావాలంటే జూన్ 7 వరకు రైతు భరోసా కేంద్రాలలో డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – రాష్ట్రంలోని 9 జిల్లాలలో 13 రకాల వరి వంగడాలకు 3,67,393 మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరికి 2,28,732 క్వింటాళ్ల వరి వంగడాలు కావాల్సి ఉంది. వీరిలో ఇప్పటి వరకు 93,397 మంది రైతులకు 48,061 క్వింటాళ్లను సరఫరా చేశారు. మిగతా వారికి ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు. వరి వంగడాలు కావాల్సిన వారు కూడా ఈనెల 7 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – గతంలో గ్రామాల వారీగా షెడ్యూల్ వేసి మండల స్థాయిలో పంపిణీ చేసేవారు. దీంతో ఇబ్బందులు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామ స్థాయి పంపిణీతో పాత ఇబ్బందులు తొలగిపోయాయి. గతంతో పోలిస్తే విత్తనాల నమోదు, పంపిణీ నేరుగా గ్రామాల్లోనే జరగడం వల్ల రైతులకు శ్రమ, ప్రయాణ, సరఫరా ఖర్చులు తగ్గాయి. – మండలానికి వెళ్లలేని వృద్ధులు, వికలాంగులు గతంలో రాయితీ విత్తనాన్ని పొందే వారు కాదు. ఇప్పుడా పరిస్థితి తప్పింది. గతంలో నాణ్యతా ప్రమాణాల పట్టింపు లేదు. ఇప్పుడు నాణ్యత లేకుంటే విత్తనాన్ని తిరిగి ఇవ్వొచ్చు. అధికారులకు ఫిర్యాదు చేసి మంచివి తెప్పించుకోవచ్చు. – గతంలో సామాజిక తనిఖీ ఉండేది కాదు. ఇప్పుడు అనర్హులు ఎవరైనా విత్తనాన్ని తీసుకుంటున్నారని తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసి చర్య తీసుకోమని కోరవచ్చు. మధ్యవర్తులు, బ్రోకర్లకు తావు లేదు. గ్రామ స్వరాజ్యమంటే ఇదే కదా.. ఈ ఏడాది విత్తనాన్ని గ్రామాల్లోనే సీజన్‌కు ముందే ప్రారంభించి పూర్తి చేశాం. ఇంతకు మించి గ్రామ స్వరాజ్యం ఏమి ఉంటుంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఆర్బీకేలతో వ్యవసాయ విప్లవం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలతో రాష్ట్రంలో వ్యవసాయ విప్లవం మొదలైంది. దళారులు, మధ్యవర్తుల మాటే లేకుండా చేశాం. ముందుగా పేర్లను నమోదు చేసుకోవడం వల్ల అసలు సాగుదార్లు ఎవరో తేలింది. దీనివల్ల దుబారాను అరికట్టగలిగాం. – హెచ్.అరుణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ దూరాభారం తగ్గింది వెల్దుర్తి మండల కేంద్రం నుంచి మా గ్రామం దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉంది. బస్సు సౌకర్యం లేదు. ప్రతి ఏడాది ప్రభుత్వం అందించే విత్తనాల కోసం మండల కేంద్రానికి వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడేవాళ్లం. విత్తనం పొందేందుకు కనీసం మూడు రోజులైనా పట్టేది. పొలం పనులు మానుకోవాల్సి వచ్చేది. గతంలో ఏనాడూ లేని విధంగా ఇలా మే నెలలోనే విత్తనాలు ఇచ్చింది లేదు. వానలు పడినప్పుడే ఇస్తుండ్రి. ఈ సారి మా ఊరి పంచాయతీ (శ్రీరంగాపురం సచివాలయం..అర కిలోమీటర్ దూరం)లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వారం కిందటే 120 కేజీల వేరుశనగ విత్తనకాయలు తీసుకున్నా. అదనపు ఖర్చులేదు, సమయం వృథా కాలేదు. దూరాభారం తగ్గింది. ఇప్పటికే వాటిని ఒలిచి విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. రేపో మాపో పదునైన వాన పడితే విత్తనాలేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎం.ఎల్లరాముడు, లక్షుంపల్లె, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా వ్యయ ప్రయాసలు తొలిగాయి ఈసారి ప్రభుత్వం ఊళ్లోనే విత్తనాలు ఇచ్చి మంచి పని చేసింది. ఇంతకుముందు సబ్సిడీ విత్తనాలు తీసుకోవడం పెద్ద ఇబ్బందిగా ఉండేది. గ్రామం నుంచి వాహనాన్ని బాడుగకు తీసుకుని పోయి..డోన్ మార్కెట్ యార్డులో తెచ్చుకునేవాళ్లం. విత్తనాలు చేతికి అందేందుకు మూడు, నాలుగు రోజులు కూడా పట్టేది. ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గ్రామంలోని రైతు భరోసా కేంద్రం ద్వారా అందజేశారు. వ్యయప్రయాసలు తొలగడమే కాకుండా, సకాలంలో విత్తనాలు వేసుకునే అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – బి.రమణయ్య, వలసల గ్రామం, డోన్ మండలం, కర్నూలు జిల్లా -
రైతుకు భరోసా
-
నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం..
-
ఉరిమే ఉత్సాహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అన్నీ శుభ సూచికలు కనిపిస్తుండటంతో రైతన్నలు ఆనందోత్సాహాలతో ఏరువాక సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ), వాతావరణ నిపుణులు ప్రకటించారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.7,500 చొప్పున జమ చేయడంతో ఖరీఫ్‌లో అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగుకు అన్నదాతలు ఆనందోత్సాహాలతో కదులుతున్నారు. మరోవైపు కల్తీలు, నకిలీలకు ఆస్కారం లేకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నకిలీ విత్తనాలు/కల్తీల వల్ల నష్టపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీన్ని నివారించి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఎంత కావాలన్నా 48 గంటల్లోగా నాణ్యమైనవి సర్టిఫై చేసి సమకూరుస్తోంది. తమ ఊరిలోనే గడప వద్దే విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తాయి. వ్యయ ప్రయాసలు ఉండవు. మరోవైపు ప్రభుత్వం విత్తన చట్టాన్ని పటిష్టం చేసింది. ఎక్కడైనా నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోతే పరిహారం అందేలా విత్తన చట్టాన్ని పకడ్బందీగా రూపొందించింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకుంటే ప్రభుత్వమే ఆర్బీకేలా ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ తమకు మేలు చర్యలు కావడంతో అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని ఆనందంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడం, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలను అనుసరిస్తుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం.. నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకడం ద్వారా భారత్ భూభాగంపై ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈనెల 5వ తేదీ ఏరువాక పౌర్ణమి కాగా దాదాపు సకాలంలో అంటే జూన్ 10వతేదీలోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. గతేడాది జూన్ 16న నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అనుకూల వాతావరణ పరిస్థితులున్నందున నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ‘వచ్చే 12 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. సోమవారం సాయంత్రానికి గానీ రాత్రికిగానీ కేరళను తాకే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. ‘పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు సోమ లేదా మంగళవారం కేరళలో ప్రవేశిస్తాయి. తదుపరి ఇవి జూన్ రెండోవారం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. తదుపరి కోస్తాంధ్ర, తెలంగాణకు విస్తరిస్తాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారించిన తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఒకరోజు అటు ఇటుగా చెప్పవచ్చు’ అని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మంచి సంకేతమే.. ‘ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయి. జూన్ పదో తేదీకల్లా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపనవాలు రాకముందు ఈ సీజన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురవడం రివాజే. ఇలా జరగడం మంచి సంకేతమే’ అని ఐఎండీ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. అరేబియాలో అల్పపీడనం – నేడు, రేపు కోస్తా, సీమలో తేలికపాటి జల్లులు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తుపానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెంమీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
రైతు భరోసా కేంద్రాల ప్రారంభంపై రైతుల హర్షం
-
సీఎం జగన్ సంకల్పం అదే..: ఆదిమూలపు
సాక్షి, ప్రకాశం జిల్లా: అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే 90 శాతం హామీలు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పుల్లల చెరువు మండలం మానేపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘ ఏడాది పూర్తి కాగానే సంబరాలు చేసి కోట్లు ఖర్చు చేయలేదు. ‘మన పాలన- మీ సూచన’ వినూత్న కార్యక్రమం చేపట్టి సూచనలు తీసుకుంటున్నామని’’ చెప్పారు. (చంద్రబాబుపై కేసు నమోదు) యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో నీటి సమస్య అధికమని, కేవలం వర్షాధార పంటలే రైతులు పండిస్తారన్నారు. రైతుల సేవలో రైతు భరోసా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. తీగలేరు కాలువ పనులు కోసం నిధులు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని.. దీనివల్ల పుల్లల చెరువు మండలంలో 11,500 ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. గతంలో రైతే రాజు అంటూ దివంగత మహానేత వైఎస్సార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా రైతును రారాజుగా చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ('టీడీపీ మహానాడు ఓ పెద్ద మాయ') -
అన్నదాతల్లో ఆనందం
సాక్షి, అమరావతి: మీరు ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.. గతంలో మాదిరిగా విత్తనాల కోసం రాత్రింబగళ్లు పడిగాపులు లేవు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వెంటనే మా ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. కౌలు రైతులకూ రైతు భరోసాను అందించారు. మీరు 90 శాతం హామీలను నెరవేర్చామని అంటున్నా ప్రజలు మాత్రం వంద శాతం చేసేశారని సంతృప్తిగా ఉన్నారు.. ఇవీ వివిధ జిల్లాల రైతుల అభిప్రాయాలు. శనివారం క్యాంపు కార్యాలయం నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నవరత్నాలంటే ఓట్లకోసమనుకున్నాం..! రెండెకరాల సొంత పొలంతో కలిపి పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నా. గతంలో నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మేలు జరగలేదు. పాదయాత్రలో మీరు మాఊరు వచ్చినప్పుడు నవరత్నాల గురించి చెబితే ఓట్ల కోసం అందరూ అలాగే చెబుతారనుకున్నాం. రైతులకు ఎవరూ ఏమీ చేయరు, మన బతుకులు ఇలాగే ఉంటాయనుకున్నాం. మీరు సీఎం కాగానే రైతుభరోసా ద్వారా రూ.13,500 మా ఖాతాల్లో వేశారు. మీరిచ్చిన డబ్బులతో వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాం. కరోనా వల్ల వరి కోతకు కూలీలు దొరక్కపోతే మీ ఆదేశాలతో వ్యవసాయశాఖ కోతమిషన్లు ఏర్పాటు చేసింది. దీని వల్ల కూలీ ఖర్చులు తగ్గాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారంలోనే మా ఖాతాలో డబ్బులు జమ చేశారు. గతంలో దళారులకిస్తే రెండు నెలల వరకూ డబ్బులిచ్చేవారు కాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు ఊర్లోనే సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు ఇవ్వనుండటం బాగుంది. మాది శివారు గ్రామం. వైఎస్సార్ హయాంలో కాలువల్లో పూడిక తీశారు. మీరు మరోసారి ఆ సాయం చేస్తే వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కొమ్మన వెంకటరమణ, కాకినాడ రూరల్, గంగనాపల్లి గ్రామం, తూర్పు గోదావరి సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పందిస్తూ వెంటనే రైతు కోరిన మేరకు ఆ ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 90 కాదు.. 100 శాతం! 90 శాతం హామీలు నెరవేర్చామని మీరంటున్నారు. కానీ జనమంతా వంద శాతం చేసేశారని అంటున్నారు. మహిళా సంఘాలకు జీరో వడ్డీ డబ్బులు జమ చేశారు. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరాతో పడిగాపులు కాసే బాధ తప్పింది. కరోనా సమయంలో మీరిచ్చిన బియ్యం, డబ్బులతో ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇబ్బంది లేకుండా గడిపాం. స్కూళ్లు మూసేసిన తర్వాత కూడా అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ఆహారాన్ని అందిస్తున్నారు. మీరు తెచ్చిన అమ్మఒడి వల్ల ఎంతోమంది పేద తల్లులు పిల్లలను చదివించుకుంటూ మిమ్మల్ని దీవిస్తున్నారు. మ దగ్గర గుర్లలో 4 వేల ఎకరాలకు నీరందించే మినీ రిజర్వాయర్‌ను నిర్మించాలని కోరుతున్నా. – చింతాడ అప్పలనర్సమ్మ, గుర్ల తమ్మిరాజుపేట, మెంటాడ, విజయనగరం రైతులకు మీ సేవ అంతా ఇంతా కాదు ఇంతకుముందు రాత్రిళ్లు భుజాన రగ్గు లేసుకుని, క్యారియర్‌లో అన్నం కట్టుకుని విత్తనాల కోసం పడిగాపులు కాసేవాళ్లం. విత్తనాలను దళారీలకు ఇచ్చిన తర్వాతే రైతులకిచ్చేవారు. ఇప్పుడు మా ఇంటికే వచ్చినయ్ సార్ విత్తనాలు. వేలిముద్ర వేసి లైన్లో నిలబడకుండానే వేరు శనక్కాయలు తీసుకున్నాం. ఒక్కసారి రైతులంతా ఎంత ఆనందంగా ఉన్నామో, సంతోషంగా ఉన్నామో చూడండి. మా రైతులకు మీరు చేసిన సేవ అంతా ఇంతా కాదు. రైతులందరి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. రైతు భరోసా డబ్బులు కూడా నాకు అందాయి. గతేడాది వర్షాలు కూడా బాగా పడ్డాయి. ఇది మీ సంకల్పం సార్. – టి.వెంకప్ప, గంతిమర్రి, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం కౌలురైతుకూ భరోసా... నేను కౌలు రైతును. ఐదెకరాలు సాగు చేస్తున్నా. మాకు కూడా రైతుభరోసా డబ్బులిచ్చినందుకు ధన్యవాదాలు. మొక్కజొన్న బస్తా రేటు రూ.1,100 మాత్రమే ఉంటే మార్కెట్ యార్డుల్లో రూ.1,750 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం మూడు, నాలుగు నెలలు తిప్పించుకునేవారు, మీరు వెంటనే అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. నా మేనల్లుడికి అమ్మఒడి ద్వారా డబ్బులిచ్చారు. మా అమ్మకు పింఛన్ ఇంటికే తెచ్చిస్తున్నారు. కంకిపాడు మండలంలో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి. – బి. శివకోటేశ్వరరావు, పెనమలూరు, కృష్ణా జిల్లా ఏడాదిలోనే అన్ని కార్యక్రమాలు నాకు 8 ఎకరాల భూమి ఉంది. వరి, అపరాలు పండిస్తా. మీరు చెప్పినట్లుగానే ఏడాది కాలంలోనే రైతు భరోసాతో పాటు అన్ని కార్యక్రమాలు చేపట్టారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు గ్రామంలోనే దొరికేలా చర్యలు చేపట్టడం బాగుంది. పంటలకు ఇన్సూరెన్స్ కూడా కల్పించడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది. కొబ్బరికి వైట్ ప్లై సమస్యను పరిష్కరించాలి. ఎస్.రాయవరం మండలంలో బ్రిడ్జి నిర్మిస్తే పది గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – దంతులూరి అచ్యుతరామరాజు, గుడివాడ, ఎస్.రాయవరం, విశాఖ రైతు విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దీనిపై మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. -
సాగు విప్లవం మార్పు మొదలైంది..!
