brothel house
-
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైం: నగరంలోని భవానీనగర్‌లో ఓ నివాసంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేసి అరెస్ట్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈస్ట్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు... భవానీనగర్‌లోని ఓ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం వచ్చి దాడులు చేశారు. బుజ్జమ్మ, శారద, సుబ్రహ్మణ్యం ముగ్గురూ కలిసి వ్యభిచార గృహం నిర్వహిస్తూ కోస్తా నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. వీరిని యువకులకు ఎరవేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. ఈ మేరకు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1000 రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నామన్నారు. ఓ మహిళను గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు. అమ్మానాన్నకు అబద్ధం చెప్పానంటూ.. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
గుడివాడరూరల్: గుట్టు చప్పుడు కాకుండా గుడివాడలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూటౌన్ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, మరో ముగ్గురు విటులను అరెస్ట్ చేసినట్లు గుడివాడ సీఐ బి.తులసీధర్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడి చేశామని చెప్పారు. నిర్వాహకురాలు పోతులూరి నాగ పుష్పావతి అలియాస్ శిరీషతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.1800 నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలు శిరీష 2018 నుంచి ఇప్పటి వరకు నాలుగుసార్లు పోలీసులకు పట్టుబడిందని వెల్లడించారు. ఇప్పటికే ఆమైపె రౌడీషీట్ కూడా ఉందని వివరించారు. అరెస్టు చేసిన వారిని న్యాయమూర్తి వద్ద హాజరుపర్చనున్నట్లు తెలిపారు. డీఎస్పీ పి.శ్రీకాంత్ ఆదేశాల మేరకు నిందితులను అరెస్ట్ చేసిన రైటర్ రమేష్, ముగ్గురు కానిస్టేబుల్స్ రామకృష్ణ, రాజేష్, హరిబాబులకు రివార్డులు అందచేశామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ మురళీకృష్ణ, ఏఏస్ఐ తదితరులు పాల్గొన్నారు. -
ఇంట్లో రహస్యంగా వ్యభిచారం.. యువతులను తీసుకొచ్చి..
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. చేపల మార్కెట్ సమీపంలో షేక్ అస్లాం నివాసం ఉంటున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అస్లాం ఇంటిపై దాడి చేయగా ఇద్దరు విటులు, ఒక అమ్మాయిని గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: బరి తెగించిన భార్య.. ‘మా ఆయన్ను లేకుండా చేస్తే మనకు అడ్డుండదు’ -
Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో బయటపడ్డ ఫేక్ బాబా అరెస్ట్ వ్యవహారంలో విస్తూపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు సయ్యద్ హుస్సేన్. వాళ్ల కష్టాలు తీర్చే శక్తి తనకుందని నమ్మబలుకుతూ.. నిస్సహాయత ఆసరాగా చేసుకుని వ్యభిచార కూపంలోకి నెట్టే ప్రయత్నం చేశాడు. ఫలక్ నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మహిళల నగ్న వీడియోలు, ఫోటోలను తీసిన సయ్యద్ హుస్సేన్(35)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ‘డెకాయ్ ఆపరేషన్’ చేపట్టి.. అదుపులోకి తీసుకున్నాడు. నిందితుడు మొబైల్ ఆధారంగా కీలక సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. నిందితుడు సయ్యద్ హుస్సేన్ లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతని స్వస్థలం కర్నాటక బీదర్ జిల్లా బసవకళ్యాణ్. కలబురిగి(గుల్బర్గా)లో ఉన్న గులాం అనే వ్యక్తి తనను పంపించినట్టు చెప్తున్నాడు సయ్యద్. మానసికంగా ఇబ్బందులు పడుతున్న మహిళలు, యువతులు రోగాలు తొలగిస్తాము అని మాయమాటలు చెప్పి నగ్నంగా వాళ్లను ఫోటోలను తీశాడు సయ్యద్. ఈ మేరకు సయ్యద్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి గ్యాలరీని పరిశీలించారు పోలీసులు. అంతేకాదు.. గులాం తో సయ్యద్ చాట్ చేసిన కొన్ని వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించినట్లు వెల్లడించారు. అయితే.. ఆ ఫోటోలను ఎక్కడికి పంపిస్తున్నాడు అనే దానిపై విచారణ జరుగుతున్నట్లు ఫలక్‌నుమా ఏసీపీ జహంగీర్ వెల్లడించారు. గుల్బర్గాలో ఉన్న గులాం గురించి సెర్చ్ టీమ్స్ ను పంపించినట్లు తెలిపిన ఆయన.. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేయాలని కోరుతున్నారు. ఫిజిక్‌ను బట్టి రేటు.. తన దగ్గరకు వచ్చే మహిళలను అందరినీ సయ్యద్ హుస్సేన్ టార్గెట్ చేయడం లేదు. ఆకర్షణీయంగా ఉండే ఫిజిక్‌ను బట్టే వాళ్లను రప్పించుకుంటున్నాడు. ముఖం.. కాళ్లు మినహాయించి కేవలం శరీరాన్ని మాత్రమే నగ్నంగా చిత్రీకరించి పంపినట్లు తెలుస్తోంది. ఒక సామాజిక కార్యకర్త ధైర్యం చేసి ఈ వ్యభిచార ముఠాను వెలుగులోకి తేగలిగారు. కలబురిగి ప్రాంతానికి గులాం.. వ్యభిచార గృహాల నిర్వాహకుడిగా ఓ అంచనాకి వచ్చారు. గులాం చెబితే.. వారం కిందట హుస్సేన్ పాతబస్తీ చేరాడు. బార్కస్ ఉంటున్న తన మరదలి ఇంట్లో అద్దెకు దిగాడు. ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన ఓ మహిళతో కలసి వ్యభిచార కార్యకలాపాలకు అనువుగా ఉండే యువతుల కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. కష్టాలు తొలగించే ఉపాయం తన వద్ద ఉందంటూ తన దగ్గరకు వచ్చే మహిళలకు, యువతులకు మాటలతో గాలం వేసేవాడు. తన గదిలో వాళ్లను నగ్నంగా ఫొటోలు తీశాడు. వాళ్ల శరీర సౌష్టవాన్ని బట్టి గులాం వారికి ధర నిర్ణయించేవాడని వాట్సాప్ ఛాటింగ్‌ల ఆధారంగా తేలింది. అలా వారం రోజుల వ్యవధిలోనే 10 మందికి పైగా మహిళల వివరాలు కలబురిగి చేరవేశాడు. వీరిలో పాతబస్తీకి చెందిన ఇద్దరు యువతులున్నట్టు తెలుస్తోంది. -
వ్యభిచార గృహంపై దాడి.. పశ్చిమ బెంగాల్ నుంచి యువతులను తీసుకువచ్చి
సాక్షి, వరంగల్: హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెడ్డికాలనీలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్‌రెడ్డి తెలిపారు. రెడ్డికాలనీకి చెందిన ఓ మహిళ అదే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు కుతాటి నందిని, విటులు మరిపెల్లి స్టిఫెన్, మరిపెల్లి పీటర్‌ను అరెస్ట్ చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. -
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వ్యభిచారం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ దేవరకొండ జయంత్‌కుమార్(27)తో పాటు బేగరి యాదయ్య(37) పట్టుబడ్డారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జి. వినయ్ పరారీలో ఉండగా మరో నిర్వాహకుడు యానాల శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..! -
గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి..
