taxi driver
-
ట్యాక్సీ డ్రైవర్ కోసం లండన్ నుంచి హైదరాబాద్‌కు వివాహిత
శంషాబాద్: ‘మీరు చాలా అందంగా ఉన్నారు’ అంటూ ఓ యువకుడు పంపిన మేసేజ్‌కు ఆ వివాహిత మనసు గతితప్పింది. ‘మీ నవ్వు బాగుంటుంది’ అన్న మేసేజ్ చూడగానే 17 ఏళ్ల వివాహ బంధాన్ని సైతం ఆమె పక్కన పెట్టేసింది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న స్పృహ మరచి మెసేజ్ పంపిన వ్యక్తి కోసం ఏకంగా విదేశాల నుంచి రెక్కలు కట్టుకొని భాగ్యనగరానికి వాలిపోయింది. ఆన్లైన్ పేమెంట్‌తో.. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ఓ జంటకు 17 ఏళ్ల కిందట పెళ్లయింది. వారికి 13 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలం కిందట భర్తకు లండన్‌లో ఉద్యోగం రావడంతో ఆయన ఒక్కడే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహిత తల్లి చనిపోవడంతో ఆమె అస్తికలను కలిపేందుకు పహాడీషరీఫ్‌కు చెందిన ఓ ట్రావెల్స్ కారును బుక్ చేసుకొని వెళ్లి వచ్చింది. గూగుల్ పే ద్వారా ట్యాక్సీ డ్రైవర్ శివకు కిరాయి చెల్లించింది. దీంతో వివాహితపై కన్నేసిన అతను.. ఆమెకు గుడ్ మార్నింగ్ సందేశాలు పంపేవాడు. తొలుత వాటిని పట్టించుకోని వివాహిత ఆ తర్వాత అతని పొగడ్తల సందేశాలకు కరిగిపోయింది. ట్యాక్సీ డ్రైవర్‌తో ఫోన్లో సంభాషించడంతోపాటు పలుమార్లు అతన్ని కలిసింది. ఆమె ప్రవర్తనలో తేడాను గమనించిన అత్తింటి వారు.. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో వివరించారు. దీంతో అతను భార్య, ఇద్దరు పిల్లలను సెపె్టంబర్ 16న హైదరాబాద్ నుంచి లండన్ రప్పించుకున్నాడు. ఏం జరిగింది..? లండన్ వెళ్లినా వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. సెపె్టంబర్ 29న భర్త తల్లి చనిపోవడంతో అతను హైదరాబాద్ వచ్చాడు. ఆ మర్నాడే వివాహిత తన ఇద్దరి పిల్లలను లండన్‌లోని ఓ పార్కుకు తీసుకొచ్చి అక్కడే వదిలేసి ట్యాక్సీ డ్రైవర్‌ను కలిసేందుకు ముంబై మీదుగా హైదరాబాద్ చేరుకుంది. తల్లి తమను వదిలేసి ఎటో వెళ్లిపోయిందంటూ పిల్లలు తండ్రికి ఫోన్లో చెప్పడంతో అతను హుటాహుటిన ఈ నెల 1న లండన్‌కు తిరిగి చేరుకున్నాడు. భార్యకు పలుమార్లు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిoది. చివరకు కాల్ కలవడంతో ఆమెతో మాట్లాడగా తనను ఎవరో కిడ్నాప్ చేసి శంషాబాద్ మధురానగర్ నుంచి బాలాపూర్ వైపు తీసుకెళ్తున్నట్లు భర్తకు చెప్పింది.దీంతో అతను వెంటనే తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఆన్లైన్లో ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్జీఐఏ, రాజేంద్రనగర్, బోయిన్పల్లి పోలీసులు ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయగా చివరకు ఫోన్ లొకేషన్ రాజేంద్రనగర్‌లో చూపింది.శంషాబాద్ టు గోవా.. పలుమార్లు ట్యాక్సీ డ్రైవర్ ఫోన్‌కు కూడా ఫోన్లు చేయగా ఓసారి వివాహిత లిఫ్ట్ చేసి మాట్లాడింది. ట్యాక్సీ డ్రైవర్ తనను ట్రాప్ చేశాడని.. తాము గోవాలో ఉన్నట్లు తెలిపి లైవ్ లోకేషన్ షేర్ చేసింది. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వస్తున్నట్లు బస్సు టికెట్‌ను వాట్సాప్ చేసింది. దీంతో పోలీసులు సోమవారం ఉదయం ఆరాంఘర్ వద్ద వారిని బస్సులోంచి దింపి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకు చెప్పకుండా లండన్ ఎందుకు వెళ్లావని.. ఆత్మహత్య చేసుకొని నువ్వే కారణమని చెబుతానని ట్యాక్సీ డ్రైవర్ బ్లాక్మెయిల్ చేయడంతోనే తాను హైదరాబాద్‌కు వచ్చానని వివాహిత పోలీసులకు తెలిపింది. అయితే ట్యాక్సీ డ్రైవర్ మాత్రం ఈ నెల 5న తన పుట్టినరోజు ఉన్నందున.. ఆ వేడుకకు రావాలని ఆహ్వానించడంతో వివాహిత ఇష్టపూర్వకంగానే వచ్చిoదని పోలీసులకు వివరించాడు. మరోవైపు తన భార్యను తిరిగి లండన్ పంపాలని భర్త ఆర్జీఐఏ పోలీసులను కోరాడు. దీంతో పోలీసులు ఆమెను సోమవారం సాయంత్రం దగ్గరుండి లండన్ విమానం ఎక్కించారు. ట్యాక్సీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు... ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగానే కలుసుకున్నందున అతనిపై కేసు నమోదు చేయలేదు. -
Delhi Rains: ఢిల్లీ విమానాశ్రయంలో కూలిన పైకప్పు
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ జాతీయ విమానాశ్రయంలో టెరి్మనల్ 1 (పాతది) పై కప్పు పాక్షికంగా కుప్పకూలింది. కొంత భాగం కూలి నేరుగా కింద ఉన్న కార్లపై పడింది. దాంతో రమేశ్ కుమార్ (43) అనే ట్యాక్సీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆరుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అగి్నమాపక యంత్రాలు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాయి. కూలిన బీమ్ల కింద ఉన్న కారులోంచి ఒకరిని కాపాడారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ‘‘శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షంతో రూఫ్ షీట్, సపోర్ట్ బీమ్‌లు కూలాయి. పార్క్ చేసిన 4 కార్లు దెబ్బతిన్నాయి’’ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో టెరి్మనల్ 1 నుంచి అన్ని విమాన సేవలనూ నిలిపివేశారు. చెకిన్ కౌంటర్లను కూడా మూసేశారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాల్లో వసతి కలి్పంచారు. కొందరికి టికెట్ డబ్బులు తిరిగిచ్చారు. ఈ టెరి్మనల్లో ఇండిగో, స్పైస్‌జెట్ దేశీయ విమాన కార్యకలాపాలు సాగిస్తాయి. అవి కార్యకలాపాలను తాత్కాలికంగా టెరి్మనల్ 2, 3కి మార్చాయి. విస్తరించిన టెరి్మనల్ 1ను ప్రధాని మోదీ మార్చిలో ప్రారంభించారు. పూర్తిస్థాయి విచారణ: కింజరాపు పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు టెరి్మనల్ 1ను సందర్శించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.ప్రచార యావ వల్లే: ప్రతిపక్షాలు మోదీ సర్కారు ప్రచార యావ వల్లే టెరి్మనల్ పై కప్పు కూలిందని విపక్షాలు ఆరోపించాయి. నిర్మాణం పూర్తవకుండానే లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మోదీ దాన్ని హడావుడిగా ప్రారంభించారంటూ ఆప్ దుయ్యబట్టింది. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే దీనికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. -
ఏమైందో తెలియదు..! నడిరోడ్డుపై క్యాబ్ డ్రైవర్ని చితక్కొట్టారు..
అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి వృద్ధుడైన ఓ క్యాబ్ డ్రైవర్‌ను దారుణంగా కొట్టారు. నడిరోడ్డులో 60 ఏళ్ల వృద్ధునిపై విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించారు. బూటు కాలుతో తంతూ ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులు కలిసి దాడి చేశారు. నగరంలోని సిక్స్త్ అవెన్యూ 34 వ కూడలికి సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు ఫైరవుతున్నారు. వీడియో ప్రకారం ఐదుగురు కలిసి క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి దెబ్బలను తట్టుకోలేక ఆ వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి తలపై చేతులు పెట్టుకుని దీనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఓ మహిళ పిడిగుద్దులను భరించలేక క్యాబ్ వైపు వంగి పడిపోయాడు. ఈ దృశ్యాలు సదరు వీక్షకున్ని ఆలోచింపజేశాయి. ఈ వీడియో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట క్యాబ్ డ్రైవర్‌కు యువకులకు మధ్య వాగ్వాదం నడిచిందని తెలిపారు. అనంతరం దాడి జరిగినట్లు పేర్కొన్నారు. Just another day in NYC.... A group of thugs beat up a 60 year old taxi cab driver in Manhattan in broad daylight. Last year a 52 year old NYC cab driver was beaten to death by a group of teens. pic.twitter.com/v9SQAkCWcN — Leftism (@LeftismForU) July 28, 2023 తీవ్రంగా గాయపడిన వృద్ధున్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. హోవార్డ్ కొలీ, నటాలీ మోర్గాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ బ్రూక్లిన్కు చెందినవారిగా గుర్తించారు. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
టాక్సీ డ్రైవర్ సాహసం.. సూసైడ్ బాంబర్‌ని కారులోనే బంధించి
లండన్: రిమెంబరెన్స్ డే సర్వీస్ సందర్భంగా లివర్‌పూల్ నగరంలోని మెటర్నటీ ఆసుపత్రి వెలుపల జరిగిన కారు పేలుడులో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ పేలుడు సంభవించడానికి ముందు ఓ టాక్సీ డ్రైవర్ చాకచక్యంగా వ్యహరించి.. ఉగ్రవాదిని అడ్డుకోవడంతో ఒక్కరు మాత్రమే మరణించారు. లేదంటే డజన్ల కొద్ది జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ప్రస్తుతం సదరు టాక్సీ డ్రైవర్ని హీరోగా కొనియాడుతున్నారు లండన్ వాసులు. ఆ వివరాలు.. బాంబర్ లివర్‌పూల్‌లో రిమెంబరెన్స్ డే సర్వీస్ వద్దకు చేరుకుని.. తనను తాను పేల్చుకుని మారణహోమం సృష్టించాలని భావించాడు. ఈ క్రమంలో తన శరీరం మీద పేలుడు పదార్థాలను అమర్చుకుని లివర్‌పూల్‌కు వెల్లడానికి క్యాబ్ ఎక్కాడు. అయితే ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో.. క్యాబ్‌ను లివర్‌పూల్ మెటర్నటీ ఆస్పత్రి వద్దకు డైవర్ట్ చేశారు. (చదవండి: యూకే లివర్‌పూల్ నగంలో కారు బ్లాస్ట్...ఒకరు మృతి) ఆస్పత్రి వద్దకు వెళ్తుండగా.. తన కారులో కూర్చున్న వ్యక్తి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో టాక్సీ డ్రైవర్ అతడిని ఓ కంట కనిపెడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు వచ్చే లోపు తన కారులో ఉన్న వ్యక్తి సూసైడ్ బాంబర్ అని టాక్సీ డ్రైవర్‌కు అర్థం అయ్యింది. మెటర్నటీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే టాక్సీ డ్రైవర్ వెంటనే కిందకు దిగి బాంబర్‌ని క్యాబ్‌లో లాక్ చేశాడు. (చదవండి: కాబుల్ మరోసారి దద్దరిల్లింది.. రాకెట్ దాడిగా అనుమానం) అనంతరం బాంబర్ల కారులో ఉండే తనను తాను పేల్చుకున్నాడు. ఈ ప్రమాదంలో బాంబర్ మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తన సమయస్ఫూర్తి, సాహసంతో ఎందరో ప్రాణాలు కాపాడిన టాక్సీ డ్రైవర్‌కు చిన్న చిన్న గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. టాక్సీ డ్రైవర్ చూసిన సాహసం తెలుసుకున్న ప్రజలు అతడిని నిజమైన హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: భారీ పేలుడు.. రద్దీమార్కెట్ మొత్తం రక్తసిక్తం -
Mukesh Ambani House: ‘అంటిలియా’ అడ్రస్ అడిగిన ముగ్గురి అరెస్టు!
Mukesh Ambani House: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసమైన అంటిలియా అడ్రస్ ఆరా తీసిన ముగ్గురు అనుమానితులను న్యూ ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఆధారాల ప్రకారం స్థానిక ఆజాద్‌మైదాన్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, నాకా బందీ నిర్వహించి న్యూ ముంబైలో వారిని పట్టుకున్నారు. సోమవారం అంబానీ నివాసమైన అంటిలియా భవనం ఎక్కడుందని ఖిల్లా కోర్టు వద్ద నీలం రంగు కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తనని అడిగారని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. వారి వద్ద ఓ బ్యాగు ఉందని తెలిపాడు. ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే నాకా బందీ ఏర్పాటు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల ఊహాచిత్రాలను తయారు చేశారు. న్యూ ముంబైలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ముగ్గురు గుజరాత్‌కు చెందిన వారుగా గుర్తించారు. వీరు ముంబై పర్యటించేందుకు వచ్చారని చెప్పారు. గుగుల్ యాప్ పనిచేయకపోవడంతో అంటిలియా భవనం అడ్రస్ గురించి ఆ ట్యాక్సీ డ్రైవర్‌ను అడిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనక విధ్వంసం సృష్టించే ఎలాంటి దురుద్ధేశం వారికి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. విశ్రాంతి లేకుండా పోరాడుతూ ఆ నొప్పిని..) -
క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి: మరో షాకింగ్ వీడియో వైరల్
లక్నో: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో ఫుటేజ్ పరిశీలించగా ఆ యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తేలింది. దీంతో ఆ యువతిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ యువతికి సంబంధించిన మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్) లక్నోలో ప్రియదర్శిని నారాయణ యాదవ్‌కు సంబంధించిన వీడియో ఆమె ప్రవర్తనా తీరును స్పష్టంగా చెబుతోంది. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవకు దిగింది. వెంటనే రంగు మార్చాలని గట్టిగా అరుస్తూ ఉంది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. డ్రోన్స్ ద్వారా దాడి జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్ డ్రైవర్‌పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే ఏమిటి? నీ ఒంటిపై కూడా నలుపు రంగు దుస్తులు ఉన్నాయి కదా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. This is the 2 Year Old Video Of #PriyadarshiniYadav Arguing with Neighbours over the Black Colour of their Main Gate. Credits: ig@be_harami#ArrestLucknowGirl #PriyadarshiniNarayan pic.twitter.com/KMB5eR6IW0 — Fackt Checker (@FacktChecker) August 5, 2021 -
‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్ డ్రైవర్ ఆవేదన
లక్నో: రెండు రోజుల క్రితం లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్ డ్రైవర్ తనను ఢీకొన్నాడని.. అతడిని కొట్టింది. ఇక సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో సదరు యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదు. ఈ వీడియో చూసిన జనం.. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తనకు జరిగిన అవమానం మాటేంటి.. పోయిన పరువు మళ్లీ తిరిగి వస్తుందా అని క్యాబ్ డ్రైవర్ ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంతకు ఆ రోజు ఏం జరిగిందో క్యాబ్ డ్రైవర్ మాటల్లోనే.. క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటిలానే నేను ఆ రోజు క్యాబ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.. అలంబాగ్ నహరియా చౌరహా సిగ్నల్ వద్ద వేచి ఉన్నాను. ఇంతలో సదరు మహిళ రోడ్డు మీద అజాగ్రత్తగా నడుస్తూ కనిపించింది. దాంతో నేను నెమ్మదిగా వెళ్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి ఆమె వెనక్కి వచ్చి నాపై దాడి చేసింది. మొబైల్ విసిరికొట్టింది’’ అని తెలిపాడు. ‘‘కాసేపటికి అక్కడ జనాలు మూగడంతో సమస్య మరింత పెద్దదయ్యింది. నా మాట ఎవరు వినిపించుకోలేదు. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఈ ఘటనలో నా కారు డామేజ్ అయ్యింది. మొత్తం మీద నాకు 60 వేల రూపాయల నష్టం వాటిల్లింది. వీటన్నింటికి మించి నా ఆత్మాభిమానం దెబ్బతిన్నది.. పరువు పోయింది. నా తప్పు లేకున్నా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటిని తిరిగి సరిచేయగలా.. నా పరువు తెచ్చివ్వగలరా’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన రెండో సీసీటీవీ ఫుటేజ్ చూసిన నెటిజనులు సదరు యువతిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ తప్పు లేకుండానే క్యాబ్ డ్రైవర్ని అవమానించారు.. తప్పు చేసిన యువతిని వదిలేయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
‘సిగ్నల్ వద్ద యువతి అతి’, అసలేం జరిగిందంటే..
సిగ్నల్ దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్‌ను, అతనికి సపోర్ట్‌గా వచ్చిన మరో వ్యక్తిని ఉత్తపుణ్యానికే రెచ్చిపోతూ చితకబాదింది ఓ యువతి. ఉత్తర ప్రదేశ్ లక్నో అవుధ్ సిగ్నల్ దగ్గర జులై 30న రాత్రి 9.40కి ఈ ఘటన జరగ్గా.. మూడు రోజుల తర్వాత సోషల్ మీడియా, మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అయ్యింది ఆ వీడియో. దీంతో ఆ యువతిని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తునే నిరసన నడిచింది.. ఇంకా నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరి కెమెరాల ఆధారంగా అక్కడేం జరిగిందో మీడియాకు వివరించారు. సిగ్నల్ పడకముందే రోడ్డు క్రాస్ చేయాలని ప్రయత్నించిన యువతి.. సరిగ్గా సిగ్నల్ పడిన టైంలో వేగంగా వస్తున్న ఓ కారు ముందట ఆగింది. ఆ వెంటనే క్యాబ్ డ్రైవర్ మీద ఊగిపోతూ.. ఆమె దాడి చేయడం రికార్డయ్యింది. ఫోన్ పగలకొట్టడంతో పాటు కారులో ఉన్న 600రూ. లాగేసుకుంది. అదంతా అంతా అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వాహనదారులంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. చాలాసేపు ట్రాఫిక్ కూడా జామ్ అయ్యింది. దీంతో పోలీసులు వచ్చారు. A man's dignity is equivalent to a woman's dignity. Cab driver Ali of #Lucknow is a true gentleman and he didn't slap back demonstrate his upbringing. #LucknowGirl Priyadarshani Yadav beats driver Ali in presence of @lkopolice. Here's CCTV footage, #ArrestLucknowGirl pic.twitter.com/dBOANBc5Dg — Joydeep Roy (@jdroy_) August 2, 2021 అటుపై యువతిని, ఆ క్యాబ్ డ్రైవర్‌ను.. అందులో ఉన్న అతని ముగ్గురి స్నేహితుల్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా తనకు చిన్న గాయం కూడా అయ్యిందని, తనకు న్యాయం చేయాలని పోలీసుల ముందు వాపోయింది ఆ యువతి. దీంతో సదాత్ అలీ సిద్ధిఖీపై నిర్లక్క్ష్య పూరిత డ్రైవింగ్ నేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని.. స్టేషన్లోనే ఉంచారు. ఆపై పూచీకత్తు మీద రిలీజ్ చేశారు. వైరల్ వీడియో ద్వారా ఈ మొత్తం విషయం బయటకు రావడంతో.. క్యాబ్ డ్రైవర్‌కు న్యాయం చేయాలంటూ ట్విటర్ హోరెత్తింది. కళ్ల ముందు ఏం జరిగిందో కనిపిస్తున్నా.. పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యువతి అరెస్ట్ డిమాండ్ చేస్తూ.. #ArrestLucknowGirl హ్యాష్ ట్యాగ్ నడిపించారు. మరోవైపు ఆ యువతి ఆచూకీ కోసం ఇంటర్నెట్లో విపరీతంగా వెతికారు నెటిజన్స్. Cab driver demands his self respect 😔🙏#lucknowgirl #justiceforcabdriver #ArrestLucknowGirl #Feminism pic.twitter.com/S4eYqRHyCd — Ashishhh (@cricAshish2002) August 3, 2021 ఈ పరిణామాల తర్వాత సోమవారం కృష్ణా నగర్ పోలీస్ స్టేషన్లో యువతిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఉద్దేశపూర్వకంగా దాడి, వస్తువుల్ని నాశనం చేసిన నేరాల కింద కేసు నమోదు అయినట్లు లక్నో అదనపు డీసీపీ చిరంజీవ్నాథ్ సిన్హా వెల్లడించారు. ఇది తన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని, న్యాయం కావాలని బాధితుడు కోరుతున్నాడు. ఇంకోవైపు ఈ యువతి పేరు ప్రియదర్శిని అంటూ కొందరు.. ఆ అమ్మాయి ఫోటోలను వైరల్ చేస్తున్నారు కూడా. -
Viral Video: ఎవడైతే నాకేంటి?.. ఎగిరెగిరి కొడుతూ ఓవరాక్షన్!