సాక్షి, అమరావతి: ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని ఏడాది పాలనలో నిరూపించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 62 శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మార్పులతోనే కాపాడుకోగలుగుతామని, రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటుతోనే ఆ మార్పు మొదలవుతోందని చెప్పారు. విత్తనాల సరఫరా మొదలు రైతులు పంటలు అమ్ముకునే వరకు ఆర్బీకేలు తోడుగా ఉంటాయన్నారు. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులకు అది తప్పనిసరిగా దక్కేలా ఆర్బీకేలు పని చేస్తాయని, అవసరమైతే పంటలు కూడా కొనుగోలు చేస్తాయని వెల్లడించారు. ఈ ఏడాది తొలి సంతకంగా పేర్కొంటూ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్ శనివారం ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 10,641 ఆర్బీకేలను సీఎం ప్రారంభించారు. ఆర్బీకేలలో ఉండే కియోస్క్‌ను కూడా సీఎం ప్రారంభించగా ఓ రైతు దీనిద్వారా తనకు కావాల్సిన విత్తనాలను ఆర్డర్ చేశారు. అనంతరం 155251 ఇంటరాక్టివ్ కాల్ సెంటర్ నెంబరుతో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ (గన్నవరం) ప్రారంభించిన సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగాపురంలోని ఆర్బీకేల పనితీరును సీఎం జగన్ లైవ్ ద్వారా వీక్షించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన ‘సీఎం–యాప్’ను ప్రారంభించి ‘ఆల్ ది వెరీ బెస్ట్’ అని టైప్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చరల్ అసిస్టెంట్లకు ఈ సందేశం ఒకేసారి చేరింది. అనంతరం లోగోను కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద సామాజిక దూరాన్ని పాటిస్తూ 50 మంది చొప్పున రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ.. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతా ఆర్బీకేలలోనే.. విత్తనాలు వేయడం మొదలు పంటల అమ్మకం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఆర్బీకేలను ఏర్పాటు చేస్తున్నాం. వీటిల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. అన్ని అంశాలలో రైతులకు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆర్బీకేలు విజ్ఞాన శిక్షణ కేంద్రాల్లా పని చేస్తాయి. సేంద్రీయ, ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తాయి. సాగుకు ముందే పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి, రైతన్నలకు ఆ ధర దక్కేలా కృషి చేస్తాయి. ఆర్బీకేలలో కియోస్క్ కూడా ఉంటుంది. వాటి ద్వారా రైతులు తమకు కావాల్సినవి కొనుక్కోవడంతోపాటు పంటలు కూడా అమ్ముకోవచ్చు. ఇక్కడ టీవీ, ఇంటర్నెట్ కూడా ఉంటాయి. భూసార పరీక్షలకు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి. 13 జిల్లాల్లో ల్యాబ్‌లు.. 13 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయం ఎక్కువగా ఉన్న 147 నియోజకవర్గాలలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతతో పాటు భూసార పరీక్షలు కూడా నిర్వహించే విధంగా ల్యాబ్‌లలో సదుపాయాలు ఉంటాయి. ఈ–పంట.. ఈ–పంట (క్రాపింగ్) నమోదు ద్వారా పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఇన్సూరెన్సు రిజిస్ట్రేషన్. బ్యాంక్ రుణాల ప్రాసెస్ సేవలు పొందవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు కె.కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, సీఎస్ నీలం సాహ్నితో పాటు, పలువురు అధికారులు, కలెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సీఎం–యాప్‌లో సమస్త సమాచారం.. ఆర్బీకేల్లో ఉండే అగ్చికల్చరల్ అసిస్టెంట్లందరికీ ట్యాబ్‌లు అందజేస్తాం. వాటిలో సీఎం–యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ యాప్) డౌన్లోడ్ చేసి ఉంటుంది. యాప్‌లో అగ్రికల్చరల్ అసిస్టెంట్లు రోజూ పంటల సమాచారం, మార్కెట్ ధరలు, గిట్టుబాటు ధరల కల్పన, అవసరమైతే మార్కెట్ ఇంటర్వెన్షన్ తదితరాలు అప్లోడ్ చేస్తారు. ఆ వెంటనే జిల్లా మార్కెటింగ్ అధికారులతో పాటు ఆర్బీకేల కోసం ప్రత్యేకంగా నియమించిన జాయింట్ కలెక్టర్లు స్పందించి రైతులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంటారు. విత్తనాల సరఫరా మొదలు సాగు మెళకువలు, సలహాలు, సూచనలు అందించడం, పంటల అమ్మకం, గిట్టుబాటు ధరల కల్పన వరకు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. నష్టాల నుంచి బయటపడి లాభం పొందా.. ముందుగా ఏడాది సుపరిపాలన పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు. మేం ప్రధానంగా వరి, పసుపు, వేరుశనగ పండిస్తుంటాం. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాను. చెప్పిన దానికంటే అదనంగా ఐదేళ్ల పాటు ఇస్తామని ప్రకటించడంపై రైతులంతా ఆనందంగా ఉన్నారు. నవంబరులో అకాల వర్షంతో వరి నేలకొరిగింది. పసుపునకు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6,850 చొప్పున ప్రకటించడంతో రైతులే స్వయంగా దళారీ వ్యవస్ధ లేకుండా, తూకంలో మోసం లేకుండా అమ్ముకోగలిగారు. నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడి ఎకరాకు రూ.70 – 80 వేలు లబ్ధి పొందా. మా మండలం పెన్నా రివర్ బెడ్ కాబట్టి ఒక బ్యారేజీ నిర్మించాలని కోరుతున్నా. – శంకర్‌రెడ్డి, రైతు, వైఎస్సార్ జిల్లా దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ వెంటనే రైతు ప్రతిపాదనను నోట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ పథకాలు సంతోషాన్నిస్తున్నాయి రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. రైతు దేశానికి వెన్నెముకలాంటివారు. ఈవిషయం తెలిసిన ఆయన రైతులకు ఎంత మంచి చేయాలో అంతా చేస్తున్నారు. విలేజ్ నాలెడ్జ్ సెంటర్ ప్రోగ్రామ్ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. మహాత్మాగాంధీ చెప్పినట్టు బుద్ధిబలం, కండబలం కలిసి పనిచేయాలి. ఈ నాలెడ్జ్ సెంటర్ద్వారా ఇది నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు మంచి చేస్తున్న ఆయనకు మరోసారి ధన్యవాదాలు. – వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ సందేశం -
రైతు భరోసా కేంద్రాల్లో 14 రకాల సేవలు
-
ఒకేసారి 10,641 రైతు భరోసా కేంద్రాలు
-
రైతు ముంగిటకే సమస్త సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతుల ముంగిటకే, వారు తమ ఊరి నుంచి అడుగు బయట పెట్టకుండానే సాగుకు సంబంధించిన సమస్త సేవలు పొందే వినూత్న వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం నేడు (శనివారం, మే 30) శ్రీకారం చుడుతోంది. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకకాలంలో 10,641 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) శనివారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఆన్లైన్ వీడియో ద్వారా వీక్షిస్తూ వీటిని ప్రారంభించనున్నారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. ప్రభుత్వం తాజాగా ఆవిష్కరించనున్న ఈ వ్యవస్థను రెండో హరిత విప్లవంగా వ్యవసాయ రంగ ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. ఆర్బీకేల ప్రారంభ ప్రక్రియ ఇలా ► రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అన్ని సన్నాహాలు చేసింది. ► 13 జిల్లాల నుండి 13 ఆర్బీకేలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి రైతులతో మాట్లాడతారు. ► జిల్లా కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు పాల్గొంటారు. ► వ్యవసాయ, అనుబంధ శాఖల రైతుల కోసం పెట్టిన సమీకృత కాల్ సెంటర్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారు. తొలి కాల్ చేసి మాట్లాడతారు. ► వ్యవసాయ, అనుబంధ శాఖలు ప్రచురించిన కరపత్రాలు, పోస్టర్లు, చిరు పుస్తకాలు, వీడియోలు, డిజిటల్ సామాగ్రిని ఆవిష్కరిస్తారు. సాగుకు సంబంధించిన ఈ సమాచారం అంతా ఆర్బీకేలలోని లైబ్రరీలలో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. ► రైతు భరోసా కేంద్రాల్లో ప్రధాన పాత్ర పోషించే కియోస్క్ నుంచి ఎవరైనా ఒక రైతు కోసం సీఎం స్వయంగా తొలి ఆర్డర్‌ను నమోదు చేసి సమీపంలోని హబ్‌కు వెళ్లిందో, లేదో పరిశీలిస్తారు. మార్కెటింగ్ శాఖ తయారు చేసిన సీఎం యాప్‌ను ప్రారంభిస్తారు. కర్నూలు జిల్లా పాండురంగపురంలోని ఆర్బీకేలో లభించే సేవలను పరిశీలిస్తారు. ► ఉద్యాన శాఖ– వివిధ అంశాలపై రూపొందించిన– ఆరు రకాల పోస్టర్లను సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రదర్శిస్తారు. ► రాజన్న పశు వైద్యం పేరిట పశు సంవర్థక శాఖ రూపొందించిన పోస్టర్, పశు విజ్ఞాన బడి పుస్తకం, పశువుల ఆరోగ్య సంరక్షణ కార్డులను ఆవిష్కరిస్తారు. గ్రామ సచివాలయాల సమీపంలోనే సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా ఉండే రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల సమీపంలోనే ఉంటాయి. స్థలం దొరకనిచోట అద్దెకు తీసుకున్నారు. కొత్త భవనాలకు ఒక్కో భవనానికి 22 లక్షలు చొప్పున దాదాపు 10, 000 భవనాలకు రూ.2200 కోట్లు ఉపాధి హామీ పథకం నుంచి మంజూరు అయ్యాయి. అంతేకాకుండా 10, 461 ఆర్బీకేలు, 65 హబ్స్, భవనాల మరమ్మతులు, బ్రాండింగ్, అందుకు అవసరమైన సదుపాయాలు, కియోస్క్‌లు, టీవీలు, ఫర్నిచర్, శిక్షణ పరికరాలు ఇంటర్నెట్ ఇతరత్రా అవసరాల కోసం మరో రూ.267 కోట్లకు పైగా వ్యయం చేసినట్టు అంచనా. -
‘రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేస్తాం’
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వాటిని భవిష్యత్తులో మరింత పటిష్టం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొత్తగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు(రైతు భరోసా), ఇతర అనుబంధ శాఖల అధికారులతో మంత్రి కన్నబాబు బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. కొత్త యాప్ ద్వారా రైతు ఎప్పటికప్పుడు పంటల వివరాలు నమోదు చేయ వచ్చని తెలిపారు. 5 లక్షల మంది రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్లను నియమించామని తెలిపారు. మే 30 నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రజా ప్రతినిధులు సందర్శిస్తారని మంత్రి కన్నబాబు తెలిపారు. జూన్ 1 నుంచి వ్యవసాయానికి సంబంధించిన పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. పలు పథకాలతో సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేశారని తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధ రహితమన్నారు. -
సాగు.. బాగైంది!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ప్రకారం రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసి కొండంత అండగా నిలిచారని పలువురు రైతులు, రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆక్వా రైతుల గురించి గతంలో ఏ సీఎం పట్టించుకోలేదని కరోనా విపత్తు సమయంలో ధర నిర్ణయించి దారుణమైన పరిస్థితి నుంచి గట్టెక్కించారని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ గిరిజనులకు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ మీరు (సీఎం జగన్) పట్టాలు ఇస్తున్నారని ఓ ఆదివాసీ మహిళా రైతు కృతజ్ఞతలు తెలిపింది. ‘మన పాలన– మీ సూచన’లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మేధోమధన సదస్సులో పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రైతులకు భరోసాతోపాటు ఆత్మగౌరవం.. సీఎం గారు చెప్పిన విషయాలన్నీ ఆకళింపు చేసుకుంటే మేం అడిగేందుకు ఇంకేమీ మిగలలేదు. గ్రామ స్ధాయి పరిపాలన సుస్ధిరంగా ఏర్పాటు చేస్తే గ్రామ స్వరాజ్యం సాకారమవుతుంది. రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్ల వృధా భూములున్నాయి. ఏటా పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి. రైతులు పండించే పంటలో కనీసం 30 శాతం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం. రైతుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు గ్రామ స్ధాయిలో చేస్తున్నారు. సచివాలయాల ఏర్పాటు ద్వారా వేల ఉద్యోగాలను ఎలాంటి అవినీతికి తావులేకుండా చేపట్టారు కాబట్టి నిజాయితీగా పనిచేస్తున్నారు. రైతులకు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూస్తుంటే భరోసాతో పాటు ఆత్మగౌరవాన్ని కూడా ఇనుమడింప చేస్తున్నారు. రైతుల కోసం పట్టణాల్లో రాజన్న వసతి గృహాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలి. – రాఘవరెడ్డి, రిటైర్డ్ వైస్ చాన్స్‌లర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదివాసీలను ఆదరించారు.. మా ఆదివాసీ బిడ్డకే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు. గ్రామ సచివాలయాల ద్వారా గిరిజన సమాజానికి పాలన అందించే ఘనత మీకే దక్కింది. గిరిజన ప్రాంతాల్లో పండించే చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు మిల్లెట్స్ బోర్డు పెట్టారు. అటవీ హక్కుల చట్టం గురించి 30వ తేదీన క్యాలెండర్లో పొందుపర్చారు. ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానిస్తే వలసలు తగ్గుతాయి. – పడాల భూదేవి, హిరమండలం, శ్రీకాకుళం జిల్లా మన బలం వ్యవసాయమే.. చాలా రాష్ట్రాలు పరిశ్రమలు అంటూ ముందుకు వెళ్తున్నాయి. మనం వ్యవసాయంలో ముందున్నాం. దానిమీద మనం దృష్టి సారించాలి. మన బలం మీదే దృష్టి కేంద్రీకరించాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌తో మన అరటి, ఏపీ క్వాలిటీ సర్టిఫికెట్తో మిరప ఎగుమతి కావాలి. ప్రపంచంలో నాణ్యతతో కూడిన ఎగుమతిదారుగా ఏపీ గుర్తింపు పొందాలి. అతిపెద్ద వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కేంద్రంగానూ గుర్తింపు రావాలి. వ్యవసాయం, జనాభా, పరిమాణంలో మనం వియత్నాంను పోలి ఉంటాం. ఆ దేశం సాధించిన విజయాన్ని మనం కూడా కచ్చితంగా సాధించగలుగుతాం. ఐదారు క్లస్టర్లను ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించాలి. – సంజీవ్, డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఐటీసీ మత్స్యకారులకు బాసట.. గత ప్రభుత్వంలో మత్స్య భరోసా కింద రూ.4వేలు ఇచ్చేవారు. అది చాలామందికి వచ్చేది కాదు. మీరు సీఎం అయిన తరువాత రూ.10 వేలు అందరి ఖాతాల్లో పడింది. గత ప్రభుత్వంలో రూ.6 డీజిల్ సబ్సిడీ ఇస్తుండగా మీరు దాన్ని రూ.9 చేశారు. దీనివల్ల మా కుటుంబానికి నెలకి రూ.3 – 4 వేల ఆదాయం వస్తోంది. వేటకు పోయి మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇచ్చేవారు. మీరు దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. గుజరాత్‌కు వలస వెళ్లిన 6 వేల మంది మత్స్యకార్మికులను బస్సుల్లో తీసుకొచ్చి రూ.2 వేల చొప్పున ఇవ్వడం గొప్ప విషయం. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్భర్ మా కల, దాన్ని నెరవేరిస్తే మా మత్స్య కారులు ఇటు చెన్నై, కర్ణాటక, గుజరాత్ వలసపోవాల్సిన అవసరం ఉండదు. – కోమరి రాజు, కావలి, నెల్లూరు, జిల్లా ఈయనేం చేస్తాడనుకున్నాం.. బీటెక్ చదివి సాప్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం చేస్తున్నా. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అనే అభిప్రాయాన్ని మాపై రుద్దాయి. మీరు నవరత్నాలు ప్రకటించినప్పుడు ఈ రాష్ట్రంలో గత పాలకులు ఏం మిగిల్చారు? ఇక ఈయనేం చేస్తాడని అనుకున్నాం. మీమీద నమ్మకంతో తక్కువ పెట్టుబడితో సాగయ్యే చిరుధాన్యాలను ఎంచుకున్నాం. మీరిచ్చిన రైతు భరోసా డబ్బులు 90 శాతం పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడ్డాయి. ఒకప్పుడు రైతునని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ రోజుల నుంచి ఇవాళ నేను రైతునని మీ వల్ల గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. – వెంగళరెడ్డి, మార్కాపురం, ప్రకాశం రైతు భరోసా డబ్బులతో విత్తనాలు కొంటున్నా.. రైతుభరోసా డబ్బులతో విత్తనాలకు డబ్బులు కట్టి ఈ సభకు వచ్చా. రైతుభరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వల్ల మాకు ఏ సమస్య వచ్చినా వెంటనే తెలుసుకోగలగుతున్నాం. తెగుళ్లకు సరైన మందులు తెలుసుకోగలుగుతున్నాం. మినీ గోడౌన్స్ కట్టుకునేందుకు రైతులకు సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. – బెల్లాన బంగారినాయుడు, గరికవలస, గుర్ల మండలం. విజయనగరం జిల్లా అరటికి ఆదరణ.. కోవిడ్ నేపథ్యంలో అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోయి ఉండేవాళ్లు. రానున్న రోజుల్లో అరటి విస్తీర్ణం బాగా పెరుగుతుంది. చీనీ బెల్ట్‌లో కూడా అరటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పుడ్ ప్రాసెసింగ్‌తో పాటు విదేశాలకు ఎగుమతి పెంచాలి. పులివెందుల ప్రాంతంలో ఎర్రవెల్లి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ల కొరత ఉంది. వాటిని మంజూరు చేయాలి. జీలుగ, జనుము సబ్సిడీ రూపంలో ఇచ్చే ఏర్పాటు చేయాలి. – బలరామ రెడ్డి, వైఎస్సార్ జిల్లా, అరటి రైతు అడగకుండానే గ్రహించిన దేవుడు.. మీరు సీఎం కాగానే ఆక్వా రైతులకు కరెంట్ యూనిట్ రూపాయిన్నరకే ఇచ్చి గొప్ప మేలు చేశారు. ప్రభుత్వం మీద భారం పడుతున్నా మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. కోవిడ్ సమయంలో రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి. అప్పుడు మీరు ఆదుకోకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేవి. నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నానంటే మీరు నిర్ణయించిన ధర వల్లనే. అడగక ముందే ఎరిగిన వాడు దేవుడు. ఆ దేవుడే మీ రూపంలో రాష్ట్రానికొచ్చాడు. మరెన్నో కాలాలు మీరే సీఎంగా ఉండి పేద ప్రజలను ఆదరించాలి. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో చదువుతున్న నా కుమార్తెకు రీయింబర్స్మెంట్ కూడా వచ్చింది. – గంగాధరం, ఆక్వారైతు, చల్లపల్లి గ్రామం, ఉప్పలగుప్తం, తూర్పుగోదావరి ఈ సమయంలో సీఎం జగన్ స్పందిస్తూ ఆక్వా రంగంలో ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఇంతవరకు జరగలేదన్నారు. ‘ఆక్వా రంగంలో సిండికేట్ సమస్య ఉంది. ఫీడ్, మార్కెట్ ఈ రెండు అంశాల మీద వీటి ప్రభావం ఉంది. వీటిని కట్టడి చేయడం కోసం, రైతులకు తోడుగా నిలబడేవారిని ప్రోత్సహించేందుకు ఐక్యూఎఫ్ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దానివల్ల స్టోరేజీ కెపాసిటీ పెరిగితే తప్పనిసరిగా రేటును మనం నియంత్రించే స్థితి వస్తుంది. దీన్ని కచ్చితంగా చేస్తాం’ అని పేర్కొన్నారు. నాణ్యమైన ఉత్పత్తులు అవసరం.. అగ్రికల్చర్ బీయస్సీ చదివి కేపిఎంజి సంస్ధలో పనిచేస్తున్నా. రైతు భరోసా కేంద్రాలు పునాదిలాంటివి. తక్కువ పురుగుమందుల అవశేషాలతో నాణ్యమైన దిగుబడి సాధించే వారికి అవార్డులు ఇవ్వాలి. – గోపీనాథ్ కోనేటి, కడప, కేపీఎంజీ ప్రైవేట్ లిమిటెడ్ -
ఇది రైతు రాజ్యం
రైతుల కష్టాలను నా పాదయాత్రలో స్వయంగా చూసి మేనిఫెస్టోను రూపొందించాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్నదాతలను ఎలా ఆదుకోవాలో ఆలోచించాం. పంటల సాగు వ్యయాన్ని తగ్గించగలిగితే రైతులు లాభపడతారు. గిట్టుబాటు ధర లభించినప్పుడే సాగు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం ఎందాకైనా వెళ్తుంది. ఇందులో భాగంగా రైతుల కోసం విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టాం. అన్నదాతలపై పెట్టుబడి భారాన్ని తగ్గించడానికే వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టాం. ఏడాదిలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. జూలైలో రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తాం. గత ఏడాది కన్నా మిన్నగా ఈ సంవత్సరం రైతులకు మంచి జరిగేలా ముందుకు వెళ్తాం శీతల గిడ్డంగులు, గోదాములు, ప్యాకింగ్ యూనిట్లు గ్రామాల్లోకి రాబోతున్నాయి. ఏడాది కాలంలో ఈ పనులు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి గ్రామంలో జనతా బజార్ ఏర్పాటు చేస్తున్నాం. రైతులు పంటలతోపాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముతారు. గుడ్లు, చేపల నుంచి అన్నీ అమ్ముతారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుంది. రైతులకు మంచి ధర లభిస్తుంది. పంట నష్టపోతే రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు పరిహారాన్ని ఇవ్వాలి. అప్పుడే వాటికి ఒక విలువ ఉంటుంది. అందుకే ప్రభుత్వమే స్వయంగా ఇన్సూరెన్సు ప్రక్రియను నడపాలని నిర్ణయం తీసుకున్నాం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది పాలనను గమనిస్తే ఇది రైతు రాజ్యమని ఎవరికైనా అర్ధమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీల చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తాను గట్టిగా విశ్వసించే వ్యక్తినని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెండో రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మేధోమథన సదస్సులో మాట్లాడారు. రైతులు, రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన ‘మన పాలన– మీ సూచన’ మేధోమథన సదస్సులో మాట్లాడుతున్న ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ రాఘవరెడ్డి చెప్పిన దానికంటే మిన్నగా... మనం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి చూశాక రైతులకు అంతకుముందు చెప్పిన విధంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లు రూ.13,500 చొప్పున రైతు భరోసా ద్వారా ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు అమలు చేశాం. ఈ పథకం ద్వారా రైతులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సమయంలో సంక్రాంతి సందర్భంగా మరో రూ.2 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని గొప్పగా అమలు చేశాం. గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టాం కాబట్టి మే నెలలో ఇవ్వలేకపోయామనే ఉద్దేశంతో రబీలో రైతులకు సాయం చేశాం. రైతు భరోసాతో ఇప్పటివరకు ఎంతిచ్చామంటే.. 2019–20లో అంటే గత ఏడాది రైతు భరోసా ద్వారా 46.69 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,534 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. ఈ ఏడాది మే నెలలో అంటే 2020–21కి సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.3,675 కోట్లు రైతుల ఖాతాల్లోకి రూ.7500 చొప్పున బదిలీ చేశాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.10,209.32 కోట్లు రైతులకు అందచేశాం. అది కూడా పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాలో వేశాం. రుణమాఫీ పేరుతో టీడీపీ ఏం చేసింది? రైతులకు రూ,87,612 కోట్ల మేర రుణమాఫీ చేస్తానన్న గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఏడాది కూడా పూర్తి కాకముందే దేవుడి దయతో రూ.10,209.32 కోట్లు రైతులకు అందచేసింది. ఇన్సూరెన్స్ బాధ్యత కూడా తీసుకున్నాం శనగ రైతులకు 2012–13 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కింద రూ.112 కోట్లు ఇచ్చాం. బీమా కంపెనీలు డబ్బులు తీసుకుంటాయి కానీ పరిహారం సక్రమంగా ఇవ్వవు. అందుకే ప్రభుత్వమే స్వయంగా బీమా నిర్వహిస్తూ రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని, మిగతాది ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ ప్రక్రియ కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో పగలే 9 గంటల విద్యుత్తు గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ‘రూ.8,645 కోట్లు బకాయి పెట్టింది. ఆ మొత్తాన్ని మేం కడుతున్నాం. ఏటా ప్రభుత్వంపై దాదాపు రూ.8,800 కోట్ల భారం పడుతున్నా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇక 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలంటే ఫీడర్లపై రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబితే అధికారంలోకి రాగానే ఇచ్చాం. దీంతో దాదాపు 82 శాతం ఫీడర్ల ద్వారా పగలే 9 గంటల విద్యుత్‌ను ఈ ఖరీఫ్‌లో ఇవ్వగలుగుతాం. రబీ నాటికి మిగిలిన 18 శాతం ఫీడర్ల కింద కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తాం. మార్కెట్ యార్డుల్లో సామాజిక న్యాయం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెట్ యార్డులను 191 నుంచి 216కు పెంచాం. మార్కెట్ యార్డుల పదవుల్లో సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేశాం. చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం.. ప్రమాదవశాత్తూ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సాయం అందిస్తున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 417 మంది రైతులు చనిపోతే పట్టించుకోలేదు. ఆ కుటుంబాలకు మేం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఈ తర్వాత చనిపోయిన మరో 229 మంది రైతులకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. పశువులకూ బీమా.. ‘బీమాను కేవలం రైతులకు, పంటలకే మాత్రమే కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు కూడా వర్తింపచేస్తున్నాం. ఆవులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు, గొర్రెలకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాం. రైతుల పొలాల వద్దే పంటను కొనుగోలు చేస్తూ దళారీల వ్యవస్థను ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఆర్బీకేలో రైతులకు అన్నీ.. ► రాష్ట్రంలో ఈనెల 30వతేదీన ప్రారంభమయ్యే 10,641 రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. వీటిద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నాణ్యమైనవి విక్రయిస్తాం. వీటిని ప్రభుత్వం సర్టిఫై చేస్తుంది. గ్యారంటీ కూడా ఇస్తుంది. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది. ► ఆర్బీకేల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా జేసీని నియమించాం. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యం చేసుకుని రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం ఆర్బీకే నుంచి ప్రారంభం అవుతుంది. వీడియో ప్రదర్శన.. ► సదస్సుకు ముందు ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు వ్యవసాయ రంగం సమస్యలు, పరిష్కారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, కౌలు రైతులకు చేస్తున్న మేలుపై కార్యక్రమంలో వీడియో ప్రదర్శించారు. సదస్సులో మంత్రులు కన్నబాబు, బొత్స, మోపిదేవి, తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితోపాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రైతులు, బ్యాంకు అధికారులు, నిపుణులు పాల్గొన్నారు. రైతులకు ఇంకా ఇంకా.. ఆక్వా రైతులకు మేలు చేసేందుకు అధికారంలోకి రాగానే యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేశాం. దాదాపు 1.2 లక్షల సర్వీసులకు సరఫరా చేస్తూ రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నాం. ► పెట్టుబడి ఖర్చు తగ్గించడంతో పాటు రైతులకు పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. కేంద్రం మరో రూ.2 వేల కోట్లు ఇస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు నాలుగు నెలల్లోనే 67,874 మంది రైతులకు పంట నçష్టం కింద వెంటనే రూ.55 కోట్లు ఇచ్చేశాం. ► కడపలో శనగ రైతులు ఇబ్బంది పడుతుంటే క్వింటాలు రూ.1,500 చొప్పున 30 క్వింటాళ్లు కొనుగోలు చేసి ఒక్కో రైతుకు రూ.45 వేలు అందించాం. ► ఉల్లి ధరలు పెరిగినప్పుడు దాదాపు 80,522 క్వింటాళ్ల ఉల్లిని సేకరించి రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాం. ► ఈసారి పంటలు బాగా పండినా కోవిడ్ కారణంగా విక్రయించలేని పరిస్థితి. దీంతో రూ.1,100 కోట్లు వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. ► వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను, టోల్ రద్దు చేశాం. కరోనా సమయంలో అరటి రైతులను ఆదుకునేందుకు పంట కొనుగోలు చేసి రాష్ట్రమంతా పంపిణీ చేశాం. ఏది.. ఎంత కొనుగోలు? దాదాపు 773 మెట్రిక్ టన్నుల ఉల్లి, 12 వేల మెట్రిక్ టన్నుల అరటి, 1,425 మెట్రిక్ టన్నుల టమాటా, దాదాపు 3,600 మెట్రిక్ టన్నుల బత్తాయిలు కొనుగోలు చేశాం. ఇలా గతంలో ఏనాడూ జరగలేదు. 2,36,136 టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు రూ.416 కోట్లు ఖర్చు చేశాం, ఇంకా కొనుగోలు చేస్తున్నాం. 50,672 మెట్రిక్ టన్నుల కందుల కోసం రూ.294 కోట్లు, 1,40,548 మెట్రిక్ టన్నుల శనగలకు రూ.685 కోట్లు, 19.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రూ.3,634 కోట్లు రబీలో ఖర్చు చేశాం. వీటన్నిటికీ కేవలం వారం పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ► రూ.164 కోట్లతో 64,405 టన్నుల జొన్నలు, 6,706 టన్నుల పసుపు రూ.46 కోట్లతో కొన్నాం. 5.60 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రైతులకు కనీస గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గత 8 నెలల్లో రూ.2,200 కోట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్లో పెట్టాం. దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు రూ.12,677 కోట్లు ఖర్చు చేశాం’. ► ‘గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించాం. విత్తన బకాయిలు దాదాపు రూ.384 కోట్లు ఇచ్చాం. ఆయిల్‌పామ్ రేటు తెలంగాణలో ఎక్కువ ఉంది. కానీ ఏపీలో తక్కువగా ఉండడంతో తొలిసారిగా ఈ రైతులను ఆదుకునేందుకు రూ.80 కోట్లు ఇచ్చాం. ► గత దశాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. 2018–19లో 150 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగా ఈ ప్రభుత్వం వచ్చాక 172 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వచ్చింది. వ్యవసాయం పండగైంది.. గతంలో విత్తనాల సీజన్లో తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనాలను గ్రామ స్ధాయిలోకి తేవడంలో మీరు చేసిన కృషి గొప్పది. ఇందులో గ్రామ సచివాలయాల పాత్ర కీలకం. పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తుండటంతో పంటను కాపాడుకోగలుగుతున్నాం. కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు అదనపు లాభం పొందుతున్నారు. పంటలు విక్రయించిన వారం రోజుల్లోగానే మా అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మీరొచ్చాక వ్యవసాయం పండుగలా మారింది. – మారుతీప్రసాద్, అనంతపురం జిల్లా -
తగ్గుతున్న వెరీ యాక్టివ్ క్లస్టర్లు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఏడాది కాలంలో సాగిన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, కార్యక్రమాలపై సమీక్ష.. రాబోయే నాలుగేళ్లలో చేపట్టాల్సిన పనులకు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకూ ‘మన పాలన–మీ సూచన’ పేరుతో మేధోమథన సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం ఆయన చేతుల మీదుగా జరుగుతుందన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ► ప్రజా ప్రభుత్వంలో ఏడాది పాటు సాగిన పాలన, పనితీరు ఏ విధంగా ఉంది. రాబోయే రోజులకు సంబంధించి ప్రజలు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై ఐదు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ► ఏడాదిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలు, చేపట్టిన పథకాలు, పనితీరుపై లబ్ధిదారులు, సమాజంలోని ముఖ్య నాయకులు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి తరహాలో కార్యక్రమాలుంటాయి. ► 25న పాలనా వ్యవస్థలో వికేంద్రీకరణ, గ్రామ, వార్డు స్థాయిలో వచ్చిన మార్పులు, గ్రామ సచివాలయాలు, పరిపాలన వికేంద్రీకరణ కోసం తీసుకున్న చర్యలపై మేధోమథనం ఉంటుంది. ► 26న వ్యవసాయం, రైతులు, వ్యవసాయ పనిముట్లు, పెట్టుబడులు, విద్యుత్, సాగునీరు, ఆక్వా, పశు సంవర్ధకం వంటి రంగాల్లో జరిగిన మేలు, ప్రజా సూచనలపై చర్చ. ► 27న విద్యా రంగంలో తెచ్చిన పెను మార్పులు, విద్యను అభ్యసించే పద్ధతిలో వచ్చిన మార్పులు, తల్లులకు కల్పించిన సేవలు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య వంటి అన్ని అంశాలపై లబ్ధిదారులు, నిపుణులతో మేధోమథనం. ► 28న పరిశ్రమలకు సంబంధించిన మౌలిక వసతులు, నైపుణ్యాల పెంపు, వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ఆయా రంగాలకు ఏవిధమైన వసతులు వచ్చాయనే దానిపై సమీక్ష. లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► 29న ఆరోగ్య వ్యవస్థపై మేధోమథనం. ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులు, ఆరోగ్య వ్యవస్థ, వైద్య విద్యలో సంవత్సర కాలంగా జరిగిన పనులు, కలిగిన లబ్ధి, రాబోయే రోజులకు సూచనలు తీసుకుంటాం. కోవిడ్‌పైనా సమీక్ష ఉంటుంది. ► 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం సీఎం జగన్ చేతుల మీదుగా జరుగుతుంది. ► రాష్ట్ర స్థాయిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ మూడు గంటలపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ► ప్రతిరోజూ ఉదయం పథకాల లబ్ధిదారులు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడి.. వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకూ అవే అంశాలపై జిల్లాల్లో ఇన్చార్జి మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, లబ్ధిదారులు, నిపుణులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ► ఆ జిల్లాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజల నుంచి సూచనలు తీసుకుంటాం. 13 జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుని.. వాటన్నింటినీ క్రోడీకరించి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ► ప్రతి రంగానికి సంబంధించి ప్రజల సూచనలు తీసుకుని రాబోయే రోజులకు లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకెళ్లడం వీటి ఉద్ధేశం. ప్రతిరోజూ కార్యదర్శులు ఆయా రంగాలపై క్లుప్తంగా నివేదికలు ఇస్తారు. అనంతరం ప్రజలు, లబ్ధిదారులు, నిపుణుల సూచనలు తీసుకుంటాం. ► ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమంగా దీనిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతరం ప్రజల అభిమతాలను పరిగణనలోకి తీసుకోవాలనే ధృక్పథంతో ముందుకెళుతున్నాం. -
పెట్టుబడి సాయం రైతు భరోసా
-