విజయనగరం క్రైమ్: స్థానిక కస్పా హైస్కూల్ సమీపంలో ఒక గ్రూప్ హౌస్‌లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. చదవండి: పుట్టినరోజు.. బయటకు వెళ్లి వస్తానని చెప్పి.. కస్పా హైస్కూల్ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల ఉక్కుపాదం
పెద్దాపురం (కాకినాడ): పట్టణంలో దర్గాసెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార గృహాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏప్రిల్‌లో పోలీసులు వ్యభిచార గృహాలపై విస్తృత దాడులు చేశారు. అప్పట్లో కొంతమంది వ్యభిచారులు, విట్లను అదుపులోకి తీసుకుని వారి డివిజనల్ మెజిస్టేట్ పెద్దాపురం ఆర్డీఓ ఎదుట హాజరుపర్చారు. దీంతో ఆర్డీఓ జేఎస్ రామారావు సత్వరమే ఆ గృహాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంలో వ్యభిచార నిర్వాహకులైన సిమ్మా సన్యాసిరావు, సిమ్మా బాపనమ్మ, దుక్కా నాగమణిలకు చెందిన గృహాలను సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. సోమవారం ఉదయం పెద్దాపురం తహసీల్దార్ జితేంద్ర, సీఐ అబ్దుల్ నబీ, ఎస్ఐ రావూరి మురళీమోహన్ సిబ్బందితో కలిసి వెళ్లి మూడు గృహాలకు తాళాలు వేసి సీల్ వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ నబీ మాట్లాడుతూ వ్యభిచార గృహాలపై దాడులు, సీజింగ్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మహిళతో ఒప్పందం.. ఇంట్లోనే వ్యభిచారం.. వచ్చిన డబ్బుల్లో సగం వాటా
హస్తినాపురం(హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... శారదానగర్ కాలనీ ఫేజ్–3లో ఉండే వరదవాణి(60) తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళ (36) వరదవాణికి పరిచయం అయ్యింది. చదవండి: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..! తాను వ్యభిచారం చేస్తానని, వచ్చిన డబ్బులో సగం ఇస్తానని ఒప్పందం చేసుకుంది. గురువారం రాత్రి వరదవాణి ఇంట్లో ఆ మహిళ వ్యభిచారం చేస్తుండగా, పోలీసులు దాడి చేశారు. మహిళతో పాటు భగవాన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1500 నగదును, 3 సెల్ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. -
ఫామ్ హౌస్‌లో గుట్టుగా వ్యభిచార గృహం.. బీజేపీ నేత అరెస్టు
లక్నో: ఫామ్ హౌస్‌లో అక్రమంగా వ్యభిచార గృహం నడుపుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మరాక్ను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు హాపుడ్ జిల్లాలో అరెస్టు చేశారు. అతడ్ని మేఘాలయ పోలీసులకు అప్పగించనున్నట్లు హాపుడ్ ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడుడైన బెర్నార్డ్‌కు చెందిన ఫామ్ హౌస్‌పై శనివారం రైడింగ్ చేశారు పోలీసులు. అక్కడ గుట్టుగా నడుపుతున్న వ్యభిచార గృహం నుంచి ఆరుగురు మైనర్లను కాపాడారు. ఈ కేసులో మొత్తం 73 మందిని అరెస్టు చేశారు. అనంతరం బెర్నార్డ్పై నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ చేశారు. అప్పటికే అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బెర్నార్డ్‌ను మేఘాలయలోని తురకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసినట్లు, ఆ రాష్ట్ర పోలీసులు అతడ్ని తీసుకువెళ్లేందుకు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చదవండి: ఫామ్ హౌసులో గుట్టుగా బీజేపీ నేత సెక్స్ రాకెట్.. 23 మంది మహిళలు, 73 మంది.. -
హైదరాబాద్: ఇంట్లోనే వ్యభిచారం.. ముగ్గురు అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మీర్‌పేట సర్వోదయనగర్ కాలనీకి చెందిన నిర్వాహకురాలు వాసిరెడ్డి సుధారాణి తన ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకురాలు సుధారాణి, దిల్సుఖ్నగర్ కృష్ణానగర్‌కాలనీకి చెందిన విటుడు గట్ల రాజు (37)తో పాటు ఓ యువతిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. సుధారాణి గతంలోనూ ఇదే కేసులో పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. కోర్టు భవనం -
Hyderabad: ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీసులు ఓ వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతలకుంటలోని అభ్యుదయనగర్ కాలనీలో వేముల కళ్యాణి (41) ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు కళ్యాణితోపాటు శ్రావణి (27) అనే యువతితో పాటు బహదూర్‌గూడకు చెందిన వినోద్‌కుమార్ (40)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: యూపీలో దారుణం.. అత్యాచార బాధితురాలిపై పోలీస్ లైంగిక దాడి -
హాస్టల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): కడప నగరంలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ సమీపంలో వ్యభిచార గృహంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు వరదచంద్రిక ప్రతిభా భారతిని, కడప బాలాజీనగర్‌కు చెందిన మహిళను, వెస్ట్ బెంగాల్ వర్దమాన్ జిల్లాకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. వీరితో పాటు విటులు వెంకటరమణ, రాం మనోహర్, వరసుబ్బారెడ్డిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.3450 నగదును, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి.. -
రియల్ ఎస్టేట్ వ్యాపారం.. మరోవైపు పేద యువతులు, మహిళలతో వ్యభిచారం
