
సాక్షి, విశాఖపట్నం : కరోనా లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లను రేపటి నుంచి 24 గంటల పాటు తెరవాలని ముఖ్యమత్రి ఆదేశించారన్నారు. అలాగే ఈ నెల 15న రైతు భరోసా అందించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసాకి అర్హతలు ఉండి నమోదు చేసుకోనివారికి ఈ నెల పది వరకు అవకాశం కల్పించామని చెప్పారు.