అన్నదాతకు..భరోసా కేంద్రాలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. ఆర్బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ఓ వినూత్న వ్యవస్థ ఏపీలో పురుడు పోసుకోనుంది. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరించే ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం 73 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇదే ప్రథమం అని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఏం ఆలోచించారో.. దానిని దేశం ఎల్లుండి అనుసరిస్తుందనే దానికి నిదర్శనంగా రైతు భరోసా వ్యవస్థ ఉండబోతుంది. ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయ స్థాయి వ్యవసాయ విధాన నిర్ణేతలను ఆకర్షించిన తరుణంలో ప్రస్తుతం దీనిపై పలు రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ తాను సైతం అన్నట్టుగా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మొదలు పేరుగాంచిన వ్యవసాయ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ వరకు ఎందరెందరో ఈ వ్యవస్థ విధివిధానాలను చర్చిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన 11 సంస్థలు సేవలందించనున్నాయి. అన్నదాత ఇంటి ముంగిటకే సాగుకు సంబంధించిన అన్ని రకాల సేవలు అందించడానికి గ్రామ సచివాలయాలకు అనుబంధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఈ నెల 30న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాల పనితీరు, అందించే సేవల వివరాలు ఇలా ఉన్నాయి. అన్ని సేవలూ అందుబాటులో.. ► నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు.. ఇతరత్రా అన్నీ గ్రామంలోనే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవి సమగ్ర వ్యవసాయ సేవా కేంద్రాలుగా ఉంటాయి. గ్రామ సచివాలయాల సమీపంలోనే ఇవి ఉంటాయి. అక్కడ స్థలం దొరక్కపోతే మరోచోట అద్దెకు తీసుకుంటారు. ► నియోజకవర్గంలో ఏర్పాటయ్యే అగ్రీ ల్యాబ్స్‌లో పరీక్షించి, ధ్రువీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని క్షేత్ర స్థాయిలో రైతులకు అందిస్తుంది. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు ఉత్తమ సాగు విధానాలు, ఇతరత్రా సూచనలు, సలహాలు ఇస్తారు. ► షాపులో అందుబాటులో ఉండే ఎరువులు, విత్తనాలు.. తదితరాలను అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు. సరసమైన ధరకు ఇక్కడ అందజేస్తారు. ► కియోస్క్ ద్వారా రైతు తనకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తే 48 నుంచి 72 గంటల్లో సరఫరా చేస్తారు. భూసార పరీక్ష చేయించుకునే సౌకర్యం ఉంటుంది. ► ఆర్బీకేలో అంతర్భాగంగా విజ్ఞాన కేంద్రం ఉంటుంది. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించి, సాగును లాభసాటిగా చేయడమే దీని ఉద్దేశం. ఇందులో భాగంగా రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. ఆడియో, వీడియోల సాయంతో మెళకువలు నేర్పుతారు. సేంద్రీయ ఎరువులైన జీవామృతం, ఘనామృతం, వేపాకు కషాయం వంటి వాటి తయారీలో శిక్షణ ఇస్తారు. ఏ ఎరువు ఎందుకు అవసరమవుతుందో చెబుతారు. నాలుగైదు ఊళ్లకు ఒక అగ్రీ హబ్ ► రైతు భరోసా కేంద్రాల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇతరత్రాలు అగ్రీ హబ్‌ల నుంచి సరఫరా అవుతాయి. వీటి నుంచి సరుకు రైతు భరోసా కేంద్రాలకు.. అక్కడి నుంచి రైతులకు వెళుతుంది. నాలుగైదు గ్రామాలకు ఒక హబ్ ఉంటుంది. ► ఆర్బీకేలలో అమ్మే ఉత్పాదకాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆదేశం. ఈ కేంద్రాలలో కొన్న విత్తనం మొలకెత్తకపోయినా, పురుగు మందు పని చేయకపోయినా, రైతులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ల్యాబ్‌లు, ఇన్పుట్ షాపులు, నాలెడ్జ్ సెంటర్లపై బాధ్యత మరింత పెరుగుతుంది. ► ఈ షాపులు వస్తే రైతు బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సెంటర్లుగా కూడా పని చేస్తాయి. ఈ షాపుల్లోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, రైతులకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. డిజిటల్ కియోస్క్ నుంచే ఆర్డర్ల నమోదు ► రైతు భరోసా కేంద్రాలు రెండు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. ఒకటి డిజిటల్ కియోస్క్, రెండవది వర్క్‌షాప్, శిక్షణ విభాగం. ఎవరైనా రైతు ఈ కేంద్రంలోని డిజిటల్ కియోస్క్‌ను ఆన్ చేస్తే వ్యవసాయ ఉత్పాదకాలకు సంబంధించి ఆయా కంపెనీల ఉత్పత్తులు, వాటి ధరలు టెలివిజన్ తెరపైన కనిపిస్తాయి. ► రైతులు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, తదితరాలను క్లిక్ చేస్తే ఆర్డర్ తయారవుతుంది. అది సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి వెళుతుంది. జిల్లాకు 5 చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో కేంద్రానికి కొన్ని పంచాయితీలలోని రైతుల వివరాలను అనుసంధానం చేస్తారు. ► వర్క్‌షాపుల ద్వారా భూసార పరీక్షలు, వివిధ అంశాలపై వీడియోల ప్రదర్శన, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో రూ.2 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను (ట్రాక్టర్‌తో ఉపయోగించేవి) అందుబాటులో ఉంచి నామమాత్రపు అద్దెకు ఇస్తారు. ► పంటల బీమా, ఇ–కర్షక్‌లో పంట నమోదు వంటి సేవలు లభిస్తాయి. పశు సంవర్థక శాఖ సేవలు సైతం లభిస్తాయి. పశు ఆరోగ్య సంరక్షణ కార్డు, ప్రాథమిక చికిత్స, ఉచిత పశువుల బీమా వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. రైతులకు వివిధ సేవలందించే జాతీయ సంస్థలు ఇవే.. ఎం ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై – ఐసీఏఆర్, వ్యవసాయ విస్తరణ విభాగం, న్యూఢిల్లీ – భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ, న్యూఢిల్లీ – జాతీయ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ, వారణాశి – సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, హైదరాబాద్ – జాతీయ పాడి పరిశోధన సంస్థ, కర్నాల్ – ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణే – సదరన్ రీజియన్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్, బెంగుళూరు – సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్, భువనేశ్వర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, హైదరాబాద్. -
ప్రధాన మార్కెట్లు 24 గంటలు తెరవాలి
సాక్షి, విశాఖపట్నం : కరోనా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లను రేపటి నుంచి 24 గంటల పాటు తెరవాలని ముఖ్యమత్రి ఆదేశించారన్నారు. అలాగే ఈ నెల 15న రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసాకి అర్హతలు ఉండి నమోదు చేసుకోనివారికి ఈ నెల పది వరకు అవకాశం కల్పించామని చెప్పారు. -
మరింత సక్సెస్‌పుల్‌గా టెలి మెడిసిన్..
సాక్షి, అమరావతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో బైకులను వీలైనంత త్వరగా అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంటనే ఇందుకు అవసరమైన బైకులు కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. డాక్టర్లు ప్రిస్కిప్షన్ ఇవ్వగానే 24 గంటల్లోగా మందులు అందేలా చూడాలని, దీని కోసం సిబ్బందికి బైకు, థర్మో బ్యాగులు కూడా తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులతో చర్చించారు. (మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే! ) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టెలి మెడిసిన్‌ను మరింత విజయవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు పూర్తి చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై మాట్లాడిన వైఎస్ జగన్ పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు కూడా దీంట్లో భాగమని తెలిపారు. కోవిడ్-19 కాకుండా ఇతర కేసులు ప్రతి రోజు ఎన్ని వస్తున్నాయన్న దానిపై వివారాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. (గ్యాస్ దుర్ఘటనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ లాక్డౌన్ సడలింపుల అనంతరం విదేశాల్లో చిక్కుకుపోయిన వారు దేశంలోకి వచ్చే కార్యక్రమం ప్రారంభమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గల్ఫ్ నుంచే కాకుండా యూకే, యూఎస్ నుంచి కూడా కొంత మంది వచ్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రానికి వచ్చే వారందరికీ క్వారంటైన్ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారంటైన్ కేంద్రాలు బాగుండేలా చూడాలన్నారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్న 75 వేలకు పైగా పడకలను ముందస్తుగా వినియోగించుకోవాలని, వాటి సంఖ్యను 1 లక్ష వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు. 75 వేల క్వారంటైన్ పడకలు వినియోగించినా, మిగిలినవి స్పేర్‌లో ఉంచాలని, వాటన్నింటిలో ఏ లోటు లేకుండా సదుపాయాలు కల్పించాలని, క్వారంటైన్లలో సదుపాయాలను మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదేశించారు. వ్యవసాయంపై సమీక్ష బత్తాయి రిటైల్ అమ్మకాల్లో ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇవ్వాలన్న అధికారుల సూచనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. పసుపు, మొక్కజొన్నకు కనీస మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుండగా, పక్క రాష్ట్రాలలో ధరలు అమలు చేయకపోవడంతో అక్కడి నుంచి రైతులు ఆ పంటలు తీసుకువస్తున్నారని అధికారులు సీఎంకు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న తక్కువ ధరకే వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి పసుపు, మొక్కజొన్న ఇక్కడికి వస్తే రాష్ట్రరైతులకు నష్టం వస్తుందని, దానిని నివారించాలని అధికారులు కోరారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. (ఏం జరిగింది పెద్దాయనా?) రైతు భరోసా పథకంలో మిగిలిపోయిన వారెవరైనా ఉంటే 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మరుసటి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మండల వ్యవసాయ అధికారులు ఇచ్చే పాస్‌లు అనుమతించాలని అధికారులకు ముఖ్యమంత్రికి సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తెరుచుకుంటున్న దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మాస్కులు ధరించేలా అవగాహన కలిగించాలన్నారు. ఇప్పటికి 6 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం మాస్క్‌లు పంపిణీ చేసిందని, ప్రతిరోజూ 42 లక్షల మాస్క్‌ల తయారీ చేస్తుందని వివరించారు. (మహారాష్ర్టలో లాక్డౌన్ పొడిగింపు! ) ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష రాష్ట్రంలో అదనంగా మరో ఫిషింగ్ హార్బర్, 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతిచ్చారు. విజయనగరం జిల్లాలో ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించనున్నారు. దీంతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం 9కి చేరనుంది. వీటితో పాటు విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, నక్కపల్లిలో మరో 2 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల సంఖ్య 3కు పెరిగింది. (విషాదం: ఛిద్రమైన వలస కార్మికుని కుటుంబం ) -
వ్యవసాయ సలహా మండళ్లు
ప్రతి ఊళ్లో ఏయే పంటలు ఎంత మేర పండించాలన్న దానిపై రైతులతో కలిసి కూర్చుని చర్చించి నిర్ణయించాలి. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆ మేరకు కార్యాచరణ ఉండాలి. ఈ నేపథ్యంలో రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్,విద్యుత్ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలి. ఏ ఊరిలో ఏ పంట వేస్తే మార్కెట్లో మంచి ధర వస్తుందనే విషయాన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అవగాహన కలిగించాలి. గత ప్రభుత్వం ఏ రోజూ వ్యవసాయం మీద దృష్టి పెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాం. రైతులకు అన్ని విధాలా న్యాయం చేకూర్చే విషయమై విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంత చేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాల్సిందే. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమం కోసం మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి, ఏ పంటలకు ఎంత డిమాండ్ ఉంటుందన్న ముందస్తు అంచనాతో వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మార్కెట్ల స్థితిగతులను పరిశీలించి, భవిష్యత్ డిమాండ్ అంచనాను శాస్త్రీయంగా విశ్లేషించి.. నమ్మకమైన సలహాలను అందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. తద్వారా ఏ పంటలు ఎంత మేర సాగు చేయాలని రైతులే నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులు, మార్కెటింగ్, ధరలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు వివరించారు. ఇదే సమయంలో కృష్ణా జిల్లాల్లో బస్తాకు కొంత ధాన్యం మినహాయించుకుంటున్నారని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. అందరం ఉన్నా ఇలా జరిగిందా.. ► బస్తాకు కొంత ధాన్యం మినహాయిస్తున్నారని కృష్ణా జిల్లా రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు లపై సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ విధంగా ఎలా మినహా యిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నా సరే.. ఇలాంటి ఘటనలు చోటు చేసు కోవడం సరికాదన్నారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునే పరిస్థితి వద్దన్నారు. ► వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరు కోవద్దని, అన్యాయం చేసే వారిని ఉపేక్షిం చరాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఫలితాలు రావాల్సిందే ► పంటలను రోడ్డు మీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవి. అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదు. ► చీనీ, అరటి, టమాటా, మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలి. వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల మార్కెటింగ్‌లో సమస్యలు రాకూడదు. ► సమీక్షలో సీఎస్ సాహ్ని, మంత్రి కన్న బాబు, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. ధర ముందుగానే ప్రకటించాలి ► వ్యవసాయ సలహా మండళ్లు రాష్ట్రం, జిల్లా, మండలం స్థాయిలో ఏర్పాటు కావాలి. ఈ మేరకు వెంటనే కార్యాచరణ రూపొందించాలి. ► రాష్ట్ర స్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు జిల్లా స్థాయి బోర్డులకు.. అక్కడి నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి. ► పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, ఆ రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతుంది. ► పంటలను ఇ– క్రాపింగ్ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి వాటిని కొను గోలు చేయడం.. ఈ ప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృ తంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలి. -
రైతులకు క్రెడిట్, డెబిట్ కార్డులు
సాక్షి, అమరావతి: రైతులకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అందించడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ఈ–పంట’తో అనుసంధానిస్తూ రైతుల క్రెడిట్ కార్డు ఉండాలని, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు వారికి డెబిట్ కార్డు ద్వారా అందించాలని సూచించారు. ఈ ఖరీఫ్ నాటికి రాష్ట్రంలో రైతులకు 56 లక్షల క్రెడిట్ కార్డులు, 56 లక్షల డెబిట్ కార్డులను సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న కియోస్క్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. కియోస్క్ రైతులకు విజ్ఞాన కేంద్రంలా పని చేస్తుందని అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. రైతులకు మరింత మేలు ► క్రెడిట్, డెబిట్ కార్డు వల్ల రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. రైతులెవరికీ తమ డబ్బు చేతికి రాదనే భయం ఉండకూడదు. సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి కార్డు చూపగానే డబ్బులు రైతుల చేతికిచ్చేలా ఉండాలని సీఎం పేర్కొన్నారు. ► ఈ క్రాప్‌కు లింక్ చేస్తూ క్రెడిట్ కార్డు ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు డెబిట్ కార్డు ద్వారా రైతులకు అందాలి. కొత్తగా క్రెడిట్ కార్డులు ఇవ్వడంతోపాటు కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాలి. ఆర్బీకేలు సిద్ధం.. ప్రత్యేక యాప్ ► రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు కానుండగా ఇప్పటికే 10,592 భవనాలను గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. జూన్ 1 కల్లా అన్నీ సిద్ధ్దమవుతాయన్నారు. వీటిపై రైతుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. సేకరణ, మార్కెట్ ఇంటెలిజెన్స్, గ్రేడింగ్, ప్యాకింగ్ కూడా ఆర్బీకేకు లింక్ చేసేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం పేర్కొన్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ జరిగితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ► ఆర్బీకే యాండ్రాయిడ్ యాప్ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. యాప్‌లో సర్వీసెస్ (కాల్‌సెంటర్) కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద పొలం బడి, పశు విజ్ఞాన బడి పేరుతో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా అధికారులు వివరించారు. ఆక్వాకూ కాల్ సెంటర్ ► ఆక్వా రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆక్వా రైతులకు కూడా కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి చోటా ఆక్వా టెస్టింగ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. కిట్లు సిద్ధం కావాలి.. ► విత్తనాల నాణ్యత, భూసార పరీక్ష కిట్లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విత్తనాలు మంచి నాణ్యతతో ఉండాలని, కాలపరిమితి ముగిసినవి ఎట్టి పరిస్ధితుల్లోనూ విక్రయించకుండా చూడాలని స్పష్టం చేశారు. నాణ్యమైనవి, సర్టిఫై చేసిన విత్తనాలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ రైతు నష్టపోకూడదని చెప్పారు నాణ్యత పరీక్ష విధానంపై అధికారుల నుంచి సీఎం వివరాలు సేకరించారు. తయారీదారుల వద్ద కూడా క్వాలిటీ టెస్టింగ్ జరగాలని సీఎం ఆదేశించారు. విమర్శలకు తావులేకుండా పారదర్శకంగా విత్తనాల కంపెనీల నుంచి కొనుగోళ్లు జరగాలన్నారు. ప్రకృతి సేద్యంపై దృష్టి సారించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. మెరుగ్గా మార్కెట్ యార్డులు ► మార్కెట్ యార్డులను మరింత మెరుగ్గా వినియోగించుకోవడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జనతా బజార్లను మార్కెట్ యార్డ్‌లతో అనుసంధానించేలా చూడాలన్నారు. ► సమావేశంలో వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