-
సిగ్నల్ దగ్గర యువతి ఓవరాక్షన్.. కుదిపేస్తున్న వీడియో
సోషల్ మీడియా అంటే వైరల్ వీడియోలకు హబ్. ప్రేమ-పగ-దాడి.. అదీ ఇదీ అనే తేడా లేకుండా ఏదైనా హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో నడిరోడ్డుపై ఓ యువతి చేసిన రచ్చ వీడియో సోషల్ మీడియాను కుదిపిస్తోంది. #ArrestLucknowGirl హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నోలోని అవధ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఓ వ్యక్తిని నడిరొడ్డులో ఓ యువతి చితకబాదడం అందులో ఉంది. నాన్ స్టాప్‌గా అతన్ని కొడుతుంటే.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో సహా అక్కడున్నవాళ్లంతా ఆ తతంగం చూస్తూ ఉండిపోయారు. కారణం అడుగుతుంటే.. ఆ వ్యక్తి ఫోన్‌ను లాక్కుని మరీ పగలకొట్టింది ఆ యువతి. అంతేకాదు అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్ లాగి మరీ బాదేసింది. ఈ టైంలో భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. వెనకాల ఉన్న చాలామంది ‘ఆ అమ్మాయికి బుద్ధుందా?’ అంటూ వెనకాల నుంచి అరవడం వినొచ్చు. అయినా పట్టించుకోకుండా ఆ అమ్మాయి ఎగరి ఎగిరి మరీ ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వ్యక్తిని ‘నీకేం పనిరా’ అంటూ మరీ బాదింది. ఇక తనను ఢీకొట్టిన కారణంగానే ఈ పని చేసినట్లు ఆ యువతి అందులో మాట్లాడినట్లు ఉంది. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాను కుదిపిస్తోంది. సరిగ్గా ఏ తేదీన జరిగిన ఘటనో తెలియదుగానీ.. ‘మేఘ్ అప్డేట్స్’ అనే ట్విటర్ పేజీ నుంచి ఈ వీడియో సర్క్యూలేట్ అయ్యింది. ఇక ఈ ఘటనలో ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలంటూ ట్వీట్లు చేస్తుండగా.. ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో హ్యాష్ ట్యాగ్ కొనసాగుతోంది. అసలేం జరిగింది అనేదానిపై లక్నో పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.. -
కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్; కానీ ట్విస్ట్ ఏంటంటే
అబుదాబి: 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ 2008లో కేరళ నుంచి అబుదాబికి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్లలో ఎప్పుడు కలిసిరాని అదృష్టం ఒక్కరాత్రిలోనే వరించింది. లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హామ్( భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్‌టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది.ఇక తన వాటా కింద సోమరాజన్‌కు ఎంతలేదన్న దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న సోమరాజన్‌కు పంట పండినట్లే. ఇదే విషయమై రెంజిత్ సోమరాజన్ స్పందిస్తూ.. '' నాకు ఇంత జాక్‌పాట్ తగులుతుందని ఊహించలేదు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చాను. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారాను. గతేడాది ఒక కంపెనీ డ్రైవర్ కమ్ సేల్స్‌మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో నేను సరైన సేల్స్ చేయని కారణంగా నా జీతంలో కోత విధించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటినుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందని మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు. -
నడిరోడ్డుపై వదిలేసిన ట్యాక్సీ డ్రైవర్.. అర్ధరాత్రి భర్త మృతదేహంతో..
సాక్షి, టెక్కలి రూరల్: మండలంలోని అక్కవరం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఒక మృతదేహాన్ని రహదారిపై దించి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ప్రదీప్, అంజలి అనే దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రదీప్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు స్వస్థలం ఒడిశాలోని బాలా సోర్కు ట్యాక్సీలో వెళ్తున్నారు. టెక్కలి సమీపంలోకి రాగానే ప్రదీప్ బండిలోనే మృతి చెందడంతో ట్యాక్సీ డ్రైవర్ ఆ మృతదేహంతో పాటు ఆమెను కూడా వాహనం నుంచి కిందకు దించి వెళ్లిపోయాడు. దీంతో నడిరోడ్డుపై తన భర్త మృతదేహంతో ఆ మహిళ ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరో వాహనాన్ని సమకూరుస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ‘స్పీకర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు’ ఆమదాలవలస: స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ రోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పు డు ప్రచారాలు నమ్మవద్దని స్పీకర్ క్యాంపు కా ర్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. స్పీకర్ దంపతులకు వారం కిందట కరోనా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తు తం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
ట్యాక్సీ డ్రైవర్ ఆత్మహత్య: ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన
బెంగళూరు: డ్రైవర్ ఆత్మహత్యకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో విమానశ్రాయంలో టాక్సీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. కర్ణాటక టూరిజం శాఖలో పని చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం తన కారులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్రైవర్ బుధవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు ‘‘బీఎల్‌ఆర్‌ఏ విమానాశ్రయంలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం. ప్రయాణికులు బీఎంటీసీ బస్సు సేవలను, వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అంటూ ట్వీట్ చేసింది. Taxi services at @BLRAirport have been regularised. Passengers may opt for app-based taxis or BMTC bus services for travel to and from BLR Airport.#taxi #bengaluru #KIAB #bengaluruairport pic.twitter.com/KB55MQ9VBP — BLR Airport (@BLRAirport) March 31, 2021 రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ప్రతాప్ (32) అనే ట్యాక్సీ డ్రైవర్ మంగళవారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రతాప్ బుధవారం ఉదయం మరణించాడు. ఇందుకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ప్రతాప్ మృతికి కారణాలు తెలియదు. తీవ్రంగా గాయపడటంతో అతడి వద్ద నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేకపోయాం’’ అని తెలిపాడు. -
ఎంపీతో అసభ్య ప్రవర్తన, ట్యాక్సీ డ్రైవర్ అరెస్టు
కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, హీరోయిన్ మిమి చక్రవర్తితో అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యాక్సీ డ్రైవర్‌ను కోల్‌కత పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిమ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న ఎంపీ కారును పశ్చిమ బెంగాల్‌లోని గరియాహట్ వద్ద సదరు ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడమే కాకుండా ఆసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో డ్రైవర్‌ను మిమి పోలీసులకు పట్టించి అతడిపై ఫిర్యాదు చేశారు. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం జిమ్ నుంచి తిరిగి వస్తున్న ఎంపీ మిమి చక్రవర్తి కారును ఓ ట్యాక్సీ డ్రైవర్ వెంబడించడం ఆమె గమనించారు. అతడు కారు పక్కనే తన ట్యాక్సీని తీసుకువచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే మొదట ఆమె దీనిని పట్టించకోకుండా తన దారిన తను వెళ్లిపోయారు. సదరు డ్రైవర్ మళ్లీ తన కారును ఓవర్ టేక్ చేసి అదే తరహాలో ప్రవర్తించడంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (చదవండి: కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్బంధంలో హీరోయిన్) ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు గరియాహట్ పోలీసులు తెలిపారు. నిందితుడిని మెట్ర పాలిటన్ బైపాస్ సమీపంలోని ఆనందపూర్‌కు చెందిన లక్ష్మణ్ యాదవ్ (32)గా గుర్తించారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354,354ఎ,354డి, 509 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎంపీ మాట్లాడుతూ.. ‘నా కారును ఓ ట్యాక్సీ వెంబడించడం గమనించాను. నేను నా కారులో ఉన్నాను. అయితే ఆ డ్రైవర్ నా వైపు చూస్తూ అసభ్యకరంగా సైగ చేశాడు. మొదట అది నేను పట్టించుకోకుండా నా కారు వేగంగా ముందుకు పోనిచ్చాడు. అతడు నా కారు అతి వేగంగా ఓవర్ టేక్ చేసి మళ్లీ అదే తరహా ఆసభ్యకరంగా సైన్ చేశాడు. ఇప్పుడు నేను అతడిని వదిలేస్తే ఆ తర్వాత అతడి ట్యాక్సీలో ప్రయాణించే మరికొందరూ స్త్రీలు కూడా అతడి వేధింపులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అది సురక్షితం కాదని ఆలోచించాను. వెంటనే అతడి కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాను’ అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.(చదవండి: శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి) -
కరోనా: ఉచిత సేవకు ఊహించని గౌరవం!
-
కరోనా: ఉచిత సేవకు ఊహించని గౌరవం!
మాడ్రిడ్: కరోనా రక్కసి మృత్యు క్రీడతో అల్లాడుతున్న స్పెయిన్‌లో ఓ స్ఫూర్తిమంతమైన సన్నివేశం చోటుచేసుకుంది. కోవిడ్ బారినపడినవారిని ఉచితంగా ఆస్పత్రికి చేరుస్తూ ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే, అతని సేవలను గుర్తించిన ఓ ఆస్పత్రి యాజమాన్యం వినూత్నంగా స్వాగతం పలికింది. రికవరీ పేషంట్‌ను తీసుకువెళ్లాలంటూ అతన్ని రప్పించిన ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ (నిలబడి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పడం) ఇచ్చారు. (చదవండి: మూడు రోజుల ఆఫీసు!) దాంతోపాటు మనీ ఎన్వలప్‌ను అందించారు. అనూహ్య సంఘటనతో ట్యాక్సీ డ్రైవర్ ఆశ్చర్యం, ఆనందాలకు లోనయ్యాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా 23 లక్షలకు పైగా జనం కోవిడ్-19 బారిన పడగా.. 1,61,191 మంది మృతి చెందారు. ఆరు లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. 20,639 మరణాలతో స్పెయిన్ మూడో స్థానంలో ఉండగా.. 39,015 మృతులతో అమెరిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 23,227 మరణాలతో ఇటలీ రెండో స్థానంలో ఉంది. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 77,357 మంది కోలుకున్నారు. (కరోనా: మరకల మాస్కులు అవసరమా..!) -
ఆమె వాలెట్‌ను అప్పగించిన పాక్ డ్రైవర్..
దుబాయ్ : ఓ భారత విద్యార్థినికి పాకిస్తాన్ టాక్సీ డ్రైవర్ సాయం చేశాడు. ఆమె పోగొట్టుకున్న వాలెట్‌ను తిరిగి ఇచ్చి.. ఇబ్బంది పడకుండా ఆదుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన రాచెల్ రోజ్ విద్యార్థిని కుటుంబం దుబాయ్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే డిగ్రీ పూర్తిచేసిన రోజ్.. ప్రస్తుతం యూకేలోని లాంకాస్టర్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇటీవల హాలీడే కోసం దుబాయ్ వచ్చిన రోజ్.. అక్కడ ఓ ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. జనవరి 4వ తేదీన బుర్జుమాన్ దగ్గర్లో సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో రోజ్ ఫ్రెండ్‌తో కలిసి పాకిస్తాన్‌కు చెందిన ఖాదీమ్ టాక్సీ ఎక్కారు. అయితే అదే సమయంలో మరో కారులో వారి స్నేహితులు ఉండటం చూసిన రోజ్.. వెంటనే కారులో నుంచి దిగిపోయారు. వారి వద్దకు వెళ్లే తొందరలో తన వాలెట్‌ను ట్యాక్సీలో మరిచిపోయారు. రోజ్ వాలెట్లో ఎమిరేట్స్ ఐడీ, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, క్రెడిట్ కార్డు, కొంత మొత్తంలో డబ్బులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత తన వాలెట్ పోగొట్టుకున్న సంగతి గుర్తించిన రోజ్ ఆందోళన చెందారు. తిరిగి యూకేకు వెళ్లే సమయం దగ్గర పడటంతో (జనవరి 8) ఆమె ఒత్తిడికి లోనయ్యారు. అంతేకాకుండా 13న ముఖ్యమైన పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే రోజ్ వద్ద కనీసం వీసాకు సంబంధించిన కాపీ కూడా లేకపోవడంతో ఆమె యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. అధికారులు మాత్రం.. తిరిగి వీసాకు దరఖస్తు చేసుకోవాల్సిందిగా రోజ్‌కు సూచించారు. దీంతో రోజ్ తన వాలెట్ కోసం పోలీసులను ఆశ్రయించారు. రోజ్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఆమె కారు ఎక్కిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. అయితే రోజ్ ఎక్కిన కారు నెంబర్‌ను మాత్రం సరిగా గుర్తించలేకపోయారు. రోజ్ కారు ఎక్కి.. వెంటనే దిగిపోవడంతో డ్రైవర్ మీటర్‌ను స్టార్ట్ చేయలేదు. దీంతో ఆర్టీఏ కాల్ సెంటర్ ద్వారా డ్రైవర్ ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఆమె వాలెట్‌ను గుర్తించడం కష్టంగా మారింది. మరోవైపు రోజ్ దిగిపోయిన తరువాత ఖాదీమ్ రెండు ట్రిప్పులు పూర్తి చేశాడు. ఆ తర్వాత కారులో వాలెట్‌ను గుర్తించిన అతడు.. దానిని ఓపెన్ చేసి చూశాడు. కానీ అందులో రోజ్‌ను సంప్రదించడానికి అవసరమైన ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆర్టీఏ కాల్‌సెంటర్‌కు కాల్ చేసిన ఖాదీమ్.. తనకు లభించిన వాలెట్లోని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఆమె అడ్రస్ కోసం ప్రయత్నించాడు. కానీ అప్పటికే రాత్రి 10 గంటలు దాటడంతో అది సాధ్యపడలేదు. ఇందుకోసం ఇతర విభాగం అధికారులను సంప్రదించాల్సిందిగా సూచించారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాలని భావించాడు. కానీ మరో ట్యాక్సీ డ్రైవర్ ఇచ్చిన సూచన మేరకు ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాడు. అయితే అవన్నీ విఫలం అయ్యాయి. చివరకు తెల్లవారుజామున 3.30 గంటలకు ఆర్టీఏ కాల్ సెంటర్ నుంచి ఖాదీమ్‌కు ఫోన్ వచ్చింది. అతడు చెప్పిన వివరాలు.. తమకు వచ్చిన ఫిర్యాదుకు సరిపోలడంతో ఆర్టీఏ కాల్ సెంటర్ అధికారులు అతనికి రోజ్ అడ్రస్ చెప్పారు. దీంతో ఖాదీమ్ వాలెట్‌ను రోజ్‌కు అందజేశాడు. తన కుమార్తె వాలెట్ తిరిగి లభించడంతో ఆనందంతో రోజ్ తండ్రి ఖాదీమ్‌కు 600 దినార్లు ఇవ్వగా తిరస్కరించాడు. రోజ్‌ను సోదరిగా భావించి ఆ డబ్బును తీసుకోలేదని ఖాదీమ్ తెలిపారు. అయితే రోజ్ కుటుంబం ఖాదీమ్‌ను అభినందిస్తూ.. ఆర్టీఏకు లేఖ రాసింది. -
మనోడిని విందుకు పిలిచారు..
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. అయితే పాకిస్తాన్ టీమ్‌లోని కొందరు భారత ట్యాక్సీ డ్రైవర్ పట్ల తమ సహృదయతను చాటుకుని ప్రేక్షకుల మన్నన చూరగొన్నారు. ఈ ఘటన గురించి ప్రముఖ కామెంటేటర్ ఆలిసన్ మిచెల్ రేడియో ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడించారు. ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్స్‌న్‌కు ఈ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. ‘యాసిర్ షా, షహీన్ ఆఫ్రిది, నసీమ్ షా సహా ఐదుగురు పాకిస్తాన్ క్రికెటర్లు ఇండియన్ రెస్టరెంట్‌కు వెళ్లాలనుకున్నారు. భారత ట్యాక్సీ ఒకరు ఈ ఐదుగురిని ఇండియన్ రెస్టరెంట్‌కు తీసుకెళ్లాడు. ట్యాక్సీ దిగిన తర్వాత డబ్బులు ఇవ్వగా డ్రైవర్ సున్నితంగా తిరస్కరించాడు. తమ పట్ల భారత ట్యాక్సీ డ్రైవర్ చూపిన ఆదరాభిమానులకు ముగ్దులైన పాక్ క్రికెటర్లు అతడిని తమతో పాటు భోజనానికి పిలిచారు. పాకిస్తాన్ ఆటగాళ్ల పక్కన కూర్చుని ఆనందంగా విందు ఆరగిస్తున్న ఫొటోలను తన ఫోన్లో ట్యాక్సీ డ్రైవర్ తనకు చూపించాడ’ని ఆలిసన్ మిచెల్ వెల్లడించారు. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానవీయ కథనం చాలా బాగుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. గ్రేట్ స్టోరీ అంటూ కొంతమంది ప్రశంసించారు. -
అమెరికన్‌కు క్యాబ్‌డ్రైవర్ టోకరా
న్యూఢిల్లీ : వరుస పండుగలతో ఢిల్లీలో వాణిజ్య సంస్థలను మూసివేశారని ట్యాక్సీ డ్రైవర్ ఓ అమెరికన్‌ను రూ 90,000కు టోకరా వేసిన ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికా జాతీకయుడు జార్జ్ వన్మిటర్ ఈనెల 18న ఢిల్లీకి చేరుకుని తాను బుక్ చేసుకున్న హోటల్‌కు వెళ్లేందుకు ట్యాక్సీ డ్రైవర్‌ను సంప్రదించగా పండగల నేపథ్యంలో సిటీలో షట్‌డౌన్ కొనసాగుతోందని నమ్మించే ప్రయత్నం చేశాడు. టూరిస్ట్‌ను నకిలీ ట్రావెల్ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లి తన టూర్‌ను తిరిగి ప్లాన్ చేసుకునేలా చేశాడు. తాను పహర్‌గంజ్‌లోని ఓ హాటల్లో రూమ్‌ను బుక్ చేసుకోగా అక్కడికి తీసుకువెళతానని చెప్పిన ట్యాక్సీ డ్రైవర్ కన్నాట్‌ప్లేస్‌లోని నకిలీ ట్రావెల్ ఏజెన్సీకి తీసుకువెళ్లాడని, అక్కడి సిబ్బంది కూడా తనకు నగరంలో షట్‌డౌన్ ఉందని , పహర్గంజ్లో తాను బుక్ చేసిన హోటల్‌ను కూడా మూసివేశారని చెప్పారని బాధితుడు తెలిపారు. అక్కడి నుంచి తనను నిందితుడు మరో నకిలీ టూర్ ఏజెన్సీ వద్దకు తీసుకువెళ్లగా, వారు తనకు జైపూర్, ఆగ్రాలోని హోటల్స్‌లో రూమ్ బుక్ చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి డబ్బు చెల్లించి తాను ఆగ్రా వెళ్లానని చెప్పారు. ఆగ్రా వెళ్లిన తర్వాత వారు చేసిన మోసం గుర్తించి ఢిల్లీలోని హోటల్‌కు తాను చెల్లించిన డబ్బును వెనక్కిఇవ్వాలని కోరానని తెలిపారు. అమెరికన్ జాతీయుడ్ని మోసం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. -
బైక్ టాక్సీ బుక్‌చేసిన యువతితో డ్రైవర్..
లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని సికందర్ బాగ్ నుంచి బైక్ టాక్సీపై న్యూ హైదరాబాద్‌లోని కార్యాలయానికి వెళుతున్న 27 ఏళ్ల అమెరికా యువతిని డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. ప్రైవేట్ భాగాల దగ్గర టచ్ చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె బైక్ నుంచి దిగిపోయి, తన తోటి ఉద్యోగులకు విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు బైక్ టాక్సీ డ్రైవర్ విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాకు చెందిన ఒక యువతి హజరత్ గంజ్‌లోని ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ, న్యూ హైదరాబాద్‌లోని మేథా లెర్నింగ్ ఫౌండేషన్‌లో పనిచేస్తోంది. ఉదయం ఆమె తన కార్యాలయానికి వెళ్లేందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. ఆమెను బైక్‌పై తీసుకు వెళుతుండగా డ్రైవర్ ఆమెను వేధింపులకు గురిచేశాడు. శృంగారం గురించి మాట్లాడుతూ.. ఆమెను వేధించడం మొదలెట్టాడు. వద్దని వారించినా వినకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో బైకి దిగి వెళ్లిపోయిన యువతి.. తోటి ఉద్యోగుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విజయ్ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.10 వేల సాయం.. 12నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు
సాక్షి, అమరావతి: సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టాలని అనుకున్నామన్నారు. కానీ మార్గదర్శకాలు సరళతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. లేనిపోని నిబంధనలతో పథకాన్ని నిరాకరించే విధంగా, విసుగు తెప్పించే విధంగా ఉండకూడదని స్పష్టం చేశారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మార్గదర్శకాలను సరళీకరిస్తున్నామన్నారు. మార్గదర్శకాలన్నింటిని మీడియా ద్వారా వెల్లడించిన తర్వాత ఈ నెల 12న ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతామని కృష్ణబాబు తెలిపారు. -
మా ఊరు నచ్చిందా? మేం నచ్చామా?
‘‘చాలామంది మా దేశం బావుండదని, ఇక్కడి వారు సరిగ్గా ప్రవర్తించరని అంటుంటారు. మేం ఎంత చక్కగా ఉన్నామో చూడండి, మా డ్రైవర్ మిమ్మల్ని ఎంత ఆత్మీయంగా చూస్తున్నాడో చూడండి. మీతో ఎంత స్నేహంగా ఉన్నారో చూడండి, మీ దేశం వెళ్లి ఈ విషయం నలుగురికీ చెప్పండి చాలు’’ అని చిన్నపిల్లల్లా చెబుతారట ఆ దేశంలో! అన్నింటికీ మించి, ఏ ప్రాంతానికి వెళ్లినా, ‘‘మా ఊరు నచ్చిందా, మేం నచ్చామా, మేం మీతో స్నేహంగా ఉన్నామా లేదా, మా ట్యాక్సీ డ్రైవర్ మీతో మర్యాదగానే నడుచుకున్నాడా?’’ అని ఎంతో మర్యాదగా అడుగుతారట అక్కడి డ్రైవర్లు. ఇటీవలే కుటుంబంతో పాటు మెక్సికో వెళ్లొచ్చిన ఆయుర్వేద వైద్య నిపుణులు డా. గాయత్రీదేవి చెప్పారు ఈ మాట. మెక్సికోలో కొద్దిమంది మాత్రమే ఇంగ్లీషు అర్థం చేసుకోగలరట. ‘‘షాపింగ్, సిటీ బస్... అన్ని ప్రదేశాలలోనూ స్పానిష్ మాట్లాడతారు. అందుకే మా అమ్మాయి అపరాజిత (అమెరికాలో ‘ఆపిల్’లో పనిచేస్తున్నారు) ముందుగానే స్పానిష్ బాగా నేర్చుకుంది’’ అని చెప్పారు గాయత్రి. ఇంకా ఆమె చెప్పిన వివరాలను బట్టి.. మెక్సికోలోని టూరిస్టు స్పాట్లలో ఒకరిద్దరు గైడ్స్ మాత్రమే ఇంగ్లీషు మాట్లాడతారు. హోటల్స్‌లో స్పానిష్ తప్పనిసరి. స్పానిష్ అక్షరాలు చూడటానికి ఇంగ్లీషులాగానే ఉంటాయి. అక్షరాలకు పైన, కింద రకరకాలుగా వేసే గుర్తులను బట్టి ఆ పదాన్ని పలకాలి. ఇంగ్లీషులో అడిగితే ధరలు ఎక్కువ చెబుతారని ముందే నెట్లో చదివిందట అపరాజిత. ఇక చిన్న చిన్న ఊళ్లు సైతం ఎంతో శుభ్రంగా కనిపిస్తుంటాయి. బీచ్‌లో ఎక్కడా చిన్నపాటి చెత్త కూడా కనిపించదు. ‘‘మెక్సికోలో టూరిస్టు ప్రదేశాలు చాలా ఎక్కువ. ఏ నంబరు బస్సు ఎక్కడికి వెళ్తుంది అని ముందుగానే గూగుల్‌లో చూసుకుంటే గమ్యస్థానాలకు చేరడం ఏమాత్రం కష్టం కాదు. బస్ ఎక్కేసి డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి, స్టాప్ రాగానే డ్రైవరు చెప్పడంతో దిగేయొచ్చు. అక్కడ... బస్సులు, ట్యాక్సీలు, కొన్ని చోట్ల తెలుపు రంగులో ఉన్న ఆటోలు కనిపించాయి. ట్యాక్సీలన్నీ ఫిక్స్డ్ రేట్లు. ఏ ప్రాంతాలలో పర్యటించాలన్నా చాలా సులువు. అన్నీ వివరంగా సైట్లో పెడతారు. ఏదీ వెతుక్కోనక్కర్లేదు. అక్కడ రెండు మూడు ఊళ్లు పూర్తిగా టూరిజం మీదే నడుస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పద్ధతిగా ఉంటాయి. అందువల్ల అక్కడ దేనికీ భయపడక్కర్లేదు’’ అంటున్నారు గాయత్రి. -
24 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ...
బీజింగ్ : ఆ తల్లిదండ్రుల 24 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. మూడేళ్ల ప్రాయంలో తప్పిపోయిన తమ కూతురిని ఎట్టకేలకు కలుసుకున్నారు. సుఖాంతంగా ముగిసిన ఈ కథనం వివరాలు...చైనా సిచుయాన్ ప్రోవిన్స్‌లోని చెంగ్డుకు చెందిన మింగ్‌క్వింగ్ కుమార్తె 1994లో తప్పిపోయింది. నాటి నుంచి మింగ్‌క్వింగ్ తప్పిపోయిన తన కూతురి ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తమ కుమార్తె పోస్టర్లను ప్రచురించాడు. పిల్లల ఆశ్రమాలు, ఆస్పత్రుల్లో వెతికారు. ఆమె జాడ కనుక్కొడానికి ఏ ఒక్క ప్రయత్నాన్ని వదల్లేదు. అయినా ఫలితం లేకపోవడంతో 2015 నుంచి కొత్త దారిలో వెతకడం ప్రారంభించారు. 2015నుంచి మింగ్‌క్వింగ్ టాక్సీ నడపడం ప్రారంభించాడు. తన టాక్సీ ఎక్కడానికి వచ్చే ప్రయాణికులకు తప్పిపోయిన తన కూతురు గురించి చెప్పేవాడు. ఇలా దాదాపు 17వేల మందికి తన కూతురు గురించి చెప్పాడు. ఇంటర్నెట్ ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేయాల్సిందిగా వారందరిని కోరాడు. కుమార్తె ఫోటోతో కూడిన వివరాలను తన టాక్సీ మీద ప్రదర్శించాడు. ఎట్టకేలకు ఆ తండ్రి ప్రయత్నం ఫలించి తన కూతురు కాంగ్ యింగ్‌ను కనుక్కోగలిగాడు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు తమ కూతురు రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం కాంగ్ యింగ్ తల్లిదండ్రులను చేరుకోనుంది. -
ట్యాక్సీ డ్రైవర్‌తో గుంజీలు.. వైరల్ వీడియో
సాక్షి, ముంబై: టాక్సీ డ్రైవర్లు కచ్చితంగా వారి బ్యాడ్జీ ధరించాలని పోలీసులు, అధికారులు సూచిస్తుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ అనధికారికంగా డ్రైవింగ్ చేసినందుకు మూల్యం చెల్లించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన నేత ఆ ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాం ధరించలేదని, కనీసం అతడికి డ్రైవింగ్ బ్యాడ్జీ లేదని అతడితో గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) నేత నితిన్ నంద్‌గోకర్ స్పందించారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఓ డ్రైవర్‌ను గమనించాను. అతడి వద్ద డ్రైవింగ్‌కు సంబంధించిన బ్యాడ్జీలేదు. అతడు డ్రైవింగ్ యూనిఫాం కూడా ధరించకుండా కనిపించాడు. సక్రమంగా బ్యాడ్జీ నెంబర్ తీసుకోవాలని, యూనిఫాం ధరించి డ్రైవింగ్ చేసుకోవాలని సూచించిన తర్వాత అతడు చేసిన తప్పును గుర్తించాలని డ్రైవర్‌తో గుంజీలు తీయించినట్లు వెల్లడించారు. మరోసారి ఇలా బ్యాడ్జీ, యూనిఫాం లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించినట్లు తెలిపారు. డ్రైవర్‌తో గుంజలీ తీయించిన వీడియో నంద్‌గోకర్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ట్యాక్సీ డ్రైవర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడంటూ నెటిజన్లు కొందరు కామెంట్ చేయగా, ఎంఎన్ఎస్ నేత తీరును మరికొందరు తప్పుపడుతున్నారు. -
ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాం ధరించలేదని..
