
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండ అవుతాపురం గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న ఓ ఇంటిపై పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు యువకులతో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బండ అవుతాపురం గ్రామానికి చెందిన వల్లిపాషా, రెడ్డిపాలెంకు చెందిన వెంగళ్‌రెడ్డి స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో హాస్టళ్లలో ఉండే ముగ్గురు యువతులను తీసుకుని వీరు ఆదివారం బండ అవుతాపురం గ్రామంలో ఓ ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు యువకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా కలిసి వ్యభిచారం నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి ముగ్గురు యువతులతో పాటు వల్లిపాషా, వెంగళ్‌రెడ్డి, లక్ష్మణ్, రవీందర్, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. యువతులకు కౌన్సెలింగ్ నిర్వహించి విడిచిపెట్టగా... మిగిలిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు.
(వర్ధన్నపేట)