20 వేలకు పైగా వైఎస్సార్ జనతా బజార్లు
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించాం. ప్రతి నిత్యావసర వస్తువును దాదాపు ప్రతిగడప వద్దకూ చేర్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు పెద్ద ఎత్తున మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆ మేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చూడాలి. మొత్తంగా మ్యాపింగ్ చేయాలి. వైఎస్సార్ జనతా బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే.. ప్రజలకు తక్కువ ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయి. ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో 20 వేలకు పైగా వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఇవి అతి పెద్ద స్థానిక మార్కెట్లుగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. వైఎస్సార్ జనతా బజార్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్ చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇందులో భాగంగానే అటు రైతులు, ఇటు ప్రజలకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేలా జనతా బజార్లకు రూపకల్పన చేశామని చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం సలహాలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. జనతా బజార్లతో అతి పెద్ద నెట్వర్క్ ► రాష్ట్రంలో 11 వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వైఎస్సార్ జనతా బజార్లను ఏర్పాటు చేయాలి. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలి. మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలి. ► దాదాపు 20 వేల జనతా బజార్లతో పెద్ద నెట్వర్క్ ఏర్పడుతుంది. ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలి. పాలు, పళ్లు, కూరగాయలు తదితరాలను నిల్వ చేసి విక్రయానికి అందుబాటులో పెట్టాలి. ► వీటి వద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్ వ్యాన్స్ కూడా పెట్టాలి. ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ట్రక్కు ఉండాలి. ప్రతి రోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి. మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఉపయోగపడతాయి. మార్కెట్లో జోక్యానికి అవకాశం ► జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుంది. మార్కెట్లో జోక్యం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా, రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది. తద్వారా గ్రామాల స్వరూపాలు మారిపోతాయి. ► ప్రతి గ్రామంలో గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలి. తద్వారా గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుంది. ► ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్ షిప్ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలి. వైఎస్సార్ జనతా బజార్ల ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తాం. -
రైతుభరోసా వచ్చేసింది
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద రాష్ట్రంలోని రైతులకు తొలివిడతగా రూ.2వేలు జమచేయడం ప్రారంభమైంది. 46.5 లక్షల మందికి పైగా రైతు ఖాతాలకు శుక్రవారం నుంచి ఈ నిధులు జమచేయడం మొదలైందని.. 15లోగా అర్హులైన రైతులందరి ఖాతాలకు నగదు చేరుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పథకం కింద వ్యవసాయ ఉత్పాదకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.13,500 పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్‌లో సగం, రబీలో మిగతా సగం నగదు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తితో ఎదురైన ప్రస్తుత విపత్కర పరిస్థితులలో రైతులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా.. ► కేంద్రం వివిధ రాష్ట్రాలకు తొలి విడతగా రూ.15,841 కోట్లు విడుదల చేసింది. ► ఇందులో ఏపీకి కేటాయించిన రూ.920 కోట్లలో దాదాపు రూ.660 కోట్లు వివిధ బ్యాంకులకు చేరాయి. ► మిగతా మొత్తం ఒకటి రెండ్రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. బ్యాంకులకు జాబితాలు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన నోడల్ అధికారిగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్.. లబ్ధిదారుల జాబితాను బ్యాంకులకు పంపారు. దీంతో బ్యాంకర్లు ప్రస్తుతం తమ వద్దకు వచ్చిన నిధులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదార్లు, దేవదాయ భూముల సాగుదారులు సహా రాష్ట్రవ్యాప్తంగా 46,50,846 మందికి గత రబీలో ప్రభుత్వ సాయం అందింది. ఇప్పుడు మళ్లీ ఖరీఫ్, రబీలలో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ‘ఖరీఫ్’ మొత్తం చెల్లించేందుకు సర్కారు సన్నాహాలు ఇదిలా ఉంటే.. వచ్చే జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రి కన్నబాబు చెప్పారు. రైతులను అన్ని విధాల ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాగా, వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ యోజన కింద ప్రస్తుతం జమచేస్తున్న నగదును తీసుకునేందుకు రైతులు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. రూపే కార్డులు, ఏటీఎంలు, గ్రామాల్లోని బ్యాంకు మిత్ర ద్వారా నగదును డ్రా చేసుకోవచ్చని.. తప్పని పరిస్థితుల్లో బ్యాంకుల వద్దకు వెళ్తే భౌతిక దూరాన్ని పాటించాలని రైతులకు కన్నబాబు విజ్ఞప్తి చేశారు. -
సకాలంలో రైతులకు చెల్లింపులు
కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల గురించి ఆ మీడియా కథనాల్లో రాయరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.8 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే అందులో రూ.6 వేల కోట్లు చెల్లించింది. ఇక మిగిలింది కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే. కేంద్రం నుంచి దాదాపు రూ.4,500 కోట్ల బకాయిలు రాకున్నా రూ.2 వేల కోట్లు అప్పు చేసి మరీ రైతులకు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళో, రేపో రైతుల బకాయిలు ఎలాగూ క్లియర్ అవుతాయి కాబట్టి.. దానికి ముందే చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని చెబుతాడు. దానిని ఆయన మీడియా తల కెత్తుకుంటుంది. వాస్తవాలు ఏమిటన్నది మాత్రం ఆయనా చెప్పడు. వాళ్లూ రాయరు. గతంలో చంద్రబాబు పెండింగ్‌లో పెట్టిన రూ.960 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించిందన్న విషయం కూడా ఆ కథనాల్లో రాయరు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడకుండా చూడాలని, సకాలంలో చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్‌లో రాబోయే సమస్యలను ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుకు ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడంలో శ్రద్ధాసక్తులు చూపించాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన హార్టికల్చర్, సెరికల్చర్, రైతు భరోసా కేంద్రాలపై అధికారులతో సమీక్షించారు. ధాన్యం బకాయిలపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు. ఈ దుష్ప్రచారం కొత్తేమీ కాదని, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.4,500 కోట్ల గురించి చంద్రబాబు మాట్లాడరని, ఆయన నోటి నుంచి ఈ మాట కూడా రాదని ఎద్దేవా చేశారు. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతతో రైతులకు న్యాయం చేసే దిశగా అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం అరటి, చీని, టమాటా, మామిడి, ఉల్లి, కొబ్బరి మార్కెటింగ్‌కు సంబంధించి ప్రతి ఏడాది ఏదో రూపంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు దక్కక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి పంటల విషయంలో రైతులకు మేలు జరిగేలా శాశ్వత పరిష్కారం చూడాలి. ఈ పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. అవి వచ్చేలోగా కోల్డ్ స్టోరేజీ సదుపాయాన్ని పెంచుకునేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఏటా ఒక పంటను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా కార్యాచరణను అమలు చేయండి. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించాలి. ఆహార శుద్ధి పరిశ్రమలు, యూనిట్లు పెట్టి రైతులను ఆదుకోవాలి. అరటి, చీని, టమాటా, కొబ్బరి, ఉల్లి, మామిడి పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తుల కోసం శాశ్వత సర్టిఫికేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. అరటి అనుబంధ ఉత్పత్తులపై ఐజీ కార్ల్‌లో ఓ సంస్థ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా అడుగు వేయాలి. పులివెందుల ఐజీ కార్ల్‌లో వ్యవసాయం, దాని అనుబంధ సంస్థల్లో అరటి అనుబంధ ఉత్పత్తులపై ఓ సంస్థను ఏర్పాటు చేయాలి. అరటి అనుబంధ ఉత్పత్తులపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలి. సోలార్ కోల్డ్ స్టోరేజ్ రూం సహా ఏది చేసినా సంతృప్త స్థాయిలో చేయండి. మండలాన్నో, నియోజకవర్గాన్నో యూనిట్‌గా చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపడితే సత్ఫలితాలు వస్తాయి. కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్ని తెల్లదోమ ఆశించినట్టు తెలుస్తోంది. దీని నివారణకు ఏయే చర్యలు చేపట్టాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. ఈ ఏడాది లక్ష్యంగా నిర్ణయించుకున్న 50 వేల టన్నుల పండ్ల ఉత్పత్తుల ఎగుమతిని పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలి. స్వయం సహాయక సంఘాలతో తేనె ఉత్పత్తులను ప్రోత్సహించి గిరిజనులకు న్యాయం చేయండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా నిలవాలి రాష్ట్రంలో 3,300 రైతు భరోసా కేంద్రాలు సిద్ధమయ్యాయని చెప్పినప్పుడు సీఎం వైఎస్ జగన్ అధికారుల పని తీరును ప్రశంసిస్తూ ఈ కేంద్రాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాక వ్యవసాయం సహా ఉద్యానవన పంటల సాగులో వినూత్న మార్పులు తీసుకురావాలన్నారు. ఏయే వంగడాలు సాగు చేయాలన్న దానిపై రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించాలని, వచ్చే ఖరీఫ్ నాటికి అన్ని కేంద్రాలు సిద్ధం కావాలని చెప్పారు. ‘వ్యవసాయ సిబ్బందికి ఇచ్చే ట్యాబ్‌లతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలా చూడాలి. ఇ–క్రాపింగ్‌ను పూర్తి చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దీనిపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామ సచివాలయంలో మద్దతు ధరల పోస్టర్ ఉండాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే విత్తనాలు నాణ్యంగా ఉండాలి. ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలి. -
మనసుతో చూడండి
నేను గ్రామాల పర్యటనకు వెళ్లే సరికి ఇంటి పట్టా మాకు రాలేదన్న మాట ఏ ఒక్క అర్హుని నుంచి వినిపించకూడదు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత చురుగ్గా పని చేయాలి. లక్షల మంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను సాకారం చేయడం కోసం వచ్చే రెండు వారాలు అధికారులు ఇళ్ల స్థల పట్టాలకు సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తల్లిదండ్రుల కమిటీల్లోని ముగ్గురు సభ్యులు ప్రతిరోజూ స్కూల్లో పరిస్థితులను పరిశీలించాలి. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి. ఆకస్మిక తనిఖీలు చేయించాలి. దీనిపై కలెక్టర్లు ఫోకస్ పెట్టాలి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కొత్త మెనూ బాగా అమలవుతోంది. అందుకు అందరికీ అభినందనలు. సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి. పక్కాగా పరిశీలిస్తుంటే లోపాలు తెలిసి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ఉన్న లోపాలను వచ్చే స్పందన నాటికి సరిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. రైతు భరోసా, పింఛన్లు తదితర పథకాల కింద లబ్ధిదారుల జాబితాలో పేర్లుండి, పంపిణీ పెండింగ్‌లో ఉన్న వారికి తక్షణమే డబ్బు అందించాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై మంగళవారం ఆయన సచివాలయం నుంచి ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వివిధ పథకాల పురోగతిని సమీక్షించారు. ‘సంక్షేమ పథకాలు అందలేదంటూ కొన్ని వినతులు వచ్చాయి. సమయం ముగిసి పోవడం వల్లో, సాంకేతిక కారణాల వల్లో వారికి అంది ఉండకపోవచ్చు. ఇలాంటి వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. రైతు భరోసా కింద ఇంకా పెండింగ్‌లో ఉన్న 21,750 మంది రైతులకు వెంటనే డబ్బు చెల్లించాలి. అమ్మఒడి కింద 42,33,098 మందికి డబ్బు చెల్లించగా, ఇంకా 11,445 మందికి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మానవతా దృక్పథంతో ఈ కేసులను క్లియర్ చేయండి. కలెక్టర్లు సానుకూల దృక్పథంతో ఉండాలి. మిగిలిన పథకాల్లో కూడా పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా పరిష్కరించండి. అర్హత ఉన్నప్పటికీ నాకు పథకం అందలేదనే మాట ఎక్కడా వినిపించకూడదు’ అని సీఎం సూచించారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని, అందువల్ల పంపిణీకి కొంత సమయం పడుతుందని చెప్పారు. మార్చి ఆఖరులోగా పంపిణీ పూర్తవుతుందన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 6.14 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ‘కొత్తగా మనం 6,14,244 మందికి పింఛన్లు ఇచ్చాం. అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. వెరిఫికేషన్ చేసి, అర్హత ఉందని తేలిన వారికి జనవరి నెల పింఛన్ కూడా ఫిబ్రవరి నెల మొత్తంతో పాటు ఇస్తాం. అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్నా పరిశీలించి ఐదు రోజుల్లో పింఛన్ కార్డు ఇస్తాం. గ్రామ సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన వివరాలు నోటీసు బోర్డుల్లో పెట్టాం. ఈ నెల 17వ తేదీ నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయించి 18వ తేదీకల్లా అప్లోడ్ చేయించాలి. 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించి, 20న తుది జాబితా ప్రకటించాలి. మార్చి ఒకటో తేదీన కార్డుతోపాటు పెన్షన్ ఇవ్వాలి. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అర్హులెవరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదు. ఈ నెల 18 నాటికి రీ వెరిఫికేషన్ పూర్తి కావాలి. ఒకవేళ ఎవరికైనా బియ్యం కార్డు రాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా పరిశీలించి అర్హులైతే కార్డు ఇస్తాం. స్పందన కార్యక్రమంపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల స్థలాలపై ప్రత్యేక దృష్టి నివాస స్థల పట్టాలకు సంబంధించి కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల వినతులు వస్తే 1.30 లక్షల మందికి పట్టాలు మంజూరు చేశారు. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులు పెండింగ్‌లో ఉన్నట్టు చూస్తున్నాం. పూరి గుడిసెలో ఉన్నవాళ్లకూ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం సమంజసం కాదు. గ్రామ వలంటీర్ ద్వారా తనిఖీ చేయించి ఇళ్ల పట్టాలు పొందడానికి అర్హులని తేలితే, జాబితాలో చేర్పించి పట్టా ఇవ్వాలి. 25 లక్షల మంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టించి అడ్డుకోవాలని టెలికాన్ఫరెన్స్‌ల్లో వారి పార్టీ నాయకులను ఉసిగొల్పుతున్నారు. భూముల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్–బి కూడా కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలి. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. మన ముద్ర ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పట్టాల పంపిణీ సందర్భంగా ఉగాది పర్వదినం రోజు 25 లక్షల కుటుంబాల్లో పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూపోతాం. కంటి వెలుగును విజయంతం చేయాలి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కంటి వెలుగును విజయంతం చేయాలి. నేత్ర పరీక్షల కోసం నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటి వెలుగు మూడోవిడత ‘అవ్వాతాత’ కార్యక్రమాన్ని ఈ నెల 18న కర్నూలులో ప్రారంభిస్తాం. ఇందులో నేను కూడా పాల్గొంటా. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన చేస్తాం. 4,906 సబ్ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4,472 సబ్ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలు గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనుల ప్రారంభానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి. 24న జగనన్న వసతి దీవెన ప్రారంభం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ఈనెల 24న విజయనగరంలో ప్రారంభిస్తాం. ఉన్నత చదువులు చదువుతున్న వారికి ఇది అండగా నిలుస్తుంది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.20 వేలు రెండు విడతలుగా ఇస్తాం. దీని కింద 11,87,904 మందికి లబ్ధి చేకూరుతుంది. 53,720 ఐటీఐ చదువుతున్న వారికి రూ.5,000 చొప్పున రెండు విడతలుగా ఏడాదిలో రూ.10 వేలు ఇస్తాం. 86,896 మంది పాలిటెక్నిక్ చదువుతున్న వారికి రూ. 7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15,000 ఇస్తాం. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న 10,47,288 మందికి రూ.10 వేల చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. ఈ పథకం కింద మొత్తం రూ.1,139 కోట్లు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. కాగా, నేత్ర శస్త్ర చికిత్స చేయించుకుంటే 25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థుల నేత్ర శస్త్రచికిత్సలను వేసవి సెలవుల నాటికి వాయిదా వేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పర్యవేక్షణకు యాప్‌ను తీసుకొస్తున్నామని వివరించారు. – గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల చిరునామాల మ్యాపింగ్ ముఖ్యమైన కార్యక్రమం. గ్రామ వలంటీర్ల చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అడ్రస్ మ్యాపింగ్ సరిగ్గా చేయని కారణంగా పెన్షన్లు ఇవ్వడానికి కొన్ని చోట్ల సమయం పడుతోంది. మ్యాపింగ్ పక్కాగా ఉంటే చకచకగా పింఛన్లు పంపిణీ చేయొచ్చు. వచ్చే నెల పెన్షన్ల పంపిణీ మొదటి రెండు రోజుల్లోనే పూర్తి కావాలి. – వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి. – చిన్న చిన్న షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు మార్చిలో ఏడాదికి రూ.10 వేలు అందించే పథకం ప్రారంభిస్తాం. – కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలోనే ప్రారంభిస్తాం. మార్గదర్శకాలు తయారు చేసి వలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి. – ఈ ఏడాది ఖరీఫ్ కల్లా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాలి. ప్రతి 2 వేల జనాభాకు సంబంధించిన వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి. ఇ– క్రాపింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి. ఈ కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి. ఈ కేంద్రాల నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలి. – ఎక్కడైనా రైతులు ఆత్మహత్య చేసుకుంటే కలెక్టరు తప్పకుండా అక్కడకు వెళ్లాలి. పరిహారం అందని మృతుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలి. ఈ విషయంలో ఎలాంటి జాప్యం ఉండరాదు. – 2014 నుంచి 2019 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో పరిహారం అందని 422 మంది కుటుంబాలకు ఈ నెల 24న పరిహారం అందించాలి. – స్కూళ్లలో మనం చేపడుతున్న నాడు – నేడు కార్యక్రమం పనులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? చూడండి. – మధ్యాహ్న భోజనంలో నాణ్యత, స్కూళ్లలో బాత్రూంల నిర్వహణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ అధికారిని పెట్టాం. – అధికారులు కూడా గ్రామాలను సందర్శించాలి. – ఏ సంక్షేమ పథకం విషయంలోనూ రాజకీయాలు, పార్టీలు చూడకూడదు. ఎలాంటి వివక్షా చూపకూడదు. అర్హులకు ఇవ్వలేదన్న మాట రాకూడదు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ఇలా.. – రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరూ అర్హులు – ఈ నెల 15 నుంచి ప్రారంభించి మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో పూర్తి – 15 నుంచి కర్నూలు, వైఎస్సార్, విశాఖపట్నం, శ్రీకాకుళం – మార్చి 7 నుంచి అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు – మార్చి 25 నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం – మొత్తం 1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్‌తో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులు -
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరణ
సాక్షి, అమరావతి : రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల కొనుగోలు బుకింగ్ చేసుకునే వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. సమావేశంలో కొనుగోలు కేంద్రాలు మరింత సమర్థవంతంగా నడవటానికి సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్, కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, సీఎస్ తదితరులు పాల్గొన్నారు. ('భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలు కావాలి') కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా చూడాలి అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన ధరల పట్టిక ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరలకన్నా తక్కువకు కొనుగోలు చేస్తే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఎక్కడ రైతు నష్టపోయినా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు. దీనికోసం సరైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రైతులనుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా సిబ్బందిని ఉంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతం శనగలు, కందులు మార్కెట్లోకి వస్తున్నాయన్నారు. పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరల రేట్లను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని, అలాగే కొనుగోలు కేంద్రాల వివరాలు కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను కొన్న తర్వాత రైతులకు డబ్బులు వెంటనే అందేలా చూడాలని సూచించారు. రైతుకు కచ్చితంగా కనీస మద్దతు ధరలు రావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ( ఎన్ రామ్‌తో సీఎం జగన్ మాటామంతి) రైతుల్లో చైతన్యం తీసుకు రావాలి వారానికోసారి కచ్చితంగా సమావేశం పెట్టుకుని రైతులకు అందుతున్న ధరలపై సమీక్ష చేయాలని, నాలుగు వారాలకోసారి తనతో సమావేశం కావాలని ముఖ్యమంత్రిసూచించారు. ఇది ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి అలసత్వం జరిగితే రైతుకు తీవ్ర నష్టం కలుగుతుందని, రైతుల్లో చైతన్యం తీసుకు రావాలని తెలిపారు. వచ్చే నెలకల్లా పరిస్థితిలో మొత్తం మార్పులు రావాలని, లేదంటే సంబంధిత అధికారులను కచ్చితంగా బాధ్యుల్ని చేస్తానని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పంటను అమ్ముకునే సమయంలో రైతులకు చిన్న ఇబ్బంది కూడా రాకూడదని స్పష్టం చేశారు. ఈ కీలక అంశాలను అధికారులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలని, ఈ క్రమంలో ఆర్థికంగా ప్రభుత్వానికి నష్టం వచ్చినా పర్వాలేదని తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళంలో గోడౌన్ల సమస్యను మిషన్ సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై అధికారులు దృష్టిపెట్టాలని ఆదేశించారు. కొత్త గోదాముల నిర్మాణం జరిగేంత వరకూ ప్రత్యామ్నాయాలు చూడాలన్నారు. (రాయిటర్స్ కథనాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం) గోదాముల, కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి ‘‘‘వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాలను ఓన్ చేసుకోవాలి. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలి. పశుసంవర్థకం, హార్టికల్చర్, ఫిషరీస్ రంగాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొత్త ఊపు ఇవ్వాలి. విత్తనాలు, ఎరువుల నాణ్యత పరీక్షలు పక్కాగా ఉండాలి. రైతులు నాణ్యమైన విత్తనాలను కోరుకుంటున్నారు. వాటిని అందించడానికి దృష్టిపెట్టాలి విత్తన కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా చూడాలి. నకిలీ విత్తనాల కేసులను సీరియస్‌గా తీసుకోవాలి. పశువులకు వైద్యం అందిస్తున్న విధానాలపై దృష్టి పెట్టాలి. మందులు వాడకుండా పాలు ఉత్పత్తిచేసే వారిని పోత్సహించాలి. అలాంటి పాలకు గిట్టు బాటు ధరలు మరింత పెంచాలి. ఆర్గానిక్ మిల్క్ పేరిట ఈ పాలను అమ్మేందుకు చర్యలు తీసుకోవాలి. అన్ని పశువులకూ ట్యాగ్ వేయాలి’’ అని సీఎం వైఎస్ జగన్ అదికారులను ఆదేశించారు. ఎరువులు, విత్తనాల కంపెనీలను నుంచి మంచి సానుకూల స్పందన ఉందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఈకంపెనీలకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయని, ఆమేరకు ధరలు తగ్గించి ఎరువులు, విత్తనాలు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు కచ్చితంగా వినూత్న విధానాలకు దారితీస్తాయన్నారు. వ్యవసాయ శాఖలోనే లీగల్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎంకు వెల్లడించారు. యూనివర్శిటీ సిఫార్సులు ప్రకారం బెంగాల్ గ్రామ్ విత్తనాలను పూర్తిస్థాయిలో సప్లై చేస్తున్నామని అధికారులు అన్నారు. -
ఫిబ్రవరి నుంచి ఫించన్ల డోర్ డెలివరీ
-
ఫిబ్రవరిలో రాజన్న పశువైద్యం ప్రారంభం
సాక్షి, అమరావతి: రాజన్న పశువైద్యం ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత ప్రారంభించనున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో ఇది అందుబాటులోకొస్తుంది. మొదట రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న పశువైద్యాన్ని కూడా అప్పటి నుంచే మొదలుపెట్టాలని పశు సంవర్థక శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే.. రైతు భరోసా కేంద్రాలను ఫిబ్రవరి 28న ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచే రాజన్న పశువైద్యం కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 3,200 పశు వైద్యశాలలే ఉండటంతో పశువులకు, ఇతర జీవాలకు వైద్యం అందించడానికి పోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 నుంచి 30 కిలోమీటర్ల నిడివిలో కొన్ని ప్రాంతాల్లో పశు వైద్యశాలలు ఉండటంతో వ్యాధులకు గురైన పశువులకు చికిత్స అందించడానికి, ఆస్పత్రులకుతరలించడానికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి గ్రామంలోనూ పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని, ఈ మేరకు రానున్న రెండేళ్లలో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతమున్న పశువైద్యశాలల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి విడత 3,300 రైతు భరోసా కేంద్రాల్లో.. తొలి విడత ప్రారంభం కానున్న 3,300 రైతు భరోసా కేంద్రాల్లో రాజన్న పశువైద్యాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేసింది. పశువులకు చికిత్స అందించడానికి షెడ్లు, మందులు, మెడికల్ కిట్స్, పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు, చాఫ్ కట్టర్లు, పాలు పితికే యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఖాళీగా ఉన్న 9,886 మంది పశు వైద్య సహాయకులను నియమించేందుకు ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు 5,612 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 2,944 మంది ఉత్తీర్ణులు కావడంతో వారిని ఉద్యోగాల్లో నియమించింది. వీరితోపాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారిని 3300 రైతు భరోసా కేంద్రాల్లో నియమించారు. వీరు వైద్యసేవలు అందించడంతోపాటు పశువులకు సమతుల పోషకాహార కార్యక్రమాలు, పశుఆరోగ్య సంరక్షణ కార్డులు, కిసాన్ కార్డులు, పశుగ్రాస లభ్యత, పశు నష్టపరిహారం పథకాన్ని అమలు చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. -
ఇంటింటా పింఛన్ల పండుగ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 54.64 లక్షల మందికిపైగా పేదలకు మేలు చేకూరుస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటివద్దే పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు పింఛన్లు 39 లక్షలు మాత్రమే ఉండగా ఇప్పుడు 54.64 లక్షల మందికిపైగా పెన్షన్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. తద్వారా కొత్తగా 15.64 లక్షల మందికి పింఛన్లతో ప్రయోజనం కలగనున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామ, పట్టణ వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పందన ద్వారా అందే దరఖాస్తుల్లో దాదాపు 60 శాతం వరకు బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. స్పందనలో అధికారులు బాగా పనిచేశారని చాలామంది ప్రశంసించారన్నారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ... 15 నుంచి కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యం కార్డులు ‘‘వైఎస్సార్ నవశకం ద్వారా కొత్తగా బియ్యం కార్డులు, పెన్షన్ అర్హుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఫిబ్రవరి 15వతేదీ నుంచి 21 వరకు వీటి పంపిణీని పూర్తి చేయాలి. నిర్దేశిత సమయానికి కార్డులు ప్రింట్ చేసి పంపిణీకి సిద్ధం చేయాలి. సామాజిక తనిఖీ ఫిబ్రవరి 2 కల్లా పూర్తి కావాలి. ఆ వెంటనే కార్డుల పంపిణీ చేపట్టాలి. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా కొత్త కార్డుల మంజూరు జరుగుతుంది. ఇళ్ల స్థలం లేదని ఎవరూ చేయి ఎత్తకూడదు.. అర్హులైన పేదలందరికీ ఉగాదికి ఇళ్ల స్థలాల పట్టాలను మంజూరు చేయాలి. 25 లక్షల మంది మహిళలకు వారి పేర్లతో రూ.10 స్టాంపు పేపర్‌పై ఇళ్లపట్టాలు జారీ చేస్తాం. లాటరీ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలి. ఫిబ్రవరి 15 లోగా ఇళ్ల పట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలి., ప్రజాసాధికార సర్వేకి, ఇళ్ల పట్టాల మంజూరుకు ముడిపెట్టకూడదు. గతంలో ఇళ్లు పొందిన వారి వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న 2006 ఏడాది వివరాలతో సరిపోల్చి చూడాలి. గ్రామాల్లో నా పర్యటన సందర్భంగా ఇళ్ల స్థలాలు లేవని ఎవరూ చేతులు ఎత్తకూడదు. ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలాలకు మెజార్టీ లబ్ధిదారులు అంగీకారం తెలపాలి. మొక్కుబడిగా ఇస్తే ఎవరూ అక్కడ ఉండేందుకు ఇష్టపడరని గుర్తుంచుకోవాలి. మనం ఇచ్చే ఇళ్ల స్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి. స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి. లబ్ధిదారుడు సంతోషంగా ఉండాలి. లేదంటే డబ్బులు వృథా కావడమే కాకుండా లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుంది. ప్లాటింగ్ చేసేటప్పుడు ఈ అంశాలను కలెక్టర్లు కచ్చితంగా పరిశీలించాలి. ఊరికి దూరంగా, నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ఫిబ్రవరి 15 కల్లా అర్హుల జాబితా సిద్ధం కావాలి. 21 కల్లా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్లు పంపించాలి. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి ఫిబ్రవరి 25 కల్లా జరగాలి. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూముల సేకరణ పూర్తి కావాలి. మార్చి 10 కల్లా సేకరించిన స్థలాల్లో ప్లాట్లను అభివృద్ధి చేయాలి. మార్చి 15 కల్లా లాటరీలు కూడా పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరగాలి. నిర్మాణాలు పూర్తయ్యాకే వారిని తరలించాలి అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారికి ప్లాట్ల్లను ఎక్కడ కేటాయిస్తున్నారో చూపించి అంగీకారం పొందాలి. వచ్చే ఏడాది చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాల్లో వీరికి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలియచేయాలి. ఆ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి. అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో నివసించే వారిని ఎలాగూ రెగ్యులరైజ్ చేస్తాం. ఈ విషయాన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలి. మనం దాపరికం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని తెలియచేయాలి. మనకు ఓటు వేయనివారైనా ఫర్వాలేదు కానీ వారికి మాత్రం మంచి జరగాలి. దీన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా తీసుకోవాలి. భవిష్యత్తు తరాలన్నీ ఈ ప్రభుత్వాన్నీ, అధికారులనూ గుర్తుంచుకుంటాయి. ఫిబ్రవరి 20న ‘వసతి దీవెన’ ప్రారంభం రాష్ట్రంలో దాదాపు 11.60 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసే ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ఫిబ్రవరి 20వతేదీన ప్రారంభిస్తాం. మొదటి విడత కింద ఫిబ్రవరిలో డబ్బులు అందచేస్తాం. జూలై– ఆగస్టులో రెండో విడత డబ్బులు ఇస్తాం. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఈ డబ్బులను విద్యార్ధుల తల్లులకు అందచేస్తాం. జగనన్న వసతి దీవెన కింద ఐటిఐæ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తాం. ఏప్రిల్ చివరికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నెలాఖరు నాటికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాల వద్దే ఏర్పాటవుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే కార్యక్రమం. నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామాల్లోనే అందించడంతో పాటు రైతులు పంటవేసే సమయానికే కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ రంగంలో సమూల మార్పులను తెస్తాం. పశు వైద్య సిబ్బంది కూడా వీటిల్లో అందుబాటులో ఉంటారు. పశువుల ఔషధాలు కూడా అక్కడే లభిస్తాయి. రైతు భరోసా కేంద్రాలకు భవనాలను సమకూర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే. రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో శాశ్వతంగా ప్రదర్శించాలి. ఎవరైనా అవకాశం కోల్పోతే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలి. మిగిలిన అన్ని పథకాల లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఏ సేవ ఎప్పుడనేది తెలియచేయాలి.