![AR Constable Arrested For Running Prostitution At Banjara Hills - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/20/Prostitution.jpg.webp?itok=H-OIjvE0)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వ్యభిచారం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ దేవరకొండ జయంత్‌కుమార్(27)తో పాటు బేగరి యాదయ్య(37) పట్టుబడ్డారు.
వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జి. వినయ్ పరారీలో ఉండగా మరో నిర్వాహకుడు యానాల శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు.
చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..!
Comments
Please login to add a commentAdd a comment