hindupuaram
-
హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చమూక.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సత్యసాయి: నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఆవేదన, బాధను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో మరో దారుణం జరిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో సుగుణమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, చిలమత్తూరులో వికలాంగుడు నాగరాజు వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా అకారణంగా నాగరాజును విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో తనను ఎందుకు తొలగించారని నాగరాజు, అతడి భార్య సుగుణమ్మ ప్రశ్నించగా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేశారు.దీంతో, సుగుణమ్మ మనాస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సందర్భంగా టీడీపీ నేతల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నెయిల్ పాలిష్ తాగి ఆమె ఆత్మహత్యయత్నం చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది. -
బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?
సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మానవత్వం మరచి ప్రవర్తించారు. బాలకృష్ణ నిర్వాకంతో పాఠశాల విద్యార్థులు ఎండలో గంటకు పైగా సమయం నిలబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. . వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొట్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించాల్సి ఉండగా.. అక్కడికి గంట లేటుగా వచ్చారు. దీంతో విద్యార్థులు.. ఎమ్మెల్యే రాక కోసం గంటసేపు ఎండలోనే నిలబడ్డారు. దీంతో, ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం బాలయ్య.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో రాజకీయ ప్రసంగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తత్కాల్ టికెట్స్‌పై ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం -
బాలకృష్ణ కారును అడ్డుకున్న గ్రామస్తులు
-
బాలయ్యా..రోడ్డు ఎక్కడయ్యా?
హిందూపురం/లేపాక్షి: ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆయన కారును అడ్డుకున్నారు. భూమి పూజ చేసి మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేదంటూ బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. హిందూపురం–చిలమత్తూరు మెయిన్‌రోడ్ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్ వేయడానికి మూడేళ్ల కిందట భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్ వేస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మెయిన్ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు. మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయావో చెప్పాలంటూ నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు. ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని చెప్పినా.. గ్రామస్తులు వెనక్కితగ్గలేదు. విధిలేని పరిస్థితిలో వారిని తప్పించుకుంటూ బాలకృష్ణ కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు మానుకోవాలి
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు మానుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి.. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను శనివారం మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జరగబోయే సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తే సహించేదని లేదని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ టీడీపీ కార్యకర్తలకు రక్షణ లేకుండా పోతుందని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడే ఆ పార్టీ పట్ల ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు నడుకోవాలని హితవు పలికారు. -
బాలకృష్ణపై మహిళల ఆగ్రహం
సాక్షి, అనంతపురం : సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. తాగునీటి సమస్యను తెలియజేస్తూ మహిళలు ఖాళీ బిందలతో ఆయన ముందు నిరసన తెలిపారు. నియోజవర్గంలోని చిలమత్తూరులో శుక్రవారం ఎమ్మెల్యే బాలకృష్ణ పల్లె బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చాలా మంది మహిళలు తమ సమస్యలు తెలియజేయడానికి రాగా.. వారిని పట్టించుకోకుండా ఆయన ప్రసంగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన మహిళలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తాగు నీటి సమస్యను విన్నవించేందుకు ఖాళీ బిందెలతో వచ్చిన మహిళల నుంచి సీఐ వెంకటేశ్వర్లు వాటిని లాక్కున్నారు. సీఐ, ఎమ్మెల్యే తీరుపై నియోజక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాలయ్యకు బాబు చెక్!
