తిరుపతి క్రైం: నగరంలోని భవానీనగర్‌లో ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేసి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... భవానీనగర్‌లోని ఓ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చి దాడులు చేశారు.
బుజ్జమ్మ, శారద, సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తూ కోస్తా నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. వీరిని యువకులకు ఎరవేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1000 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. ఓ మహిళను గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు.
అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ..
Comments
Please login to add a commentAdd a comment