
టెక్కలి: టెక్కలిలో ఈనెల 22న ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీకి సంబంధించి టెక్కలి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సీఐ ఎంవీ గణేష్ నేతృత్వంలో గత కొద్ది రోజులుగా ఒడిశా ప్రాంతాల్లో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో ఒక దొంగ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ దొంగ ఇచ్చిన సమాచారంతో ఒడిశా పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు కండ్రవీధిలో గల ఓ చెరువులో నగల కోసం అన్వేషించినట్లు సమాచారం. జిల్లాలో వరుసగా జరుగుతున్న వివిధ రకాల సంఘటనల నేపథ్యంలో టెక్కలిలో జరిగిన భారీ చోరీపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భారీ చోరీలో దొంగలు కాజేసిన రూ.2.40 లక్షల నగదు, 14 తులాల బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
(చదవండి: బాలింతల సేవలో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్)
Comments
Please login to add a commentAdd a comment