సాక్షి, అమరావతి: బావమరిది నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారా? వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు ఎమ్మెల్యే టికెట్ డౌటేనా? తెలుగుదేశం పార్టీలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే నిజమేనని స్పష్టమవుతోంది. బాలయ్యను రాజకీయాల నుంచి పూర్తిగా పక్కన పెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ ప్రజాప్రతినిధిగా ఉంటే ఎప్పటికైనా తన కుటుంబానికి ఇబ్బందులు తప్పవని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటినుంచే ఆయనను పక్కకు తప్పించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అందులో భాగంగానే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ వెనుకపడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. బాలయ్య పోటీచేస్తే ఓటమి ఖాయం 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అసలు బాగోలేదని, సర్వేల్లో ఈ నియోజకవర్గాలు పూర్తిగా వెనుకపడిపోయాయని చంద్రబాబు ఇటీవల తరచూ పార్టీ సమావేశాల్లో చెప్పుకొస్తున్నారు. ఆ 40 నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమనే లీకులు టీడీపీ నుంచి బయటకు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని, అక్కడి ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందని, దీనికంతటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఇతర నాయకులకే వ్యవహారాలన్నీ అప్పగించి అప్పుడప్పుడూ బాలయ్య తన నియోజకవర్గంలో తూతూమంత్రంగా తిరగడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే టికెట్ బాలయ్యకు దక్కకపోవచ్చని చెబుతున్నారు. బాబు వ్యూహంలో భాగంగానే.. బాలయ్యకు వ్యతిరేకంగా బయటకొస్తున్న లీకులు, ప్రచారం అంతా చంద్రబాబు వ్యూహంలో భాగమేననే వాదన వినిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో ఉంటే తన కుమారుడు లోకేశ్‌కు అడ్డంకిగా మారుతాడని బాబు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. అందుకే బాలయ్యకు పొగ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి హిందూపురం నుంచి లోకేశ్‌ను రంగంలోకి దించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్పటివరకూ బావకు విధేయుడిగానే ఉంటున్న బాలకృష్ణ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. -
రాష్ట్రంలో అరాచక పాలన
హిందూపురం అర్బన్: రాష్ట్రంలో అరాచకపాలన, హిందూపురంలో రాక్షసపాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం విచ్చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సభలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట నిలుపుకొనే నాయకుడు కాదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు అప్పులు మాఫీ చేస్తామన్నారు. ఒక్క హామీ కూడా నిలుపుకోలేదు. ఆయన కాలు మోపింది తడువు రాష్ట్రంలో ఒక్క చినుకు కూడా పడలేదన్నారు. పేదల ఆశలు ఆవిరై కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన 9నెలల కాలంలోనే రైతులు ఆకులు రాలినట్లు రాలిపోయా రు. చంద్రబాబు బామ్మరిది బాలకృష్ణ హిం దూపురానికి ఏదో చేసేస్తారని ప్రజలందరూ భావించారు. ఎన్నికల ముందు స్థానికంగా ఉం టాను, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు. ఇప్పుడు షూటింగులతో బిజీగా మారి నియోజకవర్గాన్ని తిరిగి చూడని పరిస్థితి ఏర్పడిందన్నారు. మేళాపురం క్రాస్‌లో నిరుపేదల చిన్న బంకులు పోలీసుల బలగంతో తొలగించి వారికి బతుకు తెరువు లేకుండా చేశారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో నీటిని, తర్వాత సహజ సంపద అయిన ఇసుకను కూడా వదలకుండా అమ్ముకుంటున్నారు. భవిషత్తులో మనం పిలిచే గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటారని విమర్శించారు. చెప్పిన మాటకు, ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రజల కోసం నిలిచే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనన్నారు. ఆయనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి జిల్లాలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. వారి కుటుంబ సభ్యులు అప్పులు బాధ భరించలేక కుటుంబ పోషణ భారమైన తరుణంలో వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్రతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. - శంకర్ నారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు హంద్రి నీవాయే శరణ్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంత జిల్లా తాగునీరు, సాగునీరు సమస్య తీరాలంటే ఏకైక మార్గం హంద్రి నీవా ప్రాజెక్టు. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి చెరువులకు నీళ్లు అందించడమే లక్ష్యం కావాలి. అప్పుడే రాయలసీమ ప్రజల కష్టాలు తీరుతాయి. - డాక్టర తిప్పేస్వామి, వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయ కర్త ప్రజలు బాధపడుతున్నారు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పిన ఒకే ఒక మాటకు మోసపోయి ప్రజలు ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత చంద్రబాబు చెబుతున్న అపద్ధాలు విని జరిగిన పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు. ఇందులో భాగంగానేు రైతు భరోసా యాత్రకు ప్రజలు వేలాది సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను జగన్ దృష్టికి తెస్తున్నారు. - సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ పుట్టపర్తి ఇన్చార్జ్ ఎస్సీలను నట్టేట ముంచారు రాష్ట్రంలో చంద్రబాబు ఎస్సీలను నట్టేట ముంచారు. ఇం టింటికీ ఉద్యోగం అన్నారు, ఎస్సీలను క్రెడిట్ క్యాంప్‌ల పేరుతో అన్యాయం చేస్తున్నారు. మడకశిర లో లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి నిధులు ఉన్నా ప్రారంభించడానికి చర్యలు తీసుకోలేదు. ఇందిర జలప్రభ ద్వారా ఎస్సీ రైతులకు వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారు. - రేకులకుంట హనుమంతు, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి -
గుప్త నిధుల వేటలో పోలీసులు!