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్‌పేట లక్ష్మీనగర్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే పిల్లలమర్రి వేణు (33) ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ బద్యానాయక్ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం ఇంటిపై దాడి చేశాడు. ఈ దాడిలో నిర్వాహకుడు వేణుతో పాటు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన యువతి (24), వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన విటుడు కొల్లా బలరాముడు (52)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వెయ్యి రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఉపాధి పేరిట ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద యువతులు, మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు చదవండి: మహిళకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి లాగేందుకు యత్నం.. చివరికి -
ఉప్పల్: ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం.. నిర్వాహకురాలు అరెస్ట్
సాక్షి, ఉప్పల్: వ్యభిచార నిర్వాహకురాలిని ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్ ఎస్సై మధుసూదన్ తెలిపిన మేరకు.. ఉప్పల్ ఆదర్శ్‌నగర్‌లో ఉంటున్న కుర్రి అరుణ అలియాస్ అరుణారెడ్డి (36) ఇంట్లో ఒంటరిగా ఉంటూ వ్యభిచారం నిర్వహిస్తుందన్న సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో సోదాలు నిర్వహించి ఒక సెల్‌ఫోన్, కండోమ్ ప్యాకెట్లు, నగదును స్వాదీనం చేసుకొని నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: భార్య, బావమరిది పేర్లతో పే రోల్స్.. ఉద్యోగం మానేయడంతో అసలు విషయం బయటకు -
అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు
ఖిలా వరంగల్: వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన బోనాసి స్వర్ణలత అలియాస్ కావేరి కొన్నాళ్లుగా తన ఇంట్లో రహస్యంగా వ్యభిచారం సాగిస్తోంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్‌కు చెందిన ఒకరు, కాకినాడకు చెందిన మరో యువతిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం. చదవండి: లిప్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని.. ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు శివనగర్‌లోని ఆమె ఇంటిపై సోమవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళల్ని, ఖిలా వరంగల్‌కు చెందిన విటుడు స్వామిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.5,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కోసం మిల్స్ కాలనీ పోలీసులకు నిందితులను అప్పగించి నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సంతోష్, శ్రీనివాస్‌జీ తెలిపారు. -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్
సాక్షి, పటాన్చెరు టౌన్: వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై దాడిచేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం అమీన్పూర్ పరిధి నరేంద్రకాలనీలో ఓ అపార్ట్మెంట్లో మహిళ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి, విటులు జగదీశ్ సింగ్, మోహన్‌ను, ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పటేల్‌గూడ భెల్మెట్రో కాలనీలో మరో ఇంటిపై దాడిచేసి, విటుడు అరవింద్‌ను, ఓ యువతిని అదుపులోకి తీసుకుని, విటులు ముగ్గురిని రిమాండ్ తరలించినట్లు ఆయన తెలిపారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం..8 మంది అరెస్టు -
కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, కుత్బుల్లాపూర్: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడు, ఓ విటుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గత కొంతకాలంగా వెన్నెలగడ్డ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ వస్తున్నారు. అపార్ట్‌మెంట్‌కు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో గత నెలలో పలుసార్లు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. ఈ క్రమంలో పేట్‌బషీరాబాద్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మసాజ్ సెంటర్‌కు కస్టమర్ లాగా వెళ్లి కూపీ లాగారు. ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మరో ముగ్గురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని టెన్త్ విద్యార్థిని దారుణం.. -
పంజగుట్ట : హైటెక్ వ్యభిచారం, ఏడుగురు యువతుల అరెస్టు
-
హైటెక్ వ్యభిచారం, ఏడుగురు యువతుల అరెస్టు
పంజగుట్ట: గుట్టచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సోమాజీగూడ రాజ్ భవన్ రోడ్‌లోని పార్క్ హోటల్లో హైటెక్ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళలను రిస్కీ హోమ్‌కు తరలించారు. -
ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం
సాక్షి, కుషాయిగూడ: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ గుట్టును కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. నిర్వాహకురాలితో పాటుగా విటుడు, వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని అరెస్టు చేసిన ఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్న సునీతా మండల్ (40) అనే మహిళ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. విషయం తెలిసిన కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్వాహకురాలు సునీతా మండల్, విటుడు మహదేవ్‌తో పాటుగా వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు, బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు. గతంలో ఆమెపై జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయిందన్నారు. గురువారం కేసు నమోదు చేసి నిందితులను మేజిస్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు వివరించారు. చదవండి: KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి.. -
KPHB Colony: యువతులను బలవంతంగా వ్యభిచారంలోకి..
