
నడిరోడ్డుపై భర్త మృతదేహంతో ఉన్న మహిళ వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, టెక్కలి రూరల్: మండలంలోని అక్కవరం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఒక మృతదేహాన్ని రహదారిపై దించి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ప్రదీప్, అంజలి అనే దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రదీప్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు స్వస్థలం ఒడిశాలోని బాలా సోర్‌కు ట్యాక్సీలో వెళ్తున్నారు. టెక్కలి సమీపంలోకి రాగానే ప్రదీప్ బండిలోనే మృతి చెందడంతో ట్యాక్సీ డ్రైవర్ ఆ మృతదేహంతో పాటు ఆమెను కూడా వాహనం నుంచి కిందకు దించి వెళ్లిపోయాడు. దీంతో నడిరోడ్డుపై తన భర్త మృతదేహంతో ఆ మహిళ ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరో వాహనాన్ని సమకూరుస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.
‘స్పీకర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు’
ఆమదాలవలస: స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ రోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పు డు ప్రచారాలు నమ్మవద్దని స్పీకర్ క్యాంపు కా ర్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. స్పీకర్ దంపతులకు వారం కిందట కరోనా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తు తం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు.
చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’
Comments
Please login to add a commentAdd a comment