సాక్షి, సత్యసాయి: నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. తన ఆవేదన, బాధను సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసింది.
వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో మరో దారుణం జరిగింది. టీడీపీ నేతల ఒత్తిళ్లతో సుగుణమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా, చిలమత్తూరులో వికలాంగుడు నాగరాజు వెలుగు యానిమేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, తాజాగా అకారణంగా నాగరాజును విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో తనను ఎందుకు తొలగించారని నాగరాజు, అతడి భార్య సుగుణమ్మ ప్రశ్నించగా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేశారు.
దీంతో, సుగుణమ్మ మనాస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సందర్భంగా టీడీపీ నేతల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నెయిల్ పాలిష్ తాగి ఆమె ఆత్మహత్యయత్నం చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment