ఛీ.. ఇదేం పనయ్యా కానిస్టేబుల్‌! | Armed Reserve Constable Arrested For Ganja supplying In Uppal | Sakshi
Sakshi News home page

ఛీ.. ఇదేం పనయ్యా కానిస్టేబుల్‌!

Published Sun, Dec 13 2020 4:46 PM | Last Updated on Sun, Dec 13 2020 8:16 PM

Armed Reserve Constable Arrested For Ganja supplying In Uppal - Sakshi

ఉప్పల్ ‌: క్రికెట్‌ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్మ్‌డ్‌ కానిస్టేబుల్‌ డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు దొరికిపోయాడు. శనివారం ఉప్పల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురానికి చెందిన జె.మోహన కృష్ణ (36) అక్కడే ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. జనగాం జిల్లా వాసి  సోమయ్య(36), నల్లగొండజిల్లా వాసి బానోతు యాదగిరి(24), బానోతు రా జుతో కలిసి నర్సీపట్నంలో గంజాయిని కిలో రూ. 2 వేలకు కొనుగోలు చేసి నగరంలో  రూ.8 వేలుకు విక్రయిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మోహన కృష్ణ తన కారుకు పోలీస్‌ అనే స్టిక్కర్‌ అతికించుకొని దందా సాగిస్తున్నాడు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న ఉప్పల్‌ ఎక్సైజ్‌ సీఐ చంద్రశేఖర్‌ తన బృందంతో శుక్రవారం రాత్రి ఉప్ప ల్‌ నల్ల చెరువు కట్టమీద మాటువేసి  మో హన కృష్ణ కారును పట్టుకున్నారు. కారు లో పొట్లాల రూపంలో ఉన్న 200 కిలోల గంజాయి దొరికింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, కారు, 2 సెల్‌ఫోన్లు.. మొత్తం  రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించగా, బానోతు రాజు పరారీలో ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement