రాష్ట్రంలో అరాచకపాలన, హిందూపురంలో రాక్షసపాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆరోపించారు.
హిందూపురం అర్బన్: రాష్ట్రంలో అరాచకపాలన, హిందూపురంలో రాక్షసపాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం విచ్చేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హిందూపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట నిలుపుకొనే నాయకుడు కాదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు అప్పులు మాఫీ చేస్తామన్నారు. ఒక్క హామీ కూడా నిలుపుకోలేదు.
ఆయన కాలు మోపింది తడువు రాష్ట్రంలో ఒక్క చినుకు కూడా పడలేదన్నారు. పేదల ఆశలు ఆవిరై కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన 9నెలల కాలంలోనే రైతులు ఆకులు రాలినట్లు రాలిపోయా రు. చంద్రబాబు బామ్మరిది బాలకృష్ణ హిం దూపురానికి ఏదో చేసేస్తారని ప్రజలందరూ భావించారు. ఎన్నికల ముందు స్థానికంగా ఉం టాను, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.
ఇప్పుడు షూటింగులతో బిజీగా మారి నియోజకవర్గాన్ని తిరిగి చూడని పరిస్థితి ఏర్పడిందన్నారు. మేళాపురం క్రాస్‌లో నిరుపేదల చిన్న బంకులు పోలీసుల బలగంతో తొలగించి వారికి బతుకు తెరువు లేకుండా చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో నీటిని, తర్వాత సహజ సంపద అయిన ఇసుకను కూడా వదలకుండా అమ్ముకుంటున్నారు. భవిషత్తులో మనం పిలిచే గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటారని విమర్శించారు. చెప్పిన మాటకు, ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజల కోసం నిలిచే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు. ఆయనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
జిల్లాలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. వారి కుటుంబ సభ్యులు అప్పులు బాధ భరించలేక కుటుంబ పోషణ భారమైన తరుణంలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.
- శంకర్ నారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
హంద్రి నీవాయే శరణ్యం
కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంత జిల్లా తాగునీరు, సాగునీరు సమస్య తీరాలంటే ఏకైక మార్గం హంద్రి నీవా ప్రాజెక్టు. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి చెరువులకు నీళ్లు అందించడమే లక్ష్యం కావాలి. అప్పుడే రాయలసీమ ప్రజల కష్టాలు తీరుతాయి.
- డాక్టర తిప్పేస్వామి, వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయ కర్త
ప్రజలు బాధపడుతున్నారు
రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన ఒకే ఒక మాటకు మోసపోయి ప్రజలు ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత చంద్రబాబు చెబుతున్న అపద్ధాలు విని జరిగిన పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు. ఇందులో భాగంగానేు రైతు భరోసా యాత్రకు ప్రజలు వేలాది సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను జగన్ దృష్టికి తెస్తున్నారు.
- సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి ఇన్‌చార్జ్
ఎస్సీలను నట్టేట ముంచారు
రాష్ట్రంలో చంద్రబాబు ఎస్సీలను నట్టేట ముంచారు. ఇం టింటికీ ఉద్యోగం అన్నారు, ఎస్సీలను క్రెడిట్ క్యాంప్‌ల పేరుతో అన్యాయం చేస్తున్నారు. మడకశిర లో లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు ఉన్నా ప్రారంభించడానికి చర్యలు తీసుకోలేదు. ఇందిర జలప్రభ ద్వారా ఎస్సీ రైతులకు వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారు.
- రేకులకుంట హనుమంతు, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి