armed reserve
-
వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని నవోదయ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వ్యభిచారం చేస్తూ ఏఆర్ కానిస్టేబుల్ దేవరకొండ జయంత్‌కుమార్(27)తో పాటు బేగరి యాదయ్య(37) పట్టుబడ్డారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జి. వినయ్ పరారీలో ఉండగా మరో నిర్వాహకుడు యానాల శ్రీనివాస్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. చదవండి: ఫుడ్ డెలివరీకి వెళ్లి ఇదేం పాడుపని.. యువతిని బలవంతంగా..! -
730 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు ఏఆర్‌కు మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) మార్పు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల కొత్తగా 3,805 మంది బెటాలియన్‌లో చేరడంతో 2005, 2006, 2007 బ్యాచ్‌లకు చెందిన 730 మంది కానిస్టేబుళ్లను టీఎస్ఎస్పీ శుక్రవారం రిలీవ్ చేసింది. వీరంతా శనివారం వారికి కేటాయించిన జిల్లా యూనిట్లలో రిపోర్టు చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలను గతేడాది డిసెంబరులోనే ప్రభుత్వం జారీ చేసినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా అవి అమలు కాలేదు. 2008, 2009 బ్యాచ్‌ల కానిస్టేబుళ్ల ఏఆర్ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను కూడా ఉన్నతాధికారులు ఆమోదించారని సమాచారం. -
సెంట్రీగా ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: పోలీసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాలతో పాటు పోలీసు కమిషనరేట్‌కూ నిత్యం పహారా అవసరం. ఈ విధులు నిర్వర్తించే వారినే పోలీసు పరిభాషలో సెంట్రీలని అంటారు. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లే సెంట్రీలుగా ఉండేవారు. అయితే రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ అధికారులు.. ఈ విధుల్లో మహిళల్నీ వినియోగించుకోవాలని నిర్ణయించారు. మొదట బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఉమెన్ సెంట్రీలను ఏర్పాటుచేశారు. గతంలో పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది కొరత తీవ్రంగా ఉండేది. గడిచిన కొన్నేళ్లలో జరిగిన పోలీసు రిక్రూట్మెంట్స్లో మహిళలకు 33 శాతం కోటా ఇవ్వడంతో వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన కానిస్టేబుళ్లలో ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే 24 గంటలూ విధుల్లో ఉండాల్సిన సెంట్రీ డ్యూటీలు వీరికి అప్పగించడంపై అధికారులు దృష్టిపెట్టలేదు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఉన్నతాధికారులకు ప్రత్యేక విధులు, ఏరియాలు కేటాయించారు. ఇందులో భాగంగా ఓ మహిళా ఉన్నతాధికారిణికి ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లతో స్పెషల్ పార్టీ కేటాయించారు. నిత్యం ఆమె వెంట ఉంటూ అవసరమైన సందర్భాల్లో కేటాయించిన విధులు నిర్వర్తించడమే ఈ టీమ్ లక్ష్యం. ఆ సమయంలోనే ఏఆర్ మహిళా సిబ్బంది ప్రతిభాపాటవాలపై సదరు అధికారిణికి స్పష్టత వచ్చింది. దీంతో ఆమె ‘ఉమెన్ సెంట్రీ’ఆలోచనకు రూపమిచ్చారు. ప్రాథమికంగా కమిషనరేట్‌కు 4+1 చొప్పున నలుగురు మహిళా ఏఆర్ కానిస్టేబుళ్లు, ఒక హెడ్–కానిస్టేబుల్‌ను కేటాయించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ మూడు గంటల చొప్పున రొటేషన్‌లో రోజుకు ఆరు గంటలు విధుల్లో ఉంటారు. వీరిని హెడ్–కానిస్టేబుల్ పర్యవేక్షిస్తారు. ఉమెన్ సెంట్రీల ఏర్పాటు మంచి ఆలోచనగా చెబుతున్న అధికారులు.. భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇతర కార్యాలయాలు, పోలీసుస్టేషన్లకు విస్తరించాలని భావిస్తున్నారు. -
ఛీ.. ఇదేం పనయ్యా కానిస్టేబుల్!
ఉప్పల్ : క్రికెట్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్మ్డ్ కానిస్టేబుల్ డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. శనివారం ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురానికి చెందిన జె.మోహన కృష్ణ (36) అక్కడే ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. జనగాం జిల్లా వాసి సోమయ్య(36), నల్లగొండజిల్లా వాసి బానోతు యాదగిరి(24), బానోతు రా జుతో కలిసి నర్సీపట్నంలో గంజాయిని కిలో రూ. 2 వేలకు కొనుగోలు చేసి నగరంలో రూ.8 వేలుకు విక్రయిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మోహన కృష్ణ తన కారుకు పోలీస్ అనే స్టిక్కర్ అతికించుకొని దందా సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తన బృందంతో శుక్రవారం రాత్రి ఉప్ప ల్ నల్ల చెరువు కట్టమీద మాటువేసి మో హన కృష్ణ కారును పట్టుకున్నారు. కారు లో పొట్లాల రూపంలో ఉన్న 200 కిలోల గంజాయి దొరికింది. ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, కారు, 2 సెల్ఫోన్లు.. మొత్తం రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించగా, బానోతు రాజు పరారీలో ఉన్నాడు. -
వైరస్ బారినపడి ఏఆర్ డీఎస్పీ మృతి
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పీఎస్.శశిధర్ (50) మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1996 బ్యాచ్ ఆర్ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన ఆయన బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్, కరీంనగర్, సిరిసిల్లలో పనిచేశాక పదోన్నతిపై డీఎస్పీగా మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయానికి 2019 ఫిబ్రవరి నెలలో వచ్చారు. కాగా, శశిధర్ మృతి పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎస్పీ కోటిరెడ్డి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఆర్మ్డ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్
విజయనగరం టౌన్: జిల్లాలో పని చేస్తున్న ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ రీత్యా ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ పాలరాజు పేర్కొన్నారు. ఆర్మ్డ్ సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆర్మ్డ్ రిజర్వు సిబ్బందితో బుధవారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది ఉద్యోగ రీత్యా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పట్ల సానుకూలంగా స్పందించి, పలు సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించి, అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, ఏఆర్డీఎస్పీ ఎస్.హనుమంతు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎస్వి.అప్పారావు, గురునాథరావు, శ్రీహరిరావు, రామకృష్ణ, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్విఆర్.సింహాచలం (రామా), పలువురు ఏఆర్ ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు... దూర ప్రాంతాలకు సబ్‌జైల్, సెంట్రల్ జైల్ నుంచి ముద్దాయిలను విచారణ నిమిత్తం వివిధ కోర్టులలో హాజరు పర్చేందుకు తీసుకుని వెళ్లడం, మళ్లీ వారిని ఆయా జైళ్లకు అప్పగించడం వల్ల సిబ్బంది శారీరకంగానూ, భద్రత దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ూ జిల్లాలో పని చేస్తున్న పోలీసు సిబ్బందిలో ఇప్పటికే 30 శాతం తక్కువగా ఉన్నారని, వివిధ విభాగాలకు మాత్రం 100 శాతం డిప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం ఇది వరకే కల్పించడం వల్ల ఉద్యోగ రీత్యా సిబ్బందిపై అదనపు భారం పడుతుందని, ఉద్యోగ రీత్యా కొంత ఒత్తిడి ఉందన్నారు. ూ కొన్ని చోట్ల గార్డు డ్యూటీలు నిర్వహించే సిబ్బంది నిద్రించేందుకు కనీస మౌలిక సదుపాయాలు లేనట్లుగా సిబ్బంది ఎస్పీకి తెలిపారు. –నిరుపయోగంగా, నివాస యోగ్యంగా లేని ఇళ్లను సిబ్బందికి కేటాయించడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దె అలవెన్సు పొందే సౌకర్యాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు. ఎస్కార్ట్ వాహనాలు స్ధితి సక్రమంగా ఉండే విధంగా చూడాలని, వీఐపీ వాహనాలతో వేగంగా వెళ్లే సమయాల్లో ఎస్కార్ట్ వాహనాల సామర్ధ్యం బాగో లేదని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పై సమస్యలపై స్పందించిన ఎస్పీ అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది, ఏఆర్ హెచ్‌సీలు, ఏఆర్ ఎస్ఐలకు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక డార్మిటరీలను త్వరలో నిర్మించనున్నట్లుగా ఎస్పీ తెలిపారు. -
‘నాలుగో సింహం’ అవినీతి గర్జన!