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: యువతులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతున్న ముఠాలోని ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ కాలనీ ధర్మారెడ్డి కాలనీఫేజ్ –1లోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ టీంతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులు దాడులు నిర్వహించారు. గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఆనంద్ (22), కేపీహెచ్‌బీకాలనీ ధర్మారెడ్డి కాలనీకి చెందిన మేకల కృపాకర్(29)లను అరెస్టు చేశారు. బాధితురాలిని రీహాబిలేషన్ సెంటర్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరికి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం -
నేరేడ్మెట్: చదువు కోసం వచ్చి.. వ్యభిచారం
సాక్షి, నేరేడ్మెట్: వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉంటూ డబ్బుల సంపాదన కోసం ఆన్లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్న టాంజానియా దేశానికి చెందిన యువతీ, యువకుడు కటకటాలపాలయ్యారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు సంయుక్తంగా చేసిన డెకాయ్ ఆపరేషన్‌లో ఆన్లైన్ వ్యభిచార కార్యకలాపాల గుట్టు రట్టు అయింది. నేరేడ్మెట్ సీఐ నర్సింహస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. టాంజానియా దేశానికి చెందిన యువతి(24), ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్(24) ఉన్నత విద్యనభ్యసించేందుకు గత ఏడాది జనవరిలో స్టడీ వీసాపై భారత్‌కు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సును పూర్తి చేశారు. వీసా గడువు ముగిసినా ఎఫ్ఆర్ఆర్ఓలో రెన్యూవల్ చేసుకోలేదు. కొంత కాలంపాటు తార్నాకలో నివసించిన వీరద్దరు రెండు నెలల క్రితం నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని జీకే కాలనీకి మకాం మార్చారు. భార్యాభర్తలుగా చెప్పుకొని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. మీట్–24 యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిర్వాహకురాలు/బాధితురాలైన యువతి తన అర్ధనగ్న ఫొటోలను అప్లోడ్ చేస్త తద్వారా కస్టమర్లను ఆకర్షించేది. తరువాత యాప్ ద్వారా చాటింగ్ చేసిన కస్టమర్లకు తన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చి, వారితో శృంగార సంభాషణ చేస్తూ ఇంటికి ఆహ్వానిస్తుంది. తరువాత వ్యభిచార కార్యకలాపాల్లో పాల్గొంటూ డబ్బులు సంపాదిస్తోంది. ఈ కార్యకలాపాలకు ఆమె స్నేహితుడు కబంగిలా వారెన్‌లు సహకరిస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాచకొండ సీపీ మహేష్‌భగవత్ పర్యవేక్షణలో మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ఆన్లైన్ వ్యభిచార గుట్టును రట్టు చేశారు. సోమవారం పోలీసులు ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. రెండు సెల్ఫోన్లు, పాస్‌పోర్టులను పోలీసులు సీజ్ చేశారని సీఐ చెప్పారు. చదవండి: వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్ -
వేశ్యవాటిక గుట్టురట్టు.. ఇద్దరు యువతులు, 3 విటుల అరెస్ట్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు యువతులు, ముగ్గురు విటులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గాయత్రినగర్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు సరితతో పాటు ఇద్దరు యువతులు, విటులు గాయత్రినగర్‌కు చెందిన కుంచా వెంకటరమణ (45), వనస్థలిపురం సాగర్కాంప్లెక్స్కు చెందిన విజల యాదగిరి(51), బడంగ్‌పేట ద్వారకాహిల్స్కు చెందిన నేలేటి శ్రీనివాసులు(51)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ర.10380 నగదు, 7 సెల్ఫోన్లు, ఒక బ్రెజా కారును సీజ్ చేసి అనంతరం మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. చదవండి: బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్ -
బార్లో వ్యభిచారం.. ఇద్దరు యువతులు, నిర్వాహకుల అరెస్ట్
సాక్షి, హస్తినాపురం: వ్యభిచారం నిర్వహిస్తున్న వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌పై వనస్థలిపురం పోలీసులు దాడి చేసి ఇద్దరు యువతులు, ఇద్దరు నిర్వాహకులను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మురళీమోహన్ సమాచారం మేరకు... వనస్థలిపురం సుష్మాసాయినగర్ కాలనీ విజయవాడ జాతీయ రహదారి పక్కనే వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రెస్టారెంట్‌పై ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. రెస్టారెంట్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న వి.అజయ్ (22), సెక్యూరిటీ గార్డు సుగమ బాగర్(35) ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తూ యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించారు. వీఎంఆర్ బార్ అండ్ రెస్టారెంట్లో కస్టమర్ల కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువతులను రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు ఆర్గనైజర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ -
అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం.. నలుగురు అరెస్ట్
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కేపీహెచ్‌బీ పోలీసులు ఆ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సమాచారం మేరకు... కేపీహెచ్‌బీకాలనీ మొదటి ఫేజ్‌లోని ఈడబ్ల్యూఎస్ 702 గృహంలో కొన్ని రోజులుగా కొందరు అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిన్నారు. సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడిచేసిన పోలీసులు ముగ్గురు యువకులను, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోమ్‌కు తరలించి యువకులు సురదామసీను, రాయగిరి హరిప్రసాద్, సునీల్ జన్నాలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు యువతుల అరెస్ట్
సాక్షి, నాగోలు: గుట్టుచప్పుడు కాకుండా హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న అయిదుగురిని సోమవారం రాత్రి ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఆరెస్టు చేవారు. ఎల్బీనగర్ నుంచి సరూర్‌నగర్ పాత రోడ్డులోని హోటల్ ఏబీ7 రెసిడెన్సీలో కొన్నాళ్ల నుంచి కూకట్‌పల్లికి చెందిన ముత్తవరపు శివ, సలీం ఇద్దరు గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బాలాపూర్ గుర్రంగూడలో ఉండే కొమ్మోల్ల ప్రశాంత్ వారి కింది సబ్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు సోమవారం రాత్రి హోటల్‌పై దాడి చేసి నలుగురు యువతులను, సబ్ ఆర్గనైజర్ ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ప్రధాన నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లాడ్జీలో వ్యభిచారం.. యువతి, ఆర్గనైజర్ల అరెస్ట్ -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
కర్నూలు: కర్నూలు నగరం మాధవీనగర్ శివారులోని స్టేట్‌బ్యాంక్ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మూడో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. డోన్ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి కొంత కాలంగా స్టేట్ బ్యాంక్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. అలాగే విటుడు జాకీర్‌హుసేన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్వాహకుడు వెంకటేశ్వర్లుతో పాటు కీర్తిపై కేసు నమోదు చేశారు. అయితే కీర్తి పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు మిడుతూరు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మిడుతూరు ఎస్సీకాలనీకి చెందిన అహల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి కొన్నాళ్లుగా మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ చెన్నయ్య ఆదివారం తెలిపారు. చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ... విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం.. -
వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం..