హిందూపురం : గుప్త నిధుల వేటలో లబ్ధిపొందలేదని ఇద్దరు పోలీసులు బరి తెగించారు. తమకు ఖర్చు అరుున మొత్తం రూ.30 లక్షలు చెల్లించాలని వేృట బందంలో సభ్యుడైన ట్యాక్సీ డ్రైవర్‌ను చిత్రహింసలు పెడుతున్నారు. కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేని తల్లి పురుగు మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పరిగి మండలం సీగుపల్లి నివాసి అయిన లింగమ్మ, కిష్టప్ప దంపతుల కుమారుడు రాజేష్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు గోపాల్, మంజు, మరో వ్యక్తి డెయిరీ బాలాజీలు బినామీ పేర్లతో వాహనాలు బాడుగకు నడుపుతున్నారు. త్వరలో కోటీశ్వరులైపోవాలనే కోరికతో సదరు కానిస్టేబుళ్ల చూపు గుప్త నిధులపై పడిండి. ట్యాక్సీ డ్రైవర్ రాజేష్ సహాయంతో గుప్త నిధుల వేటకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మూడు పురాతన ఆలయూల్లో జేసీబీలతో తవ్వకాలు సాగించినట్లు తెలిసింది. తవ్వకాలు జరిపినపుడు ఒక రాగి బిందె మినహా సొమ్ములు దొరకలేదని సమాచారం. లాభాలొస్తే వాటా ఇస్తాం.. ఇపుడు తవ్వకాల కోసం చేసిన ఖర్చు రూ.30 లక్షలు తమకు తెచ్చివ్వాలని సదరు కానిస్టేబుళ్లు రాజేష్‌పై ఒత్తిడి తెచ్చారు. పది రోజుల క్రితం అదుపులోకి తీసుకుని వారి శైలిలో ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజేష్ కోసం అతని భార్య రాధమ్మ, తల్లి లింగమ్మ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ‘నీ కుమారుడు రూ.30 లక్షలు అప్పు ఉన్నాడు. అది చెల్లించి విడిపించుకుపోండ’ని పోలీసులు చెప్పడంతో వారు కన్నీరు మున్నీరయ్యూరు. ‘కొన్నాళ్లుగా పోలీసులు గోపాల్, మంజు, మరొకాయన బాలాజీ అర్ధరాత్రిళ్లు మా ఇంటి కాడికి వచ్చి నా భర్తను పిలుచుకుపోయేవారు. ఎక్కడికెళ్తున్నారంటే చెప్పేవారు కాదు. ఏం జరిగిందో ఏమో పది రోజుల క్రితం మా ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు పట్టుకుపోరుునారు. -
ఐటీ హబ్‌గా హిందూపురం
హిందూపురం మునిసిపాలిటీ : తగిన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గంలోని పార్టీ ఎమ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పట్టణంలోని కౌన్సిలర్లు, తదితరులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి అనంతపురం వరకు ఐటీ కారిడార్‌ను కచ్చితంగా తీసుకొస్తామన్నారు. అలాగే ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. హిందూపురం ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం నిపుణుల ద్వారా అధ్యయం చేస్తున్నామన్నారు. పట్టణానికి బెంగళూరు దగ్గరగా ఉండటం, అక్కడ ప్రభుత్వ కిద్వాయ్ ఆస్పత్రి ఉండటం వల్ల ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరా కోసం బంజుల బండ నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్లతకు ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన సమావేశంలో హంద్రీ నీవా, పీఏబీఆర్ పథకాలపై చర్చించామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి మహిళల వలసల నివారణకు ఇక్కడే గార్మెంట్స్ పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడుతున్నామన్నారు. బాలకృష్ణకు అంగన్వాడీ కార్యకర్తల వినతి స్థానిక ఆర్అండ్ బీలో ఎమ్మెల్యేను కలిసి అగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె చాలడం లేదంటూ యజమానులు ముందుకు రావడం లేదన్నారు. దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందని, శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, తమ జీతాలను పెంచాలని వారు కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. -
