విజయనగరం టౌన్: జిల్లాలో పని చేస్తున్న ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ రీత్యా ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఎస్పీ పాలరాజు పేర్కొన్నారు. ఆర్మ్‌డ్ సిబ్బంది సమస్యలు తెలుసుకునేందుకు బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బందితో బుధవారం ఆయన సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది ఉద్యోగ రీత్యా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటి పట్ల సానుకూలంగా స్పందించి, పలు సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించి, అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, ఏఆర్‌డీఎస్పీ ఎస్.హనుమంతు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు ఎస్‌వి.అప్పారావు, గురునాథరావు, శ్రీహరిరావు, రామకృష్ణ, జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు ఎమ్‌విఆర్.సింహాచలం (రామా), పలువురు ఏఆర్ ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు...
దూర ప్రాంతాలకు సబ్‌జైల్, సెంట్రల్ జైల్ నుంచి ముద్దాయిలను విచారణ నిమిత్తం వివిధ కోర్టులలో హాజరు పర్చేందుకు తీసుకుని వెళ్లడం, మళ్లీ వారిని ఆయా జైళ్లకు అప్పగించడం వల్ల సిబ్బంది శారీరకంగానూ, భద్రత దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ూ జిల్లాలో పని చేస్తున్న పోలీసు సిబ్బందిలో ఇప్పటికే 30 శాతం తక్కువగా ఉన్నారని, వివిధ విభాగాలకు మాత్రం 100 శాతం డిప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం ఇది వరకే కల్పించడం వల్ల ఉద్యోగ రీత్యా సిబ్బందిపై అదనపు భారం పడుతుందని, ఉద్యోగ రీత్యా కొంత ఒత్తిడి ఉందన్నారు.
ూ కొన్ని చోట్ల గార్డు డ్యూటీలు నిర్వహించే సిబ్బంది నిద్రించేందుకు కనీస మౌలిక సదుపాయాలు లేనట్లుగా సిబ్బంది ఎస్పీకి తెలిపారు.
–నిరుపయోగంగా, నివాస యోగ్యంగా లేని ఇళ్లను సిబ్బందికి కేటాయించడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దె అలవెన్సు పొందే సౌకర్యాన్ని కోల్పోతున్నట్లు చెప్పారు.
ఎస్కార్ట్ వాహనాలు స్ధితి సక్రమంగా ఉండే విధంగా చూడాలని, వీఐపీ వాహనాలతో వేగంగా వెళ్లే సమయాల్లో ఎస్కార్ట్ వాహనాల సామర్ధ్యం బాగో లేదని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు.
పై సమస్యలపై స్పందించిన ఎస్పీ అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆర్మ్‌డ్ రిజర్వు సిబ్బంది, ఏఆర్ హెచ్‌సీలు, ఏఆర్ ఎస్‌ఐలకు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక డార్మిటరీలను త్వరలో నిర్మించనున్నట్లుగా ఎస్పీ తెలిపారు.
ఆర్మ్‌డ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి దర్బార్
Published Thu, Aug 24 2017 3:43 AM | Last Updated on Tue, Sep 12 2017 12:51 AM
Advertisement
Advertisement