-
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థినిపై దారుణం
కోల్‌కతా: సిక్కింకు విహారయాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన విద్యార్థినిపై టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడు ప్రేమ్‌రాజ్‌తో పాటు అతని స్నేహితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఈ నెల 13న కోల్‌కతాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు విహారయాత్రకు సిక్కిం వెళ్లారు. గ్యాంగ్ టక్లో బంధువుల హోటల్లో బస చేశారు. గ్యాంగ్‌టక్ చుట్టుపక్కల ఉన్న విహారప్రదేశాలను చూసేందుకు వారు ముగ్గురు ఓ టాక్సీ మాట్లాడుకున్నారు. కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత డ్రైవర్ వారికి చిప్స్, నీళ్లు అందించాడు. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తీసుకోగా, వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలు తినలేదు. చిప్స్ తిన్న తర్వాత ఆ అమ్మాయికి మత్తురావడంతో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు అమ్మాయిలు డ్రైవర్‌ను నిలదీశారు. డ్రైవర్ వారిద్దరినీ కారులోంచి తోసివేసి, మత్తులో ఉన్న అమ్మాయిని తీసుకుపోయాడు. ఇద్దరు అమ్మాయిలు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి గ్రామస్తులకు ఈ విషయం చెప్పారు. విద్యార్థినులు బస చేసిన హోటల్ యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్థానికుల సాయంతో గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలిని కాపాడారు. విద్యార్థిని ముఖం, మెడపై గాయాలయ్యాయని, ఆమె షాక్‌లో ఉందని స్థానికులు చెప్పారు. -
ఒక్కడు... పది జాబ్స్
ఓ వ్యక్తి... 10 ఉద్యోగాలకు సంబంధించిన విధులు నిర్వర్తించడం సాధ్యమేనా? ఎందుకు కాదు... అంటూ చేసి చూపెడుతున్నాడు 67 ఏళ్ల బిల్లీ మూయిర్. స్కాట్లాండ్లో మారుమూల ద్వీపం... నార్త్ రొనాల్డ్సేలో మూయిర్ నివసిస్తున్నాడు. ఈ బుల్లి ద్వీపంలో ఆయన ఏకంగా పది ఉద్యోగాలు అవలీలగా చేసేస్తున్నాడు. అవేమిటంటారా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఎయిర్పోర్ట్ అగ్నిమాపక దళ సభ్యుడు, ట్యాక్సీ డ్రైవర్, లైట్‌హౌస్ నిర్వాహకుడు, హాలీడే రిసార్ట్స్ యజమాని, స్థానిక కౌన్సిలర్, బిల్డర్... ఇలా మొత్తం పది ఉద్యోగాలను ఏకకాలంలో చేసేస్తున్నాడు. లైట్ హౌస్ పూర్తిగా ఆటోమేటెడ్... అప్పుడప్పుడు వెళ్లి తనిఖీ చేయడం, అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకోవడం మూయిర్ విధి. అలాగే ఈ దీవికి ఎప్పుడైనా విమానాలు వస్తుంటే... మూయిర్కు ముందే మొబైల్‌కు సమాచారం వస్తుందట. అప్పుడు ఎయిర్‌స్ట్రిప్ వద్దకు వెళ్లి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అవతారం ఎత్తుతాడు. దీవిలో అగ్నిమాపక దళంలోని ఏకైక సిబ్బంది కూడా ఇతనే. అగ్ని ప్రమాదాలను నియంత్రించడంలో ప్రత్యేక శిక్షణ కూడా పొందాడు. ఇన్ని చేస్తూనే ఖాళీ సమయాల్లో తన గొర్రెలను మేపడానికి వెళతాడు. ఒక్కడే ఇవన్నీ చేయడం ఎందుకంటే... ఈ దీవి జనాభా 50 మంది మాత్రమే. దాంతో మనోడు సాధ్యమైనన్ని పనులు తానే చక్కబెడుతుంటాడు. 67 ఏళ్లు వచ్చినా... ఇప్పుడప్పుడే రిటైరయ్యే ఆలోచనేమీ లేదని హుషారుగా చెబుతాడు. దటీజ్ స్పిరిట్. -
ట్యాక్సీ డ్రైవర్ ఝలక్
నోయిడా: ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఊబర్‌కు చెందిన డ్రైవర్ కస్టమర్‌కు ఝలక్ ఇచ్చాడు. అతడు డబ్బులు డ్రాచేసుకునేందుకు వెళ్లడం చూసి అతడి ల్యాప్ టాప్‌తో ఉడాయించాడు. ఏటీఎం నుంచి వెనక్కి వచ్చిన కస్టమర్ అది చూసి అవాక్కయ్యాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. నోయిడాకు చెందిన హిమాంశు కౌశిక్ అనే వ్యక్తి న్యూ ఫ్రెండ్స్ కాలనీ సెక్టార్ 18 గుండా వెళ్లేందుకు ఊబర్ సంస్థ నుంచి క్యాబ్ ను బుక్ చేసుకున్నాడు. అది వచ్చిన తర్వాత కారులోకి ఎక్కిన అతడు మధ్యలోకి వెళ్లాక తన స్నేహితుడికి డబ్బులు ఇవ్వాల్సి ఓ ఏటీఎం వద్ద కారు ఆపాడు. అతడు లోపలికి డబ్బు డ్రా చేసుకునేందుకు అలా వెళ్లగానే డ్రైవర్ ఇలా వెళ్లి మోసం చేశాడు. 'నేను ఎన్నోసార్లు ఆ డ్రైవర్‌కు ఫోన్ చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. 20 నిమిషాల తర్వాత నా ఫోన్ లిఫ్ట్ చేశాడు. నా బ్యాగ్ గురించి ప్రశ్నించగానే వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎత్తలేదు' అని హిమాంశు ఆందోళన వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఊబర్ సంస్థకు ఫిర్యాదు చేసినా వారి నుంచి కూడా ఎలాంటి బదులు రాలేదని వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రూ.10 లక్షల సొత్తుతో ఉడాయించిన టాక్సీ డ్రైవర్
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మోసపోయారు. వారిద్దరినీ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో కారు డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖలీద్, బోధన్‌కు చెందిన నాసర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లేందుకు వారిద్దరూ ఓ కారును మాట్లాడుకున్నారు. అందులో ఎక్కి కొంతదూరం వెళ్లాక...'ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్ద మీ జేబులో నుంచి కొన్ని కాగితాలు పడిపోవటం చూశాను. అవి పాస్‌పోర్టు, వీసాలాగానే ఉన్నాయి...' అంటూ కారు డ్రైవర్ వారిని తికమకపెట్టాడు. అతని మాటలు నిజమేననుకున్న ఖలీద్, నాసర్ కారును వెనక్కి తీసుకెళ్లాలని కోరారు. ఎయిర్‌పోర్టు టాక్సీ స్టాండు వద్దకు వెళ్లాక వారిద్దరూ కిందికి దిగి వెతుకులాట మొదలుపెట్టారు. వారు ఏమరుపాటుగా ఉన్న సమయాన్ని గమనించి కారు డ్రైవర్ వారి లగేజీతో మాయమయ్యాడు. మోస పోయామని గ్రహించిన బాధితులు ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాగుల్లో 450 కువైట్ దినార్లు, 10 సెల్ఫోన్లు, 5 తులాల బంగారు ఆభరణాలు తదితర రూ.10 లక్షల విలువైన సొత్తు ఉందని వారు పేర్కొన్నారు. అయితే, శనివారం సాయంత్రం వరకు ఆ కేసు దర్యాప్తు ప్రారంభం కాలేదనే సమాచారం మేరకు వారు జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన జోక్యం చేసుకోవటంతో పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
టాక్సీ డ్రైవర్.. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే
ఆదివారం వస్తోందంటే చాలు.. శనివారం రాత్రి నుంచే హాయిగా రిలాక్స్ అయిపోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఓ సాధారణ వ్యక్తి అసాధారణ సేవలను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నెలలో ఒక ఆదివారం సమాజసేవకు అంకితం అవుతూ.. 'ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే' పేరిట ఓ వినూత్నకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. ఇండియాలో పుట్టి ఆస్ట్రేలియాలోని డర్విన్ లో ఉంటున్న తేజేందర్ సింగ్... అక్కడ కూడు, గూడుకు నోచుకోని నిరుపేదలకు ఆహారం అందిస్తూ ఆపద్బాంధవుడయ్యాడు. తేజేందర్ సింగ్ ప్రతి ఆదివారం.. ఉదయం ఏడు గంటలకు షిఫ్టు ముగించుకొని ఇంటికి వచ్చే అతడు కిలోల కొద్దీ అన్నం, కూరగాయలను వండుతాడు. అతని కుమారుడు నవదీప్ ఆ ఆహారాన్ని సిటీలోని పేదలకు అందిస్తాడు. మూడేళ్లుగా తేజేందర్ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు. మంచి పని చేస్తున్నపుడు తనకు మరింత శక్తి వస్తుందంటున్న అతడు... పగలు ఎయిర్ కండిషనర్ మెకానిక్ గానూ పని చేస్తూ తన సంపాదనను ప్రజాసేవకు వినియోగిస్తున్నాడు. ''సంపాదించిన దానిలో పదిశాతం బీదలకు, దిక్కు లేనివారికి వెచ్చించాలన్నది మా మత ధర్మంలో ఉంది'' అంటున్న తేజేందర్ సింగ్.. ఈ రకమైన సేవ పదిమందీ చేయాలన్న ఉద్దేశంతో.. ఫేస్‌బుక్‌ను ప్రచార సాధనంగా ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఆఫ్ ద డే గా గుర్తింపు పొందాడు. రాత్రంతా టాక్సీ నడిపి, తెల్లవారుతుండగా ఇంటికి చేరే తేజేందర్ తిరిగి పని చేయాలంటే శక్తి అవసరం కాబట్టి ఏదో కాస్త తిని, కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఓపిక కూడదీసుకొని మళ్లీ పనిలో నిమగ్నమైపోతాడు. తేజేందర్ ఎందరికో ఆర్థికంగానూ అండగా నిలుస్తున్నాడు. తాను చేసే సేవకు ఎటువంటి నిధులు, విరాళాలు సేకరించడు. స్వయంగా సంపాదించిన దానిలోనే ఇతరులకు సహాయ పడతాడు. తనలాగా మరెందరో సేవలు అందించగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్నాడు. అందుకు ముందుకు వచ్చేవారు తన వ్యాను, వంట పాత్రలు వినియోగించుకోవచ్చని చెబుతున్నాడు. -
టాక్సీ డ్రైవర్‌గా..!
గాసిప్ శ్రుతీహాసన్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నారా...? తమిళ పరిశ్రమ ఔననే అంటోంది. అజిత్ హీరోగా ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదట అజిత్ టాక్సీడ్రైవర్గా నటించనున్నారనే వార్త ప్రచారమైంది. తాజాగా, ఆ పాత్రను శ్రుతీ చేస్తున్నారని భోగట్టా. మరైతే.. అజిత్ పాత్ర ఏంటి? అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. -
హరిత రథం... అది ఒక కదిలే తోట...
ధనుంజయ్ చక్రవర్తి కోల్‌కతాలోని ఒక ట్యాక్సీ డ్రైవర్. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన ట్యాక్సీపైనే ఒక రూఫ్ టాప్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకొని ముద్దుగా హరిత రథం అనే పేరు పెట్టుకున్నారు. ఇందులో ఏసీ కార్లకన్నా చల్లగా ఉండటం విశేషం. మూడేళ్ల క్రితం అందమైన మనీప్లాంట్ మొక్కతో కారులో మొక్కల పెంపకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రూ. 22 వేలు ఖర్చుచేసి అంబాసిడర్ కారుపైన తొట్టెను ఏర్పాటు చేసి మట్టితో నింపి గడ్డి పెంచుతున్నారు. దీని బరువు 65 కేజీల వరకూ ఉండటంతో వాహనం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటున్నా దీన్ని కొనసాగించటం విశేషం. కారులోపల వెనుక భాగంలోనూ ఎనిమిది కుండీల్లో మొక్కలు పెంచుతున్నాడు. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తనవంతు ప్రయత్నిస్తూ.. ప్రయాణికులకు ప్రేరణనిస్తున్నారు. ఈ మొబైల్ గార్డెన్ వ్యాన్‌ను నడపటం సాధ్యంకాదని కొందరు తోటి డ్రైవర్లు ఆయన్ను నిరుత్సాహపరచినా వెనక్కు తగ్గలేదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరు తమవంతు బాధ్యతగా మొక్కలు పెంచాలంటారు ధనుంజయ్. ఆయన ఇచ్చే కరపత్రాలు మొక్కల పెంపకంపై ప్రయాణీకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఐతే మొక్కల పెంపకం కోసం ఇంత తపన పడుతున్న ధనుంజయ్ చక్రవర్తికి సొంత కారు లేదు. ఎనిమిదేళ్లక్రితం యాక్సిడెంట్ కావటంతో చికిత్సకోసం కారును అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి కిరాయి ట్యాక్సీనే నడుపుతూ దాని ద్వారానే ప్రయాణికుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కలిగేంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. అయితే ట్యాక్సీయాజమాని అమ్రిష్ సింగ్, ధనుంజయ్ ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ సారి కోల్‌కతా వె ళ్లినప్పుడు తప్పకుండా హరిత రథంలో ప్రయాణిస్తారు కదూ! -
ట్యాక్సీల్లో పానిక్ బటన్..
సాక్షి, ముంబై: ప్రైవేటు ట్యాక్సీల్లో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, చోరీల వంటి సంఘటనలను అరికట్టేందుకు ‘పానిక్ బటన్’ అమర్చాలని ఆర్టీవో యోచిస్తోంది. ఈ పరికరాన్ని నగర పోలీసు, ట్రాఫిక్ శాఖ, సంబంధిత ట్యాక్సీ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధాన పర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పరికరం బిగించి ప్రయోజనం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనకు ఆర్టీవో ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. దేశ రాజధానిలో ఇటీవల ఓ ట్యాక్సీ డ్రైవర్ ఒంటరిగా ఉన్న మహిళాప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో ముంబైలో కూడా అపహరణ, చోరీ, హత్యలు, అత్యాచారాలు లాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఠాణేలో నాలుగు నెలల కిందట ఓ ఆటో డ్రైవర్ అపహరిస్తున్నట్లు గుర్తించిన స్వప్నాలి లాడ్ అనే మహిళ ప్రయాణికురాలు నడిచే ఆటోలోంచి దూకేసింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. అలాగే ఢిల్లీలో జరిగిన తాజా ఘటనతో ప్రయాణికుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనాలనే అంశంపై ఆర్టీవో, ప్రైవేటు ట్యాక్సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో పానిక్ బటన్ (స్విచ్) అమర్చాలని నిర్ణయానికొచ్చారు. బటన్‌ను ప్రయాణికుల సీటు వెనకాల లేదా పక్కన అమర్చాలని యోచిస్తున్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్న లేదా అత్యవసరం సమయంలో ప్రయాణికులకు ఈ స్విచ్చి నొక్కేందుకు అందుబాటులో ఉండాలి. ఈ పరికరాన్ని పోలీసు శాఖ, ట్రాఫిక్ శాఖ, ఆ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధానించడంవల్ల అది నొక్కగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమవుతారు. ఆ ట్యాక్సీ ఏ పోలీసు స్టేషన్‌కు, ఏ ఆర్టీవోకు సమీపంలో ఉంది అనేది వెంటనే తెలిసిపోతుంది. దాంతో బాధితులకు సాయం అందించి వారిని రక్షించడం, ట్యాక్సీ డ్రైవర్‌పై చర్యలు తీసుకునేందుకు సులభతరం కానుంది. కాని ఈ బటన్ విద్యుత్‌తో పనిచేస్తుంది కాబట్టి దీన్ని అమర్చడంవల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తాయని వారు భావిస్తున్నారు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బటన్ అమర్చడానికి ఆమోదముద్ర వేయలేదని ఓ అధికారి వెల్లడించారు. -
గుప్త నిధుల వేటలో పోలీసులు!
హిందూపురం : గుప్త నిధుల వేటలో లబ్ధిపొందలేదని ఇద్దరు పోలీసులు బరి తెగించారు. తమకు ఖర్చు అరుున మొత్తం రూ.30 లక్షలు చెల్లించాలని వేృట బందంలో సభ్యుడైన ట్యాక్సీ డ్రైవర్‌ను చిత్రహింసలు పెడుతున్నారు. కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేని తల్లి పురుగు మందు తాగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పరిగి మండలం సీగుపల్లి నివాసి అయిన లింగమ్మ, కిష్టప్ప దంపతుల కుమారుడు రాజేష్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హిందూపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు గోపాల్, మంజు, మరో వ్యక్తి డెయిరీ బాలాజీలు బినామీ పేర్లతో వాహనాలు బాడుగకు నడుపుతున్నారు. త్వరలో కోటీశ్వరులైపోవాలనే కోరికతో సదరు కానిస్టేబుళ్ల చూపు గుప్త నిధులపై పడిండి. ట్యాక్సీ డ్రైవర్ రాజేష్ సహాయంతో గుప్త నిధుల వేటకు ఉపక్రమించారు. ఈ క్రమంలో మూడు పురాతన ఆలయూల్లో జేసీబీలతో తవ్వకాలు సాగించినట్లు తెలిసింది. తవ్వకాలు జరిపినపుడు ఒక రాగి బిందె మినహా సొమ్ములు దొరకలేదని సమాచారం. లాభాలొస్తే వాటా ఇస్తాం.. ఇపుడు తవ్వకాల కోసం చేసిన ఖర్చు రూ.30 లక్షలు తమకు తెచ్చివ్వాలని సదరు కానిస్టేబుళ్లు రాజేష్‌పై ఒత్తిడి తెచ్చారు. పది రోజుల క్రితం అదుపులోకి తీసుకుని వారి శైలిలో ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. రాజేష్ కోసం అతని భార్య రాధమ్మ, తల్లి లింగమ్మ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ‘నీ కుమారుడు రూ.30 లక్షలు అప్పు ఉన్నాడు. అది చెల్లించి విడిపించుకుపోండ’ని పోలీసులు చెప్పడంతో వారు కన్నీరు మున్నీరయ్యూరు. ‘కొన్నాళ్లుగా పోలీసులు గోపాల్, మంజు, మరొకాయన బాలాజీ అర్ధరాత్రిళ్లు మా ఇంటి కాడికి వచ్చి నా భర్తను పిలుచుకుపోయేవారు. ఎక్కడికెళ్తున్నారంటే చెప్పేవారు కాదు. ఏం జరిగిందో ఏమో పది రోజుల క్రితం మా ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు పట్టుకుపోరుునారు. -
ట్యాక్సీ డ్రైవర్ ఐఫోన్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని ఫైనాన్స్ కంపెనీకి చెందిన మహిళపై శుక్రవారం రాత్రి లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్యాక్సీ డ్రైవరు శివకుమార్ యాదవ్‌కు ఉబర్ కంపెనీ ఇచ్చిన ఐఫోన్‌ను మంగళవారం ఢిల్లీ పోలీసులు మధురకు వెళ్లి స్వాధీన పరచుకున్నారు. ఇదివరకే యాదవ్ వాడిన మరో రెండు ఫోన్లను స్వాధీనపరచుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఐఫోన్ దొరకడం దర్యాప్తులో కీలకమని అంటున్నారు. కీలక సాక్ష్యం లభ్యం ఉబర్ కంపెనీ తన క్యాబ్ డ్రైవర్లకు ఐ ఫోన్లు ఇచ్చింది. యాప్ ద్వారా కస్టమర్లు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత కంపెనీ కస్టమర్లకు దగ్గరలో ఉన్న క్యాబ్ డ్రైవరుకు సందేశం పంపుతుంది. డ్రైవరు కంపెనీ అప్పగించిన పని స్వీకరించిన తరువాత డ్రైవరు పేరు, ఫొటో, కారు రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలను కంపెనీ తన యాప్ ద్వారా కస్టమరుకు పంపుతుంది. అందువల్ల మధురలో స్వాధీనపరచుకున్న ఐఫోన్ కీలక సాక్ష్యంగా పనికివస్తుందని పోలీసులు అంటున్నారు. ఈ ఐఫోన్‌తో శివకుమార్ యాదవ్ బాధితురాలు బక్ చేసుకున్న కారు నడిపాడన్న విషయంతో పాటు అతను ఉబర్ కంపెనీకి పనిచేస్తున్నాడన్న విషయాన్ని ధ్రువీకరించగలుగుతామని, క్యాబ్ సర్వీస్ కంపెనీకి ఈ ఘటనలో పాత్ర ఉన్నదా లేదా అనే విషయాన్ని రుజువుచేసుకోవడాని ఉపయోగపడుతోందని అంటున్నారు. ఫోన్ జీపీఎస్ రూటు ద్వారా డ్రైవరు ఎక్కడి నుంచి బాధితురాలిని పికప్ చేసుకున్నాడు, ఘటనా స్థలానికి ఏ రూటు ద్వారా ప్రయాణించాడు, ఆమెను ఎప్పుడు ఇంటి వద్ద దించాడనే విషయాన్ని తెలుసుకోవచ్చని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా ఉబర్ కంపెనీ అధికారులతో ఢిల్లీ పోలీసుల విచారణ బుధవారం కూడా కొనసాగిందని తెలిపారు. విచారణలో పశ్చాత్తాపమే లేదు గుర్గావ్ కంపెనీలో పనిచేస్తున్న 25 ఏళ్ల ఫైనాన్స్ అనాల్సిస్ట్పై లైంగిక దాడికి పాల్పడిన శివకుమార్ యాదవ్‌ను మధురలో అదుపులోకి తీసుకొన్న పోలీసులకు మరింత సమాచారం లభించింది. నిందితుడిపై మరో ముగ్గురిపై లైంగికదాడుల కేసున్నాయి. ఇందులో రెండు ఢిల్లీలో, ఒకటి యూపీలోని మణిపురి జిల్లాలో. ఇక్కడే మరో మూడు క్రిమినల్ కేసులున్నాయని విచారణలో వెల్లడైందని పోలీసులు బుధవారం పేర్కొన్నారు. ‘వరుస నిందితుడు’ శివకుమార్ తప్పులు చేసినప్పటికీ ఏ మాత్రం పశ్చాత్తాపం పడడం లేదని పోలీసులు తెలిపారు. పనిచేసే మహిళలు అంటేనే నిందితుడికి చిన్నచూపు ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. అపరిచిత మహిళల్ని టార్గెట్ ఎంచుకొని లైంగికదాడికి పాల్పడుతున్నాడు. అయితే ఇప్పటి వరకూ నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ఫైనాన్స్ కంపెనీకి చెందిన మహిళ కూడా కేసు నమదు చేయిస్తుందని నిందితుడు భావించలేదని, అందుకే నిందితుడు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూ బెయిల్‌పై బయట తిరుగుతున్నాడని అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ బ్రిజేందర్ సింగ్ తెలిపారు. ‘ నిందితుడిపై మూడు లైంగికదాడుల కేసులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులున్నట్లు గుర్తించామని చెప్పారు. ఆయా కేసుల్లో బెయిల్ పొందినట్లు చెప్పారు. 2011లో బార్ డ్యాన్సర్‌పై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి విముక్తి లభించిందని చెప్పారు. -
రాజ్‌నాథ్ నివాసం ఎదుట ఆప్ ఆందోళన
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో శుక్రవారం జరిగిన అత్యాచార ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు దిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాసం ఎదుట సోమవారం ఉదయం ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిలోనే మహిళలకు రక్షణ లేని దుస్థితి అంటూ దుమ్మెత్తిపోశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తక్షణమే ఢిల్లీలో మహిళల రక్షణ కోసం భద్రతా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు వందమంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఈ నెల 5వ తేదీన ఢిల్లీలో 25 ఏళ్ల యువతి అర్ధరాత్రి అత్యాచారానికి గురైంది. గమ్యస్థానంలో దిగబెడతానని చెప్పి క్యాబ్ డ్రైవర్ శివకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు... నిందితుడ్ని మధురాలో అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. నిందితుడు 2011లోనూ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడని తెలిసింది. బెయిల్‌పై బయటకొచ్చి క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. -
ట్యాక్సీ డ్రైవర్ కిరాతకం
మద్యం మత్తులో భార్యను హత్య చేసి ఆత్మహత్యాయత్నం అనాథలైన చిన్నారులు నిందితుడు చిత్తూరు వాసి బెంగ ళూరు : మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్నబిడ్డల ముందే కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన సంఘటన ఇక్కడి చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన తిరుమలేష్ అలియాస్ రమేష్, భార్య శాంతిమణి (33)తో చెన్నమ్మనే అచ్చుకట్ట సమీపంలోని ట్యాంక్ బండ్ ఏరియాలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. వీరికి యతిరాజ్ (7), పునీత్ (3) అనే ఇద్దరు పిల్లలు. రమేష్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల మద్యానికి బానిసైన రమేష్ విధులకు వెళ్లకుండా భార్యను డబ్బుకోసం వేధించేవాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పీకలదాక మద్యం తాగి వ చ్చిన రమేష్ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సహనం కోల్పోయి కత్తితో పిల్లల ఎదుట భార్యను విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనతో పిల్లలు ఇద్దరు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నామని బుధవారం చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీసులు తెలిపారు. -
ప్రయాణికురాలిపై టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు
కోల్ కతా:మహిళలపై మృగాళ్ల ఆకృత్యాలు శృతిమించుతూనే ఉన్నాయి. మహిళ భద్రతకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో రోజూ ఏదో మూలన అత్యాచారాలు, లైంగిక వేధింపులు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ మహిళా ప్రయాణికురాలిని టాక్సీ డ్రైవర్ లైంగిక వేధించిన ఘటన కోల్ కతా నగరంలో ఆదివారం చోటు చేసుకుంది. చిన్ గ్రిఘాటాకు దగ్గరలో మీటర్ పై టాక్సీ మాట్లాడుకుని వెళుతున్న మహిళా ప్రయాణికురాలిని డ్రైవర్ లైంగికంగా వేధించాడు. ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ దూషించసాగాడు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని బాసంతి హైవే వద్ద అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ విచారణలో అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు. -
అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారయత్నం
భారత్ వచ్చిన అమెరికా పర్యాటకురాలిపై అత్యాచారానికి యత్నించాడో కారు డ్రైవర్, అయితే ఆ మహిళ అతడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ సమయ్ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శ్రవణ్ కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... భారత్ పర్యటనలో భాగంగా అమెరికన్ పర్యాటకురాలు ఆదివారం కారులో న్యూఢిల్లీ నుంచి రుషికేశ్కు బయలుదేరింది. ఆ క్రమంలో న్యూఢిల్లీ - డెహ్రడూన్ జాతీయ రహదారిపై భోజనం కోసం కారు ఆపిన డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో ఆమె డ్రైవర్‌ను ప్రతిఘటించింది. ఎలాగోలా అతడి బారి నుంచి తప్పించుకుని... మరో కారులో రుషికేశ్ చేరుకుని...జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. -
టాక్సీ డ్రైవర్ భళా!
క్యాబ్‌లో దొరికిన రూ. 1.85 కోట్లు గ్యాంబ్లర్కు అప్పగింత వాషింగ్టన్: అమెరికాలో ఓ టాక్సీ డ్రైవర్ నిజాయితీ ప్రదర్శించాడు. క్యాబ్‌లో తనకు దొరికిన సుమారు రూ. కోటిన్నరను తిరిగి ఇచ్చి అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు. లాస్ వెగాస్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ గెరార్డో గాబోవా 13 ఏళ్లుగా ఎల్లో చెక్కర్ స్టార్ క్యాబ్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం స్థానిక కాస్మోపాలిటన్ కాసినో నుంచి ఓ పోకర్ ప్లేయర్‌ను పామ్స్ పేలస్ హోటల్‌కు తన టాక్సీలో తీసుకెళ్లి దించేశాడు. ఆ తర్వాత మరో ప్యాసింజర్‌ను పికప్ చేసుకునేందుకు వెళ్లిపోయాడు. అయితే రెండో ప్యాసింజర్ ను క్యాబ్లోకి ఎక్కించుకునే సమయంలో వెనుక సీటులో మూడు లక్షల డాలర్ల (రూ.1.85 కోట్లు)తో ఉన్న ఓ పేపర్ బ్యాగ్‌ను గుర్తించాడు గెరార్డో. వెంటనే సమాచారాన్ని క్యాబ్ కంపెనీకి తెలియజేశాడు. అప్రమత్తమైన కంపెనీ స్థానిక అధికారులకు సమాచారం అందించారు. కొద్దిగంటల తర్వాత ఆ డబ్బు మర్చిపోయింది 28 ఏళ్ల గ్యాంబ్లర్‌గా గుర్తించిన అధికారులు అతనికి పేపర్ బ్యాగ్‌ను అప్పగించారు. దీంతో క్యాబ్ డ్రైవర్ నిజాయితీకి ముగ్ధుడైన ఆ గ్యాంబ్లర్ అతనికి పది వేల డాలర్ల(సుమారు రూ. 6 లక్షలు) చెక్కును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక క్యాబ్ కంపెనీ అయితే గెరార్డోను ‘డ్రైవర్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించడమే కాక.. అతనికి వెయ్యి డాలర్ల (సుమారు రూ. 62 వేలు) నగదు రివార్డును ఇచ్చింది.