ఒకరు బాలకృష్ణ..మరొకరు ఎవరో?!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు ఇప్పటికే మంత్రివర్గంలో స్థానాన్ని ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. జిల్లా నుంచి మరొకరిని కూడా తీసుకునే అవకాశముంది. ఆ స్థానం కోసం పరిటాల సునీత (రాప్తాడు), కాలవ శ్రీనివాసులు(రాయదుర్గం), జేసీ ప్రభాకర్‌రెడ్డి(తాడిపత్రి), బీకే పార్థసారథి(పెనుకొండ) తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న విషయం విదితమే. ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే మహానాడులో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రాష్ట్ర విభజనపై అపాయింటెడ్ డే తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు. గరిష్టంగా 26 మందికి మాత్రమే స్థానం కల్పించవచ్చు. మన జిల్లా నుంచి టీడీపీ టికెట్‌పై 12 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మెజార్టీ సభ్యులు గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు సముచిత ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. కనీసం రెండు మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటుడు నందమూరి బాలకృష్ణ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్టీఆర్ తనయుడు, తన వియ్యకుండైన బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆయనకు కీలకశాఖ దక్కే అవకాశముంది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేపథ్యంలో.. అదే సామాజికవర్గానికి చెందిన మరొక ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం లేదని టీడీపీ వర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. కాగా, రెండో బెర్తు కోసం పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీకే పార్థసారథి పోటీపడుతున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన కాలవ శ్రీనివాసులు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. బీసీ వర్గానికి చెందిన కాలవకు ఆ కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన పరిటాల సునీత తనకు మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని విశ్వసిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అందులో ఒకరు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇంకొకరు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి. రెడ్డి సామాజికవర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చంద్రబాబు భావిస్తే.. జేసీ ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకునే సమయంలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన జేసీ దివాకర్‌రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కితే.. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఉండదు. కేంద్రంలో జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రి పదవి లభిస్తే... రాష్ట్ర మంత్రివర్గంలో పరిటాల సునీతకు స్థానం ఖాయమనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
కలకలం
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : హిందూపురం పట్టణం నేరగాళ్లకు షెల్టర్‌జోన్‌గా మారింది. ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలు, దందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు గిరీష్ అలియాస్ కుణిగల్ గిరి అలియాస్ మోదురు గిరి, అతని అనుచరులను ఆదివారం హిందూపురం పోలీసులు పట్టుకున్నారు. దీంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కుణిగల్ గిరి స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని చెప్పుకుంటూ తెర వెనుక వ్యవహారం నడిపేవాడు. ఇతనిది కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హోసూరు గ్రామం. దాదాపు 75 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతని ముఠాను పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు మూడు ప్రత్యేకృబందాలుగా రంగంలోకి దిగారు. దీన్నిబట్టే గిరి ఎంత పెద్ద నేరగాడో అర్థం చేసుకోవచ్చు. ఇతను 15 రోజుల క్రితం హిందూపురం పట్టణంలోని ఆరవిందనగర్‌లో ఓ ఇంటి పైఅంతస్తును అద్దెకు తీసుకున్నాడు. తన అనుచరులు ముగ్గురితో కలసి ఉండేవాడు. వారంతా ఉదయాన్నే కర్ణాటకలో డ్యూటీలంటూ వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేవారు. క్లాస్ యువకులుగా కన్పిస్తుండడంతో ఎవరికీ అనుమానం రాలేదు. కర్ణాటక ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, బెదిరింపులు, ఇసుక దందాలు వంటివి చేసేవారు. కాగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో కుణిగల్ గిరి కెనిటిక్ బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు చెప్పలేని స్థితిలో ఉండగా అతని వద్ద ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని సోదా చేశారు. ఒక తపంచా, బుల్లెట్లు, కె.ప్రశాంత్ పేరుతో డ్రైవింగ్ లెసైన్సు లభ్యమయ్యాయి. వెంటనే వారు హిందూపురం వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు తప్పుడు అడ్రెస్ చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. వెంటనే కర్ణాటకలోని తుమకూరు నేరవిభాగం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కూడా హిందూపురం చేరుకున్నారు. సంయుక్తంగా గిరి ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. అతని అనుచరులైన మంజునాథ్, గోవిందు, వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలు, బెల్లెట్లు, సుమారు రూ.8 లక్షల నగదు, దాదాపు అరకిలో బంగారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిని కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోని బెవనహళ్లి వద్ద గోవిందు మూత్రవిసర్జన అంటూ వాహనాన్ని ఆపించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతన్ని తిరిగి పట్టుకుని బెంగళూరుకు తరలించారు. కుణిగల్ గిరి ముఠా సుమారు మూడు నెలలుగా హిందూపురంలో మకాం వేసి దం దాలు సాగించినట్లు తెలుస్తోంది. పట్టణంలోనే వివిధ ప్రాంతా ల్లో ఉంటూ చివరగా ఆరవింద్‌నగర్‌కు చేరుకున్నట్లు సమాచా రం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి ఈ ముఠా స్కెచ్ వేసిందనే వదంతులు పట్టణంలో వి న్పించాయి. ‘అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి కుట్రపన్నిన ముఠాను అరెస్టుచేసిన స్థానిక పోలీసులకు అభినందనలు’ అం టూ స్థానిక ఎంఐఎం నాయకులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే..దీన్ని స్థానిక పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఈ ముఠా స్థానికంగా కాకుండా కర్ణాటక ప్రాంతా ల్లో నేరాలకు పాల్పడుతూ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో హిందూపురంలో తలదాచుకున్నట్లు వారు చెబుతున్నారు. నిఘా వైఫల్యం : కర్ణాటక ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ పక్కనే ఉన్న హిందూపురంలో మకాం పెడుతున్నా నిఘా విభాగం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు ఏటీఎం నిందితుడు హిందూపురం వచ్చి సెల్‌ఫోన్‌ను విక్రయించి దర్జాగా జారుకున్నాడు. ఇప్పుడు కుణిగల్ గిరి ముఠా పట్టుబడింది. దీన్నిబట్టే నేరగాళ్లకు హిందూపురం షెల్టర్ జోన్‌గా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులైన రాహుల్‌గాంధీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, నందమూరి బాలకృష్ణ.. ఇలా ముఖ్యులు హిందూపురం వచ్చినప్పుడు పోలీసులు అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పుకున్నారు. అయితే..వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. -
చేనేతలకు నిమ్మల కుచ్చు టోపీ
సాక్షి, అనంతపురం : ‘‘నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే చేనేతలకు అండగా ఉంటా. మీ జీవితాల్లో వెలుగు నింపుతా. చేనేత మగ్గాల్లో పని చేసే ప్రతి కార్మికుడికి ఉపాధి కల్పించి పొట్ట నింపేందుకు కృషి చేస్తా’’ - ఇదీ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప హిందూపురంలోని ముదిరెడ్డిపల్లి చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు. కానీ చేనేతల పరిస్థితి మాత్రం మారలేదు. వారి జీవితాలను చీకటిమయం చేశారు. పొట్ట నింపేందుకు కృషి చేస్తానన్న ఆయన ఏకంగా పొట్ట కొట్టారు. గెలిచి ఐదేళ్లు పూర్తయినా అటువైపు కన్నెత్తి చూడలేదు. అంతలోనే బినామీ పేర్లతో ముదిరెడ్డిపల్లిలోనే పవర్‌లూమ్స్ ఏర్పాటు చేసి వాటిని తన సమీప బంధువుల ద్వారా నడిపిస్తూ వచ్చారు. చేనేత చట్టం ప్రకారం పవర్ లూమ్స్‌లో 11 రకాల నేతలు మాత్రమే తయారు చేయాల్సి వుంది. నిమ్మల కిష్టప్ప బినామీ పేర్లతో పవర్ లూమ్స్ ఏర్పాటు చేయక ముందు హిందూపురం నియోజకవర్గంలో దాదాపు 25 వేల చేనేత మగ్గాలు వుండేవి. పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి అన్ని రకాల వస్త్రాలు తయారు చేయడంతో మగ్గాలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. ప్రస్తుతం 5 వేల మగ్గాలు కన్పించడం కూడా కష్టమే. పవర్‌లూమ్స్ విచ్చల విడిగా ఏర్పాటు చేయడం వల్ల మగ్గాలపై చేతితో నేసే వస్తువులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. దీంతో అందులో పని చేస్తున్న కార్మికులు వేరే పని చేయడం చేత కాక రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లలేక ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మల కిష్టప్పకు అండగా నిలిచి ఓట్లు వేసి గెలిపిస్తే సాటి కులస్తుడిగా తమను ఆదుకుంటాడని నమ్మిన వారికే నమ్మక ద్రోహం చేశారని పలువురు చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు రావడ ంతో ఓట్ల కోసం తిరిగి చేనేత కులస్తులు గుర్తుచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. అందరి ముందు కడిగేయాలనే ఉద్దేశంతో సన్మానం చేస్తామని నిమ్మల కిష్టప్పను హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లికి ఆహ్వానించి చేనేతలకు చేసిన ద్రోహాన్ని బయట పెడుతూ ఇక ముందు ఓట్లు అడిగేందుకు రావద్దం టూ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సారి సొంత కులస్తులే నిమ్మల కిష్టప్ప పని తీరును ప్రశ్నించడంతో గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. బినామీ పేర్లతో ఆయన పవర్ లూమ్స్ నిర్వహిస్తుండటం వల్ల ఆ ప్రభావం మర మగ్గాలపై పడింది. మర మగ్గాలపై నేసే చీరలకు గిట్టు బాటు ధర రాకపోవడంతో అందులో పని చేస్తున్న కూలీలకు రోజు వారి కూలి కూడా గిట్టకపోవడంతో వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఎంపీగానే కాకుండా చేనేత, జౌళి శాఖ మంత్రిగా పని చేసినప్పుడు కూడా చేనేతలను ఆదుకున్న పాపాన పోలేదు. ఈ సారి ప్రచారం కోసం నిమ్మల కిష్టప్ప ఎక్కడికి వెళ్తున్నా ఆయన పని తీరుపై ప్రశ్నిస్తుండటంతో సరిగా ప్రచారం కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. చేనేతల కడుపు కొడుతున్న నిమ్మల నిమ్మలకిష్టప్ప ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నా ఏనాడూ చేనేతల సంక్షేమానికి పాటు పడింది లేదు. చేనేత కార్మికులంతా పవర్‌లూమ్స్‌ను నిషేదించాలని నెలల తరబడి పోరాటాలు చేశారు. కనీసం వారికి సంఘీభావం కూడా తెలపకుండా పవర్‌లూమ్స్‌ను ప్రోత్సహించి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకడం దారుణం. ఇప్పటికే ఎంపీ సొంత మండలం గోరంట్ల, సోమందేపల్లిలో పవర్‌లూమ్స్ నడుస్తున్నాయంటే ఈయన కు చేనేతలపై ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. పవర్‌లూమ్స్ నిషేధంపై చిత్తశుద్ధిగా ఎవరైతే పోరాడుతారో వారికే మా మద్దతు ఉంటుంది. - జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ధర్మవరం -
