గుప్త నిధుల వేటలో పోలీసులు!
హిందూపురం : గుప్త నిధుల వేటలో లబ్ధిపొందలేదని ఇద్దరు పోలీసులు బరి తెగించారు. తమకు ఖర్చు అరుున మొత్తం రూ.30 లక్షలు చెల్లించాలని వేృట బందంలో సభ్యుడైన ట్యాక్సీ డ్రైవర్‌ను చిత్రహింసలు పెడుతున్నారు. కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేని తల్లి పురుగు మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పరిగి మండలం సీగుపల్లి నివాసి అయిన లింగమ్మ, కిష్టప్ప దంపతుల కుమారుడు రాజేష్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు గోపాల్, మంజు, మరో వ్యక్తి డెయిరీ బాలాజీలు బినామీ పేర్లతో వాహనాలు బాడుగకు నడుపుతున్నారు.
త్వరలో కోటీశ్వరులైపోవాలనే కోరికతో సదరు కానిస్టేబుళ్ల చూపు గుప్త నిధులపై పడిండి. ట్యాక్సీ డ్రైవర్ రాజేష్ సహాయంతో గుప్త నిధుల వేటకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మూడు పురాతన ఆలయూల్లో జేసీబీలతో తవ్వకాలు సాగించినట్లు తెలిసింది. తవ్వకాలు జరిపినపుడు ఒక రాగి బిందె మినహా సొమ్ములు దొరకలేదని సమాచారం. లాభాలొస్తే వాటా ఇస్తాం.. ఇపుడు తవ్వకాల కోసం చేసిన ఖర్చు రూ.30 లక్షలు తమకు తెచ్చివ్వాలని సదరు కానిస్టేబుళ్లు రాజేష్‌పై ఒత్తిడి తెచ్చారు.
పది రోజుల క్రితం అదుపులోకి తీసుకుని వారి శైలిలో ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజేష్ కోసం అతని భార్య రాధమ్మ, తల్లి లింగమ్మ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ‘నీ కుమారుడు రూ.30 లక్షలు అప్పు ఉన్నాడు. అది చెల్లించి విడిపించుకుపోండ’ని పోలీసులు చెప్పడంతో వారు కన్నీరు మున్నీరయ్యూరు. ‘కొన్నాళ్లుగా పోలీసులు గోపాల్, మంజు, మరొకాయన బాలాజీ అర్ధరాత్రిళ్లు మా ఇంటి కాడికి వచ్చి నా భర్తను పిలుచుకుపోయేవారు. ఎక్కడికెళ్తున్నారంటే చెప్పేవారు కాదు. ఏం జరిగిందో ఏమో పది రోజుల క్రితం మా ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు పట్టుకుపోరుునారు.