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తుండగా ఇందులో 336 సేవలను కేవలం 72 గంటల్లో పూర్తి చేయాలని నిర్దేశించాం. మిగిలిన సేవలకు కూడా కాల వ్యవధి నిర్ణయించాం. ఏ సేవ ఎన్ని రోజుల్లో అందిస్తారనే వివరాలు సచివాలయాల్లో ప్రదర్శించాలి. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు, వలంటీర్లు చురుగ్గా విధులు నిర్వర్తించేలా ఒక వ్యవస్థను సిద్ధం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన సందర్భంగా దరఖాస్తులకు సంబంధించి ఇచ్చే రసీదులపై వెంటనే స్పందించాలి. కలెక్టర్లు నేరుగా వీటి కార్యకలాపాలను పర్యవేక్షించాలి. దరఖాస్తుల స్వీకరణ, రశీదులు, పరిష్కారం అంతా డాష్ బోర్డులో కనిపించాలి. అధికారులు చాలకపోతే ఆ మేరకు ఏర్పాట్లు చేస్తాం. మనం చేస్తున్న కార్యక్రమాలమీద ఏకాగ్రత లేకుంటే వ్యవస్థలో మార్పులు తీసుకురాలేం. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల పర్యవేక్షణను జిల్లాల్లో ఒక జేసీకి అప్పగించాలి. 15 నుంచి ‘వైఎస్సార్ కంటి వెలుగు’ మూడో విడత వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అవ్వా తాతలపై ప్రత్యేక దృష్టి సారించాలి. దాదాపు 1.25 కోట్ల మందికి పరీక్షలు చేయాలని నిర్ణయించాం. జూలై 31 దాకా మూడో విడత కార్యక్రమం కొనసాగుతుంది. ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యకార్డులు జారీ చేస్తాం. ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది. 46 వేల మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. మనం దృష్టి పెట్టకుంటే ఆ పిల్లల పరిస్థితి అలాగే ఉండేది. శ్రద్ధ వహిస్తే ఎంతమందికి మంచి జరుగుతుందో దీని ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అవ్వా తాతల మీద కూడా మనం ఇలాంటి శ్రద్ధ తీసుకుంటాం. ‘అమ్మ ఒడి’ తల్లులు 42,33,098 మంది అమ్మ ఒడి కింద 42,33,098 మంది తల్లులను గుర్తించామని, పథకం ద్వారా ఇప్పటివరకు 41,25,808 మందికి రూ.6,188 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 1,07,290 ఖాతాల ట్రాన్సాక్షన్స్ విఫలమైనట్లు గుర్తించామన్నారు. దీనికి కారణాలను పరిశీలించాలని సీఎం సూచించగా వివరాల నమోదులో తప్పుల కారణంగా ట్రానాక్షన్స్ ఫెయిల్ అయ్యాయని, ఈ వారంలో దీన్ని సరిదిద్దుతామని బ్యాంకు అధికారులు చెప్పారన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరాదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సెర్ప్‌లో ఆర్డీవో స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై రెండు వారాల్లో ఒక యాప్ అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పాఠశాలల్లో బాత్రూమ్స్ నిర్వహణపై దృష్టిపెట్టాలని, అంగన్వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. వర్షాకాలానికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉండాలి జనవరి 10 నుంచి ఉభయ గోదావరి, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభమైందని, ఇప్పటివరకు 1,12,082 టన్నులు ఇంటివద్దే ప్రజలకు అందచేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 48 –72 గంటల్లో ఇసుక డోర్ డెలివరీ జరుగుతోందన్నారు. జనవరి 30న అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభమవుతుండగా ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్ డెలివరీ మొదలు కానుందని తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కానుంది. 16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని అధికారులు పేర్కొనగా వర్షాకాలం వచ్చేసరికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలని సీఎం సూచించారు. దేశమంతా చర్చించేలా దిశ చట్టం అమలు దిశ పోలీస్స్టేషన్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్లు సిద్ధమవుతున్నాయని, మిగిలిన పోలీస్స్టేషన్లు కూడా ఫిబ్రవరి రెండో వారాంతానికి సిద్ధమవుతాయని డీజీపీ తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటవుతాయని సీఎంకు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఎస్పీలు వెంటనే పరామర్శించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెచ్చిన దిశ చట్టం అమలు కూడా అదే రీతిలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దళారుల నిర్మూలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించామని సీఎం పేర్కొన్నారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని, మార్చి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. లంచగొండితనం లేకుండా, కోతలు లేకుండా ఉద్యోగికి నేరుగా జీతం వచ్చేలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేస్తున్నామని సీఎం తెలిపారు. -
రైతు శ్రేయస్సే లక్ష్యం
రైతులకు ఏమైనా సందేహాలు కలిగిన వెంటనే ఈ భరోసా కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. అందుకోసం అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌ను కూర్చోబెడుతున్నాం. డైరెక్ట్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తాం. డైరెక్ట్‌గా వీడియో స్క్రీనింగ్ వసతి కూడా కల్పిస్తున్నాం. తద్వారా నిపుణులతో సూచనలు, సలహాలు ఇప్పిస్తాం. ఆ విధంగా ప్రతి రైతుకూ ప్రతి అంశంలో తోడుగా ఉంటాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక ఏ ఒక్క రైతూ నష్టపోయే అవకాశమే లేకుండా అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి రైతు సమస్యకూ అక్కడే పరిష్కారం రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు నెలకొల్పామని, వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యకు ఈ రైతు భరోసా కేంద్రాలలో పరిష్కారమవుతుంది. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా పక్కనే లైవ్ వర్క్‌షాప్ కూడా ఉంటుంది. వ్యవసాయంలో బెస్ట్ ప్రాక్టీసులు ఏమిటన్నవి చూపి, వాటిని నేర్పించే కార్యక్రమం చేస్తారు. నేచురల్ ఫార్మింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఇంటరాక్టివ్ సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. రైతు భరోసా కేంద్రాలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. నాణ్యత లేని విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుగోలు చేసి రైతులు నష్టపోయే పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. క్వాలిటీ స్టాంప్ వేసి అమ్ముతారు. రైతు అనేవాడు ఎక్కడా కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు. ఈ కేంద్రాల ద్వారా ఫిష్, ఆక్వా సాగు చేసే ప్రాంతాలలో.. వాటికి సంబంధించిన క్వాలిటీతో కూడిన ఫీడ్, బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అవగాహన కల్పిస్తారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తూ.. రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను ఆయా గ్రామాల్లోని ఈ కేంద్రాలు అందిస్తాయి. భూసార పరీక్షలు గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు భూసార పరీక్ష (సాయిల్ టెస్ట్) కూడా చేస్తారు. విత్తనాల నాణ్యతను పరీక్షించే (సీడ్ టెస్టింగ్) సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. ఏ రైతు అయినా ఇక్కడ కొనుగోలు చేసిన విత్తనాలే కాకుండా, వేరే చోట కొనుగోలు చేసిన విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు ఈ సీడ్ టెస్టింగ్ సదుపాయం ఉపయోగపడుతుంది. ధాన్యంలో తేమ శాతం (మాయిశ్చర్ టెస్టింగ్) తెలుసుకునే మీటర్లు కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువస్తాం. గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోలు రాబోయే రోజుల్లో రైతులు తాము అమ్ముకునే పంటలకు సంబంధించి.. రైతు పంట వేసేటప్పుడే ఫలానా పంటకు కనీస గిట్టుబాటు ధర ఇదీ అని ప్రకటిస్తాం. ఇంతకన్నా తక్కువ ధరకు ఏ రైతూ పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకు ఎవరైనా కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే వివరంగా ఒక ప్రకటన కూడా ఇచ్చాము. (ప్రకటన కాపీని చూపించారు) ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎంత? ఆ పంట ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఎప్పుడు సేకరిస్తాము అన్నది కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చే ఖరీఫ్ నుంచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తాయి. రైతు తాను పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? దళారుల దగ్గరకు పోయి తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి రాకుండా రైతు భరోసా కేంద్రాలు జోక్యం చేసుకుంటాయి. ఇదీ.. ఈ పంట కనీస గిట్టుబాటు ధర. అంత కంటే తక్కువ ధరకు ఎవరూ అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా ఎక్కువ ధర వస్తే మీరు బంగారం మాదిరిగా అమ్ముకోండి. కానీ ఇంత కన్నా తక్కువ ధర వస్తే మాత్రం ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి. రాబోయే రోజుల్లో విత్తనాల పంపిణీని కూడా రైతు భరోసా కేంద్రాలు చేపడతాయి. ఇన్ని సమస్యలున్నా వెనుకడుగు వేయలేదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా వారికి తోడుగా, అండగా ఉంటోంది. ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా ఉన్నా, చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోతూ పోతూ విపరీతంగా బకాయిలు పెట్టినా భయపడలేదు. ఇన్ని సమస్యలున్నందున మేము ఇచ్చిన మాట నుంచి వెనుకడుగు వేస్తున్నామని ఏనాడూ చెప్పలేదు. దేవుడు సహకరించి, ప్రజలు దీవించడంతో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ఏడాది ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ‘రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే సరికి జూన్ వచ్చింది. నాలుగేళ్ల పాటు, ఏటా రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని మాత్రమే ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. కానీ రైతులకు మంచి చేయాలన్న ఆరాటం, తపన, తాపత్రయంతో గత ఏడాది అక్టోబర్‌లోనే ఇచ్చాము. ఖరీఫ్ సీజన్లో కాకుండా రబీలోనే వెంటనే అమలు చేశాం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పిన మొత్తాన్ని ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా దాదాపు 46 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నాం. పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుంది.. మేము అధికారంలోకి రాగానే జూన్‌లో మరో గొప్ప పథకం.. రైతులకు వడ్డీ లేని రుణాలు అమలు చేశాం. అంతకు ముందు రైతులకు ఆ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ‘వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు’ అని చెప్పి ప్రవేశపెట్టామని గర్వంగా చెబుతున్నాం. ఖరీఫ్, రబీలో పంట రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని కూడా గర్వంగా చెబుతున్నాం. రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఏ రైతు కూడా తమ పంటలను తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చేస్తామని మరోసారి భరోసా ఇస్తున్నాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశాం. పగలే 9 గంటల విద్యుత్ ప్రతి రైతుకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న తపన, తాపత్రయంలో అడుగులు ముందుకు వేశాము. రాష్టంలో 6,663 వ్యవసాయ ఫీడర్లు ఉంటే, వాటిలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యం లేదని అధికారులు చెప్పారు. అందువల్ల ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు విడుదల చేశాం. ఇప్పటికే 60 శాతం ఫీడర్ల నుంచి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. వచ్చే జూలై నుంచి 100 శాతం ఫీడర్లు పని చేస్తాయి. వ్యవసాయ మిషన్‌తో ముందడుగు రైతులకు మరింతగా మేలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. దీనికి నేనే చైర్మన్‌గా ఉన్నా. ఈ అగ్రి మిషన్‌లో రైతులు, స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ వంటి నిపుణులు ఉన్నారు. ప్రతి నెలా ఒకసారి కలిసి, వారందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. తర్వాత వాటన్నింటినీ అమలు చేస్తూ ఒక మిషన్ మోడ్‌లో పోతున్నాం. ఈ విధంగా ప్రతి అడుగు రైతుల మేలు కోసం వేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా భవిష్యత్తులో వారికి మరింత మేలు చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నాం’ అని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును అభినందిస్తూ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, బోళ్ల బ్రహ్మనాయుడు, రాపాక వరప్రసాద్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, చెల్లుబోయిన వేణుగోపాల్, కందుల నాగార్జున రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, అప్పల నాయుడు, నాగేశ్వరరావు, రాజన్నదొర, కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రసంగించారు. ‘ఈ క్రాప్’ పై అవగాహన కల్పిస్తూ.. అది అమలయ్యేలా చూస్తాయి. జిల్లా, మండలం, చివరకు ఊరును ఒక్కో యూనిట్‌గా పరిగణించి, ఈ ఊళ్లో మీరు ఈ పంట వేస్తే మంచి రేట్లు వస్తాయని చెబుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట పరిస్థితి ఇదీ.. ఈ పంట కొరత ఉంది.. ఈ పంట ఇప్పటికే ఎక్కువగా సాగు చేసినందున మీరు అమ్ముకోలేక నష్టపోతారు.. కాబట్టి ఈ పంట వేయండి అని రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటాయి. పశువులకు కూడా మొట్ట మొదటిసారిగా హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్, పశువుల బీమాతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఈ కేంద్రాలలో రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. నిజానికి ఇంతకు ముందు రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. మేము అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నాం. మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇందుకు రూ.2,100 కోట్లు రైతుల తరఫున ప్రభుత్వం భరిస్తోంది. -
వ్యవసాయంలో కీలక సంస్కరణలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఈ భరోసా కేంద్రాల్లోనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం అన్నారు. బుధవారం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాబోయే ఖరీఫ్ నాటికి 11, 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్‌షాపుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. రైతుల భరోసా పథకంను చెప్పిన దానికంటే ముందగానే అమలుచేశామని సీఎం స్పష్టం చేశారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ... ‘వ్యవసాయంలో కీలక సంస్కరణలు తీసుకువస్తాం. దీనిలో భాగంగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. పశువులకు హెల్త్ కార్డులు, పంట భీమా కార్డులు ఇస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్‌పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తాం. అలాగే విత్తన పరీక్షలు కూడా చేసుకోవచ్చు. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసాను రూ.12500 నుంచి 13500కు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఇన్సురెన్స్ ప్రీమియం కింద రూ.2100 కోట్లను ప్రభుత్వం అదనంగా భరిస్తోంది. రైతుల కోసం వైఎస్సార్ వడ్డీలేని రుణాలను అందిస్తున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకువచ్చాం. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రూ. 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించాం. రూ. 2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.’ అని అన్నారు. -
ఈసారి ‘పంట’ పండింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈసారి ‘పంట’ పండింది. అన్ని రకాల పంటలకూ అంచనాలకు మించి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుత ఖరీఫ్ (2019–20) సీజన్లో అన్నదాతలకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఒకరకంగా ఉపకరిస్తే.. పుష్కలంగా వర్షాలు కురవడం.. సాగు విస్తీర్ణం పెరగడం కూడా దిగుబడులు గణనీయంగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్థిక గణాంక శాఖ రెండో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో వరి ఉత్పత్తి సుమారు 78.68 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. మొదటి అంచనా కన్నా ఇది ఎక్కువ. మిగతా పంటల దిగుబడులు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటలుగా ఉన్న మిర్చి, పత్తి, వేరుశనగ, కంది దిగుబడులు కూడా చెప్పుకోదగిన రీతిలో పెరిగాయి. గణనీయంగా పెరిగిన దిగుబడులు.. ఏపీలోని ప్రధాన పంటల దిగుబడులన్నీ పెరిగాయి. గతంలో హెక్టార్‌కు 5,029 కిలోలుగా ఉన్న వరి ఈ ఖరీఫ్‌లో 5,166 కిలోలకు చేరింది. జొన్న, సజ్జ, చిరు ధాన్యాల దిగుబడి హెక్టార్‌కు రెండు మూడింతలు పెరిగాయి. 2018–19లో హెక్టార్‌కు 130 కిలోలుగా ఉన్న జొన్న 1,036 కిలోలకు.. సజ్జ 1,013 నుంచి 2,322 కిలోలకు చేరింది. మిర్చి, పత్తి, వేరుశనగ, కంది సాగులోనూ పెరుగుదల ఉంది. మిర్చి హెక్టార్‌కు గతేడాది ఖరీఫ్‌లో 3,142 కిలోలుగా ఉంటే ఈ ఏడాది అది 4,615 కిలోలుగా, పత్తి హెక్టార్‌కు 1,224 నుంచి 1,713 కిలోలకు చేరింది. వేరుశనగ దిగుబడి హెక్టార్‌కు 484 నుంచి 1,035 కిలోలకు.. కంది 180 నుంచి 831 కిలోలకు చేరింది. ఫలితాన్నిచ్చిన రైతు సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా వంటి సంక్షేమ పథకాలతోపాటు సమృద్ధిగా కురిసిన వర్షాలు ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉత్పత్తులు పెరగడానికి దోహదపడ్డాయని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఖరీఫ్ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనా ఆ తర్వాత కురిసిన వర్షాలు పంటలకు కలిసి వచ్చాయి. అలాగే, రిజర్వాయర్లు నిండడంతో నీటి సమస్య లేకుండాపోయింది. చీడపీడల బెడద కూడా ఈ ఏడాది తక్కువగా ఉంది. ఒక్క పత్తికి మాత్రమే కొన్ని ప్రాంతాలలో తెగుళ్లు సోకినట్టు గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఇచ్చిన పెట్టుబడి సాయం రైతులకు ఎంతగానో ఉపకరించినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. -
నవరత్నాలకు ఊతమివ్వండి
ఈ మధ్యకాలంలో పత్రికల్లో హెడ్డింగులు చూస్తూనే ఉన్నారు.. మేము తీసుకున్న చర్యలన్నీ సదుద్దేశంతో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాల్సి ఉంది. అనవసర వ్యయాలను తగ్గిస్తున్నాం. ప్రాధాన్యతల ప్రకారం ముందుకు వెళ్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కింద చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, ఆక్సిజన్ లాంటి వీటికి బ్యాంకర్లు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. రైతులు, ఆటోలు.. ట్యాక్సీలు నడుపుకుంటున్న వారికి, మత్స్యకారులకు, చేనేతలకు, అగ్రిగోల్డ్ బాధితులకు, కొత్తగా లా పూర్తి చేసిన వారికి.. ఇలా వివిధ వర్గాల వారికి ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లకు పైగా నగదు సాయం చేశామని స్పష్టం చేశారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద ఈ నెలలో సుమారు రూ.6,500 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు దాని ప్రభావం సమాజంలోని అట్టడుగు వర్గాలపైనే ఉంటుందని, ఈ పథకాల ద్వారా ఆ వర్గాల వారికి ఆక్సిజన్ అందించగలిగామన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ రూపంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాల వారికి చేరవేయడానికి ఉద్దేశించిన అన్ ఇంకంబర్డ్ ఖాతాలు అందించడంలో బ్యాంకులు చక్కటి సహకారాన్ని అందించాయన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వివిధ పథకాల కింద నగదును బదిలీ చేయగలిగామని చెప్పారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని, రైతు భరోసాతో రైతులను ఆదుకున్నామని, వ్యవసాయ రంగం బాగుండడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కౌలు రైతులకూ రుణాలు ఇవ్వండి కౌలు రైతుల విషయంలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు ఇవ్వడం లేదని ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. బ్యాంకర్లు, ప్రభుత్వం కలిసి కౌలు రైతులకు మరింత ఎక్కువగా రుణాలు అందించేలా ముందడుగు వేద్దామని కోరారు. కౌలు రైతుల కోసం ఒక చట్టాన్ని తీసుకు వచ్చామని, ఈ చట్టం పూర్తి పారదర్శకంగా ఉందని చెప్పారు. ఈ చట్టం ద్వారా రైతుల హక్కులను పరిరక్షిస్తూనే 11 నెలలకు సాగు ఒప్పందానికి వీలు కల్పిస్తోందన్నారు. రైతులు హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదని అవగాహన కల్పించాల్సిందిగా సీఎం సూచించారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ చైతన్యం, అవగాహన కలిగించేలా కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉందని, 10 నుంచి 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ప్రతి పథకాన్ని పారదర్శక విధానంలో వివక్ష, అవినీతికి తావు లేకుండా అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా ఉన్నారని, వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ నాటికి 11 వేల రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నాటికి గ్రామ సచివాలయాల పక్కనే దాదాపు 11 వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. శిక్షణ కేంద్రంలా, రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందించేలా ఈ కేంద్రాలు పని చేస్తాయని, వీటికి ప్రభుత్వం గ్యారెంటీ కూడా ఇస్తుందని స్పష్టం చేశారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఇక్కడ శిక్షణ ఇస్తారని, రైతుల ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా కూడా భవిష్యత్తులో పని చేస్తాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇంటర్నెట్ సౌకర్యంతో అనుసంధానిస్తామని, తద్వారా డిజిటలైజేషన్ పెరుగుతుందని చెప్పారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారని, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. వీరందరికీ గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. తద్వారా దాదాపు 12 లక్షల మంది లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ నవోదయం కింద ఖాతాల పునర్ వ్యవస్థీకరణపై కూడా దృష్టి పెట్టాలని, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన బ్యాంకర్లకు సూచించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన వినియోగంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉందని చెబుతున్నారని, ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీనిపై దృష్టి పెడతామన్నారు. రైతులు, మహిళా సంఘాల రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానిదే రైతులకు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలివ్వాలని సీఎం బ్యాంకర్లను కోరారు. వడ్డీ చెల్లింపు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళలు, రైతుల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో రుణాలు ఇవ్వాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై వివిధ జిల్లాల్లో వేసే వడ్డీల్లో వ్యత్యాసం ఉందని, 6 జిల్లాల్లో 7 శాతం, 7 జిల్లాల్లో 12 శాతం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ కింద పెట్టిన బకాయిలు రూ.648.62 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు చెబుతున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని బ్యాంకులు పదే పదే తన దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందిస్తున్నానని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా బ్యాంకర్లు దృష్టి పెట్టాలని సీఎం కోరారు. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి.. మాకూ కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టిందన్నారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) డేటా ప్రకారం శ్రీశైలం వద్ద కృష్ణాలో వచ్చిన నీళ్లు 47 సంవత్సరాల సగటు 1,200 టీఎంసీలుండగా గత 10 ఏళ్లలో అది 600 టీఎంసీలకు పడిపోయిందని చెప్పారు. గత 5 ఏళ్లలో అయితే ఏకంగా 400 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరో వైపు గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయన్నారు. గోదావరి మిగులు జలాలను వాడుకోవాల్సి ఉందని, 62 శాతం ప్రజలు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని, రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేవేనని, వీటికి బ్యాంకర్లందరూ సహాయం అందించాలని సీఎం కోరారు. స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరణ నాడు – నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నామని, మొత్తం 45 వేల స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలను బాగు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఇందు కోసం దాదాపు రూ.12 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నామని, తద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అడుగు వేస్తున్నామన్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతున్నామని, మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతున్నామని సీఎం వివరించారు. వచ్చే నాలుగైదేళ్లలో విద్యాపరంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వారిని ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాదు. అందుకే ప్రభుత్వం, బ్యాంకులు ఒకతాటిపైకి వచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయగలగాలి. ఉగాది నాటికి సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ.. మొత్తంగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ప్రతి ఏటా 6 లక్షల చొప్పున ఇళ్లు కడతాం. తద్వారా సిమెంట్, ఐరన్, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయి. పారిశ్రామిక వృద్ధి సాధ్యమవుతుంది. -
అన్నదాతలకు సంక్రాంతి కానుక
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ రైతు భరోసాలో భాగంగా అన్నదాతలకు సంక్రాంతి కానుకగా ప్రకటించిన రూ.2 వేలను గురువారం నుంచి వారి ఖాతాలకు నేరుగా బదిలీ చేసేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. సుమారు 46,50,629 మంది ఖాతాలకు రైతు భరోసా తుది విడత మొత్తం దాదాపు రూ.1,082 కోట్లను నేరుగా బదిలీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద గత నెల 15 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులైన వారి ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని చెప్పారు. వీరిలో వాస్తవ సాగుదారులు, కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, దేవాదాయ, ధర్మాదాయ భూముల్ని సాగు చేసుకుంటున్న వారు, ఇతర వర్గాల సాగుదార్లు ఉన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13,500 ఇస్తామని ప్రకటించి ఇప్పటికే రూ.11,500ను జమ చేసిన విషయం తెలిసిందే. కాగా, లబ్ధిదారుల పేర్లను శుక్రవారం నుంచి గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన లేఖను గ్రామ వలంటీర్లు రైతులకు అందజేసి, రసీదుపై సంతకం తీసుకుంటారు. అన్నదాతలకు ముఖ్యమంత్రి లేఖ ఇలా.. రైతన్నలకు, రైతు కుటుంబాలకు మీ కుటుంబ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నాను. కష్టాల కడగండ్లలో గత ఐదేళ్లుగా సర్వం నష్టపోయిన రైతన్నకు సహాయం అందించే విషయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కంటే మిన్నగా, 8 నెలల ముందే 2019 అక్టోబర్ 15న రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించాం. రైతులకు అందించే ఈ పెట్టుబడి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందజేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం భూ యజమాని అయిన రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.7,500 కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.13,500 ప్రతి రైతు కుటుంబానికి అందిస్తున్నాం. ఈ సొమ్మును అర్హులైన భూ యజమాని కుటుంబాలకు ఏటా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4,000.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అందజేస్తున్నాం. రాష్ట్రంలో భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో ఆర్థిక సాయం చేస్తున్నాం. మే, అక్టోబర్ నెలల్లో ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఇప్పటి వరకు రాష్ట్రంలోని 44,92,513 మంది భూ యజమానులకు రూ.11,500 చొప్పున మొత్తం రూ.5,166.37 కోట్లు అందజేశాం. రాష్ట్రంలో 1,58,116 మంది భూమి లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు, ఆర్ఓఎఫ్ఆర్ సాగుదార్లకు, దేవాదాయ భూములు సాగు చేస్తున్న వారికి ఇప్పటి వరకు రూ.11,500 చొప్పున ప్రభుత్వం మొత్తం రూ.181.83 కోట్ల ఆర్థిక సహాయం అందజేసింది. వీరందరికీ మిగతా రూ.2 వేలను ఈ జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా అందజేస్తున్నాం. డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులకు అందించే ఈ ఆర్థిక సాయం, వ్యవసాయ పెట్టుబడికి ఉపకరిస్తుందని భావిస్తున్నాను. ఈ సందర్భంలో వ్యవసాయ ఉత్పాదకాల నాణ్యతను పరిశీలించేందుకు, తద్వారా నాణ్యమైన ఉత్పాదకాలను మాత్రమే రైతన్నలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో 147 డాక్టర్ వైఎస్సార్ సమీకృత ప్రయోగశాలలను, 13 జిల్లా కేంద్రాలలో నోడల్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయబోతున్నాం. ఫిబ్రవరి నుంచి ప్రతి గ్రామ పంచాయతీ సచివాలయం పరిధిలో రైతు కోరిన, నాణ్యత ధృవీకరించిన ఉత్పాదకాలను అందించడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. భూసార పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా వినియోగించే కషాయాల తయారీ, పెట్టుబడి ఖర్చును తగ్గిస్తూ దిగుబడిని పెంచగలిగే సాంకేతిక సలహాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరలు, వాతావరణ సలహాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల సేవలు రైతు భరోసా కేంద్రం పరిధిలో అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. -
17 నుంచి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
ప్రభుత్వం అంటే అవినీతి ఉంటుందని, తక్కువ నాణ్యత ఉన్న వాటిని ఇస్తారనే ఒక అభిప్రాయం ఉంది. మేము ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చబోతున్నాం. అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించి.. రైతులకు ఇచ్చే విత్తనాలు, పురుగు మందుల్లో నాణ్యత ఉండేలా చూస్తాం. దీనివల్ల రైతుల్లో పూర్తి భరోసా ఉంటుంది. సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 17వ తేదీ నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి నాటికి 3,300 కేంద్రాలు, ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 కేంద్రాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వినియోగించే ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ఆదేశించారు. రైతులకు సలహాలు, శిక్షణ ఇచ్చేలా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలని సూచించారు. రైతులకు అందిస్తున్న వివిధ పథకాలను సక్రమంగా అందించడంలో ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఈ కేంద్రాలు పని చేయాలన్నారు. దశల వారీగా విత్తన పంపిణీ, ప్రొక్యూర్మెంట్ సెంటర్లుగా కూడా రైతు భరోసా కేంద్రాలు అవతరించాలని సీఎం పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రంలో డిజిటల్ కియోస్క్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, బయోఫెర్టిలైజర్స్, అగ్రి కెమికల్స్, పశుదాణా.. ఇతరత్రా ఉత్పత్తుల ఆర్డర్ ఇవ్వడానికి డిజిటల్ కియోస్క్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. విత్తనాల తయారీదారులు నాణ్యత పరీక్షలు చేసిన తర్వాతే వాటిని రైతు భరోసా కేంద్రాలకు పంపించాలని స్పష్టం చేశారు. విత్తనాలు నిల్వ చేసే గోడౌన్లలో కూడా నాణ్యత పరీక్షలు చేయాలని, జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆక్వాఫీడ్ నాణ్యతపై ఎలాంటి నియంత్రణ లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆక్వాఫీడ్ నాణ్యతపై ప్రమాణాలు నిర్దేశిస్తూ త్వరలోనే ఒక చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మాత్రమే తమ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను విక్రయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల కల్తీకి చెక్ పడుతుందన్నారు. ప్రస్తుతమున్న ల్యాబ్‌లను ప్రభుత్వం పెంచుతున్నందున కల్తీని అడ్డుకునే పనులు ముమ్మరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. సమావేశానికి ముందు డిజిటల్ కియోస్క్‌ను, రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసే భూసార పరీక్ష పరికరాలను సీఎం వైఎస్ జగన్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పరిశీలించారు. సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా.. - గోడౌన్లలో ఉన్నప్పుడు విత్తనాలు కల్తీ జరక్కుండా సరైన నిల్వ పద్ధతులు పాటించాలి. ఆ మేరకు సంచుల నాణ్యత ఉండాలి. - గ్రామ సచివాలయాల్లోని అగ్రికల్చర్, వెటర్నరీ ఉద్యోగులు రైతు భరోసా కేంద్రాల నుంచే విధులు నిర్వహించాలి. - పంటలకు బీమా సదుపాయం కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే అందించాలి. - వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాల జాబితా ప్రదర్శించాలి. - పంటలు, సాగు విధానాలపై డిజిటల్ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి. - వెదర్ స్టేషన్స్ ఏర్పాటు చేసి, వాతావరణ సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు చేరవేయాలి. - నిరంతరాయంగా ఇంటర్నెట్ ఉండేలా చూసుకోవాలి. - ఇ–క్రాపింగ్ నమోదు, పశువులకు బీమా సదుపాయం, కౌలు రైతుల సాగు ఒప్పందాల ప్రక్రియ కూడా రైతు భరోసా కేంద్రంలో జరగాలి. -
అన్నదాతలకు అండగా ఉంటాం