సాక్షి, చైతన్యపురి: వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలోని మరో ఇద్దరిపై చైతన్యపురి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన అల్లని శ్యాం (49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య (32) హైదరాబాద్‌కు వచ్చి సులువుగా డబ్బు సంపాదించేందుకు లొకాంటో వెబ్సైట్లో యువతుల అర్ధనగ్న చిత్రాలు పెట్టి ఆన్లైన్ ద్వారా వ్యభిచారం ప్రారంభించాడు. పేదలు, కార్మికుల, ఒంటరి మహిళలకు డబ్బు ఆశచూపి వారి ద్వారా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. మార్చి నెలలో అల్కాపురిలోని ఓ అపార్టుమెంటులో పోలీసులు దాడి చేసి నిర్వహకులతో పాటు పలు యువతులను రక్షించారు. అనంతరం నిందితులు ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఇద్దరి పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.41లో ఉన్న డాల్ఫిన్ హోటల్ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహా నిర్వాహకుడు అశ్విన్‌తో పాటు కస్టమర్లు సికింద్రాబాద్ జీవిరెడ్డి కాలనీ అల్వాల్‌కు చెందిన వ్యాపారి రాహుల్సురాన(32) కూకట్పల్లి నిజాంపేట వెంటెక్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే వెంకట అప్పయ్య దాసరి(44)లను అరెస్టు చేశారు. అలాగే గ్వాలియర్, గుజరాత్‌లోని వడోదరకు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సెక్స్ వర్కర్లను పునరావస కేంద్రానికి తరలించారు. -
వేశ్యావాటిక గుట్టురట్టు; బంగ్లాదేశ్ నుంచి తీసుకొచ్చి
బనశంకరి: బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా తీసుకువచ్చి బెంగళూరులో పడుపువృత్తి నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురిని సోమవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్లో వేశ్యవాటిక నడుస్తున్నట్లు తెలిసి దాడులు చేశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన నౌషద్‌అలీ, స్వరూప్, సమీర్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 11 నకిలీ ఆధార్ కార్డులను సీజ్ చేశారు. ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను కాపాడారు. మహిళలకు బెంగళూరులో మంచి ఉపాధిని చూపిస్తామని ఇక్కడకు తీసుకొచ్చి బలవంతంగా వేశ్యావృత్తి చేయించేవారని తేలింది. అత్యాచారం చేయడానికి వచ్చి హత్య బొమ్మనహళ్లి: మహిళను హత్య చేసిన కేసులో ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈనెల 10న బేగూరు సమీపంలోని సుభాష్ నగరలో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ చాంద్ భార్య షహినాతాజ్ (40) దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అదే ప్రాంతానికి చెందిన అక్రమ్ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం చేయడానికి వచ్చి.. ఇంటిలో ఒంటరిగా ఉన్న షహినాతాజ్పై అత్యాచారం చేయడానికి వచ్చిన అక్రమ్ ఖాన్ ఆమె గట్టిగా కేకలు వేయడంతో చాకుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన చాంద్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానితులను విచారణ చేస్తున్న సమయంలో అక్రమ్ ఖాన్ కొంచెం అనుమానాస్పదంగా కనిపించడంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: యువ దంపతుల ఆత్మహత్య -
గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం.. ఇద్దరు విటులు, యువతుల అరెస్టు
సాక్షి, గోల్కొండ: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గెస్ట్ హౌస్‌పై గోల్కొండ పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ వాచ్‌మెన్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేశారు. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అలియాస్ మున్నాభాయ్ షేక్‌పేట్ ఓయూ కాలనీలో ‘ఎంఎస్పీ గెస్ట్ ఇన్’గెస్ట్ హౌజ్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. గెస్ట్‌హౌజ్‌ను బాగా ఇంటీరియర్ డెకరేషన్ చేసి ఇంటి ముందు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించుకున్నాడు. కాగా ఇతర ప్రాంతాల నుంచి యువతులను తెచ్చి వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే బుధవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులతో పాటు గెస్ట్‌హౌజ్ వాచ్మెన్ జనైనాజెమ్ ఉద్దీన్ మలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు మున్నాభాయ్ పరారీలో ఉన్నాడు. వాచ్‌మెన్‌తో పాటు పట్టుబడ్డ వి.శ్రీను, గొలుసుల శ్రీనివాస్‌లను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు వారి నుంచి రూ.4వేల నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాడు. వ్యభిచార ముఠా సభ్యులపై పీడీయాక్ట్ చైతన్యపురి: సులువుగా డబ్బు సంపాదన కోసం వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా సభ్యులపై సరూర్ నగర్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల మానస, వల్లపు మల్లికార్జున్, పోకల లింగయ్యలు ఒక ముఠాగా ఏర్పడి తెలుగు రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి వ్యభిచార గృహం నడుపుతున్నారు. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు వారం రోజుల క్రితం ఇంటిపై దాడి చేశారు. మానస, మల్లికాఖార్జులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న పోకల లింగయ్యను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: హైటెక్ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్న సమాచారం అందుకున్న పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ గురువారం ఉదయం నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీఐ బాజీలాల్ చెప్పారు. సెక్స్ వర్కర్లకు హెచ్ఐవీ పరీక్షలు, ఇతర సలహాలు ఇచ్చే ముమ్మిడివరానికి చెందిన ఓ మహిళ ఇటీవల అమలాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న కడియం రవితో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలసి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి కొందరిని తీసుకువచ్చి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం రావడంతో సీఐ బాజీలాల్, ఎస్సై సురేష్‌బాబు ఆ గృహంపై దాడిచేసి ఒక అమ్మాయి, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నిర్వాహకులు పట్టుబడ్డారు. అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లికి చెందిన గెడ్డం ప్రసాద్, అల్లవరం మండలం మొగళ్లమూరుకు చెందిన తాడి పౌలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరకారని సీఐ చెప్పారు. పట్టుబడ్డ అమ్మాయిని మహిళా సంరక్షణాలయానికి పంపిస్తామన్నారు. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళతో పాటు రవితో పాటు ప్రసాద్, పౌలులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. చదవండి: ప్లీజ్ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు ఫేస్బుక్ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని.. -
మ్యాచింగ్ సెంటర్ ముసుగులో.. యువతులను మభ్యపెట్టి!
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు, ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.సుప్రజ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో (0) లైనులో నివాసం ఉండే షేక్ లాల్‌బీ అలియాస్ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్ ట్రావెల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షాపునకు వచ్చే చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంలో దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్షి్మ, ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. మరెక్కడైనా ఇటువంటి వ్యభిచార గృహాలు ఉంటే డయల్ 100, లేక వెస్ట్ డీఎస్పీ ఫోన్ నంబర్ 86888 31330కు సమాచారాన్ని అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో నగరంపాలెం పీఎస్ ఎస్‌హెచ్‌వో ఎ.మల్లిఖార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: సూకీకి 5 లక్షల డాలర్లు లంచమిచ్చా ఎల్బీనగర్ వ్యభిచారం గుట్టురట్టు -
బంజారాహిల్స్‌లో వ్యభిచారం గుట్టురట్టు..