- కొండపై ఏఆర్ సిబ్బందికి డ్యూటీలు - లడ్డూలు..గదుల బుకింగ్‌లో చేతివాటం - 78 రోజులుగా సిబ్బందికి తప్పుడు హాజరు - చిత్తూరు ఏఆర్‌లో అధికారుల నిర్వాకం చిత్తూరు: జిల్లాలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) విభాగంలో తవ్వేకొద్దీ ఇక్కడున్న కొందరు అధికారుల అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. ఇప్పటికే ఎస్కార్ట్ డ్యూటీల్లో చేతివాటం ప్రదర్శించిన కొందరు అధికారులు, సిబ్బందిని సైతం తప్పుడు దారుల్లోకి పంపుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇందుకు సాక్షాత్తు తిరుమలేశుని సన్నిధినే లక్ష్యంగా ఎంచుకున్నారు. ‘‘ఇటీవల సిబ్బందికి హాజరు వేస్తున్న డ్యూటీ ఆర్ఎస్ఐ దామోదర్‌రెడ్డి రాకపోవడంతో గైర్హాజరు వేశారు. అయితే చిత్తూరు ఏఆర్‌లోని 12వ ప్లటూన్‌కు చెందిన ఇ.దామోదర్‌రెడ్డి (పీసీ–1810) దీనిపై డ్యూటీ ఆర్ఎస్ఐకు పిటిషన్ లెటర్ రాశాడు. ఈ ఏడాది మే 15 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ, ఆర్ఐల ఉత్తర్వుల మేరకు తిరుమలలో గదులు, లడ్లు ఇప్పించే డ్యూటీ చేస్తున్నానని, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు హాజరు వేయాలని ఈనెల 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు లెటర్ రాసిచ్చాడు.’’ ‘‘అయితే అదే రోజు ఏఆర్ ఆర్‌ఐకు సైతం దామోదర్‌రెడ్డి తనను డ్యూటీకు తీసుకోవాలని మరో లెటర్ రాశాడు. గత నెల 27 నుంచి ఈనెల 2వ తేదీ వరకు అత్యవసర సెలవుపై వెళ్లానని..3వ తేదీ కూడా ఆరోగ్యం సరిగా లేక అదనంగా ఓ రోజు సెలవు తీసుకుంటానని పేర్కొన్నాడు. దీనిపై వెంటనే స్పందించిన ఆర్ఐ.. దామోదర్రెడ్డిను డ్యూటీలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఐను ఆదేశించాడు.’’ ఇదీ మతలబు మొదటి పిటిషన్లో తాను తిరుమల కొండపై ఉన్నతాధికారుల ఆదేశాలతోనే 78 రోజులుగా విధులు చేస్తున్నట్లు దామోదర్‌రెడ్డి స్వయంగా అంగీకరించాడు. అయితే ఈ విషయం డ్యూటీ ఆర్ఎస్ఐకు తెలిసిపోయింది. స్టాఫ్ హాజరు రిజిస్టర్లో దామోదర్‌రెడ్డి ప్రతీ రోజూ విధులకు హాజరవుతున్నట్లు ఉన్నతాధికారులు చూపించారు. ఒక్కోసారి ఇతన్ని లోకల్ ప్రిజనర్ ఎస్కార్ట్ (ఎల్పీఈ) డ్యూటీ కింద తిరుపతి పంపినట్లు రిజిస్టర్లో పేర్కొన్నారు. కానీ వాస్తవానికైతే దామోదర్‌రెడ్డి కొండపై శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇది అధికారికమా? అనధికారికమా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. అధికారికంగా అయితే హాజరు రిజిస్టర్లో ఆన్‌డ్యూటీ చూపుతూ కొండపై ఉన్నట్లు రాయాలి. కానీ ఎక్కడా ఈ విషయాన్ని రాయలేదు. ఇక ఎస్కార్ట్ డ్యూటీకి పంపితే బెల్ ఆఫ్ ఆర్మ్ పుస్తకంలో ఆయుధాలు తీసుకున్నట్లు రాయాలి. ఇతను ఎక్కడా ఆయుధాలు తీసుకోలేదు. అలాగే జనరల్ డ్యూటీ పుస్తకంలో 78 రోజుల పాటు ఎక్కడ విధులు చేశాడో రాయాలి. ఆ వివరాలు కూడా జీడీలో లేవు. ఎందరికి వాటాలో..? తిరుమల కొండపై పరపతితో గదులు, లడ్డూలు తీసుకుని బ్లాక్ వ్యాపారం చేయడంలో చిత్తూరు ఏఆర్ విభాగానికి చెందిన కొందరు అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. తాజాగా దామోదర్‌రెడ్డి రాసిచ్చిన పిటిషన్లు ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రోజూ గదులు, శ్రీవారి ప్రసాదాలను బ్లాక్‌లో విక్రయించి వచ్చిన ఆ మొత్తాన్ని చిత్తూరులోని అధికారులకు పంపగా.. ఇక్కడున్న కొందరు వాటాలు వేసుకుంటున్నట్లు సాటివారే విమర్శిస్తున్నారు. ఇటీవల కొండపై విజిలెన్స్ విభాగం ఈ విషయాన్ని గుర్తించడంతో సీఎల్ రిజిస్టర్లో దామోదర్‌రెడ్డికి ఆరు రోజుల అత్యవసర సెలవు ఇచ్చినట్లు.. రిజిస్టర్లో దిద్దుబాట్లు వేసి ఆర్ఐ సంతకం పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎస్పీ రాజశేఖర్‌బాబు మరింత లోతుగా విచారణ చేయిస్తే అక్రమార్కుల అసలు రూపం బయటపడనుంది.