
సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 328వ రోజు షెడ్యూల్ ఖరారైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి రావివలస, నౌపాడ క్రాస్ మీదుగా జయకృష్ణాపురం చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తరువాత పాదయాత్ర టెక్కలి వరకు చేరుతుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.