సాక్షి, బంజారాహిల్స్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడులు చేసి ఇద్దరు సెక్స్ వర్కర్లతో పాటు నలుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మనోజ్ ప్రకాశ్ బాసి(40), రమేష్ పటేల్(24)లు కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఆనంద్ బంజారా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి చెఫ్ ప్రశాంత్గౌడ(28), గురు(30), లోకేష్గౌడ(32), అభిషేక్(27)లతో పాటు ఇద్దరు ఆర్గనైజర్లను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెక్స్ వర్కర్లిద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మల్కాజిగిరిలో వ్యభిచార గృహంపై దాడి
సాక్షి, హైదరాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న మహిళను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర లాతూర్కు చెందిన పూజా కాంబ్లే(40) మల్కాజిగిరి సాయి నగర్లో నివాసముంటూ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుంది. విలాస జీవితానికి అలవాటు పడ్డ ఆమె గత కొంత కాలంగా ఇతర రాష్ట్రాల యువతులను తీసుకువచ్చి తను ఉంటున్న అద్దె ఇంట్లో వ్యభిచారాన్ని నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారంతో మంగళవారం రాత్రి ఆమె ఇంటిపై పోలీసులు దాడిచేసి నిందితురాలిని రిమాండ్‌కు, ఆమెతో పాటు ఉన్న యువతిని హోంకు తరలించారు. మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ -
మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్
సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిని మీర్ పేట పోలీసులు బాలాపూర్ మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో సీజ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మీర్‌పేట ఆర్ఎన్రెడ్డినగర్ టీకేఆర్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభి చారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 5వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సమక్షంలో సదరు ఇంటిలోని మొదటి అంతస్తును సీజ్ చేశారు. -
పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండ వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో కాలపత్తర్ పోలీసులు దాడి చేశారు. (అదనపు కలెక్టర్ నగేశ్ బాగోతం) ఈ దాడిలో ఇద్దరు నిర్వహకులతో పాటు, ఒక విటుడు, 7మంది బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని రెస్క్యూ చేశారు. 32 వేల నగదు, 3 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలైన మిస్కిన్, తరన్నుమ్ గత కొన్ని రోజులగా ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. బాధిత యువతుల్లో ఇద్దరు వెస్ట్ బెంగాల్, ఒకరు కర్ణాటకకు కాగా.. మిగిలిన వారు పాతబస్తీకి చెందిన వారిగా గుర్తించారు. దాడిలో పట్టుబడిన నిర్వాహకుటు, విటుడిపై కేసు నమోదు చేసి బాధిత మహిళలను హోమ్‌కు తరలించారు. -
వ్యభిచార గృహంపై దాడి.. దంపతులు అరెస్టు
సాక్షి, ఖమ్మం : ఖమ్మంలోని సాయి గణేశ్ నగర్లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఇద్దరు విటులు, ఆటో డ్రైవర్ సహా మొత్తం ఐదుమందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఓ ఇంట్లో వ్యభిచారం జరగుతుందనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు వ్యభిచార గృహ నిర్వాహకులైన భార్యభర్తలను కూడా అరెస్టు చేశారు. దంపతులతో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ప్రొద్దుటూరు క్రైం :గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఇరువురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడగలిగారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన బింగిప్రసాద్ హోటల్ నడుపుకొని జీవనం సాగించేవాడు. అలాగే ఇతని స్నేహితుడు జంబులదిన్నె బాలకృష్ణ మైదుకూరు రోడ్డులో ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహించేవాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి వ్యభిచారం గృహం నడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా నంద్యాల నుంచి అమ్మాయిలను పిలిపించేవారు. నంద్యాల, బెంగుళూరులకు చెందిన యువతులకు డబ్బు ఎర చూపి, ఇక్కడికి రప్పించి వ్యభిచారం నిర్వహించేవారు. ఈ క్రమంలో రామేశ్వరంలోని ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్ఐలు చిన్నపెద్దయ్య, ఖాన్ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. నిర్వాహకులతో పాటు పట్టణానికి చెందిన గుర్రంపాటి వేణుగోపాల్‌రెడ్డి, బద్వేలి గురుప్రసాద్రెడ్డిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 35 వేల 430 నగదును స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం గుట్టు రట్టు చేసిన సీఐ, ఎస్ఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
విలేకరుల పేరుతో మోసం
ఒంగోలు క్రైం: వ్యభిచార గృహం నిర్వాహకురాలు, అందులో వ్యభిచరిస్తున్న వారితో పాటు విలేకరుల పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితులను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక తాలూకా పోలీసుస్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను సీఐ గంగా వెంకటేశ్వర్లు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. శక్తి చానల్ స్టాఫ్ రిపోర్టరని చెప్పుకునే కందుకూరి మల్లేశ్వరి తన చానల్లో పనిచేస్తున్నారంటూ ముగ్గురిని తీసుకొని నగరంలోని సమతానగర్ నాలుగో లైన్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. వ్యభిచారం గృహానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసిన కందుకూరి మల్లేశ్వరితో పాటు రిపోర్టర్ అన్నపురెడ్ది శివప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ అన్నపురెడ్డి శేఖర్, యాడ్స్ ఇన్చార్జి అన్నపురెడ్డి కోటేశ్వరరావులను అరెస్టు చేశారు. వీరితో పాటు వ్యభిచార గృహం నిర్వహస్తున్న వేలుపూరి నాగజ్యోతి, వ్యభిచరించేందుకు వెళ్లిన మురళీకుమార్, నాగిరెడ్డి, పేరిరెడ్డిలను కూడా అరెస్టు చేశారు. సమతానగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకున్న స్టాఫ్ రిపోర్టర్ కందుకూరి మల్లేశ్వరి.. తన వద్ద పనిచేసే ముగ్గురిని తీసుకొని ఇంట్లోకి ప్రవేశించి తొలుత వీడియో తీసింది. టీవీలో ప్రసారం చేస్తామని, దీంతో పరువుపోతుందని బెదిరించింది. టీవీలో ప్రసారమైతే పోలీసులు కేసు నమోదు చేస్తారని, చివరకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించింది. భయపడిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించింది. మల్లేశ్వరి రూ.50 వేలు డిమాండ్ చేసింది. చివరకు రూ.20 వేలకు అంగీకారం కుదిరింది. డబ్బులు ఇచ్చిన అనంతరం వేలుపూరి నాగజ్యోతికి అనుమానం వచ్చి జర్నలిస్టు గుర్తింపు కార్డులు చూపాలని కోరింది. కార్డులు చూపకుండా వాహనాలపై వెళ్లిపోయారు. నాగజ్యోతితో పాటు వ్యభిచార గృహంలో ఉన్న ముగ్గురు యువకులు వాహనాలపై వారి వెంటపడ్డారు. చివరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను వెంబడించి పట్టుకున్నారు. అందరిపై కేసు నమోదు చేసి ఒంగోలు కోర్టులో న్యామూర్తి ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, తాలూకా పోలీసులు పాల్గొన్నారు. -
వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి
సాక్షి, విజయవాడ: నగరంలోని సింగ్‌నగర్ అమెరికన్ హాస్పిటల్ సమీపంలో ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు ఆ ఇంట్లో నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. 11 మంది విటులను అరెస్టు చేసి, రూ.30,800 నగదు, 8 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మురళీధర్, సీఐ ఆర్.సురేష్‌రెడ్డి ఈ దాడి చేశారు. -
సినిమాల్లో అవకాశం కోసం వ్యభిచారం
- పోలీసులకు చిక్కిన ఇంజినీరింగ్ యువతి సాక్షి, బంజారాహిల్స్ : వెండితెర మీద వెలిగిపోవాలన్న కోరిక.. ఎలాగైనా సినిమాల్లో రాణించాలనే తపన.. వీటికి ఆర్థిక ఇబ్బందులు అడ్డొచ్చాయి. వాటి నుంచి బయటపడి కలల లోకాన్ని చేరుకునేందుకు ఆమె తప్పుడు మార్గాన్ని ఎంచుకొని పోలీసులకు చిక్కింది. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న యువతి వ్యభిచార గృహంలో పోలీసులకు దొరికిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్ఎన్ నగర్లో నాగభాస్కర్ అలియాస్ విక్కి కొంత కాలంగా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. పి.సాయి దుర్గాప్రసాద్ అలియాస్ కార్తీక్, పి.ధర్మ అనే ఇద్దరు ఆయనకు అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఎంచుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అడిగినంత డబ్బు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ అందమైన అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని కోరిక ఉందని దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు లేవని చెప్పడంతో వీరు ఆమెను ట్రాప్ చేశారు. సినిమా షూటింగ్ కోసమంటూ అందమైన ఫొటోలు తీశారు. విషయం ముందుగానే చెప్పి ఆ ఫొటోలను కొందరు యువకులకు పోస్ట్ చేసి బేరం పెట్టారు. ఇంకేముంది చాలా మంది ఆమె కావాలన్నారు. రెండు రోజుల క్రితం ఎల్ఎన్నగర్లోని వ్యభిచార గృహంపై దాడి చేసిన సమయంలో ఆమె పోలీసులకు చిక్కింది. ఆమె వివరాలు రాబట్టగా ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తేలింది. ఆమెతో పాటు ముంబైకి చెందిన మరో మోడల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని నింబోలి అడ్డాలోని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉండగా అసిస్టెంట్లు కార్తీక్, ధర్మాలను ఐపీసీ సెక్షన్ 370, 370ఏ, పీటా యాక్ట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వ్యభిచారం కేసులో మంత్రి పీఎస్ అరెస్ట్
బెంగళూరు (బనశంకరి) : వేశ్యా కేంద్రంపై శనివారం సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడుకు చెందిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో పాటు 11 మందిని అరెస్ట్ చేశారు. వివరాలు... బాణసవాడి సమీపంలోని ఓ లాడ్జీలో వేశ్య కేంద్రం నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి తమిళనాడు రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి బాలకృష్ణారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి సత్యనారాయణతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ఐదుగురు యువతులను పోలీసులు కాపాడారు. బానసవాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యభిచారం గృహంపై దాడులు..
బెంగళూరు(బనశంకరి) : అరేహళ్లి లోని ఏజీఎస్లేఔట్లోని ఓ ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యావాటికపై సీసీబీ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఏజీఎస్ లేఔట్ కు చెందిన శోభ, నరేశ్ అనే యువకుడిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని పోలీసులు రక్షించారు. యువతులకు డబ్బు ఆశ చూపించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసిందని, నిందితులపై సుబ్రహ్మణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా నగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. -
హైదరాబాద్ లో బ్రోతల్ హౌస్ గుట్టురట్టు!
హయత్‌నగర్: ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్ గుట్టురట్టయింది. ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ఓ మహిళ, విటున్ని అరెస్ట్ చేశారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. బహదూర్‌పురాకు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
వ్యభిచార గృహంపై దాడి: 9మంది అరెస్ట్
సైదాబాద్: నగరంలోని ఓ వ్యభిచార గృహంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె.సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం టూఆర్టీ క్వార్టర్స్ లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. ఈ మేరకు నిర్వహించిన దాడిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు చేసినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. -
వ్యభిచార గృహంపై దాడి: ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్న ఓ వ్యభిచార గృహంపై ఎస్వోటీ పోలీసులు శనివారం మధ్యాహ్నం మెరుపు దాడికు దిగారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో మల్కాజిగిరి పరిధిలోని శివనగర్‌లోని ఓ ఇంటిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించారు. -
వ్యభిచార కేంద్రంపై దాడి: ఇద్దరి అరెస్టు
గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఓ వ్యభిచార కేంద్రంపై మలక్‌పేట పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ అల్లూరి గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన భగవతి రామ్‌చందానీ(55) సలీంనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రెండు నెలలుగా వ్యభిచార కేంద్రం నడుపుతోంది. ఫోన్ ద్వారా కస్లమర్లకు వల వేస్తుంటారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సీఐ తన సిబ్బందితో వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. రూ.4,000 స్వాధీనం చేసుకుని, నిర్వాహకురాలు భగవతి రామ్‌చందానీ, మరో మహిళ (35)ను అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి..
♦ నాలుగు నెలల క్రితం ♦ ఇద్దరు బాలికల అదృశ్యం ♦ పోలీసుల అదుపులో నిందితులు ఇల్లెందు: ఖమ్మం జిల్లా గుండాల గిరిజన బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన బాలికలు నాలుగు నెలల తర్వాత ఓ వ్యభిచార గృహంలో తేలారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డీఎస్పీ ఆర్. వీరేశ్వరరావు వివరాలు వెల్లడిం చారు. గుండాల గిరిజన బాలికల హాస్టల్లో చదివే ఓ బాలి కకు ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన ఇస్లావత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో కిషో ర్ ఆ బాలికకు మోసం చేశాడు. ఆ తర్వాత అతడు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కిషోర్‌పై కోపంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాలిని తీసుకొని గత డిసెంబర్ 16న హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. వారు వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. అక్కడ వారికి పరిచయమైన ఇద్దరు మహిళలు పని కల్పిస్తామని ఖమ్మం జిల్లా కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్వతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలో దింపాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. దీంతో వారిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు యాదగిరికి అమ్మేశారు. యాదగిరి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలో దింపాడు. విటుడిగా వచ్చిన ఓ వ్యక్తి వద్ద నున్న ఫోన్ సహాయం తో తన సోదరికి జరిగిన విష యం.. తాము ఎక్కడున్నది చెప్పింది. భయపడిన యాదగిరి ఆమెను పంపించి వేశాడు. దీంతో ఆమె నేరుగా మహబూబాద్ సమీపంలో ఉంటున్న తన సోదరి వద్దకు వచ్చి గుండాల సీఐని ఆశ్రయించింది. ఖమ్మం పోలీసులు కందుకూరులోని వ్యభిచార గృహంపై దాడి చేసి మరో విద్యార్థిని విడిపించి యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. -
వ్యభిచార గృహంలో యువతి నిర్బంధం
రాజమండ్రి రూరల్ : ఓ గృహంలో యువతిని నిర్బంధించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న నిర్వాహకురాలిని పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఆ యువతికి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం ప్రకారం.. లాలాచెరువు స్పిన్నింగుమిల్లు కాలనీ వినాయకుడిగుడి సమీపంలో ఎం.వసంతకుమారి వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. వసంతకుమారితోపాటు కోర్లమ్మపేటకు చెందిన స్టేజ్షోల డ్యాన్సర్ దారపు దుర్గకూడా వ్యభిచార వృత్తి చేసేది. 15రోజుల క్రితం రాజమండ్రి మెయిన్‌రోడ్డులో దారపు దుర్గ కోరుకొండ మండలానికి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకుంది. ఆ యువతికి తెలిసిన వారింటికి వెళ్దామని చెప్పి ఆమెను వసంతకుమారి ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి దారపు దుర్గ వెళ్లిపోయింది. వసంతకుమారి ఆ యువతిని నిర్బంధించి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. ఒకరోజు ఇద్దరు విటులను తీసుకొచ్చి వారిని ఆ యువతి వద్దకు పంపింది. ఆ సమయంలో యువతి ఏడవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారికి వసంతకుమారి కదలికలపై అనుమానం వచ్చింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి వసంతకుమారి గృహంపై బొమ్మూరు ఇన్స్పెక్టర్ కనకారావు, సిబ్బందితో కలిసి దాడిచేశారు. యువతిని ఆమె చెర నుంచి విడిపించారు. వసంతకుమారిని అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ కనకారావు వసంత కుమారిని సోమవారం రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. ఈకేసులో దారపు దుర్గను అరెస్టు చేయాల్సి ఉందని, యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగించామని కనకారావు తెలిపారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ అవుతాపురం గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఓ ఇంటిపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు యువకులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బండ అవుతాపురం గ్రామానికి చెందిన వల్లిపాషా, రెడ్డిపాలెంకు చెందిన వెంగళ్‌రెడ్డి స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో హాస్టళ్లలో ఉండే ముగ్గురు యువతులను తీసుకుని వీరు ఆదివారం బండ అవుతాపురం గ్రామంలో ఓ ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు యువకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కలిసి వ్యభిచారం నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ముగ్గురు యువతులతో పాటు వల్లిపాషా, వెంగళ్‌రెడ్డి, లక్ష్మణ్, రవీందర్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. యువతులకు కౌన్సెలింగ్ నిర్వహించి విడిచిపెట్టగా... మిగిలిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. (వర్ధన్నపేట) -
వేశ్యవాటికపై దాడి, బంగ్లాదేశ్ యువతికి విముక్తి
భూపసంద్ర మెయిన్ రోడ్డు, వినాయక లేఔట్‌లోని అద్దె ఇంటిలో నిర్వహిస్తున్న వేశ్యవాటికపై బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు నిర్వహిం చి వ్యభిచార కూపంలో మగ్గుతున్న బంగ్లాదేశ్ యువతికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా వేశ్యవాటిక నిర్వాహకుడైన మండ్య జిల్లా కిక్కేరి తాలూకా కళ్లేనహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఇతర ప్రాంతాలనుంచి విటులను ఆకర్షించి వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. యువతిని మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించి నిందితుడిపై సంజయ్‌నగర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. -
భార్యను వేశ్యాగృహానికి అమ్మబోయిన వ్యక్తి అరెస్టు
సాక్షి, ముంబై: సొంత భార్యనే కామాటిపురలోని వేశ్యాగృహానికి అమ్మబోయిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తెలిపి ఆ మహిళను రక్షించింది అక్కడి వేశ్యావృత్తిలో మగ్గుతున్నవారేనని నాగ్పాడా పోలీసులు తెలిపారు. ఆమెకు రెండు నెలల పాప కూడా ఉందన్నారు. సలావుద్దీన్‌తోపాటు అతని మొదటి భార్యకు కూడా ప్రమేయం ఉండడంతో ఇద్దరినీ బుధవారం సాయంత్రం అరెస్టు చేశామన్నారు. నాగ్పాడాకు చెందిన ఓ మహిళను ఆమె భర్త సలావుద్దీన్ ఖాన్ కామాటిపురలోని వేశ్యాగృహానికి రూ. 40 వేలకు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. సలావుద్దీన్ మొదటి భార్య ఆస్మా ఖాన్ ప్రమేయంతోనే ఆమెను వేశ్యగృహాలకు అమ్మబోయాడు. అతని భార్యనే ఇలా విక్రయిస్తున్నారని తెలుసుకున్న వేశ్యాగృహానికి చెందిన కొందరు రూ.20 వేలు ముందుగా ఇస్తామని పేర్కొని అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సలావుద్దీన్‌తోపాటు అతని మొదటి భార్య ఆస్మాను అరెస్టు చేశారు.