నలుగురూ నాలుగు దారులు
సాక్షి, అనంతపురం : హిందూపురం తెలుగుదేశం పార్టీలో ఉన్న నలుగురు నాయకులు ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కోదారి వెతుక్కుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. బాలక్రిష్ణ సోదరుని కుమారుడు సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రచారం కోసం అనుమతి తీసుకోకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయమే ఆయన హిందూపురం చేరుకున్నారు. వచ్చీ రాగానే పట్టణంలో రోడ్ షోలో పాల్గొనే విధ ంగా ముందుగానే రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అయితే స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా ఎవరూ తారకరత్న రోడ్ షోకు పర్మిషన్ తీసుకోలేదు. దీంతో తారకరత్న చేసేదిలేక లాడ్జికే పరిమితం అయ్యారు. ఎన్నికల వేళ ఏమి మాట్లాడాలో ఆయన కూడా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోకుండా నవ్వులపాలయ్యారు. రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి తీసుకోక పోవడంతో ఎటూ సమయం దొరికింది కదా అని మీడియాతో మాట్లాడుతూ బాబాయిని సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని తన మనసులో మాటను బయటకు వెల్లడించాడు. ఆ వెంటనే తేరుకొని కాదు కాదు ముఖ్యమంత్రి పదవి విషయమై మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలక్రిష్ణలు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడటంతో స్థానిక నాయకులు దిక్కులు చూస్తుండిపోయారు. రోడ్‌షోకు పోలీసులు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో తారకరత్న రోడ్డుపైకొచ్చారు. అయితే ఆయన రోడ్‌షోలో జనం కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. పనైపోయింది.. హిందూపురంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని టీడీపీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఇక్కడి గ్రూపు తగాదాల గోల భరించలేక.. బాలక్రిష్ణ నామినేషన్ వేసిన అనంతరం ఇతర జిల్లాలో ప్రచారం కోసమని వెళ్లిపోయారు. అప్పటి నుంచి స్థానిక నేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుండగా చేనేత వర్గానికి చెందిన హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను సన్మానం చేస్తామని ముదిరెడ్డిపల్లిలో వున్న చేనేత కుటుంబాలు సోమవారం రాత్రి పిలిపించి మరీ హెచ్చరించారు. గతంలో మంత్రిగా, ఎంపీగా వున్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమని, చేనేత కార్మికులకు దక్కాల్సిన నిధులు చాలా చోట్ల పక్కదారి పట్టినా వాటి గురించి స్పందించలేదని గట్టిగా నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో నిమ్మల కిష్టప్ప షాక్‌కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, సీపీ వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. వీరు దూరంగా ఉండటానికి కారణం వారిలో నెలకొన్న విభేదాలు ఒకటైతే... ప్రజల వద్దకు వెళ్తున్నా స్పందన కన్పించకపోవడంతోనే దూరం దూరంగా ఉంటున్నారనేది మరో కారణం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొనడంతో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తారకరత్న రెండు మూడు రోజులు హిందూపురంలోనే ఉండి ప్రచారం చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి రోజే స్థానిక నాయకులు హ్యాండ్ ఇవ్వడంతో ‘అదేంది బాబాయ్.. ఇక్కడ మన పార్టీ వాళ్లు ఇలాగున్నార’ం టూ బాలకృష్ణకు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు.