Tekkali
-
శ్రీకాకుళం: అమ్మో మళ్లీ వచ్చింది.. ‘పెద్దపులి’ అలజడి
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: గత ఏడాది సరిగ్గా ఇదే నవంబర్ నెలలో ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ప్రవేశించిన పెద్ద పులి మళ్లీ ఇప్పుడు మరో సారి అలజడి సృష్టిస్తోంది. గత రెండు రోజుల నుంచి టెక్కలి, కాశీబుగ్గ డివిజన్ల పరిధిలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ యా గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. శుక్రవారం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు గ్రామం సమీపంలో పెద్దపులి అడుగుల ఆనవాలు కనిపించడంతో అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతానికి పరుగులు తీశారు.గత రెండు రోజులుగా పెద్దపులి ఈ ప్రాంతంలో గల గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక వైపు తుఫాన్ ప్రభావంతో పంటను కాపాడుకునేందుకు రైతులు పంట పొలాల్లో ముమ్మరంగా కోత లు, నూర్పులు చేస్తున్న సమయంలో పెద్దపులి సంచారంపై అధికారుల హెచ్చరికలతో రైతులు మరింత భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖా ఎఫ్ఆర్ఓ జగదీశ్వరరావు, ఏసీఎఫ్ నాగేంద్ర, బీట్ అధికారులు జనప్రియ, రంజిత్, ఝాన్సీ తో పాటు సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.ప్రస్తుతం భయాందోళనకు గురి చేస్తున్న పెద్దపులి ఒడిశా నుంచి మందస రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సాబకోట, బుడంబో తదితర గిరిజన ప్రాంతాలను దాటుకుంటూ వజ్రపుకొత్తూరు తీ ర ప్రాంతంలో గల తోటల నుంచి సంత బొమ్మాళి వైపునకు చేరుకుంది. ప్రస్తుతం కోట»ొ మ్మాళి మండలం పొడుగుపాడు సమీపంలో పెద్దపులి ఆనవాలు కనిపించాయి.పులి సంచారంపై అప్రమత్తం పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖాధికారులు అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని రకాల జాగ్రత్తలు దండోరా ద్వారా తెలియజేస్తున్నారు.ప్రజలు వేకువజామున, చీకటి పడిన తర్వాత సాధ్యమైనంతవరకు బయట తిరగకుండా ఇళ్ల వద్ద ఉండాలిఇంటి ఆరుబయట లేదా పశువుల పాకల వద్ద నిద్రించకూడదుపులి తిరుగుతున్న ప్రాంతంలో అడవి లోపలకు వెళ్లేందుకు సాహసించకూడదువ్యవసాయ పనులు, బయటకు వెళ్లినపుడు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలివ్యవసాయ పనుల్లో కింద కూర్చున్నప్పుడు లేదా వంగి పని చేస్తున్నపుడు అప్రమత్తంగా ఉండాలిపంట పొలాలకు వెళ్లినపుడు బిగ్గరగా శబ్దాలు చేయాలిపులులు సంచరించే ప్రాంతాల్లో పశువులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదుపులి తిరుగుతున్న ఆనవాళ్లు, పాదముద్రలు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అటవీశాఖాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా పులి సంచరించే ఆనవాలు కనిపిస్తే తక్షణమే.. 6302267557, 9440810037,9493083748 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలి. -
అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి
-
బడుగుల భూముల్లో రాబంధువులు
దశాబ్దాల క్రితం ఆ భూములు నిరుపేద ఎస్సీ, బీసీలకు దాఖలు పడ్డాయి. సర్కారు డీ పట్టాలు ఇచ్చింది. కానీ వారెవరూ వాటిని అనుభవించ లేకపోతున్నారు. కారణం అవి ఎప్పుడో పెత్తందార్లు కబంధ హస్తాల్లో చిక్కుకోవడమే. వారికి టీడీపీ కీలక నేత అండ ఉండటం, అడిగితే అంతు చూస్తారన్న భయంతో బడుగుల వాటి పై ఆశలు వదులుకున్నారు. 2022లో సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దళిత సంఘాలు కోట్ల విలువ చేసే çసుమారు 20 ఎకరాల భూములను టీడీపీ పెత్తందారులు చెర నుంచి రక్షించేందుకు ఉద్యమిస్తున్నారు. అయితే కీలక టీడీపీ నేత సోదరుడు అధికారులపై ఒత్తిడి చేస్తూ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పక్కనే తులసిపేటలో దాదాపు 19.62ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. నిరుపేద ఎస్సీ, బీసీలకు ఇచ్చిన భూమిని అక్కడి పెత్తందార్లు ఆక్రమించుకోగా.. వీరికి టీడీపీ కీలక నేత అండగా నిలిచారు. ఇంకేముంది వారి కబంద హస్తాలనుంచి ఆక్రమిత భూమి బయటకి రావడం లేదు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ చంపేస్తారేమో అన్న.. భయంతో బాధితులు వణికిపోతున్నారు. 19.62 ఎకరాల మేర భూ ఆక్రమణ దివంగత కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు అప్పటి ప్రభుత్వం నిమ్మాడకు పక్కనున్న తులసిపేటలోని నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ల్యాండ్ సీలింగ్ భూమిని డీ పట్టాల కింద ఇచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వ గ్రామం నిమ్మాడకు కిలోమీటరన్నర దూరంలో ఉ న్న చిట్టివలస రెవెన్యూ పరిధిలో తులసిపేట ఉంది. సర్వే నెంబర్.194/1, 194/7,195/2, 200/1, 203/3బి, 208/2ఎ, 208/2సీ, 217/2, 222/1లోగల 19.62ఎకరాల భూమిని 33 మంది నిరుపేద ఎస్సీలకు, 19 మంది నిరుపేద బీసీలకు డీ పట్టాల కింద ప్రభుత్వమిచ్చింది. అయితే, ప్రభుత్వం తమకిచ్చిన భూములను లబ్ధిదారులు వెంటనే సాగు చేయకపోవడంతో అక్కడనున్న టీడీపీ నేతల అండదండలున్న పెత్తందార్లు ఆక్రమించారు. అంతటితో ఆగకుండా సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు కావడంతో భూములు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. టీడీపీ కీలక నేతలు అండదండలు ఉండటంతో ఆ భూమి మీదకి నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులు వెళ్లడానికి భయపడుతున్నారు. అసలే అక్కడ హత్యా రాజకీయాలు. నిమ్మాడ కేంద్రంగా టీడీపీ కీలక నేత ఫ్యామిలీకి నేర చరిత్ర కూడా ఉంది. వారిని కాదని అక్కడ ముందుకెళ్లడానికి సహజంగానే భయం. అలాంటి పరిస్థితులున్న పక్క గ్రామమే కావడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఆందోళనలు చేస్తున్నా.. నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ, మరికొన్ని సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా శాఖ అధ్యక్షుడు, టెక్కలి వాసి బోకర నారాయణరావు సమాచార హక్కు చట్టం కింద ఆ భూముల వివరాలు, పట్టాదారులెవరు, ప్రస్తుత అనుభవదారులు ఎవరన్న వివరాలను లిఖిత పూర్వకంగా అడిగారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వంగా 2022 మార్చిలో వివరాలు ఇచ్చింది. 19.62 ఎకరాలను 33 మంది ఎస్సీలకు, 19 మంది బీసీలకు ఇచ్చారని, ఇప్పుడా భూమి ఆక్రమణ జరిగిందని, ఫలానా వ్యక్తుల అనుభవంలో ఉందని నిర్ధారణ కూడా చేస్తూ వివరాల్లో పేర్కొంది. ఆక్రమణలో ఉన్న భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతోంది. అధికారులపై ఒత్తిళ్లు ఆందోళనలు జరుగుతుండటం, ఆక్రమిత భూమి వ్యవహారం వెలుగు చూడటం, సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిప్లయ్‌లో ఆక్రమణలు ‘డీ–పట్టా భూములు అప్పగించాలి’ కోటబొమ్మాళి: మండలంలోని చిట్టివలస పంచాయతీ తులసిపేటలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీ–పట్టా భూములను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి, అధ్యక్షుడు పాల పోలారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈనెల 20లోగా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జామి ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిట్టి సింహాచలం, బలగ రామారావు, జామాన రామారావు, బమ్మిడి వేణు పాల్గొన్నారు. ఆక్రమణదారులకు అండగా పెద్దలు డీ పట్టా భూముల ఆక్రమణదారులకు రాజకీయ పెత్తనం, అధికారం చెలాయిస్తున్న ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. ఆక్రమణ బాగోతమంతా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరిగింది. పెద్దల అండదండలు ఉండటంతో నిరుపేదలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక నిరుపేద లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ భూములు అసలైన లబ్ధిదారులకు అప్పగించి న్యాయం చేయాలి. – బోకర నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ అధ్యక్షుడు స్వాధీనం చేసుకుంటాం తులసిపేట ప్రభుత్వ భూమిలో ఎస్సీ, బీసీ పేద కుటుంబాలకు పట్టాలిచ్చారని, అవి ఆక్రమణకు గురయ్యాయని టెక్కలి సబ్ కలెక్టర్‌కు దళిత సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల గ్రామానికి మా సిబ్బందిని పంపించాం. కానీ, స్థానికంగా ఎవరూ సహకరించలేదు. బుధ వారం మరికొందరు బాధిత లబ్ధిదారులు ఫిర్యా దు చేయడంతో మళ్లీ గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరుపుతాం. అంతా నిర్ధారించుకున్నాక పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూములను స్వాధీ నం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తాం. – జామి ఈశ్వరమ్మ, తహశీల్దార్, కోటబొమ్మాళి జరిగాయని అధికారులు నిర్ధారించడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ కీలక నేత సోదరుడు రంగంలోకి దిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడా భూముల జోలికి పోవద్దని, తాము అధికారంలోకి వస్తామని, అంతవరకు జాప్యం చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తమ మాట వినకపోతే తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలియవచ్చింది. -
విశాఖ రాజధానికోసం గర్జించిన విద్యార్థి లోకం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం ‘మన విశాఖ.. మన రాజధాని’ నినాదం మార్మోగింది. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని విద్యార్థిలోకం గళమెత్తింది. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్, టెక్కలి నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్, విద్యార్థి, నిరుద్యోగ పోరాటసమితి నాయకుడు టి.సూర్యం నేతృత్వంలో విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ హనుమంతు లజపతిరాయ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్రకు ఊపిరిపోసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖలో పరిపాలన రాజధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. మన భావితరాల బంగారు భవిష్యత్ కోసం విశాఖ పరిపాలన రాజధాని కావాల్సిందేనన్నారు. ఈ విషయంలో వెనుకడుగు లేదని స్పష్టం చేశారు. జేఏసీ నియోజకవర్గ కన్వీనర్ డి.ఎ.స్టాలిన్ మాట్లాడుతూ మన భవిష్యత్ కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖలో పరిపాలన రాజధానితో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అభివృద్ది చెందుతుందని చెప్పారు. కాగా, టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పాత జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాల వద్ద జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. -
CM YS Jagan: కలిసికట్టుగా క్లీన్ స్వీప్
సాక్షి, అమరావతి: గతానికి పూర్తి భిన్నంగా అవినీతి లేకుండా, పక్షపాతం చూపకుండా 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేశాం. మంచి జరిగిన కుటుంబాల వారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఆర్బీకేలను తెచ్చి రైతన్నలు గ్రామం దాటాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఒక్కటీ అందచేస్తున్నాం. ఇంటి వద్దే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్నాం. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో కార్పొరేట్‌కు దీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలతో పల్లెల ముఖచిత్రం సంపూర్ణంగా మారుతోంది. డిసెంబర్ నాటికి మిగతా పనులు కూడా పూర్తవుతాయి. ఇవన్నీ రావటంతో గ్రామాల రూపురేఖలు మారి సరికొత్త చిత్రం ఆవిష్కృతమవుతోంది. చేసిన మంచి కళ్లెదుటే కనిపిస్తోంది. వాటిని చూసి మనమే అధికారంలో ఉండాలని ప్రతి చోటా ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ కచ్చితంగా సాధ్యమే. మనం చేయాల్సిందల్లా ప్రజల్లోకి వెళ్లి చేసిన మంచిని వివరించాలి. రేపు ఎన్నికల్లో గెలిచాక వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటాం’ అని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీరూ, నేనూ కలసికట్టుగా అడుగులు వేసి క్లీన్ స్వీప్ చేద్దామని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని రావాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతోనూ విడివిడిగా మాట్లాడి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం టెక్కలి అభివృద్ధి కోసం చేసిన పనులను సీఎం జగన్ గణాంకాలతో సహా వివరించారు. టెక్కలి నియోజకవర్గంలో భావనపాడు పోర్టు రానుందని, అందుకోసం సుమారు రూ.4,362 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్లో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మహేంద్ర తనయ ఆఫ్‌షోర్ ప్రాజెక్టు పనులను డిసెంబరులో పునరుద్ధరిస్తామన్నారు. ► మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. చాలా కాలం ఉంది కదా.. ఇవాళ్టి నుంచే ఎన్నికల గురించి ఆలోచన చేయాలా? అని మీరు అనుకోవచ్చు. 18 నెలల తర్వాత ఎన్నికలున్నా ఆ అడుగులు ఇవాళ్టి నుంచి కరెక్ట్‌గా పడితేనే క్లీన్‌స్వీప్ చేయగలుగుతాం. ► ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే మూడేళ్ల నాలుగు నెలల వ్యవధిలో అక్షరాలా రూ.1,026 కోట్లను గడప గడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. అర్హులెవరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో వలంటీర్లు, సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. ప్రతి నియోజకవర్గం, గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటే ప్రతి గ్రామంలోనూ 87 శాతం ఇళ్లకు మంచిచేశాం. ► ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రతి గడపకూ వెళ్లాలి. మనం చేసిన మంచిని గుర్తు చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ► టెక్కలి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు78కి 74, ఎంపీపీలు, జడ్పీటీసీలు మొత్తం నాలుగు మనమే గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పంలో కూడా ఇలాగే మంచి విజయాలు నమోదుచేశాం. మనం తెచ్చిన మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ► మనలో మనకు ఎన్ని విభేదాలున్నా పక్కనపెట్టి బిగ్గర్ పిక్చర్ గుర్తు తెచ్చుకుందాం. అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం. ► ఈ రోజు మన గ్రామంలోనే ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలవుతుంది. ► మూడున్నరేళ్లుగా ప్రజలకు చేస్తున్న మంచిని వివరించడానికే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టాం. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన జరుగుతోంది. -
తాడేపల్లి: టెక్కలి వైఎస్సార్సీపీ ప్రతినిధులతో సీఎం జగన్ (ఫొటోలు)
-
టెక్కలి కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం
-
మంచి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అర్హులైన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ.. ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నాం. అలాంటప్పుడు లక్ష్య సాధన పెద్ద కష్టమేమీ కాదని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ బుధవారం సాయంత్రం తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని కలవడం ఒక కారణం అయితే, ఇక రెండోది మరో పద్దెనిమిది నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. 18 నెలలంటే చాలా కాలం ఉందికా? ఇవ్వాళ్టి నుంచే ఆలోచన చేయాలా? అనుకోవచ్చు. ఆ అడుగులు ఇవ్వాళ్టి నుంచి కరెక్టుగా పడితేనే.. మనం క్లీన్‌స్వీప్ చేయగలుగుతాం. చాలా నియోజకవర్గాలకు సంబంధించిన ఇలాంటి సమీక్షా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా టెక్కలికి సంబంధించి రివ్యూ చేస్తున్నాం. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోంది. మీరు అందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది. గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతోంది. మంచి చేశామని సగర్వంగా తలెత్తుకునేలా మన పరిపాలన ఉంది. ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల రూ.1026 కోట్ల రూపాయలు గడపగడపకూ చేర్చగలిగాం. ఎవరెవరికి ఇచ్చామో.. ఆధార్ కార్డు వివరాలతో సహా, అక్కచెల్లెమ్మల పేర్లతో సహా చెప్పగలిగేలా ప్రతి ఇంటికీ చేర్చగలిగాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ఎవ్వరూ మిస్ కాకుండా, సంతృప్తస్థాయిలో, ప్రతి 50 ఇళ్లకుఒక వాలంటీర్ ద్వారా, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం ద్వారా వీటిని చేర్చాం. అర్హత ఉన్నవారికి మిస్ కాకూడదనే తపన, తాపత్రయంతో అడుగులు వేశాం. గతానికి భిన్నంగా ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు 175 కి 175 నియోజకవర్గాలు ఎందుకు మనం కొట్టలేం?: తప్పకుండా గెలవగలుగుతాం.. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోగలిగితే.. 87శాతం ఇళ్లకు మంచి చేశాం. మంచి జరిగిన ఇళ్లలో ఉన్న వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175 కి 175 సాధించలేం. మన గ్రామంలో ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, గ్రామ సచివాలయాలు, విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా ఆదుకునే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉగాది నుంచి పూర్తిస్థాయిలో అమలవుతోంది. యాభై ఇళ్లకు వాలంటీర్లు కనిపిస్తున్నారు. ఇలా గ్రామ రూపురేఖలన్నీ మార్చాం. ఇలాంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు ప్రతి కార్యకర్తా, నాయకుడూ కూడా 175 కి 175 స్థానాలు ఎందుకు సాధించలేమని మనం గుండెలమీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యం! జగన్ చేసే పని జగన్ చేయాలి. అదే మాదిరిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తలుగా, నాయకులుగా మనం చేసే పని మనం చేయాలి. ప్రతి గడపకూ వెళ్లాలి.. మనంచేసిన మంచిని వారికి గుర్తుచేయాలి, వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కేవలం ఏ ఒక్కరి వల్లనే ఇది జరగదు. నేను చేయాల్సింది నేను చేయాలి.. మీరు చేయాల్సింది మీరు చేయాలి. అందరూ కలిసికట్టుగా అడుగులేస్తేనే సాధ్యం అవుతుంది. టెక్కలి నియోజకవర్గంలో సర్పంచి ఎన్నికల్లో 136కు 119 పంచాయతీలు, ఎంపీటీసీలు 78కి 74, ఎంపీపీలు 4కు 4, జడ్పీటీసీలు 4కు 4 గెలిచాం. ఒక్క టెక్కలిలోనే కాదు.. కుప్పం నియోజకవర్గంలో కూడా ఇలాగా మంచి విజయాలు నమోదు చేశాం. మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. 175కి 175 ఎందుకు మనం తెచ్చుకోలేమన్న ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మనకు ఎన్ని గొడవలు ఉన్నాసరే.. పక్కనపెడదాం. బిగ్గర్ పిక్చర్ గుర్తుకు తెచ్చుకుందాం. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే.. వచ్చే ౩౦ ఏళ్లూ మనం ఉంటాం: ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీకూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి అని కార్యకర్తలు, కీలక నేతలను ఉద్దేశించి సీఎం జగన్ ఉద్భోధించారు. పార్టీ పటిష్టతలను కొనసాగించే క్రమంలో.. నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ఆయన వరుసగా భేటీలు జరుపుతున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Ronanki Appalaswamy: నడిచే బహు భాషాకోవిదుడు
కళింగాంధ్రలో జన్మించి రచయితగా, బోధకుడిగా, అనువాదుకుడిగా, సాహితీ విమర్శకుడిగా, అభ్యుదయవాదిగా ఆచార్య రోణంకి అప్పలస్వామి చేసిన పయనం తరగని స్ఫూర్తిని పంచింది. ఆయన 1909 సెప్టెంబరు 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఇజ్జవరం గ్రామంలో జన్మించారు. మూడో ఫారం చదువుతుండగానే పోతన భాగవతంలోని ఘట్టాలను కంఠస్థం చేసిన అప్పలస్వామి, తర్వాత కాలంలో ప్రపంచమే నివ్వరపోయేటంత భాషావేత్తగా ఎదిగారు. విజయనగరం ఎంఆర్ కళాశాలలో ఆంగ్ల బోధకుడిగా 1934లో కెరీర్ ప్రారం భించారు. ఒక వైపు ఆంగ్ల అధ్యాపకునిగా ఉంటూనే ఫ్రెంచ్, స్పానిష్, గ్రీకు, హీబ్రూ, ఇటాలియన్ వంటి యూరోపియన్ భాష లను ఆధ్యయనం చేశారు. ఆయా భాషల్లో కవితలు, రచనలు చేయడమేకాక అను వాదాలూ చేశారు. గ్రామఫోన్ ప్లేట్లు పెట్టుకొని జర్మన్, లాటిన్ లాంటి భాషల్లో నైపుణ్యం సంపా దించారు. హిందీ, ఒడియా, కన్నడం, బెంగాలీ వంటి భార తీయ భాషల్లో సైతం అసర్గళంగా మాట్లాడే శక్తి సొంతం చేసుకున్నారు. విజయనగరంలో వున్న తొలినాళ్లలో ‘సాంగ్స్ అండ్ లిరిక్స్’ పేరిట తొలికవితా సంపుటిని 1935లో వెలువ రించారు. అల్లసాని పెద్దన, క్షేత్రయ్య రచనలను ఆంగ్లీకరిం చారు. మేకియవెల్లి ఇటాలియన్ భాషలో రాసిన ‘ప్రిన్స్’ గ్రంథాన్ని, ‘రాజనీతి’ పేరుతో తెలుగులోకి సరళంగా అనువదించారు. మహాకవి గురజాడ కలం నుంచి జాలువారిన ‘పూర్ణమ్మ’, ‘తోకచుక్క’లను ఇంగ్లీష్‌లోకి అనువదించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, నారాయణ బాబు, విశ్వ సుందరమ్మ, చాకలి బంగారమ్మ వంటివారిని ప్రపంచ కవితా ప్రియులకు పరిచయం చేసింది రోణంకి వారే. ఆకాశవాణిలో కొన్ని సంవత్సరాలు ప్రసంగాలు చేశారు. ఆంగ్లభాషలో ఉత్తమ బోధకుడిగా, పలు భాషల్లో నిష్టాతుడిగా ఖ్యాతిగాంచిన రోణంకి అప్పలస్వామిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధన చేయమని ఆహ్వానం లభిం చింది. యూజీసీ ఎమెచ్యూర్ ప్రొఫెసర్‌గా నియమించింది. చాగంటి సోమయాజులు (చాసో), శ్రీరంగం నారాయణబాబు, చిర్రావూరి సర్వేశ్వర శర్మలు రోణంకికి మంచి స్నేహితులు. ప్రముఖ చిత్రకారుడు అంట్యాకుల పైడి రాజు ఎంతో సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. (క్లిక్ చేయండి: ఉత్తమ కథల సంకలనంలో ‘వేంపల్లె’ కథ) ప్రముఖ రచయిత ఆరుద్ర, రోణంకి మాష్టారుకు శిష్యుడే. అందుకే తన తొలి కావ్యం ‘త్వమేవాహం’ను అప్పల స్వామికి అంకితం చేశారు. డాక్టర్ మానేపల్లి తన తొలి కవితా సంపుటి ‘వెలిగించే దీపాలు’ను రోణంకి గారికే అంకితమిచ్చి మాష్టారు రుణం తీర్చుకున్నారు. పీవీ నరసింహారావు, పుట్టపర్తి నారాయణా చార్యుల వంటి వారితో సమాన ప్రతిభా పాటవాలు కలిగిన ఆచార్య అప్పలస్వామి జీవిత చరిత్రను, రచనలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. - డాక్టర్ జి. లీలావరప్రసాదరావు వ్యాసకర్త అసిస్టెంట్ ఫ్రొఫెసర్, బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం (సెప్టెంబరు 15నఆచార్య రోణంకి అప్పలస్వామి జయంతి) -
ఆ ఇంట్లో అద్దెకు దిగడమే వారి పాలిట శాపం
సాక్షి, ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు), టెక్కలి: సమస్యలు, ప్రమాదాలు ఎలా వచ్చి పడతాయో... ఏ సంబంధం లేకుండానే ఎలా ఇరుక్కుపోతామో ఎవ్వరూ ఊహించలేరు. విశాఖలో సోమవారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించిన ఓ యువకుడి హత్య వెనుక మిస్టరీ కూడా ఇలాంటిదే. వివాహేతర సంబంధానికి అలవాటు పడిన ఓ యువకుడు చూపించిన అతి ఉత్సాహం ఓ కుటుంబాన్నే అగాథంలోకి నెట్టింది. అభం శుభం తెలియని వారిని, వారి స్నేహితులను కటకటాలపాలు చేసింది. సోమవారం ఓ యువకుడి హత్యను గుర్తు తెలియని యువకుడి హత్యగా కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు ఎట్టకేలకు ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాటిపల్లి గ్రామానికి చెందిన పల్లి తులసీరావు (28)గా నిర్ధారించారు. ఈ ఘటనపై వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. తులసీరావు గత కొన్నేళ్లుగా దివీస్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదర్శనగర్‌లో ఉంటున్న ఓ మహిళతో అతనికి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే కొద్ది రోజులుగా అతనికి ఆ మహిళ దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై కోపంతో రగిలిపోతున్న తులసీరావు సోమవారం రాత్రి మద్యం సేవించి ఉషోదయ కూడలి దరి ఆదర్శనగర్ వచ్చాడు. రాత్రి సమయంలో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. అయితే ఎంతకీ తీయకపోవడంతో ఫోన్లో దుర్భాషలాడుతూ ఇంటి తలుపులు గట్టిగా కొట్టాడు. పలుమార్లు ఇదే తరహాలో ఉద్రేకంగా వ్యవహరించాడు. చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు) కొద్ది రోజుల కిందటే ఆ ఇంట్లోకి దంపతులు... వాస్తవానికి తులసీరావుతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కొన్ని రోజుల క్రితమే ఆదర్శనగర్‌లోని ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటకు వెళ్లిపోయింది. ఇటీవల వేరే కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగారు. అయితే భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊరికి వెళ్లడంతో భార్య ఒక్కరే ఆ ఇంట్లో ఉంది. ఎవరో తలుపులు బలంగా కొడుతున్నట్లు గమనించిన ఆమె భయాందోళనకు గురైంది. విషయాన్ని ఫోన్లో ఆమె భర్తకు సమాచారం అందించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ఆమె భర్త ఆ చుట్టుపక్కలే ఉంటున్న అతని స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఒకసారి తన ఇంటికి వెళ్లి పరిస్థితి చూడాలని, తలుపులు కొడుతున్నది ఎవరో చూసి మందలించాలని స్నేహితులకు చెప్పాడు. దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న అతని స్నేహితులు తులసీరావు గొడవ చేయడాన్ని గుర్తించి అతనిపై దాడి చేశారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న అతను వినలేదు. దీంతో ఆవేశంలో వారు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో అక్కడికక్కడే తులసీరావు కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిన వారు అతన్ని రోడ్డు పక్కకు లాగేసి అక్కడి నుంచి పరారయ్యారు. చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..) పోలీసుల అదుపులో నిందితులు సోమవారం తెల్లవారుజామున యువకుడు గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యా హ్నం 12 గంటల సమయంలో తులసీరావు మృతి చెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటన స్థలానికి సీఐ ప్రసాద్‌తోపాటు సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేయగా మంగళవారం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తులసీరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతోపాటు అజయ్, శివ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనలో ఇరుక్కున్న వారికి... తులసీరావుకి వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై ఎలాంటి అవగాహన లేదు. తులసీరావుతో అక్రమ సంబంధం పెట్టుకు న్న మహిళ గతంలో అద్దెకు ఉన్న ఇంట్లో... కొత్తగా వీరు అద్దెకు దిగడమే వారి పాలిట శాపమైంది. దీంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న భార్యభర్త, స్నేహితులైన నలుగురు యువకులు ఈ ఘటనలో ఇరుక్కుపోయారు. ఇప్పటికే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని ఎంవీపీ పోలీసులు నిర్ధారించలేదు. -
జగన్ జోలికొస్తే ఊరుకోం..
టెక్కలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులంతా వారి నోళ్లను అదుపులో పెట్టుకోవాలని, అలా కాకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జోలికి ఎవరైనా వస్తే ఆత్మాహుతి దళంగా మారుతానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైఎస్సార్ జంక్షన్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరో దిక్కులేక అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే టెక్కలి నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్సీపీ నాయకుల అంతు చూస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ దృష్టిలో అధికారం అంటే అంతు చూడటం అని మరోసారి ఆ పార్టీ నాయకులే అంగీకరించారని చురకలంటించారు. కేవలం సీఎం వైఎస్ జగన్‌ను, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే మహానాడును నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏ ప్రయోజనం చేకూర్చారో మహానాడులో ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. టీడీపీ మహిళా కార్యకర్తలతో తొడలు కొట్టించటం చూసి మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ప్రజలకు ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేశారని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి సైతం కేంద్ర బృందాలు వస్తుండటం సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా కొనసాగుతోందని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. -
దొంగ సొత్తు చెరువులో ఉందా..?
టెక్కలి: టెక్కలిలో ఈనెల 22న ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీకి సంబంధించి టెక్కలి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఎంవీ గణేష్ నేతృత్వంలో గత కొద్ది రోజులుగా ఒడిశా ప్రాంతాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక దొంగ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దొంగ ఇచ్చిన సమాచారంతో ఒడిశా పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు కండ్రవీధిలో గల ఓ చెరువులో నగల కోసం అన్వేషించినట్లు సమాచారం. జిల్లాలో వరుసగా జరుగుతున్న వివిధ రకాల సంఘటనల నేపథ్యంలో టెక్కలిలో జరిగిన భారీ చోరీపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ చోరీలో దొంగలు కాజేసిన రూ.2.40 లక్షల నగదు, 14 తులాల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: బాలింతల సేవలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్) -
ఔషధ చట్టం ఉల్లంఘిస్తే జైలుకే’
అరసవల్లి: జిల్లాలో అనధికారికంగా మందులు నిల్వ చేసే వారికి జైలు శిక్ష తప్పదని ఔషధ ని యంత్రణ శాఖ సహాయ సంచాలకులు ఎం. చంద్రరావు హెచ్చరించారు. ఆయన గురు వారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా టెక్కలి పరిధిలో ఔషధ చట్టం (1940) నిబంధనలు అతిక్రమించినందుకు బగాది కూర్మినాయకులు అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానాను టెక్కలి అసిస్టెంట్ సెషన్స్ కోర్టు విధించిందని గుర్తు చేశారు. 2018లో లైసెన్సు లేకుండా మందులు నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో అప్పట్లో టెక్కలి, శ్రీకాకుళం డ్రగ్ ఇన్స్పెక్టర్లు లావణ్య, కళ్యాణి బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కూర్మినాయుడుపై కేసు నమోదు చేశారని వివరించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలు, నిల్వలున్న వ్యాపారులపై కఠిన చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు. (చదవండి: ప్రశ్నపత్రం లీకేజీ అంటూ తప్పుడు ప్రచారం) -
తేలినీలాపురం గ్రామస్తుల సెంటిమెంట్..!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా.. తేలినీలాపురం.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది విదేశీ పక్షుల కేంద్రం. ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోని సైబీరియా నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఏటా టెక్కలిలోని తేలినీలాపురం గ్రామానికి వచ్చి సంతానోత్పత్తి చేస్తూ ప్రపంచ పటంలో ఈ గ్రామానికి ప్రత్యేక స్థానం కల్పించాయి. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు సంతానోత్పత్తిని పూర్తి చేసుకుని పిల్లలతో సహా తిరుగుముఖం పడతాయి. ఈ ఏడాది సంతానోత్పత్తిని ముగించుకుని పిల్లాపాపలతో స్వదేశానికి బయల్దేరాయి. ఇక్కడికే ఎందుకు... సంతాన ఉత్పత్తికి ఇక్కడ వాతావరణం అనుకూలం ఇక్కడి చిత్తడి నేలలు చెరువుల్లో సమృద్ధిగా ఆహార లభ్యత ఆవరణ వ్యవస్థ గ్రామస్తుల ఆదరణ కలిసిరాని కాలం.. ఈ ఏడాది ఎన్నడూలేని రీతిలో అధికసంఖ్యలో పెలికాన్ పక్షులు మృత్యువాత పడ్డాయి. ఆహారంగా స్వీకరించే చేపల్లో కొత్త వైరస్ దాడి చేసి పక్షుల మరణాలకు కారణమైందని ప్రాథమికంగా నిర్ధారించినా కచ్చితమైన కారణాలను మాత్రం కనుక్కోలేకపోయారు అధికారులు. గ్రామస్తులకు సెంటిమెంట్.. విదేశీ పక్షుల రాక కోసం గ్రామస్తులు ఏటా ఎదురుచూస్తుంటారు. ఇవి వస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం. ఇవి రాకుంటే తీవ్రంగా మదనపడిపోతారు. వీటిని చక్కగా ఆదరిస్తారు. సంతానోత్పత్తికి అనుకూలంగా.. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రం పరిసరాల్లోని చెట్లనే ఇవి ఆవాసంగా మార్చుకుంటాయి. 400 నుంచి 500 వరకు గూళ్లను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. పిల్లలకు ఆహారం సమకూరుస్తూ ఏప్రిల్ వరకు గడుపుతాయి. ఏప్రిల్ చివరిలో స్వదేశానికి పయనమవుతాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో పక్షులు మరణించినా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సంతానోత్పత్తిని కొనసాగించాయి. ఏయే రకాలు.. ఎన్నెన్ని.. ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ అనే రెండు రకాల పక్షులు తేలినీలాపురం పక్షుల కేంద్రానికి వస్తుంటాయి. అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది 330 పెలికాన్, 470 పెయింటెడ్ స్టార్క్ పక్షులు సెప్టెంబర్‌లో ఇక్కడికి వచ్చాయి. పెలికాన్.. సెప్టెంబర్‌లో వచ్చినవి: 330 మృత్యువాత పడినవి: 93 సంతానం: 192 తిరుగుముఖం పట్టినవి: 386 ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 43 పెయింటెడ్ స్టార్క్.. సెప్టెంబర్‌లో వచ్చినవి: 470 సంతానం: 450 తిరుగుముఖం పట్టినవి: 768 ప్రస్తుతం చెట్లపై ఉన్నవి: 152 ఎంతో ఆవేదన.. ఏటా పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల రాకతో మా గ్రామం సందడిగా ఉంటుంది. పక్షుల విన్యాసాలు చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. గ్రామంలో ఎప్పుడూ పండగ వాతావరణమే. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో చనిపోవడం ఎంతో ఆవేదనకు గురి చేసింది. పక్షుల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. –ఆర్.కృష్ణారావు, తేలినీలాపురం పక్షుల ఉనికి కాపాడుకోవాలి సైబీరియన్ పక్షుల ఉనికి కాపాడుకోవడం మనందరి బాధ్యత. జిల్లాను ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపుతెచ్చిన విదేశీ పక్షుల సంరక్షణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. – కె.రామారావు, జీవ వైవిధ్య శాస్త్రవేత్త వైరస్ నివారణకు.. తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి ఆనుకుని ఉన్న చెరువుల్లో చేపలకు సోకిన వైరస్‌ను నివారించేందుకు ఆయా శాఖాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం వేసవి కావడంతో చెరువుల్లో నీరు అడుగంటి పోయిన తర్వాత చర్యలు చేపట్టాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా మత్స్య శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – పి.వి.శాస్త్రి, అటవీ శాఖ రేంజర్ -
అమ్మో.. కొండచిలువ
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి రూరల్ మండలంలోని రావివలస సమీపంలోని బులవంత చెరువులో సోమవారం భారీ కొండ చిలువ కనబడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం చెరువు వైపు వెళ్లిన వారికి నాచులో ఈ భారీ సర్పం కనిపించడంతో పరుగులు తీశారు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. -
పార్టీకి పిలవలేదని వెళ్లిపోతూ.. మృత్యుఒడిలోకి..
సాక్షి, శ్రీకాకుళం(టెక్కలి రూరల్): స్నేహితులు పార్టీకి పిలవలేదనే కోపంతో వెళ్లిపోతున్న యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన స్థానిక జగతిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం వేకువజామున చోటు చేసుకోగా.. నందిగాం మండలం నౌగాం గ్రామానికి చెందిన యువడుకు శిమల ఈశ్వరరావు (20) మృతి చెందాడు. టెక్కలి ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశ్వరరావు తొలుసూరుపల్లి రోడ్డులో ఉన్న ఓ సప్లయ్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాత్రి తన స్నేహితులు జగతిమెట్ట సమీపంలో మద్యం పార్టీ చేసుకుంటున్నారు. అయితే అక్కడకు వెళ్లిన యువకుడు తనను పిలవకుండా పార్టీ చేసుకుంటారా అంటూ కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోయే క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. చదవండి: (అఘాయిత్యం: బెదిరించి లొంగదీసుకుని.. ఒకరితర్వాత ఒకరిపై..) తీవ్రంగా గాయపడిన ఈశ్వరరావు అక్కడకక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు. చదవండి: (భార్యతో వివాహేతర సంబంధం.. భర్తకు తెలిసి వేటకొడవలితో..) -
Tekkali: మరో నకిలీ బాగోతం: రశీదు అబద్ధం.. దోపిడీ నిజం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలిలో తవ్వుతున్న కొద్దీ అక్రమాల పుట్టలు బయటపడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఎంత అండగా నిలిచారో తెలీదు గానీ వెతికిన చోటల్లా అవినీతి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదివరకు భూములకు సంబంధించి ఆయన హయాంలో సృష్టించిన ఫేక్ వన్‌బీ, అడంగల్ బయటపడ్డాయి. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేసిన బాగోతాలు వెలుగు చూశాయి. నకిలీ పట్టాలతో బ్యాంకు రుణాలు కాజేసిన వ్యవహారాలూ బయటకొచ్చాయి. భూరికార్డులను తారుమారు చేసి కబ్జా చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా టెక్కలి పంచాయతీలో నకిలీ బిల్లులతో ఆస్తి పన్నుల ఆదాయాన్ని కొల్లగొట్టిన బండారం బయటపడింది. ఇందులో టెక్కలి బిల్లు కలెక్టర్‌గా పనిచేసిన సీహెచ్ కైసును బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినా మరో ఇద్దరు దీని వెనుక ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ పనిచేసిన ఓ ఉద్యోగి రిటైరైనా అప్పటి నేతల అండతో అక్కడే తిష్టవేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సొంతంగా నోటీసులు.. టెక్కలిలో నకిలీ డిమాండ్ నోటీసులు సృష్టించారు. నకిలీ రశీదు పుస్తకాలు సొంతంగా తయారు చేయించారు. టెక్కలి పంచాయతీ పరిధిలోని ఆస్తి పన్నులు చెల్లించాల్సిన వారికి తొలుత ఆ నకిలీ డిమాండ్ నోటీసులు జారీ చేశారు. పబ్లిక్కు ఆ విషయం తెలియక జారీ చేసిన డిమాండ్ నోటీసుకు తగ్గట్టుగా ఆస్తి పన్ను చెల్లింపులు చేశారు. ఇలా నకిలీలతో వసూలు చేసిన పన్నుల సొమ్మును వారు తమ జేబులోకి వేసుకున్నారు. అనుమానం రాకుండా కొంత మొత్తం మేర మాత్రం అధికారికంగా చూపించారు. ఇలా టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు రూ.16 లక్షలకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. పంచాయతీలో వసూలు చేసిన ఇంటి పన్ను సొమ్మును పంచాయతీ ఖాతాకు జమ చేయకుండా బిల్ కలెక్టర్ చేతివాటం చూపించారు. వీరితో పాటు గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి, రిటైరైన ఉద్యోగి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. టెక్కలి మేజరు పంచాయతీలో సుమారు 9 వేల పై చిలుకు ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే 2018– 19 సంవత్స రం నుంచి సుమారు మూడేళ్లుగా వసూళ్లు చేసిన ఇంటి పన్ను సొమ్ములో కొంత భాగాన్ని పంచాయతీ ఖాతాకు మళ్లిస్తూ మిగిలిన సొమ్మును స్వాహా చేశారు. గత కొద్ది రోజుల కిందట ఈ బాగోతం బయట పడడంతో, ప్రస్తుత పంచాయతీ ఈఓ తన స్థాయి మేరకు విచారణ జరిపి, రూ.16.46లక్షలకు పైగా సొమ్ము కాజేసినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగొచ్చు. దీంతో ఈఓ అజయ్‌బాబు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఇన్చార్జి డీఎల్ పీఓ ఎస్.హరిహరరావు వివరాలను సేకరించి జిల్లా అధికారులకు నివేదించారు. 2018–19లో రూ. 7,67,999, 2019–20లో రూ.4,22,416, 2020– 21లో రూ.4,55,787 స్వాహా చేశారు. ఈ మూడేళ్ల లో సుమారు రూ.16,46,202 మేర పక్కదారి పట్టినట్టు ప్రాథమికంగా తేల్చారు. పూర్తి అవినీతి బయటపడాలంటే సమగ్ర విచారణ అవసరమని గుర్తించారు. ఆ మేరకు విచారణకు కూడా ఆదేశించారు. బిల్ కలెక్టర్ సస్పెన్షన్.. పన్నుల వసూలులో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ రశీదులు జారీ చేయడం వంటి అంశాలు బయట పడటంతో పాటు ప్రాథమికంగా నిర్దారణ కావడంతో బిల్ కలెక్టర్ సీహెచ్ కైసును జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ సస్పెండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా టెక్కలి వదిలి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
ఇదో ప్రేమలేఖ! ఆనందం పట్ట‘లేఖ’
టెక్కలి రూరల్: ఇదో ప్రేమలేఖ. తన భార్యకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞత చెప్పేందుకు భర్త రాసిన లేఖ. సంతకం పెట్టడం తప్ప రాయడం తెలీని ఆ వ్యక్తి లెటర్‌ను టైప్ చేయించి ఆస్పత్రిలోని ఫిర్యాదుల పెట్టెలో వేసి వైద్యులను ఆశ్చర్యపరిచారు. నిత్యం ఫిర్యాదులతో సతమతమయ్యే వైద్య సిబ్బంది ఈ లేఖను చూసి మురిసిపోయారు. అసలు విషయంలోకి వెళ్తే.. టెక్కలి మెట్టవీధికి చెందిన గుడ్ల రామారావు భార్యకు అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. చదవండి: శ్యామలను బిడ్డలా చూసుకుంటా! కాళ్లు చేతులు కదలక నోట మాట కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాంటి స్థితిలో ఆమెను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. వైద్యులు పది రోజుల పాటు పసిబిడ్డను చూసుకున్నట్లుగా ఆమెను రాత్రీపగలు చూసుకున్నారు. వారి కృషి ఫలితంగా ఆమె వేగంగా కోలుకున్నారు. వైద్య సిబ్బంది చూపిన చొరవ రామారావు మనసు గెలుచుకుంది. వారిని ప్రత్యక్షంగా అభినందించడానికి మొహమాట పడి, ఓ లెటర్‌ను ఇలా టైప్ చేయించి ఫిర్యాదుల పెట్టెలో ఈ నెల 4న వేశారు. శుక్రవారం ఆ పెట్టెను తెరిచి చూసిన ఆస్పత్రి సిబ్బంది లేఖను చూసి సంతోషపడ్డారు. ప్రజలు ఏవో కారణాలతో ఎప్పుడూ తమను నిందిస్తూనే ఉంటారని, ఈ లేఖతో ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. -
పుస్తెలతాడు చేయించలేదని ప్రాణం తీసుకుంది..
టెక్కలి రూరల్: వివాహమై ఎనిమిదేళ్లయినా తన భర్త బంగారం పుస్తెల తాడు చేయించలేదని మనస్తాపానికి గురైన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కోట»ొమ్మాళి మండలం భావాజీపేట గ్రామంలో చోటుచేసుకోగా పంగ సత్యవతి (30) ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం గేదెలవానిపేట గ్రామానికి చెందిన సత్యవతికి ఎనిమిదేళ్ల క్రితం భావాజీపేటకు చెందిన సూర్యనారాయణతో వివాహమైంది. శుక్రవారం రాత్రి కూడా ఇరువురి మధ్య పుస్తెలతాడు విషయమై గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన సత్యవతి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శనివారం ఉదయం సూర్యనారాయణ నిద్ర లేచేసరికి సత్యవతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. కోటబొమ్మాళి ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి చల్ల రత్నాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సత్యవతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
భర్త, పిల్లలను వదిలేసి 9 ఏళ్లుగా డేటింగ్.. కానీ ప్రియుడేమో?
టెక్కలి రూరల్: భర్త, పిల్లలను వదిలేసి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళపై హత్యాయత్నం జరిగింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందనే కోపంతో ఆమెతో సహజీవనం చేస్తున్న మృగాడే విచక్షణ రహితంగా కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొరిగిపేట గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన కొప్పల కమలకు 2005లో అదే గ్రామానికి చెందిన సింగుమహాంతి భుజంగరావుతో వివాహం జరిగింది. వీరు హైదరాబాద్‌లో పనులు చేసుకుని జీవించేవారు. వీరికి ఇద్దరు కుమారులు చరణ్, హరవర్ధన్ ఉన్నారు. అయితే పెళ్లికి ముందు నుంచే కమలకు టెక్కలి మండలం బొరిగిపేట గ్రామానికి చెందిన రైల్వే గేట్మెన్ సంపతిరావు దేవరాజుతో పరిచయం ఉంది. అతడిని నమ్ముకుని 2012లో భర్త, పిల్లలను వదిలి టెక్కలి వచ్చేసింది. దేవరాజుకు భార్య, పిల్లలు ఉండడంతో ఈమెను స్థానిక ఎన్టీఆర్ కాలనీ తొమ్మిదో లైన్లో అద్దె ఇంటిలో ఉంచాడు. అయితే తొమ్మిదేళ్లు అవుతున్నా కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా ఇరువురి మధ్య గొడవలు జరిగేవి. దీంతో కమల ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన దేవరాజు ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. శుక్రవారం రాత్రి కమల ఇంటికి వెళ్లి.. పెద్ద మనుషుల వద్ద సమస్యను పరిష్కరించుకుందామని నమ్మించి బైక్‌పై బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు. నిన్ను చంపేస్తే గాని హాయిగా ఉండలేనంటూ ఇంట్లో నుంచి కత్తి తెచ్చే సరికి కమల భయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. దేవరాజు కూడా వెంబడించి గ్రామ సమీపంలో వంశధార కాలువ వద్ద కత్తితో ఆమెపై దాడి చేసి చేతులు, ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయింది. కమల చనిపోయిందని భావించిన దేవరాజు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయానికి కోలుకున్న ఆమె పాల వ్యాన్‌లో సీతాపురం గ్రామానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 108కి ఫోన్ చేయడంతో సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహారాజ్ వైద్యపరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ ఆర్.నీలయ్య వివరాలు సేకరించారు. కమలను గాయపరిచిన వారిలో దేవరాజుతో పాటుగా మరో వ్యక్తి ఉన్నాడని బాధితురాలు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్ఐ కామేశ్వరరావు తెలిపారు. -
వరుడికి చేరిన ప్రైవేటు ఫొటోలు.. అవమానంతో యువతి ఆత్మహత్య
టెక్కలి రూరల్ (శ్రీకాకుళం): ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకోమంటే కులాన్ని సాకుగా చూపి మొహం చాటేశాడు. పెద్దల బలవంతంతో ఆ యువతి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడగా.. ఆమె ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి పాల్జేశాడు. దీంతో అవమాన భారాన్ని దిగమింగుకోలేక ఆ యువతి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన లీలావతి (25) తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో తన అక్క ఇంట్లో ఉంటోంది. లీలావతి అదే మండలంలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన పైల వెంకటేష్ అనే యువకుడిని ఐదేళ్ల క్రితం ప్రేమించింది. వివాహం చేసుకోవాలని కోరగా.. కులం పేరు చెప్పి వెంకటేష్ పెళ్లికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల తల్లిదండ్రులు వేరే యువకుడిని పెళ్లి చేసుకునేలా లీలావతిని ఒప్పించారు. ఆగస్టు 26న పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ విషయం తెలిసిన వెంకటేష్ ఆ యువతికి సంబంధించి కొన్ని ప్రైవేటు ఫొటోలను వరుడితోపాటు మరికొందరికి పంపించి అల్లరి చేశాడు. ఈ విషయం తెలిసిన లీలావతి అవమాన భారం తట్టుకోలేక శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కొక్కేనికి ప్లాస్టిక్ వైరుతో ఉరి వేసుకుంది. -
అనుమానాస్పద స్థితిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పాతనౌపడ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ కూర్మాపు చిన్ని (35) అనుమానాస్పదంగా మృతి చెందారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న ఆయన రెండు రోజుల కిందట సెలవుపై ఇంటికి బయల్దేరారు. మరో నలుగురితో కలిసి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వరకు ట్యాక్సీ బుక్ చేసుకున్నారు. శనివారం ఉదయం ఆమదాలవలసలో దిగి ఆటోలో బయల్దేరుతూ టెక్కలి జగతిమెట్ట వద్దకు తమ్ముడిని పంపించాలని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన కాసేపటికే చిన్ని ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. తమ్ముడు జగతిమెట్ట వద్దే ఉన్నా చిన్ని రాలేదు. ఎంతకూ రాకపోవడంతో శనివారమంతా చుట్టుపక్కల గ్రామాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గాలించారు. పోలీసులను కూడా ఆశ్రయించారు. ఆదివారం నందిగాం మండలం దేవుపురం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఓ మృతదేహం కనిపించడంతో పోలీసులు చిన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మృతదేహం చిన్నిదేనని గుర్తు పట్టారు. -
నడిరోడ్డుపై వదిలేసిన ట్యాక్సీ డ్రైవర్.. అర్ధరాత్రి భర్త మృతదేహంతో..
సాక్షి, టెక్కలి రూరల్: మండలంలోని అక్కవరం గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఒక మృతదేహాన్ని రహదారిపై దించి వెళ్లిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒడిశాకు చెందిన ప్రదీప్, అంజలి అనే దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రదీప్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో వారు స్వస్థలం ఒడిశాలోని బాలా సోర్కు ట్యాక్సీలో వెళ్తున్నారు. టెక్కలి సమీపంలోకి రాగానే ప్రదీప్ బండిలోనే మృతి చెందడంతో ట్యాక్సీ డ్రైవర్ ఆ మృతదేహంతో పాటు ఆమెను కూడా వాహనం నుంచి కిందకు దించి వెళ్లిపోయాడు. దీంతో నడిరోడ్డుపై తన భర్త మృతదేహంతో ఆ మహిళ ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరో వాహనాన్ని సమకూరుస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. ‘స్పీకర్ ఆరోగ్యంపై వదంతులు నమ్మవద్దు’ ఆమదాలవలస: స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ రోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పు డు ప్రచారాలు నమ్మవద్దని స్పీకర్ క్యాంపు కా ర్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఓ ప్రకటన వెలువడింది. స్పీకర్ దంపతులకు వారం కిందట కరోనా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తు తం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగుందని ప్రకటనలో తెలిపారు. ఇద్దరూ జిల్లాకేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
Telugu Natakam: నటనలో జీవిస్తూ.. నాటకాన్ని బతికిస్తూ!
ఒకప్పుడు తెలుగునాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడమే కాకుండా ప్రజల మదిలో చైతన్య భావాలను రేకెత్తించిన సుందర దృశ్యకావ్యం నాటకం. మారుతున్న కాలంలో నేటి యువతకు నాటకంలోని రసజ్ఞతను ఆస్వాదించే ఆసక్తి లేకున్నా.. వారిని నటనతో కట్టిపడేసే సామర్థ్యం కలిగిన కళాకారులకు పుట్టినిల్లు సిక్కోలు. ఇక్కడి నాటక కళాసమితులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కవిటి: పౌరాణిక, సాంఘిక నాటకాల్లో విశేష సేవలందించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని దశదిశలా మారుమోగేలా చేసిన కళాకారులు ఎంతోమంది కళామతల్లి ముద్దుబిడ్డలుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ బిరుదుపొందిన యడ్ల గోపాలరావు, మీగడ రామలింగస్వామి, ఉద్దానం ప్రాంతానికి చెందిన దివంగత బెందాళం ప్రకాష్ వంటి ఎందరో ఈ ప్రాంతంనుంచి నాటకాలు వేసి సినిమాల్లో సైతం తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. 2000 సంవత్సరం వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 వరకు నాటక సమాఖ్యలు ఉండేవి. కాలక్రమంలో వీటిసంఖ్య సగానికి తగ్గిపోయింది. కవిటి ఉద్దానం ప్రాంతం బొరివంకకు చెందిన శార్వాణి గిరిజన సాంస్కృతిక సమాఖ్య, శ్రీకాకుళానికి చెందిన శ్రీశయన నాటక సమాఖ్య, నందిగాం మండలం పెద్దతామరాపల్లి శ్రీవేంకటేశ్వర నాటక కళాసమితి, టెక్కలిలో ప్రజాచైతన్య నాటక కళా సమితి, కోటబొమ్మాళి మండలం లఖిందిడ్డిలో శ్రీనివాస నాటక కళాసమితి, సంతబొమ్మాళి మండలం వడ్డివాడలో చైతన్య నాటక కళాసమితి తమ కళాసేవల్ని నేటికీ కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళంలో మిత్రా సాంస్కృతిక సమాఖ్య, ఉద్దానం ప్రాంతంలో భైరిపురం, బి.గొనపపుట్టేగ, బొరివంక, బెజ్జిపుట్టుగ, మఖరాంపురం, కత్తివరం గ్రామాల్లో నాటక పరిషత్ పోటీలు తరచుగా నిర్వహిస్తూ సాంఘిక నాటిక కళాసౌరభాల్ని భావితరాలకు అందించడంలో విశేషంగా కృషిచేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో 60 ఏళ్లుగా నాటికలు వేసే ప్రక్రియ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం బొరివంకలో పలువురు ఉపాధ్యాయులతో కలిసి ఏర్పడిన శార్వాణి నాటక సమితి సేవలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ‘నంది’సంతృప్తి అనిర్వచనీయం నాటిక ప్రదర్శనల్లో మూడు దశాబ్దాలుగా భాగస్వామిగా నటజీవితం కొనసాగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారం పొందడం మరపురాని అనుభూతి. –పిరియాచలపతిరావు, శార్వాణీ నాటక సమాఖ్య, బొరివంక నిర్మాణంలో కళావేదిక.. బొరివంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కళావేదిక ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయిన తర్వాత తెలుగురాష్ట్రాల నాటిక పరిషత్ పోటీలు నిర్వహించాలన్న అభిలాష ఉంది. –బల్లెడ లక్ష్మణమూర్తి, గౌరవాధ్యక్షుడు, శార్వాణీనాటక సమాఖ్య, బొరివంక కళాపోషణ ఉండాలి.. మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి.. అనే తెలుగు సినిమా డైలాగు నన్నెంతగానో ప్రభావితం చేసింది. వృత్తి వ్యవసాయమైనా కళారంగంపై మక్కువ నన్ను నటన వైపు ఆకర్షించేలా చేసింది. – బెందాళం శోభన్‌బాబు, సీనియర్ నటుడు, శార్వాణీనాటక సమాఖ్య -
జూట్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం
టెక్కలి రూరల్ (కోటబొమ్మాళి): మండలంలోని బజీరుపేట కూడలి సమీపంలోని శ్రీసాయి హర్షవర్ధన్ జూట్ కర్మాగారంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం షిఫ్టునకు హాజరైన వారు ఎవరి పనుల్లో వారు తలమునకలై ఉన్న సమయంలో ఒక్కసారిగా యంత్రం నుంచి మంటలు చెలరేగాయి. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో కార్మికులకు ఊపిరాడక హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా మంటలు ఎగసిపడి జూట్ నిల్వలు దగ్ధమయ్యాయి. దాదాపు 500 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో వారంతా కొంత సరుకును పట్టుకుని బయటకు పరుగులు తీశారు. నష్టం రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న కోటబొమ్మాళి, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం అగ్ని మాపక కేంద్రాల నుంచి అగ్నిమాపక వాహనాలు సాయంత్రానికి 70 శాతం వరకు మంటలను అదుపు చేశాయి. జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్ కృష్ణవర్మ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని వివరించారు. -
నాటి స్టూడెంటే.. నేటి టాలీవుడ్ డైరెక్టర్
టెక్కలి/శ్రీకాకుళం: ఒకప్పుడు విద్యార్థిగా ఆ కాలేజీ అంతా తిరిగిన కుర్రాడు.. డైరెక్టర్‌గా మారాడు. ఎక్కడ తన కలలకు పునాదులు వేసుకున్నాడో అక్కడకే వచ్చి తన ప్రయాణ అనుభవాలను పంచుకున్నాడు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో సోమవారం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ యూనిట్ సందడి చేసింది. హీరో కొణిదెల పవన్ తేజ్, హీరోయిన్ మేఘనతో పాటు డైరెక్టర్ మెట్ట అభిరామ్ విద్యార్థులతో మాట్లాడారు. డైరెక్టర్ ఇదే కాలేజీలో 2012–16లో ట్రిపుల్ ఈ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ కెరీర్‌కు ఆదిత్య కాలేజీ ఓ వేదికగా నిలిచిందన్నారు. లీడర్షిప్ ఫౌండేషన్ విభాగం తనను ఎంతో ప్రోత్సహించిందని గుర్తు చేశారు. తన మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్తేజ్తో చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం తరఫున సినిమా బృందానికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కథలో పాత్రలు కల్పితం చిత్రం నటీనటులు, డైరెక్టర్‌కు జ్ఞాపిక అందజేస్తున్న కళాశాల యాజమాన్యం మెగా ఆశీస్సులతో.. అరసవల్లి: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని హీరో కొణిదెల పవన్‌తేజ్ అన్నారు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా యూనిట్ సభ్యులు సోమవారం అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన డైరెక్టర్‌తో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 19న సినిమా రిలీజ్ చేస్తున్నామని డైరెక్టర్ అభిరామ్ తెలిపారు. చదవండి: అప్పుడు డిప్రెస్ అయ్యా! ఫిల్మ్ ఫెస్టివల్ పేరుతో ‘భీష్మ’ డైరెక్టర్‌కు ఎర -
కింజారపు కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడింది..
సాక్షి, శ్రీకాకుళం: కింజారపు సోదరుల కుటుంబం హత్యారాజకీయాలకు అలవాటు పడిందని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మాడలో ప్రతి పంచాయతీ ఎన్నికల్లో హత్యలు చేయించడం కింజారపు కుటుంబానికి పరిపాటిగా మారిందని దువ్వాడ ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకుడు కింజారపు అప్పన్న నామినేషన్ వేస్తానంటే, అతని చంపుతామంటూ కింజారపు సోదరుల అనుచరులు ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు. అప్పన్నకు తోడుగా తానే వెళ్లి నామినేషన్ వేయిద్దామనుకుంటే, తనపై కూడా కత్తులతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన అనుచరులు, పోలీసులపై కూడా కింజారపు సోదరుల అనుచరులు దాడి చేశారన్నారు. ఈ సందర్భంగా వారు తమ వాహనాలు ధ్వంసం చేసి, సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు స్వయంగా ఫోన్ చేసి అప్పన్న కుటుంబ సభ్యులను బెదిరించినా, ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. అసలు నాగరిక ప్రపంచంలో ఉన్నామా అనే అనుమానం కలిగేలా అల్లరి మూకలు చెలరేగారన్నారు. అయినప్పటికీ తాము సంయమనంతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
అప్పన్న పోటీ.. అచ్చెన్న బెదిరింపులు
సాక్షి, శ్రీకాకుళం : టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయడు మరోసారి బెదిరింపులకు దిగారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన స్వగ్రామం నిమ్మాడ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్నను బరిలో నిలపడాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. ఈ క్రమంలోనే నిమ్మాడ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నుంచి నామినేషన్ వేసేందుకు సిద్ధమైన అప్పన్నపై అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్ వేయోద్దని.. ఫోన్ చేసి ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్పన్న ఆయన మాట వినకపోవడంతో అచ్చెన్న అనుచరులు ఏకంగా అప్పన్న నివాసానికి చేరుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. నిమ్మాడలో తనను ఇప్పటి వరకు పట్టించుకోలేదని, టీడీపీ ప్రభుత్వం తప్పిదాల కారణంగానే తన భార్య ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చిందని అప్పన్న అవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి సర్పంచ్‌గా నిమినేషన్ వేసి తీరుతానని స్పష్టం చేశారు. అయితే మరోసారి అప్పన్నకు ఫోన్ చేసిన అచ్చెన్న.. తన మాట వినాలని సముదాయించే ప్రయత్నం చేశారు. గతంలో అయిపోయింది ఏదో అయిపోయిందని ఇక నుంచి పార్టీలో గౌరవిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్నన్న మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయిన అచ్చెన్నాయుడు బెదిరింపులకు దిగారు. సర్పంచ్ పదవేమన్నా రాష్ట్రపతి పదవా అంటూ ఎద్దేవా చేశారు. నిమ్మాడలో ఉద్రిక్తత.. అప్పన్నను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, అచ్చెన్నాయుడి అనుచరులు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆదివారం నాడు నామినేషన్ కేంద్రానికి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ కూడా ఉన్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బలవంతంగా బయటకు గెంటేశారు. అప్పన్నపై దాడికి దిగారు. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
బుద్ధుడినీ వదలని ప్రబుద్ధులు
స్వశక్తితో సోపానమెక్కడం కష్టం. చేతకాక స్వయంకృతం కొద్దీ పతనం కావడం సులభం. మొదటిది తమ తలకు మించిన పని కాబట్టి.. రెండోదే మేలనుకుంటున్నారు ఘనత వహించిన ప్రతి‘పచ్చ’ వర్గీయులు. తమకు మొదటి నుంచీ అలవాటైనదే కాబట్టి.. అదే దారిలో ముందుకు సాగుతున్నారు. వికృత రాజకీయాలకు తెరలేపి.. విగ్రహ విధ్వంస రాజకీయాలతో విద్వేషాలను ఎగదోసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అకృత్యాల బాటపట్టిన వారు తాజాగా టెక్కలిలో బుద్ధ భగవానుడి ప్రతిమకు సంబంధించి అతి చేయబోయారు. విగ్రహం విరిగిందిని నానాయాగీ చేసి పబ్బం గడుపుకుందామనుకున్న అచ్చెన్న వర్గీయులు అధికారులు ఇచ్చిన కచ్చితమైన జవాబులతో బొక్క బోర్లా పడ్డారు. డ్రామాకు తెరదించి తోక ముడిచారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టెక్కలి ఆది ఆంధ్రావీధి సమీపంలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులో బుద్ధుని విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి చేతి మణికట్టు మూడు నెలల క్రితమే ఊడిపోయింది. అప్పట్లోనే తాత్కాలిక మరమ్మతులు చేసి అతికించారు. ఆ మణికట్టు మళ్లీ ఊడిపోయింది. ఇంకేముంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దానిని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. తన అనుచరులను రంగంలోకి దించారు. విగ్రహ రాజకీయాలతో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు పక్కా ప్లాన్ గీశారు. టీడీపీ మండల అధ్యక్షుడు బి.శేషగిరిరావుతో పాటు నాయకులు, కార్యకర్తలను ఆ స్థలానికి పంపించి హడావుడి చేయించారు. హైడ్రామా నడిపించారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆర్.వీ.పీ.రాజు, కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ ఎన్.కామేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ ప్రకాశ్ తదితరులు సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని వాస్తవాలను వివరించారు. బుద్ధుని విగ్రహం చేతి మణికట్టు మూడు నెలల క్రితమే ఊడినట్లు చెప్పారు. రగడ సృష్టించేందుకు.. ఏదో చేద్దామని భావించి అక్కడికి వచ్చిన టీడీపీ నేతలు అధికారుల వివరణతో కంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక డీఎస్పీ శివరామిరెడ్డికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. రాష్ట్రంలో పలు హిందూ దేవాలయాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రల నేపథ్యంలో ఈ సంఘటనను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ఒక్కసారిగా వికటించినట్టయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ శిబిరంలో మాట పడిపోయింది. వీరావేశంతో ముందుకెళ్లిన టీడీపీ నేతలకు ఊహించని పరిణామంతో తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. (చదవండి: ఆ ఇద్దరూ ద్రోహులే..) కథనం అవాస్తవం... టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుద్ధుని విగ్రహ ధ్వంసంపై సోమవారం ఓ పత్రికలో వచ్చిన కథనం అవాస్తవమని ఆర్డబ్ల్యూఎస్ డీఈ కేఆర్వీపీ రాజు స్పష్టం చేశారు. టెక్కలి సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఆనుకుని ఉన్న పార్కులో గల బుద్ధుని విగ్రహం చేతి మణికట్టు సాధారణంగానే ఊడిందని ఆయన స్పష్టం చేశారు. విగ్రహం చేతిని ధ్వంసం చేశారని ఓ పత్రికలో కథనం రావడంతో డీఈతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహం చేయి మూడు నెలల కిందటే ఊడిపోయిందని, అప్పట్లో అమర్చినా మళ్లీ ఊడిపోయిందని వివరించారు. -
సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందే..
సాక్షి, టెక్కలి : మహిళా ఉద్యోగుల రక్షణకు ఎన్నికఠిన చట్టాలు తీసుకువచ్చినా కీచకుల ఆగడాలు ఆగడం లేదు. ముఖ్యంగా దిగువ స్థాయి ఉద్యోగులు పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతునే ఉన్నాయి. చట్టం నుండి తప్పించుకోవచ్చనే బులుపుతోనో, దిగువ స్థాయి ఉద్యోగులు అంటే అలుసో గాని మహిళ ఉద్యోగుల వృత్తి అవసరాలను అడ్డంపెట్టుకొని పెట్రేగిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్టీసీ డిపోలో కూడా ఓ అధికారి ఈ రకమైన వికృత చర్యకు పాల్పడ్డారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా.. తన మాట వినకుంటే ప్రమోషన్ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితులు తమ గోడును సాక్షి టీవీకి మొరపెట్టుకున్నారు.(ఆత్మస్థైర్యంతో కరోనాను జయించాను.. ) వివరాల్లోకి వెళితే.. టెక్కలి ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఈశ్వరరావు డిపోలోని మహిళల ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారితో అసభ్య చాటింగ్‌లు చేయడమే కాకుండా.. డ్యూటీ దిగాక తన ఆఫీస్‌కు వచ్చి వెళ్లాలని ఆదేశాలు కూడా జారీచేశారు. సెలవు కావాలంటే కోరిక తీర్చాల్సిందేనని పశువులా ప్రవర్తించాడు. వయసుతో సంబంధం లేకుండా తను చెప్పిందే చేయాల్సిందేనని ఒత్తిడికి గురిచేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకుంటే లాంగ్ డ్రైవ్‌లు, టూరిస్ట్ ప్లేస్‌లు తిప్పుతానని ఎర వేసే ప్రయత్నం చేశాడు. తన కోరిక తీర్చకపోతే ప్రమోషన్ లిస్ట్‌లో పేర్లు లేకుండా చేస్తానని బెదిరింపులుకు పాల్పడ్డాడు. అయితే ఈశ్వరరావు వ్యవహారం డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అయినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే ఈశ్వరరావు వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో మహిళా ఉద్యోగులు ఒక్కక్కొరిగా బయటకు వచ్చి అతడి బండరాన్ని బయటపెట్టారు. ఆ కీచకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.(విద్యార్థుల అభీష్టమే ఫైనల్) -
ఆత్మస్థైర్యంతో కరోనాను జయించాను..
టెక్కలి: ఆత్మస్థైర్యంతో కరోనాను జయించానని.. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ తాజాగా నిర్వహించిన నిర్థారణ పరీక్షల్లో గురువారం నెగిటివ్ రిపోర్టు రావడంతో స్థానిక విలేకరులతో మాట్లాడారు. తనకు పాజిటివ్ వచ్చినా ఎటువంటి ఆందోళనకు గురి కాలేదని, మనోధైర్యంతో పాటు ప్రభుత్వం అందజేస్తున్న వైద్య, ఆరోగ్య సలహాలను పాటిస్తూ కరోనాను జయించానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు కరోనా వస్తుంది.. పోతుందని దువ్వాడ అన్నారు. సరైన పోషకాహారం, మందులు, రోజూ యోగా, ధ్యానం చేస్తే సులువుగా బయటపడవచ్చన్నారు. తాను వినియోగించిన వస్తువులు ఇతరులు తాకకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లను ధరిస్తూ హోంఐసోలేషన్ పాటించడం వల్ల తనతో పాటు కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని శ్రీనివాస్ చెప్పారు. కోవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రేపు లింగాలవలసలో మంత్రి పర్యటన టెక్కలి మండలం లింగాలవలసలో ఆగస్టు 1న రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పర్యటిస్తున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పశు పోషణ అభివృద్ధిలో భాగంగా ‘జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భధారణ’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అధికారులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. -
మఠం భూములపై టీడీపీ కన్ను..
టెక్కలి: స్థానిక చిన్నబ్రాహ్మణవీధిలోని రాధామాధవస్వామి మఠం భూములపై అక్రమార్కుల కన్ను పడింది. మఠం నిర్వహణ కోసం టెక్కలి మండలం గూగెం, డమర సరిహద్దు ప్రాంతాలతోపాటు నందిగాం మండలం గురువూరు తదితర చోట్ల వందల ఎకరాల భూములను పూరీ జగన్నాథ సంస్థాన్ నుంచి అప్పగించారు. గతంలో టెక్కలిని పాలించిన పర్లాఖిమిడి గజపతి రాజుల నుంచి కేటాయించిన ఈ భూముల బాధ్యతను 1885లో గోవింద్ చరణ్‌దాస్ గోస్వామికి అప్పగించారు. డమర, గూగెం సరిహద్దు ప్రాంతాల్లో సర్వే నంబరు 261లో సుమారు 58 ఎకరాలు, సర్వే నంబరు 228, 229, 259 నంబర్లలో సుమారు 40 ఎకరాలతోపాటు నందిగాం మండలం గురువూరు ప్రాంతాల్లో వందల ఎకరాల భూముల నుంచి వచ్చే ఆదాయంతో స్వామికి నిత్య కైంకర్యాలు జరుగుతుండేవి. వీటితో పాటు పూర్వం పూరీ జగన్నాథస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అవసరమైన సదుపాయాలను ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంతో సమకూర్చేవారు. కాల క్రమేణా గోవింద్ చరణ్ దాస్ గోస్వామి పూరీ జగన్నాథస్వామి సంస్థాన్‌కు వెళ్లిపోవడంతో ఈ భూములపై పర్యవేక్షణ కొరవడింది. భక్తుల అవతారం ఎత్తిన టీడీపీ కార్యకర్తలు గత ప్రభుత్వ హయాంలో నరసింగపల్లి, కిట్టాలపాడు గ్రామానికి చెందిన కొంత మంది టీడీపీ కార్యకర్తలు ముందుగా భక్తుల అవతారం ఎత్తారు. ఆ తర్వాత మెల్లగా భూములపై కన్నేశారు. దీంతో కొంత మంది రెవెన్యూ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని వెబ్‌ల్యాండ్‌లో రికార్డులను తారుమారు చేసే పనిలో పడ్డారు. వీరి ప్రయత్నాలకు కొంత మంది రెవెన్యూ అధికారులు అండగా నిలవడంతో ఒక్కో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఒక్కో ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. ఈ విధంగా రూ.కోట్లు దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. వెబ్‌ల్యాండ్‌లో కొన్ని చోట్ల గోవింద్ చరణ్ దాస్ గోస్వామి పేరును చూపే విధంగా రికార్డులు తారుమారు చేసేశారు. సర్వే నంబర్లను సబ్ డివిజన్లుగా మార్చేసి కొనుగోలుదారుల పేర్లను వారసత్వంగా నమోదు చేసినట్లు భోగట్టా. ఈ విధంగా సుమారు 110 మందికి విక్రయించినట్లు తెలుస్తోంది. మఠం భూములను కొంత మంది టీడీపీ కార్యకర్తలు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారంటూ తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మఠానికి కేటాయించిన భూముల వివరాలు మొత్తం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాధామాధవ మఠం భూములు చేతులు మారడంలో మఠం నిర్వాహకుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మఠానికి చెందిన భూముల క్రయవిక్రయాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్ని వందల ఎకరాల అమ్మకాలు మఠం నిర్వాహకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. మఠం నిర్వాహకుల వివరణ కోసం ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు. గతంలో మా దృష్టికి వచ్చాయి.. టెక్కలిలో ఉన్న రాధామాధవ మఠానికి చెందిన భూములను విక్రయిస్తున్నట్లు గతంలో మా దృష్టికి వచ్చింది. అప్పట్లో మఠం నిర్వాహకుల వద్ద విషయం తెలుసుకున్నాం. ఎలాంటి విక్రయాలు జరగలేదని, మఠం భూముల పత్రాలు తమ వద్ద అందుబాటులో లేవంటూ దాట వేసే ప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులను సంప్రదించగా తమ వద్ద పూర్తి స్థాయిలో పత్రాలు లేవంటూ చెప్పారు. మఠం భూములను దేవదాయ శాఖ ఆదీనంలోకి తీసుకునేలా 43 రిజి్రస్టేషన్ ప్రక్రియ చేపడతాం. మఠం భూముల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. – జి.ప్రసాద్‌బాబు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్, సోంపేట -
బెజవాడకు అచ్చెన్నాయుడు తరలింపు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో రెండు గంటల్లో విజయవాడకు తీసుకురానున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఈఎస్ఐ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీ సెంట్రల్ ఆఫీసుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అక్కడ రికార్డు వర్క్ పూర్తైన తర్వాత ఇంకా సమయం మిగిలి ఉంటే ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుచనున్నారు. ఒకవేళ కోర్టు సమయం ముగిసినట్లయితే ఏసీబీ న్యాయమూర్తి ఇంటి వద్దకు తీసుకువెళ్లనున్నారు. ఇక అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ స్కాంలో పాత్రధారులుగా ఉన్న మరో ఐదుగురిని ఏసీబీ అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు ప్రదేశాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) ఇదిలా ఉండగా... అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ఏసీబీ ప్రకటన చేయడంతో పాటు మీడియా సమావేశం కూడా నిర్వహించినప్పటికీ.. ఆయనను కిడ్నాప్ చేశారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాకు తెర తీశారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటే.. అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. ఎక్కడకు తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో తెలియదంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఆయన ఈ విధంగా లేఖ విడుదల చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. -
టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్
-
ఈఎస్ఐ కుంభకోణం : 155 కోట్ల రూపాయల అవినీతి
సాక్షి, శ్రీకాకుళం : మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ఆయనతో పాటు కుటుంబ సభ్యులన్నీ కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ స్కాంలో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ హస్తం కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. టెండర్లు పిలవకుండా నామినేషన్ల పద్దతిలో అచ్చెన్నాయుడు చెప్పిన కంపెనీకు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇచ్చినట్లు నివేదికలో తేలింది. మొత్తం 155 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ తేల్చింది. ఏసీబీ తాజా దూకుడుతో స్కాములో పాలుపంచుకున్న వారి గుండెల్లో దడ మొదలైంది. (అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...) అసలు స్కాం.. టీడీపీ హయాంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హయాంలోనే కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి చొరవతోనే డైరెక్టర్లు రూ. 975 కోట్ల మందుల కొనుగోలు చేసి, అందులో 100 కోట్లకు పైగా నకిలీ బిల్లులను సృష్టించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 293 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే, 698 కోట్ల రూపాయలకు మందులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి చూపి ఖజానాకు 404 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు. అంతేకాకుండా ఈఎస్ఐ స్కాంకు పాల్పడిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, ఓమ్ని మెడీ, ఎన్వెంటర్ పర్ఫామెన్స్ సంస్థలకు సదరు డైరక్టర్లు లాబ్ కిట్ల కొనుగోలు పేరుతో 85 కోట్లు చెల్లించారు. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు) 2018-19 సంవత్సరానికి 18 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంటే , అందులో కేవలం రూ. 8 కోట్లు మాత్రమే వాస్తవ ధరగా ప్రకటించి మిగతా నిధులు స్వాహా చేశారు. అంతేగాక మందుల కొనుగోలు, ల్యాబ్ కిట్లు ,ఫర్నిచర్, ఈసీజీ సర్వీసులు బయోమెట్రిక్ యంత్రాల కొనుగోలు లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. వాస్తవానికి ఒక్కో బయోమెట్రిక్ మిషన్ ధర రూ.16,000 అయితే ఏకంగా రూ. 70 వేల చొప్పున నకిలీ ఇండెంట్లు సృషించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో తేలింది. దీనిపై ఏసీబీ లోతైన విచారణ జరుపుతోంది. -
అడ్డంగా దొరికిన టీడీపీ నాయకుడు
సాక్షి, టెక్కలి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్లో ఆ పార్టీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగింది.. అయితే అప్పట్లో వారు చేపట్టిన పనుల్లోని డొల్లతనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. టెక్కలి మండలం పాతనౌపడలో గత టీడీపీ హయాంలో గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పరపటి చిన్నయ్యరెడ్డి (టీడీపీ) కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ గ్రామంలోనే సుమారు రూ.15 లక్షల అంచనా మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా శివాలయం వీధి నుంచి దెప్పినౌపడలో ఎస్‌డబ్ల్యూపీసీ సెంటర్ వరకు రోడ్డు పనులు చేశారు. అప్పట్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఈ పనులు నిలిపివేశారు. అసంపూర్తిగా వదిలేసిన సుమారు 80 మీటర్ల రోడ్డుకు క్రషర్ వేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు తప్ప.. రోడ్డుపై క్రషర్ వేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఎటువంటి పనులు చేపట్టలేదు. రెండు రోజుల క్రితం ఇదే పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేపట్టగా అసలు విషయం బయటపడింది. క్రషర్ వేయకుండా రికార్డుల్లో ఎలా నమోదు చేశారంటూ అధికారులు నిలదీయడంతో సదరు టీడీపీ మాజీ ఎంపీటీసీ బిత్తరపోయారు. చదవండి: సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక! హడావుడిగా క్రషర్ వేయడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. గతంలో రికార్డుల్లో నమోదు చేసి క్రషర్ వేయకుండా.. ఇప్పుడు అధికారులు తనిఖీలు చేసిన తర్వాత క్రషర్ వేయడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో గ్రామస్తులు కొంత మంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆ పనులు నిలిపివేశారు. గత ప్రభుత్వ హాయాంలో పాతనౌపడలో జరిగిన అభివృద్ధి పనులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే మరిన్న అక్రమాలు వెలుగు చూస్తాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఊరు కాని ఊరిలో... దుర్మణం
టెక్కలి రూరల్: రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష... ఎందుకు మనస్తాపం చెందాడో... ఎందుకు చనిపోవాలనుకున్నాడో... ఊరు కాని ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేలినీలాపురం సమీపంలో శుక్రవారం 70 అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌పై ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించిన వ్యక్తిని ఒడిశావాసిగా గుర్తించారు. శుక్రవారం చీకటి పడటంతో మృతదేహాన్ని దించలేకపోయారు. శనివారంఉదయం టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ బి. గణేష్, విద్యుత్ శాఖ ఏఈ దయాళ్ నేతృత్వంలో 8మంది సభ్యులు టవర్‌పైకి ఎక్కి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుని జేబులో ఉన్న ఆధా ర్ కార్డు, ఇన్సూరెన్స్ కార్డు ఆధారంగా మృతుడి ది ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా బగడ మండ లం ఇచ్చాపూర్ గ్రామమని, అతని పేరు కళియమణి బెహర (40) అని గుర్తించారు. అయితే ఒడిశాకు చెందిన అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేమిటి? 70 అడుగుల ఎత్తులో ఉన్న టవర్ ఎక్కి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తదితర విషయాలు పోలీసులు దర్యాప్తు లో తేలాల్సివుంది. మృతుడి వద్ద బరంపురం నుంచి విజయనగరం వైపు ఈ నెల 14వ తేదీన తీసిన రైలు టిక్కెట్ ఉంది. అతని జేబులో దొరికిన వివరాలను బట్టి బంధువులకు ఫోన్ చేయగా మృతుడు కొద్ది రోజులుగా కేరళలో పనిచేస్తున్నాడని తెలిసింది. కేరళ నుంచి బరంపురం వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు రైల్వే టికెట్ తీసుకొని ఉంటాడని, మధ్యలో నౌపడ స్టేషన్లో దిగి తేలినీలాపురం సమీపంలో బలవన్మరణానికి పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. బరంపురం ఎందుకు వెళ్లాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. తెలియాలంటే అతని కుటుంబసభ్యులు రావాలని, అతని వద్ద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి మేనమామకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అఖండ సం‘దీపం’
ఆ గుండె పదిలం.. విధాత తలపునే మార్చిన మానవత్వం.. 15 నెలల పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని, అతడి వైద్యానికి దాతలు ఆదుకోవాలని ‘సాక్షి’ కథనం ప్రచురించిన మరుక్షణం పిల్లల నుంచి పెద్దల వరకు స్పందించారు.. అతి సామాన్యుల నుంచి మహేష్‌బాబు వంటి సూపర్స్టార్ల వరకు సాయమందించారు.. అందరి ఆశీస్సులతో ఆ బాలుడికి విజయవాడలో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. చంద్రబాబు హయాంలో తిరస్కరించినా ఆరోగ్యశ్రీ సైతం వర్తింపజేస్తామని అధికారులు తెలిపారు. టెక్కలి రూరల్: నెలల వయసున్న పసిబిడ్డ గుండెలో రంధ్రం ఏర్పడిందని తెలుకుని ఆందోళనకు గురైన ఆ తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఊరట లభించింది. దాతల సాయంతో శస్త్రచికిత్స జరగడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన లఖినాన త్రినాథరావు, సుజాత దంపతుల కుమారుడు సందీప్(15నెలలు)కు గుండెలో రంధ్రం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఆపరేషన్‌కు లక్షలు రూపాయలు ఖర్చవుతాయని తెలిసి, అంత డబ్బులు వెచ్చించే స్థోమత లేక కుమిలిపోయారు. ఈ విషయమై గత నెల 25న ‘సాక్షి’లో ‘ఆ గుండెను కాపాడండి’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై సినీ నటుడు మహేష్‌బాబు జిల్లా ఫ్యాన్స్, సేవాసమితి అధ్యక్షుడు వంకెల శ్రీనివాస్ స్పందించి మహేష్‌బాబు దృష్టికి విషయం తీసుకువెళ్లారు. అనంతరం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో బాలుడికి మంగళవారం శస్త్రచికిత్స చేయించారు. రెండు రోజుల పరిశీలన అనంతరం ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు గురువారం ప్రకటించారు. మహేష్‌బాబు సేవా సమితితో పాటు మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంఘాలు, ఉపాధ్యాయులు సైతం స్పందించి సందీప్‌కు చేయూతను అందించారు. ఎట్టకేలకు తమ కుమారుడికి సాంత్వన చేకూరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సైతం వర్తింపు.. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా సందీప్‌కు గుండె శస్త్రచికిత్స చేయాలని తల్లిదండ్రులు ప్రయత్నించగా, అప్పటి ప్రభుత్వ తీరు కారణంగా ఆమోదం రాలేదు. తాజాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో మరిన్ని వ్యాధులు చేర్చడం, సందీప్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించి తక్షణం ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. మహేష్‌బాబు సహకారంతో శస్త్రచికిత్స చేసినప్పటికీ.. ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరైతే ఆ మొత్తాన్ని చిన్నారి మందుల కోసం వెచ్చించే అవకాశముందని తల్లిదండ్రులు చెబుతున్నారు. -
పోలీస్‌స్టేషన్‌పై మహిళ దాడి
-
భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!
టెక్కలి : పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే కోపంతో ఓ వివాహిత వారికి చుక్కలు చూపెట్టింది. అరెస్టైన భర్తను బెయిల్‌పై విడుదల చేయడంతో వీరంగం సృష్టించింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేసింది. ఈ ఘటన టెక్కలి పోలిస్‌స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పాతపట్నానికి చెందిన వందనాదేవి, భవానీపురానికి నాగరాజు దంపతులు. వీరి మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ వివాదాల కేసు నడుస్తోంది. ఈకేసులో నాగరాజుకు అరెస్టు వారెంట్ జారీ చేసి టెక్కలి పోలిస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే, అరెస్టు చేసిన వెంటనే నాగరాజును విడిచిపెట్టారనే కోపంతో దేవి రెచ్చిపోయింది. పోలిస్‌స్టేషన్ అద్దాలు పగులగొట్టి రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది. -
జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనన్న వచ్చాడు.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉద్యోగాలు తెచ్చాడు.. అంటూ గ్రామ వలంటీర్లు, యువకులంతా చేసిన నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే దిశగా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయడంపై కృతజ్ఞతగా టెక్కలిలో ఆనందోత్సవ ర్యాలీ సోమవారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగాది హరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో వలంటీర్లు, యువకులు, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా స్థానిక వైఎస్సార్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ జంక్షన్ వరకు పాదయాత్ర నిర్వహించి, బాబాసాహెబ్ విగ్రాహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జగనన్న వచ్చాడు.. ఉద్యోగాలు తెచ్చాడు.. థ్యాంక్యూ జగనన్న.. అంటూ దారి పొడవునా నినాదాలతో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు టి.కిరణ్, మండల కన్వీనర్ బి.గౌరీపతి నాయకులు టి.జానకీరామయ్య, ఎస్.సత్యం, జి.గురునాథ్‌యాదవ్, కె.బాలకృష్ణ, నర్సింగ్ సాబతో, యూ.తమ్మయ్య, డి.కుశుడు, యూ.శంకర్, మదీన్, హెచ్.లక్ష్మణ్, ఎస్.మోహన్, యూ.విశ్వనాథం, జి.అప్పలరెడ్డి, ఎం.భాస్కర్, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. భర్తీతో చరిత్ర సృష్టించారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ఐదేళ్లపాటు లక్షలాది నిరుద్యోగులకు ఉసూరుమనిపించారని పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. పాదయాత్రలో నిరుద్యోగుల కష్టాలను తెలుసుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసి, చరిత్ర సృష్టించారని గుర్తుచేశారు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను రాజకీయం చేయాలని చూస్తున్నారని, ఇటువంటి కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రజ లంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. గతంలో మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పి స్తానంటూ వేల సంఖ్యలో దరఖాస్తులు తీసుకున్నారని, అయితే ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని ఎత్తిచూపారు. ప్రథి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంగా అమలుచేసిన గ్రామ వలంటీర్ వ్యవస్థపై ఈ రోజు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఈ విధానం వల్ల అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందితే టీడీపీని పూర్తిగా మరచిపోతారనే భయంతోనే చంద్రబాబు లేనిపోని కుట్రలు చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి టెక్కలి సమన్వయకర్త తిలక్ మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన అతి కొద్ది రోజుల్లోనే లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. అధికారుల పర్యవేక్షణలో ఎంతో పారదర్శకంగా చేపట్టిన ఉద్యోగాల భర్తీ వల్ల లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. అయితే దీనిని చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు ఒడి గట్టిందని దుయ్యబట్టారు. ఇటువంటి వాటిని తిప్పి కొట్టేందుకు యువత సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.. -
తాను కరిగి.. స్టీరింగ్‌పై ఒరిగి..
సమయం సోమవారం వేకువజాము 2.50 గంటలు.. టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీప ప్రాంతం.. ఒడిశా రాష్ట్రం డమన్‌జోడి నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్న కుదుపుతో ఆగింది.. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు.. బస్సు తుప్పల్లో ఎందుకు ఆగిందో తెలుసుకునేందుకు డ్రైవర్ వద్దకు వెళ్లిన వారు నిశ్చేష్టులయ్యారు. స్టీరింగ్‌పై తలపెట్టి డ్రైవర్ విగత జీవిగా ఉన్నాడు.. సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : కొవ్వొత్తి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది.. ఆ డ్రైవర్ గుండెపోటుతో ఒరిగిపోతున్నా 26మందిని రక్షించాడు.. నిత్యం విధి నిర్వహణలో భాగంగా బస్సును నడుపుతూ ఎంతోమందిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేవాడతను. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా బాధ్యతను మరచిపోలేదు... బస్సును సురక్షితంగా పక్కన నిలిపాడు. ఆపద్బాంధవుడిలా 25మంది ప్రయాణికులను, తోటి డ్రైవర్‌ను కాపాడాడు. ఉలిక్కిపడి లేచి ఈ విషయం తెలుసుకున్న పాసింజర్లు కన్నీటిపర్యంతమయ్యారు. డమన్జోడిలో బస్సు ఆది వారం రాత్రి 10 గంటలకు బయలు దేరింది. ఇద్దరు డ్రైవర్లు ఉన్న ఈ బస్సును ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా కుంపుపొడ గ్రామానికి చెందిన జోగేందర్ శెట్టి (52) అనే డ్రైవర్ నడుపుతున్నారు. రాత్రి 2.50 గంటల సమయంలో టెక్కలి సమీపంలో అక్కవరం గ్రామ సమీపంలో గుండెపోటు రావడంతో.. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగకూడదని భావించి బస్సును ఎంతో చాకచక్యంగా రోడ్డు పక్కనున్న తుప్పల్లో నిలిపివేశాడు. తుప్పల్లో హఠాత్తుగా బస్సు ఆగడంతో విషయం తెలియని పాసింజర్లు ఏం జరిగిందని అడిగేందుకు డ్రైవర్ వద్దకు వెళ్లగా.. స్టీరింగ్‌పై తలపెట్టి ప్రాణాలు కోల్పోయి ఉన్నా డు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడి తాను ప్రాణం విడిచాడని గుర్తించి హతాశులయ్యారు. జాతీయ రహదారి విభాగం హైవే పెట్రోలింగ్ అధికారులు టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.నిలయ్య, ఎస్ఐ బి.గణేష్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని గమనించి బస్సు యజమానికి సమాచారం చేరవేశారు. బస్సులో ప్రయాణం చేస్తున్న 25మంది ప్రయాణికులను అదే ట్రావెల్‌కు చెందిన మరో బస్సులో పంపించేశారు. డ్రైవర్ మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాణాలు పోతున్నా డ్రైవర్ చూపినచొరవ.. అతని అప్రమత్తత వల్ల తమం తా క్షేమంగా ఉండడం ప్రయాణికులను కదిలించింది. -
‘సచివాలయ’ నియామకాలపై విద్యార్థుల భారీ ర్యాలీ
సాక్షి, వైజాగ్ : సచివాలయ ఉద్యోగాల నియామకాలపై పలు ప్రాంతాలలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అధ్యక్షతన విశాఖలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ.. సచివాలయ నియామకాలను ఓర్వలేక టీడీపీ, ఏబీఏన్ రాధాకృష్ణ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లోనే సీఎం జగన్ నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని ప్రశంసించారు. గత ఐదేళ్లో టీడీపీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, వీఎమ్‌ఆర్‌డీ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి కాంతారావు, విద్యార్థి నాయకులు మోహన్, కళ్యాణ్, క్రాంతి కిరణ్, ఎస్సీ సెల్ నాయకులు రొయ్య వెంకట రమణ పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగాలతో ఉపాధి కల్పించింనందుకు హర్షం వ్యక్తం చేస్తూ టెక్కలిలో యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం పై హర్షం వ్యక్తం చేస్తూ..వైఎస్సార్ జిల్లాలోని కోటిరెడ్డి కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిర్ బెలూన్లను ఎగురవేసి జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిత్యానంద రెడ్డి, పులి సునీల్ కుమార్, పాకా సురేష్ ఇతర నేతలు పాల్గొన్నారు. -
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..
సాక్షి, టెక్కలి : విధుల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తనకు గుండెపోటు వచ్చినా ఎంతో చాకచక్యంగా బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపివేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెక్కలి దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి దింపి మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు స్పల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. -
నకిలీ పోలీసుల హల్చల్
సాక్షి, టెక్కలి రూరల్: నియోజకవర్గ కేంద్రం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధి కొడ్రవీధి జంక్షన్ వద్ద ఆదివారం పట్టపగలే నడిరోడ్డుపై వృద్ధురాలి వద్ద పోలీసుల పేరుతో(నకిలీ పోలీసులు) ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని తరస్కరించారు. సీనీ ఫక్కీలో జరిగిన ఈ చోరీపై వృద్ధురాలు దండా హేమలత తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత టెక్కలి మెయిన్ రోడ్డులో నివాసముంటుంది. బంధువుల ఇంటికి కొడ్రవీధి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముందు ఆగారు. తాము పోలీసులమంటూ వారి దగ్గరున్న డమ్మీ ఐడీ కార్డు చూపించారు. మెడలో అంత బంగారం వేసుకోని తిరగవద్దని, ఈ ప్రాంతంలో దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారమంతా తీసి ఆమెతో తెచ్చుకున్న బ్యాగ్‌లో పెట్టుకోమని చెప్పారు. ఆమె అనుమానంగా చూడటంతో వీధిలోంచి మరో వ్యక్తి వచ్చాడు. అతనికి కూడా అలాగే చెప్పారు. అతను తన చైన్, బంగార వస్తులు, డబ్బులు బ్యాగ్‌లో పెట్టుకోని వెళ్లిపోయాడు. అతనిని అనుసరిస్తూ ఆమె కూడా అదేవిధంగా తాళిబొట్టు, చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి బ్యాగ్‌లో పెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బంగారం అంతా భద్రంగా ఉందో, లేదో చూస్తానని బ్యాగ్ అడిగాడు. వస్తువులన్నీ సరిగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి ఆమెను పంపించేశారు. ఇంటికి వెళ్లి తాళి, గాజు లు వేసుకోడానికి బ్యాగ్ చూసేసరికి అందులో ఆ వస్తువులు కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై టెక్కలి సీఐ నీలయ్య బాధితురాలు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేతి గాజులు, తాళిబొట్టు కలిపి సుమారు 5 తులాలు ఉంటాయని బాధితురాలు రోదిస్తోంది. సీఐ నీలయ్య, ఎస్ఐ గణేష్‌లు ఘటన స్థలానికి చేరుకొని స్థానికుల వద్ద వివరాలు సేకరించారు. బాధితురాలు హేమలత, భర్త శ్రీరామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోచోట విఫలయత్నం.. పై ఘటన జరగక ముందు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు స్థానిక సంతోషిమాత గుడి సమీపంలో భవానీనగర్‌కు చెందిన విజయలక్ష్మి అనే మహిళను కూడా ఇలాగే నమ్మబలికారని పోలీసులు తెలిపారు. ఇక్కడ దొంగలు ఉన్నారని చెప్పారు. బంగారం తీసి దాచుకోవాలని సూచించడంతో ఆమె బంగారం అంతా తీసి తన చీరలో కట్టివేసింది. దీంతో చేసేది ఏమి లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొంత సమయానికే వృద్ధురాలి వద్ద బంగారం అపహరించారు. -
మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..
సాక్షి, టెక్కలి(శ్రీకాకుళం) : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న తమకు పెళ్లి చేయరని వేదనతో మిఠాయిల్లో క్రిమిసంహారక మందు కలుపుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను తండ్రి ప్రశ్నించడంతో చనిపోవడానికి వీరు సిద్ధపడ్డారు. ఈ ఘటన స్థానిక మేజర్ పంచాయతీ పరిధి జగతిమెట్ట కొండపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం... వజ్రపుకొత్తూరు మండలం అమలపాడు గ్రామానికి చెందిన పొట్నూరు షణ్ముఖరావు పలాసలోని మణప్పరం గోల్డ్‌లోన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈయన టెక్కలి ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో షణ్ముఖరావు ఆమె ఇంటికి వెళ్లి కొద్ది నెలల క్రితం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తర్వాత చెబుతానని ఆమె తండ్రి చెప్పి పంపించేశాడు. ఈ నేపథ్యంలో తక్కువ జీతం వచ్చే అబ్బాయితో ఏ విధంగా జీవిస్తావని తన కుమార్తెను ప్రశ్నించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన ప్రియుడితో చనిపోవడానికి సిద్ధపడింది. ఈ మేరకు ఇద్దరు కలసి స్వీట్స్ బాక్స్ పట్టుకుని స్థానిక జగతిమెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ పురుగుల మందు, చీమల మందు కలుపుకుని వాటిని తినగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. అయితే ప్రియుడు ఈ విషయమై తన చిన్నాన్న టంకాల శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. వెంటనే శ్రీను హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయగా, ఇరువురికి ప్రాణాపాయం తప్పినట్టు వైద్యురాలు జయలక్ష్మి తెలిపారు. ఈఘటనపై టెక్కలి ఎస్ఐ బీ గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న షణ్ముఖరావు -
ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం
సాక్షి, టెక్కలి: ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 70 ఏళ్ల చరిత్ర కలిగిన టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో మొదటిసారిగా ఏసీబీ దాడులు జరిగాయి. లంచం తీసుకుంటూ డీఐఎస్ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే) అధికారి నిమ్మక ఏకాశి ఏసీబీ అధికారులకు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో డివిజన్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భూమి సబ్ డివిజన్ విషయంలో టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్ ఏకాశి లంచం డిమాండ్ చేస్తున్నారంటూ నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ బీ.వీ.ఎస్.ఎస్ రమణమూర్తి నేతృత్వంలో సీఐలు భాస్కరరావు, హరితోపాటు ఇతర సిబ్బంది శనివారం కార్యాలయం వద్ద మాటు వేసి మధ్యాహ్నం సమయంలో డీఐఎస్ ఏకాశి బాధితుడు క్రాంతి కిరణ్ నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వివరాలు సేకరించి అనంతరం కేసు నమోదు చేసి డీఐఎస్‌ను అరెస్టు చేశారు. భూమి సబ్ డివిజన్‌కు లంచం డిమాండ్.. నందిగాం మండలం పోలవరం గ్రామానికి చెందిన దడ్ల క్రాంతి కిరణ్‌కు అదే మండలం పాలవలస సమీపంలో సర్వే నంబరు 244లోని 2ఏ, 3బీ, 4ఏ లో సుమారు 57 సెంట్లు, సర్వే నంబరు 246లోని 1బీ నంబరు 16 సెంట్లు భూమి ఉంది. ఎస్సీ కేటగిరిలో పెట్రోల్ బంక్ నిర్మాణం నిమిత్తం భూమిని సబ్ డివిజన్ చేసేందుకు జూలై 17న మీ–సేవలో దరఖాస్తు చేసుకున్నారు. సర్వే ఫైలు నందిగాం తహసీల్దారు కార్యాలయం నుంచి టెక్కలి ఆర్డీఓ కార్యాలయానికి ఫైలు చేరింది. పలుమార్లు డీఐఎస్ ఏకాశి వద్దకు కిరణ్ కాళ్లరిగేలా తిరిగాడు. చివరకు రూ.5 లక్షలను డిమాండ్ చేసినట్లు క్రాంతి కిరణ్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తన జేబులో ఉన్న తక్కువ మొత్తాన్ని సైతం లాగేసుకున్నారని బాధితుడు వాపోయాడు. విసిగిపోయిన బాధితుడు గత రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా చేయడమే ఏసీబీ లక్ష్యం. ఈ విషయంలో బాధితులు ఆశ్రయిస్తే ఎంత వారినైనా విడిచిపెట్టేది లేదు. ప్రజలకు సేవ చేయడమే అధికారుల పని. ఈ విషయంలో లంచాన్ని ప్రొత్సహించకుండా ప్రజలే ప్రశ్నించాలి. –బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి, ఏసీబీ డీఎస్పీ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.. నందిగాం మండలం పాలవలస సమీపంలో తనకు చెందిన మొత్తం 73 సెంట్లను సబ్ డివిజన్ చేయాలని టెక్కలి ఆర్డీఓ కార్యాలయం డీఐఎస్ ఏకాశిని ఆశ్రయించాను. మొదట లేనిపోని కొర్రీలు పెట్టారు. చివరకు ఖర్చు అవుతుందని చెప్పి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. పలుసార్లు చిన్న మొత్తాల్లో నగదును వసూలు చేశారు. విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. –దడ్ల క్రాంతి కిరణ్, బాధితుడు -
వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..
టెక్కలి: మండలంలో వీఆర్కే పురం గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ (మద్యం నిల్వ కేంద్రం) గొడౌన్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శనివారం రెవెన్యూ, వంశధార అధికారులు సంయుక్తంగా పరిశీలించి ఈ ఆక్రమణలను గుర్తించారు. ఇక్కడ కాలువలు నిర్మించకుండా గొడౌన్ ఏర్పాటుతో పొలాలకు ముంపు ప్రమాదం ఉందని, అలాగే వంశధార గట్టుపై అక్రమ తవ్వకాలు చేశారంటూ వీఆర్కే పురం, సీతాపురం గ్రామస్తులు ఇటీవల స్పందనలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్ఐ హరి, సర్వేయర్లు సుభాష్, రమణమూర్తి, వంశధార ఏఈ యామిని తదితరులు ఫిర్యాదుదారులు, గ్రామస్తుల సమక్షంలో బెవరేజ్‌కు ఆనుకున్న వంశధార స్థలంలో కొలతలు వేశారు. చివరగా వంశధార స్థలాన్ని ఆక్రమించి బెవరేజ్ నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
మా దారి.. రహదారి!
సాక్షి, టెక్కలి: ‘నా దారి.. రహదారి.. నా దారికి అడ్డు రాకండి.’ 1990 దశకంలో ఓ సూపర్ హిట్ సినిమాలోని ప్రాచుర్యం పొందిన డైలాగ్. ప్రస్తుతం ఇదే డైలాగ్ టెక్కలి పట్టణంలో హల్చల్ చేస్తుంది. కాకపోతే మనుషులు కాదు.. మూగజీవాల విషయంలో. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని పలువీధుల్లో పశువులు ఇష్టారాజ్యంగా సంచరిస్తుండటంతో వాహనదారులు తరచూ అనేక రకాల ప్రమాదాలకు గురవుతున్నారు. టెక్కలిలో ఆవుల యజమానులు రెండు పూటలా పాలు సేకరించి, రోడ్లపైనే వాటిని వదిలేస్తున్నారు. దీంతో పశువులు ఆహారం కోసం రోడ్లపై హల్చల్ చేస్తున్నాయి. రోడ్డుపై వ్యాపారం చేసుకోనే వారి దుకాణాల్లో ప్రవేశించి, అక్కడి పండ్లు, వితర పదార్థాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వ్యాపారులు తమకు నష్టం కలిగిస్తున్నాయని మూగ జీవాలను సైతం కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో రహదారులపై సంచరిస్తున్న ఆవులను బంధించి, వాటి యజమానులకు జరిమానాలు విధిస్తామని పలుమార్లు పంచాయతీ అధికారులు హెచ్చరించారు. అయితే అది పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాకపోవడంతో పశువుల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రహదారులపై అడ్డంగా నిద్రపోవడం, పరుగులు తీయడం వంటి వాటి వల్ల వాహనదారులు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణంలో అధికంగా ట్రాఫిక్ ఉండే వైఎస్సార్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్, పెట్రోల్ బంక్ ప్రాంతం, చిన్నబజార్ జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ఆవుల సంచారం అధికంగా ఉందని ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు. జీవాలన్నీ రహదారిపైనే ఇటీవల టెక్కలిలోని పలు వీధుల్లో శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీధుల్లో అధిక సంఖ్యలో తీరుగులు తీస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో తప్పించుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా అంబేడ్కర్ జంక్షన్ నుంచి ఇందిరాగాంధీ జంక్షన్ వరకు రాత్రి సమయంలో తిరిగాలంటేనే భయపడుతున్నారు. అదేవిధంగా గతంలో వీధులకు శివారు ప్రాంతాల్లో సంచరించే పందులు సైతం ప్రస్తుతం వీధి మధ్యలో తీరుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండే ప్రదేశంలో గుంపులుగా అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదుల పెంపంకందార్లు వాటిని గ్రామాలకు దూరంగా ఉంచేవారని, ఇటీవల ఆవులు, కుక్కల తరహాలో రోడ్లపైనే వదిలేస్తుండటంతో.. అవి పరుగులు పెడుతూ ప్రమాదాలకు హేతువులుగా మారుతున్నాయన్నారు. దీనిపై పంచాయతీ, పోలీసు అధికారులు సంయుక్తంగా దృష్టి సారించి, సంబంధిత యజమానులతో సమావేశం నిర్వహించడంతో పాటు పశువులు రహదారుల పైకి రాకుండా వారితో మాట్లాడి, చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు దీనిపై ఇది వరకే చర్యలు చేపట్టాం. చాలా వరకు రోడ్లపై తిరుగుతున్న జీవాలను పంచాయతీ కార్యాలయాలకు తరలించి, యజమానులకు అపరాధ రుసుం విధించాం. మళ్లీ ఇదే విధంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాం. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో మరోసారి సమస్యపై దృష్టి సారించాం. ఇప్పటికైనా జీవాల యజమానులు స్పందిస్తే మేలు. – శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి, టెక్కలి -
‘అచ్చెన్నాయుడి ఎన్నిక చెల్లదు’
సాక్షి, శ్రీకాకుళం: టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదని ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పెరాడ తిలక్ ఆరోపించారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి టీడీపీ అభ్యర్థిగా అచ్చెన్నాయుడు పోటీచేసిన గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్‌ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తిలక్ డిమాండ్ చేశారు. 2007 జూలై 21న మైనింగ్ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్ వారెంట్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఓబులాపురం మైనింగ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్ వారెంట్ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచినందుకు ఎన్నికల సంఘం ఆయనపై వెంటనే చర్యలు తీసుకుని.. ఎన్నికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్ తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అక్రమంగా ఎన్నికయ్యారంటూ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ రెండు స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలోనే తెలిపిన విషయం తెలిసిందే. -
టెక్కలిలో బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలోని సుదర్శన్ థియేటర్ సమీపంలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. పరస్పరం బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి చేసుకుని తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు..మరో నలుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. సుదర్శన్ థియేటర్ సమీపంలో ఉన్న రాజా వైన్స్‌లో కొందరు యువకులు గురువారం మధ్యాహ్న సమయంలో మద్యం సేవిస్తున్నారు. వారి పక్కనే స్థానికంగా నివాసముంటున్న మరికొంత మంది యువకులు మరో టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్నారు. ఒక టేబుల్ వద్ద మద్యం సేవిస్తున్న వారు సిగరెట్ తాగటం మరో టేబుల్ వద్ద కూర్చున్న యువకులకు నచ్చలేదు. వేరే దగ్గరికి వెళ్లి సిగరెట్ తాగండని చెప్పడంతో రెండు గ్రూపుల మధ్య వివాదం నెలకొంది. మాటలతో ప్రారంభమైన గొడవ బీరుబాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకునేదాకా వెళ్లింది. ఒకవర్గం యువకులు స్ధానికంగా నివాసముంటున్న వారు కాగా మరోవర్గం యువకులు పక్కనే ఉన్న ఖైజోల గ్రామానికి చెందినవారు. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖైజోల గ్రామానికి చెందిన యువకులను ఆసుపత్రికి తరలించారు. ఘర్షణలో పాల్గొన్న పలువురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
సై.. నువ్వా.. నేనా
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఉత్కంఠతకు నేటితో తెరపడనుంది. నేడు జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల బలా బలాలు నిరూపించుకోనున్నారు. టెక్కలి నియోజకవర్గంలో మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ తరఫున పేరాడ తిలక్(ఫ్యాన్), టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు(సైకిల్), కాంగ్రెస్ నుంచి చింతాడ దిలీప్(హస్తం), బీజేపీ తరఫున హనుమంతు ఉదయ్‌భాస్కర్(కమలం), జనసేన అభ్యర్థిగా కణితి కిరణ్‌కుమార్(గాజు గ్లాసు), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి చంద్రశేఖర్పట్నాయక్(సింహం), స్వతంత్ర అభ్యర్థులుగా గూట్ల కాంచన (వజ్రం), గెడ్డవలస రాము(హెలికాప్టర్) తదితర అభ్యర్థులు ఎన్నికల పోరుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రధానంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు మధ్య పోటీ నెలకొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీకి అనుకూలత ఉండడంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు ఓటమి ఖాయం అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ఆయా అభ్యర్థుల్లో ఉత్కంఠత మరింత పెరుగుతోంది. మొత్తం ఓట్లు... టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో మొత్తం 316 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,22,222 మంది ఓటర్లు ఉన్నారు. 157 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 2349 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 346 మంది పోలీసులు బందోబస్తు చేపట్టారు. నియోజకవర్గంలో మండలాల వారీగా ఓటర్లు మండలం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు టెక్కలి 58,762 29,165 29,592 05 నందిగాం 47,790 24,391 23,390 09 సంతబొమ్మాళి 56,337 28,533 27,802 02 కోటబొమ్మాళి 59,333 30,004 29,326 03 -
టెక్కలి బహిరంగ సభలో వైఎస్ జగన్
-
హామీలు నెరవేర్చాకే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్ జగన్
-
అప్పుడే మళ్లీ ఓటు అడుగుతా: వైఎస్ జగన్
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం) : మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని, వాటిని అమలు చేసిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో ఓటు అడగుతామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు 50 పేజీల మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారని, ప్రతి కులానికి ఓ పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు 34 పేజీలతో మరోసారి మోసం చేయడానికి సిద్దమయ్యారని, ప్రజలు ఆలోచించాలని కోరారు. తాము నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ఒకే పేజని..రెండు వైపులు మాత్రమే ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు.. నవరత్నాల్లో చెప్పిన మాటలు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు మేనిఫెస్టోలో పెట్టామని స్పష్టం చేశారు. ఈ మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి రోజు చూపిస్తామని, ఎవరూ మర్చిపోకుండా చేస్తామన్నారు. ప్రతి రోజు ఇది చెప్పాం.. ఇది చేశామని అందరికి చూపిస్తామని తెలిపారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వస్తామని, ఇందులో చెప్పిన ప్రతి మాటను చేశామని. మళ్లీ మమ్మల్ని గెలిపించండని అడుగుతామన్నారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని , ప్రతి రాజకీయ నాయకుడు తాను చెప్పిన పనిని చేయకపోతే.. రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని అన్నారు. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తోందని తెలిపారు. ఇది తన ఒక్కడి వల్ల కాదని, ప్రజల సాకారం కావాలని కోరారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ , శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. మాటిచ్చాను.. అండగా ఉంటాను.. ‘టెక్కలి నియోజకవర్గంలో కూడా నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి మాట, ఆవేదన, బాధలు, కష్టాలు నాకు ఇంకా గుర్తుకున్నాయి. ఈ రోజు మీ అందరికి నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నాను. మహేంద్ర తనయ ప్రాజెక్ట్‌కు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టి.. రూ.62 కోట్లు కూడా ఖర్చు చేసి 40 శాతం పనులు పూర్తి చేశారు. ఆయన మరణాంతరం ఆ ప్రాజెక్ట్‌ను ఎవరు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్ట్ అంచనాలు పెంచి దోచుకున్నారు. భూనిర్వాసితులను పట్టించుకోలేదు. పవర్‌ప్లాంట్‌ను 51 గ్రామాలు వ్యతిరేకిస్తున్నప్పుడు అధికారంలో రాగానే రద్దు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అనుమతులిస్తూ జీవోలు జారీ చేశారు. ఆ 51 గ్రామాల ప్రజలకు చెబుతున్నా.. పాదయాత్రలో మీ అందరికి మాటిచ్చాను.. మీకు తోడుగా ఉంటానని మళ్లీ పునరుద్ఘాటిస్తున్నాను. తీరప్రాంత గ్రామాల్లో మత్స్య కార్మికులకు.. కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మరిచారు. ఆ ప్రతి మత్స్యకారుడికి చెబుతున్నా.. నేను అండగా ఉంటాను. తిత్లీ తుఫానుతో ఇచ్చాపురం, పలాస, టెక్కలి ప్రాంతాలన్నీ అంతా అతలా కుతలం కావడం చూశాం. రూ. 3,648 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కానీ ఆ తరువాత ఆయన మాత్రం రూ.510 కోట్లు ఇచ్చారు. జరిగిన నష్టంలో 15 శాతం కూడా ఇవ్వలేదు. ఆ బాధితులందికి ఇప్పటికే చెప్పాను. మళ్లీ చెబుతున్నా.. మనం అధికారంలోకి రాగానే కొబ్బరి చెట్టుకు రూ. 3000 ఇస్తాను. జీడీకి హెక్టార్‌కు రూ.50వేలు ఇస్తాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిందేమిటో ఇక్కడి ప్రజలు నాతో చెప్పారు. శ్రీకాకుళంలో జరిగే ఇసుక దందాకు ఇక్కడి మంత్రి అచ్చెన్నాయుడు రింగ్ మాస్టర్. ప్రజలకు చేసిందేం లేదు. కానీ స్కెచ్‌లు వేసి అధికార దర్వినియోగం చేశారు. రూ.5 కోట్ల విలువ చేసే ఏపీఎస్ఆర్టీసీ స్థలాన్ని రూ.3 లక్షలకు కాజేసీ ప్రయత్నం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు రింగ్ మాస్టర్ అయితే గ్రామాల్లోని జన్మభూమి కమిటీలు మాఫియాలా దోచేస్తున్నాయి. చంద్రబాబు హామీలు నెరవేర్చాడా? చంద్రబాబు మోసపూరిత పాలనపై ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. 2014 ఎన్నికలప్పుడు టీవీ యాడ్స్‌తో ఊదరగొట్టారు. జాబు రావాలంటే.. బాబు రావాలని, జాబు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతని చెప్పారు. ప్రతి ఇంటికి రూ.లక్ష 50వేలు బాకీ పడ్డారు. డ్వాక్రా మహిళలు, రైతులను దారుణంగా మోసం చేశాడు. మళ్లీ ఈ రోజు మోసం చేసేందుకు అవే టీవీల్లో మళ్లీ అదే మేనిఫెస్టోతో ఊదరగొడుతున్నారు. 2014లో చంద్రబాబు చెప్పిన మేనిఫోస్టో అంశాలు.. వ్యవసాయ రుణాలు మాఫీ.. అయ్యాయా? రూ.5వేల కోట్లతో ధరల స్థీరికరణ.. పెట్టారా? బెల్ట్ షాపుల రద్దు.. అయ్యిందా? ప్రత్యేక పోలీసు వ్యవస్థ ఉందా? యువతకు ఉద్యోగం, ఉపాధి, ఇంటి ఇంటికి ఉద్యోగం.. వచ్చిందా? పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ విద్య. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద ఇంటింటికి రూ.20 లీట్లర మంచినీటి వాటర్ క్యాన్.. వచ్చిందా? యాబై పేజీలు.. 650 హామీలు ఇచ్చారు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి దారుణంగా మోసం చేశారు. ఈ మేనిఫెస్టో కూడా కనిపించకుండా మాయం చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే డ్రామా. 2014 హామీలను 100 శాతం చేశానని సిగ్గులేకుండా చెబుతున్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరగకూడదని, ఆయన పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు రావని, ఆయన పచ్చమీడియాతో రోజుకో పుకారు పుట్టిస్తుంది. ఎన్నికలు వచ్చే సరికి ఈ కుట్రలు మరింత పెరుగుతాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరిని కలిసి నవరత్నాల గురించి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే జగనన్న ప్రభుత్వం వస్తుందని చెప్పండి. జగనన్న వచ్చిన తర్వాత జరిగే సంక్షేమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. -
కలగా.. కల్పనగా..!
సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): మండలంలోని పిఠాపురం, నంబాళపేట గ్రామాలకు వెళ్లే మార్గం మధ్యలో పూర్తిగా శిథిలమైన వంతెన నిర్మాణం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వంతెన నిర్మాణం చేస్తానంటూ ప్రస్తుత రాష్ట్రం మంత్రి అచ్చెన్నాయుడు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే మళ్లీ ఎన్నికలు సమీపించిన తరుణంలో హుటాహుటిన పిఠాపురం–నంబాళపేట రహదారి పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేశారు. వంతెన నిర్మాణం మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో మంత్రి ఇచ్చిన హామీ సైతం కలగా మిగిలిపోయింది. ఎన్నికల ముందు ఒకమాట, గెలిచిన తరువాత మరోమాట అచ్చెన్నకే చెల్లిందంటూ స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రమాదకరంగా మారింది మా గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థలోనే ఉంది. ఇటీవల వంతెన నిర్మాణం చేస్తామని చెప్పారు. అయితే పనులు మాత్రం ప్రారంభం కాలేదు. గెలిచిన తరువాత ప్రజా ప్రతినిధులు మాట మార్చడం సరికాదు. –ఎ.వెంకట్రావు, నంబాళపేట, టెక్కలి మండలం హామీ నెరవేర్చ లేకపోయారు పిఠాపురం–నంబాళపేట గ్రామాల మధ్య శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్న వంతెన నిర్మాణం చేస్తామని గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి తప్ప, నిర్మాణం పూర్త కాలేదు. ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – ఎన్.పుష్పలత, ఎంపీటీసీ సభ్యురాలు, బన్నువాడ, టెక్కలి మండలం -
జనసేన పార్టీకి మరో షాక్
సాక్షి, టెక్కలి: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. టెక్కలి నియోజకవర్గ నేత పైలా రమేష్ సోమవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. తనతో పాటు 20 వేల మంది కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు టిక్కెట్ ఇస్తానని మొండిచేయి చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేయడానికి వారం ముందు పోటీకి సిద్ధంగా ఉండాలని, ఏర్పాట్లు చేసుకోవాలని చేప్పిన అధిష్టానం రాత్రికి రాత్రే వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చిందని వెల్లడించారు. అధిష్టానానికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని వాపోయారు. మనస్తాపం చెంది జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పైలా రమేష్ తెలిపారు. త్వరలోనే కార్యకర్తలతో సమావేశమై, ఏ పార్టీలో చేరేది నిర్ణయిస్తానని చెప్పారు. కాగా, టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా కణితి కిరణ్‌కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: అరె సాంబా... రాసుకో...) పిఠాపురంలోనూ... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జనసేన పార్టీ నాయకుడు అనిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో 150 మంది కార్యకర్తలు సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెండెం దొరబాబు సాదర స్వాగతం పలికారు. -
చిట్‌ఫండ్ మోసగాళ్లకు భరోసా..
చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఆయన అండగా నిలుస్తాడు. చిట్‌ఫండ్ మోసాల్లో నష్టపోయిన బాధితులంతా కాళ్ల బేరానికి వచ్చే విధంగా మంత్రి పేరు చెప్పి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తాడు. రూ.లక్షల నుంచి మొదలుకుని రూ.కోట్ల వరకు పేద, సామాన్య వర్గాలను మోసం చేసిన చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ సింగిల్సెటిల్మెంట్ వ్యవహారాలతో ఒక్కో సెటిల్మెంట్లో లక్షల నుంచి కోట్ల రూపాయలు ఆర్జిస్తుంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే మంత్రి అండతో తనకు అనుకూలమైన దారుల్లో బెదిరిస్తుంటాడు. ఇవే కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అమాయకులైన యువకుల్ని పేకాట ఉచ్చులోకి దింపుతూ వారిని అప్పులపాలు చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో లక్షల రూపాయలు ఆర్జిస్తుంటాడు. సాక్షి, టెక్కలి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు సర్వ సాధారణంగా ఉన్న ఆ వ్యక్తి 2014 తరువాత టీడీపీ అధికారంలోకి రావడం. టెక్కలి నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి హోదా సాధించడంతో మంత్రి పేరు చెప్పుకుని దందాలు కొనసాగిస్తూ ‘షాడో మంత్రి’గా అవతారం ఎత్తాడు. సెటిల్మెంట్ వ్యవహారాలు, అవినీతి పరులు, మోసగాళ్లకు అండగా నిలుస్తూ తన సామ్రాజ్యాన్ని పదిల పరుచుకుంటున్న ఓ సాధారణ వ్యక్తి నేడు జిల్లా ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాడు. ‘భూం’ఫట్ స్వాహా..! ప్రభుత్వ స్థలాలకు చెందిన సర్వే నంబర్లు మార్చుకుని తనకు అనుకూలంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఆయన స్పెషల్. ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరూ నిలదీసే సాహసం చేయలేక భయపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే సదరు మంత్రికి ఆ వ్యక్తి బినామీగా వ్యవహరించడమే కాకుండా మంత్రి చేసే ప్రతి కార్యక్రమానికి పెత్తందారీ వ్యవహారం చేయడంతో, మంత్రికి ఆ వ్యక్తికి ఉన్న సత్సంబంధాలతో ‘షాడో మంత్రిగా’ చెలామణి అవుతున్నాడు. దీంతో సామాన్య ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఇదే వ్యవహారంతో కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు అదే వ్యక్తి మరో అడుగు ముందుకు వేసి రాజకీయ దళారీగా అవతారమెత్తుతున్నాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన చిన్న పాటి కార్యకర్తలను బెదిరించడమే కాకుండా వారిపై దాడి చేసి మరీ టీడీపీలోకి బలవంతంగా లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో? అయితే తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంత్రికి తెర వెనుక ప్రధాన అనుచరుడిగా ఉండడంతో, తమకు మేలు చేస్తాడనే విశ్వాసం పెంచుకున్న వారి నమ్మకానికి అడుగడుగునా తూట్లు పొడుస్తూ మోసాలకు పాల్పడుతుండడంతో వారంతా విస్తుపోతున్నారు. టెక్కలి నియోజకవర్గం మొదలుకుని జిల్లా వ్యాప్తంగా పలు రకాల దందాలకు పాల్పడుతూ మంత్రికి వాటాలు అందిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్న ఆ వ్యక్తి ఎటువంటి ఆగడాలు చేసినా గత నాలుగున్నరేళ్లుగా ఏమీ చేయలేక బాధితులు కుమిలిపోతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి మరోసారి అవకాశం ఇస్తే ‘షాడో మంత్రిగా’ వ్యహరిస్తున్న ఆ వ్యక్తి వల్ల ఇంకెన్ని అనర్థాలు జరుతుతాయోనని కొంతమంది చర్చించుకుంటున్నారు. -
అచ్చెన్నకు ముచ్చెమటలు
సాక్షి, టెక్కలి: రాజకీయాలకు కేంద్ర బిందువైన టెక్కలి నియోజకవర్గంలో ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోరు ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు గెలుస్తారనేదానిపై వాడీవేడిగా చర్చ సాగుతోంది. 1952లో 61,196 మంది ఓటర్లతో ప్రారంభమైన నియోజకవర్గం ప్రస్థానం నేడు 2,22,222 మంది ఓటర్లకు చేరుకుంది. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలతో ఉన్న టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. టీడీపీ తరఫున మంత్రి హోదా అనుభవించిన కింజరాపు అచ్చెన్నాయుడు.. సామాన్య స్థాయి నుంచి ప్రజా పోరాటాలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు మధ్య ప్రధాన పోరు కొనసాగనుంది. కొండలాంటి అచ్చెన్నాయుడిని ఢీకొట్టడమే కాకుండా వైఎస్సార్ సీపీ విజయాన్ని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామంటూ ఎమ్మెల్యే అభ్యర్థి తిలక్‌తో పాటు నాలుగు మండలాల నాయకులు అహర్నిశలు శ్రమిస్తూ అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే తమకు విజయాన్ని అందజేస్తుందనే ధీమాతో అచ్చెన్నాయుడు తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మార్పు తప్పదా..! టెక్కలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా, మంత్రి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు అండతో గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలతో ప్రజలు విస్తుపోయారు. రేషన్ కార్డులు, పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలు ఒకటేమిటి ప్రతి పథకంలో వివక్ష చూపడంతో, అర్హులకు పథకాలు అందని ద్రాక్షగా మారాయి. రేషన్ డీలర్లపై, చిన్న స్థాయి ఉద్యోగులపై వేధింపులు, బెదిరింపులతో అంతా విస్తుపోయారు. ఏదైనా పని కోసం మంత్రి వద్దకు వెళితే ఆయన అనుసరించిన వైఖరిపై నియోజకవర్గ ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్న కొంత మంది కేడర్‌లో సైతం వ్యతిరేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుతున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీకు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లో సీనియర్ నాయకులు సైతం వైఎస్సార్ సీపీలోకి చేరుతున్నారు. నియోజకవర్గంలో అభ్యర్థుల విజయాన్ని తేల్చి చెప్పే ప్రధానమైన నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లో ఇప్పటికే టీడీపీకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అన్నదాతలకు వరం ఆఫ్‌షోర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2008లో నందిగాం మండలంలో ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పటి టెక్కలి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర కృషి ఫలితంగా నిర్మాణం తలపెట్టిన ఆఫ్‌షోర్‌కు సుమారు రూ.127 కోట్లు కేటాయించారు. నందిగాం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి తదితర మండలాల్లో సుమారు 24,600 ఎకరాలకు సాగునీటిని అందజేయడంతో పాటు పలాస మండలంలో 6 పంచాయతీల పరిధిలో 24 గ్రామాలకు తాగునీటిని అందజేయడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రాజెక్టు మంజూరులో భాగంగా 2008 ఏప్రిల్‌లో డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా పలాస మండలం రేగులపాడు వద్ద భారీ స్థాయిలో శంకుస్థాపన చేశారు. పనులు ఊపందుకున్న సమయంలో వైఎస్సార్ మరణంతో ఆఫ్‌షోర్ నిర్మాణం నిలిచిపోయింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు పలుమార్లు ఆఫ్‌షోర్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి వైఫల్యం చెందారు. ప్రజా పోరాటాలతో సానుకూలత టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ కార్యకర్తలు చేసిన ఆగడాలకు ఎదురొడ్డి ప్రజా పోరాటాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్‌కు ఈసారి అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీని పటిష్టం చేయడమే కాకుండా దిగువ స్థాయి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్న తిలక్ అందరి మన్నలను పొందారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రతో అన్ని వర్గాల ప్రజలు అభిమానులుగా మారారు. దీంతో ఈసారి టెక్కలి నియోజకవర్గంలో తిలక్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అనుచిత వైఖరిపై విమర్శలు జన్మభూమి కమిటీల ఆగడాలు, టీడీపీ కార్యకర్తల అక్రమాలతో పాటు ఏరా...పోరా అనే మాటలతో అచ్చెన్నాయుడు వైఖరిపై ప్రజలు విస్తుపోయారు. ఈసారి మంత్రికి ఓటమి తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. గ్రామ స్థాయిలో కక్ష పూరితమైన చర్యలపై టీడీపీ కార్యకర్తలు చెప్పిందే తడవుగా ఎటువంటి ఆలోచన చేయకుండా అచ్చెన్న చేసిన దుందుడుకు చర్యలు విజయానికి అడ్డంకులుగా మారనున్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి. ఆఫ్‌షోర్‌ను పూర్తి చేయకపోవడం, టెక్కలిలో హుదూద్ ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా వదిలేయడం, నందిగాంలో భవనాలు లేకుండా జూనియర్ కళాశాల మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చూపారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గం చరిత్ర... టెక్కలి నియోజకవర్గం 1952లో 61వేల196 మంది ఓటర్లతో ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం 2,22,222 మందికి చేరుకుంది. కళింగ, వెలమ, యాదవ, కాపు, రెడ్డి, వైశ్య, ఎస్సీ, ఎస్టీలతో పాటు మిగిలిన చేతివృత్తులకు చెందిన సామాజిక వర్గాలు ప్రధాన ఓటర్లగా ఉన్న ఈ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు లాంటి వ్యక్తులకు సైతం పట్టం కట్టారు. 1952లో బ్రాహ్మణతర్లా నియోజకవర్గం పేరుతో ఆరంభమై 1972 వరకు కొనసాగింది. అనంతరం టెక్కలి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. మొట్టమొదటిగా టెక్కలి, నందిగాం, పలాసలో సగభాగం, వజ్రపుకొత్తూరులో సగభాగం, సంతబొమ్మాళి మండలంలో 7 పంచాయతీలతో 2008 సంవత్సరం వరకు టెక్కలి నియోజకవర్గంగా కొనసాగింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలంతో పాటు అదే మండలంలో ప్రత్యేకంగా ఉన్న హరిశ్చంద్రాపురాన్ని ఈ నియోజకవర్గంలో విలీనం చేశారు. 2009 సంవత్సరం నుంచి నాలుగు మండలాలతో టెక్కలి నియోజకవర్గంగా కొనసాగుతూ వస్తోంది. గెలుపొందిన అభ్యర్థులు వీరే.. సంవత్సరం విజేత పార్టీ 1952 రొక్కం లక్ష్మీ నరసింహదొర ఇండిపెండెంట్ 1955 ఆర్ఎల్ఎమ్ దొర కాంగ్రెస్ 1962 రోణంకి సత్యనారాయణ ఇండిపెండెంట్ 1967 నెచ్చెర్ల రాములు ఇండిపెండెంట్ 1972 సత్తారు లోకనాథంనాయుడు కాంగ్రెస్ 1978 బమ్మిడి నారాయణస్వామి జనతాపార్టీ 1983 అట్డాడ జనార్దనరావు టీడీపీ 1985 వరదా సరోజా టీడీపీ 1989 దువ్వాడ నాగావళి టీడీపీ 1994 ఎన్.టి.రామారావు టీడీపీ 1995 హనుమంతు అప్పయ్యదొర టీడీపీ 1999 కొర్ల రేవతీపతి టీడీపీ 2004 హనుమంతు అప్పయ్యదొర కాంగ్రెస్ 2009 కొర్ల రేవతీపతి కాంగ్రెస్ 2009 కొర్ల భారతి కాంగ్రెస్ 2014 కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ మొత్తం ఓటర్లు: 2,22,222 పురుషులు: 1,12,093 స్తీలు: 1,10,110 ఇతరులు: 19 మండలాలు: 4(టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, నందిగాం) పంచాయతీలు: 136 పోలింగ్ కేంద్రాలు: 316 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు: 157 -
భార్య కళ్లెదుటే భర్త అనంత లోకాలకు..
సాక్షి, టెక్కలి రూరల్: జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కళ్ల ఎదుటే మృతి చెందటంతో భార్య ఆవేదన వర్ణనాతీతం. భర్తతో కలిసి తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో ఆనందంగా గడిపారు. తిరిగి అత్తవారింటికి వెళ్తుండగా మృత్యువు ట్రైన్ రూపంలో భర్తను తీసుకుపోయింది. పెళ్లై మూడు నెలలు గడవక ముందే ఇంతటి కష్టం రావడంతో ఆమె గుండెలు అవిసేలా రోధించింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..టెక్కలిలోని పాలకేంద్రం వెనుక నివాసం ఉంటున్న లావణ్యకు మూడు నెలలు క్రితం చిత్తూరుకు చెందిన కావడి భరత్‌తో(29) వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత లావణ్య కన్నవారి ఇంటికి భర్తతో కలిసి 5 రోజులు క్రితం వచ్చారు. అనంతరం తిరిగి మంగళవారం తన అత్తవారి ఊరు అయిన చిత్తూరు వెళ్లేందుకు పయానమయ్యారు. నౌపడ ఆర్ఎస్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు సికింద్రాబాద్ వరకు టిక్కెట్ తీశారు. లావణ్య ట్రైన్ ఎక్కిన తర్వాత భరత్ ట్రైన్ ఎక్కే సమయంలో ట్రైన్ ముందుకు కదిలింది. భార్య కళ్లెదుటే భర్త ట్రైన్ కిందకు వెళ్లిపోవడంతో రెండు కాళ్ల పైనుంచి ట్రైన్ వెళ్లింది. తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓట్ల చీలికే టార్గెట్!
సాక్షి, శ్రీకాకుళం: తమ అభ్యర్థుల గెలుపుపై ఆశలు చాలించుకున్న జనసేన పార్టీ వైఎస్సార్సీపీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడ వేస్తోంది. జిల్లాలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చడం ద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా మేలు చేకూర్చే కుటిల యత్నానికి పాల్పడుతోంది. ఇప్పటికే జనసేన, టీడీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్న ప్రచారానికి జిల్లాలో జనసేన సీట్ల కేటాయించిన తీరు బలం చేకూరుస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏ సామాజికవర్గం వారైతే జనసేన నుంచి కూడా ఆ సామాజికవర్గం వారికే సీట్లు కేటాయించింది. ఇక శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కూడా అదే వ్యూహాన్ని అమలు చేసింది. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్‌కు అండగా ఉంటూ, పార్టీ కార్యకలాపాలను నెత్తినేసుకుని మోసిన వారిని కాదని ముక్కు, ముఖం తెలియని వారికి సీట్లు కేటాయించడం చూస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఓట్లను సాధ్యమైనంత వరకు దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. అయితే టీడీపీ అభ్యర్థుల విషయంలో మాత్రం జనసేన ఈ వ్యూహాన్ని అమలు చేయకపోవడం ఇందుకు దర్పణం పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు జనసేన కేటా యించిన అభ్యర్థుల పేర్లను చూసి ఆయా నియోజకవర్గాల ప్రజలే విస్తుపోతున్నారు. అదెలా అంటే..? టెక్కలి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాళింగ సామాజికవర్గానికి చెందిన పేరాడ తిలక్ కాగా జనసేన అదే సామాజికవర్గీయుడైన కణితి కిరణ్‌కుమార్‌కు టికెట్టిచ్చింది. ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ టికెట్టు తమ్మినేని సీతారామ్ (కాళింగ)కు ఇవ్వగా ఆ నియోజకవర్గంతో సంబంధం లేని కొత్తూరు మండలానికి చెందిన కాళింగ సామాజికవర్గానికి చెందిన పేడాడ రామ్మోహనరావుకు జనసేన టికెట్టిచ్చారు. అలాగే పాతపట్నంలో తూర్పు కాపు కులానికి చెందిన రెడ్డి శాంతి వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలవగా జనసేన గేదెల చైతన్య (తూర్పు కాపు)కు కేటాయించింది. రాజాం నియోజకవర్గంలో ఎస్సీ (మాల) కులస్తుడైన కంబాల జోగులు వైఎస్సార్సీపీ అభ్యర్థి కాగా అదే సామాజిక వర్గీయుడైన ముచ్చా శ్రీనివాసరావుకు జనసేన సీటు ఖరారు చేశారు. పాలకొండలో ఎస్టీలో జాతాపు ఉపకులానికి చెందిన విశ్వాసరాయి కళావతికి వైఎస్సార్సీపీ టికెట్టివ్వగా అక్కడ పొత్తులో భాగంగా సీపీఐకి చెందిన (అదే సామాజికవర్గం) డీవీజీ శంకర్రావుకు కేటాయించారు. అలాగే శ్రీకాకుళం లోక్‌సభ స్థానం విషయంలోనూ ఆదే తీరును కనబర్చింది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కాళింగ కులానికి చెందిన దువ్వాడ శ్రీనుకు టికెట్టు ఇవ్వగా జనసేన కూడా అదే సామాజిక వర్గీయుడైన మెట్టా రామారావుకు ఏరికోరి కేటాయించింది. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్నాయుడు (వెలమ) పోటీ చేస్తుండగా ఆ సామాజికవర్గం వారిని జనసేన బరిలోకి దింపకపోవడం కుట్ర కోణం చెప్పకనే చెబుతోంది. పార్టీకి కష్టపడ్డ వారిని కాదని.. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కేవలం వైఎస్సార్సీపీ ఓట్ల చీలికే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను కేటాయించిన వైనం ఆయా నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టెక్కలిలో చాన్నాళ్లుగా ఎస్సీ సామాజిక వర్గీయుడైన కె.యాదవ్ జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతా ఆయనకే టికెట్టు ఖాయమని అనుకుంటుండగా ఆయనను కాదని ఆకస్మికంగా కాళింగ కులస్తుడైన కిరణ్‌కుమార్‌కు టికెట్టు ఇచ్చారు. రాజాంలో జనసేనలో చాన్నాళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, ప్రజలకు అంతగా పరిచయం లేని, ఇటీవలే పార్టీలో చేరిన ఎం.శ్రీనివాసరావుకు టికెట్టు కేటాయించారు. నరసన్నపేటలో ఇన్నాళ్లూ జనసేన కోసం చేతిచమురు వదల్చుకున్న లుకలాపు రంజిత్‌ను కాదని అసలు సీన్లోనే లేని మెట్టా వైకుంఠానికి అకస్మాత్తుగా టికెట్టు ఖాయం చేశారు. -
నేనున్నానని భరోసానిచ్చిన జగన్..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నెలన్నర రోజుల పాటు ప్రజాసంకల్పయాత్రలో మీ కష్టాలు కళ్లారా చూశాను. మీరు చెప్పుకున్న బాధలు విన్నాను. కిడ్నీ బాధితులు వేల సంఖ్యలో ఉంటే కేవలం 370 మందికే పెన్షన్లు ఇస్తున్నారని.. ముష్టి వేసినట్టు రూ.2,500లే చెల్లిస్తున్నారని.. 1400 మందికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారని, తామెలా బతకాలన్న ఆవేదన విన్నాను. అన్నా.. రాష్ట్రంలోనూ, దేశంలోనూ జీఎస్టీ ఉంటుందని విన్నాం.. పలాసలో జీడిపప్పు ప్యాకెట్టుపై టీఎస్టీ (తెలుగుదేశం సర్వీస్ టాక్స్) వేస్తున్నారని చెప్పి బాధపడ్డారు. భావనపాడు పోర్టు వల్ల మాకేమి మేలు జరుగుతుందన్న స్వరం విన్నాను. పోర్టుతో పాటు మత్స్యకారులకు హార్బ ర్ కట్టాలని, స్థానికులకు ఉద్యోగాలు రావాలని, భూములు కోల్పోతున్న వారికిచ్చే పరిహారం తక్కువని చెప్పారు. తిత్లీ పరిహారం రైతులకు ఇంకా సక్రమంగా అందలేదని, ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కాలేదని విన్నాను. జీడితోటలకిచ్చే రూ. 30 వేల పరిహారం తక్కువని, కొబ్బరిచెట్టుకు రూ.1,500లే ఇస్తున్నారని మీరు చెప్పిన ఆవేదనను ఓపిగ్గా విన్నాను... మీరేమీ అధైర్య పడకండి.. మీ అందరికీ నేనున్నాను. మీకు అండగా ఉంటాను.’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిక్కోలు వాసులకు, ముఖ్యంగా కిడ్నీ, తిత్లీ తుపాను బాధితులకు భరోసా ఇచ్చారు. శనివారం జిల్లాలోని పలాసలో తొలి ఎన్నికల సభలో ఆయన కిక్కిరిసిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దేవుని దయ, మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరక్కముందే ఉద్దానానికి 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూ రు చేస్తానని ప్రకటించారు. అంతేకాదు.. మంచి డాక్టర్లు, నెఫ్రాలజిస్టులను నియమించి కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ చేయించి ఉచిత మందులు అందజేస్తానని చెప్పారు. జగన్ హామీలకు హర్షధ్వానాలు ‘మీకు అన్నిరకాలుగా తోడుగా ఉంటా. కిడ్నీ బాధితుల పెన్షను రూ.10 వేలకు పెంచుతానని చెబు తున్నా. ఈ రోగాలెందుకు వస్తున్నాయంటే తాగే నీరు బాగులేక అంటున్నారు. అందుకని కాలువ ద్వారా మంచి నీటిని రప్పించి అందిస్తా.. జీడితోటలకు ఎకరానికి రూ.30 వేలకు బదులు 50 వేలు, కొబ్బరిచెట్టుకు రూ.3 వేల చొప్పున పరిహారాన్ని పెంచుతా’ అని జగన్ ఇచ్చిన హామీకి పెద్ద ఎత్తున హర్షధ్వానాలు పలికారు. శనివారం ఇటీవల ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో భానుడు భగభగలాడాడు. ఉదయం 9 గంటల నుంచే పలాస జంక్షన్ జనంతో నిండిపోయింది. హెలికాప్టర్లో పలాస చేరుకున్న జగన్ మధ్యాహ్నం 12 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. 39 నిమిషాల పాటు ఆయన ప్రసంగించారు. అంతసేపూ జనం కదలకుండా ఎండలోనే నిల్చుని జననేత ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో విన్నారు. ఆయన హామీలిస్తుంటే కరతాళధ్వనులు చేశారు. వైఎస్సార్సీపీ పలాస అసెంబ్లీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానం అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన జగన్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవల జననేత జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా బ్రహ్మరథం పట్టిన సిక్కోలు వాసులు ఎన్నికల సభలోనూ అంతే స్థాయిలో ఆదరించి మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. చేరికల జోరు వజ్రపుకొత్తూరు/ కాశీబుగ్గ/ వజ్రపుకొత్తూరు రూరల్: పలాస బహిరంగ సభలో టీడీపీ, బీజేపీల నుంచి పలువురు ముఖ్య నేతలు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరిలో వజ్రపుకొత్తూరు రిటైర్డ్ న్యాయమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు, వైశ్య సంఘం నాయకులు ఉన్నారు. వజ్రపుకొత్తూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి (టీడీపీ), మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్, పలాస వైశ్యసంఘం అధ్యక్షుడు, చార్టెడ్ అకౌంటెంట్ పి.వి.సతీష్, శైలజారెడ్డి, పలాస నియోజకవర్గ యాదవ కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాపాక చిన్నారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వాడ ఉమామమేశ్వరరావు, సీనియర్ ఓబీసీ మోర్చా స్టేట్ కౌన్సిల్ మెంబర్ తమ్మినేని మాధవరావు, పలాస మండల బీజేపీ అధ్యక్షుడు కంచరాన భాస్కరరావు, కంచరాన బుజ్జి, పలాస–కాశీబుగ్గ టీడీపీ 13వ వార్డు కైన్సిలర్ సైన కవిత వల్లభరావు, మాజీ సర్పంచ్ సాన కృష్ణ, గేదెల నీలకంఠంతోపాటు 50మంది వరకు పార్టీలో చేరారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జయమణి.. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే సరవరపు జయమణి వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ సమన్వయకర్త చిన్న శ్రీను ఆధ్వర్యంలో చేరిన ఆమెకు వైఎస్ జగన్ పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. విశ్రాంత న్యాయమూర్తి చేరిక టెక్కలి: టెక్కలికి చెందిన విశ్రాంత న్యాయమూర్తి గౌడ గోవింద కేశవరావు శనివారం వైఎస్సార్ సీపీలో చేరారు. పలాసలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, ఆమె భర్త కె.రామ్మోహన్రావు ఆధ్వర్యంలో విశ్రాంత జడ్జి కేశవరావు వైఎస్సార్ సీపీలోకి చేరారు. గోవింద కేశవరావు ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు శ్యామ్‌సుందరరావు.. పాతపట్నం:వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలాసలో రెడ్డిశాంతి ఆధ్వర్యంలో పాతపట్నం టీడీపీ సినియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, జిల్లా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిరియబెల్లి శ్యామ్‌సుందరరావు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. గుంటూరుకు చెందిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ బాబూ ఖాన్ పార్టీలో చేరారు. -
పల్లె కన్నీరు పెడుతోంది
సాక్షి, టెక్కలి: ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేసిన అనుభవం. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేయడంతో జిల్లాపై సంపూర్ణ అవగాహన. జనం తరఫున మాట్లాడగలిగే దమ్ము.. వెరసి దువ్వాడ శ్రీనివాస్. వైఎస్సార్సీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దువ్వాడ పల్లె కన్నీరు పెడుతోందని అంటున్నారు. ప్రచారమే తప్ప పనిచేయని అధికార పార్టీ తీరు వల్ల సి క్కోలు మరింత వెనుకబడిపోతోందని అంటున్నారు. ‘సాక్షి’తో తన మనోభావాలు ఇలా పంచుకున్నారు. సాక్షి: తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. జిల్లా వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దువ్వాడ : టీడీపీ పాలనలో జిల్లా మరింత వెనుకబడింది. గ్రామాల నుంచి యువత వలస పో తున్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో జనం తీవ్రం గా ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పూ ర్తిస్థాయిలో భరోసా లేదు. మ త్స్యకారులు, జీడి, కొబ్బరి రైతులు కష్టాల్లో ఉన్నారు. పేద, సామాన్య వర్గాలకు వి ద్య, వైద్యం అందడం లేదు. సాక్షి: గత ఎంపీ పనితీరు ఎలా ఉంది? దువ్వాడ : జిల్లా ప్రజలు ఎంతో ఆశతో కె.రామ్మోహన్నాయుడిని గెలిపించారు. కానీ ఆయన మాటలు తప్ప పని చేయలేకపోయారు. మంత్రిని కూడా దగ్గర ఉం చుకుని జిల్లాకు నిధులు తెప్పించలే దు. ఐదేళ్ల కాలంలో జిల్లా కేంద్రంలో కోడి రామ్మూర్తి స్టేడియాన్ని కూడా ని ర్మించలేకపోయారు. నదుల అనుసంధానం చేయలేదు. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ ఊసేలేదు. కిడ్నీ రోగులు, జీడి, కొబ్బరి రం గంపై ఆయన దృష్టి పెట్టిన దాఖలా ఒక్కటి కూడా లేదు. అభివృద్ధి చేయడంలో ఎంపీ దారుణంగా విఫలమయ్యారు. సాక్షి: వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థిగా జిల్లా సమస్యలపై ఎలాంటి అవగాహన ఉంది? దువ్వాడ : గతంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అప్పటి నుంచి జిల్లాలో ప్రతి సమస్యపై అవగాహన ఉంది. అంతే కాకుండా సుదీర్ఘమైన రాజకీయ అనుభవంతో గత కొన్నేళ్లుగా ప్రజా పోరాటాలు చేస్తున్నాను. ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆణిముత్యం లాంటి క్రీడాకారులు, మత్స్యకారులు, కిడ్నీ బాధితులు, జీడి, కొబ్బరి రైతులు, నిర్వాసితులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. సాక్షి: జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఆదరణ ఎలా ఉంది? దువ్వాడ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అంతే కా కుండా మిగిలిన రాజకీయ నాయకుల మాదిరిగా కా కుండా నిజాయితీ రాజకీయాలతో కొత్త అధ్యయనా నికి శ్రీకారం చుట్టారు. అందు కే అంతా ఆయన నాయకత్వం కోరుకుంటున్నాను. రాష్ట్రానికి అలాంటి యువ నాయకత్వం కావా లి. సాక్షి: మీరు ఎంపీగా గెలిస్తే జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? దువ్వాడ : జిల్లా ప్రజల దీవెనతో ఎంపీగా గెలిస్తే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాను. వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా జలయజ్ఞం ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందజేస్తాను. కిడ్నీ రోగులకు ఆసరాగా డయాలసిస్ కేంద్రాలను విస్తరించేలా చేస్తాను. మత్స్యకారులకు, కూరగాయల రైతులకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌లు, ఉప్పు కార్మికులను ఆదుకోవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాను. వంశధార నిర్వాసితులకు చట్టం ప్రకారం అందాల్సిన పూర్తి సదుపాయాలు కల్పిస్తాను. ప్రధానంగా వలసలు లేకుండా ఉపాధి మార్గాలు కల్పి స్తాను. జీడి, కొబ్బరి రైతులు, గిరిజనులను ఆదుకునే విధంగా ఆయా రంగాలను అభివృద్ధి చేస్తాను -
అధికార పార్టీ తరఫున..దర్జాగా ప్రచారం
సాక్షి, టెక్కలి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తరఫున విధులకు డుమ్మా కొట్టి రాజకీయ ప్రచారం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. వారిలో కోటబొమ్మాళి మండలానికి సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తూ టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న కమ్మకట్టు శ్రీనివాసరెడ్డి ఒకరు. ఆయన కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో మంత్రి అచ్చెన్నాయుడితో పాటు రాజకీయ ప్రచారంలో స్వయంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే సోమవారం రాత్రి అచ్చెన్నాయుడు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రితో పాటు హాజరయ్యారు. అలాగే మండలంలో గల ఎత్తురాళ్లపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు సనపల గుర్రయ్య, స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అన్నెపు రాధాకృష్ణ, తదితరులు విధులు పక్కన పెట్టి టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వారిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలని వైఎస్సార్సీపీ నాయకులు అన్నెపు రామారావు, కాళ్ల సంజీవరావు, సంపతిరావు హేమసుందరరాజులు ఫిర్యాదు చేశారు. -
అన్నన్నా.. అచ్చెన్నా..ఈ బెదిరింపులేందన్నా..!
‘నేను మాట్లాడినపుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి.. కాదని వేరేదేమైనా పనిచేస్తే నీకు నెక్ట్స్ బర్త్‌డే ఉండదు...’ –అది పాపులర్ సినిమా డైలాగ్ ‘రానున్న ఎన్నికల్లో నా గెలుపు కోసమే మీరు పనిచేయాలి... గ్రామాల్లో నా కోసం ప్రచారం చేయాలి... నా నామినేషన్‌కు పెద్ద ఎత్తున ప్రజలను తరలించే బాధ్యత మీదే... అలా కాదని ఎదురు తిరిగితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయ్’ –ఇది ఓటమి భయంతో వణికిపోతున్న మంత్రి గారి మేకపోతు గాంభీర్యం సాక్షి, టెక్కలి/కోటబొమ్మాళి: రెండు రోజుల క్రితం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బందితో రహస్య సమావేశం నిర్వహించారు. తనకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని బెదిరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 20న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన టెక్కలిలో నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బంది తరలిరావాలంటూ మంత్రి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తన గెలుపు కోసం గ్రామాల్లో తెర వెనుక ప్రచారాలు చేయాలంటూ బెదిరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి హోదాలో ఉంటూ మరి కొన్ని శాఖలకు చెందిన సిబ్బందితో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి హోదాను ఉపయోగించుకుని తన గెలుపు కోసం అనుకూలమైన మార్గాలను అనుసరిస్తున్నట్లు సమాచారం. డ్వాక్రా, ఉపాధి, అంగన్వాడీ సిబ్బందితో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారిని బెదిరించే పర్వం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు తన విజయం సునాయాసం అంటున్న అచ్చెన్నాయుడు మరో వైపు ఈ విధమైన బెదిరింపులకు దిగడం గమనార్హం. ఐదేళ్ల టీడీపీ పాలనలో పట్టణ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జన్మభూమి కమిటీలు, కొంతమంది టీడీపీ కార్యకర్తలు చేసిన అరాచకాలతో ఇప్పటికే ప్రజలు విసిగిపోయివున్నారు. ఈసారి ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో.. మంత్రికి ఓటమి భయం పట్టుకుందా అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన టెక్కిలి ఆర్టీసీ కార్మిక సంఘాలు
-
టెక్కలి అంతా ఒక్కటిగా...
-
చంద్రబాబు ఎలాంటి వాడో తెలుసా?
సాక్షి, టెక్కలి: సీఎం చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తుపాన్ వస్తుందని తెలిసినా తమను గాలికి వదిలేసి వెళ్లిపోయారని, చంద్రబాబు కంటే నీచమైన వ్యక్తి ప్రపంచంలోనే ఉండడని ప్రజలంతా మండిపడుతున్నారని చెప్పారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శనివారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు మనస్తత్వం గురించి ఓ పెద్దాయన చెప్పిన విషయాలను వెల్లడించారు. ‘బస్సు ప్రమాదం జరిగి అందులో పది మంది చనిపోతే మనమంతా అయ్యే అనుకుంటాం. కానీ చంద్రబాబు అలా కాదు. ఆ బస్సులో 40 మంది బతకడం తన విజయం అని తను చెప్పుకోగలుగుతాడు. చంద్రబాబు ఒక స్థాయి దాటి పోయాడన్నా. దేవుడి మీద, సృష్టి మీద విజయం సాధించానని.. నవగ్రహాలను కంట్రోల్ చేస్తున్నానని మాట్లాడుతున్నాడు. పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చిందన్నా. పెథాయ్ తుపాను వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ప్రజలను గాలికి వదిలేసి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్లియాడు. పెద్ద తుపాను రాబోతోందని తెలిసి కూడా ప్రత్యేక విమానంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణాస్వీకారానికి వెళ్లాడు. ఆయన అక్కడకు వెళ్లాల్సిన అవసరముందన్నా?’ అని తనను పెద్దాయన ప్రశ్నించాడని వైఎస్ జగన్ తెలిపారు. సముద్రాన్ని కంట్రోల్ చేశానని, పెథాయ్ తుపాన్‌ను ఓడించానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని జగన్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిని ఎల్లోమీడియా ఆకాశానికెత్తడాన్ని ప్రతిపక్ష నేత ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టి కొత్త సినిమాకు చంద్రబాబు తెర తీశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా లాక్కుకోవడం, వాడుకోవడమేనని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కునాడని గుర్తు చేశారు. తనుకు తానుగా సాధించింది ఒక్కటంటే ఒక్కటీ లేదని తూర్పారబట్టారు. భారత వాతావరణ శాఖ, ఇస్రో కంటే తాము ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ కచ్చితమైన సమాచారం అందించిందని చంద్రబాబు డబ్బా కొట్టువడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. టెక్కలిలో జన సునామీ జననేత వైఎస్ జగన్ సభకు భారీగా ప్రజలు తరలిరావడంతో టెక్కలిలోని అంబేద్కర్ జంక్షన్లో జన సంద్రాన్ని తలపించింది. దారులు, వీధులన్నీ జనంతో కిక్కిరిశాయి. కనుచూపు మేరంతా జనమే కనిపించారు. రాజన్న తనయుడి మాటలను వినేందుకు ప్రజలు అత్యంత ఆసక్తి చూపించారు. ఇళ్లపైకి ఎక్కి జననేత ప్రసంగాన్ని విన్నారు. వైఎస్ జగన్ ప్రసంగానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. -
టెక్కలి బహిరంగ సభలో వైఎస్ జగన్
-
328వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 328వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రావివలస, నౌపాడ క్రాస్ మీదుగా జయకృష్ణాపురం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తరువాత పాదయాత్ర టెక్కలి వరకు చేరుతుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. -
టెక్కలి తహసీల్దారు కార్యాలయంలో..
శ్రీకాకుళం , టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో గురువారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో తహసీల్దారు కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్క సారిగా చెలరేగి పక్కనే ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయానికి వ్యాపించాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే తహసీల్దారు ఆర్.అప్పలరాజు, సిబ్బందికి సమాచారం అందజేశారు. వారు హుటాహుటిన కార్యాలయానికి చేరుకుని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. దశాబ్దాల నాటి భవనం కావడంతో భారీ దుంగలు కిందకు పడుతుండడంతో లోపలకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. మరోవైపు దట్టమైన మంటలు వ్యాపించి కంప్యూటర్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. కొందరు సిబ్బంది మాత్రం అతికష్టమ్మీద లోపలకు వెళ్లి బీరువాలోని సర్వీస్ రిజిస్టర్లు బయటకు తీసుకువచ్చారు. అప్పటికే కొన్ని రిజిస్టర్లు స్వల్పంగా కాలిపోయాయి. ఆర్ఐ రామారావుతో పాటు ఇతర సిబ్బంది మిగిలిన సామగ్రిను, రికార్డులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. సబ్ ట్రజరీ కార్యాలయం లోపల భాగంలో ఉన్న కంప్యూటర్లు, ఇతర రికార్డులను సకాలంలో బయటకు తీసుకువచ్చారు. అగ్ని మాపక సిబ్బందితో పాటు స్థానికులు కలిసి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విలువైన ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ, 1బీ, అడంగల్స్, ఎంఎల్సీ దరఖాస్తులు, కోర్టు ఫైళ్లతో పాటు తిత్లీ తుఫాన్‌కు సంబంధించి రికార్డులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని తహసీల్దారు అప్పలరాజు స్పష్టం చేశారు. అయితే ఎన్నికల విభాగానికి చెందిన కొన్ని దరఖాస్తులు కాలిపోయాయని, వాటిని ఆన్లైన్లో నమోదు చేయడంతో సమస్య ఉండదని చెబుతున్నా రు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట ఇదే మాదిరిగా స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని రికార్డులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ చక్రధర్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. -
జోరుగా జూదం..!
శ్రీకాకుళం, టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలికి ఆనుకుని కొన్ని పరిసర ప్రాంతాల్లో పేకాట జోరుగా కొనసాగుతోంది.. ప్రతి రోజూ సుమారు 5 నుంచి 8 లక్షల రూపాయల మేరకు పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. పేకాట ఆడాలనే కాంక్ష ఉన్న వారికి గాలం వేస్తూ ఆయా శిబిరాల వద్దకు చేర్చడం.. వారితో లక్షల రూపాయల మేరకు పేకాట ఆడించడం..ఎవరికైనా అప్పు కావాలంటే అక్కడే అందజేయడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పేకాట ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా జూదం సమాచారాలు తెలియజేయడం, వాటిపై ఆసక్తి ఉన్న వారికి ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం వీరి పని. టెక్కలి నుంచి మెళియాపుట్టి రోడ్డులో మారుమూల తోటల్లోనూ, సీతాపురం నుంచి గిరిజన గ్రామాలకు వెళ్లే మార్గంలోనూ ప్రతి రోజూ లక్షల రూపాయల్లో పేకాట జరుగుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది ప్రముఖులు ఉండడంతో పోలీసులు అటు వైపు దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మారుమూల కొండ ప్రాంతాల్లోని తోటల్లో ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు జూదం జరుగుతున్నట్లు సమాచారం. ఈ చతుర్ముఖ పారాయణం వల్ల ఇప్పటికే ఎంతో మంది సామాన్య వర్గాలకు చెందిన వారు ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పో లీస్ యంత్రాంగం ప్రత్యేక నిఘా వేసి జూదానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. -
ఊపిరాగిన ఉద్దానం!
ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడు. (అన్నమోరామ‘చంద్రా’!) గుండె పగిలే దుఃఖం వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని పూడి, రెయ్యిపాడు, ఆర్ఎం పురంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా జీడి, కొబ్బరి తోటలే ఉన్నాయి. రైతులు, రైతు కూలీలకు ఇవే జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా వాళ్లకు వలసలు అంటే ఏంటో తెలీదు. తిత్లీ తుపాను దెబ్బకు ఒక్క చెట్టూ మిగల్లేదు. రెయ్యిపాడుకు చెందిన ఎం. తిరుపతిరావు ఐదెకరాల్లో జీడి, కొబ్బరి సాగుచేస్తున్నాడు. తండ్రి కాలంలో వేసిన చెట్లు నెలకు రూ.30వేల ఆదాయమిస్తున్నాయని చెప్పాడు. ‘ఐదెకరాలూ కొట్టుకుపోయిందయ్యా.. ఏం చెయ్యాలి’.. అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తిరుపతిరావును ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదని ఆయన బంధువు వెంకటరమణ తెలిపాడు. ‘ఆయనేం చేసుకుంటాడో? ఏమవుతాడో?’ అని ఇంటిల్లిపాదీ కుమిలిపోతున్నారని చెప్పాడు. మద్దెల హరినారాయణ అక్కడ జీడి పరిశ్రమ నడుపుతున్నాడు. అతనూ ఓ రైతే. అతన్ని కదిలించినా ఆవేదన తన్నుకొచ్చింది. ‘ఒక్కో చెట్టూ లక్షలు చేస్తుంది. మళ్లీ అంత చెట్టు కావాలంటే ఏళ్లు పడుతుంది. మాకా ఓపిక లేదు.. అంత శక్తీ లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఒక్కో వ్యక్తికీ రూ.20 లక్షలిచ్చినా కోలుకోలేం’ అని బావురుమన్నాడు. ప్రతీ రైతన్నదీ ఇదే ఆవేదన. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆదుకోకపోతే ఆత్మహత్యలే.. నిన్నటిదాకా ఈ ప్రాంతంలో ఆకాశాన్ని తాకి, పచ్చగా రెపరెపలాడిన కొబ్బరి చెట్లు.. ఏపుగా ఎదిగిన జీడి చెట్లు తిత్లీ దెబ్బకు పూర్తిగా నేల కొరిగాయి. కూలిన చెట్లను రంపంతో ముక్కలుగా కోస్తుంటే అక్కడ రైతన్న వేదన హృదయ విదారకంగా ఉంది. ఊళ్లకు ఊళ్లే ఎడారిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ మొక్కనాటి, పెంచి పెద్దచెయ్యాలనుకుంటున్నారు. కానీ, వారికి సాయం కావాలి. మళ్లీ ఉద్యానవనం పెంచడానికి ప్రభుత్వం కనీసం ఆరేళ్ల పాటు సాయం చేస్తే తప్ప కోలుకోలేమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కరూ పలకరించలేదు మా గుండెలు మండిపోతున్నాయి. హుద్‌హుద్ తుపాను వస్తే విశాఖను ఆదుకున్నారట. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడికి రావాలి. రైతు కష్టాన్ని చూడాలి. నిజాయితీగా ఆదుకునే ఆలోచన చేయాలి. మేం సర్వనాశనమయ్యాం. ఒక్కరూ రాలేదు. పిల్లల్లా పెంచుకున్న చెట్లు కూలిపోయాయి. రోడ్డున పడ్డాం. ఓదార్చే దిక్కేలేదు. – మద్దెల పాపయ్య, రెయ్యిపాడు, జీడి, కొబ్బరి రైతు అధికారులు ఎవరూ రావడంలేదు రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రెండు రోజులుగా అదేదీ కన్పించడం లేదు. అధికారులు అస్సలు రావడంలేదు. కూలిన చెట్లను రైతులే తొలగించుకుంటున్నారు. కానీ, అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను పంపితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లేకపోతే ఉద్దానం ఆవేశం ఏంటో ప్రభుత్వం చూస్తుంది. – సాంబమూర్తి, సీపీఎం మండల నాయకుడు, వజ్రపుకొత్తూరు -
మంత్రివర్యా ఇటువైపు చూడరా?
రెండేళ్ల క్రితం వరకు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఏడాది కిందట టెక్కలికి తరలించారు. నందిగాం మండలం తురకల కోట సమీపంలో కొండల మధ్యనున్న మూత పడిన ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ భవనం యాజమాన్యానికి ప్రభుత్వం సుమారు 9 కోట్ల 80 లక్షల రూపాయలు చెల్లించింది. అయితే, కళాశాల ఏర్పాటై ఏడాది గడుస్తున్నా ఇంత వరకు రెగ్యులర్ సిబ్బందిని నియమించలేదు. డిప్యూటేషన్ సిబ్బందితో తరగతులు నిర్వహిస్తుండటం, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం, ల్యాబ్‌లలో సరైన పరికరాలు లేకపోవడం, ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో ఉన్న ఈ కళాశాల విషయంలో చిన్నచూపు చూడడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. టెక్కలి: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతానికి సర్కార్ కళా శాల మం జూరైందనే సంతోషం కం టే.. పిల్లల కష్టాలే తమను బాధిస్తున్నాయని ఈ ప్రాంతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలు, తోటల మధ్యలో ఉన్న కళాశాలకు రక్షణ గోడ కూడా లేకపోవడంతో అక్కడ ఉండటానికే పిల్లలు భయపడుతున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది ఇక్కడి సీట్లు కూడా పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. కళాశాలలో ప్రస్తుతం ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. ఒక్కో బ్రాంచ్‌కి ఐదుగురు ఉపన్యాసకులు (లెక్చరర్లు), ఒక సీనియర్ ఉపన్యాసకుడు, శాఖాధిపతి ఒకరు చొప్పున ఉండాలి. ప్రస్తుతం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఒకరు, ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచ్‌లకు ఒక్కొక్కరు చొప్పున ఉపన్యాసకులు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. వీరితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ ఉపన్యాసకులు, ఇద్దరు గెస్ట్ లెక్చరర్లు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కళాశాలలో ట్రిపుల్ ఈ, సివిల్ బ్రాంచిల్లో మొత్తం 193 మంది విద్యార్థులు ఉన్నారు. అందుబాటులో లేని ల్యాబ్‌లు విద్యార్థులకు తగినన్ని ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. మూత పడిన ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న కొన్ని పరికరాలతో ఇప్పుడు ల్యాబ్‌లు నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం 5వ సెమిస్టర్ ల్యాబ్ పరీక్షలు జరగాల్సి ఉండగా అవి జరగడం లేదు. వసతి గృహాలు లేక అవస్థలు.. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ వసతి గృహాలు లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థినులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నుంచి ఐదు మంది చొప్పున వేల రూపాయలు అద్దె కడుతూ, వండుకుని తింటూ ఇబ్బందులు పడుతున్నారు. కళాశాలలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేవు. ఉన్నవి పూర్తిగా అధ్వానంగా మారాయి. కళాశాల ఏర్పాటు చేసిన తరువాత విద్యార్థులకు అవసరమైన వాటి కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడం గమనించదగ్గ విషయం. కళాశాలలో తగ్గిన సీట్ల భర్తీ: కొండలు, తోటల మధ్యలో కనీస సదుపాయాలు లేని ఈ కాలేజీలో చేరేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపడం లేదు. ట్రిపుల్ఈ లో 60, సివిల్ విభాగానికి 60 చొప్పున ప్రభుత్వం సీట్లు కేటాయించగా, ఈ ఏడాది ట్రిపుల్ ఈలో 34, సివిల్‌లో 19 మంది మాత్రమే చేరారు. -
టెక్కలి ఆస్పత్రిలో ఉద్రిక్తత
టెక్కలి రూరల్/నందిగాం : టెక్కలి ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలు శార్వాణీ చేసిన శస్త్రచికిత్స వికటించి బాలింత మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. శనివారం ఉదయం నుంచి ఆస్పత్రి ఎదు ట ధర్నా చేశారు. అనంతరం రహదారిపై బైఠాయించడంతో సుమారు 5 గంటల పాటు ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. ఉద్రి క్తత తారా స్థాయికి చేరుకునే లోపు ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, డా క్టర్లు, సంఘం నాయకులతో, మృతురాలి బం ధువులతో చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతురాలి బం ధువులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మందస మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి తారకరావుకు నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన గుర్రల వాసు కుమార్తె లక్ష్మి(24)కి సుమారు ఐదేళ్ల కిందట వివాహమయింది. వీరికి మూడేళ్ల కుమారుడు రుత్విక్ ఉన్నాడు. అయితే లక్ష్మి రెండో కాన్పు నిమిత్తం తన అత్తవారింటి నుంచి కన్నవారింటికి పాలవలస వచ్చింది. గురువారం ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శార్వాణీ అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. అనంతరం డాక్టర్ ఈమెకు కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స కూడా పూర్తిచేసి తల్లీ పిల్లలు బాగున్నారని భావించి ప్రసూతి విభాగానికి తరలించా రు. వారిని వార్డుకు తరలించే క్రమంలో అక్కడే ఉన్న కిందిస్థాయి సిబ్బంది శస్త్రచికిత్స ఖర్చులు నిమిత్తం రూ. 2100 తీసుకున్నట్టు లక్ష్మి అన్నయ్య గుర్రాల గణపతి తెలిపారు. అయితే అక్కడికి కొంత సమయం తర్వాత సాయంత్రం 4 గంటలకు లక్ష్మికి బ్లీడింగ్(రక్తం) అవుతుందని తన సోదరుడు గుర్రాల గణపతి నర్సులకు చెప్పగా, వారు మీరు మాకు చెప్పడం ఏమిటి... ముందు మీరు బయటకు నడవండి.. మీరు ఇక్కడ ఉండకూడదు అని తూలనాడారు. దీంతో అతడు బయటకు వచ్చేశాడు. ఆమెకు ఏమి అవ్వదు మాకు తెలుసు అని చెబుతూ రక్తాన్ని గుడ్డతో తుడిచేశారు. బ్లీడింగ్ మరీ ఎక్కువవడంతో డాక్టర్ శార్వాణీకి సమాచారం ఇవ్వడంతో ఆమె లక్ష్మికి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చారు. తర్వాత ఆస్పత్రిలో ఏబీ పాజిటివ్ రక్తం లేకపోవడం, లక్ష్మి బీపీ డౌన్ అవ్వడంతో సాయంత్రం 7 గంటల సమయంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చేరిన తర్వాత లక్ష్మి మృతి చెందింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, భర్త తారకరావు, సోదరుడు గణపతి టెక్కలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై మండిపడ్డారు. టెక్కలి ఆస్పత్రిలోని నర్సులు, వైద్యులు కలిసే లక్ష్మిని చంపేశారని, పిల్లలను అనాథలను చేశారని వాపోయారు. మృతదేహాన్ని పట్టుకుని టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అర్ధరాత్రి 12 గంటలు దాటింది తెల్లవారి ఫిర్యాదు ఇవ్వండి అని పోలీసులు అనడంతో వారు వెళ్లిపోయారు. అయితే శనివారం ఉదయం నుంచే మృతురాలి కన్నవారు ఊరు పాలవలస, అత్తవారి ఊరు సువర్ణపురం గ్రామస్తులు, నాయకులు తదితరులతో కలిసి ఆస్పత్రి గేటు ముందు ధర్నాకు దిగారు. సుమారు గంటపాటు రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో టెక్కలి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అనంతరం టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, తాహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఆస్పత్రి సూపరింటెండెంట్ కణితి కేశవరావు, జనసేన నాయకుడు యాదవ్, దళిత ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ చల్ల రామారా>వు, దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బొకర నారాయణరావు, కేఎన్పీఎస్ నాయకులు బెలమర ప్రభాకరరావు, ఈశ్వరరావు కలిసి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిర్లక్ష్యంగా వైద్యం అందించి లక్ష్మి మృతికి కారణమైనందుకు వైద్యులు, వైద్య సిబ్బందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి చివరకు సమస్యను పరిష్కరించారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జ రుగుతున్న ఆం దోళనను తెలుసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ రాఘవ ఘటనా స్థలానికి చేరుకుని అధికారులు, బాధితుల నుంచి సమాచారం అడిగితెలుసుకున్నారు. బాధితులకు అందించే సౌకర్యాలు మృతురాలు లక్ష్మికి చెందిన ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేవిధంగా చర్యలు తీసుకుంటాం. పిల్లలు పేరు మీద నందిగాం మండల కేంద్రంలో రెండు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ స్థలం ఎక్కడైన గుర్తించినట్టు అయితే ఎకరా పొలం, చంద్రన్న బీమా ఉంటే వచ్చేలా కృషిచేస్తాం. ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం వచ్చేలా కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అదేవిధంగా తక్షణ సహా యం కింద బాధిత కుటుం బానికి రూ. 40 వేలు ఆర్థిక సహాయం చేశారు. -
మంత్రి ఇలాకాలో మృత్యు ఘోష!
టెక్కలి : టెక్కలి ఏరియా ఆస్పత్రి తరచూ వివాదాల్లోకి వెళ్తోంది. వైద్యం కోసం వచ్చేవారిలో ఎవరో ఒకరు.. ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు. దీనికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగుతున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆస్పత్రిలోనే తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం టెక్కలి భూలోకమాతవీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనం ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా వైద్యం కోసం ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు. చికిత్స అనంతరం యువకుడు మృతి చెందాడు. దీనికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ యువకుడి మృతదేహంతో భూలోకమాతవీధికి చెందిన ప్రజలు ఏరియా ఆస్పత్రిని ముట్టడించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అక్కడకు కొద్ది రోజుల తరువాత ఆంజేయపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇదే ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందింది. అప్పట్లో గ్రామస్తులు ఆస్పత్రి సిబ్బంది తీరుపై నిరసన చేపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్థానిక ఆదిఆంధ్రావీధికి చెందిన ఓ యువకుడు అనారోగ్యం బారిన పడడంతో ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతను మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా యువకుడు చనిపోయాడంటూ ఆదిఆంధ్రావీధికి చెందిన వారంతా మృతదేహంతో ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తాజాగా నందిగాం మండలం పాలవలస గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే బాలింత మృతి చెందడంపై, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట నిరసన చేశారు. ఇదంతా కేవలం ఏడాది కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకంగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు మరణాలు జరుగుతుండడంపై తాత స్థాయిలో మంత్రి వైఫల్యాన్ని ప్రజలు ఎండ గడుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై పెల్లుబికుతున్న విమర్శలు ఏరియా ఆస్పత్రిలో కొంతమంది వైద్య సిబ్బంది అనుసరిస్తున్న తీరు, నిర్లక్ష్యంపై తారస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిండమే కాకుండా అత్యవసర సమయంలో అందుబాటులో ఉండడం లేదంటూ ఆరోపణలున్నాయి. రాత్రి వేళల్లో ఆస్పత్రిలో విధుల్లో ఉండాల్సిన సిబ్బంది కొన్ని సమయాల్లో అందుబాటులో ఉండడం లేదు. అంతేకాకుండా వార్డుల్లో ఉన్న రోగుల పట్ల కూడా సిబ్బంది కసురుకోవడం పరిపాటిగా మారిందంటూ రోగులు చెబుతున్నారు. అలాగే ప్రసూతి విభాగంతో పాటు ఇతర విభాగాల్లో ఆపరేషన్లకు డబ్బులు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినపుడు ఉన్నతాధికారులు రావడం, ఇరువర్గాలను కూర్చోబెట్టడం సామరస్యంగా రాజీలు చేయడం పరిపాటిగా మారిందం టూ బహిరంగంగా విమర్శలు ఉన్నాయి. తాజాగా శనివారం జరిగిన బాలింత మృతి విషయంలో ఆపరేషన్‌కు ముందు ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్న సిబ్బంది 2100 రూపాయలు తీసుకున్నారని మృతురాలి సోదరుడు ఉన్నతాధికారుల వద్ద రోదిస్తూ చెప్పడం గమనించదగ్గ విషయం. మంత్రి ఏం చేస్తున్నారు? ఏరియా ఆస్పత్రిలో తరచూ నిర్లక్ష్యపు మరణాలు జరుగుతున్నప్పటికీ మంత్రి ఏం చేస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా ఆస్పత్రిని సందర్శించడం ఆ తరువాత ఆస్పత్రిలో వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో కనీసం దృష్టి సారించడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్య సేవలపై ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరో వైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తీసుకునే క్రమశిక్షణ చర్యలు కూడా సన్నగిల్లడంతో, ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్య ధోరణి తీరు మారడం లేదంటూ బాధితులు చెబుతున్నారు. మంత్రి మాటలు.. నా నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తా. – పలు బహిరంగ సభల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. వాస్తవం ఇలా.. మంత్రి ఇలాకాలోని వంద పడకల ఏరియా ఆస్పత్రిలో కొద్ది రోజులుగా మరణ ఘోష వినిపిస్తోంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా బాలింత చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోయిందంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ఆపరేషన్‌కు రూ.2,100 తీసుకున్నారు మా చెల్లి లక్ష్మిని కాన్పు కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాం. ఆపరేషన్ కోసం థియేటర్ వద్దకు తీసుకువెళ్లాం. అక్కడ సిబ్బంది మా దగ్గర 2,100 తీసుకున్నారు. ఆపరేషన్ తరువాత పట్టించుకోకపోవడంతో మా చెల్లి మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఈ ఘోరం జరిగింది. –గుర్రాల గణపతి, పాలవలస, నందిగాం మండలం. సరిగ్గా పట్టించుకోవడం లేదు జ్వరం, నీరసంతో వారం కిందట ఆస్పత్రిలో చేరాను. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు. నర్సులకు అడిగితే ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ మాత్రలు వేసుకున్న తరువాత కడుపులో మంటతో నరకాన్ని చూస్తున్నాను. నర్సులకు అడిగితే కసిరేస్తున్నారు. –బొచ్చ రాము, రోగి, భగవాన్‌పురం, టెక్కలి మండలం. ప్రజా రోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గ కేంద్రమైన టెక్కలిలో ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రిలో వరుసగా నిర్లక్ష్యపు మరణాలు సంభవిస్తుంటే మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేనా ప్రజలకు అందజేసే మెరుగైన వైద్యం. కమీషన్ల వైపే కాకుండా ప్రజల ఆరోగ్యంపై మంత్రి దృష్టి పెడితే మంచిది. ఏరియా ఆస్పత్రిలో జరుగుతున్న సంఘటనలతో ప్రజలు ఆస్పత్రికి రావాలంటే భయపడుతున్నారు. ఈ సంఘటనలపై ప్రజలకు మంత్రి సమాధానం చెప్పాలి. –పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి. -
సంకల్పానికి తోడుగా..
-
‘దందాలకు కేరాఫ్ అడ్రస్ ఆ మంత్రి’
కోటబొమ్మాళి: రాష్ట్రంలో ఏ దందా జరిగినా రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన పాత్ర వహిస్తూ దందాలకు కేరాఫ్‌గా మారారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ విమర్శించారు. శుక్రవారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేసే దందాలు రోజురోజుకు మీడియాద్వారా బహిర్గతం అవుతున్నాయని ఆరోపించారు. అమరావతిలో ఉన్న భూములు వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు ముడుపులు కట్టబెట్టడం వల్ల కేబినెట్లో బి–గ్రేడ్ మంత్రిగా దిగజారిన అచ్చెన్నాయుడుకు మంత్రి వర్గంలో ప్రమోషన్ కల్పించారని దుయ్యబట్టారు. ఇసుక, లిక్కర్ దందాలతోపాటు నయీమ్‌తో వ్యవహారాలు నడపడం ద్వారా అన్ని అక్రమదారుల్లో ప్రధాన భూమిక పోషించారని ధ్వజమెత్తారు. టెక్కలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులకు గతంలో నైతిక విలువలు ఉండేవని.. ప్రజల పక్షాన సమస్యలపై పోరాడేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు దందాలు, కబ్జాలు, లిక్కర్ మాఫియాకు, నయీమ్ వంటి దుర్మార్గులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ఎద్దేవా చేశారు. మంత్రిగా ప్రజా సమస్యలను పరిష్కరించాలి్సన అచ్చెన్న.. అవినీతికి అడ్డాగా మారారని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఎస్.హేమసుందరరాజు, పార్టీ నాయకులు పేడాడ వెంకటరావు, దుబ్బ సింహాచలం, కాళ్ల గణపతి, ఎస్.వినోద్, ఎం.భాస్కరరెడ్డి, జి.సూర్యప్రకాశ్, మూల అప్పన్న, తదితరులు పాల్గొన్నారు. -
మరి కొద్ది క్షణాల్లో పెళ్లి.. అంతలోనే..
► పెళ్లి కుమారుడు కుటుంబ సభ్యులతో తగాదాకు దిగిన కుల పెద్దలు ►పోలీసులు నచ్చజెప్పిన ఫలితం శూన్యం ►రోలు వద్ద జరిగిన వివాహం ► టెక్కలి గొల్లవీధిలో ఘటన టెక్కలి(శ్రీకాకుళం): డివిజన్ కేంద్రమైన టెక్కలి గొల్లవీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంతో పెళ్లి వేడుక వివాదాస్పదంగా మారింది. పెళ్లి కుమార్తెతో పాటు పెళ్లికి వచ్చిన వారంతా ఇబ్బందులు పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు గొల్లవీధికి చెందిన యువకునికి, విశాఖపట్నానికి చెందిన యువతితో వివాహాం చేసేందుకు కుటుంబ సభ్యులు ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున ముహూర్తం కావడంతో మరి కొద్ది క్షణాల్లో మూడు ముళ్లు పడతాయనుకునే సమయంలో అదే వీధికి చెందిన కొంతమంది కుల పెద్దలు మండపం వద్దకు వచ్చి పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులతో తగాదాకు దిగారు. పాత కుటుంబ కలహాలు నేపథ్యంలో వివాహం జరుగుతున్న చోట రచ్చ రచ్చ చేశారు. తగాదా తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానిక పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే ఆదివారం ఉదయం అంతా ఎటువంటి తగాదా లేకుండా సరిగ్గా ముహూర్తం సమయానికే కొంతమంది కుల పెద్దలు తగాదాకు దిగడంపై అసలు కారణాలు తెలియకపోవడంతో అంతా బిత్తరపోయారు. తగాదా ఎప్పటికీ సద్దుమణగకపోవడంతో నవ దంపతులను మరో చోటకు తీసుకువెళ్లి రోలు సమక్షంలో వివాహం చేసినట్టు తెలిసింది. -
భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి
టెక్కలి : భార్య మరణాన్ని తట్టుకోలేక మానసిక వేదనతో భర్త మరణించిన సంఘటన టెక్కలి మండలం నరసింగపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడియాల పారమ్మ (60) 12 రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె భర్త రాజన్న (63) మానసికంగా కుంగిపోయాడు. సోమవారం పారమ్మ పెద్దకర్మ జరిగిన అనంతరం రాజన్న మరింత ఆందోళనకు గురయ్యాడు. మంగళవారం పరిస్థితి విషమించడంతో ముగ్గురు కుమారులు రాజన్నను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయన కన్నుమూశాడు. అనంతరం రాజన్న మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. కాగా, రాజన్న మనవరాలి వివాహం బుధవారం జరగనుండటం, ఇంతలోనే వృద్ధులిద్దరూ మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.